మాస్టర్ బూట్ రికార్డ్

ఏ ఏంటీవైరస్ సాఫ్ట్ వేర్ గుర్తించనంతగా మీ సిస్టమ్ లో వైరస్ లు, ట్రోజాన్ లు ప్రవేశించడానికి వీలు కల్పించేవే rootkit లు. రూట్ కిట్ మన సిస్టమ్ లోకి ప్రవేశించిన తర్వాత అడ్మినిస్ర్టేటర్ కి ఎంత విస్తృత స్థాయిలో అధికారాలు ఉంటాయో వాటన్నింటినీ చేజిక్కించుకుంటుంది. బ్యాక్ గ్రౌండ్ లో నిరంతరం పరిశీలిస్తుండే ఏ,టివైరస్ సాఫ్ట వేర్ ప్రాసెస్ ల దృష్టిలో పడకుండా కూడా ఇవి తమని తాము రక్షించుకుంటాయి. అలాగే రూట్ కిట్ లు ప్రస్తుతం మన సిస్టమ్ లో ఇన్ ఫెక్ట్ అయిన వైరస్ లనే కాకుండా మనం నెట్ కి కనెక్ట్ అయినప్పుడు మరిన్ని ప్రమాదకరమైన స్క్రిప్ట్ లను, కోడ్ లను మన సిస్టమ్ లోకి తీసుకు వచ్చి పడేస్తుంటాయి. Rootkit Revealer వంటి కొన్ని ప్రోగ్రాములు మన కంప్యూటర్లో రూట్ కిట్ లు ఏమైనా ఉన్నాయేమో గుర్తించగలుగుతాయి.
కేవలం విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లోడ్ అయిన తర్వాత మాత్రమే పనిచేసే రూట్ కిట్ లు ఇంతకాలం పిసి యూజర్లని బెంబేలెత్తిస్తే తాజాగా ఏకంగా హార్డ్ డిస్క్ యొక్క Master Boot Record (MBR) లోకి చొరబడే రూట్ కిట్ లు వెలుగు చూశాయి. వాస్తవానికి హార్డ్ డిస్క్ యొక్క MBR లోకి చొరబడే బూట్ సెక్టార్ లైరస్ లు DOS వాడుకలో ఉన్న రోజులనుండే ఉన్నాయి. అయితే ఇలాంటి వైరస్ లను దాదాపు అన్ని ఏంటీలైరస్ సాఫ్ట్ వేర్లు స్కాన్ చేసి తొలగించగలుగుతాయి. ఒకవేళ ఏవునా బూట్ సెక్టార్ వైరస్ లు ఇంకా మొండిగా ఉంటే, బూటబుల్ సిడి/ఫ్లాపీ ఆధారంగా పనిచేసే ఏంటి వైరస్ సాఫ్ట్ వేర్లు,, ఇతర సెక్యూరిటీ అప్లికేషన్ల నుండి దాచిపెట్టుకోవడం! ఈ నేపధ్యంలో MBRని ఆశ్రయించే రూట్ కిట్ లను ఎదుర్కోవడం చాలా కష్టమైన వ్యవహారమే! కంప్యూటర్ ని ఆన్ చేసిన తర్వాత BIOS అన్ని హార్డ్ వేర్ పరికరాలను ఇనీషియలైజ్ చేయగానే తదుపరి దశలో మెమరీలోకి లోడ్ అయ్యేదే Master Boot Record. ఈ నేపధ్యంలో ఏకంగా MBRలోకి ప్రవేశించడం ద్యారా రూట్ కిట్ లు మన ఆపరేటింగ్ సిస్టమ్ పై పూర్తి స్థాయి నియంత్రణ పొందగలుగుతాయి. ఇక మనం ఎన్ని ఏంటి వైరస్, ఏంటి స్పైవేర్ సాఫ్ట్ వేర్లు వేసుకున్నా కాండానికే చెదలు పడితే అవేం చేయగలుగుతాయి. MBR లో స్ధిరనివాసం ఏర్పరుచుకున్న రూట్ కిట్ లు తమతోపాటు ఎప్పటికప్పుడు మరికొన్ని ట్రోజాన్ లూ బూట్ సెక్టార్ లోకి లాక్కు రావడం జరుగుతుంటుంది. దాంతో మనం ఆపరేటింగ్ సిస్టమ్ ని బూట్ చేయడమే అనేక రకాల ఇన్ ఫెక్షన్లతో మొదలుపెట్టడమవుతుంది. పస్తుతం Windows XP అంతకన్నా పాత వెర్షన్లకు చెందిన ఆపరేటింగ్ సిస్టమ్ లకు చెందిన MBR లకు ఇన్ ఫెక్ట్ అయ్యే విధంగా రూట్ కిట్ లు చాలామంది కంప్యూటర్లకి సోకుతున్నాయి. Windows Vista ని ఉపయోగిస్తూ, తమ కంప్యూటర్లని ఎప్పటికప్పుడు Windows Update ద్వారా అప్ డేట్ చేసుకుంటున్న యూజర్లకు ఈ బూట్ సెక్టార్ రూట్ కిట్ ల బాధ ప్రస్తుతం లేదు. ఇలాంటి వాటిని తొలగించాలంటే Rootkir Revealer వంటి సాఫ్ట్ వేర్లు బూటబుల్ సిడి ఆధారంగా రన్ అయ్యేలా రెడీ అవ్వాల్సిందే!
డౌన్ లోడ్ లింక్ : http://www.filehippo.com/download_rootkit_revealer/



















