ప్లాష్ ఏనిమేషన్లని అడ్డుకోవడానికి

September 30, 2007 Uncategorized No Comments


ఇటీవలి కాలంలో ఇంటర్నెట్లో మనం ఏ వెబ్ సైట్ ని ఓపెన్ చేస్తున్నా ప్రతీ పేజీలోనూ తప్పనిసరిగా కొన్ని ఫ్లాష్ ఏనిమేషన్లు దర్శనమిస్తున్నాయి. దాదాపు ఇవన్నీ అడ్వర్ టైజ్ మెంట్లు కావడం గమనార్హం. ఇలాంటి మనకు ఏమాత్రం అవసరం లేని ఫ్లాష్ అడ్వర్ టైజ్ మెంట్లు సిస్టంలోకి ప్రవేశించడానికి ఎక్కువ నెట్ బ్యాండ్ విడ్త్ ని ఉపయోగించుకుంటాయి. మనం ఏ సమాచారాన్నయితే కోరుకుంటామో దానికి ప్రాధాన్యత

ఇవ్వబడకపోగా ఉన్న బ్యాండ్ విడ్త్ మొత్తాన్నీ ఈ ప్రకటనలే హరిస్తుంటాయి. ఈ నేపధ్యంలో నెట్ కి కనెక్ట్ అయినప్పుడు వెబ్ పేజీల్లో ఫ్లాష్ పైళ్లనేవే చూపించబడకుండా ఏర్పాటు చేసుకోవచ్చు. అదెలాగంటే Start>Run కమాండ్ బాక్స్ల్ లోకి వెళ్లి.. regsvr32 c:\windows\system32\macromed\Flash\swflash.ocx/u అని టైప్ చేసి (IE7లో swflash.ocx బదులు flash9c.ocx అనే ఫైల్ పేరు టైప్ చేయాలి) OK బటన్ ప్రెస్ చేయండి. దీంతో ఇకపై వెబ్ పేజీల్లో ఏ విధమైన ఫ్లాష్ ఏనిమేషన్లూ చూపించబడవు. భవిష్యత్సులో ఎప్పుడైనా తిరిగి ఫ్లాష్ ఏనిమేషన్లు చూపించబడేలా ఏర్పాటు చేసుకోవాలంటే మళ్ళీ Start>Run కమాండ్ బాక్స్ లోనే regsvr32 c:\windows\system32\macromed\Flash\swflash.ocx అని టైప్ చేసి OK బటన్ ప్రెస్ చేస్తే సరిపోతుంది.

రిజిస్ట్రీ టిప్స్ వీడియో సిడి

September 27, 2007 Uncategorized 1 Comment

తెలుగులో మొట్టమొదటిసారిగా “కంప్యూటర్ ఎరా” మాసపత్రిక ఆడియో వివరణతో కూడిన వీడియో సిడిలను రూపొందించడానికి పూనుకున్నది. ఈ నేపధ్యంలో మీ అభిమాన పత్రిక నుండి మొదటి వీడియో సిడిగా విండోస్ “REGISTRY TIPS” విడుదల చేయడం జరిగింది. దాదాపు 4 గంటల నిడివి గల ఆడియో వివరణ కలిగిన అత్యద్భుతమైన దృశ్య నాణ్యత కలిగిన వీడియో ఫైళ్లని ఇందులో పొందుపరిచాం. ఈ సిడి ధర రూ. 300/-. చక్కని నాలెడ్జ్ పాఠకులకు అందించాలన్న సదాశయంతో మేము చేసిన ఈ ప్రయత్నాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాం. ఈ సిడి కావాలనుకునే వారు ఈ క్రింది అడ్రస్ కు రూ. 300/- (కేవలం మనియార్డర్ ద్వారా మాత్రమే) పంపించి సిడిని కొరియర్ ద్వారా తెప్పించుకోగలరు. మనియార్డర్ ఫారంలో మీ పేరు, పూర్తి చిరునామా, ఫోన్ నెంబర్, సిడి పేరు (Registry Tips సిడి కోసం అని రాయాలి) వివరంగా రాయాలి. మనియార్డర్ పంపించవలసిన చిరునామా:

N. Sridhar,
303, Sai Pavan Nivas,
Daieerguda, Near Rao’s High School,
Kukatpalli, Hyderabad.
Ph: 9848227008
గమనిక: మేగజైన్ రూపకల్పనలో ఉన్నప్పుడు ఫోన్ ఆఫ్ చేసి ఉంచబడుతుంది.

