మీరు సేవకు రెడీనా?

November 30, 2007 Uncategorized 13 Comments

బ్లాగు మిత్రులందరికీ నమస్కారం. కంప్యూటర్ ఎరా ఫోరమ్ లో ఇప్పటివరకూ 2100 మంది సభ్యులున్నారు. వారిలో చాలామంది ఏదో రకంగా సర్వీస్ చేయాలన్న తలంపుని కలిగి ఉన్నారు. వారందరి ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఓ వినూత్నమైన ప్రాజెక్టుని రూపొందించడం జరిగింది. కంప్యూటర్ ఎరా ఫోరమ్ సభ్యులను ఉద్దేశించి రాసిన ఈ క్రింది పోస్టుని.. మన బ్లాగు మిత్రులు ఎవరైనా ఈ ప్రాజెక్టులో పాల్గొంటారేమో, దీని గురించి తెలియజేద్దామని ఈ బ్లాగులో పోస్ట్ చేస్తున్నాను. మీ అభిప్రాయాలు పంచుకోగలరు.

ప్రియమైన కంప్యూటర్ ఎరా పాఠకులకు నమస్కారాలు.

మనం ఇతరులకు పంచితే మనకు మరింత పెరిగేది నాలెడ్జ్ మాత్రమే. కంప్యూటర్ రంగంలో మీకు ఉన్న నాలెడ్జ్ ని కంప్యూటర్ ఎరా ఫోరమ్ ద్వారా తోటి పాఠకులతో షేర్ చేసుకుంటూ సమాజసేవ చేస్తున్న మహానుభావులందరి కృషి మాటల్లో వ్యక్తపరచలేనిది. ఇటీవలి కాలంలో కొందరు పాఠకులు మన పత్రిక నేపధ్యం, లక్ష్యాలు, నా వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకున్న మీదట “ఏ రకంగానైనా మీ వెనుక మేముంటాం” అంటూ వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నారు. Really I am feeling so happy after hearing those supporting words”. వ్యక్తిగతంగా నాకే సాయమూ అవసరం లేదు. నేను చాలారోజులుగా కొన్ని ప్రాజెక్టులు నా మనసులో ఉన్నాయి అని చెబుతూ వస్తున్నాను కదా. వాటిలో ఒక ప్రాజెక్ట్ గురించి ఇప్పుడు వివరిస్తాను. ఆసక్తి ఉన్నవారు ఈ ప్రాజెక్టులో పాలుపంచుకోవచ్చు.

మీ కంప్యూటర్ నుండే ఇతరులకు హెల్ప్ చేయడం:

మనలో చాలామందికి వేర్వేరు రంగాలపై నాలెడ్జ్ ఉంటుంది. ఉదా.కు.. నాకు హార్డ్ వేర్, రిజిస్ట్రీ , కొత్త సాఫ్ట్ వేర్లు, ట్రబుల్ షూటింగ్ వంటి వాటిపై అవగాహన ఉంది. అలాగే మరో వ్యక్తికి MS-Office గురించి బాగా తెలిసి ఉండవచ్చు. మరో వ్యక్తికి పేజ్ మేకర్, ఫొటోషాప్ లపై అవగాహన ఉండి ఉండవచ్చు. మరో పాఠకుడికి C, C++, Javaలపై నాలెడ్జ్ ఉంటుంది… ఇలా ప్రతీ ఒక్కరూ ఏదో ఒక రంగంపై కొద్దోగొప్పో అవగాహన కలిగి ఉంటారు.

ఇప్పటివరకూ మనం చేస్తున్నది ఏమిటంటే:

నాకు MS-Officeలో ఏదైనా డౌట్ ఉంటే నేను నా డౌట్ ని ఈ ఫోరమ్ లో రాస్తే దానిపై అవగాహన ఉన్న వారు తిరిగి తమ సమాధానాన్ని టైప్ చేసి నా డౌట్ ని క్లియర్ చేస్తున్నారు. ఇలా ఇప్పటివరకూ ఈ ఫోరమ్ లో ప్రశ్నలు, సమాధానాల ద్వారా ఒకరికొకరు సాయం చేసుకుంటున్నారు కదా! అయితే ఈ విధానం వల్ల ఒక పరిమితి ఉంది, ఒకవేళ మీ సమాధానాన్ని నేను అర్థం చేసుకోగల బేసిక్ నాలెడ్జ్ కూడా నాకు లేదనుకోండి.. మీరు అంత కష్టపడి ఇచ్చిన సమాధానం వృధానే అవుతుంది కదా! ఇలాంటి కొన్ని పరిమితులను దృష్టిలో ఉంచుకుని మరింత మెరుగైన విధానాన్ని ప్రవేశపెట్టాలన్నది నా ఆలోచన.

