Online Bankingపై ETV2లో నా ప్రోగ్రామ్

ఇంటర్నెట్ బ్యాంకింగ్ సదుపాయాన్ని పొందడం ఎలా, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఏయే పనుల్ని బ్యాంక్ కి వెళ్లకుండా కంప్యూటర్ నుండే నిర్వహించుకోవచ్చు.. వంటి వివరాలతో ETV2 సఖి ప్రోగ్రామ్ లో డిసెంబర్ 3, 2010 (శుక్రవారం) ప్రసారం అయిన నా ప్రోగ్రామ్ వీడియోని ఈ క్రింద పొందుపరుస్తున్నాను.

వెబ్ సైట్ల క్రియేషన్ ఎలా? I News Live ఇంటర్వ్యూ

వెబ్ సైట్ క్రియేషన్ రిక్వైర్ మెంట్స్ గురించి I News తెలుగు ఛానెల్ జరిపిన 30 నిముషాల లైవ్ ప్రోగ్రామ్ ని ఈ క్రింద మూడు పార్ట్ లుగా చూడవచ్చు.

CD/ DVD ఇన్ సైడ్ స్టోరీ - I News Live ఇంటర్వ్యూ

CD, DVDల గురించి ఇంట్రెస్టింగ్ విషయాలతో I News తెలుగు ఛానెల్ లో నేను చేసిన ఓ అరగంట ఫోన్-ఇన్ లైవ్ ప్రోగ్రామ్ ని ఇక్కడ చూడవచ్చు

Softwaresపై I News Live ఇంటర్వ్యూ

కంప్యూటర్ సాఫ్ట్ వేర్ల ఇన్ స్టలేషన్, OS సెక్యూరిటీ జాగ్రత్తలు, ఇతర ముఖ్య అంశాలపై I News తెలుగు ఛానెల్ లో నేను చేసిన అరగంట phone-in లైవ్ షో ని ఇక్కడ చూడవచ్చు.

Recent Articles:

Tabletలో రెండు ఆపరేటింగ్ సిస్టమ్ లు వేసుకోవచ్చు ఇలా..

కొన్ని రోజుల క్రితం "Akash, Ubislate 7 వంటి నాసిరకం ఉత్పత్తులపై  విపరీతమైన మోజు పెంచుకోవద్దు" అని చెబుతూ, కొన్ని నెలలు వేచి చూస్తే మంచి కంపెనీల, నాణ్యత, మంచి పనితీరు కలిగిన  టాబ్లెట్లు చవక ధరలకే అందుబాటులోకి వస్తాయన్న దానికి ఉదాహరణగా HP Touch Pad 32 GB టాబ్లెట్ ని http://www.youtube.com/watch?v=NsNnzylHDGI అనే వీడియోలో చూపించాను.

ఈ టాబ్లెట్ ఆఫర్ లో 99 డాలర్లకు (అంటే 4 నెలల క్రితం అప్పటి ధర ప్రకారం రూ. 5,000 లోపు) లభించింది.

ఈ వీడియో పోస్ట్ చేసిన తర్వాత చాలామంది "అందులో Web OS మాత్రమే ఉంటుంది కదా, ఆండ్రాయిడ్ లేనప్పుడు వృధా కదా" అంటూ పెదవి విరిచారు.

ఒక మామూలు కంప్యూటర్ నే తీసుకుంటే దానిలో విండోస్, Linux ఇలా ఏ OS నైనా వేసుకోవచ్చు. అలాగే టాబ్లెట్లలోనూ మనకు నచ్చిన OSని వేసుకోవడానికి పద్ధతులు ఉంటాయి.

దీన్ని నిరూపించడానికే నేను పై వీడియోలో చూపించిన టాబ్లెట్ లో Android ఆపరేటింగ్ సిస్టమ్ ని వేసి, దాని ఫొటోలు ఇక్కడ అందిస్తున్నాను.

టాబ్లెట్ లో రెండు ఆపరేటింగ్ సిస్టమ్ లు

ఇకపోతే "HP కంపెనీ ఆ ప్రోడక్ట్ ని నిలిపివేసిందట", "ఇండియాలో దొరకట్లేదు" అంటూ సందేహాలు వ్యక్తం చేసిన వారికి నేను చెప్పదలుచుకున్నది ఒక్కటే.. నేను ఈ టాబ్లెట్ ని రివ్యూ చేసింది కేవలం "ఆకాష్, Ubislate 7లకు దేశీయ బ్రాండింగ్ పులిమి, సామర్థ్యానికి మించి నెత్తికి ఎక్కించుకుంటున్న ప్రభుత్వ ధోరణినీ, ప్రజల అవగాహనా లేమినీ" కొద్దిగా విజ్ఞులైన వారి దృష్టికి తెస్తూ.. కొన్నాళ్లు వేచి చూస్తే నేను వీడియోలో చూపించినటువంటి నాణ్యమైన టాబ్లెట్లు అతి చవక ధరలకే రావడం ఖాయం అన్నది తెలియజెప్పడానికి మాత్రమే.