SATA – ఇంటర్‌ఫేస్ ఎందుకు?

September 27, 2007 Uncategorized 1 Comment

SATA – అధునాతన మదర్‌బోర్డ్ లన్నింటిలో పొందుపరచబడుతున్న కనెక్టివిటీ ఇంటర్‌ఫేస్! Serial ATA అనే పదాన్ని సంక్షిప్తంగా SATA అని పిలుస్తుంటారు. ఇంతకుముందు ఉపయోగించబడిన Parallel ATA అనే ఇంటర్‌ఫేస్ స్థానంలో ప్రవేశించిందీ కొత్త టెక్నాలజీ. మదర్‌బోర్డ్ లపై SATA సపోర్ట్ ని అందిస్తుండడంతో ప్రస్తుతం ఈ హార్డ్ డిస్కులు, సిడి/డివిడి రైటర్లు కూడా SATA వి లభిస్తున్నాయి. SATA డిస్కులను మామూలు PATA డిస్క్ ల మాదిరిగా Master, Slave అని జంపర్ సెట్టింగులని కాన్ఫిగర్ చేయవలసిన అవసరం లేదు. SATA డిస్క్ లు తమకి తాము ప్రత్యేకమైన చానెల్‌ని వినియోగించుకుంటాయి. కాబట్టి మామూలు డ్రైవ్‌లలో మాదిరిగా జంపర్ సెట్టింగుల పనిలేదు.

SATA ఇంటర్‌ఫేస్ టెక్నాలజీ అంత అవసరమా?

భారీ స్టోరేజ్ కెపాసిటీ గల హార్డ్ డిస్క్ లు విడుదల అవుతుండడం, మరోవైపు క్రమేపీ పవర్‌ఫుల్ ఆపరేటింగ్ సిస్టమ్‌లు, అప్లికేషన్ ప్రొగ్రాములు, గేమ్‌లు మార్కెట్లో ప్రవేశిస్తుండడంతో SATA ఇంటర్‌ఫేస్ రూపం సంతరించుకుంది. SATA 1 ఇంటర్‌ఫేస్ ద్వారా సెకనుకి 150MB డేటానీ, SATA 2 ఇంటర్‌ఫేస్ ద్వారా 300MB ట్రాన్స్ ఫర్ రేట్‌ని సాధించవచ్చు. అయితే ఇక్కడొక విషయం గుర్తుంచుకోవాలి. SATA ఇంటర్‌ఫేస్‌కి సంబంధించిన సామర్ధ్యం మాత్రమే ఇది. SATA హార్డ్‌డిస్క్ ని మీ కంప్యూటర్‌లో పెట్టుకుని .. ‘సార్, మీరు చెప్పినంత స్పీడ్ రావట్లేదు ‘ అనకండి. కేవలం ఇంటర్‌ఫేస్ బాగా స్పీడై ఉన్నంత మాత్రాన సరిపోదు. హార్డ్‌డిస్క్ ల యొక్క RPM(నిమిషానికి తిరిగే చుట్ల సంఖ్య), బఫర్ సైజ్ పరిమితంగా ఉన్నంత కాలం మీరు SATA ఇంటర్‌ఫేస్ ఉన్న సిస్టమ్‌ని వాడుతున్నా ఉపయోగంలేదు. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న హార్డ్‌డిస్క్ లు గరిష్టంగా 10000 RPM తో తిరిగేవి లభిస్తున్నాయి. వీటిని SATA ఇంటర్‌ఫేస్‌కి కనెక్ట్ చెయ్యడం వల్ల సెకనుకు 80MB మేరకు సమాచారాన్ని మాత్రమే ట్రాన్స్ ఫర్ చేసుకోవడం వీలవుతుంది.