కొత్తగా మనం చేయగలిగింది:

ఇప్పుడు RAdmin, Remote Desktop, Team Viewer వంటి అనేక రకాల రిమోట్ డెస్క్ టాప్ మోనిటరింగ్, అడ్మినిస్ట్రేషన్ టూల్స్ అందుబాటులో ఉన్నాయి. వీటి సాయంతో మనం ఇతరుల కంప్యూటర్లోకి ప్రవేశించి వారి సందేహాలను తీర్చవచ్చు. ఉదా.కు… నాకు C లాంగ్వేజ్ లో ఒక ఫంక్షన్ ఎలా రాయాలో తెలియడం లేదనుకోండి. ‘Dilse’ అనే పాఠకుడికి దానిపై అవగాహన ఉంది అనుకుంటే.. అతను ఇలాంటి సాఫ్ట్ వేర్ల సాయంతో నా కంప్యూటర్లోకి ప్రవేశించి ఇక్కడ నేను నా కంప్యూటర్ పై చూస్తుండగానే ఫంక్షన్ రాసి చూపించవచ్చు. అలాగే మౌర్య అనే పాఠకుడికి కంప్యూటర్లో తెలుగు టైప్ చేయడం ఎలాగో తెలియదనుకోంఢి… అప్పుడు నేనో, ప్రసాద్ గారో, వర్మ దాట్ల గారో మౌర్య కంప్యూటర్ లోకి ప్రవేశించి అతని సిస్టమ్ లో తెలుగు టైప్ చేసుకోగలిగేలా కాన్ఫిగర్ చేసి పెడతాం. అంటే మనం పాఠకులం అందరం ఒకరు తిరుపతిలో ఉన్నా, ఒకరు నిజామాబాద్ లో, మరొకరు గుంటూరులో, వేరొకరు వైజాగ్ లో, ఒకరు హైదరాబాద్ లో ఉండి కూడా ఎక్కడ ఉన్న వారి సందేహాలనైనా నేరుగా వారి కంప్యూటర్లోకి ప్రవేశించి పరిష్కరించవచ్చు. దీనికిగాను పెద్దగా సాంకేతిక పరిజ్ఞానం ఏదీ అవసరం లేదు. ఎంత సులభంగా ఈ పనిని నిర్వర్తించవచ్చో నేను తర్వాత వివరిస్తాను. గత ఏడాది కాలంగా ఈ ప్రాజెక్టుని దృష్టిలో ఉంచుకుని రకరకాల రిమోట్ మోనిటరింగ్ టూల్స్ పనితీరుని పరీక్షిస్తూ వస్తున్నాను. అన్నింటి కంటే ఉచితంగా లభించే Team Viewer అనే సాఫ్ట్ వేర్ చాలా బాగా పనిచేస్తోంది. సో.. మనమందరం కేవలం 1MB సైజ్ మాత్రమే గల ఆ సాఫ్ట్ వేర్ ని మన కంప్యూటర్లో ఇన్ స్టాల్ చేసుకుంటే సరిపోతుంది.

మీరు చేయగలరా?

