తెలుగు భాషాపరిరక్షణకి సరికొత్త ఉద్యమం – మీరూ భాగస్వాములవుతారా?
ఇటీవల చాప క్రింద నీరులా తెలుగు భాషని తమ మేధావితనం నుండి ఊడిపడుతున్న పదాలతో గందరగోళపరిచే ప్రయత్నాలు ఊపందుకున్నాయి. ఉదా.కు.. గట్టిపళ్ళెం(HDD), జాలగూడు, విహారిణి, నియంత్రణా వ్యవస్థ (O.S),క్రమకర్తలు(Programmers),ఖతి (Font),సంగణకం(Computer), విశ్వవ్యాప్త వలయం(World Wide Web), మృదులాంతకం (Software),"పంపక సులభ కవిలె (PDF)"అలాగే సంప్రకారం (Format) వంటివి. వీటికి మొదటి వేదిక బ్లాగులు. ఇలాంటి విచిత్ర పద ప్రయోగాలను అంగీకరిస్తే మనకు తెలుగు భాషపై మమకారం ఉన్నట్లు, వీటినీ, వీటి పుట్టుక యొక్క ప్రామాణీకతని ప్రశ్నిస్తే భాషాద్రోహులుగా ముద్రించ ప్రయత్నిస్తారు. భాష కొందరి సొత్తా? పాండిత్య ప్రదర్శనతో హాస్యాస్ఫూరకంగా ఉండే పదాలను సృష్టించేసి.. "ఇదే సరైన భాష, ఒప్పుకో.. లేదా భాషా ద్రోహిగా మిగిలిపోతావు" అంటే ఏమిటర్థం? ఇప్పటికే చక్కని ప్రమాణాలతో ఉన్న తెలుగు భాషని తూలనాడితే ద్రోహం కానీ ఈ పైత్యపు పదాలను ఒప్పుకోపోవడం భాషపై గౌరవం లేనట్లు ఎలా అవుతుందో సదరు మేధావులకే తెలియాలి.
కొత్తపదాలు పుట్డాలి నిజమే.. కానీ అవి ఉచ్ఛరించడానికి అనువుగా పుట్టించడంలో మేధావులు ఎందుకు శ్రద్థ తీసుకోరు? నోరు తిరగక అందరూ వదిలేసే విధంగా ఉండే పదాల్ని జనసామాన్యంలో ఎన్నాళ్లని బ్రతికించగలరు? ఆంగ్ల పదాలను మక్కీకి మక్కి తర్జుమా చేసే ప్రయత్నంలో "సరళత"ని గాలికొదిలేస్తే ఆ పదాలకు మనుగడ ఎంత?
ఇన్నాళ్లూ నేను తటస్థుడిని, ఇకముందు కూడా అంతే. తెలుగు బ్లాగుల్లో 2007 నుండి నా నడవడికను చూసిన ఎవరికైనా ఇది అర్థమయ్యే ఉంటుంది. భాషని కలుషితం చేస్తున్న తీరుని సహించలేక ఇప్పుడు నేను గళమెత్తడాన్ని నేపధ్యంగా తీసుకుని నాకు రంగూ, రుచీ, వాసనల్ని ఆపాదించి ఏదో గాటన కట్టేద్దామని ఎవరైనా అనుకుంటే అది వారి చిన్నతనమే అవుతుంది. భాషపై ఎవరికి ఎంత బాధ్యత ఉందో అది అర్థం పర్థం లేని పదాలతో కలుషితం కాకుండా రక్షించుకోవలసిన బాధ్యత నాకూ అంతే ఉంది. పడికట్టు వాదనలతో భాష ఔన్నత్యాన్ని, తెలుగు వారిగా మన తెలుగుని రక్షించుకోవలసిన కర్తవ్యాన్నీ సుదీర్ఘ విశ్లేషణలతో ఏకరువు పెడుతూ లోపాయికారీగా తాము తామర తంపరగా సృష్టించే విచిత్ర పదాలకు “ఒప్పుకోలు”ని చదువరుల నుండి పొందగోరే ప్రయత్నాలు అందరికీ అర్థమవుతాయి. భాష మేధావుల మెదళ్లల్లోంచి మాత్రమే కాదు జనించవలసింది.. సామాన్యుల అభిప్రాయాలకూ భాషానిర్మాణంలో స్థానం ఉండాలి. అప్పుడే ఆ భాష అర్థవంతంగా ఉంటుంది. లేదంటే “PDFని ‘పంపక సులభ కవిలె’ అని నిర్థారించేశాం పో.. ఇక వాడుకోండి” అని చేతులు దులుపుకుంటే ఎవరు ఎందుకు వాడాలి? అది సరళమైన పదమా? గుర్తుంచుకుని వాడడానికి?
