Monthly Archives: March 2011

నా సెగేట్ 500 GB పోర్టబుల్ హార్క్ డిస్క్ ని సీల్ తీస్తూ వీడియో డిమాన్ స్ట్రేషన్

రూ. 2500కే జేబులో పెట్టుకు వెళ్లగలిగే 500 GB పోర్టబుల్ USB ఎక్స్ టర్నల్ హార్డ్ డిస్క్ వస్తుంటే ఇక మన స్టోరేజ్ అవసరాలకు లోటేం ఉంటుంది చెప్పండి. 500 GB హార్డ్ డిస్క్ ని అప్పటికప్పుడు సీల్ విప్పుతూ ఈ వీడియోలో దీని సదుపాయాల గురించి మీకు వివరిస్తున్నాను. స్పీకర్లు ఆన్ చేసుకుని వింటూ చూస్తే ఈజీగా అర్థమవుతుంది.

– నల్లమోతు శ్రీధర్

ఎడిటర్

కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

గమనిక: ఈ వీడియోని మీ మిత్రులతో పంచుకోవాలంటే ఈ లింక్ ని వారికి పంపించండి: http://www.youtube.com/watch?v=sFLdRoFymak

ఈ వీడియోని చూసేటప్పుడు మీ నెట్ కనెక్షన్ స్పీడ్ గా ఉన్నదైతే.. 720p, 1080p అనే హై డెఫినిషన్ (HD) రిజల్యూషన్లని Youtube Playerలో ఎంచుకుని మరింత హై క్వాలిటీతో వీడియోని చూడొచ్చు.

[http://www.youtube.com/watch?v=sFLdRoFymak]

 

వివిధ టెలివిజన్ ఛానెళ్లలో నేను చేసిన ప్రోగ్రాములు, ఇతర టెక్నికల్ వీడియోల కోసం http://youtube.com/nallamothu అనే ఛానెల్ కి సబ్ స్కైబ్ చేయొచ్చు.

 

computerera telugu magazine

ఫొటోషాప్ లో ఫన్నీ ఫొటోలను తయారు చేయవచ్చిలా (వీడియో డెమో)

ఒక ఫొటోలో ఉండే చిన్న చిన్న లోపాలను సరిచేసుకోవడంతో పాటు ఫొటోల్లోని వివిధ ప్రాపర్టీలూ, మనుషుల ఆకారాల్లోని కళ్లూ, నోరూ, ముక్కూ వంటి వివిధ భాగాలను తగిన విధంగా అడ్జెస్ట్ చేసుకోవడం ద్వారా ఎంతటి అనూహ్యమైన ఎఫెక్టులను ఫొటోషాప్ లో పొందవచ్చో ఈ క్రింది వీడియోలో వివరిస్తున్నాను. స్పీకర్లు ఆన్ చేసుకుని వింటూ చూస్తే ఈజీగా అర్థమవుతుంది.

– నల్లమోతు శ్రీధర్

ఎడిటర్

కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

ఈ వీడియోని మీ మిత్రులతో పంచుకోవాలంటే ఈ లింక్ ని వారికి పంపించండి: http://www.youtube.com/watch?v=pSH8mtZvtpw

[http://www.youtube.com/watch?v=pSH8mtZvtpw]

వివిధ టెలివిజన్ ఛానెళ్లలో నేను చేసిన ప్రోగ్రాములు, ఇతర టెక్నికల్ వీడియోల కోసం http://youtube.com/nallamothu అనే ఛానెల్ కి సబ్ స్కైబ్ చేయొచ్చు.

computerera telugu magazine

మీ కంప్యూటర్లో అన్నింటి కన్నా తక్కువ కెపాసిటీ ఏమిటో తెలుసుకోవడం ఇలా (వీడియో డెమో)

