వెబ్ సైట్ క్రియేషన్ గురించి I News లైవ్ షో with Nallamothu Sridhar

వెబ్ సైట్ క్రియేషన్ రిక్వైర్ మెంట్స్ గురించి I News తెలుగు ఛానెల్ జరిపిన 30 నిముషాల లైవ్ ప్రోగ్రామ్ ని ఈ క్రింద మూడు పార్ట్ లుగా చూడవచ్చు.

[http://www.youtube.com/watch?v=s4hAXj-_7-Y]

[http://www.youtube.com/watch?v=pGXAc6Fxosk]

[http://www.youtube.com/watch?v=K8g38rP30cQ]

5 జూలై 2010 నల్లమోతు శ్రీధర్ I News తెలుగు ఛానెల్ లో చేసిన లైవ్ ప్రోగ్రామ్

జూలై 5, 2010 ఉదయం 8.30 గంటల నుండి 9 గంటల మధ్య I News తెలుగు ఛానెల్ లో సాఫ్ట్ వేర్ ఇన్ స్టలేషన్ల గురించి కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ ఎడిటర్ నల్లమోతు శ్రీధర్ చేసిన లైవ్ షోని ఈ క్రింద మూడు భాగాలుగా చూడవచ్చు.

[http://www.youtube.com/watch?v=ozzh6NC7IvQ]

[http://www.youtube.com/watch?v=8T6CAOttQks]

[http://www.youtube.com/watch?v=eW7nSo30JpQ]

మిత్రులకు నమస్కారం..

కంప్యూటర్ ఎరా మాసపత్రిక పాఠకులకు, బ్లాగు మిత్రులకూ అందరికీ నమస్కారం. సరిగ్గా ఏడాది క్రితం పనుల వత్తిడి వల్ల ఈ బ్లాగుకి విరామం ప్రకటించడం జరిగింది. అప్పట్లో ఎందరో మిత్రులు, ఆత్మీయులు పునఃప్రవేశాన్ని ఆకాంక్షించారు. అయితే నెరవేర్చవలసిన బాధ్యతలు చాలా ఉన్నందువల్ల సుదీర్ఘ విరామం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా పూర్తిస్థాయిలో బ్లాగుని ప్రారంభించడం లేదు. కేవలం మేగజైన్ విడుదలకి సంబంధించిన సమాచారం, ఇతర కొన్ని ముఖ్యమైన అంశాలను మిత్రులకు చేరవేయడం గురించీ, అలాగే వీలైనప్పుడు ఉపయోగపడే టెక్నికల్ పోస్టులను చేద్దామన్న ఆలోచనతోనే ఈ బ్లాగుని తిరిగి ప్రారంభించడం జరుగుతోంది. అయితే 2007 నుండి 2009 జూలై వరకూ బ్లాగుని నిర్వహించిన సమయంలో చేసిన 650కి పైగా పోస్టులను మీరు నెలల వారీగా ఆర్కైవ్స్ ని ఓపెన్ చేసి రీడ్ చేయవచ్చు. మీ అందరి సహాయసహకారాలు ఎప్పటిలానే కొనసాగుతాయని ఆకాంక్షిస్తుస్తూ..

- మీ నల్లమోతు శ్రీధర్

ఎడిటర్, కంప్యూటర్ ఎరా తెలుగు మాసపత్రిక

ఇటీవల ఓ టెలివిజన్ ఛానెల్ లో అటెండ్ అయిన ఓ లైవ్ షోని ఈ క్రింద మీతో పంచుకుంటున్నాను.

