ఇక అసలు విషయానికి వస్తే ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో నకిలీ ప్రొఫైళ్ల గురించి నేను చేసిన స్టోరీ నిన్న (29 జూలై 2011) రాత్రి 9 ప్రైమ్ టైమ్ న్యూస్ లో ప్రసారమైంది. ఈ స్టోరీ ఈరోజు ఉదయం నా ఒపీనియన్ తో రిపీట్ అయింది. అనివార్య కారణాల వల్ల అది రికార్డ్ చేయలేకపోయాను. నిన్న ప్రసారమైన స్పెషల్ స్టోరీ క్రింది వీడియోలో చూడొచ్చు. అలాగే ఫేస్ బుక్ వంటి వాటి లో ప్రైవసీ విషయమై 4 నెలల క్రితం నేను చేసిన విశ్లేషణాత్మకమైన వీడియో క్రింద చూడొచ్చు, టివిలో ప్రసారమైన విజువల్స్ లో రిలవెంట్ టాపిక్ అవడం వల్ల గతంలో నేను చేసిన వీడియో దృశ్యాలను చూపించడం జరిగింది.
వీడియోని చూసేటప్పుడు మీ నెట్ కనెక్షన్ స్పీడ్ గా ఉన్నదైతే.. 720p, 1080p అనే హై డెఫినిషన్ (HD) రిజల్యూషన్లని Youtube Playerలో ఎంచుకుని మరింత హై క్వాలిటీతో వీడియోని చూడొచ్చు.
వివిధ టెలివిజన్ ఛానెళ్లలో నేను చేసిన ప్రోగ్రాములు, ఇతర టెక్నికల్ వీడియోల కోసం http://youtube.com/nallamothu అనే ఛానెల్ కి సబ్ స్కైబ్ చేయొచ్చు.
గత ఆఫర్లలో లైసెన్స్ లు గెలుచుకున్న వారూ కొత్త ఆఫర్లకు అర్హులే.
ఈ ఆఫర్ మీకు లభించే సమయం: 29 జూలై 2011 ఉదయం 10 గంటల నుండి 3 ఆగస్ట్ 2011 ఉదయం10 గంటల వరకూ (మొత్తం 5 రోజుల పాటు)
మీరు గిఫ్ట్ కూపన్ ఎలా పొందాలో వివరాలు అడుగున ఉన్నాయి చూడండి.
పుస్తకాలన్నా, చక్కని సాహిత్యమన్నా ఆసక్తి లేని వారు ఉండరు. అయితే వృత్తి ఉద్యోగాల్లో, పనుల వత్తిడుల్లో పుస్తకాలను వెంట తీసుకువెళ్లి తీరుబడిగా చదువుకునే వెసులుబాటు ఎవరికీ దొరకట్లేదు. మన ఆనందాలైనా, అభిరుచులైనా, స్నేహితులైనా, చదువైనా, రాతలైనా సకలం కంప్యూటర్లూ, మొబైళ్లతోనే ముడిపడిపోయినప్పుడు కంప్యూటర్లోనే అద్భుతమైన రచనలను చదువుకునే అవకాశం దొరికితే బాగుంటుంది కదా! ఆ అవసరాన్ని తీర్చేదే "Kinige.com (కినిగె.కామ్)" అనే సైటు!
ఇ-బుక్స్ దొరికే సైట్లు చాలానే ఉన్నాయి కదా.. ఇదే ఎందుకు?
మనం సాహిత్యాన్ని అభిమానిస్తాం. రచయితల్ని ఆరాధిస్తాం. కానీ ఆ రచయితలు మరో నాలుగు రచనలు చేయాలన్నా మనం పుస్తకాలను కొంటేనే కదా వారు పొట్టపోసుకుని అద్భుతమైన సాహిత్యాన్ని మనకు అందించగలిగేది! మరి చాలా సైట్లలో దొంగతనంగా పుస్తకాలను స్కాన్ చేసి పెట్టే ఇ-పుస్తకాలను డౌన్ లోడ్ చేసుకోవడం ద్వారా సాహిత్యాభిమానులుగా సాహిత్యాన్ని మనం బ్రతికిస్తున్నామా? చంపేస్తున్నామా?
సరిగ్గా ఇక్కడే ఈ "కినిగె" సైట్ తన ప్రత్యేకతను చాటుకుంటుంది. నేరుగా రచయితల అనుమతితో పుస్తకాలను చవక ధరలకు ఆన్ లైన్ లో విక్రయిస్తూ, అద్దెకు ఇస్తూ అటు రచయితలకు ఆదాయంతో పాటు ఇటు పుస్తక ప్రియులకు ఒరిజినల్ సాహిత్యాన్ని దర్జాగా చదువుతున్నామన్న అనుభూతినీ మిగుల్చుతుంది. ఈ క్రింది వీడియోలో kinige.com సైట్ లో రిజిస్టర్ చేసుకోవడం మొదలుకుని, పుస్తకాలు కొనడం, అద్దెకు తీసుకోవడం, స్నేహితులకు గిఫ్ట్ లు పంపడం వంటి పలు విషయాలను పూసగుచ్చినట్లు చూపించడం జరిగింది. స్పీకర్లు ఆన్ చేసుకుని వింటూ చూస్తే ఈజీగా అర్థమవుతుంది.
తెలుగు, ఇంగ్లీషు సాహిత్యానికి సంబంధించి విస్తృత శ్రేణిలో పుస్తకాలు kinige.com సైట్ లో లభిస్తున్నాయి. కధలు, కవితలు, ఫిక్షన్, నాన్-ఫిక్షన్, ఆధ్యాత్మికం, సినిమా, రాజకీయాలూ, పిల్లల పుస్తకాలూ వంటి వివిధ విభాగాల క్రింద ఇవి అందుబాటులో ఉన్నాయి.
ఒక పుస్తకాన్ని పుస్తకం అసలు ధరతో సంబంధం లేకుండా రూ. 30 నామమాత్రపు అద్దెతో నెలరోజుల పాటు చదువుకునే అవకాశం ఈ సైట్ కల్పిస్తోంది.
పుస్తకాలను మనకు మనం అద్దెకు తీసుకోవడం, కొనడమే కాకుండా మన ఆత్మీయులకు వారి పుట్టినరోజులు, ఇతర ప్రత్యేకరోజుల్లో గిఫ్ట్ గా పంపించవచ్చు. మనం గిఫ్ట్ గా పంపే పుస్తకాలు వారికి నచ్చుతాయో లేదోనని సందేహంగా ఉంటే మన అకౌంట్ లోని కొంత బ్యాలెన్స్ ని వారికి గిఫ్ట్ గా పంపించుకోనూ వచ్చు. ఆ అమౌంట్ తో వారు వారికి నచ్చిన పుస్తకాలను kinige.com సైట్ నుండి కొనుక్కోగలుగతారు లేదా అద్దెకు తీసుకుంటారు.
మన అకౌంట్ లోకి విదేశాల్లో నివశిస్తున్న వారు Paypal ద్వారానూ (పేపాల్ తో $10 రీఛార్జ్ చేసుకుంటే రూ. 400 బ్యాలెన్స్ లభిస్తుంది), ఇండియాలో నివశిస్తున్నవారు వివిధ బ్యాంకుల క్రెడిట్, డెబిట్ (ATM) కార్డులు, క్యాష్ కార్డులూ, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సదుపాయాల ద్వారానూ అమౌంట్ ని రీఛార్జ్ చేసుకుని వాడుకోవచ్చు.
