కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ ఫిబ్రవరి 2011 మార్కెట్లో రిలీజైంది

అనేక సంవత్సరాలుగా తెలుగు పాఠకులకు నాణ్యమైన టెక్నికల్ నాలెడ్జ్ ని అందిస్తూ వస్తున్న "కంప్యూటర్ ఎరా" తెలుగు మాసపత్రిక తాజా ఫిబ్రవరి 2011 సంచిక రాష్ట్రవ్యాప్తంగా పుస్తకాల షాపుల్లో విడుదల అయింది.

కేవలం రూ. 20లకే ఎంత నాలెడ్జ్ లభిస్తోందో ఇప్పటివరకూ "కంప్యూటర్ ఎరా"ని చదవని వారు ఒక్క సంచిక బుక్ షాపుల్లో కొని చూస్తే అర్థమవుతుంది. పాఠకులు పుస్తకాల షాపుల్లో మేగజైన్ ని సులభంగా గుర్తించడం కోసం ఈ క్రింద ఫిబ్రవరి 2011 సంచిక కవర్ పేజీని పొందుపరుస్తున్నాం.

మన పత్రిక సంవత్సర చందా రూ. 240 మాత్రమే. ఇండియాలో ఎక్కడ నివశిస్తున్న వారైనా ఈ క్రింది అడ్రస్ కి చందా మొత్తాన్ని మనియార్డర్ ద్వారా పంపించి ప్రతీ నెలా మేగజైన్ ని నేరుగా మీ ఇంటికే పొందవచ్చు.

BANDLA PUBLICATIONS, 2-2-1130/24/1/D/1, 305, Beside Indian Bank, Shivam Road, New Nallakunta, Hyderabad – 500014. Ph: 9963293399, 04027673494

 

విదేశాల్లో నివశిస్తున్న వారు

http://www.telugudukanam.co.in/more.php?current_product_id=M3708 అనే "తెలుగు దుకాణం" వారి వెబ్ సైట్ ద్వారా ప్రపంచంలోని ఏ ప్రదేశానికి అయినా వారు తెలియజేసిన మొత్తాన్ని చెల్లించి "కంప్యూటర్ ఎరా" తెలుగు పత్రికను తెప్పించుకోవచ్చు.

 

computerera telugu magazine Feb 2011 cover page

మీరు పంపే mails మీదైన styleలో ఇలా పంపండి

ఎవరికైనా మెయిల్ పంపేటప్పుడు ప్లెయిన్ కలర్ లో, స్టైల్ లో పంపితే చదివేవారికి కూడా పెద్దగా ఆసక్తి ఏర్పడదు. అందుకే మీరు ఇకపై ఎవరికి మెయిల్ పంపినా అది మీకు నచ్చిన కలర్ లో, డీఫాల్ట్ స్టైల్ లో పంపించుకోవడం ఎలాగో ఈ క్రింది వీడియోలో వివరిస్తున్నాను. స్పీకర్లు ఆన్ చేసుకుని వింటూ చూస్తే ఈజీగా అర్థమవుతుంది.

ఈ వీడియోని మీ మిత్రులతో పంచుకోవాలంటే ఈ లింకుని వారికి పంపించండి: http://www.youtube.com/watch?v=zh4Lt_OSfk0

[http://www.youtube.com/watch?v=zh4Lt_OSfk0]
 

వివిధ టెలివిజన్ ఛానెళ్లలో నేను చేసిన ప్రోగ్రాములు, ఇతర టెక్నికల్ వీడియోల కోసం http://youtube.com/nallamothu అనే ఛానెల్ కి సబ్ స్కైబ్ చేయొచ్చు.

700వ పోస్ట్ – మీ ఫొటోలతో డాన్స్ చేయించవచ్చు ఇలా!

