మంచి ఏంటీవైరస్ అంటూ మభ్యపుచ్చుతున్న నకిలీ ఏంటీవైరస్

ఏంటీవైరస్

ఇంటర్నెట్ బ్రౌజ్ చేస్తుండగా “Your system is infected.. Clean your system with our powerful antivirus” వంటి నకిలీ వార్నింగ్ మెసేజ్ లు చాలామంది గమనించే ఉంటారు. ముఖ్యంగా అనధికారిక సమాచారం ఉన్న సైట్లలో ఇవి ఎక్కువగా కన్పిస్తుంటాయి. ఇలాంటి నకిలీ వార్నింగ్ మెసేజ్ లను నమ్మి ఆ adలపై క్లిక్ చేశారంటే చేజేతులా malware ప్రోగ్రాములను మన సిస్టమ్ లోకి ఆహ్వానించినట్లే. వాటి పట్ల అప్రమత్తంగా ఉండండి. ఇదిలా ఉంటే..

ఇటీవలి కాలంలో Anti-Virus – 1 అనే నకిలీ ఏంటీవైరస్ ప్రోగ్రామ్ ఒకటి నెట్ లో చలామణి అవుతోంది. ఈ ప్రోగ్రామ్ బాగా పనిచేస్తుందని భ్రమపడి పొరబాటున దీన్ని మన కంప్యూటర్లో ఇన్ స్టాల్ చేశామంటే మోసపోయినట్లే. ఇది నకిలీ ఏంటీవైరస్ ప్రోగ్రామ్ అవడమే కాదు.. మనం కంప్యూటర్లోని Hosts ఫైల్ లో ఈ క్రింది ఎంట్రీలను జతచేస్తుంది.

O1 – Hosts: 217.20.175.74 www.review.2009softwarereviews.com
O1 – Hosts: 217.20.175.74 review.2009softwarereviews.com
O1 – Hosts: 217.20.175.74 a1.review.zdnet.com
O1 – Hosts: 217.20.175.74 www.d1.reviews.cnet.com
O1 – Hosts: 217.20.175.74 www.reviews.toptenreviews.com
O1 – Hosts: 217.20.175.74 reviews.toptenreviews.com
O1 – Hosts: 217.20.175.74 www.reviews.download.com
O1 – Hosts: 217.20.175.74 reviews.download.com
O1 – Hosts: 217.20.175.74 www.reviews.pcadvisor.c.uk
O1 – Hosts: 217.20.175.74 reviews.pcadvisor.co.uk
O1 – Hosts: 217.20.175.74 www.reviews.pcmag.com
O1 – Hosts: 217.20.175.74 reviews.pcmag.com
O1 – Hosts: 217.20.175.74 www.reviews.pcpro.co.uk
O1 – Hosts: 217.20.175.74 reviews.pcpro.co.uk
O1 – Hosts: 217.20.175.74 www.reviews.reevoo.com
O1 – Hosts: 217.20.175.74 reviews.reevoo.com
O1 – Hosts: 217.20.175.74 www.reviews.riverstreams.co.uk
O1 – Hosts: 217.20.175.74 reviews.riverstreams.co.uk
O1 – Hosts: 217.20.175.74 www.reviews.techradar.com
O1 – Hosts: 217.20.175.74 reviews.techradar.com

ఈ ఎంట్రీలను జతచేయడం ద్వారా మనం cnet.com, download.com వంటి అనేక ప్రముఖ సాఫ్ట్ వేర్ రివ్యూ సైట్లని ఓపెన్ చేసినప్పుడు ఆయా సైట్ల హోమ్ పేజీ ఓపెన్ అవకుండా 217.20.175.74 అనే IP అడ్రస్ కలిగిన సర్వర్ లోని Fake రివ్యూ పేజీలు మన కంప్యూటర్ స్ర్కీన్ పై చూపించబడతాయి. ఇవి Anti-Virus – 1 ప్రోగ్రామ్ అత్యంత శక్తివంతమైనదిగా రివ్యూ రాయబడి ఉంటాయి. దాంతో మనం నిజంగా అది శక్తివంతమైనదని నమ్ముతాం.

ఈ నకిలీ ఏంటీవైరస్ ప్రోగ్రామ్ తన గురించి నకిలీ రివ్యూలు చూపించడమే కాకుండా.. మన కంప్యూటర్లో చీటికీ మాటికీ తప్పుడు సెక్యూరిటీ అలర్ట్ లు చూపిస్తూ, స్ర్కీన్ సేవర్ రూపంలో కంప్యూటర్ బ్లూస్ర్కీన్ గా మారి, రీస్టార్ట్ అయినట్లు భ్రమింపజేస్తూ మనల్ని భయపెడుతుంది. నిజంగా ఏదో వైరస్ మన సిస్టమ్ కి ఇన్ ఫెక్ట్ అయిందన్న భ్రాంతిని కలిగించి, ఆ వైరస్ ని తొలగించాలంటే కొంత మొత్తం వెచ్చించి ఈ Anti-Virus -1 అనే నకిలీ ప్రోగ్రామ్ ని ఆన్ లైన్ లో కొనుగోలు చెయ్యమని మనల్ని తప్పుదారి పట్టిస్తుంది. కాబట్టి ఈ ప్రోగ్రామ్ ని నమ్మకండి.