ఏయే కేబుళ్ళు అవసరం అవుతాయి…

మీ మదర్‌బోర్డ్ పై SATA సపోర్ట్ ఉంటే మదర్‌బోర్డ్ తో పాటు 7-pin డేటా కేబుల్ అందించబడుతుంది. దానిని ఒక వైపు మదర్‌బోర్డ్ పై కనెక్ట్ చేసి రెండవ చివర్న SATA హార్డ్ డిస్క్కి కనెక్ట్ చేయాలి. డిస్క్కి పవర్‌సప్లై ఇవ్వడానికి 15-pin పవర్ కేబుల్‌ని ఉపయోగించాలి. అధికశాతం SATA డ్రైవ్‌లు తమకు కావలసిన విద్యుత్ కోసం 15-pin పవర్ కేబుళ్ళపైన గానీ , లేదా మన సిస్టమ్‌లలో సాధారణంగా కనిపించే 4-pin పవర్ కేబుళ్ళపై గానీ ఆధారపడతాయి. రెండింటిలో ఏదో ఒక దాని ద్వారా మాత్రమే పవర్ సప్లై అందించాలి. 25-pin కేబుల్ లేకపోతే 43-pin to 15-pin పవర్ అడాప్టర్‌ని వాడవచ్చు.

డ్రైవ్ గుర్తించబడలేదా?

మీ మదర్‌బోర్డ్ కి డీఫాల్ట్ గా SATA సపోర్ట్ ఉంటే సమస్యే లేదు. ఒకవేళ మీరు కొత్తగా కొన్ని SATA హార్డ్ డిస్క్ని వాడడం కోసం, మీ మదర్‌బో్ర్డ్ పై SATA సపోర్ట్ లేకపోయినా థర్డ్ పార్టీ SATA కంట్రోల్లర్‌ని అమర్చుకున్నట్లయితే ఆ కంట్రోలర్‌కి సంబంధించిన డివైజ్ డ్రైవర్లు ఇన్‌స్టాల్ చేయకపోతే ఆ కంట్రోలర్‌కి మీరు కనెక్ట్ చెసిన SATA హార్డ్ డిస్క్ గుర్తించబడదు. ఇకపోతే మదర్‌బోర్డ్ పైనే SATA సపోర్ట్ ఉన్నట్లయితే మీ మదర్‌బోర్డ్ సిడిలోనే SATA కంట్రోలర్‌కి సంబంధించిన డ్రైవర్లు పొందుపరచబడి ఉంటాయి. కొన్ని మదర్‌బోర్డ్ ల విషయంలో ఫ్లాపీ్‌డిస్క్ ల్లో డ్రైవర్లు అందించబడుతుంటాయి. వాటిని తప్పనిసరిగా ఇన్‌స్టాల్ చేసుకుంటేనే సపోర్ట్ లభిస్తుంది.

డ్రైవర్లు ఇలా ఇన్‌స్టాల్ చేసుకోవాలి.

మదర్‌బోర్డ్ తో పాటు ఫ్లాపీలో SATA కంట్రోలర్ డ్రైవర్లు అందించబడితే ఓ.కే. మదర్‌బోర్డ్ సిడిలో డ్రైవర్లు ఇవ్వబడినట్లయితే ముందు వేరే కంప్యూటర్‌లో ఆ సిడిని పెట్టి అందులోని Drivers అనే ఫోల్డర్‌లో ఉండే MakeDisk.exe అనే ప్రోగ్రామ్‌ని రన్ చేయడం ద్వారా ఒక ఖాళీ ఫ్లాపీలోకి SATA డ్రైవర్లని కాపీ చేసుకోండి. ఇప్పుడు Windows XP Setup సిడితో సిస్టమ్‌ని బూట్ చేసి కొద్ది క్షణాల తర్వాత స్క్రీన్‌పై Press F6 if you need to install a third party SCSI drivers అనే మెసేజ్ కనిపించినపుడు F6 కీని ప్రెస్ చేయండి. ఇప్పుడు S కీని ప్రెస్ చేసి SATA కంట్రోలర్ డ్రైవర్లు ఉన్న ఫ్లాపీ డిస్క్ ని డ్రైవ్‌లో ఇన్‌సర్ట్ చేసి డివైజ్‌ని పేర్కొంటే డ్రైవర్లు ఇన్‌స్టాల్ అవుతాయి.