మిత్రులకు నమస్కారం,

జూలై 2007లో ప్రారంభించబడిన "నల్లమోతు శ్రీధర్ సాంకేతికాలు" బ్లాగ్ ఈ పోస్ట్ తో 700 పోస్టులను పూర్తి చేసుకుంటోంది. అలాగే కామెంట్లు కూడా రౌండ్ ఫిగర్ అయ్యాయి. ఇప్పటివరకూ 950 స్పందనలు వచ్చాయి. అయితే వీటి గురించి ఎప్పుడూ ఆలోచించలేదు అనుకోండి. ఎన్ని కామెంట్లు వచ్చినా ఈ బ్లాగు చాలామందికి ఉపయోగపడుతోందన్న విషయం మాత్రం నా విజిటర్ స్టాటిస్టిక్స్ ద్వారా అర్థమవుతూనే ఉంది. 2007 నుండి 2009 జూలై వరకూ రెండేళ్లపాటు ఈ బ్లాగుని నిర్వహించిన తర్వాత కొద్ది డిటాచ్ మెంట్ కోసం, ఇతర ముఖ్యమైన బాధ్యతల కోసం గత ఏడాదిన్నర కాలంగా బ్లాగ్ ని నిలిపివేసి తిరిగి డిసెంబర్ 2010 నుండి నిర్వహిస్తూ వస్తున్నాను. 1996లో మొట్టమొదటి తెలుగులో సాంకేతిక పత్రికను మొదలుపెట్టిన క్షణం నుండి ఈరోజుటి వరకూ గత 15 సంవత్సరాలుగా టెక్నాలజీని సగటు తెలుగు పిసి వాడకందారునికి సులువుగా అందించడం కోసం నాకు సాధ్యమైనన్ని అన్ని మార్గాల్లోనూ పనిచేస్తున్నాను. వాటిలో ఒక మార్గం మాత్రమే ఈ బ్లాగు. టెక్నికల్ అవేర్ నెస్ కోసం నేను చేస్తున్న ఇతర ప్రాజెక్టులనూ సమన్వయం చేసుకుంటూ ఈ బ్లాగు ద్వారానూ కొందరు మిత్రులకు చేరువ అవుతూ ప్రయాణం సాగిస్తున్నాను. ఈ ప్రయాణంలో 2007 నుండి ఇప్పటివరకూ మీ ఆదరాభిమానాలు కనబరుస్తున్నందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇకపోతే ఈ 700వ పోస్ట్ విషయానికి వస్తే..

ఏదైనా ఫొటోలో మెడ తిన్నగా లేదనుకుందాం. దాన్ని Photoshop CS5లో చాలా ఈజీగా సరిచేసుకోవచ్చు. కేవలం మెడ అనే కాదు ఒక వ్యక్తి యొక్క శరీరంలోని ఏ భాగాన్నయినా Puppet Wrap టూల్ సాయంతో ఎలా బ్రేక్ డాన్స్ వేయించొచ్చో ఈ క్రింద అనుష్క ఫొటోతో డిమాన్ స్ట్రేట్ చేశాను. స్పీకర్లు ఆన్ చేసుకుని వింటూ చూస్తే ఈజీగా అర్థమవుతుంది.

ఈ వీడియోని మీ మిత్రులతో పంచుకోవాలంటే ఈ లింకుని వారికి పంపించండి: http://www.youtube.com/watch?v=ZD0yGiXve3M

[http://www.youtube.com/watch?v=ZD0yGiXve3M]

వివిధ టెలివిజన్ ఛానెళ్లలో నేను చేసిన ప్రోగ్రాములు, ఇతర టెక్నికల్ వీడియోల కోసం http://youtube.com/nallamothu అనే ఛానెల్ కి సబ్ స్కైబ్ చేయొచ్చు.

బ్రౌజర్ plug-ins వల్ల రిస్కులు – అప్ డేటెడ్ గా ఎలా ఉండాలి?

హ్యాకర్లు మన కంప్యూటర్ ని హ్యాక్ చెయ్యడానికి అందుబాటులో ఉన్న మార్గాల్లో లోపభూయిష్టమైన బ్రౌజర్ plug-insని వాడడం ప్రధానమైన మార్గంగా చెప్పుకోవచ్చు. మన కంప్యూటర్లో ఉండే Flash Player, Real Player, Java వంటి అన్ని రకాల plug-insనీ ఎప్పటికప్పుడు అప్ డేటెడ్ గా ఉంచుకోవాలి. వివిధ వెబ్ సైట్లని ఓపెన్ చేయడానికి Firefox బ్రౌజర్ ని ఉపయోగించే వారు తమ పిసిలోని ప్లగ్-ఇన్ లను చిన్న క్లిక్ తో ఎలా అప్ డేటెడ్ గా ఉంచుకోవచ్చో ఈ వీడియోలో తెలియజేస్తున్నాను. స్పీకర్లు ఆన్ చేసుకుని వింటూ చూస్తే ఈజీగా అర్థమవుతుంది.

