Home » Uncategorized » Currently Reading:

ఇప్పటివరకూ 500 పోస్టులు!

October 24, 2008 Uncategorized 19 Comments

బ్లాగు మిత్రులందరికీ నమస్కారాలు. చాలా కాజువల్ గా జూలై 9, 2007న ప్రారంభించిన “సాంకేతికాలు” బ్లాగులో ఈరోజుకి 500 పోస్టులు పూర్తయ్యాయి. కొత్త పోస్ట్ చేద్దామని Dashboard ఓపెన్ చేస్తే ఈరోజు ఉదయం రాసినది 500వ పోస్టు అని అర్థమైంది. అందుకే ఈ సంతోషాన్ని మిత్రులతో పంచుకుందామని ఈ 501వ టపా రాస్తున్నాను. నిరంతరం ఈ బ్లాగుని ఆదరిస్తున్న మిత్రులందరికీ ధన్యవాదాలు. సాంకేతికాలు బ్లాగుని ఎంతమంది చూస్తున్నారో (గణాంకాల ప్రకారం సంఖ్య తెలుస్తున్నా), ఎంతమందికి ఉపయోగపడుతోందో అన్న సందేహం అప్పుడప్పుడు తలెత్తుతున్నా, ఇతర సామాజిక అంశాల బ్లాగుల మాదిరిగా కామెంట్ల ప్రోత్సాహకాలు తక్కువే అయినా నేను రాసే ఈ పోస్టులు ఎవరో ఒకరికి ఎప్పుడోసారి ఉపయోగపడితే చాలు అన్న ఉద్దేశంతో పోస్టులు చేసుకుంటూ వెళ్లడం జరుగుతోంది. ఈ బ్లాగు నిర్వహణలో తన పూర్తి సహాయసహకారాలు అందిస్తున్న జ్యోతక్కకు హృదయపూర్వక ధన్యవాదాలు. రోజుల వారీ ఇప్పుడే లెక్కపెడితే బ్లాగు ప్రారంభించి ఇప్పటికి 465 రోజులైంది, 500 టపాలు రాయడం జరిగింది. బ్లాగు ప్రారంభించినప్పటి నుండి ఇంతవరకూ 60,541 విజిట్స్, లక్షా మూడు వేల చిల్లర pageviews నమోదయ్యాయి. ఇదీ స్థూలంగా ఇప్పటివరకూ “సాంకేతికాలు” బ్లాగు ప్రస్థానం. ఆదరించిన అందరికీ మరోమారు ధన్యవాదాలు తెలుపుకుంటూ…

- నల్లమోతు శ్రీధర్

Currently there are "19 comments" on this Article:

  1. aravindps says:

    Congrats!On your 500th Blog Post
    Keep the ball rolling
    All the Best.

  2. vijayamohan says:

    త్వరలోనే సహస్రం చేరుకొవాలని కోరుకుంటూ…

  3. vydeek says:

    అభినందనలు. మీ ప్రస్ధానం ఇదే విధంగా కొనసాగాలని కోరుకుంటున్నాను. ఆ పేజివ్యూలె చెబుతున్నాయి ఈ బ్లాగు ఎంత ప్రముఖమైనదొ. ఇన్ని పోస్ట్లు చేసిన మీ కమిట్మెంట్ కి హేట్సాఫ్ అండి.

  4. varma says:

    ఇలాగే ఒక్కో మెట్టు ఎక్కుతూ ఉన్నత శిఖరాలను చేరుకోవాలని మనసారా కోరుకుంటున్నాము …..

  5. శుభాకాంక్షలు :)

  6. రాజేంద్ర కుమార్ దేవరపల్లి says:

    శ్రీధర్ గారు,మామూలుగా ఐదువందల టపాలంటే నాలాంటి వాళ్ళూ రాయగలరు,మీరు రాస్తుంది అత్యంతపొడిబారిన (డ్రై)అంశాలు,అదీ చదివి,సారాంశం జీర్ణించుకుని,పాఠక మహాశయులకు ఏమేరకు ఉపయోగపడుతుందీ అన్న విచికిత్సకు గురై,ఇది తప్పనిసరిగా అందరికీ పనికొస్తుంది అన్న విచక్షణతో అంతకు మించి సులభమైన పదజాలంతో మాకు అందజెస్తున్నారు చూడండి,అక్కడా ..మీకూ.. నాలాంటి వాళ్ళకూ మధ్యనున్న వ్యత్యాసం తెలిసేది.

