జూన్ 28, 2009 ఆదివారం సాయంత్రం 4 గం.లకు హైదరాబాద్ యూసఫ్ గూడ బస్తీ వద్ద ఉన్న కృష్ణకాంత్ పార్క్ లో నిర్వహించబడిన “కంప్యూటర్ ఎరా సాంకేతిక సహాయం” సభ్యుల సమావేశ వివరాలు ఇవి:
హాజరైన సభ్యుల సంఖ్య: 22
1. ఆర్. శ్రీనివాస్
2. పి. ఆంజనేయులు
3. బి. పట్టాభిరాం
4. టి. శ్రీనివాస బాబు
5. బి. శేఖర్
6. ఐ. వివేకానంద స్వామి
7. నల్లమోతు శ్రీధర్
8. డి. నాగ గోపాలరావు
9. పి. మస్తాన్ వలీ ఖాన్
10. కె. విజయారావు
11. వీరాంజనేయులు
12. జి.కె. మేఘనాధ్
13. పి. శ్రీనివాస్
14. టి. కిషోర్
15. టి. భానుప్రతాప్ రెడ్డి
16. కె. ఇంతియాజ్ అహ్మద్
17. జయకృష్ణ
18. పి. రామేశ్వరరావు
19. కట్టా విజయ్
20. జె. సంతోష్ కుమార్
21. ఎ. నాగబాబు
ఒక సభ్యుని పేరు నమోదు చెయ్యబడలేదు. అలాగే డా. పవన్ గారు రాయవేలూరులో క్యాంప్ లో ఉండడం వల్లా, సాయిపోతూరి గారు, సాయిరాం గారు, మధు గారు వ్యక్తిగత కారణాల వల్ల హాజరు కాలేకపోయారు.

చర్చించబడిన అంశాలు:
1వ టాపిక్: వైరస్ లు, స్పైవేర్లని ఎలా ఎదుర్కోవాలి?
వైరస్, ట్రోజాన్, స్పైవేర్, కీలాగర్, రూట్ కిట్ వంటి వేర్వేరు ప్రమాదకరమైన అంశాల గురించి వివరిస్తూ ఒకప్పుడు వ్యాప్తిలో ఉన్న బూట్ సెక్టార్ వైరస్ లు, ఫైల్ వైరస్ లకు భిన్నంగా పిసి యూజర్ల పిసి వాడకపు తీరుతెన్నులు మారేకొద్దీ వైరస్ ల ఫంక్షనాలిటీ ఎలా మార్చబడుతూ కొత్తరకం వైరస్ లు వ్యాప్తిలోకి తీసుకురాబడుతున్నాయి అన్న విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. వైరస్ ల నుండి రక్షణ పొందాలంటే కేవలం Avira, AVG వంటి ఉచిత ఏంటీవైరస్ సాఫ్ట్ వేర్లు ఇన్ స్టాల్ చేసుకుని అన్ని రకాలుగా సురక్షితంగా ఉన్నామని భావిస్తే సరిపోదనీ, ప్రస్తుతం వైరస్ లు, ట్రోజాన్లు, కీలాగర్లు, నెట్ వర్క్ అటాక్ లు, మెయిల్ క్లయింట్ల ద్వారా తలెత్తే సెక్యూరిటీ లోపాలు, బ్రౌజర్ సంబంధిత ఫిషింగ్ స్కామ్ లు వంటి అనేక ప్రమాదాలు పిసి యూజర్లకు పొంచి ఉన్న తరుణంలో శక్తివంతమైన ఇంటర్నెట్ సెక్యూరిటీ సూట్ ని ప్రతీ పిసి యూజర్ వాడవలసిన అవసరం ఎంతైనా ఉందని వివరించడం జరిగింది. అలాగే దాన్ని ఎప్పటికప్పుడు అప్ డేట్ చేసుకోవడం యొక్క ప్రాధాన్యత ప్రస్తావనకు వచ్చింది.
వైరస్ ల నుండి రక్షణ పొందడానికి అత్యంత సురక్షితమైన మార్గంగా Returnil Virtual System, Windows Steady State, Deep Freeze వంటి డిస్క్ ప్రొటెక్షన్ టూల్స్ గురించి లాప్ టాప్ లో డిమాన్ స్ట్రేట్ చెయ్యడం జరిగింది. మీ సిస్టమ్ కి ఎంతటి ప్రమాదకరమైన వైరస్ సోకినా కేవలం సిస్టమ్ రీస్టార్ట్ చేస్తే ఆ వైరస్ ఆటోమేటిక్ గా తొలగిపోయేలా ఈ టూల్స్ వెసులుబాటు కల్పిస్తాయి. వీటిని ప్రాక్టికల్ గా ఎలా వాడవచ్చో ఓ చిన్న ఫైల్ ని డెస్క్ టాప్ పై క్రియేట్ చేసి రీస్టార్ట్ అయిన తర్వాత ఆ ఫైల్ మాయమవడాన్ని లాప్ టాప్ లో చూపించడం జరిగింది. ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఎన్నేళ్లు గడిచినా వైరస్ ల గురించి దిగులు చెందవలసిన అవసరం ఉండదు.