మన పిసిలో అమర్చబడి ఉన్న ప్రాసెసర్, RAM, గ్రాఫిక్ కార్డ్, హార్డ్ డిస్క్ ల పూర్తి కెపాసిటీల ఆధారంగా మన కంప్యూటర్ కి ఓ ర్యాంక్ ఇవ్వబడుతుంది. దీన్నే "సిస్టమ్ రేటింగ్" అని పిలుస్తారనుకోండి, అది వేరే విషయం! ఈ సిస్టమ్ రేటింగ్ ని బట్టి మనది ఏ స్థాయి కంప్యూటరో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఆ రేటింగ్ ని బట్టే మీ కంప్యూటర్లో ఎలాంటి సాఫ్ట్ వేర్లు, గేమ్ లూ సరిగా రన్ అవుతాయీ లేదూ అన్నది ఆధారపడి ఉంటుంది. ఈ నేపధ్యంలో అసలు మీ కంప్యూటర్ యొక్క సిస్టమ్ రేటింగ్ ని ఎలా తెలుసుకోవాలీ, ఆ రేటింగ్ లను ఇచ్చే టెస్ట్ లను ఎంత ఈజీగా చేయవచ్చో ఈ క్రింది వీడియోలో వివరిస్తున్నాను. స్పీకర్లు ఆన్ చేసుకుని వింటూ చూస్తే ఈజీగా అర్థమవుతుంది.

– నల్లమోతు శ్రీధర్

ఎడిటర్

కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

ఈ వీడియోని మీ మిత్రులతో పంచుకోవాలంటే ఈ లింక్ ని వారికి పంపించండి: http://www.youtube.com/watch?v=WWAinyuygyc

[http://www.youtube.com/watch?v=WWAinyuygyc]

 

గమనిక: పనికొచ్చేవీ పనికిరానివీ ఎన్నో విషయాలు మిత్రులకు ఫార్వార్డ్ చేస్తుంటాం. అందరికీ ఉపయోగపడాలన్న తపనతో ఎంతో కష్టపడి తయారు చేసిన ఈ వీడియోని ఈ క్రింద ఉండే Facebook, Google Buzz, Linkedin వంటి సర్వీసుల ద్వారా గానీ, మెయిల్ ద్వారా గానీ మీ మిత్రులకూ చేరవేసి ఈ నాలెడ్జ్ ని వాళ్లూ పొందేలా ఎందుకు చేయకూడదు? ఆలోచించండి.

వివిధ టెలివిజన్ ఛానెళ్లలో నేను చేసిన ప్రోగ్రాములు, ఇతర టెక్నికల్ వీడియోల కోసం http://youtube.com/nallamothu అనే ఛానెల్ కి సబ్ స్కైబ్ చేయొచ్చు.

 

computerera telugu magazine

ఈ మౌస్ ఎలా వంగుతోందో చూడండి.. (నా లేటెస్ట్ మౌస్ వీడియో డెమో)

వైర్ లెస్ మౌస్ లు మనకు కొత్తేమీ కాదు. కానీ ఈ చిత్రంలో నేను చూపిస్తున్న వైర్ లెస్ మౌస్ మాత్రం చాలా కొత్తగానూ, కంఫర్టబుల్ గానూ ఉంటుంది. ఎక్కడికైనా సులభంగా తీసుకువెళ్లగలిగేలా ఉంటూ, అవసరం అయినప్పుడు వంచుకుంటూ, అవసరం లేనప్పుడు నిటారుగా చేస్తూ ఈ మౌస్ ని మనం వాడుకోవచ్చు. ఇటీవల నేను తీసుకున్న ఈ మౌస్ ఎలా పనిచేస్తుందో ఈ వీడియోలో డిమాన్ స్ట్రేట్ చేస్తున్నాను. స్పీకర్లు ఆన్ చేసుకుని వింటూ చూస్తే ఈజీగా అర్థమవుతుంది.

