ఫొటోషాప్ టెక్నిక్ – ఎఫెక్ట్ ని అప్లై చేశాక కూడా textని మార్చడం ఇలా (వీడియో డెమో)

 ఫొటోషాప్ లో మరో టెక్నిక్ మీకు ఇప్పుడు నేర్పిస్తాను. సహజంగా textకి texture వంటి వివిధ ఫిల్టర్లని అప్లై చేసిన తర్వాత తిరిగి అదే textని మార్చాలంటే ఫొటోషాప్ లో వీలుపడదు కదా. దీనికి కారణం ఒక ఫిల్టర్ ని అప్లై చేయబోయే ముందే "ఆ textని రేస్టరైజ్ చేస్తున్నా,  జాగ్రత్తపడండి.." అంటూ ఫొటోషాప్ మొత్తుకుంటుంది. ఎఫెక్ట్ ని అప్లై చేశాక ఒక వేళ Sridhar అని టైప్ చేసిన దానికి బదులు Sridharcera అని మేటర్ మార్చవలసి వచ్చిందనుకుందాం. అప్పుడు పరిస్థితి ఏమిటి? దీనికీ ఓ బ్రహ్మాంఢమైన పరిష్కారముంది. అదే ఫొటోషాప్ లోని Smart Objects అనే ఓ బుల్లి సదుపాయం. దాన్ని వాడడం ఎలాగో 5 నిముషాల్లో ఈ క్రింది వీడియోలో నేను వివరించిన దాన్ని చూసి మీరు నేర్చేచుకోవచ్చు. స్పీకర్లు ఆన్ చేసుకుని తెలుగులో నేను చెప్పే వివరణని వింటూ చూస్తే ఈజీగా అర్థమవుతుంది. 

 
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
 
ఈ వీడియోని మీ మిత్రులతో పంచుకోవాలంటే ఈ లింకుని వారికి పంపించండి: http://www.youtube.com/watch?v=W5RhDi3zwbo
 
 
ఈ వీడియోని 3Dలోనూ చూడవచ్చు: వీడియోని ప్లే చేసేటప్పుడు ప్లేయర్ పై ఉండే 3D అనే బటన్ ని క్లిక్ చేయడం ద్వారా ఈ వీడియోని 3Dలోనూ మీరు చూడొచ్చు. తెలుగులో మొట్టమొదటి 3D ఛానెల్ అయిన http://youtube.com/nallamothu అనే దానికి మీరు Subscribe చేయొచ్చు.

వీడియోని చూసేటప్పుడు మీ నెట్ కనెక్షన్ స్పీడ్ గా ఉన్నదైతే.. 720p, 1080p అనే హై డెఫినిషన్ (HD) రిజల్యూషన్లని Youtube Playerలో ఎంచుకుని మరింత హై క్వాలిటీతో వీడియోని చూడొచ్చు.

 వివిధ టెలివిజన్ ఛానెళ్లలో నేను చేసిన ప్రోగ్రాములు, ఇతర టెక్నికల్ వీడియోల కోసం http://youtube.com/nallamothu అనే ఛానెల్ కి సబ్ స్కైబ్ చేయొచ్చు.

computerera telugu magazine

 

333 వీడియోలతో 841 మంది సబ్ స్కైబర్లతో తెలుగులో మొట్టమొదటి పూర్తి స్థాయి 3D వీడియో ఛానెల్

youtube nallamothu sridhar computerera telugu magazine

 

ఎప్పటికప్పుడు లేటెస్ట్ టెక్నాలజీని సామాన్య ప్రజలకు అర్థమయ్యేలా 15 సంవత్సరాలుగా చేస్తున్న టెక్నికల్ అవేర్ నెస్ కార్యక్రమాల్లో భాగంగా  2007 నుండి తెలుగులో మొట్టమొదటిసారిగా వీడియో పాఠాలనూ ఉచితంగా అందిస్తూ ఉన్నాం. 2007 నుండి ఇప్పటివరకూ మొత్తం 333 వీడియోలనుhttp://youtube.com/nallamothu అనే ఛానెల్ లో చూడవచ్చు. ఇకపై తాజాగా రాబోయే వీడియోల అప్ డేట్లని మీ మెయిల్ కే పొందాలంటేhttp://youtube.com/nallamothu ఛానెల్ కి ఉచితంగా Subscribe కూడా చేయవచ్చు.