Firefoxలో 1,2,3.. ఇలా సిరీస్ లా ఉన్న పేజీలు ఆటోమేటిక్ గా ఒక పేజీ నుండి మరో పేజీకి వెళ్లేలా

Google సెర్చ్ ఇంజిన్ లో మనం ఏదైనా పదాన్ని టైప్ చేసి వెదికినప్పుడు 1, 2, 3, 4, 5.. ఇలా అనేక పేజీల్లో సెర్చ్ ఫలితాలు వస్తాయి కదా! ఒక పేజీ నుండి మరో పేజీకి వెళ్లాలంటే మొదటి పేజీ చివరకు వెళ్లి Next అనే బటన్ ని క్లిక్ చేయడం కానీ, పేజీ నెంబర్ ని క్లిక్ చేయడం గానీ చేయాల్సి వస్తుంటుంది. అలా కాకుండా మనం ఒక పేజీ చివరకు verticalగా మౌస్ వీల్ తో scroll చెయ్యగానే దానంతట అదే రెండవ పేజీ కూడా లోడ్ అయి మొదటి పేజీ కొనసాగింపుగా చూపించబడితే మరింత సౌకర్యవంతంగా ఉంటుంది కదా.

ఇలా ఒక సిరీస్ గా ఉన్న పేజీలను ఆటోమేటిక్ గా లోడ్ చేసేలా Firefox బ్రౌజర్ కోసం ఒక AutoPager అనే ఒక addon లభిస్తోంది. దీన్ని మీ firefox బ్రౌజర్ లో ఇన్ స్టాల్ చేసుకుని firefoxని రీస్టార్ట్ చేసిన తర్వాత ఇలా సిరీస్ లతో కూడిన సైట్ లోకి ప్రవేశించిన తర్వాత Do you want to enable auto paging on this site using it? అనే మెసేజ్ బాక్స్ ఒకటి వస్తుంది. అందులో OK బటన్ కొడితే సరిపోతుంది. దాంతో ఒక పేజీ చివరకు చేరగానే కొద్ది క్షణాలకు ఆ తర్వాతి పేజీ మొదటి పేజీ అడుగున వచ్చి చేరుతుంది. మనం స్వయంగా పేజీలకు మారవలసిన శ్రమ ఉండదు.

Addon డౌన్ లోడ్ లింకు: ఇక్కడ క్లిక్ చేయండి.

వైరస్ ఇన్ ఫెక్ట్ అయిన పెన్ డ్రైవ్ లో నుండి సురక్షితంగా ఫైళ్లని బ్యాకప్ తీయడం

ఇతర కంప్యూటర్లకు కనెక్ట్ చెయ్యడం వల్ల మీ పెన్ డ్రైవ్ లో వైరస్ ఉందనుకోండి. దాన్ని మీ పిసికి కనెక్ట్ చెయ్యాలంటే ఎక్కడ వైరస్ పిసిలోకి ప్రవేశిస్తుందో అని భయపడవలసి వస్తుంటుంది. ఒక్కోసారి ధైర్యం చేసి పెన్ డ్రైవ్ ని USB పోర్ట్ కి కనెక్ట్ చేసినా వైరస్ కారణంగా అందులోని ఫైళ్లని My Computer ద్వారా చూడలేని పరిస్థితి తలెత్తవచ్చు. అలాంటప్పుడు ఈ టెక్నిక్ పాటించండి.

Autorun డిసేబుల్ చేయండి:

USB పోర్ట్ కి పెన్ డ్రైవ్ ని కనెక్ట్ చెయ్యడానికి ముందు మీ కంప్యూటర్లో రిమూవబుల్ డిస్క్ లు autorun అయ్యే సదుపాయాన్ని డిసేబుల్ చేయడం మంచిది. అదెలాగంటే..

  1. Start>Run కమాండ్ బాక్స్ లో regedit అని టైప్ చేసి రిజిస్ట్రీ ఎడిటర్ ప్రోగ్రామ్ లోకి వెళ్లండి.
  2. ఇప్పుడు రిజిస్ట్రీలో HKEY_CURRENT_USER\Software\Microsoft\Windows\CurrentVersion\Policies\Explorer అనే విభాగంలోకి వెళ్లండి.
  3. కుడిచేతి వైపు NoDriveAutorun అనే DWORD వేల్యూ ఉంటే దాన్ని డబుల్ క్లిక్ చేసి Decimal బటన్ ని టిక్ చేసి 255 అనే సంఖ్యని Value dataగా ఇవ్వండి. ఒకవేళ ఇప్పటికే NoDriveAutorun అనే DWORD ఎంట్రీ గనుక లేనట్లయితే మౌస్ తో రైట్ క్లిక్ చేసి New>DWORD అనే ఆప్షన్ ఎంచుకుని కొత్తగా క్రియేట్ చెయ్యబడే DWORD వేల్యూకి NoDriveAutorun అనే పేరుని ఇచ్చి దానికి 255 అనే విలువను వేల్యూ డేటాగా ఇవ్వండి.
  4. ఇప్పుడు కంప్యూటర్ ని రీస్టార్ట్ చేస్తే autorun డిసేబుల్ చెయ్యబడుతుంది.