అటు ఆఫీసులోనూ, ఇటు ఇంట్లోనూ వేర్వేరు కంప్యూటర్లలో, iPhone, iPad వంటి పలు రకాల మొబైల్ డివైజ్ లలోనూ, అలాగే Windows, Mac, Linux వంటి అన్ని ఆపరేటింగ్ సిస్టమ్ లలోనూ మనం కొన్న/అద్దెకు తీసుకున్న పుస్తకాలను చదువుకోవచ్చు..
మొత్తం 100 మందికి ఒక్కొక్కటి రూ. 100 విలువ గల మొత్తం రూ. 10,000 విలువైన 100 గిఫ్ట్ కూపన్లు.
ఒక్కొకటి ధర ఎంత?
విడిగా కొనాలంటే రూ. 100. మీకు పూర్తి ఉచితం.
పుస్తకాలంటున్నారు, చాలా సైట్లలో కన్పించే మాదిరి పైరేటెడ్ వా?
అస్సలు కానేకాదు. 100% ఇవి రచయితల అనుమతితో అందించబడుతున్న అసలు పుస్తకాలు. దర్జాగా మీరు వీటిని ఆస్వాదించవచ్చు.
గిఫ్ట్ కూపన్ గెలుపొందాలంటే రూల్స్ ఎలా ఉంటాయి?
అస్సలు రూల్స్ ఏమీ ఉండవు. ఈ రోజు (29 జూలై 2011 ఉదయం 10 గంటల నుండి 3 ఆగస్ట్ 2011 ఉదయం10 గంటల వరకూ (మొత్తం 5 రోజుల పాటు) sridharcera@gmail.com అనే నా మెయిల్ ఐడికి ఈ క్రింది వివరాలతో పాటు రాసి పంపండి. గతంలో ముగిసిన ఆఫర్లకి రిక్వెస్ట్ పంపితే పరిగణించబడవు. ఇప్పుడు నడుస్తున్న ఆఫర్ కే మీరు రిక్వెస్ట్ పంపాలి.
1. మీ పూర్తి పేరు
2. మీ అసలైన (నకిలీవీ, వాడనివీ పనికిరావు) మెయిల్ ఐడి
3. మీ ఫోన్ నెంబర్
4. ఊరి పేరు.
5. మీరు కోరుతున్న గిఫ్ట్ కూపన్ పేరుగా "Kinige" అనే పేరునీ కూడా మీరు పంపే మెయిల్ లో పేర్కొనాలి.
పై వివరాలతో రిక్వెస్ట్ పంపిన వారి నుండి వారి అవసరాన్ని గుర్తించి randomగా 100 గిఫ్ట్ కూపన్లు కేటాయిస్తాం. ఇంకేమీ రూల్స్ లేవు. ఆగస్ట్ 5 ఉదయం 10 గంటల నుండి 12 గంటల లోపు మీ గిఫ్ట్ కూపన్లు మీకు మెయిల్ ద్వారా పంపుతాను.
మీరు నిరంతరం గూగుల్ +, ఫేస్ బుక్, ట్విట్టర్, బజ్, ఆర్కుట్ విండోల వైపు లేటెస్ట్ అప్ డేట్లు ఏమైనా వచ్చాయేమోనని చూస్తున్నారా? ఇలా మనకు తెలియకుండానే మనం ఎంత సమయాన్ని వృథా చేస్తున్నామో కదా! మనం చేయాల్సిన ఇతర పనులపై పూర్తిగా ఏకాగ్రత నిలపాల్సి ఉన్నప్పుడు వివిధ సైట్లు మన సమయాన్ని హరించకుండా ఏర్పాటు చేసుకోవచ్చు. రోజు మొత్తంలో కొన్ని గంటలు మాత్రమే, లేదా ఒక గంటలో కొన్ని నిముషాలు మాత్రమే మనం ఎక్కువగా టైమ్ గడుపుతున్న సైట్లు బ్లాక్ చేసుకోవడం ఎలాగో ఈ వీడియోలో వివరించాను. స్పీకర్లు ఆన్ చేసుకుని వింటూ చూస్తే ఈజీగా అర్థమవుతుంది.
వీడియోని చూసేటప్పుడు మీ నెట్ కనెక్షన్ స్పీడ్ గా ఉన్నదైతే.. 720p, 1080p అనే హై డెఫినిషన్ (HD) రిజల్యూషన్లని Youtube Playerలో ఎంచుకుని మరింత హై క్వాలిటీతో వీడియోని చూడొచ్చు.
వివిధ టెలివిజన్ ఛానెళ్లలో నేను చేసిన ప్రోగ్రాములు, ఇతర టెక్నికల్ వీడియోల కోసం http://youtube.com/nallamothu అనే ఛానెల్ కి సబ్ స్కైబ్ చేయొచ్చు.
మైక్రోసాఫ్ట్ నుండి 2013-2014 మధ్య విండోస్ 8 రాబోతోంది. "Windows 7 కన్నా పెద్దగా కొత్త మార్పులేం ఉంటాయిలే.. విండోస్ 8 లో" అని డిసైడ్ అయిపోకండి. ఈ కొత్త వెర్షన్ లో ఆపరేటింగ్ సిస్టమ్ కెర్నల్ మొదలుకుని, నెట్ వర్క్, స్టోరేజ్, ఇంటర్ ఫేస్, డివైజ్ లతో OS కమ్యూనికేట్ చేసే విధానం వంటివన్నీ సమూలంగా మార్చబడుతున్నాయి. పాతా, కొత్త విండోస్ అప్లికేషన్లు అన్నీ టచ్ ఇన్ పుట్ లకు స్పందించేలా OS రూపకల్పన జరుగుతోంది. అలాగే సాధారణ OS ఆధారిత అప్లికేషన్లతో పాటు HTML 5, JavaScript ఆధారంగా తయారు చేయబడే మొబైల్ అప్లికేషన్ల లాంటివీ భారీ సంఖ్యలో Windows 8కి అందుబాటులో ఉండనున్నాయి. ఇవి Internet Explorer 10 వెర్షన్ ఆధారంగా FullScreenలో పనిచేస్తాయి.
ఇక అసలు విషయానికి వస్తే Windows 8 స్వరూపంలో చోటుచేసుకోనున్న Tiles ఇంటర్ ఫేస్ తదితర అంశాలు ఎలా ఉంటాయో నా కంప్యూటర్లో ఈ వీడియోలో వివరిస్తున్నాను. దీని ద్వారా మీకు కొంత అవగాహన రావచ్చు. స్పీకర్లు ఆన్ చేసుకుని వింటూ చూస్తే ఈజీగా అర్థమవుతుంది.
వీడియోని చూసేటప్పుడు మీ నెట్ కనెక్షన్ స్పీడ్ గా ఉన్నదైతే.. 720p, 1080p అనే హై డెఫినిషన్ (HD) రిజల్యూషన్లని Youtube Playerలో ఎంచుకుని మరింత హై క్వాలిటీతో వీడియోని చూడొచ్చు.
