అయ్య బాబోయ్.. ఇంటర్నెట్ క్రాష్ అయిపోయింది!

July 31, 2007 Uncategorized 1 Comment



కంప్యూటర్ క్రాష్ అయి మన కంప్యూటర్లోని విలువైన సమాచారం నష్టపోయిన సందర్భాలు మనకు అనుభవైకవేద్యమే! ఒకవేళ ఏకంగా ఇంటర్నెట్టే క్రాష్ అయి ఏ వెబ్ సైట్ అసలు ఓపెన్ అవకపోతే ఎలా ఉంటుందన్నది ఊహాజనితంగా ఓ వార్తాంశంగా పై వీడియోలో చిత్రీకరించారు. ఇది నేను తయారు చేసిన వీడియో కాదు. నెట్ బ్రౌజ్ చేస్తుండగా ఈ వీడియో నా ద్ళష్టికి వచ్చింది. చాలా ఆసక్తికరంగా ఉండడం వల్ల అందరికీ చూపిద్దామని ఇక్కడ పొందుపరుస్తున్నాను. ఫైల్ సైజ్ ఎక్కువగా ఉండడం వల్ల ప్లే అవడానికి ఎక్కువ సమయం పడుతోంది.

USB 2.0, Firewire బ్యాండ్ విడ్త్ వివరాలు

July 31, 2007 Uncategorized 4 Comments

తాజాగా మార్కెట్లో లభిస్తున్న స్కానర్లు, ఎక్స్‌టర్నల్ హార్డ్‌డిస్క్‌లు, DV కామ్‌కోడర్లు హైస్పీడ్ డేటా ట్రాన్స్‌ఫరింగ్ కోసం USB 2.0, Firewire ఇంటర్‌ఫేస్‌లను కలిగి ఉంటున్నాయి. కొత్త కంప్యూటర్లు ఎటూ USB 2.0 సపోర్ట్ ని కలిగి ఉంటున్నాయి. అయితే USB 1.1 పోర్ట్లులు ఉన్న పాత కంప్యూటర్లలో గరిష్టంగా సెకనుకు 12 మెగాబైట్ల డేటాని మాత్రమే ట్రాన్స్‌ఫర్ చేయగలుగుతుండగా USB 2.0 సెకనుకు 480MB డేటా వరకు ట్రాన్స్‌ఫర్ చేయగలుగుతుంది.ఎంత వృత్యాసం ఉందో చూడండి. అలాగే Firewire పోర్ట్‌లు సెకనుకు 400MB వరకూ ట్రాన్స్‌ఫర్ చేయగలుగుతాయి. లేటెస్ట్ హైస్పీడ్ పెరిఫెరల్స్‌ని మీ పాత కంప్యూటర్లో ఉన్న USB 1.1 పోర్ట్‌లకు కనెక్ట్ చేసుకుని ఉపయోగించుకునే అవకాశం ఉన్నప్పటికీ పెర్ఫార్మెన్స్ మాత్రం గణనీయంగా తగ్గుతుంది. ఈ నేపధ్యంలో USB 2.0/Firewire సపోర్ట్‌ని ఓ PCI కార్డ్‌ని సిస్టమ్‌లో అమర్చుకోవడం ద్వారా పొందవచ్చు. Adaptec DuoConnect వంటి PCI కార్డ్‌లు రెండు కనెక్టివిటీలను ఒకే PCI కార్డ్‌లో అందిస్తాయి. దీన్ని PCI స్లాట్‌పై అమర్చుకుని సిస్టమ్‌ని ఆన్‌చేస్తే New Hardware Found మెసేజ్ వస్తుంది. కార్డ్‌తోపాటు అందించబడిన డివైజ్ డ్రైవర్లని ఇన్‌స్టాల్ చేసి మీ హైస్పీడ్ పెరిఫెరల్స్‌ని వాడవచ్చు.

