My Computerలో ఏదైనా డ్రైవ్ పై మౌస్ తో డబుల్ క్లిక్ చేసినప్పుడు ఆ డ్రైవ్ లోపల ఫోల్డర్లు, ఫైళ్లు చూపించబడడానికి బదులు Search ఆప్షన్ వస్తోందా? అయితే క్రింది వీడియోలో ఈ సమస్యని పరిష్కరించడం ఎలాగో చిన్న టెక్నిక్ ని ఆడియోతో సహా తెలుగులో వివరించడం జరిగింది. మీరే చూడండి:
Windows XP ఆపరేటింగ్ సిస్టమ్ ని కంప్యూటర్లో ఇన్ స్టాల్ చేసే సమయంలో రీజినల్ సెట్టింగ్స్, టైమ్ జోన్, అడ్మినిస్ర్టేటర్ పాస్ వర్డ్ వంటి కొన్ని ఆప్షన్లని ఎంచుకోవడానికి మనం కంప్యూటర్ దగ్గరే ఉండవలసి వస్తుంది. అలా కాకుండా Setup ప్రారంభమైనది మొదలుకుని పూర్తయ్యేటంత వరకూ XP తనంతట తాను కొనసాగేలా కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. దీనికి గాను XP సెటప్ సిడిలో \Support\Tools\Deploy.cab ఫైల్ లో ఉండే Setup Managerని రన్ చేయండి. ఇది Setupmgr.exe పేరుతో ఉంటుంది. దీన్ని రన్ చేయండి. ఇప్పుడు XP Setup సమయంలో వేర్వేరు దశల్లో మనం ఇవ్వాల్సిన సమాచారాన్ని సేకరించడానికి ప్రశ్నలు అడగబడతాయి. వాటికి మనం ఇచ్చే సమాధానాలు ఫైళ్లుగా సేవ్ అవుతాయి. ఇప్పుడు NEWXP పేరిట డెస్క్ టాప్ పై గానీ, వేరే ఎక్కడైనా ఓ ఫోల్డర్ ని క్రియేట్ చేసి ఒరిజినల్ XP సిడిలో ఉన్న ఫైళ్లు, ఫోల్డర్లని యధాతధంగా ఆ ఫోల్డర్ లోకి కాపీ చేయండి. అదే విధంగా ఇంతకుముందు మనం ఇచ్చిన సమాధానాల ఆధారంగా Setup Manager క్రియేట్ చేసిన ఆన్సర్ ఫైళ్లని కూడా అదే ఫోల్డర్ లోకి కాపీ చేయండి. ఇప్పుడు ఆ కొత్త ఫోల్డర్ లోని Setup ప్రోగ్రామ్ రన్ చేయబడేలా autorun.inf ఫైల్ ని మోడిఫై చేసి సిడిని Nero వంటి సిడి రికార్డింగ్ సాఫ్ట్ వేర్ తో రైట్ చేసుకుంటే సరిపోతుంది. ఇకపై ఆ కొత్త సిడితో Windows XP సెటప్ చేస్తుంటే ఎలాంటి మనం ప్రత్యేకంగా ఆప్షన్లు ఎంచుకోవలసిన పనిలేకుండానే దానికదే ఆప్షన్లు ఎంచుకోబడతాయి, సిస్టమ్ రీస్టార్ట్ అవుతుంది… చివరకు Windows XP సెటప్ పూర్తవుతుంది.
Adobe Photoshop 7, CS2 వంటి వెర్షన్లని ఉపయోగిస్తున్నప్పుడు ఒక్కోసారి అనేక సమస్యలు ఉత్పన్నం అవుతుంటాయి. ముఖ్యంగా ఫైల్ ని సేవ్ చేసేటప్పుడు ఒక్కసారిగా స్ర్కీన్ పై Kernel32 ఎర్రర్ మెసేజ్ చూపించబడి సిస్టమ్ మొత్తం ఫ్రీజ్ అయిపోతున్నట్లయితే సాధ్యమైనంత వరకూ తక్కువ అప్లికేషన్లు రన్ అవుతుండగా మాత్రమే ఫొటోషాప్ ని ఉపయోగించండి. RAM తక్కువగా ఉండి ఫొటోషాప్ తో పాటు PageMaker, InDesign, Acrobat వంటి ఇతర అడోబ్ ప్రోడక్టులు, MS-Office సాఫ్ట్ వేర్లు సైతం ఓపెన్ చేయబడి ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితి తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాంటప్పుడు ముఖ్యమైన అప్లికేషన్ ప్రోగ్రాములను మాత్రమే ఉంచుకుని మిగిలిన వాటిని క్లోజ్ చేసి ఫొటోషాప్ పై పనిచేయండి. అలాగే వేర్వేరు వెర్షన్ల ఫొటోషాప్ లను ఒకే సిస్టమ్ లో ఇన్ స్టాల్ చేసి వాడడం (ఉదా.కు.. ఓ వైపు ఫొటోషాప్ 7 ఉండగా, ఫొటోషాప్ CS2 వంటివి వాడడం), మీరు ఇన్ స్టాల్ చేసుకున్న ఫొటోషాప్ సాఫ్ట్ వేర్ లో ముఖ్యమైన ఫైళ్లు కరప్ట్ అవడం వల్ల, అడోబ్ షేర్డ్ ఫైళ్లు కరప్ట్ అవడం వల్ల, వేర్వేరు అడోబ్ ఉత్పత్తులు కామన్ ఫైళ్లని ఉపయోగించుకోవడంలో ఇబ్బందుల వల్ల కూడా ఇలా ఫొటోషాప్ క్రాష్ అయ్యే అవకాశం ఉంది. కారణం విశ్లేషించి తెలుసుకుని తగిన చర్యలు తీసుకోండి.