– నల్లమోతు శ్రీధర్

ఎడిటర్

కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

గమనిక: ఈ వీడియోని మీ మిత్రులతో పంచుకోవాలంటే ఈ లింక్ ని వారికి పంపించండి: http://www.youtube.com/watch?v=rpmYGj06I0w

[http://www.youtube.com/watch?v=rpmYGj06I0w]

 

గమనిక: పనికొచ్చేవీ పనికిరానివీ ఎన్నో విషయాలు మిత్రులకు ఫార్వార్డ్ చేస్తుంటాం. అందరికీ ఉపయోగపడాలన్న తపనతో ఎంతో కష్టపడి తయారు చేసిన ఈ వీడియోని ఈ క్రింద ఉండే Facebook, Google Buzz, Linkedin వంటి సర్వీసుల ద్వారా గానీ, మెయిల్ ద్వారా గానీ మీ మిత్రులకూ చేరవేసి ఈ నాలెడ్జ్ ని వాళ్లూ పొందేలా ఎందుకు చేయకూడదు? ఆలోచించండి.

వివిధ టెలివిజన్ ఛానెళ్లలో నేను చేసిన ప్రోగ్రాములు, ఇతర టెక్నికల్ వీడియోల కోసం http://youtube.com/nallamothu అనే ఛానెల్ కి సబ్ స్కైబ్ చేయొచ్చు.

 

computerera telugu magazine

కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ ఏప్రిల్ 2011 సంచిక మార్కెట్లో రిలీజైంది

అనేక సంవత్సరాలుగా తెలుగు పాఠకులకు నాణ్యమైన టెక్నికల్ నాలెడ్జ్ ని అందిస్తూ వస్తున్న "కంప్యూటర్ ఎరా" తెలుగు మాసపత్రిక తాజా ఏప్రిల్ 2011 సంచిక మార్కెట్లో విడుదలైంది. రాష్ట్రవ్యాప్తంగా పుస్తకాల షాపుల్లో 1-2 రోజుల్లోపు దర్శనమిస్తుంది.

కేవలం రూ. 20లకే ఎంత నాలెడ్జ్ లభిస్తోందో ఇప్పటివరకూ "కంప్యూటర్ ఎరా"ని చదవని వారు ఒక్క సంచిక బుక్ షాపుల్లో కొని చూస్తే అర్థమవుతుంది. కేవలం ఈ బ్లాగ్ లోనే ఎంతో అమూల్యమైన సమాచారం ఇస్తుంటే.. మరి పూర్తి సమయం వెచ్చించి ఎంతో శ్రమించి తయారు చేసే "కంప్యూటర్ ఎరా" పత్రిక ఇంకెంత అద్భుతంగా ఉంటుందో మీరే ఊహించవచ్చు.

మన పత్రిక సంవత్సర చందా రూ. 240 మాత్రమే. ఇండియాలో ఎక్కడ నివశిస్తున్న వారైనా ఈ క్రింది అడ్రస్ కి చందా మొత్తాన్ని మనియార్డర్ ద్వారా పంపించి ప్రతీ నెలా మేగజైన్ ని నేరుగా మీ ఇంటికే పొందవచ్చు.

BANDLA PUBLICATIONS, 2-2-1130/24/1/D/1, 305, Beside Indian Bank, Shivam Road, New Nallakunta, Hyderabad – 500014. Ph: 9963293399, 04027673494

 

విదేశాల్లో నివశిస్తున్న వారు

http://www.telugudukanam.co.in/more.php?current_product_id=M3708 అనే "తెలుగు దుకాణం" వారి వెబ్ సైట్ ద్వారా ప్రపంచంలోని ఏ ప్రదేశానికి అయినా వారు తెలియజేసిన మొత్తాన్ని చెల్లించి "కంప్యూటర్ ఎరా" తెలుగు పత్రికను తెప్పించుకోవచ్చు.

వివిధ టెలివిజన్ ఛానెళ్లలో నేను చేసిన ప్రోగ్రాములు, ఇతర టెక్నికల్ వీడియోల కోసం http://youtube.com/nallamothu అనే ఛానెల్ కి సబ్ స్కైబ్ చేయొచ్చు.