ఎలాంటి ప్రతిఫలం లేకుండానే చిన్న చిరునవ్వు కూడా నవ్వనంతగా మనం బిగదీసుకుపోతున్న నేటి రోజుల్లో ఒక్క పైసా ఆశించకుండా ఇతరులకు సేవ చేయాలన్న ఆలోచన చాలామందికి “ఎందుకు టైమ్ వేస్ట్, ఆ కష్టపడేదేదో మన కోసం మనం కష్టపడితే ఓ నాలుగు రాళ్లయినా వెనుకేయవచ్చు” అనిపించడం ఖాయం. అయితే నిజంగా ఒకటి ఆలోచించండి మనం పోతూ పోతూ ఇవ్వాళ చెమటోడ్చి సంపాదించే డబ్బు మూటలను మనతోపాటు కట్టుకుపోలేం. అదే ఓ పదిమందికి సాయపడితే “ఫలానా మనిషి దేవుడు లాంటి వాడు” అని వారి జీవితాంతం ఏదో ఒక సందర్భంలో గుర్తుచేసుకుంటూనే ఉంటారు. మనం పోయినా మిగిలి ఉండేది మనం చేసిన సేవే. అలాగే మనం పంచిన నాలెడ్జ్ తో ఎందరో జీవితంలో స్ధిరపడవచ్చు. అంటే మన ఒక్కళ్ల జీవితం ఎంతోమందికి నిండు జీవితం, స్థిరత్వం ప్రసాదిస్తోందన్నమాట. అంతకన్నా కావలసిన తృప్తి ఏముంటుంది? ఇదీ నా ఆలోచనావిధానం. అలాగని ఎవరినీ నేను స్వంత పనులు మానేసుకుని సమాజసేవ చేయమని కోరడం లేదు. మీకు తెలిసిన నాలెడ్జ్ ని రోజుకి ఓ గంటో, రెండు గంటలో ఇతరుల సందేహాలు తీర్చడానికి వెచ్చించండి చాలు. ఏ ఛాటింగ్ లోనో వేస్ట్ చేసే టైమ్ ని ఇలా సద్వినియోగం చేసుకుంటే బాగుంటుంది కదా! ఒక్కటి మాత్రం నిజం.. ఇలా నలుగురికీ సాయపడడంలో లభించే తృప్తి కోట్లు సంపాదించినా రాదని నేను స్వతహాగా ఎక్స్ పీరియెన్స్ చేస్తూనే ఉన్నాను. కాబట్టి మీకూ ఎంతో కొంత సమాజానికి సేవ చేయాలని ఉంటే మీరూ ఈ ప్రాజెక్టులో భాగస్వాములు అవండి. ఒకవేళ “మా వల్లేం అవుతుంది, మా ఉద్యోగాలు మమ్మల్ని చేసుకోనివ్వండి.. ఏదో 15 రూపాయలు పెట్టి కంప్యూటర్ ఎరా చదువుతున్నాం కదా అని శ్రీధర్ గారు మనల్ని ఎలా ఇరికిస్తున్నారో చూడండి” అని ఫీల్ అయితే మీ ఇష్టం. మీరు సేవ చేయాలని ఎలాంటి బలవంతం లేదు. నేను నా స్వంత పనులను మీరు చేయమని కోరడం లేదు. మీకు ఇష్టమైతే చేయవచ్చు, ఇష్టం లేకపోతే వదిలివేయవచ్చు. నా లక్ష్యం ఒక్కటే మనందరం కలిసి ఇలాంటి వినూత్నమైన ప్రాజెక్ట్ ద్వారా యావత్ భారతదేశానికే ఆదర్శంగా నిలవాలన్నది. ఇవ్వాళ ఓ నలుగురే ముందుకు రావచ్చు, కొన్నాళ్లకు ఓ పదిమందవుతారు, మరికొన్నాళ్లకు వంద, వేయి.. ఇలా పెరుగుతారు. ఒకరికొకరు ఎలాంటి డబ్బూ ఆశించకుండా ఇలా సాయం చేసుకుంటున్నారంటే ఖచ్చితంగా ఇది చాలా గొప్ప సమాజ సేవ అవుతుంది. సో.. మీకు నిజంగా ఆసక్తి ఉంటే, మధ్యలోనే చేతులు ఎత్తేయమని, ఈ ప్రాజెక్టుకి వీలైనంత వరకూ జీవితాంతం కట్టుబడి ఉంటామనుకుంటే మీరూ ఇందులో భాగస్వాములు కావచ్చు.

మీ వివరాలు అందించండి:

ఇతరులకు సేవ చేయాలన్న ఆసక్తి ఉన్నవారు ఇదే పోస్ట్ లో మీ వివరాలు తెలియజేయండి. అవేంటంటే:

మీ పేరు, మెయిల్ అడ్రస్, మీకు ఏయే రంగాలపై మంచి నాలెడ్జ్ ఉంది, మీరు ఏయే సమయాల్లో ఇతరుల కోసం టైమ్ కేటాయించగలుగుతారు (ఉదా.కు.. సాయంత్రం 6-7 గంటల వరకూ). ఇబ్బంది లేదనుకుంటే మీ ఫోన్ నెంబర్. మీరు ఏం చేయాలంటే, మీరు ఏ టైమ్ మీకు వీలు అవుతుందని చెప్పారో ఆ సమయంలో తప్పనిసరిగా యాహూ మెసెంబర్/Gtalk వంటి వాటిలో ఛాటింగ్ లో అందుబాటులో ఉండాలి, లేదా మీ ఫోన్ ని ఆ టైమ్ లో ఆన్ చేసి ఉంచాలి. మెసెంజర్ లేదా ఫోన్ ద్వారా సాయం కావలసిన వాళ్లు మీకు రిక్వెస్ట్ పంపిస్తారు. అప్పుడు మీరు Team Viewer సాఫ్ట్ వేర్ ని ఓపెన్ చేసి.. అవతలి వ్యక్తి తెలియజేసిన అతని యూజర్ ID, పాస్ వర్డ్ ల సాయంతో అతని కంప్యూటర్ లోకి ప్రవేశించి, అతని సందేహాన్ని క్లారిఫై చేయవలసి ఉంటుంది. ఒకవేళ ఆ సమయంలో మీరు బిజీగా ఉంటే మరో టైమ్ లో మీ ఇద్దరూ కలిసి సమస్యని పరిష్కరించుకోవచ్చు. ఇందులో ఎలాంటి కండిషన్స్ లేవు, కావలసిందల్లా సాయపడే స్వభావమే!

ఎక్కడి నుండి డౌన్ లోడ్ చేసుకోవాలి?

ఈ క్రింది వెబ్ అడ్రస్ నుండి Team Viewerని డౌన్ లోడ్ చేసుకోండి.

http://www.teamviewer.com/download/TeamViewer_Setup.exe

డౌన్ లోడ్ చేశాక ఇన్ స్టాల్ చేసేటప్పుడు క్రింది చిత్రంలోని విధంగా Install Team Viewer అనే ఆప్షన్ టిక్ చేసి ఇన్ స్టాల్ చేయండి:

ఆ తర్వాత క్రింది విధంగా బాక్స్ వస్తుంది:

అందులో Start TeamViewer automatically with windows అనే ఆప్షన్ ని టిక్ చేయకండి. క్రింద పాస్ వర్డ్ అనే ప్రదేశం వద్ద మీ పేరుని పాస్ వర్డ్గ్ గా ఇవ్వండి. ఈ పాస్ వర్డ్ గుర్తు ఉంచుకోండి. ఆ తర్వాత Next, Next కొట్టి ఇన్ స్టలేషన్ పూర్తి చేయండి. మీ కంప్యూటర్లో ఫైర్ వాల్ ఉంటే Team Viewer ని నెట్ యాక్సెస్ చేయడానికి అనుమతించమంటారా అని అడుగుతుంది. Allow/Accept చేయండి. చివరిగా క్రింది చిత్రంలో విధంగా విండో వస్తుంది.

అందులో ID అనే బాక్స్ లో మిమ్మల్ని హెల్ప్ అడిగిన వ్యక్తి యొక్క కంప్యూటర్ ID టైప్ చేసి, Connect to Partner అనే బటన్ ని క్లిక్ చేయండి. ఇప్పుడు పాస్ వర్డ్ అడుగుతుంది. అతను మీకు తెలియజేసిన పాస్ వర్డ్ టైప్ చేస్తే సరిపోతుంది.

ఈ ప్రాజెక్ట్ గురించి ఇంకేమైనా సందేహాలుంటే అడగగలరు. అలాగే నిజంగా ఆసక్తి ఉన్నవారు వెంటనే మీ వివరాలు ఇక్కడ తెలియజేసి ఇందులో భాగస్వాములు అవండి, గొప్ప నాలెడ్జబుల్ సొసైటీ ని నిర్మిద్దాం.

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా

వెబ్‌సైట్లలోని కలర్ కోడ్‌లు ఎలా తెలుసుకోవాలి.

November 29, 2007 Uncategorized No Comments

కొన్ని ఆకర్షణీయంగా ఉండే వెబ్‌సైట్లలో డిజైనింగ్ కోసం ఏయే రంగులు ఉపయోగించారన్నది సులువుగా తెలుసుకోవచ్చు. స్క్రీన్‌పై కనిపిస్తున్న ఏ రంగు యొక్క కలర్ కోడ్‌నైనా సులువుగా తెలియజేసేలా Color Picker వంటి కొన్ని చిన్న చిన్న సాఫ్ట్‌వేర్లు లభిస్తున్నాయి. మీరు వాటిని వాడవచ్చు. లేదా నెట్‌పై redalt.com అనే వెబ్‌పేజీలోకి వెళ్ళి అడుగున Type the Url అనే ప్రదేశం వద్ద మీరు ఏ వెబ్‌సైట్ యొక్క రంగుల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో ఆ వెబ్‌సైట్ అడ్రస్ టైప్ చేసి Get Colors అనే బటన్‌ని క్లిక్ చేయండి.