కంప్యూటర్ ఎరా పాఠకుల సమావేశం డిసెంబర్ 24, మధ్యాహ్నం 3 గంటలు
హాజరైన పాఠకులు 1. సలీం భాషా 2. జి. చైతన్య 3. సి.హెచ్. సత్యనారాయణ 4. జి. శ్రీనివాస్ 5. టి. నవీన్ రెడ్డి 6. ఎ. అభిరామ్ 7. ఎం. మురళీధర్ 8. పి. మౌర్య 9. ఎ. ఉమాశంకర్ 10. జి.పి. జాకబ్ 11. ఎం. నరేందర్ కుమార్ 12. నల్లమోతు శ్రీధర్ 13. మురళీధర్ గారి మిత్రులు పనిమీద ముందే వెళ్లిపోయారు, ఆయన పేరు జీవన్.
మొట్టమొదటిదే అయినా ఈ మీటింగ్ ఎంతో బాగా జరిగింది. మధ్యాహ్నం 3 గంటలకు అందరం కృష్ణకాంత్ పార్క్ టికెట్ గేట్ వద్ద జమకూడి లోపలికి ప్రవేశించాం. లోపలికి వెళ్లి కూర్చున్నాక మీటింగ్ యొక్క అజెండా జిరాక్స్ కాపీలను అందరికీ పంచడం జరిగింది. ఈ అజెండాలో చర్చించిన కొన్ని అంశాలు….
ఫోరమ్ కార్యకలాపాల విషయమై:జనవరి 2, 2008 నాటికి మన ఫోరంని ప్రారంభించి ఏడాది పూర్తవుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఫోరం ని మెరుగ్గా తీర్చిదిద్దడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి అన్న అంశమై శ్రీనివాస్, మౌర్య, మురళీధర్, జాకబ్ గార్లు మంచి సలహాలు అందించారు. ఈ సందర్భంగానే కేవలం Thanks వంటి పోస్టుల సంఖ్యతో పోలిస్తే నిజంగా కంటెంట్ ఉన్న పోస్టుల సంఖ్య పెరగాలని దానిపై సభ్యుల సూచనలు కోరడం జరిగింది. సీరియస్ గా ఫోరంలో రోజుకు ఒకటి రెండు పోస్టులైనా కంటెంట్ తో కూడినవి చేస్తే ఫోరం మరింత ప్రయోజనకరంగా ఉంటుందని నిర్ణయానికి రావడం జరిగింది. ఈ సందర్భంగా మీటింగ్ కి హాజరు అవని సభ్యులు కూడా దయచేసి.. కనీసం రోజుకి ఒక్క పావుగంట, అరగంటపాటైనా వెచ్చించి మన ఫోరంలో మరిన్ని మంచి పోస్టులు ప్రచురించడానికి ముందుకు వస్తారని ఆశిస్తున్నాం.
ఇకపోతే ఫోరంలో కొత్త సభ్యులు తెలియక రాంగ్ సెక్షన్లలో చేసే పోస్టులను ఎలా మోడరేట్ చేయాలి, కొత్త సభ్యులకు ఫోరంలో ఫలానా విధంగానే పోస్ట్ చేయాలని గైడ్ లైన్స్ ఎలా ఇవ్వాలి అన్న చర్చ జరిగింది. అందరికీ కన్పించే చోట రూల్స్ వంటివి పెడితే బాగుంటుందని అభిప్రాయపడ్డాం. కానీ మనది ఉచిత ఫోరం అవడం వల్ల అన్ని పేజీల్లో కన్పించేలా వాటిని అమర్చడం వీలుపడదు. అందుకే ఇలాంటి గైడ్ లైన్స్ ని Sticky పోస్టులుగా ప్రచురిస్తున్నాం అని నేను వివరించడం జరిగింది. ఇకపోతే రాంగ్ సెక్షన్లలో చేసే పోస్టులను (ఉదా.కు.. సందేహాలను పాఠకుల సహకారం విభాగంలో పోస్ట్ చేయవలసింది పోయి పిసి టిప్స్ అనే విభాగంలో కొందరు పోస్ట్ చేస్తుంటారు) తిరిగి సరైన విభాగాల్లో మూవ్ చేయడానికి ఎవరో ఒక మోడరేటర్ పూర్తి బాధ్యతని తీసుకుంటే బాగుంటుందని అభిప్రాయపడడం జరిగింది. దయచేసి ప్రస్తుతం మోడరేటర్ హోదా కలిగిన వ్యక్తులలో ఈ బాధ్యతని (రాంగ్ పోస్టులను మూవ్ చేయడం, కొత్త సభ్యులను సరైన మార్గంలో నడిపించడం) ఎవరో ఒకరు స్వీకరిస్తే బాగుంటుంది. ఈ బాధ్యతని చేపట్టగల మోడరేటర్ ఈ పోస్ట్ క్రిందనే రిప్లై ఇవ్వగలరు.
