RAM కొనబోతున్నట్లయితే…

August 31, 2007 Uncategorized 1 Comment

* కొత్త సిస్టమ్‌కి మెమరీని కొనుగోలు చేసేటప్పుడు మీరు ఎంత మొత్తంలో అయితే RAM అమర్చుకోదలుచుకున్నారో అంత మొత్తానికి ఒకే RAM మాడ్యూల్‌ని మాత్రమే తీసుకోండి. రెండు మాడ్యుళ్ళు ఉన్నప్పుడు అనేక కారణాల వల్ల ఒక మాడ్యూల్ ఫెయిలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒకటే వాడండి.

* మాడ్యూళ్ళకి రెండు వైపులా ప్లాస్టిక్ కేసింగ్ ఉన్న RAMని ఎట్టి పరిస్థితుల్లో సెలెక్ట్ చేసుకోకండి. ఈ తరహా మాడ్యుళ్ళు ఎక్కువగా ఫెయిల్ అవుతున్నాయి.ఓపెన్‌గా ఉన్న మాడ్యుళ్ళనే కొనుగోలు చేయండి.

* SDRM అయితే 133MHz బస్‌స్పీడ్ ఉన్న మాడ్యుళ్ళని, DDR అయితే 400 MHz బస్‌స్పీడ్ ఉన్న మాడ్యూళ్ళనే ఎంచుకోవడం వల్ల సిస్టమ్ పెర్‌ఫార్మెన్స్ మెరుగ్గా ఉంటుంది. ఒక వేళ మీ మదర్ బోర్డ్ సపోర్ట్ చెయ్యకపోతేనే తక్కువ బస్‌స్పీడ్‌ని ఎంచుకోండి.

* ఆల్రెడీ మీ సిస్టమ్‌లో పాత RAM మాడ్యూల్ ఉన్నట్లైతే దాన్ని అప్‌గ్రేడ్ చేసుకోవడానికి కొత్త రామ్ కొంటున్నట్లయితే పాత దానితో కొత్త మాడ్యూల్‌ని జత చేయకండి.పాత రామ్‌ని స్టాండ్‌బైగా ప్రక్కన పెట్తుకుని కేవలం కొత్తదాన్ని మాత్రమే వాడండి.

స్పీకర్లని కొనుగోలు చేయబోతున్నట్లయితే..

August 31, 2007 Uncategorized No Comments

పవర్ రేటింగ్ : మార్కెట్లో లభిస్తున్న అన్ని స్పీకర్లూ పవర్ రేటింగ్‌ని PMPO ప్రమాణంలో పేర్కొంటున్నారు. అయితే PMPO అర్ధం లేని స్పెసిఫికేషన్! దీనికి బదులు స్పీకర్ సిస్టమ్ యొక్క RMS పవర్‌ని పరిగణనలోకి తీసుకోండి. సరౌండ్ సౌండ్ స్పీకర్ల విషయంలో కనీసం 40 Watts RMS పవర్ ఉన్న స్పీకర్లని ఎంచుకోవడం మంచిది. నిరంతరాయంగా పవర్‌ని హ్యాండిల్ చెయ్యగల సమర్ధత స్పీకర్‌లో ఎంత ఉందో తెలుసుకోవడానికి RMS మాత్రమే సరైన ప్రమాణం.

ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్: మీరు కొనే స్పీకర్ యొక్క ఫ్రీక్వెన్సీ 16 KHz కంటే ఎక్కువ లభించనపుడు క్లాసిక్ మ్యూజిక్ వినేటప్పుడు high treble లభించదు. అలాగే 50 KHZ కన్నా తక్కువ ఫ్రీక్వెన్సీని మీ స్పీకర్ సపోర్ట్ చెయ్యకపోతే డ్రమ్ సౌండ్లు, సినిమాల్లో భారీ పేలుళ్ళ శబ్దాలను ఎఫెక్టివ్‌గా వినడానికి వీలుపడదు. ఈ నేపధ్యంలో మీ స్పీకర్ ఎక్కువ ఫ్రీక్వెన్సీ రేంజ్‌ని సపోర్ట్ చేసేదై ఉండాలి.

ఆడియో ఇన్‌పుట్: 2.1 స్టీరియో స్పీకర్ సిస్టమ్‌ని ఎంచుకుంటే కేవలం అనలాగ్ లెఫ్ట్, రైట్ చానెళ్ళు మాత్రమే లభిస్తాయి. అదే 4 చానెల్ సరౌండ్‌సౌండ్ సిస్టమ్ విషయంలో స్పీకర్ సిస్టమ్‌కి మొత్తం నాలుగు అనలాగ్ ఆడియో ఇన్‌పుట్‌లు ఉండేలా చూసుకోవాలి.అదే 5.1 స్పీకర్స్ విషయంలో మొత్తం ఆరు సపరేట్ RCA ఇన్‌పుట్‌లు స్పీకర్‌కి లభించేలా జాగ్రత్త వహించాలి.