webOS నుండి Androidకి రీబూట్ ఆప్షన్ ఇలా వస్తుంది

ఆండ్రాయిడ్ నల్లమోతు ఛానెల్ అప్లికేషన్ ఇది
 

గతంలో ఈ  HP Touchpad 32 GB టాబ్లెట్ గురించి నేను చేసిన వీడియో రివ్యూని చూడలేకపోయిన వారు ఈ క్రింద దాన్ని చూడవచ్చు:

ధన్యవాదాలు.

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

Studio N ఛానెల్ లో నిన్నటి నా లైవ్ డిస్కషన్ ఇక్కడ

మిత్రులకు నమస్కారం. నిన్న (19th Jan 2012) స్టూడియో N న్యూస్ ఛానెల్ లో ప్రసారమైన నా లైవ్ డిస్కషన్ ఇక్కడ చూడొచ్చు.

 

TV9 ఛానెల్ లో నిన్న జరిగిన నా లైవ్ డిస్కషన్ మిస్ అయిన వారు ఇక్కడ చూడొచ్చు..

TV 9 తెలుగు ఛానెల్ లో నిన్న రాత్రి 8 గంటలకు ప్రసారమైన నా live discussionని మిత్రులు ఈ క్రింద చూడవచ్చు.

ధన్యవాదాలు.

TV9లో ఈరోజు రాత్రి 8 గంటల న్యూస్ బులెటన్ లో నా లైవ్ డిస్కషన్

హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు రాత్రి 8 గంటల న్యూస్ బులెటన్ లో TV 9 న్యూస్ ఛానెల్ లో నా లైవ్ డిస్కషన్ ని మిత్రులు చూడవచ్చు. ధన్యవాదాలు.

ముఖ్యమైన ఫైల్ కరప్ట్ అయిందా? కారణాలు ఇవి.. Must Watch

ఆ ఒక్క ఫైల్ లో మీ జీవితం ముడిపడి ఉందనుకుందాం.. లేదా ఎన్నో గంటలు కష్టపడి ఆ ఫైల్ ని తయారు చేసుకున్నారనుకుందాం.

ఓ ఫైన్ మార్నింగ్ అవసరం పడి ఆ ఫైల్ ని ఓపెన్ చేయబోతే File Corrupted.. మాదిరి మెసేజ్ వస్తే ఎంత బాధగా ఉంటుంది? ఇప్పటివరకూ మీకు ఇలాంటి సమస్యలేమీ రాకపోయినా మున్ముందు ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోపోతే ఫైళ్లు కరప్ట్ అవడం చాలా మామూలు విషయం.

అది మీ రెజ్యూమ్ కావచ్చు, ఫొటో కావచ్చు, నెట్ నుండి డౌన్ లోడ్ చేసుకున్న ఫైల్ కావచ్చు.. ఎందుకు కరప్ట్ అవుతుంది అన్నది చాలా వివరంగా ఈ వీడియోలో చెప్పడం జరిగింది. ఈ వీడియో చూస్తే File corruptionపై మీకు పూర్తి అవగాహన ఏర్పడుతుంది. ఇకపై జాగ్రత్తగా ఉండొచ్చు.

మీ వెబ్ సైట్ లోనూ, బ్లాగ్ లోనూ మీకు ఈ వీడియో నచ్చితే రీపబ్లిష్ చేసుకోవచ్చు. మీ బ్లాగ్ లో కొత్త పోస్ట్ చేసేటప్పుడు HTML మోడ్ లో ఉండగా క్రింది లైన్ ని మీ పోస్ట్ లో add చేస్తే ఈ వీడియో వచ్చేస్తుంది.

<iframe width="560" height="315" frameborder="0" allowfullscreen="" src="http://www.youtube.com/embed/ip6bOy0xKjQ"></iframe></p>

 

 

అశ్లీల చిత్రాలు మీ పిల్లల మనసుల్ని పాడుచేయకుండా ఇలా..