చిట్కాలు

September 26, 2007 Uncategorized 2 Comments

ప్రస్తుతం లభిస్తోన్న అన్ని గ్రాఫిక్స్ కార్డులలోకి Nvidia GeForce 7950 GX2 అత్యంత శక్తివంతమైనదిగా పరిగణించబడుతుంది.

నెట్‍వర్క్ లోని ఇంటర్నెల్ పిసిలకు ప్రైవేట్ అడ్రస్‍ని ఇవ్వడం ద్వారా ఫైర్‍వాల్ మాదిరిగా రక్షించే సర్వీసే.. Network Address Translation

Printer Spooler అనే ఫోల్డర్ కరప్ట్ అయితే మనమ్ ప్రింట్ చేసే డాక్యుమెంట్లు Junk Characters తో వస్తాయి.

www.rapidshare.de అనే ఉచిత ఫైల్ హోస్టింగ్ వెబ్‍సైట్ ఎప్పటికప్పుడు టైమర్, వర్డ్ వెరిఫికేషన్ సిస్టమ్‍లను మారుస్తుంది.

.NET ఆధారంగా డెవలప్ చేయబడిన అప్లికేషన్లు మన సిస్టమ్‍లో రన్ అవాలంటే .NET Framework సిస్టమ్‍లో ఉండి తీరాలి.

CMOS బ్యాటరీ లేకపోతే మామూలు కన్నా విండోస్ బూటింగ్ స్లో అవుతుంది. BIOS OS కి ట్రాన్స్ ఫర్ అయ్యే సమయం ఎక్కువవుతుంది.

DDR2 రామ్ స్లాట్ ఉన్న మదర్‍బోర్డ్ లలో 1GB సామర్ధ్యం కలిగిన మెమరీ మాడ్యూల్‍ని వాడడం ద్వారా పెర్‍ఫార్మెన్స్ బాగుంటుంది.

Thunderbird మన మెయిళ్ళని సర్వర్‍లో ఒక్క కాపీ కూడా మిగల్చకుండా అన్నీ మన సిస్టమ్‍లోకి ఆఫ్‍లైన్‍లోకి డౌన్‍లోడ్ చేస్తుంది

Dual Core Processor ప్రొసెసర్‍ని అమర్చుకోదలుచుకున్న వారు E6400 మోడళ్ళని నిరభ్యంతరకరంగా ఎంపిక చేసుకోవచ్చు.

మన నెట్‍వర్క్ లోని సెక్యూరిటీ లోపాలను గుర్తించడానికి www.xfocus.org సైట్‍లో లభించే X-Scan అనే ప్రోగ్రామ్ పనికొస్తుంది.

Visual Route అనే మృదులాంత్రం (software) ఉపయోగించి నెట్ ద్వారా మన సిస్టమ్‍కి ఎవరెవరు కనెక్ట్ అయ్యారన్నది స్పష్టంగా తెలుసుకోవచ్చు.

ఎలాంటి స్క్రీన్‍సేవర్‍ని ఉపయోగించకుండా LCD మోనిటర్‍ని నిరంతరం ఆన్ చేసి ఖాళీగా ఉంచితే 50% వరకూ బ్రైట్‍నెస్ తగ్గుతుంది.

అంతర్జాలం(Internet) పై ఏదైనా వెబ్‍సైట్‍ని చూడదలుచుకుంటే www.altavista.com అనే ఆన్లైన్ ట్రాన్స్ల్ లేషన్ సర్వీసు సాయం తీసుకోండి.