గూగుల్ ఎర్త్….GOOGLE EARTH

August 30, 2007 Uncategorized 1 Comment

’తాతా కంప్యూటర్లో మన ఇల్లు, పురులు, సూర్యలంకలు సముద్రపు ఒడ్డు కనిపిస్తున్నాయే’! అంటూ ఓ మనవడు చెబుతుంటే ఆ తాత మొహంలో సంభ్రమం కొట్టొచ్చినట్లు కనిపించింది. Google Earth, Wikipedia ల పుణ్యమా అని ప్రపంచంలోని ఏ మారుమూల ప్రదేశం గురించైనా క్షణాల్లో ఉపగ్రహ చిత్రాల ద్వాఅరా తెలుసుకోవడం సాధ్యపడుతోంది.

ఎక్కడ లభిస్తుంది, ఎంత సైజ్ ఉంటుంది?

Google Earth అనేది ఓ ఉచిత మృదులాంత్రము (Software). 11 MB సైజుగల ఈ ప్రోగ్రామ్‍ని http://earth.google.com అనే సైట్ నుండి పొందవచ్చు. ఫ్రీవర్షన్‍ని డౌన్‍లోడ్ చేసుకునేటప్పుడు ఓ రిజిస్ట్రేషన్ ఫారంని నింఫి యూజర్‍నేమ్, లైసెన్స్ కీలను పొందాలి. Google Earth ని నెట్‍కి కనెక్ట్ చేసే సమయంలో వీటిని తెలియజేస్తేనే లాగిన్ అవుతుంది.

ఎలా ఎక్స్ ప్లోర్ చేయాలి?

Google Earth ప్రోగ్రామ్‍ని రన్ చేసిన వెంటనే ఓ globe గుండ్రంగా తిరుగుతూ మన ముందుకు వస్తుంది. ఆ గ్లోబ్‍లో ఏ ప్రదేశం వద్ద అయినా మౌస్‍ని ప్రెస్ చేసి పట్టుకుని మీకు కావల్సిన దేశం వచ్చేటంతవరకూ కుడి, ఎడమ వైపులకు మౌస్‍ని డ్రాగ్ చేస్తూ వెళ్ళండి. ఇప్పుడు మీకు కావలసిన దేశం వచ్చిన తర్వాత Mapsకి క్రింది భాగంలో కన్పించే కంట్రోళ్ళని ఉపయోగించి ఆ దేశంలోని ఇతర నగరాలు, పట్టణాలని వెతుకుతూ వెళ్ళాలి. ఉదా.కు New Delhi, Mumbai, Hyderabad వంటి నగరాల పేర్లు కనిపిస్తాయి. వాటిలో ఏదైనా నగరాన్ని సెంటర్ పొజిషన్‍లోకి తెచ్చుకుని.. ఆ నగరాన్ని జూమ్ చేసుకుంటూ వెళితే ఆ నగరంలోని వివిధ ప్రాంతాల పేర్లు కన్పిస్తుంటాయి. హైదరాబాదుని జూమ్ చేసుకుంటూ వెళితే హుస్సేన్‍సాగర్, అమీర్‍పేట్, ఎల్.బి. స్టేడియం, వంటి వివిధ ప్రదేశాల పేర్లు కనిపిస్తాయి. వాటిలో ఏదైనా ప్రదేశాన్ని ఎంచుకుని జూమ్ చేసుకుంటూ వెళితే ఆ ప్రదేశం పరిసర ప్రాంతాలు, భవనాలు, రోడ్లు ఉపగ్రహచిత్రం రూపంలో చూపించబడతాయి. మన రాష్ట్రంలోని చిన్న చిన్న పట్టణాల రూపురేఖలని సైతం Google Earth ప్రోగ్రామ్ ద్వారాఎక్స్ ప్లోర్ చేసుకోవచ్చు.

చిటికెలో కావలసిన ప్రదేశాన్ని చూడాలా?