తాజా టెక్నికల్ సమాచారం అందించడమే కాకుండా మేమూ ఎల్లప్పుడూ తాజా టెక్నాలజీని adopt చేసుకుంటూ డైనమిక్ గా ఉంటాం అనడానికి నిదర్శనంగా ప్రస్తుతం http://youtube.com/nallamothu ఛానెల్ లోని 333 వీడియోలూ పూర్తిగా 3D ఫార్మేట్ లో లభిస్తున్నాయి. మీ వద్ద 3D మోనిటర్, టివి ఉన్నా స్టీరియోస్కోపిక్/ఏక్టివ్ షట్టర్ గ్లాసెస్ వంటి ఎలాంటి టెక్నాలజీలో అయినా మన తెలుగు టెక్నికల్ వీడియోలను ఎంచక్కా 3Dలో ఆస్వాదించవచ్చు. తెలుగులో మొట్టమొదటి 3D ఛానెల్ ఇది. ఇందులో ఇప్పటికే ఉన్న వందలాది వీడియోలను సద్వినియోగం చేసుకోగలరు.

 

nallamothusridhar

3d glasses computerera telugu magazine

Facebookలో కుడిచేతి వైపు ఫ్రెండ్స్ అప్ డేట్లు కదులుతూ చిరాకు కలిగిస్తున్నాయా.. ఇలా తొలగించండి (వీడియో డెమో)

 Facebook సైట్ లో ఇటీవల ఎన్నో కొత్త options ప్రవేశపెట్టబడ్డాయి. వాటిలో Sidebar Ticker ఒకటి. ఇది మన Friendsలో ఎవరెవరు ఏయే పనులు చేస్తున్నారన్నది రియల్ టైమ్ లో అప్ డేట్లు చూపిస్తుంటుంది. ఇది మంచి సదుపాయమే అయినా, సీరియస్ గా మనం ఇతర పనుల్లో బిజీగా ఉన్నప్పుడు ఈ Sidebar Ticker అనవసరమైన అంశాలపైకి మన దృష్టిని మళ్లించి సమయం వృధా చేసే ప్రమాదమూ ఉంది.  అందుకే కొంతమంది దీన్ని పెద్దగా ఇష్టపడడం లేదు. ఒకవేళ మీకూ ఈ Sidebar Ticker నచ్చకపోతుంటే దాన్ని తొలగించుకోవడం ఎలాగో ఈ వీడియోలో చూపిస్తున్నాను. 5 నిముషాల్లో మీరు ఆ సైడ్ బార్ ని తీసేసుకోవచ్చు. స్పీకర్లు ఆన్ చేసుకుని వింటూ చూస్తే ఈజీగా అర్థమవుతుంది.

 
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
 
ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తో పంచుకోవాలంటే ఈ లింక్ ని వారికి పంపించండిhttp://www.youtube.com/watch?v=A_ax1He_yto
 
 

 

వీడియోని చూసేటప్పుడు మీ నెట్ కనెక్షన్ స్పీడ్ గా ఉన్నదైతే.. 720p, 1080p అనే హై డెఫినిషన్ (HD) రిజల్యూషన్లని Youtube Playerలో ఎంచుకుని మరింత హై క్వాలిటీతో వీడియోని చూడొచ్చు.