టాబ్‌లు ఆకర్షణీయమైన రంగుల్లోకి వచ్చేలా…

November 29, 2007 Uncategorized 1 Comment


ఫైర్‌ఫాక్స్ బ్రౌజర్‌లో మనం వేర్వేరు ట్యాబ్‌ల క్రింద వేర్వేరు వెబ్‌సైట్లని బ్రౌజ్
చేసుంటాము కదా!! అలా ఓపెన్ చేయబడిన ప్రతీ ట్యాబ్ ఆకర్షణీయమైన
రంగుల్లో చూపించబడితే కళ్లకు ఇంపుగా ఉంటుంది కదూ!! దీనిని సాధ్యం
చేసేదే colourful tabs డౌన్‌లోడ్ చేసుకుని ఆనందించండి.

వైరస్‍‍లను ఇలా తయారుచేస్తారు…

November 29, 2007 Uncategorized 1 Comment

కంప్యూటర్ వైరస్‌లను తయారు చేయాలంటే బాగా ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఉండాలన్న అభిప్రాయం మనలో చాలామందికి ఉంది. వాస్తవానికి అది నిజమే! అయితే ఇటీవలి కాలంలో రెడీమేడ్‌గా ఎవరైన క్షణాల్లో తమకు తాము వైరస్‌లను క్రియేట్ చేసుకోగలిగేలా Virus Builder ప్రోగ్రాములు వ్యాప్తిలోకి వచ్చాయి. ఇలాంటి ప్రోగ్రాముల్లో హార్డ్ డిస్కులోని ఫైళ్ళని డిలీట్ చేసేలా, Control Panel, Task Manager, Mouse, Desktop వంటి వేర్వేరు అంశాలను డిసేబుల్ చేసేలా ఆప్షన్లు పొందుపరచబడి ఉంటాయి. ఇక్కడ మీరు ఏయే అంశాలను టిక్ చేసి, Create Virus అనే బటన్‌ని క్లిక్ చేస్తే వెంటనే ఓ EXE ఫైల్ సిద్ధమైపోతుంది. ఇప్పుడు ఆ వైరస్ ప్రోగ్రామ్‌ని రన్ చేసిన సిస్టంలో ఇంతకుముందు టిక్ చేసిన అంశాలు ఆచరించబడతాయి. ఇలా ఎవరైనా సులభంగా వైరస్‌లు తీర్చిదిద్దగలుగుతున్న ప్రస్తుత తరుణంలో మనం మరింత జాగ్రత్తగా ఉండడం ఎంతైనా శ్రేయస్కరం కదా!

థంబ్‌నెయిల్ ఇమేజ్‌లతో గ్యాలరీ సృష్టించడానికి

November 26, 2007 Uncategorized No Comments

థంబ్‌నెయిల్ ఇమేజ్‌లతో కూడిన HTML ఇమేజ్ గ్యాలరీలను సృష్టించడానికి
Express Thumbnail Creator అనే ప్రోగ్రామ్ ఉపయుక్తంగా ఉంటుంది.
మనం గ్యాలరీగా క్రియేట్ చేయదలుచుకున్న ఇమేజ్‌లను సెలెక్ట్ చేసుకుని ఫైనల్
ఔట్‌పుట్ ఎక్కడ సేవ్ చేయబడాలో స్పెసిఫై చేస్తే సరిపోతుంది. HTML, CSSలపై
ఆవగాహన ఉన్నవారు స్వంతంగా టెంప్లేట్లు క్రియేట్, ఎడిట్ చేసుకోవడానికి ఈ
ప్రోగ్రామ్‌లో అవకాశం ఉంది.

నెట్ నుండి కావలసిన సమాచారానికి

November 26, 2007 Uncategorized 2 Comments

నెట్‌పై మీరొక ఆసక్తికరమైన వెబ్‌పేజీ చూస్తున్నారనుకుందాం. అందులోని కొంత
సమాచారాన్ని కాపీ చేసుకుని మీ సిస్టమ్‌లో సేవ్ చేసుకోవాలనిపించింది. అలాగే
నెట్‌పై స్ట్రీమ్ అవుతున్న ఆడియో,వీడియోలను భద్రపరుచుకోవాలనుకున్నారు.
అలాంటప్పుడు ఉపయోగపడే DataBites అనే సాఫ్ట్‌వేర్! దీని సాయంతో
డైనమిక్‌గా మారుతుండే సమాచారాన్ని సైతం సిస్టంలోకి డ్రాగ్ చేసుకోవచ్చు.
అలాగే మనం మోనిటర్ చేస్తున్న సమాచారం ఎంత సేపటికి రెఫ్రెష్
చేయబడుతుండాలన్నదీ సెట్ చేసుకోవచ్చు.