అశ్లీల సమాచారం మీ కంప్యూటర్లకు చేరి మీ పిల్లల్ని పాడు చేయకుండా ఇలా కాపాడుకోవచ్చు:  http://computerera.co.in/link/antiporn

మీ హార్డ్ డిస్క్ ఎప్పుడైనా ఫెయిలైపోవచ్చు.. నమ్మలేకపోతున్నారా? ఇది చూడండి

ఉన్న ఫళాన హార్డ్ డిస్క్ dead అయిపోతే అందులో మీరు ఎంతో కష్టపడి సేవ్ చేసుకున్న ఫైళ్లూ, డేటా అంతా ఏమైపోవాలి? ఆలోచించండి. “హార్డ్ డిస్క్ ఎందుకు ఫెయిలవుతుందిలే” అని ధీమాగా ఉండకండి.

ఇక్కడ నా 3 హార్డ్ డిస్కులలో ఒకటి ఫెయిల్ అవడానికి ఎంత దగ్గరగా ఉందో ఈ వీడియోలో చూస్తే మీరు ఇంకే మాత్రం ఆలస్యం చెయ్యరు.

C, D, E, F వంటి అన్ని డ్రైవ్ లూ ఉండే మీ హార్డ్ డిస్క్ పూర్తిగా పనిచేయకుండా ఆగిపోకముందే ఈ వీడియోలో నేను చూపించిన పద్ధతిలో వాటి హెల్త్ కండిషన్ తెలుసుకుని డేటా బ్యాకప్ తీసుకోండి.

మీ వెబ్ సైట్ లోనూ, బ్లాగ్ లోనూ మీకు ఈ వీడియో నచ్చితే రీపబ్లిష్ చేసుకోవచ్చు. మీ బ్లాగ్ లో కొత్త పోస్ట్ చేసేటప్పుడు HTML మోడ్ లో ఉండగా క్రింది లైన్ ని మీ పోస్ట్ లో add చేస్తే ఈ వీడియో వచ్చేస్తుంది.

<iframe width="560" height="315" src="http://www.youtube.com/embed/_E0yjj0Ys74" frameborder="0" allowfullscreen></iframe>

 

 

 

దిస్ ఈజ్ ది సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ

నిన్న తాడేపల్లిగూడెంలో రెండు కాలేజీలకు కలిపి 450 మంది విద్యార్థుల్ని ఉద్దేశించి 3 సెషన్లు నిర్వహించడం జరిగింది. వాటి పూర్తి కవరేజ్ మరో పోస్ట్ లో అందిస్తాను.

ప్రస్తుతానికి ఈ పోస్ట్ లో నన్ను టెక్నికల్ గా అప్ డేటెడ్ గా ఉంచుతున్న సీక్రెట్ ఏంటో చెప్తూ ఆ సీక్రెట్ ని అలవర్చుకోమని విద్యార్థుల్ని ఈ చిన్న క్లిప్పింగ్ లో కోరుతున్నాను. మిత్రులారా ఇది నా గురించి గొప్ప చెప్పుకోవడానికి ఇలా పబ్లిక్ గా share చెయ్యట్లేదు, సెమినార్లకు నేరుగా రాలేని వాళ్లెందరో ఉంటారు, వారిలో ఏ ఒక్కరైనా నా మాటలకు, నేను నేర్పించదలుచుకున్న way of thinkingకి ఈ వీడియోల ద్వారా మోటివేట్ అయితే అదే చాలు, అందుకే పంచుకుంటున్నాను.

తాడేపల్లిగూడెంలో రేపు (9th Jan 2012) రెండు సెమినార్లు

రేపు ఉదయం (సోమవారం 9th Jan 2012), 10.30-12 గంటల వరకూ Venkateswara Institute of Science & Information Technology (VISIT) తాడేపల్లి గూడెంలోనూ, అలాగే 3PM – 4 PM వరకూ అదే ఊళ్లోని వాసవీ  డిగ్రీ కాలేజ్ లోనూ  నా సెమినార్లు ఉంటాయి. తాడేపల్లి గూడెంలో నివశిస్తున్న "కంప్యూటర్ ఎరా" పాఠకులు, ఇతర మిత్రులు కలవొచ్చు.  వివరాలకు 9000239948 అనే నెంబర్ కి కాల్ చెయ్యవచ్చు. ధన్యవాదాలు.