పెన్ డ్రైవ్ లోని డేటాని బ్యాకప్ తీయడం:

  1. Autorunని డిసేబుల్ చేసిన తర్వాత పెన్ డ్రైవ్ ని పిసికి కనెక్ట్ చేసి, My Computerలో పెన్ డ్రైవ్ ఐకాన్ పై రైట్ క్లిక్ చేసి Properties>Tools అనే విభాగంలో Backup Now అనే ఆప్షన్ క్లిక్ చేయండి. ఇప్పుడు వచ్చే డైలాగ్ బాక్స్ లో Backup files and settings అనే ఆప్షన్ టిక్ చేసి Next కొట్టండి.
  2. తర్వాత వచ్చే What to Back Up అనే స్ర్కీన్ లో Let me choose what to backup అనే ఆప్షన్ ని టిక్ చేసి Next కొట్టండి.
  3. తర్వాతి స్క్రీన్ లో ఏయే ఫైళ్లు, ఫోల్డర్లని బ్యాకప్ తీయాలో ఎడమచేతి వైపు విభాగంలో టిక్ చేసి Next కొట్టండి.
  4. Backup Type, Destination and Name అనే స్క్రీన్ లో ఆ ఫైళ్లని ఏ లొకేషన్ లోకి బ్యాకప్ తీయాలో ఎంచుకుని Next కొట్టండి.
  5. చివరిగా Finish అనే బటన్ ని క్లిక్ చేస్తే పెన్ డ్రైవ్ లోని ఇన్ ఫెక్ట్ అయి కాపీ అవని, ఓపెన్ అవని ఫైళ్లు మనం కోరిన లొకేషన్ లోకి బ్యాకప్ తీయబడతాయి.

మెసెంజర్ బ్లాక్ చెయ్యబడిందా.. ఇలా ఛాట్ చేసుకోవచ్చు!

chat

ఆఫీసుల్లోనూ, కాలేజీల్లోనూ యాహూ మెసెంజర్, GTalk వంటివి బ్లాక్ చెయ్యబడ్డాయా? అయితే ఆన్ లైన్ ద్వారా మీ యాహూ, జీమెయిల్ ఐడిల్లోకి లాగిన్ అయి అక్కడి నుండి ఛాట్ చేసుకునే Web Messenger సర్వీసులు అనేకం ఉన్నాయి. ఒకవేళ అవి కూడా మీ ఆఫీసులో బ్లాక్ చెయ్యబడి ఉన్నట్లయితే మరో మార్గముంది. ఈ క్రింద చెప్పిన ప్రకారం చేయండి.

వాడడం ఇలా:

  1. http://tinychat.com/ అనే సైట్ ఓపెన్ చేయండి.
  2. వెంటనే ప్రత్యక్షమయ్యే Homepageలో Click to create your chatroom అనే లింకుని క్లిక్ చేయండి.
  3. వెంటనే కొన్ని క్షణాలకు ఒక ఛాట్ రూమ్ క్రియేట్ అయి దాని అడ్రస్ బాక్స్ లో ప్రత్యక్షమవుతుంది. (ఇక్కడ మీరు ఆ అడ్రస్ ని కాపీ చేసి మీ ఫ్రెండ్ కి మెయిల్ ద్వారా గానీ/ఇతర మార్గాల ద్వారా చేరవేయాలి)
  4. ఆ అడ్రస్ పక్కనే Enter Chat Room అనే బటన్ ని క్లిక్ చేయండి.
  5. ఆ వెంటనే Enter your nickname అనే బాక్స్ లో మీ పేరుని టైప్ చేయండి.
  6. అంతే ఛాట్ విండో స్ర్కీన్ పై వచ్చేస్తుంది. క్రింద బాక్సులో టైప్ చేస్తే అది ఛాట్ విండోలోకి వస్తుంది. మీ మిత్రులు మీరు పంపిన లింకు ద్వారా మీ తాత్కాలిక ఛాట్ విండోలోకి రాగలుగుతారు. మీరు ఛాట్ చేసుకోవచ్చు.

అదనపు సదుపాయాలు:

  • యూనీకోడ్ సపోర్ట్ ఉండడం వల్ల తెలుగులో కూడా టైప్ చేసి ఛాట్ చేసుకోవచ్చు.
  • పైన కన్పించే Options జాబితా ద్వారా Nicknameని మార్చుకోవచ్చు.
  • Save Chat log అనే ఆప్షన్ ద్వారా మీరు మీ స్నేహితులతో జరిపిన ఛాట్ సంభాషణను ఒక text ఫైల్ గా సేవ్ చేసుకోవచ్చు, ఇ-మెయిల్ ద్వారా పంపుకోవచ్చు, ఇతర ఆప్షన్లు లభిస్తాయి.
  • Add to Website ఆప్షన్ ద్వారా బ్లాగులు, ఫోరంలలో ఈ ఛాట్ సర్వీస్ ని పొందుపరుచుకుని మీ సందర్శకులతో ఛాట్ చేసుకోవచ్చు.