వివిధ టెలివిజన్ ఛానెళ్లలో నేను చేసిన ప్రోగ్రాములు, ఇతర టెక్నికల్ వీడియోల కోసం http://youtube.com/nallamothu అనే ఛానెల్ కి సబ్ స్కైబ్ చేయొచ్చు.
మనం వాడే ప్రతీ పిసీలోని మదర్ బోర్డ్ పై CMOS చిప్ ఉంటుందని, అందులోనే BIOS సెట్టింగులన్నీ భద్రపరచబడి ఉంటాయనీ తెలిసిందే. BIOSలోని సెట్టింగులు ఎవరుబడితే వారు మార్చకుండా అందులోకి ప్రవేశించాలంటే సరైన పాస్ వర్డ్ టైప్ చేస్తేనే వెళ్లగలిగేలా మనం రక్షించుకుంటూ ఉంటాం కూడా! అలాగే పిసిలోకి వెళ్లాలన్నా పాస్ వర్డ్ టైప్ చేస్తేనే వెళ్లగలిగేలా కూడా ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం. అయితే ఒక్కోసారి ఈ పాస్ వర్డ్ లను మర్చిపోతాం. దాంతో మనం అటు BIOSలోకీ, ఇటు పిసిలోకీ వెళ్లలేకపోతాం. సరిగ్గా ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లోనే ఈ వీడియోలో నేను చూపిస్తున్న సులువైన చిట్కా మీకు ఉపయోగపడుతుంది. స్పీకర్లు ఆన్ చేసుకుని వింటూ చూస్తే ఈజీగా అర్థమవుతుంది.
వీడియోని చూసేటప్పుడు మీ నెట్ కనెక్షన్ స్పీడ్ గా ఉన్నదైతే.. 720p, 1080p అనే హై డెఫినిషన్ (HD) రిజల్యూషన్లని Youtube Playerలో ఎంచుకుని మరింత హై క్వాలిటీతో వీడియోని చూడొచ్చు.
వివిధ టెలివిజన్ ఛానెళ్లలో నేను చేసిన ప్రోగ్రాములు, ఇతర టెక్నికల్ వీడియోల కోసం http://youtube.com/nallamothu అనే ఛానెల్ కి సబ్ స్కైబ్ చేయొచ్చు.
గమనిక: వివిధ పనుల వత్త్తిడుల వల్ల ఫ్రీ ఆఫర్లు ఈరోజు ప్రకటించలేకపోతున్నాను. మంగళ లేదా బుధవారాల్లో, ఆ తర్వాతా మంచి ఆఫర్లు మీకు అందించబోతున్నాను.
ఇక అసలు విషయానికి వస్తే..
మీరు మీ మొబైల్ ద్వారానో, నెట్ బుక్ ద్వారానో మీ మొబైల్ లోని ఏదైనా SMSని గానీ, మెయిల్ ని గానీ, వెబ్ పేజీని గానీ ప్రింట్ ఇచ్చుకోవచ్చని తెలుసా? మొబైల్ కి ప్రింటర్ ఎలా కనెక్ట్ అవుతుందీ అని ఆశ్చర్యపోతున్నారా? అసలు అదే సాధ్యపడితే ఆఫీస్ కెళ్లే దారిలోనే ప్రింట్ ఇచ్చేస్తే మన ఆఫీసులో ఆ ఫైల్ దానికది ప్రింట్ అయి కూర్చుంటే అద్భుతమే కదా!
నేను చెప్పింది సాధ్యమే! మీకు నమ్మశక్యం కావడానికి నేరుగా నా HTC Desire అనే ఆండ్రాయిడ్ ఫోన్ తో ఓ SMSని ప్రింట్ చేసి మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. స్పీకర్లు ఆన్ చేసుకుని వింటూ చూస్తే ఈజీగా అర్థమవుతుంది.
వీడియోని చూసేటప్పుడు మీ నెట్ కనెక్షన్ స్పీడ్ గా ఉన్నదైతే.. 720p, 1080p అనే హై డెఫినిషన్ (HD) రిజల్యూషన్లని Youtube Playerలో ఎంచుకుని మరింత హై క్వాలిటీతో వీడియోని చూడొచ్చు.
వివిధ టెలివిజన్ ఛానెళ్లలో నేను చేసిన ప్రోగ్రాములు, ఇతర టెక్నికల్ వీడియోల కోసం http://youtube.com/nallamothu అనే ఛానెల్ కి సబ్ స్కైబ్ చేయొచ్చు.
ఈ ఆఫర్ మీకు అందుబాటులో ఉండే సమయం: 21 జూలై 2011 ఉదయం 10 గంటల నుండి 22 జూలై 2011 ఉదయం 10 గంటల వరకూ!
గత ఆఫర్లలో లైసెన్స్ లు గెలుచుకున్న వారూ కొత్త ఆఫర్లకు అర్హులే. కాకపోతే మీకు ఆయా సాఫ్ట్ వేర్లు ఉపయోగపడతాయనిపిస్తేనే రిక్వెస్ట్ పంపండి.
ఆఫర్ ముగిసింది.. ఈ CloneDVD ఆఫర్ లో లైసెన్సులు గెలుచుకున్న వారి వివరాలు ఇవి:
సినిమా డివిడిల్ని మీ పిసిలోకి కాపీ చేయడానికి ప్రయత్నిస్తున్నా కాపీ అవడం లేదా?
మీ దగ్గర DVD 9 సైజ్ లో ఉన్న సినిమాని 4.3 GB స్టోరేజ్ కెపాసిటీ కలిగిన సింగిల్ లేయర్ డివిడిలోకి రైట్ చేసుకోవాలనుకుంటున్నారా?
డివిడిలో ఉన్న సినిమాల్లో నచ్చిన సీన్, సాంగ్ వరకే కట్ చేసుకుని ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా?
ఒక డివిడి సినిమాలో సహజంగా వేర్వేరు ఛాప్టర్లు, మెనూలూ ఉంటాయని మనకు తెలిసిందే కదా! సో మెనూలెందుకు దండగ అనుకుంటున్నారా? డివిడిలోని అవసరం లేని భాగాలను తొలగించి తిరిగి ఖాళీ డిస్కులో రైట్ చేసుకునే వీలుంటే ఎంత బాగుణ్ణూ.. అన్నది మీ ఫీలింగా..?
అయితే మీ అవసరాలన్నింటికీ ఒక్కటే సరైన తరుణోపాయం.. అదే Aviosoft CloneDVD.
ఈ సాఫ్ట్ వేర్ మనకు అందిస్తున్న సదుపాయాలు చూద్దామా?
మనకు బాగా నచ్చిన సినిమాలనూ, వీడియో డివిడిలనూ ఏమాత్రం క్వాలిటీ తగ్గకుండా మరో ఖాళీ డివిడిలోకి కాపీ చేసుకోవచ్చు.