అలాగే మనం ఇంత కష్టపడి ఓ టీమ్ స్పిరిట్ తో నడిపిస్తున్న ఫోరంని మరింత మంది దృష్టికి తీసుకువెళ్లే మార్గమేదైనా ఉందా అన్న చర్చ జరిగింది. ఫోరం ని విజిట్ చేయడానికి వచ్చేవాళ్లని కేవలం పోస్టులను చదివి వెళ్లే ఫాలోయర్స్ గా కాకుండా తమకు తెలిసిన నాలెడ్జ్ ని సైతం పోస్ట్ చేసే లీడర్స్ గా వీలైనంత ఎక్కువమందిని మోటివేట్ చేయడం ఎలాగన్నది కొద్దిగా చర్చించాం. మీ సూచనలు కూడా ఇక్కడ తెలియజేయగలరు. ఇకపోతే ఫోరం లో మనం పోస్ట్ చేసే కంటెంట్ మరింత ఆకర్షణీయంగా కన్పించేలా స్ర్కీన్ షాట్లు, బోల్డ్, ఇటాలిక్ వంటి ఫాంట్ స్లైళ్లు, వివిధ కలర్స్ ని ఉపయోగించి రూపొందిస్తే బాగుంటుందని అనుకున్నాం. కొద్దిగా ఓపిక చేసుకుని మనం పోస్టులను ఇలా పబ్లిష్ చేస్తే ఫోరం అందరినీ ఆకట్టుకుంటుంది.
సాంకేతిక సహాయం కి సంబంధించి: Team Viewer ద్వారా మనం ఇతరులకు అందించదలుకున్న టెక్నికల్ సపోర్ట్ విషయమై కొన్ని అంశాలు చర్చించడం జరిగింది. ఎవరు ఎప్పుడు ఆన్ లైన్ లో ఉంటున్నారు, ఎవరికి సహాయం అవసరం అవుతుంది అన్న కమ్యూనికేషన్ పెద్ద ఇబ్బందిగా ఉంటుందని చెప్పాను. ఇదే విషయమై ఓ లేఖిని, కూడలి సృష్టికర్త వీవెన్ ప్రత్యేకమైన ఛాట్ రూమ్ ని మన కోసం తయారు చేయడానికి మన మీటింగ్ ముందు రోజే సుముఖత వ్యక్తపరిచారు. అదే విషయం నేను ప్రస్తావించాను. వీవెన్ చెప్పిన ప్రకారమే.. సరిగ్గా మీటింగ్ జరిగిన మరుసటి ఉదయమే… కంప్యూటర్ ఎరా సాంకేతిక సహాయం పేరిట http://computerera.koodali.org/ అనే అడ్రస్ లో ఛాట్ రూం ప్రారంభమైంది. ఇందులో ఇప్పుడు చాలామంది ఇతరులకు సాయపడుతున్నారు, తమ నాలెడ్జ్ ని అప్ డేట్ చేసుకుంటున్నారు, అవసరమైతే టీమ్ వ్యూయర్ ద్వారా అవతలి వారి కంప్యూటర్లోకి ప్రవేశించి మరీ సమస్యని పరిష్కరించడం జరుగుతోంది. అలాగే టీమ్ వ్యూయర్ ద్వారా ఫలానా టైమ్ లో మేము సేవ చేయగలం అని మాట ఇచ్చిన వారు సాధ్యమైనంత వరకూ ఆయా సమయాల్లో (ఎప్పుడైనా కుదరకపోతే ఫర్వాలేదనుకోండి) ఎవరున్నా లేకపోయినా ఛాట్ రూంలో గడిపితే బాగుంటుంది.
మేగజైన్ కి సంబంధించి:మన అన్ని పనులకూ పునాది లాంటి కంప్యూటర్ ఎరా మేగజైన్ రీడబులిటీని మరింత పెంచడం ఎలా అన్నది చర్చించాం. మౌత్ పబ్లిసిటీ ఒక్కటే మార్గమని నిర్ణయానికి వచ్చాం. ఇంకేమైనా సూచనలు ఉంటే తెలుపగలరు. అలాగే అందరికీ ఉపయోగపడుతుంది అనుకున్న కొత్త విషయాలు ఏమైనా (గతంలో ప్రచురించబడకపోతే) మేగజైన్ లో రాయడానికి ఎవరికైనా అవకాశం ఇస్తానని ప్రకటించాను. మీరైనా మంచి కంటెంట్ ఉంటే ప్రతీ పిసి యూజర్ కి ఉపయోగపడుతుందనుకుంటే ఒక్కసారి 9848227008 నెంబర్ లో ఉదయం 10 గం. నుండి సాయంత్రం 4 గం. లోపు నాకు కాల్ చేసి మాట్లాడగలరు.
ఇతరత్రా అంశాలు: అన్ని ఊళ్లలోనూ అనేకమంది కంప్యూటర్ ఎరా పాఠకులు ఉన్నారు. వారందరూ ప్రతీ మీటింగ్ కి హైదరాబాద్ రావాలన్నా రాలేరు. అదే ఏ ఊళ్లో ఉన్న రీడర్స్ ఆ ఊళ్లో నెలకో, రెండు నెలలకోసారి చిన్న సమావేశం ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది కదా అన్న అంశం చర్చించాం. అలాగే మనం చేస్తున్న ఇలాంటి ప్రొడక్టివ్ కార్యకలాపాల గురించి ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి మెయిన్ స్ర్టీమ్ మీడియా కవర్ చేసేలా తద్వారా పదిమందికీ నాలెడ్జ్ ని పంచాలన్న మన ఉద్యమం మరింత బలోపేతం అయ్యేలా ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నదీ చర్చించడం జరిగింది.
అప్పటికే చీకటి పడడం, ఊళ్లకు వెళ్లవలసిన సభ్యులు ఉండడం కారణంగా అజెండాలో మరికొన్ని అంశాలు ఉన్నప్పటికీ సమావేశాన్ని ముగించాం.