 

computerera telugu magazine

మీ ఇంటర్నెట్ ఎంత స్పీడ్ వస్తోందో ప్రతీ క్షణం పొల్లుపోకుండా చూసి స్పీడ్ రాకపోతే ISPలను నిలదీయొచ్చిలా (వీడియో డెమో)

మీ ఇంటర్నెట్ స్పీడ్ ఎంత వస్తుంటుంది.. అని పలు సందర్భాల్లో అనేకమంది మిత్రులను, మన కంప్యూటర్ ఎరా మేగజైన్ పాఠకులను అడిగితే చాలా కొద్ది మంది మాత్రమే ఏవరేజ్ ఎంత స్పీడ్ వస్తుందో చెబుతూ ఉంటారు. అసలు చాలామందికి ప్రతీ క్షణం తాము ఇంటర్నెట్ లో ఎంత వేగంతో ఫైళ్లని డౌన్ లోడ్ చేసుకోగలుగుతున్నామో, ఎంత వేగంతో ఫైళ్లని అప్ లోడ్ చేయగలమో ఎలా తెలుసుకోవాలో తెలియని పరిస్థితి. కొంతమంది speedtest.net వంటి సైట్ల లో శాంపిల్ speed testలు జరుపుకుని అవే కరెక్ట్ స్పీడ్ లని నమ్ముతుంటారు. అలాంటి సైట్లలో మనం సెలెక్ట్ చేసుకునే సర్వర్ లొకేషన్, ఫైల్ సైజ్, ఆ సర్వర్ పై ఆ సమయంలో ఉన్న లోడ్ వంటి పలు అంశాల వల్ల మన నెట్ కనెక్షన్ స్పీడ్ ఎంతో సరిగ్గా తెలుసుకోలేము. దీనికన్నా మెరుగ్గా మన నెట్ స్పీడ్ ని తెలుసుకోవడంతో పాటు, ఏరోజు, ఏ వారం, ఏ నెల ఎంత డౌన్ లోడ్ చేసుకున్నారన్నది రిపోర్టులు సైతం పొందడం ఎలాగో ఈ క్రింది వీడియోలో వివరంగా డిమాన్ స్ట్రేట్ చేశాను. స్పీకర్లు ఆన్ చేసుకుని వింటూ చూస్తే ఈజీగా అర్థమవుతుంది.

– నల్లమోతు శ్రీధర్

ఎడిటర్

కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

గమనిక:  మరో 2 రోజుల్లో (మార్చి 28 నాటికి) "కంప్యూటర్ ఎరా" తెలుగు మేగజైన్ ఏప్రిల్ 2011 సంచిక రాష్ట్రవ్యాప్తంగా బుక్ షాపుల్లో లభిస్తుంది. మిస్ అవకండి.

మరో విషయం ఆఫ్టరాల్ ఒక బ్లాగ్ లో నాణ్యమైన సమాచారం ఇవ్వడానికి ఇంత శ్రమిస్తున్నాం.. మరి "కంప్యూటర్ ఎరా" తెలుగు మేగజైన్ ఇప్పటివరకూ చూడని వారు, ఎంతో శ్రమించి రూపొందించే ఆ పత్రికలో ఎంత అమూల్యమైన సమాచారం ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఒక్క నెలైనా మేగజైన్ చూడండి, నచ్చితే కంటిన్యూ అవండి, లేదంటే ignore చేయొచ్చు.

ఈ వీడియోని మీ మిత్రులతో పంచుకోవాలంటే ఈ లింక్ ని వారికి పంపించండి: http://www.youtube.com/watch?v=tFDMwk03ohE

[http://www.youtube.com/watch?v=tFDMwk03ohE]

 

వివిధ టెలివిజన్ ఛానెళ్లలో నేను చేసిన ప్రోగ్రాములు, ఇతర టెక్నికల్ వీడియోల కోసం http://youtube.com/nallamothu అనే ఛానెల్ కి సబ్ స్కైబ్ చేయొచ్చు.