మన దగ్గర ఉన్న ఒరిజినల్ డివిడి కాపీ ప్రొటెక్ట్ చేయబడి ఉన్నా ఫర్వాలేదు. సహజంగా కాపీ ప్రొటెక్ట్ చేయబడిన సినిమాలను మామూలు పద్ధతుల్లో రైట్ చేయడానికి ప్రయత్నించినా, పిసిలోకి కాపీ చేయబోయినా కాపీ ప్రాసెస్ మధ్యలో నిలిచిపోతుంటుంది. అయితే Aviosoft CloneDVD ఇలాంటి అవరోధాలను చిటికెలో తొలగిస్తుంది. ఈ సాఫ్ట్ వేర్ లో పొందుపరచబడిన Ripper వివిధ డివిడిల్లో ఉండే CSS ఎన్ క్రిష్షన్, సోనీ ARccOS వంటి కాపీ ప్రొటెక్షన్ పద్ధతులూ, RPC-I/RPC-II/RCE వంటి వివిధ రీజిన్ ప్రొటెక్షన్లని తొలగించి డివిడిలను కాపీ చేసి పెడుతుంది.
ఒక డివిడి మూవీలోని పూర్తి సినిమాని గానీ, మెనూలు, ఇంట్రోలూ, సబ్ టైటిళ్లలు, అదనపు లాంగ్వేజ్ లూ, సౌండ్ ట్రాక్ లూ వంటి అవసరం లేని అంశాలను వదిలేసి కావలసినంత వరకూ మాత్రమే మనం కాపీ చేసుకోవచ్చు.
చాలావరకూ సినిమా డివిడిలు DVDలు DVD 9 ఫార్మెట్ లో లభిస్తుంటాయి. వీటిని మనం మరో డివిడిలోకి రైట్ చేసుకోవాలంటే DL (డబుల్ లేయర్) డివిడిలు మన వద్ద ఉండాలి. కానీ వీటి ధర ఎక్కువ ఉండడం వల్ల వీటిని కొనే వారు అరుదు. ఈ నేపధ్యంలో DVD 9 డిస్కులను కూడా మన దగ్గర ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే DVD 5 డిస్కుల్లోకి రైట్ చేసుకోవడానికి కూడా ఈ Aviosoft CloneDVD అనే సాఫ్ట్ వేర్ పనికొస్తుంది.
ఒకవేళ DVD 9 డిస్కుని ఏమాత్రం నాణ్యత చెక్కుచెదరకుండా రెండు DVD-5 డిస్కుల్లోకి రైట్ చేసుకోవాలన్నా ఈ Aviosoft CloneDVD ప్రోగ్రామ్ మనకు వెసులుబాటు కల్పిస్తుంది.
అలాగే డివిడి మూవీలను AVI, MP4 వంటి వేర్వేరు ఇతర పాపులర్ వీడియో ఫార్మేట్లలోకి, ఆడియో ఫైళ్లు గానూ రిప్ చేసుకోవచ్చు.
మనకు సహజంగా ఒక సినిమాలో ఓ మంచి సాంగ్ గానీ, సీన్ గానీ నచ్చుతూ ఉంటుంది. కేవలం దాని వరకూ మాత్రమే మనం డివిడి నుండి కాపీ చేసుకోవాలంటే Aviosoft CloneDVD ప్రోగ్రామ్ లోని Clip అనే సదుపాయం బాగా ఉపకరిస్తుంది.
ఒక డివిడి మూవీలోని రెండూ అంతకన్నా ఎక్కువ టైటిళ్లని ఒకదానితో ఒకటి Merge చేసుకుని సింగిల్ మూవీగా ఈ సాఫ్ట్ వేర్ సాయంతో తయారు చేసుకోవచ్చు.
మనం కాపీ చేసే మూవీ పైన మన పేరు గానీ, మన కంపెనీ పేరు గానీ Watermarkగా పొందుపరుచుకోవచ్చు. మూవీలోని అవసరం లేని భాగాన్ని Crop చేసుకోవచ్చు.
మన అవసరాలకు తగ్గట్లు AVI, ASF, 3GP, MP4 for Apple iPod, iPad, iPhone, PSP, BlackBerry వంటి వివిధ డివైజ్ లూ, స్మార్ట్ ఫోన్ల స్ర్కీన్ సైజ్ లకు తగ్గట్లుగా డివిడి మూవీని కన్వర్ట్ చేసుకోవచ్చు.
డివిడి కాపీయింగ్, కన్వర్షన్ పూర్తయిన తర్వాత కంప్యూటర్ దానంతట అదే ఆపేయబడేలా ఏర్పాటు చేసుకోవచ్చు కూడా!
డివిడిలను రైట్ చేయడానికి మన పిసిలో Nero burn ఇంజిన్ వంటి ఒకటి కంటే ఎక్కువ ఇంజిన్లు ఇన్ స్టాల్ చేయబడి ఉంటే మనకు నచ్చిన ఇంజిన్ వాడుకునే వీలుంది.
ఇలా.. అనేక సదుపాయాలను ఈ Aviosoft CloneDVD అనే ప్రోగ్రామ్ కలిగి ఉంది.
గ్యాలరీ:
ఉచితంగా ఎన్ని లైసెన్స్ లు అందిస్తున్నామంటే:
మొత్తం 50 మందికి 50 జెన్యూన్ లైసెన్స్ లు.
ఒక్కొకటి ధర ఎంత?
విడిగా కొనాలంటే రూ.3,080. మీకు పూర్తి ఉచితం.
ఉచితమంటున్నారు చాలా సైట్లలో కన్పించే మాదిరి పైరేటెడ్ వా?
అస్సలు కానేకాదు. 100% ఇవి జెన్యూన్ లైసెన్స్ లు. దర్జాగా మీరు ఆ సాఫ్ట్ వేర్ తయారీదారుల నుండి సపోర్ట్ పొందొచ్చు.
ఉచితంగా ఎలా ఇస్తున్నారు?
గత 10 సంవత్సరాలుగా పబ్లిష్ అవుతున్న కంప్యూటర్ ఎరా తెలుగు మాసపత్రిక RNI సర్క్యులేషన్ వివరాలు గమనించిన మీదట ఆయా సాఫ్ట్ వేర్ తయారీ సంస్థలు మేగజైన్ పాఠకులకు తమ ఉత్పత్తులను కాంప్లిమెంటరీగా అందించడానికి ముందుకు వచ్చాయి. వాటినే మీకు కేటాయించడం జరుగుతోంది. సో ఈ ఆఫర్ ని "కంప్యూటర్ ఎరా తెలుగు మాసపత్రిక" అందిస్తున్న కానుకగా భావించండి, మేగజైన్ ని మీకు తెలిసిన వారికీ పరిచయం చేయండి. కేవలం బ్లాగు విజిటర్స్ మాత్రమే కాకుండా http://computerera.co.in సైట్ ద్వారా మేగజైన్ రిలీజ్ వివరాలు పొందడానికి తమ మెయిల్ అడ్రస్ లు మాకు పంపిన 15,000 మంది పాఠకులకూ randomగా కేటాయిస్తాం.
సాఫ్ట్ వేర్ గెలుపొందాలంటే రూల్స్ ఎలా ఉంటాయి?
రూల్స్ ఏమీ ఉండవు. ఈ రోజు (21 జూలై 2011 ఉదయం 10 గంటల నుండి రేపు ఉదయం (22 జూలై 2011) 10 గంటల వరకూ sridharcera@gmail.com అనే నా మెయిల్ ఐడికి ఈ క్రింది వివరాలతో పాటు ఈ అప్లికేషన్ మీకు ఎలా పనికొస్తుందో మీ అవసరాన్ని వివరంగా రాసి పంపండి. గతంలో ముగిసిన ఆఫర్లకి రిక్వెస్ట్ పంపితే పరిగణించబడవు. ఇప్పుడు నడుస్తున్న ఆఫర్ కే మీరు రిక్వెస్ట్ పంపాలి.