“మీ AntiVirus పని చేస్తో౦దా లేదా..?” మరికొన్ని ఫోరంలోని విలువైన పోస్టులు

February 24, 2009 Uncategorized No Comments

1. మీ Antivirus పని చేస్తు౦దో లేదో తెలుసుకోవడానికి ఈ క్రి౦ది పద్దతిని ఉపయోగి౦చ౦డి ఇది పూర్తిగా Safe పద్ధతి. (పోస్ట్ చేసిన మెంబర్: మోహన్)

లింకు: ఇక్కడ క్లిక్ చేయండి.

2. రోజుకో కమర్షియల్ సాఫ్ట్ వేర్ ని పూర్తి ఉచితంగా లీగల్ గా అందించే సైట్ గురించి చేయబడిన ఈ క్రింది పోస్టు చూడండి. (పోస్ట్ చేసిన మెంబర్: khari)

లింకు: ఇక్కడ క్లిక్ చేయండి.

3. 3D Studio Max ద్వారా LCD మోనిటర్ ఆకారాన్ని డిజైన్ చెయ్యడం ఎలాగో స్టెప్ బై స్టెప్ ట్యుటోరియల్ తెలుగులో (పోస్ట్ చేసిన మెంబర్: ఎస్.వి.స్వామి, కువైట్)

లింకు: ఇక్కడ క్లిక్ చేయండి.

4.  కంప్యూటర్ నుండి బ్లూటూత్ ద్వారా ఫోన్ లోకి ఫైళ్లు ఎలా ట్రాన్స్ ఫర్ చేయాలో అచ్ఛ తెలుగులో చక్కని ట్యుటోరియల్ (పోస్ట్ చేసిన మెంబర్: వంశీ)

లింకు: ఇక్కడ క్లిక్ చేయండి.

5. మొబైల్ ఫోన్ లో ఇన్ స్టాల్ చేసుకునే ఏంటీవైరస్ ప్రోగ్రాముల లింకులు. (పోస్ట్ చేసిన మెంబర్: శ్రీనివాసబాబు)

లింకు: ఇక్కడ క్లిక్ చేయండి.

6. కేవలం 626 KB మాత్రమే పరిమాణం కలిగిన ప్రపంచంలోనే అతి చిన్న PDF రీడర్ ప్రోగ్రామ్ వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? (పోస్ట్ చేసిన మెంబర్: చిలకపాటి శివరామప్రసాద్)

లింకు: ఇక్కడ క్లిక్ చేయండి.

7. కాయిన్ ని ఎలా మాయం చెయ్యాలో తెలుసుకుంటారా? మాజిక్ ట్రిక్ (పోస్ట్ చేసిన మెంబర్: మహేష్ రెడ్డి)

లింకు: ఇక్కడ క్లిక్ చేయండి.

8. సిస్టమ్ ట్రే లో Safely Remove Hardware ఐకాన్ కన్పించడం లేదా? ఇలా చేయండి. తెలుగులో చక్కని వివరణ (పోస్ట్ చేసిన మెంబర్: శ్రీనివాసబాబు)

లింకు: ఇక్కడ క్లిక్ చేయండి.

9. చైనా మొబైల్ ఫోన్ల సీక్రెట్ కోడ్ లు కావాలా? (పోస్ట్ చేసిన మెంబర్: కృష్ణ)

లింకు: ఇక్కడ క్లిక్ చేయండి.

10. మీ కంప్యూటర్లో ఇన్ స్టాల్ చేసుకునే పనిలేకుండా నేరుగా క్రికెట్ గేమ్ ని కంప్యూటర్ ఎరా ఫోరంలో ఎంచక్కా ఇలా ఆడుకోవచ్చు. (పోస్ట్ చేసిన మెంబర్: నల్లమోతు శ్రీధర్)

లింకు: ఇక్కడ క్లిక్ చేయండి.

ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన వేలాది పోస్టుల నుండి మరికొన్ని లింకులు మరోసారి చూద్దాం.

పై లింకులు ఓపెన్ కావాలంటే http://computerera.co.in/forumలో మీరు ఉచితంగా రిజిస్టర్ అవాలి. అదెలాగంటే..

రిజిస్టర్ అవడం ఇలా:

స్పామ్, ఇతర సమస్యలను అధిగమించడానికి http://computerera.co.in/forum అనే తెలుగు సాంకేతిక ఫోరంలో రిజిస్ట్రేషన్ తప్పనిసరి చెయ్యడం జరిగింది.