ఇలాంటి ప్రయత్నాలతో భాషని కలుషితం చేస్తున్న మేధావుల నుండి నా తెలుగు భాష చులకన అవకుండా ఉండేలా ఒక బాధ్యత గల వ్యక్తిగా నేనూ “తెలుగు భాషా పరిరక్షణ” ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నాను. ఇందులో ఎవరైనా భాగస్వాములు కావచ్చు. పూర్తి కార్యాచరణ అందరం కలిసి నిర్మించుకుందాం.దf
తెలుగు భాష ఉనికీ, స్థితి, గతీ, మేధావుల భాషాపాండిత్యంతో గందరగోళపు పదాలతో సామాన్యులకు దూరం అవుతున్న తీరుపై మీరూ ఆందోళన చెందుతుంటే మీ సైట్లలో, బ్లాగుల్లో, మీ ప్రతీ పోస్టుల్లో ఈ క్రింది ఎంబెడ్ కోడ్ ని పొందుపరిచి భాషపై మీకున్న అభిమానాన్ని ప్రదర్శించవచ్చు. కనీసం దీని ద్వారానైనా సదరు మేధావులు డ్రాయింగ్ రూముల్లో కూర్చుని ఏకపక్షంగా విచిత్ర పదాలను తామర తంపరగా సృష్టించి చలామణి చేయప్రయత్నించడం ఎంత తప్పిదమో గ్రహిస్తారని ఆశిద్దాం.

ఫేస్ బుక్ నుండి ఈ అంశం గురించి వచ్చిన కొన్ని స్పందనలు:
-
-
Krishna KrpKhachitam ga sridhar garu, miru cheppindi nutiki nuru pallu yadardham. Bhasha lo saralatal lopiste adi prajalaku cheruva kaledu. adi andariku amodayogyam kadu. samklistamina bhasha vyavaharam ati koddimandi bhasha nipunulaki,panditulaki matrame artham autundi. manam edina vishayanni janam andarito panchukovalante manam vyaktikarinche bhavam chala saralam ga unde andariki artham ayyela undali. miru chese ee prayatnaniku nenu cheygaligindi edina unte tappakunda chestanu sridhar garu.16 minutes ago · -
K Krishna Chaitanya desha basha landu telugu lessa ani nammuthunnam kabatti thappakunda sir………………. Than Q for giving this………
-
Narsing Basuthkar ఈ విషయం పైనే అంధ్ర జ్యొతి ఆదివారం పుస్తకం లో తేది 12-06-11 నాడు పాపినేని శివశంకర్ గారి "అనగా నేమి?" అన్న కథ వచ్చింది….చాలా బాగా రాసారు…చదువగలరు…
7 hours ago ·
-
Santhosh Kumar Sharma Gollapelli ya, even facebook telugu version or windows telugu version asalu use cheyalem
-
Narsing Basuthkar మీరు చెప్పింది అక్షరాల సత్యం.చిన్నప్పటి నుంచి పాఠ్య పుస్తకాల లో ఉండే తెలుగు చూసి ఇది తెలుగు భాషేనా అని సందేహం కలుగుతుండేది..తరువాత కాని తెలిసి రాలేదు.. కాదని…వేలల్లో జీతాలు తీసుకుంటూ తెలుగు భాష ను సాంకేతిక భాషగా అభివృద్ధి చెయ్యలేని మన తెలుగు "పీఠాధిపతులు" ఇందుకు సిగ్గుపడాలి…
-
Hari Krishna padalu chala vichitranga unnai sir….ila computer gurinchi telugu lo matladatam chala kastam…okka padanike pavu ganta pattela undi….