1. మీ పూర్తి పేరు (లైసెన్స్ ని ఈ పేరుతోనే కంపెనీ కేటాయిస్తుంది)
2. మీ అసలైన (నకిలీవీ, వాడనివీ పనికిరావు) మెయిల్ ఐడి
3. మీ ఫోన్ నెంబర్
4. ఊరి పేరు.
5. మీరు లైసెన్స్ పొందబోతున్న ఈ సాఫ్ట్ వేర్ పేరుని కూడా మీరు పంపే మెయిల్ లో పేర్కొనాలి.
పై వివరాలతో రిక్వెస్ట్ పంపిన వారి నుండి వారి అవసరాన్ని గుర్తించి randomగా 50 లైసెన్స్ లు కేటాయిస్తాం. ఇంకేమీ రూల్స్ లేవు. జూలై 23 ఉదయం 10 గంటల నుండి 12 గంటల లోపు మీ లైసెన్స్ లు మీకు మెయిల్ ద్వారా పంపుతాను.
ఇకపై మీకు అన్ని ప్రోడక్ట్ అప్ డేట్లూ ఉచితంగా లభిస్తాయి.
ఒరిజినల్ లైసెన్స్ లతో వైరస్ లు, ట్రోజాన్ లూ, రూట్ కిట్ లూ రావు.
అడోబ్ ఫొటోషాప్.. అదేదో బ్రహ్మపదార్థమనీ, దాన్ని అర్థం చేసుకోవడం, నేర్చుకోవడం కష్టమనీ చాలామంది భావిస్తారు. గత 7 సంవత్సరాలుగా మన కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ లో నేను ఫొటోషాప్ ని చాలా సులభంగా వివరిస్తున్న విషయం మన పాఠకులకు తెలిసిందే. అలాగే ఫొటోషాప్ పై నా వీడియో ట్యుటోరియళ్లూ చూస్తూనే ఉన్నారు కదా! ఇదే క్రమంలో ఈసారి ఫొటోషాప్ లోని Actionsని రికార్డ్ చేసుకుని, వాటిని play చేయడం ద్వారా మళ్ళీ మళ్ళీ చేయాల్సి వచ్చే రిపీటెడ్ పనుల్ని ఎంత సులభంగా, వేగంగా చేసుకోవచ్చో ఈ వీడియోలో వివరిస్తున్నాను. స్పీకర్లు ఆన్ చేసుకుని వింటూ చూస్తే ఈజీగా అర్థమవుతుంది.
వీడియోని చూసేటప్పుడు మీ నెట్ కనెక్షన్ స్పీడ్ గా ఉన్నదైతే.. 720p, 1080p అనే హై డెఫినిషన్ (HD) రిజల్యూషన్లని Youtube Playerలో ఎంచుకుని మరింత హై క్వాలిటీతో వీడియోని చూడొచ్చు.
వివిధ టెలివిజన్ ఛానెళ్లలో నేను చేసిన ప్రోగ్రాములు, ఇతర టెక్నికల్ వీడియోల కోసం http://youtube.com/nallamothu అనే ఛానెల్ కి సబ్ స్కైబ్ చేయొచ్చు.
ఈ ఆఫర్ మీకు అందుబాటులో ఉండే సమయం: 19 జూలై 2011 ఉదయం 10 గంటల నుండి 20 జూలై 2011 ఉదయం 10 గంటల వరకూ! (ఆఫర్ ముగిసింది, విజేతల వివరాలు క్రింద చూడొచ్చు)
గమనిక:ఒక్కొకటీ రూ. 3,080 విలువైన ప్రతీ ఒక్కరి వద్దా ఉండాల్సిన ఓ అతి ముఖ్యమైన సాఫ్ట్ వేర్ 50 ఒరిజినల్ లైసెన్స్ లు (రూ. 1,54,000 విలువైనవి) మీకోసం ఈ వారం ఇదే సైట్ లో లభించబోతున్నాయి. గత ఆఫర్లలో లైసెన్స్ లు గెలుచుకున్న వారూ కొత్త ఆఫర్లకు అర్హులే. సో ఈ వారం ఈ సైట్ ని మిస్ అవకండి!
వివిధ ఫంక్షన్లు, పార్టీలూ, టూర్లలో మనం దిగిన ఫొటోలను ఆకర్షణీయమైన picture collageలుగా తయారు చేసుకోవడానికి పికాసా వంటి ఉచిత టూల్స్ ఉన్నప్పటికీ ఈ క్రింది వీడియోలో నేను పరిచయం చేయబోతున్న Picture Collage Maker Pro అనే సాఫ్ట్ వేర్ లో ఎన్నో మెరుగైన సదుపాయాలు లభిస్తున్నాయి. ఇంతకుముందు ఎప్పుడూ ఈ సాఫ్ట్ వేర్ ని వాడని వారు కూడా చాలా వేగంగా అర్థం చేసుకుని అత్యంత నాణ్యమైనా, ఆకర్షణీయమైనా picture collagesని ఈ Picture Collage Maker Pro అనే ప్రోగ్రామ్ ద్వారా సృష్టించుకోవచ్చు. దీనిని ఎలా వాడాలో ఈ వీడియోలో ప్రతీ స్టెప్ వివరంగా చూపించడం జరిగింది. స్పీకర్లు ఆన్ చేసుకుని వింటూ చూస్తే ఈజీగా అర్థమవుతుంది.
వివిధ సందర్భాలకు తగ్గట్లు వందల కొద్దీ రెడీమేడ్ Collage templates ఈ సాఫ్ట్ వేర్లో లభిస్తున్నాయి.
టెంప్లేట్లు వాడడం ఇష్టం లేకపోతే ఖాళీ collageని సృష్టించుకుని దానిలో మనకు నచ్చినట్లు ఫొటోలను అమర్చుకోవచ్చు.
Collageలోని ప్రతీ ఫొటోనీ అవసరాన్ని బట్టి crop, rotate, align చేసుకోవచ్చు.
ఫొటోలకు masks, framesతో మరింత అందం, ప్రత్యేకమైన స్టైల్ ఆపాదించవచ్చు.
మనం ప్రిపేర్ చేసుకునే collageలలో అవసరం అయిన చోట textనీ, మనం కోరుకున్న నెల యొక్క కాలెండర్ నీ పొందుపరుచుకోవచ్చు.
తయారు చేసుకున్న picture collageలను ప్రింటర్ ద్వారా ప్రింట్ తీసుకోవచ్చు, ఒక ఫొటోగా పిసిలో సేవ్ చేసుకోవచ్చు, E-Mail ద్వారా ఇతరులకు పంపుకోవచ్చు.
పై వీడియోని చూస్తే ఈ ప్రోగ్రామ్ ఎంత సమర్థవంతమైనదో అర్థమవుతుంది.
ఆఫర్ లో లైసెన్స్ లు పొందిన వారి వివరాలు:
ఫొటో గ్యాలరీ:
ఉచితంగా ఎన్ని లైసెన్స్ లు అందిస్తున్నామంటే:
మొత్తం 35 మందికి 35 జెన్యూన్ లైసెన్స్ లు.