Globe బొమ్మని జూమ్ చేస్తూ కావలసిన ప్రదేశానికి చేరుకోవడం కష్టంగా ఉందా … అయితే Google Earth ప్రోగ్రామ్‍లోని Fly to అనే బాక్సులో మీరు ఏ నగరాన్ని చూడాలనుకుంటున్నారో దాని పేరుని టైప్ చేయండి. ప్రముఖ ప్రాంతాలని సందర్శించడానికి ఇది సులభంగా ఉంటుంది. ప్రపంచంలోని ప్రముఖ ప్రదేశాలకు సంబంధించిన అదనపు సమాచారాన్ని సైతం Google Earth ద్వారా పొందవచ్చు. ఏదైనా ప్రముఖ ప్రదేశానికి బ్రౌజ్ చేసేటప్పుడు అక్కడికి దగ్గరలో హైవేలు, రెస్టారెంట్లు, లాడ్జిలు, బ్యాంకులు, రిటైల్‍షాపులు, ఫార్మసీలు, వంటి ఎలాంటీ వనరులైనా ఉన్నాయేమో తెలుసుకోవడానికి అవకాశముంది. దీనికి గాను Google Earth ప్రోగ్రాములో Layers అనే ప్రదేశం వద్ద కావలసిన అంశాలని ఎంచుకుంటే సరిపోతుంది. వివిధ ప్రదేశాలని బ్రౌజ్ చేసేటప్పుడు పలురకాల సింబల్స్ రూపంలో ఇవి చూపించబడతాయి.


ధర్డ్ పార్టీ ప్లగ్‍ఇన్‍లు సైతం లభిస్తున్నాయి…

Google Earth ప్రోగ్రాములో ఉన్న సదుపాయాలు సరిపోవడం లేదా… అయితే www.googleearthhacks.com అనే వెబ్‍సైట్‍లో అదనపు మ్యాపులు, ఫోటోలు లభించడంతో పాటు ఈ ప్రోగ్రామ్‍ని ఉపయోగిస్తున్న ఇతర యూజర్ల అభిప్రాయాలు తెలుసుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకుంటున్న పరిణామాలను తెలుసుకోవడానికి Google News స్టోరీలు, Earth చిత్రాలు చూసి చూసి విసిగిపోయి కొద్ది భిన్నంగా వేరే గ్రహం చిత్రాలు చూడాలనుకుంటే Jupiter గ్రహం యొక్క చిత్రాలు చూపించే ప్లగ్‍ఇన్‍లు వంటివి ఎన్నో ఈ సైట్‍లో డౌన్‍లోడ్ చేసుకోవడానికి సిద్ధంగా లభిస్తున్నాయి.ది

మీ మెయిల్ స్పామ్ కాకుండా…

August 29, 2007 Uncategorized 1 Comment

మీ ఫ్రెండ్‍కొక ముఖ్యమైన మెసేజ్ పంపించారనుకోండి. అయితే పొరబాటున అది Bulk ఫోల్డర్‍లోకి వెళితే, దానిని చెక్ చేసుకోకుండానే అతను ఆ ఫోల్డర్‍ని క్లీన్ చేస్తే మీరు పంపించిన మెసేజ్ నిరుపయోగమైనట్లే కదా! అవును… అప్పుడప్పుడు ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతుంటాయి. మనం పంపించే మెసేజ్‍లలో Yahoo, Rediff, Gmail వంటి సర్వర్లలోని స్పామ్ ఫిల్టర్లు వడగట్టే ఏ ఒక్క లక్షణం ఉన్నా మన మెయిల్ అవతలి వ్యక్తి Inbox కి వెళ్ళడానికి బదులు Junk/Bulk/Spam ఫోల్డర్లకి చేరుకుంటుంది. ఒక్కోసారి మనం పంపించే మెసేజ్‍లలోని సబ్జెక్ట్ లైన్‍లను చూడగానే రిసీవ్ చేసుకున్నవారు స్పామ్ మెసేజ్ అని పొరబాటుపడి డిలీట్ చేసే అవకాశామూ ఉంది. ఈ నేపధ్యంలో మన మెసేజ్ స్పామ్‍గా పరిగణించబడకుండా ఉండాలంటే మెయిల్ పంఫించేటప్పుడు క్రింది జాగ్రత్తలు తీసుకోవాలి.

సబ్జెక్ట్ అర్ధవంతమైనదై ఉండాలి.

మీరు కంపోజ్ చేసే మెయిల్ మెసేజ్‍లకు సబ్జెక్ట్ అనే ప్రదేశంలో మెసేజ్‍లోని అర్ధాన్ని ప్రతిఫలించే విధంగా వాక్యాన్ని పేర్కోనాలి.కొంతమంది అసలు Subject అనే కాలమ్‍లో ఏమీ టైప్ చేయరు. అది అదనపు శ్రమ అని వదిలివేస్తుంటారు. ఇలా ఎలాంటి సబ్జెక్ట్ లైనులనూ కలిగి ఉండని మెసేజ్‍లను చాలా మెయిల్ సర్వర్లు Junk/Spam ఫోల్డర్‍లోకి పంపిస్తుంటాయి. అలాగే Subject లైన్‍గా Stuff, Hello , HI, Help, New, Free వంటి పదాలను టైప్ చేయకండి. అలాంటి మెసేజ్‍లు స్పామ్‍గా పరిగణించబడతాయి.

