డయాగ్రములను గీయాలా???

October 31, 2007 Uncategorized 1 Comment

ఎడ్యుకేషనల్, బిజినెస్ రంగాల్లో ఉన్నవారు పలు సందర్భాల్లో డయాగ్రములను గీయవలసి వస్తుంది. వివిధ గణాంకాలకు తగ్గట్లు డయాగ్రములను గీయడానికి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో ప్రత్యేకంగా ఎటువంటి ప్రోగ్రామ్ లభ్యం కావడం లేదు. ఈ నేపధ్యంలో సాధారణ అవసరాలు మొదలుకుని క్లిష్టతరమైన సందర్భాలకు సైతం Flow Charts, Business, Technical Diagrams, Schemes, Plans, Family Trees వంటివి క్రియేట్ చెయ్యడానికి వాటిని bmp, jpeg వంటి పాపులర్ ఇమేజ్ ఫార్మేట్లకు ఎక్స్‌పోర్ట్ చేసుకోవడానికి ఉపయోగపడే ప్రోగ్రామే Diagram Studio.

వీడియో ఎడిటింగ్‌కి పనికొచ్చే ప్రోగ్రామ్

October 31, 2007 Uncategorized 1 Comment

AVI, MPEG వంటి ఫార్మేట్లలో ఉన్న వీడియో క్లిప్‌లకు ఆడియో జత చెయ్యడానికి, Fade, Pixelate, Blur, Wave, Emboss వంటి పలు రకాల స్పెషల్ ఎఫెక్టులు జత చెయ్యడానికి ఉపకరించే ప్రోగ్రామే Video Edit Magic దీని సాయంతో వెబ్ కెమెరా నుండి వీడియోని కేప్చర్ చేయవచ్చు. ఒక మీడియ ఫైల్‌లోని ఆడియో, వీడియో కాంపొనెంట్‌లను దేనికది వేర్వేరుగా ఎడిట్ చెయ్యవచ్చు. ఒక వీడియో క్లిప్‌పై మరో వీడియో క్లిప్‌ని Overlay చేయవచ్చు. వీడియో ఫైళ్ళకి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, వాయిస్ ఓవర్‌లను జత చెయ్యవచ్చు. టెక్స్ట్ టైటిళ్ళను జతచేయవచ్చు. ఇలా పలు రకాలుగా ఉపయోగపడుతుంది.

YouTube నుండి డౌన్‍లోడ్ చేసుకోవాలా??

October 30, 2007 Uncategorized 2 Comments

Youtube, Google, iFilm, break.com, Putfile, FindVideos వంటి అనేక వీడియో హోస్టింగ్ వెబ్‌సైట్లలో అనేక అంశాలకు సంబంధించిన వీడియో క్లిప్‌లను ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేకమంది పిసి యూజర్లు ఇతరులతో షేర్ చేస్తున్నారు. ఈ సైట్లలోకి ప్రవేశించినప్పుడు ఓ ప్లేయర్ ఓపెన్ అయి మనం ఎంచుకున్న వీడియో ప్లే అవుతుంది తప్ప డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ కనిపించదు. అయితే ఆయా సైట్ల నుండి వీడియోలను డౌన్‌లోడ్ చేసుకోవడానికి కొన్ని టెక్నిక్‌లు ఉన్నాయి. Youtube నే ఉదా.గా తీసుకుంటే మీరు డౌన్‌లోడ్ చేయదలుచుకున్న వీడియో లింక్‌ని ఆ సైట్ నుండి క్లిప్‌బోర్డ్‌లోకి కాపీ చేసుకుని http://keepvid.comఅనే సైట్‌లోని అడ్రస్‌బార్‌లో పేస్ట్ చేసి Download అనే బటన్ క్లిక్ చేస్తే డైరెక్ట్ లింక్ లభిస్తుంది. Firefox బ్రౌజర్‌ని వాడుతున్న యూజర్లు https://addons.mozilla.org/firefox/2390/ అనే వెబ్‌సైట్ నుండి VideoDownloader Extensionని డౌన్‌లోడ్ చేసుకుని దానిద్వారా వివిధ సైట్లలోని వీడియో క్లిప్‌ల వంటి ఎంబెడ్డెడ్ ఆబ్జెక్టులను సిస్టమ్‌లోకి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. డౌన్‌లోడ్ అయిన .flv క్లిప్‌లను http://www.videospark.com/index.php?ssp=24అనే వెబ్‌సైట్లో లభించే FLV Player అనే ప్రోగ్రామ్‌తో ప్లే చేసుకోవచ్చు.

బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌లో బ్రౌజింగ్ స్పీడ్

October 30, 2007 Uncategorized 2 Comments

మన సిస్టమ్‌లో 512Kbps బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ ఉండి, నెట్ బ్రౌజింగ్ కోసం Firefox వాడుతున్నపుడు వివిధ వెబ్‌సైట్లు వేగంగా ఓపెన్ కావాలంటే ఇలా చేయండి. మీ Firefox బ్రౌజర్‌లోని అడ్రస్ బార్‌లో about:config అని టైప్ చేసి వెంటనే స్క్రీన్‌పై ప్రత్యక్షమయ్యే వివిధ కాన్‌ఫిగరేషన్ సెట్టింగులలో network.http.max-connections అనే సెట్టింగ్‌కి 48 అనే విలువనూ, network.http.max-connections.per.serverకి 24 విలువా,network.http.max.persistent.connections.per.proxy అనే సెట్టింగ్‌కి 12 అనే విలువనూ, network.http.max.persistent.connections.per.server అనే సెట్టింగ్‌కి 6 అనే విలువనూ, network.http.pipelining సెట్టింగ్‌ని trueగానూ,network.http.pipelining.maxrequestsకి 32 అనే విలువనూ, network.http.proxy.pipelining సెట్టింగ్‌ని trueగానూ సెట్‌చేసి Firefox ప్రోగ్రామ్‌ని రీస్టార్ట్ చేసి చూడండి. మునుపటి కన్నా మీ బ్రౌజింగ్ స్పీడ్ పెరుగుతుంది.

Device Found పాపప్ మెసేజ్ లు రాకుండా!

October 29, 2007 Uncategorized No Comments


Windows Vista ఆపరేటింగ్ సిస్టం కొత్త్తగా కంప్యూటర్ కి ఏదైనా హార్డ్ వేర్ డివైజ్ ని కనెక్ట్ చేసినట్లు గుర్తించినట్లయితే చీటికీ మాటికీ New Hardware Found అనే పాపప్ మెసేజ్ ని స్ర్కీన్ పై చూపిస్తూ విసిగిస్తుంటుంది. ఒకవేళ ఆ డివైజ్ కి సంబంధించిన డివైజ్ డ్రైవర్లు మన వద్ద ఉంటే వాటిని ఇన్ స్టాల్ చేస్తే సరిపోతుంది. ఒకవేళ ఆ కొత్త హార్డ్ వేర్ డివైజ్ యొక్క డ్రైవర్లు గనుక మన వద్ద లేకపోయినట్లయితే ఇలా పాపప్ చూపించబడడం చిరాకుగా ఉంటుంది. ఇలా చీటికీ మాటికీ పాపప్ చూపించబడకుండా అడ్డుకోవడానికి Start>Run కమాండ్ బాక్స్ లో gpedit.msc అని టైప్ చేసి Group Policy అనే ప్రోగ్రాం లోకి వెళ్లి అందులో Computer Configuration\Administrative Templates\System Device Intallation అనే విభాగంలో Turn off new Hardware balloons during device installation అనే ఆప్షన్ ని ఎనేబుల్ చేస్తే ఇకపై ఇలా పాపప్ మెసేజ్ లు రాకుండా ఉంటాయి.

రెండు ఎకౌంట్లనూ ఒకే Gmail ID నుండి వాడుకోవడం ఇలా.. (వీడియో)

October 27, 2007 Uncategorized 3 Comments

మీ వద్ద రెండు GMail ఐడిలు ఉన్నప్పుడు దేని నుండి మెసేజ్ పంపించాలంటే దానిలోకి లాగిన్ అవ్వాల్సిన పనిలేకుండా రెండు IDలను ఒకే GMail ఐడిలోకి లాగిన్ అయి.. మనం కోరుకున్న ఐడి నుండి మెసేజ్ ని కంపోజ్ చేసే మార్గాన్ని ఈ వీడియోలో వివరించాను. తెలుగులో ఆడియో వివరణ కూడా ఉంటుంది.

పురాతన వార్తాపత్రికల కథనాలు కావాలా?