  1. ఆ పేజీని ఓపెన్ చేసిన వెంటనే పైన కన్పించే Register అనే బటన్ క్లిక్ చేయండి.
  2. వెంటనే ఒక రిజిస్ట్రేషన్ ఫారం వస్తుంది. అందులో మీ పేరు, మెయిల్ ఐడి (వర్కింగ్ ది ఇవ్వాలి), పాస్ వర్డ్.. వంటి పలు వివరాలు నింపిన తర్వాత Submit కొట్టండి.
  3. ఆ తర్వాత మీ మెయిల్ కి ఒక ఏక్టివేషన్ లింకుని పంపించబడుతుంది. మీ మెయిల్ inboxకి వచ్చిన ఆ ఏక్టివేషన్ లింకుని క్లిక్ చేస్తే మీ అకౌంట్ ఏక్టివేట్ అవుతుంది.
  4. చివరిగా ఇకపై ఎల్లప్పుడూ మీరు పేర్కొన్న యూజర్ నేమ్, పాస్ వర్డ్ లను ఎంటర్ చేస్తూ ఫోరంలోకి లాగిన్ అయి పోస్టులను చూడవచ్చు.

వేలకొద్దీ సాంకేతిక పోస్టులు మీకు అందుబాటులో..

February 24, 2009 Uncategorized No Comments

http://computerera.co.in/forum అనే సాంకేతిక ఫోరంలో ఇప్పటివరకూ 7,542 మంది సభ్యులు, 11,065 పోస్టులు ఉన్నాయి. ఎప్పటికప్పుడు సభ్యులు చక్కని సాంకేతిక సమాచారాన్ని పదిమందికీ పంచుతూ ఫోరంలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. ఫోరం మొదలెట్టి రెండేళ్లు దాటినా ఇప్పటివరకూ ఫోరం గణాంకాలు ఒకటి రెండుసార్లు అదీ ముఖ్యమైన మైలురాళ్లు అధిగమించినప్పుడు మాత్రమే ఈ బ్లాగులో పొందుపరచడం జరిగింది తప్ప వీలైనంత వరకూ ఫోరమ్ ప్రస్తావన బ్లాగులో తీసుకురావడానికి మనస్కరించలేదు. చివరకు http://computerera.co.in/forum, http://computerera.co.in/chat అనే ఎప్పటి నుండో నిర్వహించబడుతున్న సర్వీసుల బటన్లు/లింకులను కూడా ఈ సాంకేతికాలు బ్లాగులో పొందుపరచలేదు.  “సాంకేతిక సహాయం” పేరిట ఒకరికొకరు సాంకేతిక పరిజ్ఞానాన్ని షేర్ చేసుకోవడంతో పాటు, వివిధ సందర్భాల్లో హెల్ప్ చేసుకోవాలన్న ఉద్దేశ్యంతో నిర్వహించబడుతున్న ఈ ఉచిత సర్వీస్ లో ఇప్పటివరకూ ప్రసాద్ గారు, జీవి గారు, జ్యోతి గారు, గిరిచంద్ గారు, శ్రీనివాస్ కర గారు, రవిశంకర్ గారు, సాయి పోతూరి గారు, మహేష్ రెడ్డి గారు, ఎస్.వి.స్వామి గారు, సాయిచరణ్, వెంకట్ గారు, జాహ్నవి గారు, వాణి గారు, manam గారు, రవీంద్ర కాట్రగడ్డ గారు, రాఘవులు గారు, జాకబ్ గారు, మొయిన్ గారు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో మహానుభావులు రాత్రింబవళ్లు ఇతరులకు సాంకేతికంగా వారి సహాయ సహకారాలు అందిస్తూ వచ్చారు. ఈ ప్రక్రియలో ఎవరికైనా రిప్లైల ద్వారా అందించే సహకారం, ఛాట్ లో వివరణలు అర్థం కానట్లయితే టీమ్ వ్యూయర్ అనే ఉచిత రిమోట్ అడ్మిన్ టూల్ సాయంతో అనేక మంది desktopలను సభ్యులు, నిపుణులు తమ కంప్యూటర్ నుండి యాక్సెస్ చేసి వారి సమస్యలు పరిష్కరించేవారు. క్లుప్తంగా చెప్పాలంటే అనేకమంది ఔత్సాహికులు కలిసికట్టుగా నిర్వహిస్తున్న సాంకేతిక ఫోరం, ఛాట్ రూమ్ ల నేపధ్యం ఇది.

ఇదిలా ఉంటే కంప్యూటర్ ఎరా ముద్రిత పత్రికకు ప్రత్యేకంగా reader base ఉంది. ఇప్పటివరకూ ఫోరంలో రిజిస్టర్ అయిన ఏడు వేలకు పై చిలుకు సభ్యులు మేగజైన్ రీడర్స్, మేగజైన్ లో ఫోరం url చూసి రిజిస్టర్ చేసుకున్న వారే. ఈ బ్లాగు ద్వారా ఫోరం గురించి తెలుసుకుని అందులో రిజిస్టర్ అయి నాలెడ్జ్ ని షేర్ చేస్తున్న/పొందుతున్న వారు నామమాత్రమే. “ఎప్పటికప్పుడు ఫోరంలో చోటుచేసుకుంటున్న తాజా విలువైన పోస్టులను బ్లాగులో ప్రచురించండి” అంటూ కొందరు ఫోరం మిత్రులు సూచించినా ఫోరం/ఛాట్ లకు ఒక ప్రత్యేకమైన ఉనికి, members base ఉండడం వల్ల “బ్లాగు ద్వారా ఫోరంని పాపులర్ చేసుకుంటున్నారు” అన్న అభిప్రాయాన్ని తోటి బ్లాగర్లలో పొందడం ఇష్టం లేక ఫోరం కార్యకలాపాలను ఈ రెండేళ్ల కాలంగా బ్లాగుకి దూరంగా ఉంచుతూ వస్తున్నాను.