ఫార్మేటింగ్ మెళకువలు పాటించండి…

మెయిల్ మెసేజ్‍లో మనం పొందుపరిచే సమాచారంలో మొదటి పేరాలో ఫ్రీ ఆఫర్స్ వంటి పదాల్ని వాడితే అవి స్పామ్‍గా పరిగణించబడే ప్రమాదం ఉంది. అలాగే అన్నీ కేపిటల్,అన్నీ స్మాల్ లెటర్స్ తో టైప్ చేసిన మెసేజ్‍లను మెయిల్ సర్వర్‍లోని Spam Filters స్పామ్ మెసేజ్‍లుగా పరిగణించి నేరుగా రిసీవ్ చేసుకున్న వ్యక్తి యొక్క Junk ఫోల్డ్రర్‍లోకి తరలించే అవకాశముంది. సహజంగా మెసేజ్‍లోని Text కి Bold, Italic, Font color, Alignment వంటి ఫార్మేటింగ్‍లను అప్లై చేసినప్పుడు ఆయా మెసేజ్‍లను స్పామ్ ఫిల్టర్లు సాధారణ మెసేజ్‍లుగా గుర్తించడం ఇక్కడ గమనార్హం. కాబట్టి మెసేజ్ ఫార్మటింగ్ చేయండి.

Bulk Mail ప్రోగ్రాములు వాడవద్దు.

ఒకేసారి భారీ సంఖ్యలో మెయిల్ అడ్రస్‍లకు మెసేజ్‍లను పంపించగలిగే Bulk మెయిల్ మృదులాంత్రముల(Software) ద్వారా పంపించబడే అన్ని మెసేజ్‍లను Yahoo వంటి అన్ని సర్వర్లూ స్పామ్‍గానే పరిగణిస్తాయి.

మౌస్ ఇష్టమొచ్చినట్టు మూవ్ అవుతుందా…

August 29, 2007 Uncategorized No Comments

విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‍లో ఆప్షన్లను సెలెక్ట్ చేసుకోవడానికి, దాదాపు అన్నిరకాల
ఇతర పనులకూ మౌస్ లేనిదే కష్టం. అయితే ఒక్కోసారి మౌస్ పాయింటర్ మన
చేతితో మూవ్ చేస్తున్న పద్ధతికి అనుగుణంగా కాకుండా, మరీ స్లోగా కానీ,జెర్కీగా
గానీ మూవ్ అవుతుంటుంది. సాధారణంగా మౌస్ రోలర్‍లకు మురికి చేరినపుడు
ఈ పరిస్థితి తలెత్తుతుంది. అలాంటప్పుడు మౌస్ వెనుకభాగంలొ ఉండే మౌస్
కవర్‍ని తొలగించి అందులోని మౌస్ బాల్‍ని బయటకు తీయండి. ఇప్పుడు మౌస్
లోపల ఖాళీ ప్రదేశం ఏర్పడుతుంది. ఆ ఖాళీప్రదేశం ద్వారా మౌస్ రోలర్లకు పట్టిన
మురికిని గుర్తించవచ్చు. నీటిలో ముంచిన ఒక గుడ్డను తీసుకుని ఆ రోలర్లకు
పట్టుకున్న మురికిని మెల్లగా గీరివేయండి. మురికి ప్యాచ్‍లుగా ఊడిపోతుంది..
అలాగే మౌస్‍బాల్‍ని కూడా శుభ్రంగా డిటర్జెంట్ నీళ్ళలో కడిగి శుభ్రంగా తుడిచి మౌస్
లోపల అమర్చండి. మౌస్ ప్యాడ్ ద్వారా ఎక్కువగా మురికి మౌస్ లోపలికి చేరుతుంది.
కాబట్టి ప్రతీరోజూ మౌస్ ప్యాడ్‍పై చేరుకున్న దుమ్ముని శుభ్రపరచడం శ్రేయస్కరం.