October 27, 2007 Uncategorized No Comments


హిందూ, వాషింగ్టన్ పోస్ట్ వంటి సుధీర్ఘ నేపధ్యం కలిగిన్ వార్తా పత్రికల్లో గతంలో ప్రచురించబడిన అంశాలను Google సంస్థ http://news.google.com/archivesearch అనే సైట్ ద్వారా అందిస్తోంది. ఈ వెబ్‍సైట్ ద్వారా వెదుక్కుంటూ పోతే చరిత్ర గురించి అనేక ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూస్తాయి. ఉదా. కు.. పాకిస్తాన్ ఒక దేశంగా 1947 లో రూపు దాల్చినప్పటికీ “పాకిస్తాన్” అనే పదం 1900 వ సంవత్సరంలోని వార్తాపత్రికల్లోనే తారసపడింది. అలాగే మనం 2000వ సంవత్సరం తర్వాత మాత్రమే Windows XP ఆపరేటింగ్ సిస్టమ్‍ని ఉపయోగిస్తున్నాము కదా… మరి ఈ Windows XP అనే పదం మొట్టమొదటిసారి ఎప్పుడు వార్తల్లోకి ఎక్కిందో తెలుసా.. 1985 లో…! ఇలా చెప్పుకుంటూ పోతే ఈ న్యూస్ ఆర్చివ్స్ లోని వివిధ పాత వార్తా పత్రికల కథనాలను అధ్యయనం చేసుకుంటూ పోతే మనకు తెలియని చరిత్రలో మరుగునపడిపోయిన ఎన్నో వాస్తవాలను తెలుసుకోవచ్చు. Google సెర్చ్ఇంజిన్ లో మాదిరిగానే ఏ కీవర్డ్ నైనా ఆర్కివ్స్ లో వెదికి చదువుకోవచ్చు.

ముఖ్యమైన పాయింట్లను హైలైట్ చేయడం

October 27, 2007 Uncategorized No Comments

MS Wordలో బ్రోచర్లు,కవరింగ్ నోట్లు తయారు చేసేటప్పుడు కొన్ని పాయింట్లను హైలైట్ చేయాల్సొస్తుంది. అప్పుడు వర్డ్‌లో లభించే Blinking Background అనే ఆప్షన్ ద్వారా మీ ముఖ్యమైన పాయింట్లని హైలైట్ చేసుకోవచ్చు. ఏ టెక్స్ట్ నైతే హైలైట్ చేయాలనుకున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకుని Format>Font మెనూలో ఉండే Text Effects అనే విభాగంలోకి వెళ్ళండి. Office 97లో ఇది Animation అనే విభాగంలో ఉంటుంది.. ఇక్కడ Blinking Background అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకుంటే మనం సెలెక్ట్ చేసుకున్న టెక్స్ట్ ఎల్లప్పుడూ బ్లింక్ అవుతూ ప్రత్యేకంగా కనిపిస్తుంది.

మీ IP, DNS, MAC అడ్రసులు తెలుసుకోవాలా? (వీడియో)

October 26, 2007 Uncategorized 4 Comments

మీ కంప్యూటర్ల యొక్క నెట్ వర్క్ కనెక్షన్ల యొక్క IP అడ్రస్లు, MAC, DNS సర్వర్ అడ్రసులు వంటి సకల సమాచారం తెలుసుకోవడం ఎలాగో ఈ వీడియోలో వివరించడం జరిగింది. బిగినర్స్ కి మాత్రమే ఉద్దేశించబడిన వీడియో ఇది. అడ్వాన్స్ డ్ యూజర్లు టైం వృధా చేసుకోవలసిన పనిలేదు.

Skype మాటలని రికార్డ్ చేసుకోవచ్చు..

October 26, 2007 Uncategorized 1 Comment

వాయిస్ చాటింగ్ నిమిత్తం ఇప్పటికీ ఎక్కువమంది Yahoo Messengerని ఉపయోగిస్తున్నప్పటికీ మాటల్లోమరింత స్పష్టత పొందడమ్ కోసం కొంతమంది Skype వైపు మొగ్గు చూపిస్తున్నారు. దీనిద్వారా టెలిఫోన్ ఇంటర్వ్యూలు, పానెల్ డిస్కషన్స్, కాన్ఫరెన్స్ లు వంటివి నిర్వహించబడుతున్నాయంటే అతిశయోక్తి కాదు. Skype ద్వారా ఇతరులతో మనం మాట్లాడేటప్పుడు ఆ సంభాషణని రికార్డ్ చేసుకోవడానికి ఆ ప్రోగ్రామ్‍లో ఎలాంటి ఆప్షన్ పొందుపరచబడలేదు. ఆప్షన్ లేదు కద అని నిరుత్సాహపడవలసిన పనిలేదు. Skype ద్వారా మీరు జరిపే సంభాషణని కొన్ని ధర్డ్ పార్టీ సాఫ్ట్ వేర్లని ఉపయోగించి MP3, WAV, WMA వంటి ఆడియో ఫార్మేట్లలోకి రికార్డ్ చేసుకోవచ్చు. అదెలాగంటే… http://www.telco.com/kishkish/KishKish.SAM.Setup.4.0.0.7.exe అనే వెబ్‍సైట్ నుండి KishKish SAM అనే చిన్న ప్లగ్‍ఇన్ డౌన్‍లోడ్ చేసుకుని మీ సిస్టమ్‍లో ఇన్‍స్టాల్ చేసుకోండి. అంతే ఇక మీ Skype ప్రోగ్రామ్‍కి వచ్చే ఏ ఇన్‍కమింగ్ కాల్‍నైనా ఈ ప్లగ్‍ఇన్ ఆటోమేటిక్‍గా రికార్డ్ చేస్తుంది. అలాగే ఔట్‍గోయింగ్ కాల్ చేసేటప్పుడు ఫోన్ ఎత్తిన వెంటనే రికార్డింగ్ మొదలవుతుంది.

