USB వైరస్‌ల నుండి రక్షణ పొందడానికి

June 28, 2008 Uncategorized 1 Comment

ఇటీవలి కాలంలో USB పెన్ డ్రైవ్‌లద్వారా భారీ మొత్తంలో వైరస్‌లు వ్యాప్తి చెందుతున్నాయి. ప్రముఖ ఏంటీ్‌వైరస్ సాఫ్ట్‌వేర్లు తమ వద్ద ఉన్న వైరస్ డెఫినిషన్లని ఆధారంగా చేసుకుని కొంతవరకూ మాత్రమే వీటి నుండి రక్షణను కల్పిస్తున్నాయి. ఈ నేపధ్యంలో USB వైరస్‌లని గుర్తించి అడ్డుకోవడానికి అధునాతన  proactive తనిఖీ పద్ధతులను అనుసరించే USB Disk security 5.0.0.35 అనే సాఫ్ట్‌వేర్‌ని ఉపయోగించి చూడండి. ఈ సాఫ్ట్‌వేర్ ఎలాంటి అప్‌డేట్ అవసరం లేకుండానే USB వైరస్‌ల నుండి రక్షణ కల్పిస్తుంది.

సులభంగా ఫ్లాష్ వెబ్‌సైట్లని డిజైన్ చేసుకోవడానికి

మీకో స్వంత డొమైన్(వెబ్ సైట్) ఉందా? దానిని ఆకర్షణీయంగా మీకు మీరే డిజైన్ చేసుకోవాలనుకుంటున్నారా?   వెబ్ డిజైనింగ్‌పై తగిన పరిజ్ఞానం లేకపోయుంటే, Flash Website Design Pro అనే సాఫ్ట్‌వేర్‌ని ఉపయోగించండి. ఈ ప్రోగ్రామ్  సాయంతో  ఏనిమేటెడ్ ఫ్లాష్ వెబ్‌సైట్లని, introలు , బ్యానర్లు, ఫ్లాష్ అడ్వర్టైజ్‌మెంట్లకు చాలా సులభంగా రూపొందించుకోవచ్చు.

డ్రైవర్లు మిస్ అయ్యాయా .. వర్రీ అవకండి.

మీవద్ద సౌండ్ , డిస్‌ప్లే, లాన్‌కార్డ్ వంటి  ముఖ్యమైన హర్డ్‌వేర్ పరికరాల డివైజ్ డ్రైవర్ల సిడి మిస్ అయిందా! అయితే ప్రస్తుతం అవి మీ సిస్టంలో ఇన్‌స్టాల్ చెయ్యబడి రెడీగా లభిస్తున్నట్లయితే మిస్ అయిన సిడిల గురించి వర్రీ అవ్వాల్సిన పనిలేకుండా ప్రస్తుతం విండోస్‌లో ఇన్‌స్టాల్ చెయ్యబడి ఉన్నవాటినే బ్యాకప్ తీసుకునే అవకాశాన్ని Drivermax అనే సాఫ్ట్‌వేర్ కల్పిస్తోంది. ఈ సాఫ్ట్‌వేర్ ఉన్న డ్రైవర్లని బ్యాకప్ తీయడమే కాకుండా మన సిస్టంలోని వివిధ హార్డ్‌వేర్ పరికరాల గురించి విస్తృతమైన సమాచారాన్ని అందిస్తుంది. అలాగే ప్రస్తుతం మన సిస్టంలో ఉన్న డ్రైవర్లకు నెట్‌లో ఏవైనా అప్‌డేట్లు లభిస్తున్నాయేమో వెదికి తెలియజేస్తుంది.. మీవద్ద అన్ని డ్రైవర్ల సిడిలు ఉన్నా Drivermax  ద్వారా  మీ సిస్టమ్ లో ఉన్న డ్రైవర్లని ఒకే ప్యాకేజీ క్రింద బ్యాకప్ తీసుకోవడం వల్ల ఈసారి సిస్టమ్ ని ఫార్మేట్ చేసినప్పుడు ప్రతి సిడిని వెదికి ప్రతీ డ్రైవర్‌నూ వేర్వేరుగా ఇన్‌స్టాల్ చెయ్యనవసరం లేకుండా సులభంగా ఒకేసారి అన్ని డ్రైవర్లని మీ కంప్యూటర్లో ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. హార్డ్‌వేర్ టెక్నీషియన్లకు, హోం పిసి యూజర్లకు బాగా ఉపకరించే ప్రోగ్రామ్ ఇది.