LCD మోనిటర్‍ని క్లీన్ చేసే మార్గం

September 26, 2007 Uncategorized No Comments

LCD మోనిటర్‍పై దుమ్ము, వేలిముద్రలు పడినప్పుడు సున్నితంగా ఉండే
గుడ్డను తీసుకోండి. మామూలు నీళ్ళలో ఉండే లవణపు పరిమాణం వల్ల
స్క్రీన్‍పై మరకలు పడతాయి కాబట్టి డిస్టిల్ వాటర్ తీసుకొని ఆ నీళ్ళలో
కొద్దిగా వెనిగర్‍ని కలిపి పల్చని మిశ్రమంగా చేయండి.ఇప్పుడు మోనిటర్‍ని
ఆఫ్ చేయండి. లేదా black బ్యాక్‍గ్రౌండ్ సెట్ చేయడం ద్వారా
మోనిటర్‍పై ఉన్న దుమ్ము స్పష్టంగా కన్పిస్తుంది. ఎక్కడైతే దుమ్ముందో
అక్కడ ఆ మిశ్రమంలో పల్చని గుడ్డని తడిపి సున్నితంగా ఒకే దిశలొ
(పైకి క్రిందకి) తుడవండి.మందపాటి గుడ్డని వాడితే LCD మోనిటర్
స్క్రీన్‍పై గీతలు పడతాయి. జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి.

ప్లే అయ్యే పాటలు మధ్యలో కొద్ది క్షణాలు ఆగడానికి కారణం

September 26, 2007 Uncategorized No Comments

C, D వంటి డిస్క్ద్ డ్రైవ్ లలో మనం భద్రపరుచుకున్న MP3 ఫైళ్లు Winamp వంటి మీడియా ప్లేయింగ్ సాప్ట్ వేర్ల ద్వారా ప్లే అయ్యేటప్పుడు కొన్నిసార్లు అప్పటివరకూ బాగానే ప్లే అయిన ఆడియో కొన్ని క్షణాలపాటు నిలిచిపోతున్నట్లు కొందరు చెబుతుంటారు. ఇదే విధంగా పినాకిల్ వంటి కేప్చరింగ్ కార్డ్ ల సాయంతో వీడియోని కేప్చర్ చేసేటప్పుడు అన్ని ఫ్రేములూ డిస్క్ లో స్టోర్ చేయబడక కొన్ని ఫ్రేములు డ్రాప్ చేయబడడం

కొంతమంది గమనించే ఉంటారు. దీనికి కొంతవరకూ హార్డ్ డిస్క్ మెకానిజం కారణమవుతుంది. హార్డ్ డిస్క్ లో ఉండే ప్లాటర్లు, డిస్క్ లోని Servo-Motorsకీ మధ్య ఎలైన్ మెంట్ స్థిరంగా ఉండాలి. ఐతే ఉష్ణోగ్రతలో చోటుచేసుకునే మార్పుల వల్ల ఒక్కోసారి ఈ ఎలైన్ మెంట్ గతి తప్పుతుంటుంది. ఈ ఇబ్బందిని ఎదుర్కోవడానికి హార్డ్ డిస్క్ నిరంతరాయంగా ధర్మల్ కాలిబ్రేషన్ అనబడే ప్రక్రియ ద్వారా Servo-Motorsకీ, ప్లాటర్లకూ మధ్య ఎలైన్ మెంట్ ని తనిఖీ చేస్తుంటుంది. ఈ ప్రక్రియ జరిగే సమయంలో ఎలైన్ మెంట్ తిరిగి కుదుర్చుకునేటప్పుడు ఆడియో విషయంలో ప్లే అవుతున్నది కాస్తా కొద్ది క్షణాలపాటు ఆగిపోవడం జరుగుతుంటుంది. దీని గురించి ఆందోళన చెందనవసరం లేదు.

అక్టోబర్ 2007 సంచిక రెండు రోజుల్లో విడుదల అవుతుంది!

September 25, 2007 Uncategorized 1 Comment

ఈ సంచికతో కంప్యూటర్ ఎరా 7వ సంవత్సరంలోకి అడుగుపెడుతోంది.. ఈ ఆరేళ్లలో స్పృశించిన కొన్ని అద్భుతమైన వ్యాసాలను ఈ సంచికలో ప్రచురించడం జరిగింది. మిస్ అవకుండా చదవవలసిన సంచిక ఇది.