2వ టాపిక్: పార్టీషన్ బ్యాకప్ టూల్స్
సడన్ గా మీ కంప్యూటర్ హ్యాంగ్ అయి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లోడ్ కాలేదనుకోండి ఏం చేస్తారూ…? కొద్దిగా ట్రబుల్ షూటింగ్ తెలిసిన వారు ఎర్రర్ మెసేజ్ లని బట్టి సమస్యని సాల్వ్ చెయ్యడానికి ప్రయత్నిస్తారు, మరికొందరు Setup సిడి పెట్టి Repair కొడతారు. పై బాపతు పిసి యూజర్లు పోనూ దాదాపు మిగిలిన అందరూ మళ్లీ సిస్టమ్ ని ఫార్మేట్ చేసి విండోస్ ఫ్రెష్ గా ఇన్ స్టాల్ చేసి డివైజ్ డ్రైవర్లు, తమకు కావలసిన సాఫ్ట్ వేర్లు, ఇతర సెట్టింగులు గంటల తరబడి విసుక్కుంటూ మరీ చేసుకుంటూ ఉంటారు. అంత శ్రమ పడవలసిన అవసరం లేకుండా ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో కేవలం 10-25 నిముషాల్లోపు మీ కంప్యూటర్ విండోస్ తోనూ, ఇతర మీ సాఫ్ట్ వేర్లతోనూ, డివైజ్ డ్రైవర్ల తోనూ ఫ్రెష్ గా రెడీ అయ్యే మార్గం ఉంటే ఎగిరి గంతేస్తారు కదూ! ఇప్పటికే చాలామంది Norton Ghost, Acronis True Image వంటి టూల్స్ తో దీన్ని సాధిస్తున్నారు. ఇలా ఆపరేటింగ్ సిస్టమ్ క్రాష్ అయినప్పుడు, బూట్ అవనప్పుడు, ఇతర సమస్యలు తలెత్తినప్పుడు, లేదా ఒకే మాదిరి కంప్యూటర్లు భారీ సంఖ్యలో కొన్నప్పుడు వాటన్నింటిలో వేగంగా విండోస్ ని, ఇతర సాఫ్ట్ వేర్లని లోడ్ చెయ్యడానికి పలు రకాల ఉచిత, పెయిడ్ పార్టీషన్ బ్యాకప్ టూల్స్ పనికొస్తాయి.
Clonezilla, PING, SelfImage, NFGDump, DriveImageXML, MaxBlast, DiscWizard for Windows, Acronis True Image, Norton Ghost వంటి సాఫ్ట్ వేర్ల గురించి సభ్యులకు క్లుప్తంగా పరిచయం చెయ్యడంతో పాటు వాటి వాడకాన్ని లాప్ టాప్ లో screenshots ద్వారా వివరించడం జరిగింది.
3వ టాపిక్: స్లిప్ స్ట్రీమింగ్
పై రెండు టాపిక్స్ ని నేను వివరించగా స్లిప్ స్ర్టీమింగ్ పై కొన్ని నెలలుగా అన్ని మార్గాల్లో స్టడీ చేస్తున్న శ్రీనివాస్ పిరాట్ల గారు ఈ అంశం గురించి స్క్రీన్ షాట్లతో సహా వివరించారు. అస్సలు విండోస్ ఇన్ స్టలేషన్ సమయంలో ప్రోడక్ట్ కీ, లాంగ్వేజ్, అడ్మిన్ యూజర్ నేమ్, పాస్ వర్డ్ వంటివేమీ మనం ఎంటర్ చెయ్యనవసరం లేకుండానే “అన్ అటెండెడ్” ఇన్ స్టలేషన్ ఎలా చెయ్యాలి, విండోస్ XPతో పాటు SP3, VLC, WinRAR, MS Office, Firefox వంటి ఇతర సాఫ్ట్ వేర్లు nLite, MultiSet వంటి టూల్స్ ఉపయోగించి ఆటోమేటెడ్ ఇన్ స్టలేషన్ CD/DVDని ఎలా తయారు చేసుకోవాలి వంటి పలు టెక్నిల్ ల గురించి శ్రీనివాస్ పిరాట్ల గారు సోదాహరణగా వివరించారు. వివిధ పద్ధతుల్లోని లోపాలు, పరిమితులు వివరించారు.
తదుపరి సమావేశం: ఆగస్ట్ 2, 2009. ఆదివారం సాయంత్రం 3 గంటలకు హైద్రాబాద్ యూసఫ్ గూడ బస్తీ వద్ద ఉన్న కృష్ణకాంత్ పార్క్ లో జరుగుతుంది. వీలైన వారందరూ హాజరు కాగలరు.
ఆగస్ట్ సమావేశంలో చర్చించబడే టాపిక్ లు:
1. కొత్త కంప్యూటర్ కొనేటప్పుడు ఎలాంటి ప్రాసెసర్, మదర్ బోర్డ్ ఎంచుకోవాలి?
2. Win 98-Windows 7, RedHat, Ubuntu వంటి వివిధ ఆపరేటింగ్ సిస్టమ్ ల కంపారిజన్
3. ఓపెన్ సోర్స్ సాఫ్ట్ వేర్ల ప్రయోజనాలు, అవి దొరికే మార్గాలు.
పై అంశాలపై మీకు తెలిసిన సమాచారాన్ని కూడా ప్రిపేరై మీటింగులో చర్చించవచ్చు.
ధన్యవాదాలు.
- నల్లమోతు శ్రీధర్