ఇక వైరస్ ల బాధ ఉండదు, ఫార్మేటింగ్ పనే లేదు.. ప్రతీ ఒక్కరూ ఫాలో అవ్వాల్సిన ది బెస్ట్ సొల్యూషన్
ఎవర్ని కదిపినా మా కంప్యూటర్ లో వైరస్ ఉందేమో చాలా స్లో అయిపోయింది అనే కంప్లయింట్లే!
ఏంటీవైరస్ లను నమ్ముకోవడమూ శుద్ధ దండగే. అస్సలు మన కంప్యూటర్లోకి వైరస్సే రాకుండా కాపాడుకోలేమా?
చీటికీ మాటికీ హార్డ్ వేర్ టెక్నీషియన్ వచ్చి format చేస్తూ ఉంటే అతనికి ఓ 200 సమర్పించుకునే తిప్పలు తప్పవా?
కంప్యూటర్ ఎప్పుడూ ఫాస్ట్ గా, క్లీన్ గా ఉంచుకోవడం కుదరదా?
ఈ వీడియో చూడండి.. ఇక మీరు సంవత్సరాల తరబడి ఒక్క వైరస్ బారిన కూడా పడరు. నాదీ గ్యారెంటీ.
నా కంప్యూటర్లోకి వైరస్ అనేదే రాదు. అంతేకాదు నేను ఏదైనా విండోస్ కొత్త వెర్షన్ రిలీజైతే తప్ప చీటికీ మాటికీ వైరస్ ల కోసమని కంప్యూటర్ ని ఫార్మేట్ చేయాల్సిన అవసరమే పడదు.
నేను ఈ వీడియోలో చూపించిన చిన్న, ఉచిత పద్ధతి ఎంతో విలువైన మీ సమయాన్నీ, విలువైన మీ హార్డ్ డిస్కులోని డేటానీ కాపాడుతుంది.
ఇంట్లో కంప్యూటర్ ఉన్న వారి దగ్గర్నుండీ ఇంటర్నెట్ సెంటర్లూ, ఆఫీసులు కలిగి ఉన్న వారి వరకూ ఖచ్చితంగా దీన్ని ది బెస్ట్ మెథడ్ గా ఒప్పుకుని తీరతారు. ఇలాంటివే పలు పద్ధతుల గురించి మన కంప్యూటర్ ఎరా మేగజైన్ లో గతంలో వివరంగా చర్చించాను. కానీ అన్నింటికన్నా ఇది చాలా మెరుగైన విధానం.
ఆలస్యమెందుకు? మీ కంప్యూటర్ సమస్యలకు ఈ ఒక్క వీడియోతో ఛెక్ పెట్టేయండి మరి.
స్పీకర్లు ఆన్ చేసుకుని వింటూ చూస్తే ఈజీగా అర్థమవుతుంది.
నల్లమోతు శ్రీధర్
Title: Say goodbye to Virus and Formatting : Must Watch and Share Full HD
Duration: 7.46
Submited by: admin
Category: Tips Tricks, Troubleshooting
Added on: November 11th, 2011
Views: 1,668 views
By: lakshminarayana
telugu format nokia 5230 lo support cheyalanta ala.adi meru telugu lo type chasindi mottam boxes la chupistundi
By: admin
లక్ష్మీనారాయణ గారు.. నోకియా ఫోన్లు Symbian ఆధారంగా పనిచేస్తాయి. వాటిలో తెలుగు ఫాంట్ ఇన్ స్టాల్ అయి ఉండదు. ఇన్ స్టాల్ చేసినా రెండర్ చేయడానికి సరైన లైబ్రరీ ఫైల్ వాటిలో ఉండదు.
By: S.A.KAREEM
Sir, Virtual Router tool dvara laptop la mana PC ni kuda Virtual Router ga Marchu ko Vachha.
By: NEELAM NAGARAJESWARA RAO
Sir! meeru ekkuvaga android OS supported mobiles sambhandhinchina samaachaaram istaaru. Maalanti NOKIA smart phone users especially symbian OS vallaku useful samaachaaram kuda ivvandi plz.
By: admin
నీలం నాగేశ్వరరావు గారు.. దాదాపు Symbian గురించి ఎవరికీ తెలియని 2004 టైమ్ నుండి 2009 వరకూ ఆ OS వాడిన వ్యక్తిని నేను. బట్ సింబియాన్ డెవలప్‌మెంట్ ఆగిపోయింది.
Nokia తన వ్యూహాత్మక తప్పిదాల వల్ల అన్ని కంపెనీలూ Android, Windows Mobile వంటి ఇతర OSలకు మారినా తన మార్గం మార్చుకోలేకపోయింది. ఈమధ్యనే Windows Mobileతో జతకట్టింది.
సో ఈ నేపధ్యంలో ఆగిపోయిన సింబియాన్ OS గురించి నేను టైమ్ స్పెండ్ చేసిన వీడియోలు చేసినా ఓ ఏడాది తర్వాత అవి ఎవరికీ ఉపయోగపడవు అన్న విషయం దయచేసి అర్థం చేసుకోండి.
I have to optimize my time for better platforms. అంతే తప్ప సింబియాన్‌పై నాకు చిన్నచూపు లేదండీ
By: durgaprasad
sir me website chaala use avutundi meku chaala danyavadamulu.. na laptop ki wifi undi kani windows 7 os vesaka panicheyadam maanesindi kaaranam telupagalaru