కానీ ఫోరంలో పలువురు సభ్యులచే పోస్ట్ చెయ్యబడుతున్న విలువైన పోస్టులను పరిశీలిస్తుంటే కేవలం ఇప్పటివరకూ ఉన్న సభ్యులకే కాకుండా ఆ నాలెడ్జ్ ఇతరులకూ చేరితే మరింత మంది ప్రయోజనం పొందినవారవుతారు అన్న అభిప్రాయం కలుగుతోంది. అందుకే http://computerera.co.in/forum అనే ఫోరంలో ఇప్పటివరకూ పోస్ట్ చెయ్యబడిన అనేక విలువైన పోస్టుల లింకులను అప్పుడప్పుడు ఈ సాంకేతికాలు బ్లాగు ద్వారా అందజేయదలిచాను.

రిజిస్టర్ అవడం ఇలా:

స్పామ్, ఇతర సమస్యలను అధిగమించడానికి http://computerera.co.in/forum అనే తెలుగు సాంకేతిక ఫోరంలో రిజిస్ట్రేషన్ తప్పనిసరి చెయ్యడం జరిగింది.

  1. ఆ పేజీని ఓపెన్ చేసిన వెంటనే పైన కన్పించే Register అనే బటన్ క్లిక్ చేయండి.
  2. వెంటనే ఒక రిజిస్ట్రేషన్ ఫారం వస్తుంది. అందులో మీ పేరు, మెయిల్ ఐడి (వర్కింగ్ ది ఇవ్వాలి), పాస్ వర్డ్.. వంటి పలు వివరాలు నింపిన తర్వాత Submit కొట్టండి.
  3. ఆ తర్వాత మీ మెయిల్ కి ఒక ఏక్టివేషన్ లింకుని పంపించబడుతుంది. మీ మెయిల్ inboxకి వచ్చిన ఆ ఏక్టివేషన్ లింకుని క్లిక్ చేస్తే మీ అకౌంట్ ఏక్టివేట్ అవుతుంది.
  4. చివరిగా ఇకపై ఎల్లప్పుడూ మీరు పేర్కొన్న యూజర్ నేమ్, పాస్ వర్డ్ లను ఎంటర్ చేస్తూ ఫోరంలోని, ఛాట్ రూమ్ లోకి లాగిన్ అయి పోస్టులను చూడవచ్చు.

Adobe Readerలో కీలకమైన సెక్యూరిటీ లోపం

adobe reader

PDF ఫైళ్లని ఓపెన్ చెయ్యడానికి Adobe Reader 9, అంతకుపూర్వపు వెర్షన్లు ఉపయోగించే వారు, Acrobat Professional ప్రోగ్రామ్ ని వాడేవారు ఇటీవల బయల్పడిన ఓ కీలకమైన సెక్యూరిటీ లోపం కారణంగా సమస్యలు ఎదుర్కోవలసి వస్తోంది.  Buffer Overflow కారణంగా సిస్టమ్ అకస్మాత్తుగా క్రాష్ అవడంతో పాటు ఈ సెక్యూరిటీ లోపాన్ని ఆసరాగా చేసుకుని హ్యాకర్లు మన సిస్టమ్ పై నియంత్రణ పొందగలిగే ప్రమాదముంది. ఈ లోపాన్ని పరిష్కరించేలా మార్చి 11, 2009 నాటికి ఓ అప్ డేట్ ని విడుదల చేసే ప్రయత్నాల్లో Adobe సంస్థ ఉంది.

ప్రత్యామ్నాయం: ఇప్పటికీ PDF ఫైళ్లని ఓపెన్ చెయ్యడానికి Acrobat Readerని వాడేవారు Foxit Reader, Sumatra PDF Viewer వంటి  ఇంకా వేగంగా పనిచేసే light weight ప్రోగ్రాములను ఉపయోగించడం ఉత్తమం.

FoxIt Reader డౌన్ లోడ్ లింకు: ఇక్కడ క్లిక్ చేయండి.

Sumatra PDF Viewer డౌన్ లోడ్ లింకు: ఇక్కడ క్లిక్ చేయండి.

Gmailని మీ స్వంత రంగులతో నింపుకోవడం ఇలా..

జీమెయిల్

కొన్నేళ్లపాటు ఒకే మాదిరి రంగులను చూస్తూ వచ్చిన Gmail యూజర్లకు కొన్ని నెలల క్రితం Google సంస్థ Gmail Themesతో తాయిలం అందించింది.  ఇటీవలి కాలంలో గమనిస్తూ పోతే ఒకటి రెండు రోజులకో మార్పు, కొత్త జోడింపు చొప్పున Gmailలోనూ, ఇతర Google సర్వీసులలోనూ చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే Gmail Themesలో ఏదో ఒక themeని ఉపయోగిస్తున్న వారు ఆ రెడీమేడ్ కలర్ స్కీమ్ లు నచ్చకపోతే స్వంతంగా మీకు నచ్చిన రంగులతోనూ Gmail స్వరూపాన్ని మార్చుకోవచ్చు. అదెలాగంటే..