సమాచారానికి స్పెషల్ ఎఫెక్టులు

September 25, 2007 Uncategorized No Comments

కొంత సమాచారాన్ని టైప్ చేసి అది చుట్టచుట్టబడిన విధంగా క్రింది చిత్రంలోని మాదిరిగా మార్చాలంటే మల్టీమీడియాపై ఎంతో అవగాహన కలిగి ఉండాలని చాలామంది భ్రమపడుతుంటారు. వాస్తవానికి Adobe Photoshop, Illustrator వంటి పవర్ ఫుల్ ప్రోగ్రాంలకు మాత్రమే ఇలాంటి స్పెషల్ ఎఫెక్టులను సాధించే ప్రత్యేకమైన ఫిల్టర్లు లభిస్తుంటాయి. అయితే ఆయా సాప్ట్ వేర్లు మీ వద్ద లేకపోయినా, లేదా

వాటిని ఉపయోగించడం ఎలాగో మీకు తెలియకపోయినా దిగులుపడవలసిన పనిలేదు. ఇంటర్నెట్ పై http://www.dotsphinx.com/partyprinter.en/ అనే వెబ్ సైట్ ఇలాంటి స్పెషల్ ఎఫెక్టులను అందిస్తోంది. ఈ వెబ్ సైట్లో కావలసిన షేప్ ని టెక్ట్స్ బాక్స్ లో మీకు కావలసిన సమాచారాన్ని టైప్ చేసి ఫాంట్ సైజ్ ని ఎంచుకుంటే సరిపోతుంది.

Norton సాప్ట్ వేర్లు సరిగ్గా అన్ ఇన్ స్టాల్ అవకపోతుంటే..

September 24, 2007 Uncategorized 1 Comment

www.symantec.com/symnrt అనే వెబ్ పేజీ నుండి రిమూవల్ టూల్ ని డౌన్లోడ్ చేసుకుని మీ పిసిలో వాడండి.

టాస్క్ పై ఎంత సమయం వెచ్చించారన్నది:

September 22, 2007 Uncategorized No Comments

వృత్తి స్వభావాన్ని బట్టి ఒక్కొక్కరు నెలకు, సంవత్సరానికి, రోజుకి, గంటకు ఇంత అని సంపాదిస్తుంటారు. పేరున్న కన్సల్టెంట్లు, అడ్వకేట్లు, ఆర్కిటెక్టులు, ఇంటీరియర్ డిజైనర్లు వంటి వారు ఓ ప్రాజెక్ట్ పై తాము ఎంత కాలం సేవలను వెచ్చించామన్న అంశం ఆధారంగా ఫీజులను వసూలు చేస్తుంటారు. ఒక్కోసారి తాము పనిచేసిన గంటలను కూడా పరిగణనలోకి తీసుకోవలసి వస్తుంటుంది. దీనికోసం ఎక్కువగా క్యాలెండర్లు, PIM లపై ఆధారపడుతుంటారు. దానికి బదులు TaskBlaze అనే ప్రోగ్రామ్‍ని ఓ సారి ఉపయోగించి చూడండి. ఈ ఉచిత మృదులాంత్రము(software) ఏ task మీదైనా మనం వెచ్చించే సమయాన్ని ఖచ్చితంగా లెక్కిస్తూ ఉంటుంది. Taskని ప్రారంభించగానే ఈ ప్రోగ్రామ్‍ని ఓపెన్ చేసి Timer ని క్లిక్ చేయండి. పని పూర్తవగానే టైమర్‍ని ఆపేయండి. ఇప్పుడు ఆ Task పై మీరు వెచ్చించిన మొత్తం సమయం Outlook Schedule గా Export చేయబడుతుంది. ఈ సమాచారం ఆధారంగా మీ కస్టమర్ల నుండి ఫీజు వసూలు చేయవచ్చు. నిరంతరం బిజీగా ఉండే ప్రొఫెషనల్స్ కి ఈ ప్రోగ్రామ్ ఉపయోగపడుతుంది.