ఒక్కొకటి ధర ఎంత?
విడిగా కొనాలంటే రూ.1,800. మీకు పూర్తి ఉచితం.
ఉచితమంటున్నారు చాలా సైట్లలో కన్పించే మాదిరి పైరేటెడ్ వా?
అస్సలు కానేకాదు. 100% ఇవి జెన్యూన్ లైసెన్స్ లు. దర్జాగా మీరు ఆ సాఫ్ట్ వేర్ తయారీదారుల నుండి సపోర్ట్ పొందొచ్చు.
ఉచితంగా ఎలా ఇస్తున్నారు?
గత 10 సంవత్సరాలుగా పబ్లిష్ అవుతున్న కంప్యూటర్ ఎరా తెలుగు మాసపత్రిక RNI సర్క్యులేషన్ వివరాలు గమనించిన మీదట ఆయా సాఫ్ట్ వేర్ తయారీ సంస్థలు మేగజైన్ పాఠకులకు తమ ఉత్పత్తులను కాంప్లిమెంటరీగా అందించడానికి ముందుకు వచ్చాయి. వాటినే మీకు కేటాయించడం జరుగుతోంది. సో ఈ ఆఫర్ ని "కంప్యూటర్ ఎరా తెలుగు మాసపత్రిక" అందిస్తున్న కానుకగా భావించండి, మేగజైన్ ని మీకు తెలిసిన వారికీ పరిచయం చేయండి. కేవలం బ్లాగు విజిటర్స్ మాత్రమే కాకుండా http://computerera.co.in సైట్ ద్వారా మేగజైన్ రిలీజ్ వివరాలు పొందడానికి తమ మెయిల్ అడ్రస్ లు మాకు పంపిన 15,000 మంది పాఠకులకూ 3 నుండి10 లైసెన్స్ ల వరకూ randomగా కేటాయిస్తాం.
సాఫ్ట్ వేర్ గెలుపొందాలంటే రూల్స్ ఎలా ఉంటాయి?
రూల్స్ ఏమీ ఉండవు. ఈ రోజు (19 జూలై 2011 ఉదయం 10 గంటల నుండి రేపు ఉదయం (20 జూలై 2011) 10 గంటల వరకూ sridharcera@gmail.com అనే నా మెయిల్ ఐడికి ఈ క్రింది వివరాలతో పాటు ఈ అప్లికేషన్ మీకు ఎలా పనికొస్తుందో మీ అవసరాన్ని వివరంగా రాసి పంపండి. గతంలో ముగిసిన ఆఫర్లకి రిక్వెస్ట్ పంపితే పరిగణించబడవు. ఇప్పుడు నడుస్తున్న ఆఫర్ కే మీరు రిక్వెస్ట్ పంపాలి.
1. మీ పూర్తి పేరు (లైసెన్స్ ని ఈ పేరుతోనే కంపెనీ కేటాయిస్తుంది)
2. మీ అసలైన (నకిలీవీ, వాడనివీ పనికిరావు) మెయిల్ ఐడి
3. మీ ఫోన్ నెంబర్
4. ఊరి పేరు.
5. మీరు లైసెన్స్ పొందబోతున్న ఈ సాఫ్ట్ వేర్ పేరుని కూడా మీరు పంపే మెయిల్ లో పేర్కొనాలి.
పై వివరాలతో రిక్వెస్ట్ పంపిన వారి నుండి వారి అవసరాన్ని గుర్తించి randomగా 35 లైసెన్స్ లు కేటాయిస్తాం. ఇంకేమీ రూల్స్ లేవు. జూలై 21 ఉదయం 10 గంటల నుండి 12 గంటల లోపు మీ లైసెన్స్ లు మీకు మెయిల్ ద్వారా పంపుతాను.
ఇకపై మీకు అన్ని ప్రోడక్ట్ అప్ డేట్లూ ఉచితంగా లభిస్తాయి.
ఒరిజినల్ లైసెన్స్ లతో వైరస్ లు, ట్రోజాన్ లూ, రూట్ కిట్ లూ రావు.
మీకొక స్వంత వెబ్ సైట్ ఉందనుకుందాం. దానిలో Joomla, Drupal వంటి కంటెంట్ మేనేజ్ మెంట్ సిస్టమ్ లను గానీ, WordPress, Blogger వంటి బ్లాగింగ్ స్ర్కిప్ట్ లను గానీ, లేదా chat సదుపాయాన్ని అందించే phpfreechat వంటి వాటినీ.. ఇలా వేర్వేరు స్ర్కిప్ట్ లను ఇన్ స్టాల్ చేయవలసి వస్తే ముందు వాటిని డౌన్ లోడ్ చేసుకుని unzip చేసుకుని, ftp ద్వారా మీ హోస్టింగ్ స్పేస్ లోకి అప్ లోడ్ చేసుకుని.. మరోవైపు SQL డేటాబేస్ లను క్రియేట్ చేసుకుని ఆ డేటాబేస్ వివరాలను config.php వంటి ఫైళ్లలో సేవ్ చేసి.. install.phpని రన్ చేయడం.. చాలా పెద్ద ప్రాసెస్ గా అన్పించడం లేదూ..? ఈ ప్రాసెస్ ని టైప్ చేయడానికే నాకు చిరాకు వస్తే రియల్ టైమ్ లో ఇంత పని చేయాలంటే ఇంకెంత చిరాకు వస్తుందో మీకు తెలిసిందే కదా!
….. మరి దీనికి సింపుల్ సొల్యూషన్ లేదా?
ఎందుకు లేదు.. ఉంది! ఈ క్రింది వీడియోలో WordPress, Joomla వంటి వివిధ పాపులర్ స్ర్కిప్ట్ లను ఎంత ఈజీగా ఇన్ స్టాల్ చేసుకోవచ్చో కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ ఎడిటర్ నల్లమోతు శ్రీధర్ వివరిస్తున్నారు. స్పీకర్లు ఆన్ చేసుకుని వింటూ చూస్తే ఈజీగా అర్థమవుతుంది.
వీడియోని చూసేటప్పుడు మీ నెట్ కనెక్షన్ స్పీడ్ గా ఉన్నదైతే.. 720p, 1080p అనే హై డెఫినిషన్ (HD) రిజల్యూషన్లని Youtube Playerలో ఎంచుకుని మరింత హై క్వాలిటీతో వీడియోని చూడొచ్చు.
వివిధ టెలివిజన్ ఛానెళ్లలో నేను చేసిన ప్రోగ్రాములు, ఇతర టెక్నికల్ వీడియోల కోసం http://youtube.com/nallamothu అనే ఛానెల్ కి సబ్ స్కైబ్ చేయొచ్చు.
