ఓపెన్ అయి విండోలతో ప్రయోగాలు చెయ్యడానికి

గమనిక: వివిధ కంప్యూటర్ చిట్కాలు, ప్రాబ్లెంలకు సమాధానాలు, ఆసక్తికరమైన వెబ్ సైట్లు, ట్యుటోరియళ్లు వంటి అనేక అంశాలపై ఇప్పటికే 8,000 మంది సభ్యులతో 12,500 పోస్టులను కలిగిన కంప్యూటర్ ఎరా సాంకేతిక సహాయం ఫోరంలో వెంటనే ఉచితంగా రిజిస్టర్ అవండి, అమూల్యమైన టెక్నికల్ నాలెడ్జ్ ని స్వంత చేసుకోండి.

ఉచితంగా రిజిస్టర్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

మీ కంప్యూటర్ లో అనేక సాఫ్ట్ వేర్లని ఓపెన్ చేసి పనిచేసుకుంటూ ఉన్నప్పుడు ఆయా ప్రోగ్రాముల విండోలూ, taskbar ఐకాన్లూ స్క్రీన్ పై కన్పిస్తూ ఉంటాయి కదా! ఒకవేళ స్క్రీన్ మొత్తం వీటన్నింటితో నిండిపోయి గందరగోళంగా ఉందనుకోండి. కాసేపు అన్ని విండోలనూ system trayకి మినిమైజ్ చేసుకుని అవసరం అయినప్పుడు మాత్రమే తిరిగి show చేసుకోవాలంటే ఇంటర్నెట్ లో అనేక ఉచిత టూల్స్ ని ఉపయోగించవచ్చు. అలాంటి ఓ టూలే.. Clicky Gone.  ఈ టూల్ సాయంతో ఓపెన్ అయిన అన్ని విండోలనూ సిస్టమ్ ట్రేకి మినిమైజ్ చేసుకోవచ్చు.

ఈ క్రింది సైట్ లో ఆ ప్రోగ్రామ్ కి సంబంధించి పోర్టబుల్ వెర్షన్ కూడా లభిస్తుంది.

దీని డౌన్ లోడ్ లింకు: ఇక్కడ క్లిక్ చేయండి.

ఫైల్ షేరింగ్ సైట్లలో వెంటనే డౌన్ లోడ్ మొదలయ్యేలా

గమనిక: వివిధ కంప్యూటర్ చిట్కాలు, ప్రాబ్లెంలకు సమాధానాలు, ఆసక్తికరమైన వెబ్ సైట్లు, ట్యుటోరియళ్లు వంటి అనేక అంశాలపై ఇప్పటికే 8,000 మంది సభ్యులతో 12,500 పోస్టులను కలిగిన కంప్యూటర్ ఎరా సాంకేతిక సహాయం ఫోరంలో వెంటనే ఉచితంగా రిజిస్టర్ అవండి, అమూల్యమైన టెక్నికల్ నాలెడ్జ్ ని స్వంత చేసుకోండి.

ఉచితంగా రిజిస్టర్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.


మన వద్ద ఉన్న ఫైళ్లని మన మిత్రులకు పంపించదలుచుకుంటే Megaupload, Rapidshare, megashare, mediafire, divshare వంటి అనేక ఫైల్ షేరింగ్ సైట్ల లోకి అప్ లోడ్ చేసి ఆ లింకులను మన మిత్రులకు పంపిస్తుంటాం కదా! అయితే ఆయా లింకులను పట్టుకుని డౌన్ లోడ్ చేయడానికి ప్రయత్నించినప్పుడు ఒక్కో సైట్ ఒక్కో రకంగా 30, 60, 180 సెకండ్ల చొప్పున వెయిట్ చేయమని చెప్తుంది. అన్ని సెకండ్లు వేచి ఉన్న తర్వాతే డైరెక్ట్ డౌన్ లోడ్ లింకు ఇస్తుంది.