కీబోర్డ్ పై టైప్ చేసేవాటిని రికార్డ్ చేసే డివైజ్

November 25, 2007 Uncategorized No Comments


Golden Eye వంటి సాఫ్ట్ వేర్ల సహాయంతో మీ కంప్యూటర్ పై ఏమి టైప్ చేస్తున్నారు అన్నది మీ కంప్యూటర్ పై కూర్చున్న వారికి తెలియకుండానే రికార్డ్ చేయవచ్చని మీకు తెలిసే ఉంటుంది. అయితే సిస్టమ్ ని ఫార్మేట్ చేస్తే ఆ సాఫ్ట్ వేర్లు పనిచేయకుండా పోతాయి. అలా కాకుండా పై చిత్రంలో విధంగా నేరుగా మీ PS/2 కీబోర్డ్ పిన్ కే గుచ్చగలిగే కీషార్క్ అనే ఓ డివైజ్ ని ఉపయోగిస్తే కీబోర్డ్ ద్వారా మీరు గానీ, మీ కంప్యూటర్ పై కూర్చున్న ఎవరైనా ఏమి టైప్ చేసినా ఇది తన మెమరీలో రికార్డ్ చేసుకుంటూ వెళుతుంది. ఎప్పుడైనా దానిని తిరిగి చదువుకోవచ్చు. అవసరం లేదనుకుంటే దానిని కేబుల్ నుండి తొలగించి దాచిపెట్టుకోవచ్చు. పై చిత్రంలో నల్ల రంగులో ఉన్న భాగమే ఆ డివైజ్. దీని ధర రూ. 2500/-.

స్టెగనోగ్రఫీతో దాచిపెట్టబడిన వాటిని కనుక్కోవచ్చు..

November 25, 2007 Uncategorized 2 Comments


ఫొటోలలోనూ, MP3 ఫైళ్లలోనూ రహస్యంగా ఇతర ఫైళ్లని జొప్పించి ఇతరులకు కనపడకుండా చేరవేసే ప్రక్రియను స్టెగనో గ్రఫీ అంటారు. ఇలా ఒక ఫైల్ లో రహస్యంగా సమాచారాన్ని జొప్పించడానికి అనేక రకాల స్టెగనోగ్రఫీ సాఫ్ట్ వేర్లు లభిస్తున్నాయి. అయితే ఈ స్టెగనోగ్రఫీకి విరుగుడుగా స్టెగనాలసిస్ అనే ప్రత్యేకమైన టెక్నిక్ సైతం వాడుకలోకి వచ్చింది. మనం ఏ పేరెంట్ ఫైళ్లలో అయితే రహస్య సమాచారాన్ని పొందుపరిచామో ఆ పేరెంట్ ఫైళ్లని స్వీకరించి, విశ్లేషించి, అందులో అంతర్గతంగా పొందుపరచబడి ఉన్న సమాచారాన్ని గుర్తించి నాశనం చేసే ప్రక్రియనే స్టెగనాలసిస్ గా వ్యవహరిస్తారు. స్టెగనోగ్రఫీ కంటెంట్ ని గుర్తించే ఇలాంటి సాఫ్ట్ వేర్లలో Stegdetect అనే ప్రోగ్రామ్ JPEG ఇమేజ్ ఫైళ్లలో రహస్యంగా పొందుపరచబడిన సమాచారాన్ని వెదికిపట్టుకోగలుగుతుంది.

పవర్ పోగానే UPS కూడా ఆగిపోతోందా?