ఇలా చేయండి..

  1. మీ Gmailలోకి లాగిన్ అవండి.
  2. Settings విభాగంలోకి వెళ్లండి.
  3. Themes అనే టాబ్ లోకి వెళ్లండి. ఇందులో అన్నింటికన్నా చివర్న Choose your own colors అనే ఆప్షన్ కన్పిస్తుంది. దాన్ని క్లిక్ చేయండి.
  4. దీంతో వెంటనే ఒక పాపప్ విండో స్ర్కీన్ పై ప్రత్యక్షమవుతుంది. ఇందులో Gmail స్వరూపంలోని వివిధ భాగాలను మనకు నచ్చిన రంగులతో నింపుకునేలా వివిధ భాగాలపై క్లిక్ చేస్తూ తద్వారా వచ్చే Color paletteల నుండి నచ్చిన రంగులను ఎంచుకుంటూ మొత్తం పూర్తయ్యాక Save బటన్ కొడితే సరిపోతుంది.

అంతే ఇప్పుడు మీరు ఎంచుకున్న కొత్త వర్ణాలతో Gmail కన్పించనారంభిస్తుంది. ఓసారి ప్రయత్నించి చూడండి.

XViD వీడియో కొడెక్ గురించి..

February 20, 2009 Uncategorized 1 Comment

మనం కంప్యూటర్లో ప్లే చేసుకునే వీడియోకి సంబంధించి MPEG, AVI, RM, MOV, FLV వంటి వీడియో ఫార్మేట్లు ఎలాగో ఆయా వీడియో ఫార్మేట్లలో మళ్లీ తిరిగి వివిధ కొడెక్ లు ఉంటుంటాయి. ఈ నేపధ్యంలో AVI వీడియో ఫార్మేట్ లో  DivX వంటి ఇతర codecs మాదిరిగానే XViD అనేది కూడా ఓ వీడియో codec. తక్కువ సైజ్ లోనే అత్యంత నాణ్యమైన వీడియోని సాధించిపెట్టే ఈ కొడెక్ ఓపెన్ సోర్స్ కోవకు చెందినది కావడం వల్ల విస్తృతంగా వాడబడుతోంది. 100GB పరిమాణం గల వీడియో దృశ్యాలను సైతం కేవలం 500MB పరిమాణంలో నాణ్యతలో పెద్దగా వ్యత్యాసం తలెత్తకుండా XViD ద్వారా కంప్రెస్ చేసుకోవచ్చు. DivX సపోర్ట్ కలిగి ఉన్న అన్ని డివిడి ప్లేయర్లు (టివికి కనెక్ట్ చేసుకునేవి) ఈ XViD కొడెక్ ఆధారంగా కంప్రెస్ చెయ్యబడిన AVI వీడియో ఫైళ్లని ప్లే చెయ్యగలుగుతాయి.  అనేక వీడియో కన్వర్షన్ ప్రోగ్రాములు ఈ AVI XViD కొడెక్ లోకి వీడియోని కన్వర్ట్ చెయ్యడానికి అవకాశం కల్పిస్తుంటాయి.

Youtubeలో మనం ప్లే చేసిన వీడియోలు మిగిలి ఉంటే..

Youtube, Google Video వంటి ఆన్ లైన్ వీడియో షేరింగ్ సైట్లలో మనం కావలసిన వీడియోలను ప్లే చేసేటప్పుడు అవి తాత్కాలికంగా మన కంప్యూటర్లో భద్రపరచబడతాయని చాలామందికి తెలియదు. తిరిగి అవే వీడియోలను ప్లే చెయ్యవలసి వస్తే మళ్లీ ఆయా సైట్లకు వెళ్లి ప్లే చేసే పనిలేకుండా ఓ చిన్న ఉచిత టూల్ ని వాడి ఇప్పటికే మీ కంప్యూటర్లో భద్రపరచబడి ఉన్న పాత వీడియోలను flv ఫైళ్లుగా జాగ్రత్తగా సేవ్ చేసుకోవచ్చు. దీని పేరు VideoCacheView. ఈ ప్రోగ్రామ్ ని ఇన్ స్టాల్ చేసి రన్ చేసిన తర్వాత ఇది Internet Explorer, Mozilla ఆధారిత బ్రౌజర్లు అయిన firefox, flock వంటి బ్రౌజర్ల cacheని పరిశీలించి ఇప్పటికే మన హార్డ్ డిస్క్ లో గతంలో ప్లే చేసి వీడియో ఫైళ్లు కన్పిస్తే వాటి జాబితాను చూపిస్తుంది. ఆ జాబితాలో నుండి మీకు కావలసిన వీడియోని ఎంచుకుని దానిపై రైట్ క్లిక్ చేసి Copy Selected Files To అనే ఆప్షన్ ని ఎంచుకుని desktopపై సేవ్ చెయ్యబడేలా ఏర్పాటు చేసుకోండి.

