విండోస్ 7 ఏక్టివేషన్ ని బ్యాకప్ తీసుకోవడం ఎలా? (వీడియో డెమో)
కంప్యూటర్ ని ఫార్మేట్ చేసిన ప్రతీసారీ విండోస్ ని ఆన్ లైన్ లో ఏక్టివేట్ చేయడం కుదరొచ్చు, కుదరకపోవచ్చు. అలాంటప్పుడు ఇప్పటికే మీ కంప్యూటర్ లో ఏక్టివేట్ అయి ఉన్న ఏక్టివేషన్ సెట్టింగులను బ్యాకప్ తీసుకోవడం తెలిస్తే అవసరం అయినప్పుడు వాటిని తిరిగి ఉపయోగించుకోవచ్చు. అదెలాగన్నది ఈ వీడియోలో కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ ఎడిటర్ నల్లమోతు శ్రీధర్ వివరిస్తున్నారు. స్పీకర్లు ఆన్ చేసుకుని వింటూ చూస్తే ఈజీగా అర్థమవుతుంది.
ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తో పంచుకోవాలంటే ఈ లింక్ ని వారికి పంపించండి. http://www.youtube.com/watch?v=jDbHMGZAAkM
వీడియోని చూసేటప్పుడు మీ నెట్ కనెక్షన్ స్పీడ్ గా ఉన్నదైతే.. 720p, 1080p అనే హై డెఫినిషన్ (HD) రిజల్యూషన్లని Youtube Playerలో ఎంచుకుని మరింత హై క్వాలిటీతో వీడియోని చూడొచ్చు.
వివిధ టెలివిజన్ ఛానెళ్లలో నేను చేసిన ప్రోగ్రాములు, ఇతర టెక్నికల్ వీడియోల కోసం http://youtube.com/nallamothu అనే ఛానెల్ కి సబ్ స్కైబ్ చేయొచ్చు.
తెలుగు భాష ఉనికీ, స్థితి, గతీ, మేధావుల భాషాపాండిత్యంతో గందరగోళపు పదాలతో సామాన్యులకు దూరం అవుతున్న తీరుపై మీరూ ఆందోళన చెందుతుంటే మీ సైట్లలో, బ్లాగుల్లో, మీ ప్రతీ పోస్టుల్లో ఈ క్రింది ఎంబెడ్ కోడ్ ని పొందుపరిచి భాషపై మీకున్న అభిమానాన్ని ప్రదర్శించవచ్చు. కనీసం దీని ద్వారానైనా సదరు మేధావులు ఏకపక్షంగా విచిత్ర పదాలను తామర తంపరగా సృష్టించి చలామణి చేయప్రయత్నించడం ఎంత తప్పిదమో గ్రహిస్తారని ఆశిద్దాం.