November 25, 2007 Uncategorized No Comments


మీవద్ద UPS ఉన్నట్లయితే అకస్మాత్తుగా పవర్ సప్లై నిలిచిపోతే మెయిన్ పవర్ సప్లై నుండి UPSలోని బ్యాటరీ ఛార్జ్ తీసుకుని సిస్టమ్ కి విద్యుత్ సరఫరా అందిస్తుంది. అయితే కొన్ని UPSలు అలా కరెంట్ పోగానే అవీ ఆగిపోయి సిస్టమ్ నిలిచిపోవడానికి దారితీస్తాయి. AC నుండి DCకి మారే స్విచ్ఓవర్ సర్క్యూటరీలో లోపం ఉండడం వల్ల ఇలా జరుగుతుంది. నాసిరకం కంపెనీలకు చెందిన UPSలలో ఇలాంటి ఇబ్బంది ఎక్కువగా తలెత్తుతుంటుంది. అలాగే UPSపై పరిమిత మొత్తంలో మాత్రమే లోడ్ వేయాలి. లేదంటే అవి కరెంట్ పోగానే లోడ్ తట్టుకోలేక ట్రిప్ అవుతుంటాయి, దానితో సిస్టమ్ రీస్టార్ట్ అవుతుంది. చాలామంది సిస్టమ్ తోపాటు, స్పీకర్లు, ప్రింటర్, స్కానర్ వంటి అన్ని రకాల పెరిఫెరల్స్ నీ UPSకే కనెక్ట్ చేస్తుంటారు. అలాగే 17″, 19″ వంటి పెద్ద మోనిటర్ల వల్ల కూడా కొన్నిసార్లు సమస్యలు వస్తాయి. ఉదా.కు.. మోనిటర్ వరకూ మాత్రమే ఆఫ్ చేయబడి ఉన్నప్పుడు కరెంట్ పోయిందనుకోండి. వెంటనే మీరు మోనిటర్ ని ఆన్ చేశారంటే మొత్తం సిస్టమ్ రీస్టార్ట్ చేయబడే ప్రమాదం ఉంది. దీనికి కారణం మోనిటర్ ఆన్ చేయబడిన మొదటి కొద్ది క్షణాల్లో భారీ మొత్తంలో విద్యుత్ ని వాడుకుంటుంది. అంత స్థాయిలో విద్యుత్ ని ఆ కొన్ని క్షణాలపాటు అందించలేక యుపిఎస్ చేతులు ఎత్తేస్తుంది.

మనం వాడేది అసలైన కొటేషన్ మార్క్ కాదు..

November 24, 2007 Uncategorized 2 Comments


కీబోర్డ్ ద్వారా ‘ మరియు ” చిహ్నాలను మనం కొటేషన్ మార్కులుగా ఎంటర్ చేస్తుంటాం కదా. వాస్తవానికి అవి నిజమైన కొటేషన్ మార్కులు కావు. వీటిని Hash Marks అంటారు. అడుగులు, అంగుళాలను తెలియజేసేటప్పుడు మాత్రమే (ఉదా.కు.. 9’6″) వీటిని ఉపయోగించాలి. వంపులుగా ఉండే (“) నిజమైన కొటేషన్ మార్కులకు బదులుగా ఈ హాష్ మార్క్ ని మీరు ఉపయోగిస్తున్నట్లయితే మీకు సరైన పరిజ్ఞానం లేనట్లే భావిస్తారు. మరి నిజమైన కొటేషన్ మార్కులకు కీబోర్డ్ నుండి పొందడం ఎలాగంటే..

ముందు న్యూమరిక్ కీప్యాడ్ ని ఆన్ చేయండి. ఇప్పుడు..

Alt+0145 (న్యూమరిక్ కీపాడ్ పై సంఖ్యలని ప్రెస్ చేయాలి) – అనే కీల సముదాయాన్ని ప్రెస్ చేస్తే ‘ అనే ఎడమచేతి వైపు సింగిల్ కోట్ వస్తుంది.
Alt+0146 – అనే కీల సముదాయాన్ని ప్రెస్ చేస్తే ’ అనే కుడిచేతి వైపు సింగిల్ కోట్ వస్తుంది.
Alt+0147 – అనే కీల సముదాయాన్ని ప్రెస్ చేస్తే “ అనే ఎడమ చేతి వైపు డబుల్ కోట్ వస్తుంది.
Alt+0148 – అనే కీల సముదాయాన్ని ప్రెస్ చేస్తే ” అనే కుడిచేతి వైపు డబుల్ కోట్ వస్తుంది.

అంతా బాగానే ఉంది కానీ, ఇలా కొటేషన్ మార్కులు ఎంటర్ చేయవచ్చినప్పుడల్లా అన్ని కీలను ప్రెస్ చేయడం కష్టంగా ఉంటుంది కదూ! అందుకే పేజ్ మేకర్, క్వార్క్ ఎక్స్ ప్రెస్ వంటి సాఫ్ట్ వేర్లలో Typographer’s Quotes లేదా Smart Quotes పేరిట ఆప్షన్లు పొందుపరచబడి ఉంటాయి. ఈ ఆప్షన్లని ఎనేబుల్ చేసిన తర్వాత ఇంతకాలం మనం ఎంటర్ కీకి పక్కనే కనిపించే హాష్ మార్క్ కీని ప్రెస్ చేస్తే అని నిజమైన కర్లీ కొటేషన్ మార్కుగా మార్చబడుతుంటుంది.