 వివిధ టెలివిజన్ ఛానెళ్లలో నేను చేసిన ప్రోగ్రాములు, ఇతర టెక్నికల్ వీడియోల కోసం http://youtube.com/nallamothu అనే ఛానెల్ కి సబ్ స్కైబ్ చేయొచ్చు.

computerera telugu magazine

విండోస్ 8లోని Metro UIలో అప్లికేషన్ Tiles సైజ్ ని తగ్గించుకోవడం, తొలగించడం (వీడియో డెమో)

 తాజాగా మైక్రోసాఫ్ట్ రూపొందించిన Windows 8 ఆపరేటింగ్ సిస్టమ్ లో Metro UI పేరుతో కొత్త యూజర్ ఇంటర్ ఫేస్ ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ సరికొత్త యూజర్ ఇంటర్ ఫేస్ లో వివిధ రకాల అప్లికేషన్లు Tiles రూపంలో కన్పిస్తుంటాయి. ఈ Tiles యొక్క సైజ్ ని తగ్గించుకోవడం, పెంచుకోవడం, అవసరం లేని వాటిని పూర్తిగా Uninstall చేసుకోవడం లేదా యూజర్ ఇంటర్ ఫేస్ నుండి తాత్కాలికంగా Unpin చేసుకోవడం ఎలాగో ఈ క్రింది వీడియోలో వివరిస్తున్నాను.

 
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
 
ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తో పంచుకోవాలంటే ఈ లింక్ ని వారికి పంపించండిhttp://www.youtube.com/watch?v=HmpB9AHyans
 

 వీడియోని చూసేటప్పుడు మీ నెట్ కనెక్షన్ స్పీడ్ గా ఉన్నదైతే.. 720p, 1080p అనే హై డెఫినిషన్ (HD) రిజల్యూషన్లని Youtube Playerలో ఎంచుకుని మరింత హై క్వాలిటీతో వీడియోని చూడొచ్చు.

 వివిధ టెలివిజన్ ఛానెళ్లలో నేను చేసిన ప్రోగ్రాములు, ఇతర టెక్నికల్ వీడియోల కోసం http://youtube.com/nallamothu అనే ఛానెల్ కి సబ్ స్కైబ్ చేయొచ్చు.

computerera telugu magazine

సెల్ ఫోన్ లో వీడియోలను వాల్ పేపర్ గా అమర్చుకోవడం ఇలా (వీడియో డెమో)

 సెల్ ఫోన్లో మామూలు వాల్ పేపర్లని వాడీ వాడీ బోర్ కొడుతోందా? సినిమాలనో, మంచి వీడియో సాంగ్ లనో వాల్ పేపర్ గా సెట్ చేసుకోగలిగితే ఎంత బాగుణ్ణు అని మీకు అన్పిస్తుంటే ఈ క్రింది వీడియోని తప్పకుండా చూసి తీరాల్సిందే. కంప్యూటర్ విషయానికే వస్తే Windows Vista లో DreamScene ద్వారా డెస్క్ టాప్ పై ఎలాగైతే వీడియోలను వాల్ పేపర్లుగా సెట్ చేసుకోగలిగే వాళ్లమో ఇప్పుడు అదే అవకాశం సెల్ ఫోన్ల విషయంలోనూ లభిస్తోంది. అదెలాగన్నది నా మొబైల్ పై వివరంగా చూపిస్తున్నాను మీరే చూడండి.

 
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
 
ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తో పంచుకోవాలంటే ఈ లింక్ ని వారికి పంపించండిhttp://www.youtube.com/watch?v=YB5cNd-4Pr0
 
 

వీడియోని చూసేటప్పుడు మీ నెట్ కనెక్షన్ స్పీడ్ గా ఉన్నదైతే.. 720p, 1080p అనే హై డెఫినిషన్ (HD) రిజల్యూషన్లని Youtube Playerలో ఎంచుకుని మరింత హై క్వాలిటీతో వీడియోని చూడొచ్చు.

 వివిధ టెలివిజన్ ఛానెళ్లలో నేను చేసిన ప్రోగ్రాములు, ఇతర టెక్నికల్ వీడియోల కోసం http://youtube.com/nallamothu అనే ఛానెల్ కి సబ్ స్కైబ్ చేయొచ్చు.

computerera telugu magazine

మీ కంప్యూటర్లో కొన్ని వీడియోలు ఎందుకు ప్లే అవడం లేదు?