ఆధ్యాత్మిక భాండాగారం

August 26, 2007 Uncategorized 3 Comments

నిత్యం ‘ఆదిత్య హృదయం’ చదివితే మనసు ప్రశాంతంగా ఉంటుందని పారాయణం చేసేవారు చాలామంది అంటారు. మరికొందరు కార్తీకమాసం వచ్చిందంటే చాలు..లింగాష్టకం, బిల్వాష్టకం, విశ్వనాధాష్టకం, ఉమామహేశ్వరస్తోత్రం వల్లె వేస్తుంటారు. నాలిక స్పష్టత లేక కొందరు ఆడియో రూపంలో వాటిని విని తరిస్తుంటారు. పుస్తకాలు, క్యాసెట్లు, సిడిల రూపంలో మాత్రమే ఇంతకాలం లభించిన మన ఆధ్యాత్మిక సంపద ఇప్పుడు అంతర్జాలం(Internet)లోనూ పొందుపరచబడి ఉంది.ఆధ్యాత్మిక ప్రియుల కోసం నెట్‌పై లభించే వివిధ భక్తి వెబ్‌సైట్ల వివరాలను ఇప్పుడు అందించడం జరుగుతుంది. www.telugubhakti.com/telugupages/main.htm అనే వెబ్‌సైట్‌లో శివ, విష్ణు,వేంకటేశ్వరస్వామి,అయ్యప్ప,కృష్ణుడు,లక్ష్మీదేవి,దుర్గామాత,విఘ్నేశ్వరుడు,సరస్వతీమాత, రాముడు, హనుమంతుడు వంటి వివిధ భగవత్ స్వరూపాలకు సంబంధించిన శ్లోకాలు, స్తోత్రాలు, అచ్చ తెలుగులో స్కాన్ చేయబడి పొందుపరచబడి ఉన్నాయి. చాలా అరుదుగా లభించే అనేక స్తోత్రాలు ఈ వెబ్‌సైట్‌లో లభిస్తున్నాయి. కొన్ని శ్లోకాలు, స్తోత్రాలు MP3 ఫార్మేట్‌లో ఆడియోగా డౌన్‌లోడ్ చేసుకోవడానికి సైతం ఈ వెబ్‌సైట్‌లో పొందుపరచబడి ఉండడం విశేషం!!

చల్లని మాటలతో భావం మనసులో హత్తుకుపోయేలా వివరించే ఉషశ్రీ కంఠస్వరం చాలామందికి సుపరిచితమే. ఉషశ్రీ స్వరం నుండి జాలువారిన రామాయణం, భాగవతం,మహాభారతాలను వింటుంటే ఎంతవారైనా తన్మయులు కావడం ఖాయం. వీటిని http://surasa.net/music/ushasri-vani/ అనే వెబ్‌సైట్‌లో Real Player ద్వారా వినవచ్చు. www.telugufm.com/modules/music/devotional.aspx అనే వెబ్‌సైట్‌లోనూ,
www.andhravilas.com/devotional.asp
www.raaga.com/channels/devotional.asp
www.andhrakitchen.com/devmusic.php
www.telugusongs.allindiasite.com\devo.html
www.ragalahari.com/devotional.asp
www.devotionalsongs.com
www.telugutoranam.com/devotional/index.php,
www.annamayya.org/home.htm
www.shaivam.org/ste.htm
వంటి వెబ్‌సైట్లలో తెలుగు శ్లోకాలు, స్త్రోత్రాలు ఆడియో రూపంలో వినడానికి సిద్ధంగా లభిస్తున్నాయి.www.teluguone.com/bhakti అనే వెబ్‌సైట్‌లో శ్లోకాలు, స్త్రోత్రాలు ఆడియో రూపంలో లభించడంతోపాటు వివిధ పూజలు,వ్రతవిధానం, కాలజ్ఞానం వంటి అనేక అంశాలు సైతం పొందవచ్చు.

మెయిల్ చదివింది లేనిది తెలుసుకోవడమెలా???

August 25, 2007 Uncategorized 3 Comments

మనం మన స్నేహితులకు పంపించే మెయిల్స్‌ని వారు రిప్లై ఇచ్చేవరకు వారు వాటిని చదివింది లేనిదీ అర్ధం కాదు. అయితే ఓ చిన్న చిట్కాని పాటించడం ద్వారా మనం పంపించిన మెయిల్ మెసేజ్‌ని వారు ఎప్పుడు చదివినది, వారికి తెలియకుండానే మనం ఓ రిపోర్ట్ ద్వారా పొందవచ్చు. అదెలాగంటే www.statcounter.com అనే వెబ్‌సైట్‌లోకి వెళ్ళి ఉచిత ఎకౌంట్‌ని రిజిస్టర్ చేసుకోండి. ఇప్పుడు install code ఆప్షన్లలోకి వెళ్ళి invisible tracking button and HTML only counter అనే ఆప్షన్‌ని ఎంచుకున్న వెంటనే statcounter.com వెబ్‌సైట్ మనకు ఓ HTML image snippetని అందిస్తుంది. ఇప్పుడు మనం Google, Yahoo వంటి మెయిల్ ఎకౌంట్ల ద్వారా మెసేజ్‌ని కంపోజ్ చేసేటప్పుడు HTML ఫార్మేట్‌లో మెసేజ్ పంపబడేలా సెట్ చేసుకుని ఆ HTML పేజీలో ఇంతకుముందు డౌన్‌లోడ్ చేసుకున్న snippetని ఎంబెడ్ చేయండి. అంతే… మీ ఫ్రెండ్ మీరు పంపిన మెసేజ్‌ని ఓపెన్ చేసిన వెంటనే … అతనికి ఏమాత్రం అనుమానం రాకుండా మెసేజ్ ఓపెన్ చేసిన తేదీ, టైం వివరాలు మనకు వచ్చేస్తాయి..ఇంకెందుకు ఆలస్యం…