Deep Freezeతో సిస్టంకి పూర్తి స్థాయి రక్షణ

July 31, 2007 Uncategorized No Comments


http://www.faronics.com/ అనే వెబ్‌సైట్‌లో లభించే DeepFreeze అనే సాప్ట్ వేర్ ఇన్‌స్టాల్ చేసుకుంటే వైరస్‌లు, సిస్టమ్ క్రాష్‌లు, అప్లికేషన్ ఎర్రర్లు వంటి ఎలాంటి సమస్య వచ్చినా ఒక్కసారి కంప్యూటర్‌ని రీస్టార్ట్ చేస్తే అన్ని సమస్యలు తీరిపోతాయి. ఒకటికన్నా ఎక్కువ హార్డ్‌డిస్క్‌లను సైతం ఇది సపోర్ట్ చేస్తుంది. FAT16, FAT32, NTFS వంటి అన్ని ఫైల్ సిస్టమ్‌లకు చెందిన డ్రైవ్‌లను ఇది ప్రొటెక్ట్ చేయగలుగుతుంది. కేవలం 2MB మాత్రమే హార్డ్‌డిస్క్ స్పేస్‌ను ఆక్రమించుకునే ఈ ప్రోగ్రామ్ ఎల్లప్పుడూ పార్టీషన్లను మోనిటర్ చేస్తూ పార్టీషన్ లలో చోటుచేసుకునే మార్పులను , కొత్తగా చేరిన సెట్టింగులను తొలగించి డిస్క్‌లను పూర్వస్థితికి తీసుకువెళ్తుంది. ఈ నేపధ్యంలో ఒక్కోసారి కొంత డేటాని నష్టపోవల్సిన పరిస్థితి కూడా తలెత్తుతుంది. అందుకే మీరు ఏ పార్టీషన్ నైతే మోనిటర్ చేయమని సెట్ చేశారో ఆ పార్టీషన్లో ముఖ్యమైన ఫైళ్లని సేవ్ చేయకండి. ఇతర పార్టీషన్లలో సేవ్ చేసుకోండి. పలు ఆపరేటింగ్ సిస్టమ్‌లు ఇన్‌స్టాల్ చేయబడి ఉన్న డ్రైవ్ లను సైతం ఇది మోనిటర్ చేయగలుగుతుంది. Win 95 నుండి XP, Vista వరకు అన్ని ఆపరేటింగ్ సిస్టమ్‌లపై రన్ అవగలిగే ఈ సాప్ట్ వేర్‌ని ఇన్‌స్టాల్ చేసిన వెంటనే ఏయే పార్టీషన్లని మోనిటర్ చేయమంటారని కోరుతుంది. మనం ఎంచుకున్న పార్టీషన్లకు మాత్రమే ఇక ముందు ప్రొటెక్షన్ లభిస్తుంది.

XPలోకి ఆటోమేటిక్ గా లాగిన్ అవ్వాలంటే..

July 30, 2007 Uncategorized No Comments


సహజంగా విండోస్ XP ఇన్ స్టాల్ అయి ఉన్న కంప్యూటర్లో సిస్టం ని బూట్ చేసినప్పుడు పలు యూజర్ అకౌంట్లు మన సిస్టంలో ఉన్నట్లయితే ఏ యూజర్ అకౌంట్ తో లాగిన్ అవ్వాలో ఎంచుకోమని కోరబడుతుంది. మనం ఎక్కువగా ఒకే యూజర్ అకౌంట్ ని వాడుతున్నప్పుడు ప్రతీసారీ ఇలా సెలెక్ట్ చేసుకునే పని లేకుండా ఆటోమేటిక్ గా లాగిన్ అయ్యేలా సెట్ చేసుకోవచ్చు. దీనికిగాను Start>Run కమాండ్ బాక్స్ల్ లో control userpasswords2 అని టైప్ చేసి వెంటనే స్ర్ల్కీన్ పై ప్రత్యక్షమయ్యే డైలాగ్ బాక్స్ లో Users must enter a username and password to use this computer అనే ఆప్షన్ని డిసేబుల్ చేయండి. వెంటనే ఇకపై ఏ యూజర్ నేము, పాస్ వర్డ్ కలిగిన అకౌంట్ లోకి విండోస్ ఆటోమేటిక్ గా లాగిన్ అవ్వాలో తెలుపమంటూ యూజర్ నేము, పాస్ వర్డ్ల్ లను ఇవ్వమంటుంది. వాటిని టైప్ చేస్తే సరిపోతుంది. ఇకపై విండోస్ మనల్ని ఏమీ అడగకుండానే ఆటోమేటిక్ గా లాగిన్ అవుతుంది.