1996వ సంవత్సరంలో తెలుగులో మొట్టమొదట కంప్యూటర్ సాహిత్యాన్ని ప్రారంభించే అవకాశం నాకు కలిగింది. అదే సమయంలో చెన్నైలో సూపర్ హిట్ తెలుగు ఫిల్మ్ మేగజైన్ కి సబ్ ఎడిటర్ గా కూడా ఏకకాలంలో పనిచేస్తూ 1998 వరకూ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, మనీషా కొయిరాలా, శంకర్, రజనీకాంత్, కమల్ హాసన్ వంటి ప్రముఖులెందరినో ఇంటర్వ్యూలు చేయడం మర్చిపోలేని అనుభవం. అయితే సినిమా రంగంలో ఉన్న అనారోగ్యకరమైన వాతావరణం వల్ల నాకంటూ ఓ ప్రత్యేకమైన ఉనికిని సృష్టించుకోవడం కోసం సినిమా రంగం నుండి బయటకు వచ్చి పూర్తిగా టెక్నాలజీ రంగంలో స్థిరపడడం జరిగింది. 96 నుండి 2001 వరకూ పలు కంప్యూటర్ పత్రికలకు ఎడిటర్ గా పనిచేసి.. 2001 నుండి "కంప్యూటర్ ఎరా" తెలుగు మంత్లీ మేగజైన్ ఎడిటర్ గా పత్రిక మొత్తాన్నీ రూపొందిస్తూ ఉన్నాను. అలాగే తెలుగు టెలివిజన్ ఛానెళ్లలో మొట్టమొదటి టెక్నికల్ phone-in ప్రోగ్రామ్ కి గెస్ట్ గా అటెండ్ అయ్యే అవకాశమూ 2010 జనవరి 20న కలిగింది. అప్పటి నుండి ఇప్పటివరకూ I News, ETV2, ABN ఆంధ్రజ్యోతి, NTV, Zee 24 గంటలు, సాక్షి టివి, మహా టివి, జాగృతి న్యూస్ వంటి ఛానెళ్లలో 90కి పైగా లైవ్, రికార్డెడ్ ప్రోగ్రాముల్ని చేయడం జరిగింది. 2007లో అత్యుత్తమైన నాణ్యతతో కూడిన పోస్టులతో, వీడియోలతో తెలుగులో మొదటి ప్రొఫెషనల్ టెక్నికల్ బ్లాగ్ గానూ, మొదటి వీడియో బ్లాగ్ గానూ ఇప్పుడు మీరు చూస్తున్న బ్లాగ్ ప్రత్యేకతను సంతరించుకుంది. అలాగే 2007 జనవరి 1న ప్రారంభించిన తెలుగులోనే మొట్టమొదటి టెక్నికల్ ఫోరమ్ అయిన "కంప్యూటర్ ఎరా సాంకేతిక ఫోరమ్" 14 వేల మంది సభ్యులతో 10 వేలకు పైగా పోస్టులతో 2009 జూలై వరకూ నిర్వహించబడింది. దాంతోపాటే మొట్టమొదటి తెలుగు టెక్నికల్ ఛాట్ రూమ్ అయిన "కంప్యూటర్ ఎరా సాంకేతిక సహాయం" అనే ఛాట్ రూమ్ రెండేళ్లలో వేలాది మందికి తెలుగు టైప్ చేయడం మొదలుకుని అనేక కంప్యూటర్ సంబంధిత సాంకేతిక సమస్యలకు తక్షణ సహాయం అందించింది. ఇకపోతే http://youtube.com/nallamothu అనే ఛానెల్ లో 361కి పైగా ప్రొఫెషనల్ క్వాలిటీ తెలుగు టెక్నికల్ వీడియోలు అందించాను. ఈ ఛానెల్ కి 1192 మంది సబ్ స్కైబర్లు ఉన్నారు. అందుబాటులో ఉన్న వివిధ మార్గాల ద్వారా తెలుగు వారందరకీ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించే పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాను.
వీడియో లింక్ ఇది: http://bit.ly/sriwishes మన బిజీ షెడ్యూల్స్‌లో ముఖ్యమైన ఫ్రెండ్స్, బంధువుల్ని birthdays, marriage anniversaryలకు విష్ చేయడం కూడా మర్చిపోతున్నాం… మరో వైపు ఫ్రెండ్స్ సర్కిల్ కూడా పెరుగుతోంది. అందరి వివరాలూ గుర్తుంచుకుని విష్ చేయడం కూడా కష్టం అవుతోంది. ఈ వీడియోలో నేను చూపించిన టెక్నిక్ ఫాలో అయ్యారంటే.. ఇక ప్రతీ ఏటా కరెక్ట్ టైమ్‌కి మీ ఫ్రెండ్‌కి birthday విషెస్ ఆటోమేటిక్‌గా sms ద్వారా వెళ్లిపోతాయి… కేవలం బర్త్‌డే అనే కాదు.. [...]
వీడియో లింక్ ఇది: http://bit.ly/sriomega శరీరానికి కొవ్వు పదార్థాలూ అవసరమే…. కొవ్వు పదార్థాల్లో చాలా రకాలుంటాయి.. చాలామంది లావు తగ్గాలని పూర్తిగా అన్నింటినీ మానేస్తుంటారు.. కానీ కొవ్వు పదార్థాల వాడకంలో ఓ నిష్పత్తిని పాటించాలి… దీన్ని పాటించకపోవడం వల్లనే అనేక రకాలైన ఆరోగ్య సమస్యలు మనల్ని చుట్టు ముడుతున్నాయి…. Omega 3, Omega 6 అని రెండు రకాల ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి. మనం తినే ఆహారం ద్వారా ఇవి శరీరంలోకి వస్తుంటాయి. వీటి నిష్పత్తి ఎల్లప్పుడూ [...]
వీడియో లింక్ ఇది: http://bit.ly/sricameraphone మీ ఫ్రెండ్స్, రెలెటివ్స్‌తో వీడియో ఛాట్ చేసుకోవడానికి మీ పిసికి Webcam లేదా? మీ దగ్గర ఎటూ కెమెరా ఫోన్ ఉంది కదా.. ఆ కెమెరాని మీ పిసి యొక్క Webcamగా వాడేసుకుంటే పోలా.. వినడానికి ఇది అసాధ్యమనిపిస్తోంది కదూ.. అయితే ఈ వీడియో చూడండి అది ఎంత ఈజీ పనో ప్రాక్టికల్‌గా నేను చేసి చూపించడం జరిగింది. ఈ టెక్నిక్‌తో మీ ఫోన్ కెమెరాని మీ పిసి యొక్క Webcamగా [...]
ఆధార్ కార్డ్ డౌన్ లోడ్ చేసుకోవడం ఇలా.. ప్రాక్టికల్ డెమో.. Must Share వీడియో లింక్ ఇది: http://bit.ly/sriaadhaar మీరు ఆధార్ కార్డ్‌కి enroll చేసుకుని ఉన్నారా? ఇంకా మీకు ఆధార్ కార్డ్ ఇంటికి రాలేదా? అయితే ఈ వీడియోలో నేను ప్రాక్టికల్‌గా చూపించిన పద్ధతి ద్వారా మీరూ మీ కార్డ్‌ని వెంటనే మీ పిసిలోకి డౌన్లోడ్ చేసుకుని.. అవసరం అయిన ప్రతీచోటా వాడుకోవచ్చు. ఆధార్ కార్డుల కోసం వేచిచూస్తున్న ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని [...]