- నల్లమోతు శ్రీధర్

Search This Site:

About Me

1996వ సంవత్సరంలో తెలుగులో మొట్టమొదట కంప్యూటర్ సాహిత్యాన్ని ప్రారంభించే అవకాశం నాకు కలిగింది. అదే సమయంలో చెన్నైలో సూపర్ హిట్ తెలుగు ఫిల్మ్ మేగజైన్ కి సబ్ ఎడిటర్ గా కూడా ఏకకాలంలో పనిచేస్తూ 1998 వరకూ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, మనీషా కొయిరాలా, శంకర్, రజనీకాంత్, కమల్ హాసన్ వంటి ప్రముఖులెందరినో ఇంటర్వ్యూలు చేయడం మర్చిపోలేని అనుభవం. అయితే సినిమా రంగంలో ఉన్న అనారోగ్యకరమైన వాతావరణం వల్ల నాకంటూ ఓ ప్రత్యేకమైన ఉనికిని సృష్టించుకోవడం కోసం సినిమా రంగం నుండి బయటకు వచ్చి పూర్తిగా టెక్నాలజీ రంగంలో స్థిరపడడం జరిగింది. 96 నుండి 2001 వరకూ పలు కంప్యూటర్ పత్రికలకు ఎడిటర్ గా పనిచేసి.. 2001 నుండి "కంప్యూటర్ ఎరా" తెలుగు మంత్లీ మేగజైన్ ఎడిటర్ గా పత్రిక మొత్తాన్నీ రూపొందిస్తూ ఉన్నాను. అలాగే తెలుగు టెలివిజన్ ఛానెళ్లలో మొట్టమొదటి టెక్నికల్ phone-in ప్రోగ్రామ్ కి గెస్ట్ గా అటెండ్ అయ్యే అవకాశమూ 2010 జనవరి 20న కలిగింది. అప్పటి నుండి ఇప్పటివరకూ TV 9, ABN, I News, ETV2, NTV, Zee 24 గంటలు, Studio N, సాక్షి టివి, మహా టివి, జాగృతి న్యూస్ వంటి ఛానెళ్లలో 100కి పైగా లైవ్, రికార్డెడ్ ప్రోగ్రాముల్ని చేయడం జరిగింది. 2007లో అత్యుత్తమైన నాణ్యతతో కూడిన పోస్టులతో, వీడియోలతో తెలుగులో మొదటి ప్రొఫెషనల్ టెక్నికల్ బ్లాగ్ గానూ, మొదటి వీడియో బ్లాగ్ గానూ ఇప్పుడు మీరు చూస్తున్న బ్లాగ్ ప్రత్యేకతను సంతరించుకుంది. అలాగే 2007 జనవరి 1న ప్రారంభించిన తెలుగులోనే మొట్టమొదటి టెక్నికల్ ఫోరమ్ అయిన "కంప్యూటర్ ఎరా సాంకేతిక ఫోరమ్" 14 వేల మంది సభ్యులతో 10 వేలకు పైగా పోస్టులతో 2009 జూలై వరకూ నిర్వహించబడింది. దాంతోపాటే మొట్టమొదటి తెలుగు టెక్నికల్ ఛాట్ రూమ్ అయిన "కంప్యూటర్ ఎరా సాంకేతిక సహాయం" అనే ఛాట్ రూమ్ రెండేళ్లలో వేలాది మందికి తెలుగు టైప్ చేయడం మొదలుకుని అనేక కంప్యూటర్ సంబంధిత సాంకేతిక సమస్యలకు తక్షణ సహాయం అందించింది. ఇకపోతే http://youtube.com/nallamothu అనే ఛానెల్ లో 361కి పైగా ప్రొఫెషనల్ క్వాలిటీ తెలుగు టెక్నికల్ వీడియోలు అందించాను. ఈ ఛానెల్ కి 1704 మంది సబ్ స్కైబర్లు ఉన్నారు. అందుబాటులో ఉన్న వివిధ మార్గాల ద్వారా తెలుగు వారందరకీ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించే పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాను. My Contact Number: 9000239948 Mail ID: sridharcera@gmail.com

ఇక్కడ RSS Feedకి Subscribe చేసి నేరుగా పోస్ట్ లు పొందండి

ఆండ్రాయిడ్ లో పొందండి!

నా వీడియోలను మీ దగ్గర ఉన్న Android ఫోన్ లో పొందాలంటే ఈ క్రింది లింక్ ని మీ ఫోన్ బ్రౌజర్ లో ఓపెన్ చేసి వెంటనే వచ్చే అప్లికేషన్ ని ఇన్ స్టాల్ చేసుకోండి. అన్ని వీడియోలూ ఎంజాయ్ చేయండి. http://goo.gl/DqsA4

లేదా ఈ క్రింది QR Codeని మీ Android ఫోన్ లోని Barcode Scannerతో స్కాన్ చేస్తే నేరుగా అప్లికేషన్ డౌన్ లోడ్ పేజీకి వెళ్లవచ్చు. Image and video hosting by TinyPic