ఈ మీటింగ్ కి విశేషత ఏమంటే.. అభిరామ్ అనే సభ్యుడు గుంటూరు నుండి ప్రత్యేకంగా ఆరోజు ఉదయం బయల్దేరి సరిగ్గా మీటింగ్ టైమ్ కి వచ్చి, మీటింగ్ అయిపోయిన వెంటనే అసలు రిఫ్రెష్ అవడానికి సమయం లేకపోయినా వెంటనే తిరుగు ప్రయాణం అవడం చాలా బాధ అనిపించింది. ఇంత కమిట్ మెంట్ ఉన్నవారం అందరం ఒకచోట కలిస్తే అద్భుతాలు సృష్టించవచ్చు కదా! అలాగే మనందరికీ చిరపరిచితుడైన మౌర్య ప్రత్యేకంగా నెల్లూరు నుండి బస్ లో సీటు దొరకకపోయినా అలాగే రాత్రంతా ఇబ్బందిపడుతూ హాజరవడం! మీటింగ్ అయిపోయిన వెంటనే అదే రాత్రి తిరిగి ప్రయాణమవడం అతని చిత్తశుద్ధికి నిదర్శనం. నరేందర్ ఓ రెండు రోజులు ముందే సూర్యాపేట నుండి వచ్చి మీటింగ్ ముందురోజు వ్యక్తిగతంగా నన్ను కలిసి మీటింగ్ కి హాజరయ్యారు. సత్యనారాయణ గారు, మురళీధర్ గారు ఆఫీసుకు సెలవు పెట్టి మరీ మీటింగ్ కి వచ్చారు. సలీంభాషా, జీవన్, చైతన్య, జాకబ్, ఉమాశంకర్, శ్రీనివాస్, నవీన్ రెడ్డి తదితరులు చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేశారు. ఈ మీటింగ్ ని వీలైనంత బాగా కవర్ చేద్దామని ఫొటోలు, ఆడియో రికార్డ్ చేశాం. ఆడియో ఫైల్ కరప్ట్ అవడం వల్ల 132MB నుండి కంప్రెస్ అవక నాలుగైదు రోజులు విసిగించింది. అభిరామ్ గారు ఇలాగైతే లాభం లేదని పనిగట్టుకుని మరీ దాన్ని ఫ్లాష్ ఫార్మేట్ లోకి కన్వర్ట్ చేసే పనిలో ఉన్నారు. అది రెడీ అయ్యాక ఇక్కడే లింక్ ఇవ్వడం జరుగుతుంది. ఫొటోలు మెమరీ కార్డ్ కరప్ట్ అవడం వల్ల ఒక్క ఫొటో కూడా పొందలేకపోయాం. ఇక మిగిలిన ఏకైక చిన్న సెల్ ఫోన్ వీడియో క్లిప్ ని ఆల్రెడీ పోస్ట్ చేశాం, మీరూ చూసే ఉంటారు. చాలా ఆనందంగా, స్నేహితులం కలిసినట్లు జరిగిన ఈ మీటింగ్ చాలా మోటివేషన్ ని కలిగించింది.
తదుపరి మీటింగులు:
1. జనవరి 27 ఆదివారం సాయంత్రం 3 గంటలకు, కృష్ణకాంత్ పార్క్, యూసఫ్ గూడ బస్తీ దగ్గర, హైదరాబాద్ 2. ఫిబ్రవరి 24, ఆదివారం సాయంత్రం 3 గంటలకు (అదే ప్రదేశం వద్ద)
ఏ కారణం చేతైనా మొదటి మీటింగ్ కి హాజరు అవలేకపోయిన వారు వాటికైనా వీలుచేసుకుంటారని ఆశిస్తున్నాం. ఈ మీటింగ్ ని విజయవంతం చేసిన అందరికీ ధన్యవాదాలు..!
మీవద్ద ఆణిముత్యాల్లాంటి పాత పాటల కలెక్షన్ ఉందనుకుందాం. క్యాసెట్లలో ఉన్న ఆ పాటలన్నింటినీ డిజిటల్ ఫార్మేట్‌లోకి మార్చుకుని సిడిల్లోకి ఎక్కించుకునే మార్గాలనేకం ఉన్నాయి. సింపుల్‌గా క్యాసెట్లను స్టీరియో లేదా టేప్ రికార్డర్‌లో ఉంచి, ఆ స్టీరియోని కంప్యూటర్ యొక్క సౌండ్ కార్డ్ కి కనెక్ట్ చేసి Jet Audio, Total Recorder వంటి సాఫ్ట్ వేర్లలొ టేప్‌రికార్డర్/స్టీరియోలో ప్లే అయ్యే పాటలను WAV లేదా MP3 ఫార్మేట్‌లో రికార్డ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు క్యాసెట్లలోని పాటలన్నీ మీ హార్డ్ డిస్క్ లోకి వచ్చేశాయి. వాటిని Nero, NTI CD Maker, WinonCD, Prassi వంటి ఆడియో సిడి ఆప్షన్‌ని అందించే సిడి రైటింగ్ సాఫ్ట్ వేర్లని ఉపయోగించి ఖాళీ సిడిల్లోకి డిజిటల్ ఫార్మేట్‌లోకి రికార్డ్ చేసుకోవచ్చు. సాధారణంగా ఈ సాఫ్ట్ వేర్లు WAV, MP3< WMA, వంటి విభిన్న ఆడియో ఫార్మేట్లకు చెందిన ఆడియో ఫైళ్ళని ఇన్‌పుట్‌గా తీసుకుని మామూలు ఆడియో సిడి ప్లేయర్లు ప్లే చెయ్యగల CD-DA ఫార్మేట్‌లోకి వాటిని రికార్డ్ చెయ్యగలుగుతాయి.