- నల్లమోతు శ్రీధర్

ఎడిటర్

కంప్యూటర్ ఎరా తెలుగు మంత్లీ మేగజైన్

ఈ వీడియోని మీ మిత్రులతో పంచుకోవాలంటే ఈ లింకుని వారికి పంపించండి: http://www.youtube.com/watch?v=NjAlZU_w9Bs

[http://www.youtube.com/watch?v=NjAlZU_w9Bs]

వివిధ టెలివిజన్ ఛానెళ్లలో నేను చేసిన ప్రోగ్రాములు, ఇతర టెక్నికల్ వీడియోల కోసం http://youtube.com/nallamothu అనే ఛానెల్ కి సబ్ స్కైబ్ చేయొచ్చు.

Blu-Ray సినిమాలు ఎంత క్వాలిటీతో ఉంటాయో ఇదిగో చూడండి (వీడియో)

సిడిలు, డివిడిలు, ప్రస్తుతం Blu-Ray డిస్కులు వాడుకలోకి వచ్చేశాయి. ఇటీవలి కాలంలో Blu-Ray సినిమాలు కూడా వెల్లువలా వస్తున్నాయి. అయితే Blu-Ray డ్రైవ్ ల ధర ఎక్కువ ఉండడం, సినిమాల ధరలూ ఎక్కువ ఉండడం వల్ల చాలా కొద్దిమంది మాత్రమే వీటిని వాడగలుగుతున్నారు. ఈ నేపధ్యంలో Blu-Ray సినిమాలు ఎంత క్వాలిటీగా ఉంటాయో నేను 32 అంగుళాల Sony LCD టివిలో "అవతార్" బ్లూరే సినిమాని ప్లే చేస్తూ ఈ క్రింద వీడియోలో చూపించాను. స్పీకర్లు పెట్టుకుని వింటూ చూస్తే ఆ ఫీల్ ని మీరే అనుభూతి చెందవచ్చు.

- నల్లమోతు శ్రీధర్

ఎడిటర్

కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

గమనిక: ఈ వీడియోని మీ మిత్రులతో పంచుకోవాలంటే ఈ లింకుని వారికి పంపండి: http://www.youtube.com/watch?v=MWROFjoFFts

మరో విషయం: కేవలం రూ. 20 ధర  కలిగిన ఫిబ్రవరి 2011 "కంప్యూటర్ ఎరా" తెలుగు మాసపత్రిక అద్భుతమైన టెక్నికల్ సమాచారంతో జనవరి 31 నాటికి బుక్ షాపుల్లో లభిస్తుంది. మిస్ అవకండి. పత్రిక సంవత్సర చందా వివరాలకు: http://computerera.co.in సైట్ ని సందర్శించండి.

[http://www.youtube.com/watch?v=MWROFjoFFts]

వివిధ టెలివిజన్ ఛానెళ్లలో నేను చేసిన ప్రోగ్రాములు, ఇతర టెక్నికల్ వీడియోల కోసం http://youtube.com/nallamothu అనే ఛానెల్ కి సబ్ స్కైబ్ చేయొచ్చు.

 

 

చదవలేకపోతున్నారా..? ఇలా వినండి!

బాగా అలసిపోయినప్పుడు పిసి ముందు కూర్చుని కళ్లు విప్పార్చుకుని చదివే ఓపిక లేక ఏదైనా నవల్ కి గానీ, ఆన్ లైన్ లో న్యూస్ ఐటెమ్ ని గానీ ఎవరైనా చదివి విన్పిస్తే బాగుణ్ణు అనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని మీరు తప్పక చూసి తీరవలసిందే. మనం టైప్ చేసిన మేటర్ నీ గానీ, వందల కొద్దీ పేజీలు ఉండే సమాచారాన్ని గానీ లేదా, వివిధ న్యూస్ వెబ్ సైట్లలోని సమాచారాన్ని కానీ మనకు చదివి విన్పించడమే కాదు మనం కోరుకుంటే MP3 ఆడియో ఫైళ్లుగా కూడా మార్చే మార్గాన్ని ఈ వీడియోలో వివరిస్తున్నాను. స్పీకర్లు ఆన్ చేసుకుని వింటూ చూస్తే ఈజీగా అర్థమవుతుంది.