ఇలా అన్నేసి సెకండ్లు, నిముషాలు వెయిట్ చెయ్యవలసిన శ్రమ లేకుండా నేరుగా డౌన్ లోడ్ లింకు లభించేలా చెయ్యడానికి Firefox బ్రౌజర్ ని ఉపయోగించే వారికి ఓ చక్కని addon లభిస్తోంది. అదే SkipScreen. దీన్ని మీ Firefox బ్రౌజర్ లో ఇన్ స్టాల్ చేసి బ్రౌజర్ ని రీస్టార్ట్ చేస్తే సరిపోతుంది. ఇకపై వివిధ ఫైల్ షేరింగ్ సైట్లలో ఎక్కువ సేపు వెయిట్ చెయ్యవలసిన పనిలేకుండానే నేరుగా డౌన్ లోడ్ లింకు వచ్చేస్తుంది.

ఇలా చేయండి:

స్టెప్ 1: ఈ లింకు నుండి SkipScreen addonని మీ Firefox బ్రౌజర్ లో ఇన్ స్టాల్ చేసుకోండి.

స్టెప్ 2: Firefoxని రీస్టార్ట్ చేశాక ఇకపై మీరు ఏ ఫైల్ షేరింగ్ సైట్ నుండి డౌన్ లోడ్ చేసుకోవడానికి ప్రయత్నించినా count down రాకుండా నేరుగా ఈ క్రింది మాదిరిగా డౌన్ లోడ్ లింకు లభిస్తుంది. Download చేసుకోవడమే తరువాయి!

Count Downని అధిగమించడానికి కొందరు javascript:c=0;void(0); అనే Java Scriptని అడ్రస్ బార్ లో టైప్ చేసి ట్రై చేస్తుంటారు. ప్రతీసారీ అన్ని సైట్లకూ ఇలా చేయడం కన్నా పైన మనం చెప్పుకున్న addon వాడడం ఉత్తమం.

ఏదైనా ఆడియో/వీడియో/జిప్ ఫైల్ లోని కొంత భాగాన్నే డౌన్ లోడ్ చేసుకోవాలా?

April 7, 2009 Uncategorized 1 Comment

నకు ఇంటర్నెట్ లో వివిధ సైట్లలో MP3, AVI ఫైళ్లు, ZIP, RAR ఫైళ్లు డౌన్ లోడ్ చేసుకోవడానికి సిద్ధంగా లభిస్తుంటాయి. అయితే మన నెట్ కనెక్షన్ స్పీడ్ తక్కువ కావడం వల్ల ఆడియో/వీడియో మొత్తం కాకుండా అందులో కొంత ముక్కని మాత్రమే డౌన్ లోడ్ చేసుకోదలుచుకున్నా, జిప్ ఫైల్ లో లోపల అనేక ఫైళ్లు ఉంటే వాటిలో కేవలం మనకు కావలసిన ఫైల్ ని మాత్రమే డౌన్ లోడ్ చేసుకోదలుచుకున్నా LoadScout అనే 1MB ఉచిత సాఫ్ట్ వేర్ ఉపయోగపడుతుంది. దాన్ని ఎలా వాడాలో చూద్దాం. ఈ లింకు నుండి Load Scout ని డౌన్ లోడ్ చేసుకోండి. దాన్ని ఇన్ స్టాల్ చేసుకున్న తర్వాత ఈ క్రింది విధంగా చేయండి.

స్టెప్ 1: ఆ ప్రోగ్రామ్ ని ఓపెన్ చేసి Open URL అనే బటన్ ని క్లిక్ చేయండి.

స్టెప్ 2: తర్వాత వచ్చే స్క్రీన్ లో Please enter a link to a media file to get info. అనే బాక్సులో మీరు ఆన్ లైన్ లో ఉన్న ఏ ఆడియో/వీడియో/జిప్ ఫైల్ యొక్క వివరాలను చూడదలుచుకున్నారో ఆ లింకు అడ్రస్ ని టైప్ చేయండి. ఆ తర్వాత OK బటన్ కొట్టండి.