 

computerera telugu magazine

ఇంటర్నెట్ షేర్ చేసుకోవడానికి తప్ప రూటర్ ఎందుకూ పనికిరాదా? వెబ్ సైట్ల బ్లాకింగ్, ఇతర అంశాలపై వీడియో డెమో

మీ దగ్గర ఒకటే ఇంటర్నెట్ కనెక్షన్ ఉందనుకుందాం. దాన్ని Wireless ద్వారా లేదా Wireతోనూ ఒకటి కంటే ఎక్కువ కంప్యూటర్లకూ, లాప్ టాప్ లకూ, Wi-Fi సదుపాయం ఉన్న సెల్ ఫోన్లకూ పంచుకోవాలనుకున్నారనుకుందాం. సో మొట్టమొదట చేసే పనేమిటి? మార్కెట్లోకి వెళ్లి Netgear వంటి వైర్ లెస్ రూటర్ ని కొనుక్కొచ్చుకుని దాని ద్వారా నెట్ షేరింగ్ ని కాన్ఫిగర్ చేసుకోవడం! చాలామంది అంతటితో వదిలేస్తుంటారు. ఒక రూటర్ లో అంతర్గతంగా ఎన్నో సెట్టింగులు చేసుకోవచ్చు. ఎలాంటి ప్రత్యేకమైన సాఫ్ట్ వేర్లు అవసరం లేకుండా అవసరం లేని వెబ్ సైట్లని బ్లాక్ చేసుకోవచ్చు, మన నెట్ వర్క్ లో ఉన్న ఏదైనా కంప్యూటర్ కి నెట్ కనెక్షన్ అందకుండా అడ్డుకోవచ్చు.. అసలు ఈ సెట్టింగులు అన్నీ ఎక్కడ ఉంటాయి.. ఎలా కాన్ఫిగర్ చేసుకోవాలన్నది ఈ క్రింది వీడియోలో నా రూటర్ ని మీకూ చూపిస్తూ, నా రూటర్ కాన్ఫిగరేషన్ సెట్టింగులను కూడా మీకు చూపిస్తూ వివరంగా డిమాన్ స్ట్రేట్ చేశాను. స్పీకర్లు ఆన్ చేసుకుని వింటూ చూస్తే ఈజీగా అర్థమవుతుంది.

– నల్లమోతు శ్రీధర్

ఎడిటర్

కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

ఈ వీడియోని మీ మిత్రులతో పంచుకోవాలంటే ఈ లింక్ ని వారికి పంపించండి: http://www.youtube.com/watch?v=eRwHjre7YvY

[http://www.youtube.com/watch?v=eRwHjre7YvY]

 

వివిధ టెలివిజన్ ఛానెళ్లలో నేను చేసిన ప్రోగ్రాములు, ఇతర టెక్నికల్ వీడియోల కోసం http://youtube.com/nallamothu అనే ఛానెల్ కి సబ్ స్కైబ్ చేయొచ్చు.

 

computerera telugu magazine

మెయిల్ ఇప్పుడు రాసి పెట్టుకుంటే తర్వాత మీకు నచ్చినప్పుడు ఆటోమేటిక్ గా వెళ్లిపోవాలా? (వీడియో డెమో)