ఆటోమేటిక్‍గా జిప్ చేసే ప్లగ్‍ఇన్…

August 25, 2007 Uncategorized No Comments

Outlook ప్రోగ్రామ్ ద్వారా మనం మెయిల్ మెసేజ్‌లు పంపిస్తూ, స్వీకరిస్తుంటాము. అధిక సందర్భాల్లో మనం పంపించే మెయిల్స్‌తోపాటు ఫైల్ అటాచ్‌మెంట్లు కూడా పంపించవలసి వచ్చినప్పుడు ఎక్కువ పరిమాణం కలిగిన ఫైళ్ళని పంపించడానికి అధిక సమయం తీసుకుంటుంది. ఈ నేపధ్యంలో మెయిల్‌తోపాటు మనం పంపించే ప్రతీ అటాచ్‌మెంట్‌ని ఆటోమేటిక్‌గా జిప్ చేసి పంపించే ప్లగ్ఇన్ ఒకటి www.baxbex.com సైట్‌లో లభిస్తుంది. దీనిని ఉపయోగించడం వల్ల మెయిల్స్ వేగంగా పంపించడానికి వీలు పడుతుంది.

హార్డ్ డిస్క్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు

August 24, 2007 Uncategorized 3 Comments

ప్రస్తుతం 250GB వరకూ స్టోరేజ్ కెపాసిటీ కలిగిన ఇంటర్నల్ హార్డ్ డిస్క్‌లు లభిస్తున్నాయి. వీటి కొనుగోలు సమయంలో చాలా మంది ఏమాత్రం శ్రద్ధ చూపించరు. హార్డ్ డిస్క్‌లను కొనేటప్పుడు పరిగణనలోకి తీసుకోవలసిన వివిధ అంశాల గురించి క్రింద డీటైల్డ్‌గా వివరించడం జరిగింది.

స్టోరేజ్ కెపాసిటీ…

సాధారణ అవసరాలకు 40GB హార్డ్‌డిస్క్ సరిపోతుంది. అయితే 40 GBకీ 80 GBకీ రెండు మూడు వందలకు మించి పెద్దగా వృత్యాసం లేకపోవడం వల్ల 80GBని ఎంచుకోండి.క్యాసెట్ -టు-సిడి/డివిడి కన్వర్షన్ వంటి కార్యకలాపాలు చేసేవారు స్టోరేజ్ అవసరాలు ఎక్కువగా ఉండడంవల్ల కనీసం 120/160GB హార్డ్ డిస్క్‌లను కొనుగోలు చేయండి. అంతకన్నా ఎక్కువ కెపాసిటీ కలిగిన హార్డ్‌డిస్క్‌లు అవసరం అయితే ఇంటర్నల్ డిస్క్‌ల కన్నా USB పోర్ట్‌కి కనెక్ట్ చేసుకోగలిగే ఎక్స్‌టర్నల్ డిస్క్‌లను కొనండి. ప్రస్తుతం ఎక్స్‌టర్నల్ డిస్క్‌లు 400GB స్టోరేజ్ కెపాసిటీవి ఉన్నాయి.

రోటేషనల్ స్పీడ్..

దాదాపు అన్ని ATA హార్డ్‌డిస్క్‌లు 5400 లేదా 7200 rpm (నిమిషానికి తిరిగే చుట్లు) కలిగి ఉంటున్నాయి. వాస్తవానికి హార్డ్‌డిస్క్ యొక్క rpm ఎక్కువగా ఉంటే హార్డ్‌డిస్క్ నుండి డేటా వేగంగా వెలిగితీయబడుతుంది. అయితే rpm ఒక్కటే హార్డ్‌డిస్క్ యొక్క పనితీరుని ప్రభావితం చేయదు. డ్రైవ్ జామెంట్రీ, డేటాని రిట్రీవ్ చెయ్యడానికి డ్రైవ్ అనుసరించే పద్ధతి వంటి పలు అంశాలు డ్రైవ్ పెర్ఫార్మెన్స్‌పై ప్రభావం కనబరుస్తాయి. ఏదేమైనా 7200rpm ఉన్న హార్డ్‌డిస్క్‌లను మాత్రమే ఎంపిక చేసుకోండి.