సిస్టమ్ స్పీడ్‌ని పెంచే ప్రోగ్రామ్ ….


అనేక కారణాల వల్ల విండోస్‌ని ఫ్రెష్‌గా ఇన్‌స్టాల్ చేసినపుడు ఉన్నంత స్పీడ్ రోజులు గడిచే కొద్ది ఉండదు. దీనికి ప్రధానమైన కారణం అటు హార్డ్ డిస్క్‌లో, రిజిస్ట్రీలో చెత్తా చెదారం పేరుకుపోవడం. మీ కంప్యూటర్ కూడా స్లో అయిందని భావించినట్లయితే BoostSpeed అనే సాఫ్ట్‌వేర్‌ని డౌన్‌లోడ్ చేసుకుని మీ కంప్యూటర్లో రన్ చేయండి. ఈ ప్రోగ్రామ్‌లో రిజిస్ట్రీ క్లీనర్, మన పిసిలో ఇన్‌స్టాల్ అయిన ప్రోగ్రాములను windows uninstaller కన్నా  సమర్ధవంతంగా uninstall చేసే టూల్, startup manager, RAM, browser optimiser, file shredder విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ స్పీడ్‌ని  పెంచే ప్రోగ్రామ్‌లో దాగి ఉన్న  అంతర్గత సెట్టింగులను తగిన విధంగా మార్చడం ద్వారా విండోస్ పనితీరుని పెంపొందించే సదుపాయం, అలాగే ముఖ్యమైన విండోస్ సెట్టింగులను మనకు నచ్చిన విధంగా మార్పిడి చేసే పలు ఆప్షన్లు లభిస్తుంటాయి. ఇది చాలా సమర్ధవంతంగా పని చేస్తుంది.

శక్తివంతమైన ఉచిత ఇమేజ్ వ్యూయర్..

మీ వద్ద డిజిటల్ కెమెరా నుండి షూట్ చేసుకున్న ఫోటోలు , నెట్‌లో వెబ్‌సైట్ల నుండి సేవ్ చెసుకున్న ఫోటోలు భారీ మొత్తంలో ఉన్నట్లయితే వాటిని సులభంగా చూడడానికి, స్లైడ్ షో రూపంలో వీక్షించడానికి , crop, lens, waves, morphs, resize, color adjustment వంటి ఎఫెక్ట్‌లు పొందడానికి Fast Stone Image Viewer అనే సాఫ్ట్‌వేర్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది BMP, JPEG, GIF, TIFF, ICO, TGA, PCX, PNG వంటి దాదాపు అన్ని రకాల ఫైల్ ఫార్మేట్లని సపోర్ట్ చేస్తుంది. Red Eye removal, batch conversion వంటి సదుపాయాలు సైతం లభిస్తున్నాయి.

మాడ్యూలర్ లే‍అవుట్‍తొ యూనీకోడ్ పొందడం..


తెలుగు టైపింగ్ కోసం ShreeLipi, Anu సాఫ్ట్‌వేర్లని ఉపయోగించేవారు సహజంగా Modular, Apple కీబోర్డ్ లేఅవుట్లని వాడుతుంటారు. అయితే ఇంటర్నెట్‌లో బ్లాగుల్లో, ఫోరమ్‌లలో తెలుగులో టైప్ చేయాలంటే యూనికోడ్ పొందడానికి ఇప్పటివరకూ inscript, lekhini, baraha వంటి ఫోనెటిక్ లేఅవుట్లని వాడవలసిందే! దీనివల్ల వేర్వేరు సందర్భాల్లో అటు Modular, ఇటు ఫోనెటిక్ లేఅవుట్లతో తంటాలు పడేవారి కోసం లేఖిని సృష్టికర్త వీవెన్ “మైక్రోసాఫ్ట్ కీబోర్డ్ లేఅవుట్ క్రియేటర్” సాయంతో యూనికోడ్‌కి మాడ్యూలర్ కీ లేఅవుట్‌ ని మాపింగ్ చేసారు. అంటే ఇప్పుడు మీరు మాడ్యూలర్‌పై వేగంగా టైప్ చేయగలిగితే ఈ లేఅవుట్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవడం ద్వారా ఇంటర్నెట్‌పై కూడా వేగంగా తెలుగులో టైప్ చేయొచ్చు.

