Home » వీడియోలు »సాఫ్ట్ వేర్లు » Currently Reading:

పిసిని వదిలేసి పక్కకు వెళ్లేటప్పుడు ఒక్క క్లిక్ తో ఓపెన్ చేయబడిన మీ ప్రోగ్రాముల్ని లాక్ చేసుకుని వెళ్లడం ఇలా (వీడియో డెమో)

సీరియస్ గా మీరు ఏ Word, Excel ఫైల్ లోనో.. Firefox వంటి బ్రౌజర్ లోనో వెబ్ సైట్లు ఓపెన్ చేసి పనిచేసుకుంటూ ఉన్నారనుకుందాం.

ఉన్న ఫళాన బాస్ పిలిస్తేనో, వేరే పనేదో పడితేనో పిసిని అలాగే వదిలేసి పక్కకు వెళ్లాల్సి వస్తే.. ప్రస్తుతం మనం చేస్తున్న ఫైళ్లూ, ప్రోగ్రాముల జోలికి ఇతరులు ఎవరూ వెళ్లి వాటిలో పొరబాటున మార్పులు చేయకుండా రక్షించుకోవడం కోసం చాలామంది ఏకంగా విండోస్ ని lock చేసి వెళతారు.

దాని బదులు కేవలం మనం ప్రస్తుతం ఓపెన్ చేసి పెట్టుకున్న ప్రోగ్రామ్ నే అది ఎవరికీ ఓపెన్ అవకుండా చిన్న క్లిక్ తో పాస్ వర్డ్ తో లాక్ చేయడం ఎలాగో ఈ వీడియోలో ప్రతీ ఒక్కరికీ అర్థమయ్యే విధంగా ప్రాక్టికల్ గా వివరిస్తున్నాను. స్పీకర్లు ఆన్ చేసుకుని వింటూ చూస్తే ఈజీగా అర్థమవుతుంది.

- నల్లమోతు శ్రీధర్

ఈ వీడియోని మీ మిత్రులతో పంచుకోవాలంటే ఈ లింకుని వారికి పంపించండి: http://www.youtube.com/watch?v=AWjt4HFQ1UI

 ఈ వీడియోని 3Dలోనూ చూడవచ్చు: వీడియోని ప్లే చేసేటప్పుడు ప్లేయర్ పై ఉండే 3D అనే బటన్ ని క్లిక్ చేయడం ద్వారా ఈ వీడియోని 3Dలోనూ మీరు చూడొచ్చు. తెలుగులో మొట్టమొదటి 3D ఛానెల్ అయిన http://youtube.com/nallamothu అనే దానికి మీరు Subscribe చేయొచ్చు.

వీడియోని చూసేటప్పుడు మీ నెట్ కనెక్షన్ స్పీడ్ గా ఉన్నదైతే.. 720p, 1080p అనే హై డెఫినిషన్ (HD) రిజల్యూషన్లని Youtube Playerలో ఎంచుకుని మరింత హై క్వాలిటీతో వీడియోని చూడొచ్చు.

 

 వివిధ టెలివిజన్ ఛానెళ్లలో నేను చేసిన ప్రోగ్రాములు, ఇతర టెక్నికల్ వీడియోల కోసం http://youtube.com/nallamothu అనే ఛానెల్ కి సబ్ స్కైబ్ చేయొచ్చు.

Subscribe to me on YouTube

computerera telugu magazine

Search This Site:

Press75.com Press75.com Press75.com Press75.com

About Me

1996వ సంవత్సరంలో తెలుగులో మొట్టమొదట కంప్యూటర్ సాహిత్యాన్ని ప్రారంభించే అవకాశం నాకు కలిగింది. అదే సమయంలో చెన్నైలో సూపర్ హిట్ తెలుగు ఫిల్మ్ మేగజైన్ కి సబ్ ఎడిటర్ గా కూడా ఏకకాలంలో పనిచేస్తూ 1998 వరకూ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, మనీషా కొయిరాలా, శంకర్, రజనీకాంత్, కమల్ హాసన్ వంటి ప్రముఖులెందరినో ఇంటర్వ్యూలు చేయడం మర్చిపోలేని అనుభవం. అయితే సినిమా రంగంలో ఉన్న అనారోగ్యకరమైన వాతావరణం వల్ల నాకంటూ ఓ ప్రత్యేకమైన ఉనికిని సృష్టించుకోవడం కోసం సినిమా రంగం నుండి బయటకు వచ్చి పూర్తిగా టెక్నాలజీ రంగంలో స్థిరపడడం జరిగింది. 96 నుండి 2001 వరకూ పలు కంప్యూటర్ పత్రికలకు ఎడిటర్ గా పనిచేసి.. 2001 నుండి "కంప్యూటర్ ఎరా" తెలుగు మంత్లీ మేగజైన్ ఎడిటర్ గా పత్రిక మొత్తాన్నీ రూపొందిస్తూ ఉన్నాను. అలాగే తెలుగు టెలివిజన్ ఛానెళ్లలో మొట్టమొదటి టెక్నికల్ phone-in ప్రోగ్రామ్ కి గెస్ట్ గా అటెండ్ అయ్యే అవకాశమూ 2010 జనవరి 20న కలిగింది. అప్పటి నుండి ఇప్పటివరకూ I News, ETV2, ABN ఆంధ్రజ్యోతి, NTV, Zee 24 గంటలు, సాక్షి టివి, మహా టివి, జాగృతి న్యూస్ వంటి ఛానెళ్లలో 90కి పైగా లైవ్, రికార్డెడ్ ప్రోగ్రాముల్ని చేయడం జరిగింది. 2007లో అత్యుత్తమైన నాణ్యతతో కూడిన పోస్టులతో, వీడియోలతో తెలుగులో మొదటి ప్రొఫెషనల్ టెక్నికల్ బ్లాగ్ గానూ, మొదటి వీడియో బ్లాగ్ గానూ ఇప్పుడు మీరు చూస్తున్న బ్లాగ్ ప్రత్యేకతను సంతరించుకుంది. అలాగే 2007 జనవరి 1న ప్రారంభించిన తెలుగులోనే మొట్టమొదటి టెక్నికల్ ఫోరమ్ అయిన "కంప్యూటర్ ఎరా సాంకేతిక ఫోరమ్" 14 వేల మంది సభ్యులతో 10 వేలకు పైగా పోస్టులతో 2009 జూలై వరకూ నిర్వహించబడింది. దాంతోపాటే మొట్టమొదటి తెలుగు టెక్నికల్ ఛాట్ రూమ్ అయిన "కంప్యూటర్ ఎరా సాంకేతిక సహాయం" అనే ఛాట్ రూమ్ రెండేళ్లలో వేలాది మందికి తెలుగు టైప్ చేయడం మొదలుకుని అనేక కంప్యూటర్ సంబంధిత సాంకేతిక సమస్యలకు తక్షణ సహాయం అందించింది. ఇకపోతే http://youtube.com/nallamothu అనే ఛానెల్ లో 361కి పైగా ప్రొఫెషనల్ క్వాలిటీ తెలుగు టెక్నికల్ వీడియోలు అందించాను. ఈ ఛానెల్ కి 1192 మంది సబ్ స్కైబర్లు ఉన్నారు. అందుబాటులో ఉన్న వివిధ మార్గాల ద్వారా తెలుగు వారందరకీ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించే పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాను.

Comment on this Article:

Google Playలో పొందండి

ఇక్కడ RSS Feedకి Subscribe చేసి నేరుగా పోస్ట్ లు పొందండి