ఇంటర్‌ఫేస్..

ATA/133 కోవకు చెందిన డ్రైవ్‌లను ఎంపిక చేసుకోండి. ఈ హార్డ్‌డిస్క్‌లు సెకనుకు 133 MB వరకూ డేటాని ట్రాన్స్‌ఫర్ చేయగలుగుతాయి. కొన్ని మదర్‌బోర్డ్‌లు ATA/133 ఇంటర్‌ఫేస్‌ని సపోర్ట్ చేయవు. అలాంటి బోర్డ్‌లలో కూడా ATA/133 హార్డ్‌డిస్క్‌లను అమర్చుకోవచ్చు. అయితే డేటా ట్రాన్స్‌ఫర్ రేట్ మాత్రం సెకనుకు 100MB మాత్రమే లభిస్తుంది. అలాంటి పాతతరం బోర్డ్‌లలో ATA/133 హార్డ్‌డిస్క్‌ల నుండి సెకనుకు 133MB ట్రాన్స్‌ఫర్ రేట్‌ని సాధించాలంటే add-in కార్డ్ ఒకటి అమర్చుకోవాలి.

బఫర్…

ప్రాసెసర్ కొంత డేటాని అందించమని హార్డ్‌డిస్క్‌ని కోరిందనుకుందాం. హార్డ్‌డిస్క్ ముందుగా ప్రాసెసర్ ఒక్కసారికి ఎంత మొత్తంలో సమాచారాన్ని ప్రాసెస్ చెయ్యగలుగుతుందో అంతమేరకే పంపించి కోరిన మొత్తం డేటాలో కొంత మొత్తాన్ని ప్లాటర్లలోనుండీ తనవద్దే టెంపరరీ స్టోరేజ్ ఏరియాగా ఉండే “బఫర్” లో స్టోర్ చేసుకుంటుంది.ప్రాసెసర్ మొదట పంపించిన డేటాని ప్రాసెస్ చేయడం పూర్తయిన వెంటనే బఫర్‌లోని డేటాని ప్రాసెసర్‌కి పంపించి తిరిగి బఫర్‌ని నింపుకుంటుంది. హార్డ్‌డిస్క్‌ని కొనేటప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో 8MB బఫర్ ఉన్న డ్రైవ్‌లను కొనుగోలు చేయండి.

కొన్న వెంటనే తనిఖీ చేయండి..

హార్డ్‌డిస్క్‌ని కొని పార్టీషన్లు చేసి ఫార్మేట్ చేసిన వెంటనే డిస్క్‌లోని అన్ని పార్టీషన్లని Surface Test ద్వారా తనిఖీ చేయండి. మేన్యుఫాక్చరింగ్ లోపాల వల్ల, డీలర్స్ ఎలా పడితే అలా పడేయడం వల్ల కొన్ని డిస్క్‌లలో ఆల్రెడీ బాడ్ సెక్టార్లు ఉండే అవకాశం ఉంది. బాడ్ సెక్టర్స్ కనిపిస్తే వెంటనే డిస్క్‌ని గట్టిగా అమర్చండి. స్క్రూలు టైట్ చేయకపోవడం వల్ల డిస్క్‌రీడింగ్ సమయంలో క్యాబినెట్ కదలడం వల్ల డిస్క్ సైతం కదిలినట్లయితే మీడియా ప్రాబ్లెమ్స్ వచ్చే అవకాశం ఉంది.

100.చాటింగ్ చేసేవారికి శుభవార్త..

August 22, 2007 Uncategorized 2 Comments

Gaim అనేది విండోస్‌తోపాటు పలు ఇతర ఆపరేటింగ్ సిస్టమ్‌లకు ఇన్‌స్టెంట్
మెసేజింగ్ క్లయింట్‌గా పనిచేస్తుంది. ఈ ప్రోగ్రామ్ MSN Messenger,
Yahoo! Messenger, AIM, ICQ, IRC, jabber వంటి ప్రముఖ
ఇన్‌స్టెంట్ మెసేజింగ్ సర్వర్లను సపోర్ట్ చెయ్యడమే కాకుండా పెద్దగా ప్రాచుర్యం పొందని
Gadu-Gadu, Zephyr నెట్‌వర్క్‌లను సైతం సపోర్ట్ చేస్తుంది. ఈ క్లయింట్
ప్రోగ్రామ్‌తో ఒకేసారి పలు మెసేజింగ్ సర్వర్లలోకి లాగిన్ అవవచ్చు. అలాగే ఒక
చాట్ సర్వర్ నుండి మరో చాట్ సర్వర్‌కి ఈజీగా మారిపోవచ్చు. పలు ఇన్‌స్టెంట్
మెసేజింగ్ ఎకౌంట్లు కలిగి ఉన్నవారికి చాలా ఉపయోగపడుతుంది ఈ ప్రోగ్రామ్.