[http://www.youtube.com/watch?v=4jAmv_jMnhk]

[http://www.youtube.com/watch?v=N7GYkw9nH18]

[http://www.youtube.com/watch?v=xryYQ_OXGl0]

Search This Site:

Press75.com Press75.com Press75.com Press75.com

About Me

1996వ సంవత్సరంలో తెలుగులో మొట్టమొదట కంప్యూటర్ సాహిత్యాన్ని ప్రారంభించే అవకాశం నాకు కలిగింది. అదే సమయంలో చెన్నైలో సూపర్ హిట్ తెలుగు ఫిల్మ్ మేగజైన్ కి సబ్ ఎడిటర్ గా కూడా ఏకకాలంలో పనిచేస్తూ 1998 వరకూ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, మనీషా కొయిరాలా, శంకర్, రజనీకాంత్, కమల్ హాసన్ వంటి ప్రముఖులెందరినో ఇంటర్వ్యూలు చేయడం మర్చిపోలేని అనుభవం. అయితే సినిమా రంగంలో ఉన్న అనారోగ్యకరమైన వాతావరణం వల్ల నాకంటూ ఓ ప్రత్యేకమైన ఉనికిని సృష్టించుకోవడం కోసం సినిమా రంగం నుండి బయటకు వచ్చి పూర్తిగా టెక్నాలజీ రంగంలో స్థిరపడడం జరిగింది. 96 నుండి 2001 వరకూ పలు కంప్యూటర్ పత్రికలకు ఎడిటర్ గా పనిచేసి.. 2001 నుండి "కంప్యూటర్ ఎరా" తెలుగు మంత్లీ మేగజైన్ ఎడిటర్ గా పత్రిక మొత్తాన్నీ రూపొందిస్తూ ఉన్నాను. అలాగే తెలుగు టెలివిజన్ ఛానెళ్లలో మొట్టమొదటి టెక్నికల్ phone-in ప్రోగ్రామ్ కి గెస్ట్ గా అటెండ్ అయ్యే అవకాశమూ 2010 జనవరి 20న కలిగింది. అప్పటి నుండి ఇప్పటివరకూ I News, ETV2, ABN ఆంధ్రజ్యోతి, NTV, Zee 24 గంటలు, సాక్షి టివి, మహా టివి, జాగృతి న్యూస్ వంటి ఛానెళ్లలో 90కి పైగా లైవ్, రికార్డెడ్ ప్రోగ్రాముల్ని చేయడం జరిగింది. 2007లో అత్యుత్తమైన నాణ్యతతో కూడిన పోస్టులతో, వీడియోలతో తెలుగులో మొదటి ప్రొఫెషనల్ టెక్నికల్ బ్లాగ్ గానూ, మొదటి వీడియో బ్లాగ్ గానూ ఇప్పుడు మీరు చూస్తున్న బ్లాగ్ ప్రత్యేకతను సంతరించుకుంది. అలాగే 2007 జనవరి 1న ప్రారంభించిన తెలుగులోనే మొట్టమొదటి టెక్నికల్ ఫోరమ్ అయిన "కంప్యూటర్ ఎరా సాంకేతిక ఫోరమ్" 14 వేల మంది సభ్యులతో 10 వేలకు పైగా పోస్టులతో 2009 జూలై వరకూ నిర్వహించబడింది. దాంతోపాటే మొట్టమొదటి తెలుగు టెక్నికల్ ఛాట్ రూమ్ అయిన "కంప్యూటర్ ఎరా సాంకేతిక సహాయం" అనే ఛాట్ రూమ్ రెండేళ్లలో వేలాది మందికి తెలుగు టైప్ చేయడం మొదలుకుని అనేక కంప్యూటర్ సంబంధిత సాంకేతిక సమస్యలకు తక్షణ సహాయం అందించింది. ఇకపోతే http://youtube.com/nallamothu అనే ఛానెల్ లో 361కి పైగా ప్రొఫెషనల్ క్వాలిటీ తెలుగు టెక్నికల్ వీడియోలు అందించాను. ఈ ఛానెల్ కి 1192 మంది సబ్ స్కైబర్లు ఉన్నారు. అందుబాటులో ఉన్న వివిధ మార్గాల ద్వారా తెలుగు వారందరకీ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించే పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాను.

Google Playలో పొందండి

ఇక్కడ RSS Feedకి Subscribe చేసి నేరుగా పోస్ట్ లు పొందండి