మీరు ఖచ్చితంగా C లాంగ్వేజ్ అనే పేరు వినే ఉంటారు. కానీ అది చాలా కష్టమని మీరు భావిస్తూ ఉండొచ్చు. ఇంజనీరింగ్ చదివే స్టూడెంట్ల దగ్గర్నుండీ సాఫ్ట్ వేర్ జాబ్ లు చేసే వాళ్ల వరకూ C లాంగ్వేజ్ ని ఎందుకు అంతగా వాడతారో అర్థం అయి ఉండదు. అస్సలు మీరు కనీసం తెలుసుకోవాలని కూడా ప్రయత్నించి ఉండి ఉండకపోవచ్చు.
కనీసం ఇప్పటికైనా C లాంగ్వేజ్ ఎందుకు పనికొస్తుందో తెలుసుకోవాలన్న మినిమమ్ క్యూరియాసిటీ మీకు కలిగి ఉంటే ఈ వీడియో మీ కోసమే తయారు చేశాను.
దీనిలో కావాలని పెద్ద పెద్ద ఉదాహరణలు చెప్పలేదు. వీలైనంత వరకూ అర్థం కాని పదాలను వాడకుండా ఉండడానికి ప్రయత్నించాను. అస్సలు C లాంగ్వేజ్ అనేది ఎందుకు వాడతారో మామూలు కంప్యూటర్ యూజర్ కి తెలియడమే ఈ వీడియో లక్ష్యం. అలాగే C లాంగ్వేజ్ అంటే ఏదో గొప్ప కాదనీ, చిన్న చిన్న లైన్లతో కావలసిన ఫలితాలు ఎలా వస్తాయో ఎవరికైనా అర్థం కావడం కోసం ఇందులో ఓ చిన్న ప్రోగ్రామ్ నీ చూపించాను.
చదువుకునే పిల్లలే కాదు.. వారిని చదివించే తల్లిదండ్రులకు కూడా ఈ వీడియో చూస్తే C లాంగ్వేజ్ మీద కొద్దిపాటి అవగాహన కలుగుతుంది. మీవాడు ఏం నేర్చుకుంటున్నాడంటే.. “C” అని ధీమాగా చెప్పేయగలరు.
జస్ట్ సరదాకే అంటున్నాననుకోండి. కానీ ఇది నిజం! మీరే చూడండి.
Title: What is the use of C Language? A common user perspective Full HD
Duration: 8.02
Submited by: admin
Category: C Language, Softwares, Tips Tricks
Added on: November 21st, 2011
Views: 329 views
By: SeshagiriRao
How to install anu 7 on windows 7
By: admin
శేషగిరిరావు గారు… Anu TTF Setup ఫైల్ మీద రైట్ క్లిక్ చేసి Properties>Compatibility Modeగా Windows XP SP3ని సెట్ చేయండి. ఆ తర్వాత మళ్లీ అదే ఫైల్ పై రైట్ క్లిక్ చేసి Run As Administrator ద్వారా రన్ చేయండి. ఖచ్చితంగా ఇన్ స్టాల్ అవుతుంది.