స్టెప్ 3: ఇప్పుడు ఆ ఫైల్ ఓపెన్ అయి క్రింది చిత్రంలోని విధంగా బ్రౌజర్ లో కన్పిస్తుంది. ఇక్కడ నేను sridhar.zip అనే జిప్ ఫైల్ పై టెస్ట్ చేశాను కాబట్టి ఆ ఫైల్ లో లోపల ఉన్న ఫైళ్ల వివరాలను LoadScout ప్రోగ్రామ్ కుడిచేతి వైపు చూపిస్తుంది.

స్టెప్ 4: ఇప్పుడు ఆ జిప్ ఫైల్ లోని ఫైళ్లలో మీకు ఏ ఫైల్ వరకూ మాత్రమే కావాలో ఆ ఫైల్ పై రైట్ క్లిక్ చేసి Extract అనే బటన్ ని క్లిక్ చేయండి.

స్టెప్ 5: వెంటనే క్రింది చిత్రంలో విధంగా బాక్సు వస్తుంది. అందులో Browse అనే బటన్ ద్వారా నెట్ నుండి మనం ఎంచుకున్న ఫైల్ ముక్క మన హార్డ్ డిస్క్ లో ఏ ప్రదేశంలో స్టోర్ చెయ్యదలుచుకున్నామో ఆ లొకేషన్ ఎంచుకోండి. ఆ తర్వాత చివరగా Start అనే బటన్ కొడితే మనం ఎంచుకున్న ఫైల్/లేదా ఆడియో/వీడియోలోని కొంత భాగం మాత్రమే డౌన్ లోడ్ అవుతుంది.

డౌన్ లోడ్ లింకు మరోసారి: లింకు

యాహూ మెసెంజర్ లో మొబైల్ నెంబర్ మార్చడం ఇలా..

Yahoo Messengerలో మొబైల్ ద్వారా మెసేజ్ లను పొందగలిగేలా కాన్ఫిగర్ చేసిన వారు ఎప్పుడైనా తమ పాత మొబైల్ నెంబర్ స్థానంలో కొత్త మొబైల్ నెంబర్ ని యాహూ మెసెంజర్ లో మార్చవలసి వచ్చినట్లయితే ఈ క్రింద చెప్పినట్లు చేస్తే సరిపోతుంది.

స్టెప్ 1: యాహూ మెసెంజర్ లో Preferences కొట్టండి.

స్టెప్ 2: వెంటనే ఈ క్రింది విధంగా వచ్చే బాక్సులో General అనే విభాగంలో Edit Mobile Phone అనే బటన్ క్లిక్ చేయండి.

స్టెప్ 3: ఆ వెంటనే yahoo mobile వెబ్ పేజీ మీ బ్రౌజర్ లో ఓపెన్ చెయ్యబడుతుంది ఈ క్రింది ఫొటోలో మాదిరిగా. అందులో Edit అనే బటన్ ని క్లిక్ చేయండి.

స్టెప్ 4: వెంటనే వచ్చే కొత్త పేజీలో EDIT THIS DEVICE అనే బాక్స్ లో మీరు మార్చదలుచుకున్న కొత్త మొబైల్ నెంబర్ ని ఎంటర్ చేసి Change అనే బటన్ క్లిక్ చేస్తే సరిపోతుంది.

గమనిక: వివిధ కంప్యూటర్ చిట్కాలు, ప్రాబ్లెంలకు సమాధానాలు, ఆసక్తికరమైన వెబ్ సైట్లు, ట్యుటోరియళ్లు వంటి అనేక అంశాలపై ఇప్పటికే 8,000 మంది సభ్యులతో 12,500 పోస్టులను కలిగిన కంప్యూటర్ ఎరా సాంకేతిక సహాయం ఫోరంలో వెంటనే ఉచితంగా రిజిస్టర్ అవండి, అమూల్యమైన టెక్నికల్ నాలెడ్జ్ ని స్వంత చేసుకోండి.

