Home » Uncategorized » Currently Reading:

కొత్త పాళీ గారికి జన్మదిన శుభాకాంక్షలు

October 28, 2008 Uncategorized 25 Comments

కొందరు వ్యక్తులను తలుచుకుంటే ఎనలేని గౌరవం మనసులో నిండిపోతుంది. వారి వ్యక్తిత్వంలోని ఉన్నత భావాలు, జిజ్ఞాస, కష్టించి పనిచేసే స్వభావం వంటివి వారి చుట్టూ ఓ ఆకర్షణావలయం సృష్టిస్తాయేమోననిపిస్తుంది. అలాంటి మహోన్నత వ్యక్తిత్వం కలిగి, తెలుగు బ్లాగ్లోకంలో తనకంటూ ఓ ప్రత్యేకమైన ముద్రని వేసుకున్న బ్లాగరి “కొత్తపాళీ”గా అందరికీ చిరపరిచితులైన ఎస్. నారాయణస్వామి గారు. జీవితాన్ని విభిన్న కోణాల్లో స్పృశిస్తూ, ఆయా అనుభవాలను మదిలో ప్రోది చేసుకుంటూ ఎంతో ఉత్సాహంగా ఆయన సాగించే ప్రయాణాన్ని చూసి ఏకలవ్య శిష్యుల్లా అనుసరించబుద్ధి అవుతుంది. స్వతహాగా మృధుస్వభావి అయిన కొత్తపాళీ గారిలో పట్టుదల, కష్టించి పనిచేసే నైజం, సమాజం పట్ల ఆయన కనబరిచే బాధ్యత, వెన్నుతట్టి ప్రోత్సహించే మంచితనం వంటి ఎన్నో లక్షణాలు ఎంతోమందిని ఆయనకు సన్నిహితులను చేస్తాయి. అలాంటి మహోన్నత వ్యక్తికి “కంప్యూటర్ ఎరా” సాంకేతిక సహాయం మిత్రబృందం తరఫున, బ్లాగు మిత్రుల తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇలాంటి ఎన్నో పుట్టినరోజులు సుఖసంతోషాలతో ఆయన జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నాం. కొత్తపాళీ గారిపై ఉన్న అభిమానంతో ప్రత్యేకంగా ఏనిమేషన్ ని తయారుచేసిన మిత్రులు జీవి (గోపాల్ వీరనాల) గారికి, చిలకపాటి శివరామప్రసాద్ గారికి ధన్యవాదాలు. స్వతహాగా తన పనేదో తాను సిన్సియర్ గా చేసుకువెళ్లే గురుతుల్యుడు కొత్తపాళీ గారికి ఇలాంటివి నచ్చవు అని తెలిసినా మా సంతోషం కోసం మేము తెలియజేస్తున్న శుభాకాంక్షలు. మా కోసమైనా మా అభిమానాన్ని స్వీకరించమని మనవి.

Currently there are "25 comments" on this Article:

  1. bhavani says:

    ముందుగా కొత్తపాళిగారికి జన్మదిన శుభాకాంక్షలు.
    మీరు రాసిన దానితో నేను 100% అంగీకరిస్తాను.
    ఆయనంటే నాకు చాలా గౌరవం.

  2. malathini says:

    కొత్తపాళీ, జన్మదిన శుభాకాంక్షలు.
    - మాలతి

  3. కొత్త పాళీ గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు….

  4. ramani says:

    మళ్ళీ మళ్ళీ రావాలి ఈరోజు.
    కొత్తపాళీ గారికి మా ప్రమదల తరపున కూడా జన్మదిన శుభాకాంక్షలు.

  5. నా తరఫునకూడా కొత్తపాళి గారికి జన్మదిన శుభాకాంక్షలు.

  6. Purnima says:

    గురువు గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు

  7. జన్మదిన శుభాకాంక్షలు కొత్తపాళి గారు.

  8. chavakiran says:

    HBD!
    HBD!!