Search This Site:

Press75.com Press75.com Press75.com Press75.com

About Me

1996వ సంవత్సరంలో తెలుగులో మొట్టమొదట కంప్యూటర్ సాహిత్యాన్ని ప్రారంభించే అవకాశం నాకు కలిగింది. అదే సమయంలో చెన్నైలో సూపర్ హిట్ తెలుగు ఫిల్మ్ మేగజైన్ కి సబ్ ఎడిటర్ గా కూడా ఏకకాలంలో పనిచేస్తూ 1998 వరకూ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, మనీషా కొయిరాలా, శంకర్, రజనీకాంత్, కమల్ హాసన్ వంటి ప్రముఖులెందరినో ఇంటర్వ్యూలు చేయడం మర్చిపోలేని అనుభవం. అయితే సినిమా రంగంలో ఉన్న అనారోగ్యకరమైన వాతావరణం వల్ల నాకంటూ ఓ ప్రత్యేకమైన ఉనికిని సృష్టించుకోవడం కోసం సినిమా రంగం నుండి బయటకు వచ్చి పూర్తిగా టెక్నాలజీ రంగంలో స్థిరపడడం జరిగింది. 96 నుండి 2001 వరకూ పలు కంప్యూటర్ పత్రికలకు ఎడిటర్ గా పనిచేసి.. 2001 నుండి "కంప్యూటర్ ఎరా" తెలుగు మంత్లీ మేగజైన్ ఎడిటర్ గా పత్రిక మొత్తాన్నీ రూపొందిస్తూ ఉన్నాను. అలాగే తెలుగు టెలివిజన్ ఛానెళ్లలో మొట్టమొదటి టెక్నికల్ phone-in ప్రోగ్రామ్ కి గెస్ట్ గా అటెండ్ అయ్యే అవకాశమూ 2010 జనవరి 20న కలిగింది. అప్పటి నుండి ఇప్పటివరకూ I News, ETV2, ABN ఆంధ్రజ్యోతి, NTV, Zee 24 గంటలు, సాక్షి టివి, మహా టివి, జాగృతి న్యూస్ వంటి ఛానెళ్లలో 90కి పైగా లైవ్, రికార్డెడ్ ప్రోగ్రాముల్ని చేయడం జరిగింది. 2007లో అత్యుత్తమైన నాణ్యతతో కూడిన పోస్టులతో, వీడియోలతో తెలుగులో మొదటి ప్రొఫెషనల్ టెక్నికల్ బ్లాగ్ గానూ, మొదటి వీడియో బ్లాగ్ గానూ ఇప్పుడు మీరు చూస్తున్న బ్లాగ్ ప్రత్యేకతను సంతరించుకుంది. అలాగే 2007 జనవరి 1న ప్రారంభించిన తెలుగులోనే మొట్టమొదటి టెక్నికల్ ఫోరమ్ అయిన "కంప్యూటర్ ఎరా సాంకేతిక ఫోరమ్" 14 వేల మంది సభ్యులతో 10 వేలకు పైగా పోస్టులతో 2009 జూలై వరకూ నిర్వహించబడింది. దాంతోపాటే మొట్టమొదటి తెలుగు టెక్నికల్ ఛాట్ రూమ్ అయిన "కంప్యూటర్ ఎరా సాంకేతిక సహాయం" అనే ఛాట్ రూమ్ రెండేళ్లలో వేలాది మందికి తెలుగు టైప్ చేయడం మొదలుకుని అనేక కంప్యూటర్ సంబంధిత సాంకేతిక సమస్యలకు తక్షణ సహాయం అందించింది. ఇకపోతే http://youtube.com/nallamothu అనే ఛానెల్ లో 361కి పైగా ప్రొఫెషనల్ క్వాలిటీ తెలుగు టెక్నికల్ వీడియోలు అందించాను. ఈ ఛానెల్ కి 1192 మంది సబ్ స్కైబర్లు ఉన్నారు. అందుబాటులో ఉన్న వివిధ మార్గాల ద్వారా తెలుగు వారందరకీ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించే పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాను.

Google Playలో పొందండి

ఇక్కడ RSS Feedకి Subscribe చేసి నేరుగా పోస్ట్ లు పొందండి