Windows Update అయ్యాక రీస్టార్ట్ డైలాగ్ బాక్స్ ని వాయిదా వెయ్యడం
గమనిక: ఇలాంటివే 13,800లకు పైగా అమూల్యమైన టెక్నికల్ పోస్టులను చదవాలనుకుంటే ఈ లింకుని క్లిక్ చేసి ఇప్పటికే 8,300 మంది సభ్యులున్న“కంప్యూటర్ ఎరా” ఫోరమ్ లో ఉచితంగా రిజిస్టర్ చేసుకుని నాలెడ్జ్ ని యాక్సెస్ చేయొచ్చు.
Windows XP ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క జెన్యూన్ వెర్షన్‌ని కలిగిన యూజర్లు ఇంటర్నెట్ నుండి ఎప్పటికప్పుడు ప్యాచ్‌లు, సెక్యూరిటీ ఫిక్స్ లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిసిందే! ఒకవేళ మీ సిస్టమ్‌లో Automatic Update సదుపాయం గనుక ఎనేబుల్ చెయ్యబడి ఉన్నట్లయితే విండోస్ తనంతట తాను స్వయంగా అప్‌డేట్లని మన కంప్యూటర్లోకి డౌన్‌లోడ్ చేస్తుంది. అంతవరకూ బాగానే ఉంది.. అయితే డౌన్‌లోడింగ్ పూర్తయి అప్‌డేట్లు ఇన్‌స్టాల్ చేయబడిన తర్వాత Do you want to restart your computer now? అనే మెసేజ్ చీటికీ మాటికీ సిస్టమ్‌ని రీస్టార్ట్ చేసేటంత వరకూ వస్తూ విసిగిస్తుంటుంది. దీనిని అధిగమించడానికి Task Managerలో wuauclt.exe అనే ప్రాసెస్‌ని End చేయండి. అయితే ఈ పద్ధతి కొద్దిసేపు మాత్రమే రిలీఫ్ ఇస్తుంది. పర్మినెంట్‌గా ‘రీస్టార్ట్’ మెసేజ్ నుండి స్వాంతన పొందాలంటే Start>Run బాక్స్ లో cmd అని టైప్‌చేసి కమాండ్ ప్రామ్ట్ వద్ద..
sc stop wuauserv
అనే కమాండ్‌ని టైప్ చేయండి, గొడవ వదులుతుంది. దీంతో ఇకపై మీరు మేన్యువల్ గా రీస్టార్ట్ చేసే వరకూ ఇంతకుక్రితం డౌన్ లోడ్ అయిన విండోస్ అప్ డేట్లు అప్లై చెయ్యబడవు. ఏదైనా సీరియస్ పనిలో బిజీగా ఉన్నప్పుడు Automatic Update రీస్టార్ట్ చెయ్యమని విసిగిస్తుంటే అధిగమనించడానికి ఈ టెక్నిక్ ఉపయోగపడుతుంది. ఒకవేళ మీకు సమయం ఉంటే అప్ డేట్లు ఇన్ స్టాల్ చెయ్యబడిన వెంటనే రీస్టార్ట్ చేసుకోవడం ఉత్తమం.