ఇ-మెయిల్ వాడని వాళ్లం ఉండము. కానీ "వచ్చే సంవత్సరం మీ ఫ్రెండ్ పుట్టినరోజుకి ఇప్పుడే మీరు ఓ మెయిల్ తయారు చేసుకుని అది ఆరోజు మిస్ అవకుండా పంపించబడేలా" ఏర్పాటు చేసుకోగలమా? సాధ్యం కాదని అనుకుంటున్నారు కదూ! అది సాధ్యమే ఎలాగో ఈ క్రింది వీడియోలో వివరిస్తున్నాను. స్పీకర్లు ఆన్ చేసుకుని వింటూ చూస్తే ఈజీగా అర్థమవుతుంది. ఈ పద్ధతి ద్వారా ఏ తేదీ, టైమ్ లో అయినా మనం కంప్యూటర్ ఆన్ చేసి ఉన్నా, ఆఫ్ చేసి ఉన్నా ఆటోమేటిక్ గా మనం ఎవరికైతే మెయిల్స్ షెడ్యూల్ చేస్తున్నామో వారికి పంపించబడతాయి. సో మీ ఫ్రెండ్స్, రెలెటివ్స్ యొక్క ఏ ముఖ్యమైన సెలబ్రేషన్ కీ మెయిల్ ద్వారా విష్ చేయడం ఇక మర్చిపోరు.

– నల్లమోతు శ్రీధర్

ఎడిటర్

కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

ఈ వీడియోని మీ మిత్రులతో పంచుకోవాలంటే ఈ లింక్ ని వారికి పంపించండి: http://www.youtube.com/watch?v=Mm6nZXNHpV8

[http://www.youtube.com/watch?v=Mm6nZXNHpV8]

వివిధ టెలివిజన్ ఛానెళ్లలో నేను చేసిన ప్రోగ్రాములు, ఇతర టెక్నికల్ వీడియోల కోసం http://youtube.com/nallamothu అనే ఛానెల్ కి సబ్ స్కైబ్ చేయొచ్చు.

 

computerera telugu magazine

ఈ వారం సమగ్రంగా (మార్చి 14 – 19).. మిస్ అయిన పోస్టులు ఇక్కడ చూడొచ్చు

 

1. ఫొటోషాప్ లో Clipping Path ఎంత ఈజీనో, ఎంత ఉపయోగమో చూడండి..

మన దగ్గర ఉన్న ఫొటోలను కావలసిన భాగం వరకూ సెలెక్ట్ చేసుకుని బ్యాక్ గ్రౌండ్ ని వదిలేసి వర్డ్, పేజ్ మేకర్ వంటి అప్లికేషన్లలో వాడుకుందామన్నా ఆ ఇమేజ్ ల చుట్టూ వైట్ బ్యాక్ గ్రౌండ్ వస్తూనే ఉంటుంది. అలా white బ్యాక్ గ్రౌండ్ రాకుండా కేవలం మనకు కావలసిన ఇమేజ్ వరకూ మాత్రమే ట్రాన్స్ పరెంట్ గా అమర్చుకోవడం ఎలాగో, ఫొటోషాప్ నేర్చుకోవాలనుకునే వారు ప్రతీ ఒక్కరూ తెలుసుకోవలసిన Clipping Path టెక్నిక్ గురించి ఇక్కడ చూడండి: http://www.youtube.com/watch?v=_lrk4rIR0Qg

2. Firefox 4 అంత బాగుందా? చూడాలనిపించడం లేదా?

"ఇంటర్నెట్ ని బ్రౌజ్ చెయ్యడానికి విండోస్ తో పాటు వచ్చే Internet Explorer ఉండగా Firefoxని ఎందుకు వాడాలి".. అని ప్రశ్నించే స్థాయి నుండి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది యూజర్లు Firefox బ్రౌజర్ కి అలవాటు పడిపోయారు. అతి త్వరలో Firefox 4 అధికారికంగా విడుదల కానుంది. ప్రస్తుతం  ఫైనల్ వెర్షన్ కి దాదాపు సమానమైన Firefox 4 RC1 వెర్షన్ మనకు అందుబాటులో ఉంది. దీన్ని నిరభ్యంతరంగా డౌన్ లోడ్ చేసుకుని వాడుకోవచ్చు. Firefox ఇప్పుడు ఉన్న వెర్షన్ తోనే సరిపెట్టుకుంటే చాలు కదా.. కొత్త వెర్షన్ అవసరమా.. అని సందేహం వ్యక్తం చేసేవారి కోసమూ, అలాగే Firefox 4 వెర్షన్ యొక్క గొప్పదనం తెలియని వారి కోసమూ ఈ వీడియోని తయారు చేశాను. దీన్ని చూశాక ఖచ్చితంగా Firefox 4 వైపు మీ మనసు మళ్లుతుంది. మరి ఆలస్యమెందుకు ఈ లింకుని క్లిక్ చేసి చూసేయండి: http://www.youtube.com/watch?v=v6T2oeW1rDk