గట్టి పాస్‍వర్డ్‍లను వాడడం అలవాటు చేసుకోండి..

ఇంటర్నెట్‌ని  ఎక్కువగా ఉపయోగించేవారు పెద్ద తలనొప్పిగా భావించే అంశం అనేక యూజర్‌నేమ్‌లు, పాస్‌వర్డ్‌లు గుర్తుపెట్టుకోవడం! ఏ వెబ్‌సైట్‌లోకి లాగిన్ అవాలంటే ఓ ఎకౌంట్ క్రియేట్ చేసుకోమంటుంది. ఆ వివరాల్ని  గుర్తుపెట్టుకోవడమేమో చాలా కష్టం. అందుకే చాలామంది అన్ని వెబ్‌సైట్లకి ఒకే యూజర్ నేమ్, పాస్‌వర్డ్ ఎంచుకుంటూ ఉంటారు. ఏ కీలాగర్ ద్వారానో ఏ ఒక్క యూజర్‌నేమ్, పాస్‌వర్డ్ ఇతరులకు తెలిసినా, ఇక వారు మీరు విజిట్ చేసే అన్ని వెబ్‌సైట్లకూ అవే యూజర్ డీటైల్స్‌తో లాగిన్ అవగలగుతారు. అందుకే సాధ్యమైనంత వరకూ అటు అక్షరాలు, సంఖ్యల మిశ్రమంగా ఉండే ఆల్ఫా న్యూమరిక్ పదాలను యూజర్‌నేమ్, పాస్‌వర్డ్‌లుగా సెట్ చేసుకోండి. వాటిని గుర్తుపెట్టుకోవడం కష్టమనిపిస్తే.. ప్రత్యేకంగా యూజర్‌నేమ్, పాస్‌వర్డ్‌లను గుర్తుపెట్టుకోవడానికి కొన్ని సాఫ్ట్‌వేర్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో భద్రంగా స్టోర్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు అందుబాటులో ఉన్న టెక్నాలజీని ఉపయోగించి సులభమైన పాస్‌వర్డ్‌లను  చాలా చాలా ఈజీగా హ్యాకర్లు తెలుసుకోగలుగుతున్నారు. MD5 వంటి క్రాకింగ్ టెక్నాలజీలైతే ఎన్‌క్రిప్టెడ్ పాస్‌వర్డ్‌లను సైతం డీకోడ్ చేసి దానియొక్క ఒరిజినల్ పాస్‌వర్డ్‌ని చెప్పగలుగుతుంది.    కాబట్టి పాస్‌వర్డ్‌ల ఎంపికలో, వినియోగంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది.

కంటెంట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ అంటే?

June 13, 2008 Uncategorized 1 Comment


మీరొక స్వంత డొమైన్ (సైట్) నిర్వహిస్తున్నారనుకుందాం. మీ వెబ్‌సైట్‌ని నచ్చిన విధంగా డిజైన్ చెయ్యడానికి కావలసిన వెబ్ డిజైనింగ్ పరిజ్ఞానం మీకు లేకపోతే చింతించవలసిన పనిలేదు. ఇంటర్నెట్‌లో Content Management System ల పేరిట కొన్ని రెడిమేడ్ వెబ్ టెంప్లేట్లు లభిస్తున్నాయి. వాటిలో Joomla, drupaal అనేవి ప్రముఖవైనవి. మీరు చేయవలసినదల్లా ఆయ సైట్ల నుండి వాటిని డౌన్‌లోడ్ చేసుకుని మీ వెబ్‌సైట్‌కి వాటిని అప్‌లోడ్  చేసి డేటాబేస్ వంటివి కాన్ఫిగర్ చేయడమే! దీంతో ఫ్రొఫెషనల్ లుక్ మీ సైట్‌కి స్వంతమవుతుంది. మెనూల దగ్గర్నుండి, టైటిళ్ళు, కంటెంట్, యూజర్ల రిజిస్ట్రేషన్ వంటి అనేక విస్తృత స్థాయి అంశాలను వీటిలో మీకు నచ్చినట్టుగా కాన్ఫిగర్ చేసుకోవచ్చు. స్వంత డొమైన్ ఉన్నవారికి ఇవి పనికి వస్తాయి.