  9. గురువుగారికి పుట్టిరోజు శుభాకాంక్షలు :-)

  10. కల says:

    Wish you a happy birthday sir.
    Have a nice day.

  11. lalita says:

    ఇప్పుడే ప్రమదావనం లో తెలిసింది.
    కొత్తపాళీ గారికి పుట్టినరోజు సుభాకంక్షలు.
    జ్యొతిగారి బ్లాగులో కేకు వారికే ఆన్నమాట!

  12. గురువుగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు..

    లలిత.. ఆ కేకు నా ఫ్రెండ్ కోసం పెట్టుకున్నాను. కొత్తపాళీగారు గురువుగారు కదా. అయనకు కాదులే అది.ఏంటో కూడలికి జబ్బు చేసింది పండగ పూట.

  13. కొత్తపాళీ says:

    OMG OMG
    This is too much.
    ఏం చెప్పాలో నోట మాట రావడం లేదు. వినమ్రంగా తల వంచుతున్నాను,

  14. teresa says:

    Many happy returns ;)

  15. కొత్తపాళీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు.

    ఈ రోజు తెలుగు బ్లాగ్లోకానికి శుభదినం, ఈ రోజు మళ్ళీ మళ్ళీ రావాలిని ఆశిస్తూ…

    మరమరాలు

  16. లచ్చిమి says:

    కొత్తపాళీ గారికి జన్మదిన శుభాకాంక్షలు

  17. జన్మదిన శుభాకాంక్షలు కొత్తపాళీ గారికి. మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ…

  18. నియంత says:

    గురుతుల్యులకు జన్మదిన శుభాకాంక్షలు…

  19. కొత్త పాళీ గారికి జన్మదిన శుభాకాంక్షలు.
    అందరి ఆకాంక్షలు తెలిసి, ఇలాంటి అవకాశం కల్పించిన శ్రీధర్ గారికి నెనరులు.మీ టపా ఎంతైనా అభినందనీయం!

  20. కొత్త పాళీ గారు మీకు జన్మ దిన శుభాకాంక్షలు.
    ఈ అద్భుత మూర్తి గురించి, మరిన్ని వివరాలందించినందుకు శ్రీధర్ గారు ధన్యవాదాలు.

  21. మోహన says:

    కొత్త పాళీ గారు..జన్మ దిన శుభాకాంక్షలు.

    @శ్రీధర్
    Thank you.

  22. రవి says:

    కొత్తపాళీ గారు, బ్లాగ్లోకానికి అజాత శతృవు., ఆత్మబంధువూనూ. ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

  23. కొత్త పాళీ గారు..జన్మ దిన శుభాకాంక్షలు.

  24. రాయలవారికి నావైపు నుంచి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

    (సాధారణంగా నేను ఎవరికీ ఏ సందర్భంగాను శుభాకాంక్షలు చెప్పను. కానీ రాయలవారు వేఱు)

  25. haridevana says:

    కొత్తపాళీ గారికి జన్మ దిన శుభాకాంక్షలు

Search This Site:

About Me

1996వ సంవత్సరంలో తెలుగులో మొట్టమొదట కంప్యూటర్ సాహిత్యాన్ని ప్రారంభించే అవకాశం నాకు కలిగింది. అదే సమయంలో చెన్నైలో సూపర్ హిట్ తెలుగు ఫిల్మ్ మేగజైన్ కి సబ్ ఎడిటర్ గా కూడా ఏకకాలంలో పనిచేస్తూ 1998 వరకూ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, మనీషా కొయిరాలా, శంకర్, రజనీకాంత్, కమల్ హాసన్ వంటి ప్రముఖులెందరినో ఇంటర్వ్యూలు చేయడం మర్చిపోలేని అనుభవం. అయితే సినిమా రంగంలో ఉన్న అనారోగ్యకరమైన వాతావరణం వల్ల నాకంటూ ఓ ప్రత్యేకమైన ఉనికిని సృష్టించుకోవడం కోసం సినిమా రంగం నుండి బయటకు వచ్చి పూర్తిగా టెక్నాలజీ రంగంలో స్థిరపడడం జరిగింది. 96 నుండి 2001 వరకూ పలు కంప్యూటర్ పత్రికలకు ఎడిటర్ గా పనిచేసి.. 2001 నుండి "కంప్యూటర్ ఎరా" తెలుగు మంత్లీ మేగజైన్ ఎడిటర్ గా పత్రిక మొత్తాన్నీ రూపొందిస్తూ ఉన్నాను. అలాగే తెలుగు టెలివిజన్ ఛానెళ్లలో మొట్టమొదటి టెక్నికల్ phone-in ప్రోగ్రామ్ కి గెస్ట్ గా అటెండ్ అయ్యే అవకాశమూ 2010 జనవరి 20న కలిగింది. అప్పటి నుండి ఇప్పటివరకూ TV 9, ABN, I News, ETV2, NTV, Zee 24 గంటలు, Studio N, సాక్షి టివి, మహా టివి, జాగృతి న్యూస్ వంటి ఛానెళ్లలో 100కి పైగా లైవ్, రికార్డెడ్ ప్రోగ్రాముల్ని చేయడం జరిగింది. 2007లో అత్యుత్తమైన నాణ్యతతో కూడిన పోస్టులతో, వీడియోలతో తెలుగులో మొదటి ప్రొఫెషనల్ టెక్నికల్ బ్లాగ్ గానూ, మొదటి వీడియో బ్లాగ్ గానూ ఇప్పుడు మీరు చూస్తున్న బ్లాగ్ ప్రత్యేకతను సంతరించుకుంది. అలాగే 2007 జనవరి 1న ప్రారంభించిన తెలుగులోనే మొట్టమొదటి టెక్నికల్ ఫోరమ్ అయిన "కంప్యూటర్ ఎరా సాంకేతిక ఫోరమ్" 14 వేల మంది సభ్యులతో 10 వేలకు పైగా పోస్టులతో 2009 జూలై వరకూ నిర్వహించబడింది. దాంతోపాటే మొట్టమొదటి తెలుగు టెక్నికల్ ఛాట్ రూమ్ అయిన "కంప్యూటర్ ఎరా సాంకేతిక సహాయం" అనే ఛాట్ రూమ్ రెండేళ్లలో వేలాది మందికి తెలుగు టైప్ చేయడం మొదలుకుని అనేక కంప్యూటర్ సంబంధిత సాంకేతిక సమస్యలకు తక్షణ సహాయం అందించింది. ఇకపోతే http://youtube.com/nallamothu అనే ఛానెల్ లో 361కి పైగా ప్రొఫెషనల్ క్వాలిటీ తెలుగు టెక్నికల్ వీడియోలు అందించాను. ఈ ఛానెల్ కి 1704 మంది సబ్ స్కైబర్లు ఉన్నారు. అందుబాటులో ఉన్న వివిధ మార్గాల ద్వారా తెలుగు వారందరకీ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించే పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాను. My Contact Number: 9000239948 Mail ID: sridharcera@gmail.com

Comment on this Article:







ఇక్కడ RSS Feedకి Subscribe చేసి నేరుగా పోస్ట్ లు పొందండి

ఆండ్రాయిడ్ లో పొందండి!

నా వీడియోలను మీ దగ్గర ఉన్న Android ఫోన్ లో పొందాలంటే ఈ క్రింది లింక్ ని మీ ఫోన్ బ్రౌజర్ లో ఓపెన్ చేసి వెంటనే వచ్చే అప్లికేషన్ ని ఇన్ స్టాల్ చేసుకోండి. అన్ని వీడియోలూ ఎంజాయ్ చేయండి. http://goo.gl/DqsA4

లేదా ఈ క్రింది QR Codeని మీ Android ఫోన్ లోని Barcode Scannerతో స్కాన్ చేస్తే నేరుగా అప్లికేషన్ డౌన్ లోడ్ పేజీకి వెళ్లవచ్చు. Image and video hosting by TinyPic