మీరు ఇంటర్నెట్ నుండి ఓ వీడియో ఫైల్ ని డౌన్ లోడ్ చేసుకున్నారు, లేదా మీ ఫ్రెండ్ ఒక వీడియో పంపించారనుకుందాం. అయితే ఆ వీడియో ఫైల్ ని మీ దగ్గర ఉన్న Windows Media Player ఓపెన్ చెయ్యలేకపోతోందా? అయితే ఓసారి VLC Player అనే  సాఫ్ట్ వేర్ ని డౌన్ లోడ్ చేసి ట్రై చేయండి. చాలావరకూ అన్ని రకాల వీడియోలు ఈ ప్లేయర్ తో ప్లే అవుతాయి. VLC Playerలో కూడా ప్లే అవకపోయినట్లయితే.. ఆ వీడియో క్లిప్ ని ప్లే చెయ్యగలిగే వీడియో Codec మీ ఆపరేటింగ్ సిస్టమ్ లో లేనట్లు లెక్క. ఒక్కోసారి "Codec లేదు, డౌన్ లోడ్ చెయ్యమంటారా" అని మీడియా ప్లేయర్ మెసేజ్ చూపించి కూడా డౌన్ లోడ్ చెయ్యమని కోరినప్పుడు నెట్ లో సరైన Codec లభించడం లేదని చేతులెత్తేస్తుంది. ఇలాంటి ఇబ్బందులను అధిగమించడానికి ftp://ftp2.kcsoftwares.com/kcsoftwa/files/videoinspector.zip అనే లింకులో లభించే Video Inspector అనే ఓ చిన్న సాఫ్ట్ వేర్ ని డౌన్ లోడ్ చేసుకుని ఇన్ స్టాల్ చేసుకోండి. ఈ ప్రోగ్రామ్ మనం ప్లే చెయ్యడానికి ఉపక్రమించే వీడియో క్లిప్ ని విశ్లేషించి అది ఏ Codecతో ఎన్ కోడ్ చెయ్యబడినదో గుర్తించి, ఆ Codec మన సిస్టమ్ లో ఉందో లేదో తెలియజేస్తుంది. మన కోరిక మేరకు ఇంటర్నెట్ నుండి అవసరం అయిన కొడెక్ ను డౌన్ లోడ్ చేసి వీడియోని ప్లే చేస్తుంది కూడా!

కంప్యూటర్ ఎరా అక్టోబర్ 2011 సంచిక సెప్టెంబర్ 27 నాటికి బుక్ షాపుల్లో లభిస్తుంది

 కంప్యూటర్ ఎరా తెలుగు మంత్లీ మేగజైన్ అక్టోబర్ 2011 సంచిక ఈ నెల (సెప్టెంబర్) 27 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా పుస్తకాల షాపుల్లో లభిస్తుంది. ప్రతీ లైన్ లోనూ మీరు ఊహించనంత వినూత్నమైన టెక్నికల్ సమాచారంతో కూడిన ఈ సంచికని మిస్ అవకండి.

computerera telugu magazine october 2011 nallamothu sridhar cover page

వివిధ టెలివిజన్ ఛానెళ్లలో నేను చేసిన ప్రోగ్రాములు, ఇతర టెక్నికల్ వీడియోల కోసం http://youtube.com/nallamothu అనే ఛానెల్ కి సబ్ స్కైబ్ చేయొచ్చు.

computerera telugu magazine

Windows 8 డెవలపర్ ప్రివ్యూ నేను వాడుతుండగా..