Yahoo IDని పర్మినెంట్ గా తీసేయాలంటే!

July 30, 2007 Uncategorized No Comments


అనేకమంది పలు Yahoo IDలను క్రియేట్ చేస్తుంటారు. కానీ వాటిలో ఒకటి, రెండు IDలను మాత్రమే రెగ్యులర్ గా ఉపయోగిస్తుంటారు. మీరు గతంలో రిజిస్టర్ చేసుకుని ప్రస్తుతం నిరుపయోగంగా ఉన్న IDలను తొలగించాలంటే http://edit.yahoo.com/config/delete_user అనే వెబ్ సైట్ కి వెళ్లండి. ఇక్కడ మీ యూజర్ నేము, పాస్ వర్డ్ లతో లాగిన్ అయిన వెంటనే Yahoo ID ని తొలగించడం వల్ల మీ మెయిల్స్, అడ్రస్ బుక్ వంటి అంశాలను ఇకపై పొందలేరు అని వార్నింగ్ మెసేజ్ కనిపించి క్రింది భాగంలో Terminate this Account అనే ఆప్షన్ కనిపిస్తుంది. అది క్లిక్ చేయండి. అకౌంట్ ని తొలగించిన తర్వాత ఇక మనం ఆ అకౌంట్ లోకి లాగిన్ అవడానికి వీలుపడదు. అయితే ఇతరులు మాత్రం 90 రోజుల వరకూ ఆ మెయిల్ IDకి మెసేజ్ లు పంపించగలుగుతారు. అప్పటివరకూ అవి బౌన్స్ అవకుండా వెళుతూనే ఉంటాయి. ఆడియో వివరణతో కూడిన పై వీడియోని చూడండి, వివరంగా అర్థమవుతుంది.

LAN కార్డ్ MAC అడ్రస్ ని మార్చడం ఇలా!

July 30, 2007 Uncategorized No Comments


మనం కొనుగోలు చేసే ప్రతీ LAN కార్డ్ కీ లేదా మన మదర్ బోర్డ్ పై అంతర్గతంగా పొందుపరచబడి ఉండే LAN చిప్ కీ ప్రత్యేకంగా ఫిజికల్, పర్మినెంట్ అడ్రస్ అంటూ ఒకటి ఉంటుంది. దానినే MAC అడ్రస్ అంటుంటారు. ఈ MAC అడ్రస్ మరియు సిస్టం యొక్క IP అడ్రస్ ల ఆధారంగా నెట్ వర్క్ లో ఏమి జరుగుతోందన్నది (నెట్ వర్క్ ట్రాఫిక్, పాకెట్లను విశ్లేషించడం ద్వారా) నెట్ వర్క్ అడ్మినిస్ట్రేటర్లు పర్యవేక్షించగలుగుతారు. వాస్తవానికి ఈ పర్మినెంట్ అడ్రస్ ని మార్చడానికి వీలుపడదు. అయితే http://www.codeproject.com/tools/MacIdChanger/MACAddressChanger_Exe.zip అనే వెబ్ సైట్లో లభించే MAC Address Changer వంటి సాప్ట్ వేర్ని ఉపయోగించడం ద్వారా ప్రస్తుతపు మన లాన్ కార్డ్ యొక్క MAC అడ్రస్ ని తాత్కాలికంగా మనం పేర్కొనే వేరొక MAC అడ్రస్ గా పరిగణనలోకి తీసుకోబడేలా ఏర్పాటు చేసుకోవచ్చు. సాధారణంగా MAC అడ్రస్ 12 ఆల్ఫాన్యూమరిక్ అక్షరాలను కలిగి ఉంటుంది. కాబట్టి మనం ఏ అడ్రస్ గా మార్చదలుచుకున్నామో ఆ అడ్రస్ కూడా తప్పనిసరిగా 12 అక్షరాలను మాత్రమే ఇవ్వాలి.