ఉచితంగా రిజిస్టర్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

బ్రౌజర్ లో ఫ్లాష్ అడ్వర్ టైజ్ మెంట్లు రాకుండా

ఇటీవలి కాలంలో ఇంటర్నెట్లో మనం ఏ వెబ్ సైట్ ని ఓపెన్ చేస్తున్నా ప్రతీ పేజీలోనూ తప్పనిసరిగా కొన్ని ఫ్లాష్ ఏనిమేషన్లు దర్శనమిస్తున్నాయి. దాదాపు ఇవన్నీ అడ్వర్ టైజ్ మెంట్లు కావడం గమనార్హం. ఇలాంటి మనకు ఏమాత్రం అవసరం లేని ఫ్లాష్ అడ్వర్ టైజ్ మెంట్లు సిస్టంలోకి ప్రవేశించడానికి ఎక్కువ నెట్ బ్యాండ్ విడ్త్ ని ఉపయోగించుకుంటాయి. మనం ఏ సమాచారాన్నయితే కోరుకుంటామో దానికి ప్రాధాన్యత ఇవ్వబడకపోగా ఉన్న బ్యాండ్ విడ్త్ మొత్తాన్నీ ఈ ప్రకటనలే హరిస్తుంటాయి. ఈ నేపధ్యంలో నెట్ కి కనెక్ట్ అయినప్పుడు వెబ్ పేజీల్లో ఫ్లాష్ పైళ్లనేవే చూపించబడకుండా ఏర్పాటు చేసుకోవచ్చు. అదెలాగంటే Start మెనూలో Run కమాండ్ బాక్స్ల్ లోకి వెళ్లి.. regsvr32 c:\windows\system32\macromed\Flash\swflash.ocx/u అని టైప్ చేసి (IE7లో swflash.ocx బదులు flash9c.ocx అనే ఫైల్ పేరు టైప్ చేయాలి) OK బటన్ ప్రెస్ చేయండి. దీంతో ఇకపై వెబ్ పేజీల్లో ఏ విధమైన ఫ్లాష్ ఏనిమేషన్లూ చూపించబడవు. భవిష్యత్సులో ఎప్పుడైనా తిరిగి ఫ్లాష్ ఏనిమేషన్లు చూపించబడేలా ఏర్పాటు చేసుకోవాలంటే మళ్ళీ Start మెనూలో Run కమాండ్ బాక్స్ లోనే regsvr32 c:\windows\system32\macromed\Flash\swflash.ocx అని టైప్ చేసి OK బటన్ ప్రెస్ చేస్తే సరిపోతుంది.

గమనిక: వివిధ కంప్యూటర్ చిట్కాలు, ప్రాబ్లెంలకు సమాధానాలు, ఆసక్తికరమైన వెబ్ సైట్లు, ట్యుటోరియళ్లు వంటి అనేక అంశాలపై ఇప్పటికే 8,000 మంది సభ్యులతో 12,500 పోస్టులను కలిగిన కంప్యూటర్ ఎరా సాంకేతిక సహాయం ఫోరంలో వెంటనే ఉచితంగా రిజిస్టర్ అవండి, అమూల్యమైన టెక్నికల్ నాలెడ్జ్ ని స్వంత చేసుకోండి.

ఉచితంగా రిజిస్టర్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Firefox సెట్టింగులు బ్యాకప్ ఇలా తీసుకోవచ్చు

Firefox బ్రౌజర్ ఉపయోగించేవారు  తమ బ్రౌజర్ లో స్టోర్ చేసుకున్న బుక్ మార్క్ లు, కుకీలు, పాస్ వర్డ్ లు, addonలు మొదలైన అన్ని సెట్టింగులను బ్యాకప్ తీసుకోవడానికి MozBackup అనే చిన్న ఉచిత ప్రోగ్రామ్ ఉపయోగపడుతుంది. దీన్ని ఎలా వాడాలో ఇప్పుడు చూద్దాం.

స్టెప్ 1: http://mozbackup.jasnapaka.com/download.php అనే లింకు నుండి క్రింది చిత్రంలోని విధంగా డౌన్ లోడ్ చేసుకోండి.

స్టెప్ 2: డౌన్ లోడ్ చేసిన ప్రోగ్రామ్ ని ఇన్ స్టాల్ చేసిన తర్వాత దాన్ని రన్ చేసి క్రింది చిత్రంలో విధంగా Next క్లిక్ చేయండి.