September 14, 2011 Uncategorized No Comments

"కంప్యూటర్ ఎరా" లాంటి పత్రికను ఆరంభించినప్పటి నుండి (10 సంవత్సరాలు) ఎడిటర్ గా ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని పాఠకులకు అందిస్తూ వస్తున్న నేను ఆ క్రమంలో తాజాగా విండోస్ 8 డెవలపర్ ప్రివ్యూని వాడడం మొదలెట్టాను. అందులో చోటుచేసుకున్న మార్పులను ఈ క్రింద ఫొటోల రూపంలో అందిస్తున్నాను.

 

- నల్లమోతు శ్రీధర్

విండోస్ 8లో చోటుచేసుకున్న Metro UI (యూజర్ ఇంటర్ ఫేస్)

 Metro UI nallamothusridhar

విండోస్ 8లో "నల్లమోతు శ్రీధర్ సాంకేతికాలు"బ్రౌజ్ చేస్తుండగా..

విండోస్ 8 nallamothusridhar

ఆఫీస్ 2007, 2010లో మాదిరిగా రిబ్బన్ యూజర్ ఇంటర్ ఫేస్ ని కలిగిన Windows Explorer, అందులో నేను క్రియేట్ చేసిన ఫోల్డర్

ribbion ui nallamothusridhar windows 8

నేను 4GB RAMతో 64-bit విండోస్ 8 వాడుతున్నాను..

4gb ram windows 8 nallamothu sridhar

ఫైళ్లు, ప్రోగ్రాములూ, సెట్టింగులను ఇలా సులభంగా వెదుక్కోవచ్చు.. సరికొత్త యూజర్ స్వరూపం ఇక్కడ కూడా..

విండోస్ 8 search interface

Control Panelలో యూజర్ అకౌంట్లు ఇలా కన్పిస్తుంటాయి:

Windows 8 User Interface Control Panel nallamothu sridhar

 

I News ఛానెల్ లో నిన్న జరిగిన Hardcore లైవ్ ప్రోగ్రామ్

September 10, 2011 మీడియా No Comments

 ఇంటర్నెట్ లో మెయిల్స్ లోనూ, ఛాటింగ్, Facebook, Twitter, Google + వంటి సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలోనూ తెలుగు లో ఎలా టైప్ చేయాలి, సాంకేతికంగా మన కంప్యూటర్లో ఉండాల్సిన సెట్టింగులు, యూనీకోడ్ కన్సార్టియమ్ లో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం సభ్యత్వం తీసుకోవడం వల్ల ఒనగూరే అదనపు ప్రయోజనాలూ వంటి అంశాలపై I News తెలుగు ఛానెల్ లో 9 సెప్టెంబర్ 2011 HardCore ప్రోగ్రామ్ లో జరిగిన చర్చని ఈ వీడియోలో చూడవచ్చు.

 ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తో పంచుకోవాలంటే ఈ లింక్ ని వారికి పంపించండిhttp://www.youtube.com/watch?v=Qo57ObG-6pI

 

వీడియోని చూసేటప్పుడు మీ నెట్ కనెక్షన్ స్పీడ్ గా ఉన్నదైతే.. 720p, 1080p అనే హై డెఫినిషన్ (HD) రిజల్యూషన్లని Youtube Playerలో ఎంచుకుని మరింత హై క్వాలిటీతో వీడియోని చూడొచ్చు.

 వివిధ టెలివిజన్ ఛానెళ్లలో నేను చేసిన ప్రోగ్రాములు, ఇతర టెక్నికల్ వీడియోల కోసం http://youtube.com/nallamothu అనే ఛానెల్ కి సబ్ స్కైబ్ చేయొచ్చు.

computerera telugu magazine

 