ఇన్‌స్టెంట్ మెసెంజర్‌లను బ్లాక్ చేయడానికి

July 29, 2007 Uncategorized 4 Comments


Yahoo, GTalk, MSN, AIM, Jabber వంటి అనేక ఇన్‌స్టెంట్ మెసెంజర్ ప్రోగ్రాములు ప్రస్తుతం వాడుకలో ఉన్నాయి. వీటి ద్వారా కొత్త పరిచయాలు ఏర్పడడం మాట అటుంచితే విలువైన పని గంటలు వృధా అవడం, తెలిసీతెలియక యువత పెడదారి పట్టడం, వ్యక్తిగత సమాచారం ఎవరికి బడితే వారికి చెప్పడం వంటి అనర్ధాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపధ్యంలో మీ కంప్యూటర్‌లో Yahoo,Google Talk, MSN, AIM,Odigo, PalTalk, QQ Messenger, Jabber, IMessenger.Net, AOL, IRC, ICQ, GAIM వంటి ఏ రకమైన ఇన్‌స్టెంట్ మెసెంజర్ ప్రోగ్రాం పనిచేయకుండా లాక్ చెయ్యడానికి http://www.comvigo.com/downloadIMLock/IMLSetup.exe అనే వెబ్ సైట్లో లభించే Im Lock Home Edition అనే ప్రోగ్రాం ఉపయోగపడుతుంది. ఈ ప్రోగ్రాం సహాయంతో అవసరం అనుకుంటే iTunes, Internet Explorer, Skype ప్రోగ్రాములు సైతం పనిచెయ్యకుండా లాక్ చేసుకోవచ్చు. ప్రైవసీ,సెక్యూరిటీ కోరుకునేవారికి పనికొచ్చే సాప్ట్ వేర్ ఇది.

CAD డిజైన్లని డిస్‌ప్లే చేసే వ్యూయర్

July 29, 2007 Uncategorized No Comments

BMP,JPG, GIF వంటి సాధారణ ఇమేజ్ ఫార్మేట్లకు చెందిన ఫొటోలను చూడడానికి ACDSee, CompuPic వంటి సాప్ట్ వేర్లు ఎలా ఎలా పని చేస్తాయో అదే విధంగా ఆర్కిటెక్ట్‌లు, డిజైనర్లు ఉపయోగించే AutoCAD సాప్ట్ వేర్ కి సంబంధించిన DWG, DXF డిజైన్లని ఆయా సాప్ట్ వేర్లు ఇన్‌స్టాల్ చేయబడి లేకపోయినా సులభంగా చూడడానికి, ప్రింట్ తీసుకోవడానికి DWGSee 2008 అనే సాప్ట్ వేర్ ఉపయోగపడుతుంది. అన్ని విండోస్ వెర్షన్లపై ఈ ప్రోగ్రాం పని చేస్తుంది.

పదాలు చెప్పే కధలు

July 28, 2007 Uncategorized 1 Comment

Sign off : లోకల్ ఏరియా నెట్‌వర్క్‌లో ఉన్న ఒక కంప్యూటర్ నుండి బయటకు రావడాన్ని లేదా మెయిల్ ఎకౌంట్ల నుండి వెలుపలికి రావడాన్ని Sign off లేదా log off, Sign Out అని వ్యవహరిస్తుంటారు.

Sign on/Sign In: కంప్యూటర్ సిస్టమ్‌లోకి ఇ-మెయిల్ ఎకౌంట్లలోకి ప్రవేశించే ప్రక్రియను sign on అని అంటారు. దీనినే ఒక్కోసారి Sign in అని కూడా పిలుస్తుంటారు. ఈ ప్రక్రియలో యూజర్‌నేమ్, పాస్‌వర్డ్‌లు అవసరమవుతాయి.