హార్డ్ డిస్క్ లో స్టోర్ చేసుకున్న ఫోటోలు ఒకదాని తర్వాత ఒకటి ప్లే చెయ్యబడే ఒక సినిమా మాదిరిగా (మూవీ క్లిప్‌గా) సిడిపై రికార్డ్ చేసుకోవడానికి Roxio Easy CD Creator, Win on CD వంటి సిడిరైటింగ్ సాఫ్ట్ వేర్లలో PhotoCD అనే ఆప్షన్ పొందుపరచబడింది. ఈ ఆప్షన్‌ని ఉపయోగించి మనం క్రియేట్ చేస్తున్న సిడికి ఒక ఆల్బం పేరుని ఇచ్చి అందులో పొందుపరచవలసిన ఫోటోల లోకేషన్‌ని స్పెసిపై చేస్తే అవన్నీ ఒక వీడియో ఫైల్‌గా కన్వర్ట్ చెయ్యబడి సిడిలోకి రికార్డ్ అవుతాయి. ఒకవేళ మీరు ఫోటో సిడిగా రూపొందించుకోవాలనుకున్న్ ఐమేజ్‌లకు రకరకాల Transition ఎఫెక్టులు ఇచ్చి చూపరుల్ని ఆశ్చర్యచకితుల్ని చెయ్యాలంటే Photo2VCD అనే సాఫ్ట్ వేర్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అయితే ఎక్కువ ఫోటోలను ఇన్‌పుట్‌గా ఇస్తే వాటిని VCD ఫార్మేట్‌లోకి కన్వర్ట్ చెయ్యడానికి ఈ సాఫ్ట్ వేర్ ఎక్కువ సమయం తీసుకుంటూంది.
2000వ సంవత్సరంలో టివి ట్యూనర్ కార్డ్ కొన్నప్పుడు అందరూ పిసిలో టివి వస్తుందంటే చాలా ఆశ్చర్యంగా చూసేవారు. అప్పట్లో టివిలో ప్రసారం అయ్యే ప్రోగ్రాములను ఎలాగైనా రికార్డ్ చేసుకోవాలని మహా కోరికగా ఉండేది. కార్డ్ తోపాటు ఇచ్చిన సాఫ్ట్ వేర్ లో ఆ వెసులుబాటు ఉన్నా భారీ సైజ్ గల AVI ఫైళ్లుగా సేవ్ చేయడానికి మాత్రమే అవకాశం ఉండడంతో ఎలాగైనా తక్కువ సైజ్ తీసుకునే MPEG ఫార్మేట్ లోకి రికార్డ్ చేసుకునే మార్గం దొరకకపోతుందా అని అన్వేషించడం ప్రారంభించాను. ఆ అన్వేషణలో WinVCR అనే సాఫ్ట్ వేర్ నన్నెంతో ఆకర్షించింది. ఇప్పుడు ఆ సాఫ్ట్ వేర్ తయారీ కంపెనీ దుకాణం మూసేసుకున్నా ఇప్పటికీ ఆ సాఫ్ట్ వేర్ పేరు తలుచుకుంటే ఎంతో హాపీ అనిపిస్తుంది. ఇదంతా ఎందకు చెప్పుకుంటూ వస్తున్నానంటే… సంవత్సరాల తరబడి పిసిలను వాడిన అనుభవం ఉన్నవారు ఖచ్చితంగా ఎప్పుడోకప్పుడు ఏదో ఒక సాఫ్ట్ వేర్, ఏదో ఒక వెర్షన్ పై మోజు పెంచుకుంటారు. అలా మీరూ ఏదైనా పాత సాఫ్ట్ వేర్ ని లైక్ చేసినట్లయితే http://www.old-versions.net/ అనే వెబ్ సైట్లోకి వెళ్లి మీరు అప్పట్లో మెచ్చిన సాఫ్ట్ వేర్ ని వెదికి పట్టుకుని తిరిగి తనివితీరా మీ సిస్టంలో ఇన్ స్టాల్ చేసుకోవచ్చు. కేవలం పాత వెర్షన్ సాఫ్ట్ వేర్ల కోసం ఉద్దేశించబడిన చక్కని సైట్ ఇది.
పిసి యూజర్లకి కంప్యూటర్ పై పనిచేసేటప్పుడు సహజంగా అనేక సందేహాలు వస్తుంటాయి. వాటిని పరిష్కరించడానికి ఎవరైనా నిపుణులు అందుబాటులో ఉంటే చాలా బాగుంటుంది. మనలో చాలామందిమి సాంకేతికంగా చాలా నేర్చుకుని ఉంటున్నాం. కానీ మన నాలెడ్జ్. ఓపిక మొత్తం మన ఉద్యోగాలు చేసుకునేసరికే హరించుకుపోతోంది. సాంకేతికంగా నాలెడ్జ్ ఉన్న వారందరూ ఒకే చోట కలుస్తూ ఒకరికొకరు వారి నాలెడ్జ్ ని షేర్ చేసుకోవడంతో పాటు.. ఎవరికైనా సాంకేతిక సహాయం అవసరం అయితే వారికి తక్షణం సహాయపడగలిగేలా ఓ ప్లాట్ ఫారం తయారు చేద్దామన్న నా తపనకు లేఖిని, కూడలి సృష్టికర్త వీవెన్ గారు.. http://computerera.koodali.org/ అనే లింక్ లో ఓ ఛాట్ రూమ్ ని క్రియేట్ చేసి పెట్టడం ద్వారా సపోర్ట్ గా నిలిచారు. దయచేసి వివిధ రంగాల్లో సాంకేతిక పరిజ్ఞానం ఉన్నవారు ఈ రూమ్ లో తరచూ కొద్ది సమయం గడుపుతూ… తమ నాలెడ్జ్ ని ఇతరులతో షేర్ చేసుకోవడమే కాకుండా ఇతరులకు కూడా సహాయపడగలరు. కంప్యూటర్లో తెలుగు రాకపోవడం, ఫొటోషాప్ లో ఏదో ఒక