Explorer ని క్లోజ్ చేసే వేర్వేరు పద్ధతులు

Windows ఆపరేటింగ్ సిస్టమ్‌లో Start Menu, Desktop, My Computer వంటి షెల్‌లన్నీ  explorer.exe ప్రోగ్రామ్‌పై ఆధారపడి పని చేస్తుంటాయి. విండోస్ రిజిస్ట్రీలో గానీ, ఇతర సిస్టమ్ మార్పులను గానీ చేసినప్పుడు ఆ మార్పులు అమలులోకి రావాలంటె సిస్టమ్‌ని రీస్టార్ట్ చెయ్యవలసిన అవసరం లేకుండా explorer.exe ని రీస్టార్ట్ చేస్తే సరిపోతుంది. Windows XP, Vista లలో Ctrl+Alt+Del  ద్వారా TaskManager లోకి వెళ్ళి explorer.exe ని వెదికి పట్టుకుని End Task కొట్టండి. ఆ తర్వాత వెంటనే Task Manager లోనే File మెనూలో ఉండే New Task(Run) ఓపెన్ చేసి explorer.exe అని టైప్ చేస్తే మళ్ళీ explorer లోడ్ చెయ్యబడుతుంది. Vistaలో మరో మార్గమూ ఉంది. Vista లో  Start మెనూని ఓపెన్ చేసి Ctrl+Shift కీలను ఒకేసారి ప్రెస్ చేయండి. అందులో Exit Explorer ని క్లిక్ చేస్తే సరి. తిరిగి Task Manager ద్వారా పైన చెప్పిన విధంగా దాన్ని పొందవచ్చు.

మహిళలకు కావలసినంత సమాచారం ..


ఇంటర్‌నెట్ కనెక్షన్ అంటే కేవలం ఏ చాటింగ్‌కో పరిమితం అనుకునేవారెందరో ఉన్నారు. ఇంటర్నెట్ ద్వారా మనకు కావలసింది ఏదైనా ఇట్టే పొందవచ్చు. కొందరు మహిళలను ‘మీకు పిసి , ఇంటర్నెట్ కనెక్షన్ ఇస్తే ఏం సమాచారం పొందాలనుకుంటారు’ అని ఆరా తీస్తే మంచి పెయింటింగులను అన్వేషిస్తాం’ అని బదులిచ్చారు. ఖచ్చితంగా ఎన్నో  వేల రూపాయలు పెట్టి కొనుగోలు చేసే ఆర్ట్ పుస్తకాల్లోనూ లభించనంత అద్భుతమైన  గ్లాస్,ఫ్యాబ్రిక్, పాట్ పెయింటింగులు, ఫ్లవర్లు, పెన్సిల్ డ్రాయింగులు, జపనీస్, చైనీస్ ఆర్ట్, రవివర్మ చిత్రాలు వంటివి ఇంటర్నెట్లో కోకొల్లలుగా దొరుకుతాయి. వాటి ఆధారంగా తమ సృజనాత్మకతకు మెరుగులు పెట్టుకోవచ్చు. కావలసిందల్లా మనకు కావలసిన సమాచారం కోసం గూగుల్ వంటి సెర్చ్ ఇంజిన్లలో కొద్ది ఓపిగా వెదకడమే.

www.google.com

www.live.com

www.yahoo.com

www.altavista.com

www.lycos.com
వంటి వేర్వేరు సెర్చ్ ఇంజిన్‌లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి.కేవలం పెయింటింగులు మాత్రమే కాదు. షడ్రుచులు, ఆంధ్రాకిచెన్ వంటి

బ్లాగులు , వెబ్‌సైట్లలో నోరూరించే వంటకాల తయారీ విధానం అందమైన బొమ్మలతో లభిస్తుంది.