స్టెప్ 3: ఇప్పుడు మీ కంప్యూటర్ లో Mozilla Firefox, Thunderbird వంటి పలు Mozilla అప్లికేషన్లు ఉన్నట్లయితే వాటిలో దేని ప్రొఫైల్ ని బ్యాకప్ తీయాలో ఆ అప్లికేషన్ ని ఎంచుకుని Next క్లిక్ చేయండి.

స్టెప్ 4: ఇప్పుడు మీ Firefox బ్రౌజర్ లో ఒకటి కంటే ఎక్కువ ప్రొఫైళ్లు ఉంటే వాటిలో దేన్ని బ్యాకప్ తీయాలో ఎంచుకోవాలి. సహజంగా default అనే ఒకే ఒక్క ప్రొఫైల్ ఉంటుంది కాబట్టి దాన్ని ఎంచుకోండి.

స్టెప్ 5: Save backup to directory అనే ఆప్షన్ వద్ద Browse అనే బటన్ క్లిక్ చేసి బ్యాకప్ తీసిన ప్రొఫైల్ ని హార్డ్ డిస్క్ లో ఏ ప్రదేశంలో సేవ్ చెయ్యాలో పేర్కొనాలి.

స్టెప్ 6: Next క్లిక్ చేయండి.

స్టెప్ 7: ఇప్పుడు మీ Firefox బ్రౌజర్ కి సంబంధించిన Settings, passwords, History, Bookmarks వంటి అంశాల్లో వేటిని బ్యాకప్ తీసుకోవాలనుకుంటున్నారో వాటి ఎదురుగా టిక్ చేయండి.

స్టెప్ 8: Next బటన్ కొట్టండి.

స్టెప్ 9: ఇప్పుడు క్రింది చిత్రంలోని విధంగా మనం ఎంచుకున్న అంశాలు బ్యాకప్ తీయబడడం మొదలవుతుంది.

స్టెప్ 10: చివరిగా Finish అనే బటన్ కొడితే సెట్టింగుల బ్యాకప్ పూర్తయినట్లే.

చివరిగా ఎప్పుడైనా ఆ సెట్టింగులను Restore చేసుకోవాలంటే Restore a profile అనే ఆప్షన్ ని ఎంచుకుంటే సరిపోతుంది.

ఫాంట్ల సంఖ్య ఎక్కువైనప్పుడు సమస్యలు

మనం మేన్యువల్ గా ఇన్ స్టాల్ చెయ్యడంతో పాటు వివిధ అప్లికేషన్ ప్రోగ్రాములతో పాటు పెద్ద సంఖ్యలో ఫాంట్లు సిస్టమ్ లోకి వచ్చి చేరుతుంటాయి. భారీ మొత్తంలో ఫాంట్లు ఉండడం వల్ల సిస్టమ్ స్లో అవడమే కాకుండా ఒక్కోసారి అనూహ్యంగా ప్రవర్తిస్తుంటుంది. సర్వసాధారణంగా ఇప్పటికే కంప్యూటర్లో 800-1000 ఫాంట్లు ఇన్ స్టాల్ చెయ్యబడి ఉన్నట్లయితే కొత్త ఫాంట్లని ఇన్ స్టాల్ చేసేటప్పుడు ఇన్ స్టలేషన్ కి సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి. అదీగాక భారీ మొత్తంలో ఫాంట్లు ఇన్ స్టాల్ చెయ్యబడి ఉన్నప్పుడు Word, Pagemaker, Photoshop వంటి అప్లికేషన్ ప్రోగ్రాములు ఇనీషియలైజ్ అవడానికీ, ఫాంట్ లిస్ట్ నుండి ఫాంట్లని ఎంచుకోవడానికీ ఎక్కువ సమయం పడుతుంటుంది.