తెలుగు ఫొటోషాప్ ట్యుటోరియల్ – లెసన్ 6 – కావలసిన Toolsని ఫాస్ట్‌గా సెలెక్ట్ చేసుకోవడం, ఎడిట్ చేసుకోవడం ఎలా? వీడియో లింక్ ఇది: http://bit.ly/sriphotoclass6 అద్భుతమైన ఫొటోలు సృష్టించాలనుకునే ప్రతీ ఒక్కరూ ఫొటోషాప్ అందించే అనేక టూల్స్‌ని అవసరాన్ని బట్టి వాడక తప్పదు. ఫొటోషాప్ టూల్‌బాక్స్‌లో కావలసిన టూల్‌ని వెదికి పట్టుకోవడం చాలామంది కష్టంగా భావిస్తారు.. ఆయా టూల్స్‌ని వెదికేసరికే నీరసం వచ్చేసి.. నేర్చుకోవడం ఆపేస్తారు.. ఈ నేపధ్యంలో తగిన టూల్‌ని వేగంగా సెలెక్ట్ చేసుకోవడం [...]
వీడియో లింక్ ఇది: http://bit.ly/sriphoclass5 ఫొటోషాప్ ఓపెన్ చేయగానే కన్ఫ్యూజ్డ్గా కన్పిస్తోందా? ఏది ముట్టుకుంటే ఏమైపోతుందో అన్నంత భయం వేస్తోందా? అయితే ఈ వీడియో చూస్తే ఆ భయం ఖచ్చితంగా పోతుంది. ఫొటోషాప్‌లో పానెల్స్ రూపంలో ఉండే వివిధ ఆప్షన్ల గురించీ… వాటిని ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలీ, డిలీట్ చేసుకోవాలన్నదీ ప్రాక్టికల్‌గా ఈ వీడియోలో చూపించడం జరిగింది. గమనిక: ఫొటోషాప్ నేర్చుకోవాలనుకునే ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ షేర్ చెయ్యగలరు. వీడియో లింక్ [...]
వీడియో లింక్ ఇది: http://bit.ly/srifbupdate ఫేస్బుక్, గూగుల్+ల్లో తరచూ ఏదో ఒకటి పోస్ట్ చేసే మనం… ఇంటర్నెట్ కనెక్షన్ లేకనో, ఊరెళ్లడం వల్లనో… కొన్ని రోజుల పాటు ఏమీ పోస్ట్ చెయ్యలేకపోతే… వాస్తవానికైతే నష్టం ఏమీ లేదు.. అయితే కొన్ని మంచి విషయాల్ని… ఆటోమేటిక్‌గా ప్రతీరోజూ, లేదా మనం కోరుకున్న రోజుల్లో ఓ నిర్థిష్టమైన సమయంలో పోస్ట్ అయ్యేలా సెట్ చేసుకోగలిగితే బాగుంటుంది కదూ..? ఇలా ప్లాన్డ్గా మనం కోరుకున్న టైమ్‌లో ఆటోమేటిక్‌గా ముందే మనం సెట్ [...]
వీడియో లింక్ ఇది: http://bit.ly/sriphotoshop4 ఫొటొషాప్ ఫొటోలను ఎడిట్ చేసేటప్పుడు మన చేతులు చాలా ఫ్రీగా మూవ్ అవ్వాలంటే, అలాగే మనకు కావలసిన రిజల్ట్స్‌ని మెరుగ్గా పొందాలంటే Screen Modesని ఆయా అవసరాలకు తగ్గట్లు సెట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫొటోషాప్ వేర్వేరు Screen Modesని అందిస్తుందన్న విషయమే చాలామందికి తెలీదు. ఈ నేపధ్యంలో వివిధ Screen Modesని ఎలా ఉపయోగించాలో ఈ వీడియోలో ప్రాక్టికల్‌గా చూపించడం జరిగింది. – నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా [...]
వీడియో లింక్ ఇది: http://bit.ly/srirti మనం ప్రభుత్వాలనూ, ప్రభుత్వ విభాగాలనూ తిట్టుకోవడంతో సరిపెట్టుకోవాల్సిన పనిలేదు… మనకు ఏ డిపార్ట్‌మెంట్‌పై అయినా అనుమానం ఉంటే, లేదా ఏ ప్రభుత్వ పధకంపై నైనా, లేదా మీ వ్యక్తిగత అవసరాలకు చేసిన అప్లికేషన్ల తాజా స్థితిపై అయినా సమాచారం కావాలంటే.. “సమాచార హక్కు” చట్టం క్రింద (RTI Act) ఉచితంగా సమాచారం కోరొచ్చు. దీని వల్ల మనకు ఎలాంటి నష్టమూ లేదు… ఆయా విభాగాల నుండి ఖచ్చితంగా మనకు సమాచారం అందించబడాలి… [...]
వీడియో లింక్ ఇది: http://bit.ly/sriphoto3 ఫొటోషాప్ అస్సలు కష్టమేమీ కాదు.. దీని కోసం కంప్యూటర్ ఇనిస్టిట్యూట్లకు వెళ్లాల్సిన పనిలేదు.. ఏమాత్రం కంప్యూటర్ నాలెడ్జ్ లేని వారికి కూడా అర్థమయ్యే విధంగా తెలుగులో చాలా ప్రాక్టికల్‌గా ఫొటోషాప్ లెసన్లని ఇకపై రెగ్యులర్‌గా అందించడం జరుగుతుంది.. ఇప్పుడు ఈ లెసన్‌లో ఫొటోషాప్ Options Barని ఉపయోగించడం గురించి ప్రాక్టికల్‌గా చూద్దాం… ఇప్పటికీ పాత లెసన్లు చూసి ఉండకపోతే ఈ క్రింది లింకుల నుండి చూడొచ్చు. Watch Lesson 2 “How [...]
Google Playలో పొందండి
ఇక్కడ RSS Feedకి Subscribe చేసి నేరుగా పోస్ట్ లు పొందండి
Sridhar Nallamothu: వాణి గారు.. ఈ playlistలో తెలుగు ఫొటోషాప్ లెసన్స్ వీడియోలు ఉంటాయి చూడండి..http://www.youtube.com/playlist?list=PLeDx22eBiFkQkpKuINtkywdlGrRaj9sQP...
p. vani: namaskaram sridhar garu naa peru
vani naaku telugulo photoshop
nerchukovalani vundi ela?...
బి.వి. వరప్రసాద రాజు: ఆర్యా!
తెలుగులో కంప్యూటర్ విషయాలు అందిస్తున్నందుకు మీకు నా కృతజ్ఞతలు. మీ కృషి శ్లాఘనీయము. తెలుగు వారికి మీరు కంప్యూటర్ సాంకేతిక సూచి పితా...
cbrao: ఉపయోగకరంగా ఉన్న ఈ వీడియో ఆసక్తికరంగా అందించినందులకు ధన్యవాదాలు. జీ-మైల్ మాత్రమే గాక మన ఇతర ఇ ఆస్తులను వారసులకు ఎలా అందచేయాలో వివరిస్తూ మరణానంతరం జీవ...
shiva: చాలా మంది సాఫ్ట్వేర్ వాళ్ళకు కూడా హార్డ్‌వేర్, పిసి అసెంబ్లింగ్, నెట్వర్కింగ్, లైనక్స్,సోషల్ మార్కెటింగ్ం పేజ్మేకర్, ఫొటోషాప్, కోరల్ డ్రా, ప్రీమియర్...