ఈ వీడియోని మీ మిత్రులతో పంచుకోవాలంటే ఈ లింక్ ని వారికి పంపించండి: http://www.youtube.com/watch?v=X-MzXsfb868

[http://www.youtube.com/watch?v=X-MzXsfb868]

వివిధ టెలివిజన్ ఛానెళ్లలో నేను చేసిన ప్రోగ్రాములు, ఇతర టెక్నికల్ వీడియోల కోసం http://youtube.com/nallamothu అనే ఛానెల్ కి సబ్ స్కైబ్ చేయొచ్చు.

LED మోనిటర్లు ఎంత క్వాలిటీ ఉంటాయో చూడండి

కొత్తగా మోనిటర్ కొనబోయే వారు చాలామంది ఇప్పటికీ LCD మోనిటర్లనే ఎంచుకుంటూ ఉన్నారు. మన దగ్గర ఓ 10వేలు ఉన్నాయనుకుంటే ఆ పదివేలకు ఎక్కువ అంగుళాల సైజ్ కలిగిన LCD మోనిటర్ కొనొచ్చు అన్న అభిప్రాయంతో ఇలా చేస్తూ ఉన్నారు. అయితే మరో రెండు, మూడు వేలు అదనంగా వెచ్చించి అయినా అద్భుతమైన కలర్ డెప్త్, విజువల్ ఎక్స్ పీరియెన్స్ ని అందించే LED మోనిటర్లని ఎంచుకోవడం చాలా మంచిది. ఈ క్రింది వీడియోలో నాలుగు నెలల క్రితం నేను కొన్న Dell ST2220M అనే LED మోనిటర్ ని సమీక్షిస్తూ అందులోని ప్రత్యేకతలు వివరిస్తున్నాను. స్పీకర్లు ఆన్ చేసుకుని వింటూ అందులో దృశ్యాలు ఎంత స్పష్టంగా కన్పిస్తున్నాయో చూడండి, ఈజీగా అర్థమవుతుంది.

- నల్లమోతు శ్రీధర్

ఎడిటర్

కంప్యూటర్ ఎరా తెలుగు మాసపత్రిక

గమనిక: ఈ వీడియోని మీ మిత్రులతో పంచుకోవాలంటే ఈ లింకుని వారికి పంపించండి: http://www.youtube.com/watch?v=CWzFYV0sZnM

[http://www.youtube.com/watch?v=CWzFYV0sZnM]

వివిధ టెలివిజన్ ఛానెళ్లలో నేను చేసిన ప్రోగ్రాములు, ఇతర టెక్నికల్ వీడియోల కోసం http://youtube.com/nallamothu అనే ఛానెల్ కి సబ్ స్కైబ్ చేయొచ్చు.

ఫొటోషాప్ లో ఒక బ్యాక్ గ్రౌండ్ లో వేరే ఫొటో పెట్టడం ఎలా?

"ఒక బ్యాక్ గ్రౌండ్ లో వేరొక ఫొటో అచ్ఛం కలిసిపోయినట్లు ఎలా పెడతారో" అని 1997 వరకూ అనుకునేవాడిని. మా సూపర్ హిట్ తెలుగు మేగజైన్ కి కవర్ పేజీలు తయారు చేసే పేజ్ లేఅవుట్ ఆర్టిస్టులు రాంబాబు, సుబ్రహ్మణ్యం గార్లు కూడా అప్పట్లో మేన్యువల్ గానే కవర్ పేజీలు సెట్ చేసి ఫిల్మ్ కి పంపేవారు. 1999 నాటికి పూర్తి స్థాయిలో వారూ ఫొటోషాప్ ని వాడడం మొదలుపెట్టిన తర్వాత వారు ఫొటోషాప్ వాడే విధానాన్ని గమనిస్తూ ఒక బ్యాక్ గ్రౌండ్ లో వేరొక ఫొటో ఎంత సులభంగా పెట్టవచ్చో అర్థం చేసుకున్నాను. ఈ నేపధ్యంలో ఇప్పుడిప్పుడే ఫొటోషాప్ నేర్చుకుంటున్న వారికి ఫెధర్ ఎఫెక్ట్ ద్వారా ఫొటోలను మిక్స్ చెయ్యడం ఎలాగో ఈ క్రింది వీడియోలో వివరిస్తున్నాను. స్పీకర్లు ఆన్ చేసుకుని వింటూ చూస్తే ఈజీగా అర్థమవుతుంది.