    ఇహ కామెంట్సంటారా వాటి గురించి పట్టించుకునే స్థితిలో మీరు లేరు,ఆ అవసరమూ మీకు లేదు, పైగా బ్లాగు ఒక్కటి రాస్తూ కూచో లేరుకదా మీరు?మీకు మీ స్నేహబృందానికీ నా మనఃపూర్వక అభినందనలు

  7. nallamothusridhar says:

    అరవింద్ గారు, విజయామోహన్ గారు, vydeek గారు, వర్మ గారు, శివ బండారు గారు, నాగప్రసాద్ గారు, దేవరపల్లి రాజేంద్ర గారు మీ ప్రోత్సాహకరమైన మాటలతో మరింత ఉత్సాహం నింపినందుకు ధన్యవాదాలు.

  8. ramani says:

    అభినందనలు శ్రీధర్ గారు.

  9. varudhinit says:

    అభినందనలు.

  10. M. Srinivas Gupta says:

    Guruvu Gaaru, First I am congratulating of 500th post and achieving thousands of fans like me. We are not measuring quantity, you are providing best quality in your articles which are more than “Quantity”.

  11. మీకు నా అభినందనలు శ్రీధర్ గారు. మీ బ్లాగు ప్రస్థానం ఇలాగే కొనసాగాలి.

    మీ బ్లాగు ఆరెసెస్ ఫీడుకి ఇరవై ఎనిమిది వేల మందికి పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారంటేనే దానికున్న ఆదరణ తెలుస్తుంది.

  12. nallamothusridhar says:

    ప్రతాప్ గారు, రమణి గారు, వరూధిని గారు ధన్యవాదాలండీ. శ్రీనివాస్ గుప్త గారు “గురువు గారు” అంటూ ఆత్మీయంగా పలకరిస్తూ తరచూ మీరు చేసే కామెంట్లు ఉత్సాహాన్నిస్తున్నాయి. ప్రవీణ్ గార్లపాటి గారు, నేను బ్లాగుల్లోకి రాకముందు ఎక్కడో మీ పోస్ట్ చూసే “ఈయన ఎవరబ్బా అప్పుడే నెట్ లో తెలుగులో టెక్నాలజీ రాసేవారున్నారు, మనమూ రాయాలి” అనుకున్న సందర్భం ఉందండీ. నిన్న ఈనాడులో మీ బ్లాగు సమీక్ష రావడం చాలా హాపీ అన్పించింది. మీ సపోర్ట్ కి ధన్యవాదాలు.

  13. కొత్తపాళీ says:

    అభినందనలు!

  14. venkat says:

    Congrats sridhar garu meeru marinni manchi postlu rayalani korukuntu,sorry for late response

  15. Sudhakar Reddy,S. says:

    Congratulations for achieving the 500 mark. Wish u post many more useful tech info.
    Posting in English because I don’t know how to post in Telugu here. (I know how to use Lekhini but don’t know how to use it to post in Telugu here).
    Want to see the entire list of ur posts (first time I am seeing ur posts). How to get the list?

  16. shaik says:

    Thanq Sridhargaru, we need your support every time.

Search This Site:

About Me

1996వ సంవత్సరంలో తెలుగులో మొట్టమొదట కంప్యూటర్ సాహిత్యాన్ని ప్రారంభించే అవకాశం నాకు కలిగింది. అదే సమయంలో చెన్నైలో సూపర్ హిట్ తెలుగు ఫిల్మ్ మేగజైన్ కి సబ్ ఎడిటర్ గా కూడా ఏకకాలంలో పనిచేస్తూ 1998 వరకూ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, మనీషా కొయిరాలా, శంకర్, రజనీకాంత్, కమల్ హాసన్ వంటి ప్రముఖులెందరినో ఇంటర్వ్యూలు చేయడం మర్చిపోలేని అనుభవం. అయితే సినిమా రంగంలో ఉన్న అనారోగ్యకరమైన వాతావరణం వల్ల నాకంటూ ఓ ప్రత్యేకమైన ఉనికిని సృష్టించుకోవడం కోసం సినిమా రంగం నుండి బయటకు వచ్చి పూర్తిగా టెక్నాలజీ రంగంలో స్థిరపడడం జరిగింది. 96 నుండి 2001 వరకూ పలు కంప్యూటర్ పత్రికలకు ఎడిటర్ గా పనిచేసి.. 2001 నుండి "కంప్యూటర్ ఎరా" తెలుగు మంత్లీ మేగజైన్ ఎడిటర్ గా పత్రిక మొత్తాన్నీ రూపొందిస్తూ ఉన్నాను. అలాగే తెలుగు టెలివిజన్ ఛానెళ్లలో మొట్టమొదటి టెక్నికల్ phone-in ప్రోగ్రామ్ కి గెస్ట్ గా అటెండ్ అయ్యే అవకాశమూ 2010 జనవరి 20న కలిగింది. అప్పటి నుండి ఇప్పటివరకూ TV 9, ABN, I News, ETV2, NTV, Zee 24 గంటలు, Studio N, సాక్షి టివి, మహా టివి, జాగృతి న్యూస్ వంటి ఛానెళ్లలో 100కి పైగా లైవ్, రికార్డెడ్ ప్రోగ్రాముల్ని చేయడం జరిగింది. 2007లో అత్యుత్తమైన నాణ్యతతో కూడిన పోస్టులతో, వీడియోలతో తెలుగులో మొదటి ప్రొఫెషనల్ టెక్నికల్ బ్లాగ్ గానూ, మొదటి వీడియో బ్లాగ్ గానూ ఇప్పుడు మీరు చూస్తున్న బ్లాగ్ ప్రత్యేకతను సంతరించుకుంది. అలాగే 2007 జనవరి 1న ప్రారంభించిన తెలుగులోనే మొట్టమొదటి టెక్నికల్ ఫోరమ్ అయిన "కంప్యూటర్ ఎరా సాంకేతిక ఫోరమ్" 14 వేల మంది సభ్యులతో 10 వేలకు పైగా పోస్టులతో 2009 జూలై వరకూ నిర్వహించబడింది. దాంతోపాటే మొట్టమొదటి తెలుగు టెక్నికల్ ఛాట్ రూమ్ అయిన "కంప్యూటర్ ఎరా సాంకేతిక సహాయం" అనే ఛాట్ రూమ్ రెండేళ్లలో వేలాది మందికి తెలుగు టైప్ చేయడం మొదలుకుని అనేక కంప్యూటర్ సంబంధిత సాంకేతిక సమస్యలకు తక్షణ సహాయం అందించింది. ఇకపోతే http://youtube.com/nallamothu అనే ఛానెల్ లో 361కి పైగా ప్రొఫెషనల్ క్వాలిటీ తెలుగు టెక్నికల్ వీడియోలు అందించాను. ఈ ఛానెల్ కి 1704 మంది సబ్ స్కైబర్లు ఉన్నారు. అందుబాటులో ఉన్న వివిధ మార్గాల ద్వారా తెలుగు వారందరకీ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించే పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాను. My Contact Number: 9000239948 Mail ID: sridharcera@gmail.com

Comment on this Article:







ఇక్కడ RSS Feedకి Subscribe చేసి నేరుగా పోస్ట్ లు పొందండి

ఆండ్రాయిడ్ లో పొందండి!

నా వీడియోలను మీ దగ్గర ఉన్న Android ఫోన్ లో పొందాలంటే ఈ క్రింది లింక్ ని మీ ఫోన్ బ్రౌజర్ లో ఓపెన్ చేసి వెంటనే వచ్చే అప్లికేషన్ ని ఇన్ స్టాల్ చేసుకోండి. అన్ని వీడియోలూ ఎంజాయ్ చేయండి. http://goo.gl/DqsA4

లేదా ఈ క్రింది QR Codeని మీ Android ఫోన్ లోని Barcode Scannerతో స్కాన్ చేస్తే నేరుగా అప్లికేషన్ డౌన్ లోడ్ పేజీకి వెళ్లవచ్చు. Image and video hosting by TinyPic