Search This Site:

Press75.com Press75.com Press75.com Press75.com

About Me

1996వ సంవత్సరంలో తెలుగులో మొట్టమొదట కంప్యూటర్ సాహిత్యాన్ని ప్రారంభించే అవకాశం నాకు కలిగింది. అదే సమయంలో చెన్నైలో సూపర్ హిట్ తెలుగు ఫిల్మ్ మేగజైన్ కి సబ్ ఎడిటర్ గా కూడా ఏకకాలంలో పనిచేస్తూ 1998 వరకూ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, మనీషా కొయిరాలా, శంకర్, రజనీకాంత్, కమల్ హాసన్ వంటి ప్రముఖులెందరినో ఇంటర్వ్యూలు చేయడం మర్చిపోలేని అనుభవం. అయితే సినిమా రంగంలో ఉన్న అనారోగ్యకరమైన వాతావరణం వల్ల నాకంటూ ఓ ప్రత్యేకమైన ఉనికిని సృష్టించుకోవడం కోసం సినిమా రంగం నుండి బయటకు వచ్చి పూర్తిగా టెక్నాలజీ రంగంలో స్థిరపడడం జరిగింది. 96 నుండి 2001 వరకూ పలు కంప్యూటర్ పత్రికలకు ఎడిటర్ గా పనిచేసి.. 2001 నుండి "కంప్యూటర్ ఎరా" తెలుగు మంత్లీ మేగజైన్ ఎడిటర్ గా పత్రిక మొత్తాన్నీ రూపొందిస్తూ ఉన్నాను. అలాగే తెలుగు టెలివిజన్ ఛానెళ్లలో మొట్టమొదటి టెక్నికల్ phone-in ప్రోగ్రామ్ కి గెస్ట్ గా అటెండ్ అయ్యే అవకాశమూ 2010 జనవరి 20న కలిగింది. అప్పటి నుండి ఇప్పటివరకూ I News, ETV2, ABN ఆంధ్రజ్యోతి, NTV, Zee 24 గంటలు, సాక్షి టివి, మహా టివి, జాగృతి న్యూస్ వంటి ఛానెళ్లలో 90కి పైగా లైవ్, రికార్డెడ్ ప్రోగ్రాముల్ని చేయడం జరిగింది. 2007లో అత్యుత్తమైన నాణ్యతతో కూడిన పోస్టులతో, వీడియోలతో తెలుగులో మొదటి ప్రొఫెషనల్ టెక్నికల్ బ్లాగ్ గానూ, మొదటి వీడియో బ్లాగ్ గానూ ఇప్పుడు మీరు చూస్తున్న బ్లాగ్ ప్రత్యేకతను సంతరించుకుంది. అలాగే 2007 జనవరి 1న ప్రారంభించిన తెలుగులోనే మొట్టమొదటి టెక్నికల్ ఫోరమ్ అయిన "కంప్యూటర్ ఎరా సాంకేతిక ఫోరమ్" 14 వేల మంది సభ్యులతో 10 వేలకు పైగా పోస్టులతో 2009 జూలై వరకూ నిర్వహించబడింది. దాంతోపాటే మొట్టమొదటి తెలుగు టెక్నికల్ ఛాట్ రూమ్ అయిన "కంప్యూటర్ ఎరా సాంకేతిక సహాయం" అనే ఛాట్ రూమ్ రెండేళ్లలో వేలాది మందికి తెలుగు టైప్ చేయడం మొదలుకుని అనేక కంప్యూటర్ సంబంధిత సాంకేతిక సమస్యలకు తక్షణ సహాయం అందించింది. ఇకపోతే http://youtube.com/nallamothu అనే ఛానెల్ లో 361కి పైగా ప్రొఫెషనల్ క్వాలిటీ తెలుగు టెక్నికల్ వీడియోలు అందించాను. ఈ ఛానెల్ కి 1192 మంది సబ్ స్కైబర్లు ఉన్నారు. అందుబాటులో ఉన్న వివిధ మార్గాల ద్వారా తెలుగు వారందరకీ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించే పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాను.

Google Playలో పొందండి

ఇక్కడ RSS Feedకి Subscribe చేసి నేరుగా పోస్ట్ లు పొందండి