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

ఈ వీడియో మీ మిత్రులతో షేర్ చేసుకోవాలంటే ఈ లింకు వారికి పంపండిhttp://www.youtube.com/watch?v=hAaUnJtE5Ks

[http://www.youtube.com/watch?v=hAaUnJtE5Ks]

వివిధ టెలివిజన్ ఛానెళ్లలో నేను చేసిన ప్రోగ్రాములు, ఇతర టెక్నికల్ వీడియోల కోసం http://youtube.com/nallamothu అనే ఛానెల్ కి సబ్ స్కైబ్ చేయొచ్చు.

లేటెస్ట్ HTC HD7 విండోస్ మొబైల్ 7 ఫోన్ నీ రివ్యూ చేశాను

Windows Mobile 7 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేసే HTC HD7 ఫోన్ ఈ వీడియో తీసేనాటికి ఇంకా india లో రిలీజ్ కాలేదు. ఇంత ముందుగా ఈ ఫోన్ ని రివ్యూ చేసే అవకాశం మాత్రం నాకు కలిగింది. గతంలో Android ఆధారంగా పనిచేసే HTC Desire, HTC Desire HD ఫోన్లని కూడా ఇలా వీడియోలతో రివ్యూ చేశాను కదా! ఆ కోవలో ఈ తాజా ఫోన్ ఎలా ఉందో మీరే చూడండి.

ఈ వీడియోని మీ మిత్రులతో పంచుకోవాలంటే ఈ లింకుని వారికి పంపించండి: http://www.youtube.com/watch?v=qgsQweRb1g0

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మంత్లీ మేగజైన్

[http://www.youtube.com/watch?v=qgsQweRb1g0]

వివిధ టెలివిజన్ ఛానెళ్లలో నేను చేసిన ప్రోగ్రాములు, ఇతర టెక్నికల్ వీడియోల కోసం http://youtube.com/nallamothu అనే ఛానెల్ కి సబ్ స్కైబ్ చేయొచ్చు.
 

ఇకపై కొత్త పోస్టులు నేరుగా మీ మెయిల్ కే కావాలా? క్రింద మీ మెయిల్ ఐడి టైప్ చేసి Subscribe కొట్టండి:


ETV 2 సఖిలో నిన్న (జనవరి 21, 2011) ప్రసారమైన నా ఎపిసోడ్ వీడియో

మిత్రులకు నమస్కారం. నిన్న (జనవరి 21, 2011, శుక్రవారం) ETV2 సఖి ప్రోగ్రామ్ లో ప్రసారం అయిన నా ప్రోగ్రామ్ వీడియోని ఈ క్రింద పొందుపరుస్తున్నాను. ఆసక్తి ఉన్నవారు చూడగలరు. ధన్యవాదాలు.

ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తో పంచుకోవాలంటే ఈ లింకుని వారికి పంపించండి: http://www.youtube.com/watch?v=PP3gjlqWquo

[http://www.youtube.com/watch?v=PP3gjlqWquo]

వివిధ టెలివిజన్ ఛానెళ్లలో నేను చేసిన ప్రోగ్రాములు, ఇతర టెక్నికల్ వీడియోల కోసం http://youtube.com/nallamothu అనే ఛానెల్ కి సబ్ స్కైబ్ చేయొచ్చు.