ఆప్షన్ ఎలా వాడాలో తెలియకపోవడం వంటి ఏ సందేహాలనైనా ఈ ఛాట్ రూమ్ లో అడగవచ్చు. మీరు అడిగిన అంశంపై ఎవరికైనా అవగాహన, తగిన సమయం ఉంటే తప్పక మీకు సహాయపడతారు. మనందరం మన సేవ, అభిమానాల ద్వారా మనకు మధ్య బలమైన అనుబంధాలను పెంచుకుంటూ మంచి సమాజాన్ని నిర్మించడానికి ఇది దోహదపడుతుంది. ఒక్కసారి మనం వివిధ రూపాల్లో ఎంత సమయం వృధా చేస్తున్నామో ఆలోచించండి. కొద్దిపాటి సమయం మన వారి కోసం వెచ్చిస్తే ఎంత సంతృప్తి కలుగుతుంది? అలాగే వీలైనంత వరకూ లేఖిని, బరహ, ఇన్ స్ర్కిప్ట్ వంటి పద్ధతులను అనుసరించడం ద్వారా ఈ ఛాట్ రూము లో తెలుగులోనే మాట్లాడుకుందాం. ఒకవేళ వాటిని ఎలా వాడాలో మీకు తెలియకపోతే ఇక్కడే అడగండి, ఎవరో ఒకరం సహాయపడతాం. అలాగే దయచేసి సహాయం అందించదలుచుకున్న వారూ, సహాయం కోరేవారూ ప్రతీ ఒక్కరూ http://www.teamviewer.com/download/TeamViewer_Setup.exe అనే సైట్ లో లభించే టీమ్ వ్యూయర్ అనే సాఫ్ట్ వేర్ ని మీ కంప్యూటర్లో ఇన్ స్టాల్ చేసుకుంటే.. మరింత సులువుగా మీ అనుమతితో మీ కంప్యూటర్లోకి ప్రవేశించి మీకు సహాయపడడానికి అవకాశం ఉంటుంది. పని పూర్తయ్యాక మీ డెస్క్ టాప్ కి సపోర్ట్ ఇచ్చేవారు తీసుకున్న కనెక్షన్ ని నిలిపివేయవచ్చు. ఓ మంచి నాలెడ్జబుల్ సొసైటీ కోసం ఎలాంటి వెనుకా ముందూ ఆలోచనలు లేకుండా అన్ని రంగాల్లో ఉన్నవారూ ముందుకు రాగలరు. అలాగే గతంలో “సేవకు రెడీనా” అనే పోస్టులో ఇతరులకు సాయపడడానికి ముందుకు వచ్చి తమ వివరాలు, తాము అందుబాటులో ఉండే సమయాలు వెల్లడించిన వారు వీలైనంత వరకూ ఈ ఛాట్ రూములో మీరు ప్రకటించిన సమయాల్లో అందుబాటులో ఉండగలరు.
VCDల్లో ఉన్న DAT, MPEG ఫైళ్ళను, AVI, WMV, ASF, ఫార్మేట్లలో ఉన్న వీడియో ఫైళ్ళను నేరుగా DiVX, AVI/MPEG4, WMV V7/V8 ఫార్మేట్లకు కన్వర్ట్ చెయ్యడానికి ఉపయోగపడే సాఫ్ట్ వేరే MPEG 4 Direct Maker. ఈ సాఫ్ట్ వేర్ ద్వారా 250 Kbps VHS క్వాలిటీ వీడియో క్లిప్‌లను, 500Kbps డివిడి క్వాలిటీ క్లిప్‌లను ఎన్‌కోడ్ చేసుకోవచ్చు. అలాగే విసిడిలను నేరుగా DivX ఫార్మేట్లలోకి మార్పిడి చేసుకోవచ్చు.
1996వ సంవత్సరంలో తెలుగులో మొట్టమొదట కంప్యూటర్ సాహిత్యాన్ని ప్రారంభించే అవకాశం నాకు కలిగింది. అదే సమయంలో చెన్నైలో సూపర్ హిట్ తెలుగు ఫిల్మ్ మేగజైన్ కి సబ్ ఎడిటర్ గా కూడా ఏకకాలంలో పనిచేస్తూ 1998 వరకూ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, మనీషా కొయిరాలా, శంకర్, రజనీకాంత్, కమల్ హాసన్ వంటి ప్రముఖులెందరినో ఇంటర్వ్యూలు చేయడం మర్చిపోలేని అనుభవం. అయితే సినిమా రంగంలో ఉన్న అనారోగ్యకరమైన వాతావరణం వల్ల నాకంటూ ఓ ప్రత్యేకమైన ఉనికిని సృష్టించుకోవడం కోసం సినిమా రంగం నుండి బయటకు వచ్చి పూర్తిగా టెక్నాలజీ రంగంలో స్థిరపడడం జరిగింది. 96 నుండి 2001 వరకూ పలు కంప్యూటర్ పత్రికలకు ఎడిటర్ గా పనిచేసి.. 2001 నుండి "కంప్యూటర్ ఎరా" తెలుగు మంత్లీ మేగజైన్ ఎడిటర్ గా పత్రిక మొత్తాన్నీ రూపొందిస్తూ ఉన్నాను. అలాగే తెలుగు టెలివిజన్ ఛానెళ్లలో మొట్టమొదటి టెక్నికల్ phone-in ప్రోగ్రామ్ కి గెస్ట్ గా అటెండ్ అయ్యే అవకాశమూ 2010 జనవరి 20న కలిగింది. అప్పటి నుండి ఇప్పటివరకూ TV 9, ABN, I News, ETV2, NTV, Zee 24 గంటలు, Studio N, సాక్షి టివి, మహా టివి, జాగృతి న్యూస్ వంటి ఛానెళ్లలో 100కి పైగా లైవ్, రికార్డెడ్ ప్రోగ్రాముల్ని చేయడం జరిగింది. 