Search This Site:

Press75.com Press75.com Press75.com Press75.com

About Me

1996వ సంవత్సరంలో తెలుగులో మొట్టమొదట కంప్యూటర్ సాహిత్యాన్ని ప్రారంభించే అవకాశం నాకు కలిగింది. అదే సమయంలో చెన్నైలో సూపర్ హిట్ తెలుగు ఫిల్మ్ మేగజైన్ కి సబ్ ఎడిటర్ గా కూడా ఏకకాలంలో పనిచేస్తూ 1998 వరకూ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, మనీషా కొయిరాలా, శంకర్, రజనీకాంత్, కమల్ హాసన్ వంటి ప్రముఖులెందరినో ఇంటర్వ్యూలు చేయడం మర్చిపోలేని అనుభవం. అయితే సినిమా రంగంలో ఉన్న అనారోగ్యకరమైన వాతావరణం వల్ల నాకంటూ ఓ ప్రత్యేకమైన ఉనికిని సృష్టించుకోవడం కోసం సినిమా రంగం నుండి బయటకు వచ్చి పూర్తిగా టెక్నాలజీ రంగంలో స్థిరపడడం జరిగింది. 96 నుండి 2001 వరకూ పలు కంప్యూటర్ పత్రికలకు ఎడిటర్ గా పనిచేసి.. 2001 నుండి "కంప్యూటర్ ఎరా" తెలుగు మంత్లీ మేగజైన్ ఎడిటర్ గా పత్రిక మొత్తాన్నీ రూపొందిస్తూ ఉన్నాను. అలాగే తెలుగు టెలివిజన్ ఛానెళ్లలో మొట్టమొదటి టెక్నికల్ phone-in ప్రోగ్రామ్ కి గెస్ట్ గా అటెండ్ అయ్యే అవకాశమూ 2010 జనవరి 20న కలిగింది. అప్పటి నుండి ఇప్పటివరకూ I News, ETV2, ABN ఆంధ్రజ్యోతి, NTV, Zee 24 గంటలు, సాక్షి టివి, మహా టివి, జాగృతి న్యూస్ వంటి ఛానెళ్లలో 90కి పైగా లైవ్, రికార్డెడ్ ప్రోగ్రాముల్ని చేయడం జరిగింది. 2007లో అత్యుత్తమైన నాణ్యతతో కూడిన పోస్టులతో, వీడియోలతో తెలుగులో మొదటి ప్రొఫెషనల్ టెక్నికల్ బ్లాగ్ గానూ, మొదటి వీడియో బ్లాగ్ గానూ ఇప్పుడు మీరు చూస్తున్న బ్లాగ్ ప్రత్యేకతను సంతరించుకుంది. అలాగే 2007 జనవరి 1న ప్రారంభించిన తెలుగులోనే మొట్టమొదటి టెక్నికల్ ఫోరమ్ అయిన "కంప్యూటర్ ఎరా సాంకేతిక ఫోరమ్" 14 వేల మంది సభ్యులతో 10 వేలకు పైగా పోస్టులతో 2009 జూలై వరకూ నిర్వహించబడింది. దాంతోపాటే మొట్టమొదటి తెలుగు టెక్నికల్ ఛాట్ రూమ్ అయిన "కంప్యూటర్ ఎరా సాంకేతిక సహాయం" అనే ఛాట్ రూమ్ రెండేళ్లలో వేలాది మందికి తెలుగు టైప్ చేయడం మొదలుకుని అనేక కంప్యూటర్ సంబంధిత సాంకేతిక సమస్యలకు తక్షణ సహాయం అందించింది. ఇకపోతే http://youtube.com/nallamothu అనే ఛానెల్ లో 361కి పైగా ప్రొఫెషనల్ క్వాలిటీ తెలుగు టెక్నికల్ వీడియోలు అందించాను. ఈ ఛానెల్ కి 1192 మంది సబ్ స్కైబర్లు ఉన్నారు. అందుబాటులో ఉన్న వివిధ మార్గాల ద్వారా తెలుగు వారందరకీ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించే పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాను.

Google Playలో పొందండి

ఇక్కడ RSS Feedకి Subscribe చేసి నేరుగా పోస్ట్ లు పొందండి