 

 

 

ఇకపై కొత్త పోస్టులు నేరుగా మీ మెయిల్ కే కావాలా? క్రింద మీ మెయిల్ ఐడి టైప్ చేసి Subscribe కొట్టండి:

Search This Site:

Press75.com Press75.com Press75.com Press75.com

About Me

1996వ సంవత్సరంలో తెలుగులో మొట్టమొదట కంప్యూటర్ సాహిత్యాన్ని ప్రారంభించే అవకాశం నాకు కలిగింది. అదే సమయంలో చెన్నైలో సూపర్ హిట్ తెలుగు ఫిల్మ్ మేగజైన్ కి సబ్ ఎడిటర్ గా కూడా ఏకకాలంలో పనిచేస్తూ 1998 వరకూ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, మనీషా కొయిరాలా, శంకర్, రజనీకాంత్, కమల్ హాసన్ వంటి ప్రముఖులెందరినో ఇంటర్వ్యూలు చేయడం మర్చిపోలేని అనుభవం. అయితే సినిమా రంగంలో ఉన్న అనారోగ్యకరమైన వాతావరణం వల్ల నాకంటూ ఓ ప్రత్యేకమైన ఉనికిని సృష్టించుకోవడం కోసం సినిమా రంగం నుండి బయటకు వచ్చి పూర్తిగా టెక్నాలజీ రంగంలో స్థిరపడడం జరిగింది. 96 నుండి 2001 వరకూ పలు కంప్యూటర్ పత్రికలకు ఎడిటర్ గా పనిచేసి.. 2001 నుండి "కంప్యూటర్ ఎరా" తెలుగు మంత్లీ మేగజైన్ ఎడిటర్ గా పత్రిక మొత్తాన్నీ రూపొందిస్తూ ఉన్నాను. అలాగే తెలుగు టెలివిజన్ ఛానెళ్లలో మొట్టమొదటి టెక్నికల్ phone-in ప్రోగ్రామ్ కి గెస్ట్ గా అటెండ్ అయ్యే అవకాశమూ 2010 జనవరి 20న కలిగింది. అప్పటి నుండి ఇప్పటివరకూ I News, ETV2, ABN ఆంధ్రజ్యోతి, NTV, Zee 24 గంటలు, సాక్షి టివి, మహా టివి, జాగృతి న్యూస్ వంటి ఛానెళ్లలో 90కి పైగా లైవ్, రికార్డెడ్ ప్రోగ్రాముల్ని చేయడం జరిగింది. 2007లో అత్యుత్తమైన నాణ్యతతో కూడిన పోస్టులతో, వీడియోలతో తెలుగులో మొదటి ప్రొఫెషనల్ టెక్నికల్ బ్లాగ్ గానూ, మొదటి వీడియో బ్లాగ్ గానూ ఇప్పుడు మీరు చూస్తున్న బ్లాగ్ ప్రత్యేకతను సంతరించుకుంది. అలాగే 2007 జనవరి 1న ప్రారంభించిన తెలుగులోనే మొట్టమొదటి టెక్నికల్ ఫోరమ్ అయిన "కంప్యూటర్ ఎరా సాంకేతిక ఫోరమ్" 14 వేల మంది సభ్యులతో 10 వేలకు పైగా పోస్టులతో 2009 జూలై వరకూ నిర్వహించబడింది. దాంతోపాటే మొట్టమొదటి తెలుగు టెక్నికల్ ఛాట్ రూమ్ అయిన "కంప్యూటర్ ఎరా సాంకేతిక సహాయం" అనే ఛాట్ రూమ్ రెండేళ్లలో వేలాది మందికి తెలుగు టైప్ చేయడం మొదలుకుని అనేక కంప్యూటర్ సంబంధిత సాంకేతిక సమస్యలకు తక్షణ సహాయం అందించింది. ఇకపోతే http://youtube.com/nallamothu అనే ఛానెల్ లో 361కి పైగా ప్రొఫెషనల్ క్వాలిటీ తెలుగు టెక్నికల్ వీడియోలు అందించాను. ఈ ఛానెల్ కి 1192 మంది సబ్ స్కైబర్లు ఉన్నారు. అందుబాటులో ఉన్న వివిధ మార్గాల ద్వారా తెలుగు వారందరకీ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించే పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాను.

Google Playలో పొందండి

ఇక్కడ RSS Feedకి Subscribe చేసి నేరుగా పోస్ట్ లు పొందండి