Search This Site:

Press75.com Press75.com Press75.com Press75.com

About Me

1996వ సంవత్సరంలో తెలుగులో మొట్టమొదట కంప్యూటర్ సాహిత్యాన్ని ప్రారంభించే అవకాశం నాకు కలిగింది. అదే సమయంలో చెన్నైలో సూపర్ హిట్ తెలుగు ఫిల్మ్ మేగజైన్ కి సబ్ ఎడిటర్ గా కూడా ఏకకాలంలో పనిచేస్తూ 1998 వరకూ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, మనీషా కొయిరాలా, శంకర్, రజనీకాంత్, కమల్ హాసన్ వంటి ప్రముఖులెందరినో ఇంటర్వ్యూలు చేయడం మర్చిపోలేని అనుభవం. అయితే సినిమా రంగంలో ఉన్న అనారోగ్యకరమైన వాతావరణం వల్ల నాకంటూ ఓ ప్రత్యేకమైన ఉనికిని సృష్టించుకోవడం కోసం సినిమా రంగం నుండి బయటకు వచ్చి పూర్తిగా టెక్నాలజీ రంగంలో స్థిరపడడం జరిగింది. 96 నుండి 2001 వరకూ పలు కంప్యూటర్ పత్రికలకు ఎడిటర్ గా పనిచేసి.. 2001 నుండి "కంప్యూటర్ ఎరా" తెలుగు మంత్లీ మేగజైన్ ఎడిటర్ గా పత్రిక మొత్తాన్నీ రూపొందిస్తూ ఉన్నాను. అలాగే తెలుగు టెలివిజన్ ఛానెళ్లలో మొట్టమొదటి టెక్నికల్ phone-in ప్రోగ్రామ్ కి గెస్ట్ గా అటెండ్ అయ్యే అవకాశమూ 2010 జనవరి 20న కలిగింది. అప్పటి నుండి ఇప్పటివరకూ I News, ETV2, ABN ఆంధ్రజ్యోతి, NTV, Zee 24 గంటలు, సాక్షి టివి, మహా టివి, జాగృతి న్యూస్ వంటి ఛానెళ్లలో 90కి పైగా లైవ్, రికార్డెడ్ ప్రోగ్రాముల్ని చేయడం జరిగింది. 2007లో అత్యుత్తమైన నాణ్యతతో కూడిన పోస్టులతో, వీడియోలతో తెలుగులో మొదటి ప్రొఫెషనల్ టెక్నికల్ బ్లాగ్ గానూ, మొదటి వీడియో బ్లాగ్ గానూ ఇప్పుడు మీరు చూస్తున్న బ్లాగ్ ప్రత్యేకతను సంతరించుకుంది. అలాగే 2007 జనవరి 1న ప్రారంభించిన తెలుగులోనే మొట్టమొదటి టెక్నికల్ ఫోరమ్ అయిన "కంప్యూటర్ ఎరా సాంకేతిక ఫోరమ్" 14 వేల మంది సభ్యులతో 10 వేలకు పైగా పోస్టులతో 2009 జూలై వరకూ నిర్వహించబడింది. దాంతోపాటే మొట్టమొదటి తెలుగు టెక్నికల్ ఛాట్ రూమ్ అయిన "కంప్యూటర్ ఎరా సాంకేతిక సహాయం" అనే ఛాట్ రూమ్ రెండేళ్లలో వేలాది మందికి తెలుగు టైప్ చేయడం మొదలుకుని అనేక కంప్యూటర్ సంబంధిత సాంకేతిక సమస్యలకు తక్షణ సహాయం అందించింది. ఇకపోతే http://youtube.com/nallamothu అనే ఛానెల్ లో 361కి పైగా ప్రొఫెషనల్ క్వాలిటీ తెలుగు టెక్నికల్ వీడియోలు అందించాను. ఈ ఛానెల్ కి 1192 మంది సబ్ స్కైబర్లు ఉన్నారు. అందుబాటులో ఉన్న వివిధ మార్గాల ద్వారా తెలుగు వారందరకీ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించే పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాను.

Google Playలో పొందండి

ఇక్కడ RSS Feedకి Subscribe చేసి నేరుగా పోస్ట్ లు పొందండి