2007లో అత్యుత్తమైన నాణ్యతతో కూడిన పోస్టులతో, వీడియోలతో తెలుగులో మొదటి ప్రొఫెషనల్ టెక్నికల్ బ్లాగ్ గానూ, మొదటి వీడియో బ్లాగ్ గానూ ఇప్పుడు మీరు చూస్తున్న బ్లాగ్ ప్రత్యేకతను సంతరించుకుంది. అలాగే 2007 జనవరి 1న ప్రారంభించిన తెలుగులోనే మొట్టమొదటి టెక్నికల్ ఫోరమ్ అయిన "కంప్యూటర్ ఎరా సాంకేతిక ఫోరమ్" 14 వేల మంది సభ్యులతో 10 వేలకు పైగా పోస్టులతో 2009 జూలై వరకూ నిర్వహించబడింది. దాంతోపాటే మొట్టమొదటి తెలుగు టెక్నికల్ ఛాట్ రూమ్ అయిన "కంప్యూటర్ ఎరా సాంకేతిక సహాయం" అనే ఛాట్ రూమ్ రెండేళ్లలో వేలాది మందికి తెలుగు టైప్ చేయడం మొదలుకుని అనేక కంప్యూటర్ సంబంధిత సాంకేతిక సమస్యలకు తక్షణ సహాయం అందించింది. ఇకపోతే http://youtube.com/nallamothu అనే ఛానెల్ లో 361కి పైగా ప్రొఫెషనల్ క్వాలిటీ తెలుగు టెక్నికల్ వీడియోలు అందించాను. ఈ ఛానెల్ కి 1704 మంది సబ్ స్కైబర్లు ఉన్నారు. అందుబాటులో ఉన్న వివిధ మార్గాల ద్వారా తెలుగు వారందరకీ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించే పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాను.
My Contact Number: 9000239948
Mail ID: sridharcera@gmail.com
90% మంది స్టూడెంట్స్ దగ్గర పిసి గానీ, లాప్ టాప్ గానీ ఉంటోంది. ఇంజనీరింగ్ చదువులంటే కంప్యూటర్ తప్పదన్నది కాలేజీల, విద్యార్థుల, తల్లిదండ్రుల ఏకాభిప్రాయం. దాంతో అప్పో సొప్పో చేసి.. "కాస్త మా వాడి కోసం మంచి లాప్ టాప్ చెప్పండి" అంటూ నాబోటి, మీబోటి వారిని ఆరా తీసి మరీ తల్లిదండ్రులు ఉన్న ఫళాన కొనిపించేస్తుంటారు. అప్పటి వరకూ ఫ్రెండ్స్ రూమ్ ల్లో లాప్ టాపుల్లో అందరూ గ్రూప్ గా సినిమాలు చూసేవారు కాస్తా పెన్ [...]
http://bit.ly/srisites ఎక్కడో అమెరికాలో ఉన్న ఫేస్ బుక్ సైట్ ఇండియాలో అంత వేగంగా ఎలా ఓపెన్ అవగలుగుతోంది? అలాగే UK సర్వర్ లో ఉన్న నా nallamothusridhar.com వెబ్ సైట్ ఇండియాలో ఉన్న మనకు క్షణాల్లో ఎలా కన్పిస్తోంది? వీటన్నింటి గురించి మనం ఆలోచించం.. మనకు తెలియకుండానే టెక్నికల్ గా ఎన్నో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ప్రపంచంలో ఏ మూలన ఉన్న వారికైనా ఒకే వేగంతో వెబ్ సైట్లు ఓపెన్ అవగలుగుతున్నాయంటే దాని వెనుక ఓ అద్భుతమైన టెక్నాలజీ [...]
మనం టివిలో చూసే సినిమాలు కావచ్చు, కంప్యూటర్ మోనిటర్ లో కావచ్చు.. హై డెఫినిషన్ అంటే 720p వీడియో క్వాలిటీనే అని భావిస్తున్నారు ఇప్పటికీ చాలామంది! మరికొందరైతే 720×576 pixles రిజల్యూషన్ ఉన్న డివిడి క్వాలిటీ DTH ప్రసారాలనే Airtel, Reliance Big TV వంటి సర్వీసుల ద్వారా పొందుతూ అదే గొప్ప క్వాలిటీ అని భావిస్తున్నారు. ఆయా DTH సర్వీసులు HD సెట్ టాప్ బాక్స్ ల ద్వారా కొన్ని HD ఛానెళ్లని ప్రసారం చేస్తున్నా [...]
ఒక సినిమా ఒక షో ప్రదర్శించినందుకు ఒక్కో థియేటర్ కి అయ్యే ఖర్చు రూ. 350 మాత్రమే అంటే నమ్ముతారా? పొలిటీషియన్లు, సినిమా నటులు తమ హోమ్ థియేటర్ లలో రిలీజ్ సినిమాల్ని ఒరిజినల్ థియేటర్ ఫీల్ లో చూడడానికి ఒక్కో షోకి రూ. 20వేల వరకూ ఖర్చు పెడుతున్నారన్నదీ నమ్మశక్యం కావట్లేదు కదూ..! ఒక సినిమా ఎలా డిజిటలైజ్ అవుతుందీ, అన్ని థియేటర్లకీ ఎలా పంపించబడుతుంది, సినిమా థియేటర్లని డిజిటలైజ్ చేయడానికి ఎంత ఖర్చుపెట్టాలి.. షో [...]