3. మీ కంప్యూటర్ టైమ్ కరెక్టేనా? ఆటోమేటిక్ గా అదే కరెక్ట్ అయ్యేలా ఎలా సెట్ చేసుకోవచ్చో తెలుసుకోవాలని ఉందా?

కంప్యూటర్లో మనం సెట్ చేసుకునే టైమ్ కరెక్టేనా? గంటల తరబడి పిసిపై గడిపేటప్పుడు టైమ్ సరిగ్గా సెట్ చేసుకోవలసిన అవసరం ఉంది కదా? చాలామంది టివి టైమ్ అనీ, రైల్వే టైమ్ అనీ ఏదో ఒక టైమ్ ని వాచ్ లో సెట్ చేసుకుని అదే టైమ్ ని పిసిలోనూ సెట్ చేస్తుంటారు. ఇలా సరైనదో కాదో తెలియని టైమ్ ని సెట్ చేసుకునే బదులు నేరుగా ఇంటర్నెట్ లో ఉండే వివిధ టైమ్ సర్వర్ల ద్వారానే ప్రతీ క్షణం మన పిసి యొక్క టైమ్ దానంతట అదే అప్ డేట్ చేయబడి మనకు సరైన సమయం చూపించేలా ఏర్పాటు చేసుకుంటే భేషుగ్గా ఉంటుంది కదూ! మరెందుకు ఆలస్యం అదెలాగో ఈ వీడియోలో వివరంగా చూపించాను.. http://www.youtube.com/watch?v=5AlGsz9CZZs

4. Windows Vista, Windows 7 ఒరిజినల్ వెర్షన్లు ఎలా ఉంటాయో బాక్సులతో సహా చూడాలని ఉందా?

ఇటీవలి కాలంలో Windows XPకి గుడ్ బై చెప్పేసి అందరూ ఎంతో ఆకర్షణీయమైన, అనేక సదుపాయాలు కలిగిన Windows 7 వైపు మొగ్తు చూపిస్తున్నారు. ఈ నేపధ్యంలో అసలు Windows Vista కావచ్చు, Windows 7 కావచ్చు.. ఒరిజినల్ వెర్షన్ ని తీసుకున్నప్పుడు లభించే బాక్స్ లు ఎలా ఉంటాయి, వాటిలో ఏమేమి ప్యాక్ చేయబడి లభిస్తాయన్నది నేను వాడుతున్న ఒరిజినల్ వెర్షన్ బాక్స్ లను చూపిస్తూ ఈ వీడియోలో డిమాన్ స్ట్రేట్ చేస్తున్నాను.. http://www.youtube.com/watch?v=LJ94gmo_Ahw

5. ఫోన్ నుండి పూర్తి ఉచితంగా ప్రపంచంలో ఎక్కడికైనా మాట్లాడాలని ఉంటే.. ఇదిగో ఇలా..

ఫోన్ లోనే Skype ఉంటే హాపీగా ప్రపంచంలో ఎక్కడ ఉన్న వారితోనైనా ఫోన్ బిల్లు పడకుండా గంటల తరబడి మాట్లాడుకోవచ్చు కదా. జస్ట్ Wi-Fi లేదా 3G ఇంటర్నెట్ కి మన ఫోన్ ని కనెక్ట్ చేస్తే చాలు. ఈ రెండు అందుబాటులో లేకపోయినా GPRS ఉన్నా సర్ధుకుపోవచ్చు. సెల్ ఫోన్ లో Skype సాఫ్ట్ వేర్ తో ఫోన్ నుండి పిసికి, పిసి నుండి ఫోన్ కీ, లేదా రెండు ఫోన్లకి మధ్యా ఉచిత వాయిస్ కాల్స్ ఎలా చేసుకోవచ్చన్నది ఈ వీడియోలో క్లియర్ గా డిమాన్ స్ట్రేషన్ చేస్తున్నాను. స్పీకర్లు ఆన్ చేసుకుని వింటూ చూస్తే ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ క్లిక్ చేయండి: http://www.youtube.com/watch?v=AcjDeDAaLNw