-
Kamalakar Reddy well said and well done. Manam teluguloki saankethika padaalanu alaage grahinchadam manchidi, andaraku arthamavuthundi.
























మీకు నా సంపూర్ణ మద్దతు.
http://ekalingam.blogspot.com/2011/06/blog-post.html
గ్రాంథిక భాషకి పెద్ద పీట వేస్తే ఏమవుతుందో ఈ ఉదాహరణలో చూద్దాం. ఔరంగజేబ్‌కి చిన్నప్పుడు చదువు నేర్పించిన గురువు ఔరంగజేబ్ పెద్దైన తరువాత అతని దగ్గరకి అతని ఆస్థానంలో ఉద్యోగం కోసం వచ్చాడు. “నువ్వు నాకు చిన్నప్పుడు సాధారణ ప్రజలకి అర్థం కాని ఫార్సీ, అరబ్బీ భాషలలో చదువు నేర్పించావు, నేను ఇప్పుడు రాజునైనా ఆ భాషల జ్ఞానం నాకు ఎందుకూ ఉపయోగపడకుండా పోయింది, నేను నీకు ఉద్యోగం ఇవ్వను, నీ ఊరికి వెళ్ళి వ్యవసాయం చేసుకో” అని తన గురువుకి ఔరంగజేబ్ సమాధానం చెప్పాడు.
మెయిల్స్, ఫోన్లు, సోషల్ నెట్ వర్కింగ్ సైట్ల ద్వారా నేను ఊహించిన దానికన్నా పెద్ద సంఖ్యలో ఈ ఉద్యమానికి మద్దతు తెలిపిన మిత్రులందరికీ ధన్యవాదాలు. ఖచ్చితంగా నిర్మాణాత్మకంగా అందరం కలిసి ప్రణాళిక రచిద్దాం. అత్యవసరపడనవసరం లేదు.. అన్ని పధకరచనలూ చేసుకుని మనం చేసే పని చిత్తశుద్ధితో వ్యక్తిగత స్వార్ధాలకు తావు లేకుండా మన తెలుగు భాషారక్షణకై కలిసి పనిచేద్దాం. ధన్యవాదాలు.
ఈ విషయంలో నాపూర్తి మద్దతు మీకుంటుంది.
శ్రీధర్ గారూ!, నమస్తే.
తెలుగు భాషాపరిరక్షణ ఉద్యమం అన్నారు.
బాగుంది. సంతోషం.
అయితే అన్నివిధాలా చెడిపోతున్న తెలుగును సంపూర్ణంగా
పరిరక్షించడానికి ఉద్యమిస్తున్నారా?
లేక కంప్యూటర్ పరంగా ఇంగ్లీషుభాషాపదాలకు బదులుగా వాడే తెలుగుపదాలను సరియైనవి నిర్ణయించడంకోసం
ఉద్యమిస్తున్నారా?
మీవ్యాసాన్ని బట్టి కంప్యూటర్ కు సంబంధించిన సరైన తెలుగుపదాలను అందరం కలసి ,అందరికీ ఆమోదయోగ్యంగా
నిర్ణయించడమే మీ సంకల్పంలా (పరిరక్షణోద్యమంలా ) అనిపిస్తోంది..
మొత్తానికి మీది సరైన ఆలోచనే.
నేనూ చేయి కలుపుతాను.
నావంతు సహకారం అందిస్తాను.
ఇంకో విషయం.
