సాఫ్ట్ వేర్లు సరిగ్గా ఇన్ స్టాల్ అవలేదని మెసేజ్ వస్తోందా? ఇదీ పరిష్కారం..
విండోస్ పాత వెర్షన్లలో లేని Program Compatibility Assistant అనే ఓ సదుపాయం విండోస్ 7, Vista ఆపరేటింగ్ సిస్టమ్ లలో పొందుపరచబడింది.
మన ఆపరేటింగ్ సిస్టమ్ లో ఇన్ స్టాల్ చేసే ప్రతీ ప్రోగ్రామ్ నీ ఇది పరిశీలిస్తూ ఆ ప్రోగ్రామ్ లోని అంతర్గత అంశాలేమైనా ప్రస్తుతం మనం వాడుతున్న అధునాతన ఆపరేటింగ్ సిస్టమ్ కి కంపాటబుల్ అవని విధంగా ఉన్నాయని భావిస్తే వెంటనే క్రింది చిత్రంలోని విధంగా మెసేజ్ లు చూపిస్తూ ఉంటుంది.

బేసిక్ పిసి యూజర్లకి ఇది మేలే చేస్తుంది. ఒకవేళ మీరు అడ్వాన్స్ డ్ యూజర్లు అయి ఉండీ, మీరు ఇన్ స్టాల్ చేసిన ప్రోగ్రామ్ బాగానే ఇన్ స్టాల్ అయిపోయింది అన్న నమ్మకం మీకు ఉన్నట్లయితే, ఇకపై ఈ మెసేజ్ కన్పించకుండా డిసేబుల్ చేసుకోవచ్చు. దానికి గాను…
స్టెప్ 1: Win+R కీలను ప్రెస్ చేస్తే క్రింది చిత్రంలోని విధంగా Run అనే బాక్స్ వస్తుంది.

స్టెప్ 2: ఈ Run అనే బాక్స్ లో services.msc అని టైప్ చేసి.. Program Compatibility Assistant అనే సర్వీస్ ని వెదికి పట్టుకుని దానిపై రైట్ క్లిక్ చేసి Stop కొట్టండి.

ఆ తర్వాత మళ్లీ రైట్ క్లిక్ చేసి Properties కొట్టి General>Startup Type వద్ద Disabledగా సెట్ చేస్తే ఇకపై విండోస్ బూటింగ్ తో సైతం ఈ సర్వీస్ మళ్లీ ప్రారంభించబడకుండా శాశ్వతంగా డిసేబుల్ చేయబడుతుంది.

వివిధ టెలివిజన్ ఛానెళ్లలో నేను చేసిన ప్రోగ్రాములు, ఇతర టెక్నికల్ వీడియోల కోసం http://youtube.com/nallamothu అనే ఛానెల్ కి సబ్ స్కైబ్ చేయొచ్చు.



