సమ్మర్ హాలిడేస్ లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు నేరుగా ఆండ్రాయిడ్ ఫోన్ నుండే ప్రైవేట్ బస్ టికెట్లని బుక్ చేసుకునే సదుపాయం redbus.in వెబ్ సైట్ యొక్క మొబైల్ అప్లికేషన్ ద్వారా లభిస్తోంది. దీన్ని మీ ఫోన్ / టాబ్లెట్ లో Google Play నుండి డౌన్ లోడ్ చేసుకుని ఇన్ స్టాల్ చేసుకోవచ్చు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల ఎంపిక, ప్రయాణ తేదీ, ప్రయాణీకుల సంఖ్య, ఎక్కడ ఎక్కుతారు వంటి వివరాలు ఎంచుకున్న తర్వాత ఇంటర్నెట్ బ్యాంకింగ్, [...]
2000 నాటి మాట.. నా కొత్త అసెంబుల్డ్ కంప్యూటర్లో 4GB హార్ట్ డిస్క్ కొనడానికి అయిన ఖర్చు రూ. 3,500. 2011 ఏప్రిల్ నాటి మాట.. 1TB (1000GB) ఎక్స్ టర్నల్ Western Digital హార్డ్ డిస్క్ కొనడానికి నాకు అయిన ఖర్చు రూ. 3,500 ఇప్పటి ఏప్రిల్ 2012 నాటి మాట.. అదే 1TB హార్డ్ డిస్క్ ధర రూ. 6,900 ఈ మూడు ధరలు ఇంత ప్రత్యేకంగా చెప్పడానికి ఓ కారణముంది. 12 సంవత్సరాల [...]
http://bit.ly/sriapplebattery iPhone అనే పేరు మీద ఉన్న మోజు కొద్దీ అనేకమంది రకరకాల మోడళ్లని కొంటున్నారు. iPhoneలో బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ రావాలంటే ఓ చిన్న టెక్నిక్ పనికొస్తుంది. అదేంటో ఈ వీడియోలో ఏపిల్ సంస్థ లేటెస్ట్ మోడల్ అయిన నా iPhone 4Sలో చూపిస్తున్నాను. ఈ ఒక్క సెట్టింగ్ చాలావరకూ బ్యాటరీని కాపాడుతుంది. http://bit.ly/sriapplebattery మీ వెబ్ సైట్ లోనూ, బ్లాగ్ లోనూ మీకు ఈ వీడియో నచ్చితే రీపబ్లిష్ చేసుకోవచ్చు. మీ బ్లాగ్ లో [...]
ఫేస్ బుక్ యూజర్లని ఇబ్బందులకు గురిచేస్తున్న వైరస్ లను దృష్టిలో ఉంచుకుని Facebook సంస్థ Microsoft, McAfee, Trend Micro, Sophos, Symantec వంటి వివిధ ప్రముఖ సంస్థలకు చెందిన ఏంటీవైరస్ ఉత్పత్తులను తన ఫేస్ బుక్ యూజర్లకి ఉచితంగా అందిస్తోంది. అందుబాటులో ఉన్న వాటిలో ఏదో ఒక ఏంటీవైరస్ ని మాత్రమే మనం ఎంచుకోవాలి. వీటిలో Microsoft Security Essentials, Sophos Anti-Virusలు రెండూ పూర్తిగా శాశ్వతంగా ఉచిత ఉత్పత్తులు. McAfee Internet [...]
Google Drive ఆన్ లైన్ లో ఉచితంగా 5GB వరకూ ఫైళ్లని సేవ్ చేసుకునే సదుపాయాలు కల్పిస్తూ https://drive.google.com/ అనే లింక్ లో అందుబాటులోకి వచ్చింది. సద్వినియోగం చేసుకోవచ్చు. ఈ క్రింది చిత్రంలో Google Driveని వాడుతుండగా నా పిసిలోని System Tray ఐకాన్ వద్ద లభిస్తున్న ఆప్షన్లని చూడొచ్చు.
ఇక్కడ RSS Feedకి Subscribe చేసి నేరుగా పోస్ట్ లు పొందండి
నా వీడియోలను మీ దగ్గర ఉన్న Android ఫోన్ లో పొందాలంటే ఈ క్రింది లింక్ ని మీ ఫోన్ బ్రౌజర్ లో ఓపెన్ చేసి వెంటనే వచ్చే అప్లికేషన్ ని ఇన్ స్టాల్ చేసుకోండి. అన్ని వీడియోలూ ఎంజాయ్ చేయండి.
http://goo.gl/DqsA4
లేదా ఈ క్రింది QR Codeని మీ Android ఫోన్ లోని Barcode Scannerతో స్కాన్ చేస్తే నేరుగా అప్లికేషన్ డౌన్ లోడ్ పేజీకి వెళ్లవచ్చు.
Recent Comments:
kvsv: రీయంబార్స్మెంట్ పేరుతో గవర్నమెంట్ సొమ్ములు కడుతూంది గాబట్టి ...ఈ కాలేజీల్లో చేరుతున్నరు తప్పా...ఈ పర్టికులర్ సబ్జె క్ట్ లో ఇన్ట్రెస్ట్ ఉండికాదు...రీయం...
basu: reservation la bharatam lo udyogam techukuntunnaru santoshinchandi....
తాడిగడప శ్యామలరావు: శ్రీధర్
మీ ఆవేదన అక్షరాలా ప్రస్తుతస్థితిని ప్రతిబింబిస్తోది.
మా రోజుల్లో నన్నయ వచ్చివ్రాస్తే కూడా నూటికి 40 మార్కులు వచ్చేవికావు తెలుగులో. ఇప్పుడు అ...
srujana: we are waiting for ur review on this fone.....
prabhakar: శ్రీధర్ గారు,
నేను నోకియా 2600 క్లాస...