ఎవరో మేధావులు తయారుచేశారని మీరిచ్చిన
ఉదాహరణల్లో, గట్టిపళ్లెం, ఒక్కటే తెలుగుపదం.
మిగిలినవన్నీ సంస్కృతపదాలు.
వాటిని తెలుగుపదాలన్న మేధావులెవరు?
ఇక జాలగూడులో ‘జాల’ సంస్కృతం. ‘గూడు’ తెలుగుపదం.
అలాగే పంపక సులభ కవిలె లో ‘సులభ’ సంస్కృతం.
అటూ ఇటూ తెలుగు.
అలా ఎలా తయారుచేశారీ దుష్ట సమాసాల్ని.?
సరే మరొక విషయం.
నిజానికి ఒక వస్తువును ఒక భాషకు చెందినవాడు
తయారుచేసి, తానొక పేరును తనభాషలో నిర్ణయించాక
ఎవరికివారు తమభాషలో దానికి సమానార్థకమైన పదాన్ని
ఏర్పాటు చేద్దామనుకోవడం కృతకమే అవుతుంది తప్ప
సహజం కాదు.
ఉదా: car.
దాన్ని తయారుచేసిన ఆసామి దానికి తన భాషలో పెట్టిన
ఆ పేరుకు మన తెలుగులో ఏమని పేరు పెడితే అర్థమవుతుంది.?
(పెట్టిన తెలుగు పేరుకు car అని మాత్రమే అర్థం రావాలి)
కష్టంకదా!
రచనలైనా అంతే.
ప్రతిభాషకు తమదైన జాతీయాలుంటాయి. ప్రత్యేక పదాలుంటాయి.
వాటిని అనువదించడం అంత సులభం కాదు.
శ్రీనాథుడు, హర్షనైషధాన్ని అనువదిస్తూ, శ్రీహర్షుడు ప్రయోగించిన సంస్కృతవ్యాకరణాంశాన్ని ఒక పద్యంలో , “గమికర్మికృతనైకనీవృతుడనై”
అని అలాగే అనువదించాడు.
సారాంశం ఏమిటంటే అన్నింటికీ అనువాదాలు కుదరడం కష్టం. అని.
అయితే ప్రయత్నించడంలో తప్పు లేదు.
ప్రయత్నంతో దేన్నైనా సాధించవచ్చు.
నా తోడ్పాటు మీకుంటుందని మనవి చేస్తూ,
నాగస్వరం.
శుభం భూయాత్.
శ్రీధర్ గారికి శుభాకాంక్షలు.
ఎన్నో ఆంగ్ల పదాలు మన తెలుగు ప్రజల నాలుకలపై నాట్యమాడుతూ, మన పదాలే అన్నంతగా స్థిరపడిపోయాయి. ఈ పదాలను విడిచిపెట్టి మనం తెలుగులో సంభాషణ చేయలేము. చేసినా ప్రజలకు అర్ధంగాదు. ఉర్దూ, సంస్కృత పదాలెన్నింటటినో తెలుగు తనలో కలుపుకుంది. అలాగే తెలుగు ప్రజల వాడుకలో బాగా బలపడిన, ఇక ఎవరూ పెకలించలేనంతగా పాతుకుపోయిన, ఇంగ్లీషు పదాలను మన తెలుగు డిక్షనరీలో చేర్చటం వల్ల మన భాష తప్పక బలపడుతుంది. సంస్కృత, ఉర్దూ పదాలు వేలాదిగా తెలుగులో చేరకపోయి ఉన్నట్లయితే తెలుగు భాషకీపాటి శక్తి వచ్చి ఉండేది కాదు గదా?