Search This Site:

Press75.com Press75.com Press75.com Press75.com

About Me

1996వ సంవత్సరంలో తెలుగులో మొట్టమొదట కంప్యూటర్ సాహిత్యాన్ని ప్రారంభించే అవకాశం నాకు కలిగింది. అదే సమయంలో చెన్నైలో సూపర్ హిట్ తెలుగు ఫిల్మ్ మేగజైన్ కి సబ్ ఎడిటర్ గా కూడా ఏకకాలంలో పనిచేస్తూ 1998 వరకూ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, మనీషా కొయిరాలా, శంకర్, రజనీకాంత్, కమల్ హాసన్ వంటి ప్రముఖులెందరినో ఇంటర్వ్యూలు చేయడం మర్చిపోలేని అనుభవం. అయితే సినిమా రంగంలో ఉన్న అనారోగ్యకరమైన వాతావరణం వల్ల నాకంటూ ఓ ప్రత్యేకమైన ఉనికిని సృష్టించుకోవడం కోసం సినిమా రంగం నుండి బయటకు వచ్చి పూర్తిగా టెక్నాలజీ రంగంలో స్థిరపడడం జరిగింది. 96 నుండి 2001 వరకూ పలు కంప్యూటర్ పత్రికలకు ఎడిటర్ గా పనిచేసి.. 2001 నుండి "కంప్యూటర్ ఎరా" తెలుగు మంత్లీ మేగజైన్ ఎడిటర్ గా పత్రిక మొత్తాన్నీ రూపొందిస్తూ ఉన్నాను. అలాగే తెలుగు టెలివిజన్ ఛానెళ్లలో మొట్టమొదటి టెక్నికల్ phone-in ప్రోగ్రామ్ కి గెస్ట్ గా అటెండ్ అయ్యే అవకాశమూ 2010 జనవరి 20న కలిగింది. అప్పటి నుండి ఇప్పటివరకూ I News, ETV2, ABN ఆంధ్రజ్యోతి, NTV, Zee 24 గంటలు, సాక్షి టివి, మహా టివి, జాగృతి న్యూస్ వంటి ఛానెళ్లలో 90కి పైగా లైవ్, రికార్డెడ్ ప్రోగ్రాముల్ని చేయడం జరిగింది. 2007లో అత్యుత్తమైన నాణ్యతతో కూడిన పోస్టులతో, వీడియోలతో తెలుగులో మొదటి ప్రొఫెషనల్ టెక్నికల్ బ్లాగ్ గానూ, మొదటి వీడియో బ్లాగ్ గానూ ఇప్పుడు మీరు చూస్తున్న బ్లాగ్ ప్రత్యేకతను సంతరించుకుంది. అలాగే 2007 జనవరి 1న ప్రారంభించిన తెలుగులోనే మొట్టమొదటి టెక్నికల్ ఫోరమ్ అయిన "కంప్యూటర్ ఎరా సాంకేతిక ఫోరమ్" 14 వేల మంది సభ్యులతో 10 వేలకు పైగా పోస్టులతో 2009 జూలై వరకూ నిర్వహించబడింది. దాంతోపాటే మొట్టమొదటి తెలుగు టెక్నికల్ ఛాట్ రూమ్ అయిన "కంప్యూటర్ ఎరా సాంకేతిక సహాయం" అనే ఛాట్ రూమ్ రెండేళ్లలో వేలాది మందికి తెలుగు టైప్ చేయడం మొదలుకుని అనేక కంప్యూటర్ సంబంధిత సాంకేతిక సమస్యలకు తక్షణ సహాయం అందించింది. ఇకపోతే http://youtube.com/nallamothu అనే ఛానెల్ లో 361కి పైగా ప్రొఫెషనల్ క్వాలిటీ తెలుగు టెక్నికల్ వీడియోలు అందించాను. ఈ ఛానెల్ కి 1192 మంది సబ్ స్కైబర్లు ఉన్నారు. అందుబాటులో ఉన్న వివిధ మార్గాల ద్వారా తెలుగు వారందరకీ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించే పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాను.

Google Playలో పొందండి

ఇక్కడ RSS Feedకి Subscribe చేసి నేరుగా పోస్ట్ లు పొందండి