ఇప్పుడు ఆ వీడియో ఫైళ్లు FLV ఫార్మేట్ లో సేవ్ అవుతాయి. వాటిని మీ కంప్యూటర్లో ప్లే చెయ్యాలంటే VLC Player, MPlayer వంటి FLV ఫైళ్లని ప్లే చెయ్యగలిగే ఏ ప్రోగ్రామ్ అయినా ఇన్ స్టాల్ చేయబడి ఉండాలి. ఆ ప్లేయర్ తో ఆ వీడియో ఫైళ్లని ప్లే చేసుకోవచ్చు.

Video Cache View డౌన్ లోడ్ లింకు: ఇక్కడ క్లిక్ చేయండి.

FLV Player డౌన్ లోడ్ లింకు: ఇక్కడ క్లిక్ చేయండి.

Search This Site:

Press75.com Press75.com Press75.com Press75.com

About Me

1996వ సంవత్సరంలో తెలుగులో మొట్టమొదట కంప్యూటర్ సాహిత్యాన్ని ప్రారంభించే అవకాశం నాకు కలిగింది. అదే సమయంలో చెన్నైలో సూపర్ హిట్ తెలుగు ఫిల్మ్ మేగజైన్ కి సబ్ ఎడిటర్ గా కూడా ఏకకాలంలో పనిచేస్తూ 1998 వరకూ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, మనీషా కొయిరాలా, శంకర్, రజనీకాంత్, కమల్ హాసన్ వంటి ప్రముఖులెందరినో ఇంటర్వ్యూలు చేయడం మర్చిపోలేని అనుభవం. అయితే సినిమా రంగంలో ఉన్న అనారోగ్యకరమైన వాతావరణం వల్ల నాకంటూ ఓ ప్రత్యేకమైన ఉనికిని సృష్టించుకోవడం కోసం సినిమా రంగం నుండి బయటకు వచ్చి పూర్తిగా టెక్నాలజీ రంగంలో స్థిరపడడం జరిగింది. 96 నుండి 2001 వరకూ పలు కంప్యూటర్ పత్రికలకు ఎడిటర్ గా పనిచేసి.. 2001 నుండి "కంప్యూటర్ ఎరా" తెలుగు మంత్లీ మేగజైన్ ఎడిటర్ గా పత్రిక మొత్తాన్నీ రూపొందిస్తూ ఉన్నాను. అలాగే తెలుగు టెలివిజన్ ఛానెళ్లలో మొట్టమొదటి టెక్నికల్ phone-in ప్రోగ్రామ్ కి గెస్ట్ గా అటెండ్ అయ్యే అవకాశమూ 2010 జనవరి 20న కలిగింది. అప్పటి నుండి ఇప్పటివరకూ I News, ETV2, ABN ఆంధ్రజ్యోతి, NTV, Zee 24 గంటలు, సాక్షి టివి, మహా టివి, జాగృతి న్యూస్ వంటి ఛానెళ్లలో 90కి పైగా లైవ్, రికార్డెడ్ ప్రోగ్రాముల్ని చేయడం జరిగింది. 2007లో అత్యుత్తమైన నాణ్యతతో కూడిన పోస్టులతో, వీడియోలతో తెలుగులో మొదటి ప్రొఫెషనల్ టెక్నికల్ బ్లాగ్ గానూ, మొదటి వీడియో బ్లాగ్ గానూ ఇప్పుడు మీరు చూస్తున్న బ్లాగ్ ప్రత్యేకతను సంతరించుకుంది. అలాగే 2007 జనవరి 1న ప్రారంభించిన తెలుగులోనే మొట్టమొదటి టెక్నికల్ ఫోరమ్ అయిన "కంప్యూటర్ ఎరా సాంకేతిక ఫోరమ్" 14 వేల మంది సభ్యులతో 10 వేలకు పైగా పోస్టులతో 2009 జూలై వరకూ నిర్వహించబడింది. దాంతోపాటే మొట్టమొదటి తెలుగు టెక్నికల్ ఛాట్ రూమ్ అయిన "కంప్యూటర్ ఎరా సాంకేతిక సహాయం" అనే ఛాట్ రూమ్ రెండేళ్లలో వేలాది మందికి తెలుగు టైప్ చేయడం మొదలుకుని అనేక కంప్యూటర్ సంబంధిత సాంకేతిక సమస్యలకు తక్షణ సహాయం అందించింది. ఇకపోతే http://youtube.com/nallamothu అనే ఛానెల్ లో 361కి పైగా ప్రొఫెషనల్ క్వాలిటీ తెలుగు టెక్నికల్ వీడియోలు అందించాను. ఈ ఛానెల్ కి 1192 మంది సబ్ స్కైబర్లు ఉన్నారు. అందుబాటులో ఉన్న వివిధ మార్గాల ద్వారా తెలుగు వారందరకీ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించే పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాను.

Google Playలో పొందండి

ఇక్కడ RSS Feedకి Subscribe చేసి నేరుగా పోస్ట్ లు పొందండి