తెలుగులో చేరిన పరభాషాపదాల జాబితా ఇక్కడ చూడండిః
తెలుగు నిఘంటువులో చేరాల్సిన ఇంగ్లీషు పదాలు
2010http://nrahamthulla3.blogspot.com/2010/08/blog-post.html
తెలుగు వారు పలికే ఉర్దూ పదాలు
http://nrahamthulla3.blogspot.com/2010/08/blog-post_29.html
సెల్‌ఫోన్‌లో ఎస్సెమ్మెస్‌లు వచ్చాక.. పొడిపొడి అక్షరాలతో ఇంగ్లి ష్‌లో మెసేజ్‌లు పంపటం అందరికీ అలవాటైంది. అలాగే అన్న దానికి ఇన్నాళ్లూ వాడిన ‘ఓకే’ కాస్తా.. ఇప్పుడు ‘కే’ అయిపోయింది. టేక్ కేర్ అని చెప్పడానికి.. టీసీ అనే ఆంగ్ల అక్షరాలను టైప్ చేస్తే చాలు. ఇలా ఎస్సెమ్మెస్‌లలో వాడే సరికొత్త సంక్షిప్త పదాలు ఎన్నో.. తాజాగా మార్కెట్‌లోకి వచ్చిన ‘న్యూ ఆక్స్‌ఫర్డ్ అమెరికన్ డిక్షనరీ ఆఫ్ ఇంగ్లిష్’ మూడో సంచికలో చేరాయి.
బెస్ట్ ఫ్రెండ్ ఫర్ ఎవర్ అనే అర్థానిచ్చే బీఎఫ్ఎఫ్.. అలాగే టాక్ టూ యూ లేటర్ అని చెప్పే టీటీవైఎల్ వంటి సంక్షిప్త పదాలు వీటిల్లో కొన్ని. ఇటీవల ముగిసిన ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీ ల్లో ప్రేక్షకులను బాగా ప్రభావితం చేసిన నోటితో ఊదే వాయి ద్యం ‘వువుజెలా’ కూడా ఈ డిక్షనరీలోకి వచ్చి చేరింది.
ఇంగ్లిషు భాషలో ఇప్పుడిప్పుడే వాడుకలోకి వస్తున్న.. సోషల్ నెట్‌వర్కిం గ్ (ఒకే అభిరుచి కలిగిన వాళ్లు ఓ సమూహంగా ఏర్పడటం), లిప్‌స్టిక్ లెస్బియన్ (మహిళల్లాగా దుస్తులేసుకొనే నపుంసకులు), స్టేకాషన్ (ఇంటి దగ్గరే ఉండి సెలవులను ఎంజాయ్ చే యడం) వంటి పదాలతో పాటు.. పర్యావరణానికి సంబంధించిన కార్బన్ ఆఫ్‌సెట్టింగ్, గ్రీన్ ఆడిట్, కార్బన్ క్రెడిట్ వంటి కొ త్త కొత్త పదాలను కూడా ఈ నిఘంటువులో పొందుపరిచారు.
ప్రభుత్వ వ్యవహారాల్లో కొత్తగా దొర్లుతున్న పదాలు వాటర్‌బోర్డింగ్, ఎగ్జిట్ స్ట్రాటజీలతో పాటు సరికొత్త సాంకేతిక పదాలు క్లౌడ్ కంప్యూటింగ్, హాష్‌ట్యాగ్, ట్యాగ్ క్లౌడ్ వంటి వాటిని కూడా ఈ డిక్షనరీలో చేర్చారు. ఇలా రెండు వేలకు పైబడిన కొత్త పదాలు, పదబంధాలు, నుడికారాలు ఈ నిఘంటువులో చేరాయి.(ఆంధ్రజ్యోతి23.9.2010)
తెలుగు ప్రజల వాడుకలో బాగా బలపడిన, ఇక ఎవరూ పెకలించలేనంతగా పాతుకుపోయిన, ఇంగ్లీషు పదాలను మన తెలుగు డిక్షనరీలో చేర్చటం వల్ల మన భాష తప్పక బలపడుతుంది.తెలుగునిఘంటువును కూడా ఇలా విస్తరించుకుంటూ పోతే మనభాషకు కొత్తశక్తి వస్తుంది.తెలుగు ప్రజలకు సౌకర్యం పెరుగుతుంది.
Dear sir,
I will give full support to u