Search This Site:

Press75.com Press75.com Press75.com Press75.com

About Me

1996వ సంవత్సరంలో తెలుగులో మొట్టమొదట కంప్యూటర్ సాహిత్యాన్ని ప్రారంభించే అవకాశం నాకు కలిగింది. అదే సమయంలో చెన్నైలో సూపర్ హిట్ తెలుగు ఫిల్మ్ మేగజైన్ కి సబ్ ఎడిటర్ గా కూడా ఏకకాలంలో పనిచేస్తూ 1998 వరకూ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, మనీషా కొయిరాలా, శంకర్, రజనీకాంత్, కమల్ హాసన్ వంటి ప్రముఖులెందరినో ఇంటర్వ్యూలు చేయడం మర్చిపోలేని అనుభవం. అయితే సినిమా రంగంలో ఉన్న అనారోగ్యకరమైన వాతావరణం వల్ల నాకంటూ ఓ ప్రత్యేకమైన ఉనికిని సృష్టించుకోవడం కోసం సినిమా రంగం నుండి బయటకు వచ్చి పూర్తిగా టెక్నాలజీ రంగంలో స్థిరపడడం జరిగింది. 96 నుండి 2001 వరకూ పలు కంప్యూటర్ పత్రికలకు ఎడిటర్ గా పనిచేసి.. 2001 నుండి "కంప్యూటర్ ఎరా" తెలుగు మంత్లీ మేగజైన్ ఎడిటర్ గా పత్రిక మొత్తాన్నీ రూపొందిస్తూ ఉన్నాను. అలాగే తెలుగు టెలివిజన్ ఛానెళ్లలో మొట్టమొదటి టెక్నికల్ phone-in ప్రోగ్రామ్ కి గెస్ట్ గా అటెండ్ అయ్యే అవకాశమూ 2010 జనవరి 20న కలిగింది. అప్పటి నుండి ఇప్పటివరకూ I News, ETV2, ABN ఆంధ్రజ్యోతి, NTV, Zee 24 గంటలు, సాక్షి టివి, మహా టివి, జాగృతి న్యూస్ వంటి ఛానెళ్లలో 90కి పైగా లైవ్, రికార్డెడ్ ప్రోగ్రాముల్ని చేయడం జరిగింది. 2007లో అత్యుత్తమైన నాణ్యతతో కూడిన పోస్టులతో, వీడియోలతో తెలుగులో మొదటి ప్రొఫెషనల్ టెక్నికల్ బ్లాగ్ గానూ, మొదటి వీడియో బ్లాగ్ గానూ ఇప్పుడు మీరు చూస్తున్న బ్లాగ్ ప్రత్యేకతను సంతరించుకుంది. అలాగే 2007 జనవరి 1న ప్రారంభించిన తెలుగులోనే మొట్టమొదటి టెక్నికల్ ఫోరమ్ అయిన "కంప్యూటర్ ఎరా సాంకేతిక ఫోరమ్" 14 వేల మంది సభ్యులతో 10 వేలకు పైగా పోస్టులతో 2009 జూలై వరకూ నిర్వహించబడింది. దాంతోపాటే మొట్టమొదటి తెలుగు టెక్నికల్ ఛాట్ రూమ్ అయిన "కంప్యూటర్ ఎరా సాంకేతిక సహాయం" అనే ఛాట్ రూమ్ రెండేళ్లలో వేలాది మందికి తెలుగు టైప్ చేయడం మొదలుకుని అనేక కంప్యూటర్ సంబంధిత సాంకేతిక సమస్యలకు తక్షణ సహాయం అందించింది. ఇకపోతే http://youtube.com/nallamothu అనే ఛానెల్ లో 361కి పైగా ప్రొఫెషనల్ క్వాలిటీ తెలుగు టెక్నికల్ వీడియోలు అందించాను. ఈ ఛానెల్ కి 1192 మంది సబ్ స్కైబర్లు ఉన్నారు. అందుబాటులో ఉన్న వివిధ మార్గాల ద్వారా తెలుగు వారందరకీ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించే పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాను.

Google Playలో పొందండి

ఇక్కడ RSS Feedకి Subscribe చేసి నేరుగా పోస్ట్ లు పొందండి