Signal-to-Noise Ratio: వివిధ మాధ్యమాల ద్వారా సమాచారం ప్రసారం చెయ్యబడే సమయంలో డేటా ట్రాన్స్ఫరింగ్ లో మధ్యలో అవాంతరాలు ఏర్పడుతుంటాయి. దీనినే noise అంటుంటారు. ప్రసరించబడుతున్న సిగ్నల్‌కి నాయిస్‌కి మధ్య ఉన్న నిష్పత్తిని ఈ Signal-to-noise ratioగా పిలుస్తారు. సహజంగా దీన్ని డెసిబల్స్‌లో కొలుస్తారు.

Silicon: రాళ్ళు,ఇసుకలో లభిస్తూ కంప్యూటర్ చిప్‌లను తయారు చెయ్యడానికి ఉపయోగపడే మూలకమిది. ఈ సిలికాన్ అనే పదాన్ని ఆధారంగా చేసుకునే అమెరికాలోని SanJose, California చుట్టుపక్కల ప్రాంతాలకు సిలికాన్ వ్యాలీ అనే పేరుతో పిలుస్తుంటారు.

SIMD:Single Instruction/Multiple Data అనే పదానికి సంక్షిప్త రూపమిది. వేర్వేరు సమాచారంపై ఒకే ఆపరేషన్లను నిర్వహించే పారలల్ ప్రాసెసర్ ని SIMD పేరుతో పిలుస్తుంటారు.

Print Directly ఆప్షన్ వల్ల ఉపయోగం

July 28, 2007 Uncategorized No Comments

సాధారణంగా మనం డాక్యుమెంట్లని ప్రింట్ చేసుకునే నిమిత్తం File>Print కమాండ్ ద్వారా మనం పంపించే జాబ్‌లు నేరుగా ప్రింటరుకి చేరుకోకుండా తాత్కాలికంగా హార్డ్‌డిస్క్‌లోని C:\Windows\System32\Spool అనే ప్రత్యేకమైన ఫోల్డర్‌లో స్టోర్ చెయ్యబడతాయి. దీనివల్ల మనం ఇచ్చిన ప్రింట్‌జాబ్‌లు ప్రింట్ అవడానికి కొద్దిగా అదనంగా సమయం తీసుకుంటుంది. ప్రింటింగ్ జరిగే సమయంలో అది పూర్తయ్యేటంత వరకూ మనం ఖాళీగా కూర్చోకుండా మరో ప్రక్క వర్క్ చేసుకోవడానికి వీలుగా ఈ ప్రింటర్ స్పూలింగ్ అనే సదుపాయం పొందుపరచబడింది. దాదాపు అన్ని రకాల ప్రింటర్ డ్రైవర్లలోనూ Printer Spooling ఆఫ్ చెయ్యడానికి ఆప్షన్ పొందుపరచబడి ఉంటుంది. దీనిని ఆఫ్ చెయ్యడానికి ControlPanel>Printers అనే ఆప్షన్‌ని డబుల్ క్లిక్ చేసి మీ సిస్టంలో ఇన్‌స్టాల్ చెయ్యబడి ఉండి ప్రస్తుతం మీరు ఉపయోగిస్తున్న ప్రింటర్ డ్రైవర్‌ని సెలక్ట్ చేసుకుని మౌస్‌తో రైట్‌క్లిక్ చేసి Properties అనే ఆప్షన్‌ని ఎంచుకోండి. వెంటనే స్క్రీన్‌పై ప్రత్యక్షమయ్యే డైలాగ్‌బాక్స్‌లో Details అనే పేజ్‌లో Spool Settings అనే బటన్‌ని క్లిక్ చేసి, అందులో Print Directly to Printer అనే ఆప్షన్‌ని ఎంచుకుంటే సరిపోతుంది. కొన్ని ప్రింటర్ లలో ఈ ఆప్షన్ వేరే పేరుతో గానీ, వేరే ప్రదేశంలో గానీ ఉండవచ్చు.