6. ఉబుంటు ఆపరేటింగ్ సిస్టమ్ లో రూట్ యూజర్ అకౌంట్ కి చేరుకోవడం ఎలా?

ఉబుంటు linux ఆపరేటింగ్ సిస్టమ్ లో మనం ఇన్ స్టలేషన్ సమయంలో క్రియేట్ చేసుకునే డీఫాల్ట్ యూజర్ అకౌంట్ తో పాటు ఓ root యూజర్ అకౌంట్ రహస్యంగా ఉంటుంది. ఆపరేటింగ్ సిస్టమ్ కి సంబంధించిన కీలకమైన మార్పులు చేయడానికి ఈ root అకౌంట్ తో లాగిన్ కావలసి ఉంటుంది. అయితే ఎవరుబడితే వారు.. ఎలా బడితే అలా OSలో మార్పులు చేసి కష్టాలు తెచ్చుకోకుండా ఉండడం కోసం దీన్ని రహస్యంగా పెట్టడం జరిగింది. మీరు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ root యూజర్ గా Ubuntuని ఉపయోగించాలంటే ముందు root accessని పొందవలసి ఉంటుంది. అదెలాగన్నది ఈ  వీడియోలో వివరిస్తున్నాను.. http://www.youtube.com/watch?v=PR7buFwe8Jc

ఉబుంటు ఆపరేటింగ్ సిస్టమ్ లో రూట్ యూజర్ అకౌంట్ కి చేరుకోవడం ఎలా? (వీడియో డెమో)

ఉబుంటు linux ఆపరేటింగ్ సిస్టమ్ లో మనం ఇన్ స్టలేషన్ సమయంలో క్రియేట్ చేసుకునే డీఫాల్ట్ యూజర్ అకౌంట్ తో పాటు ఓ root యూజర్ అకౌంట్ రహస్యంగా ఉంటుంది. ఆపరేటింగ్ సిస్టమ్ కి సంబంధించిన కీలకమైన మార్పులు చేయడానికి ఈ root అకౌంట్ తో లాగిన్ కావలసి ఉంటుంది. అయితే ఎవరుబడితే వారు.. ఎలా బడితే అలా OSలో మార్పులు చేసి కష్టాలు తెచ్చుకోకుండా ఉండడం కోసం దీన్ని రహస్యంగా పెట్టడం జరిగింది. మీరు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ root యూజర్ గా Ubuntuని ఉపయోగించాలంటే ముందు root accessని పొందవలసి ఉంటుంది. అదెలాగన్నది ఈ క్రింది వీడియోలో వివరిస్తున్నాను. స్పీకర్లు ఆన్ చేసుకుని వింటూ చూస్తే ఈజీగా అర్థమవుతుంది.

– నల్లమోతు శ్రీధర్

ఎడిటర్

కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

 ఈ వీడియోని మీ మిత్రులతో పంచుకోవాలంటే ఈ లింక్ ని వారికి పంపించండి: http://www.youtube.com/watch?v=PR7buFwe8Jc

[http://www.youtube.com/watch?v=PR7buFwe8Jc]

వివిధ టెలివిజన్ ఛానెళ్లలో నేను చేసిన ప్రోగ్రాములు, ఇతర టెక్నికల్ వీడియోల కోసం http://youtube.com/nallamothu అనే ఛానెల్ కి సబ్ స్కైబ్ చేయొచ్చు.

 

computerera telugu magazine