Search This Site:

Press75.com Press75.com Press75.com Press75.com

About Me

1996వ సంవత్సరంలో తెలుగులో మొట్టమొదట కంప్యూటర్ సాహిత్యాన్ని ప్రారంభించే అవకాశం నాకు కలిగింది. అదే సమయంలో చెన్నైలో సూపర్ హిట్ తెలుగు ఫిల్మ్ మేగజైన్ కి సబ్ ఎడిటర్ గా కూడా ఏకకాలంలో పనిచేస్తూ 1998 వరకూ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, మనీషా కొయిరాలా, శంకర్, రజనీకాంత్, కమల్ హాసన్ వంటి ప్రముఖులెందరినో ఇంటర్వ్యూలు చేయడం మర్చిపోలేని అనుభవం. అయితే సినిమా రంగంలో ఉన్న అనారోగ్యకరమైన వాతావరణం వల్ల నాకంటూ ఓ ప్రత్యేకమైన ఉనికిని సృష్టించుకోవడం కోసం సినిమా రంగం నుండి బయటకు వచ్చి పూర్తిగా టెక్నాలజీ రంగంలో స్థిరపడడం జరిగింది. 96 నుండి 2001 వరకూ పలు కంప్యూటర్ పత్రికలకు ఎడిటర్ గా పనిచేసి.. 2001 నుండి "కంప్యూటర్ ఎరా" తెలుగు మంత్లీ మేగజైన్ ఎడిటర్ గా పత్రిక మొత్తాన్నీ రూపొందిస్తూ ఉన్నాను. అలాగే తెలుగు టెలివిజన్ ఛానెళ్లలో మొట్టమొదటి టెక్నికల్ phone-in ప్రోగ్రామ్ కి గెస్ట్ గా అటెండ్ అయ్యే అవకాశమూ 2010 జనవరి 20న కలిగింది. అప్పటి నుండి ఇప్పటివరకూ I News, ETV2, ABN ఆంధ్రజ్యోతి, NTV, Zee 24 గంటలు, సాక్షి టివి, మహా టివి, జాగృతి న్యూస్ వంటి ఛానెళ్లలో 90కి పైగా లైవ్, రికార్డెడ్ ప్రోగ్రాముల్ని చేయడం జరిగింది. 2007లో అత్యుత్తమైన నాణ్యతతో కూడిన పోస్టులతో, వీడియోలతో తెలుగులో మొదటి ప్రొఫెషనల్ టెక్నికల్ బ్లాగ్ గానూ, మొదటి వీడియో బ్లాగ్ గానూ ఇప్పుడు మీరు చూస్తున్న బ్లాగ్ ప్రత్యేకతను సంతరించుకుంది. అలాగే 2007 జనవరి 1న ప్రారంభించిన తెలుగులోనే మొట్టమొదటి టెక్నికల్ ఫోరమ్ అయిన "కంప్యూటర్ ఎరా సాంకేతిక ఫోరమ్" 14 వేల మంది సభ్యులతో 10 వేలకు పైగా పోస్టులతో 2009 జూలై వరకూ నిర్వహించబడింది. దాంతోపాటే మొట్టమొదటి తెలుగు టెక్నికల్ ఛాట్ రూమ్ అయిన "కంప్యూటర్ ఎరా సాంకేతిక సహాయం" అనే ఛాట్ రూమ్ రెండేళ్లలో వేలాది మందికి తెలుగు టైప్ చేయడం మొదలుకుని అనేక కంప్యూటర్ సంబంధిత సాంకేతిక సమస్యలకు తక్షణ సహాయం అందించింది. ఇకపోతే http://youtube.com/nallamothu అనే ఛానెల్ లో 361కి పైగా ప్రొఫెషనల్ క్వాలిటీ తెలుగు టెక్నికల్ వీడియోలు అందించాను. ఈ ఛానెల్ కి 1192 మంది సబ్ స్కైబర్లు ఉన్నారు. అందుబాటులో ఉన్న వివిధ మార్గాల ద్వారా తెలుగు వారందరకీ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించే పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాను.

Google Playలో పొందండి

ఇక్కడ RSS Feedకి Subscribe చేసి నేరుగా పోస్ట్ లు పొందండి