జాగృతి తెలుగు ఛానెల్ లో ప్రసారమైన నా అంతరంగం గంట వీడియో ఇక్కడ.. Must Watch

 "జాగృతి" న్యూస్ ఛానెల్ లో 24 ఆగస్ట్ 2011 8.30 PM నుండి 9.30 వరకూ "అంతరంగం" పేరుతో నా 15 సంవత్సరాల టెక్నికల్ ప్రయాణం, ప్రస్తుత టెక్ ట్రెండ్స్, టెక్నాలజీ, హ్యూమన్ రిలేషన్స్, కెరీర్స్.. వంటి పలు టెక్నికల్ అవేర్ నెస్ అంశాలపై డిస్కషన్ జరిగింది. అనేక సాంకేతిక పరమైన అంశాల గురించి విశ్లేషణాత్మకమైన చర్చ జరిగింది. టెక్నాలజీ వివిధ రంగాల్లో పోషిస్తున్న పాత్ర, టెక్నాలజీని ఎంతవరకూ స్వీకరించాలి, ఎక్కడ త్యజించాలి వంటి పలు అంశాలు చర్చించబడిన ఆ ప్రోగ్రామ్ వీడియోని ఈ క్రింద చూడవచ్చు.

 
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
 
మొదటి భాగపు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తో పంచుకోవాలంటే ఈ లింక్ ని వారికి పంపించండి:   http://www.youtube.com/watch?v=9kFyX3YfB1w
 
 

 

రెండవ భాగపు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తో పంచుకోవాలంటే ఈ లింక్ ని వారికి పంపించండి: http://www.youtube.com/watch?v=GUR7qR0AWng

 

వీడియోని చూసేటప్పుడు మీ నెట్ కనెక్షన్ స్పీడ్ గా ఉన్నదైతే.. 720p, 1080p అనే హై డెఫినిషన్ (HD) రిజల్యూషన్లని Youtube Playerలో ఎంచుకుని మరింత హై క్వాలిటీతో వీడియోని చూడొచ్చు.

 వివిధ టెలివిజన్ ఛానెళ్లలో నేను చేసిన ప్రోగ్రాములు, ఇతర టెక్నికల్ వీడియోల కోసం http://youtube.com/nallamothu అనే ఛానెల్ కి సబ్ స్కైబ్ చేయొచ్చు.

computerera telugu magazine

 

Search This Site:

Press75.com Press75.com Press75.com Press75.com

About Me

1996వ సంవత్సరంలో తెలుగులో మొట్టమొదట కంప్యూటర్ సాహిత్యాన్ని ప్రారంభించే అవకాశం నాకు కలిగింది. అదే సమయంలో చెన్నైలో సూపర్ హిట్ తెలుగు ఫిల్మ్ మేగజైన్ కి సబ్ ఎడిటర్ గా కూడా ఏకకాలంలో పనిచేస్తూ 1998 వరకూ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, మనీషా కొయిరాలా, శంకర్, రజనీకాంత్, కమల్ హాసన్ వంటి ప్రముఖులెందరినో ఇంటర్వ్యూలు చేయడం మర్చిపోలేని అనుభవం. అయితే సినిమా రంగంలో ఉన్న అనారోగ్యకరమైన వాతావరణం వల్ల నాకంటూ ఓ ప్రత్యేకమైన ఉనికిని సృష్టించుకోవడం కోసం సినిమా రంగం నుండి బయటకు వచ్చి పూర్తిగా టెక్నాలజీ రంగంలో స్థిరపడడం జరిగింది. 96 నుండి 2001 వరకూ పలు కంప్యూటర్ పత్రికలకు ఎడిటర్ గా పనిచేసి.. 2001 నుండి "కంప్యూటర్ ఎరా" తెలుగు మంత్లీ మేగజైన్ ఎడిటర్ గా పత్రిక మొత్తాన్నీ రూపొందిస్తూ ఉన్నాను. అలాగే తెలుగు టెలివిజన్ ఛానెళ్లలో మొట్టమొదటి టెక్నికల్ phone-in ప్రోగ్రామ్ కి గెస్ట్ గా అటెండ్ అయ్యే అవకాశమూ 2010 జనవరి 20న కలిగింది. అప్పటి నుండి ఇప్పటివరకూ I News, ETV2, ABN ఆంధ్రజ్యోతి, NTV, Zee 24 గంటలు, సాక్షి టివి, మహా టివి, జాగృతి న్యూస్ వంటి ఛానెళ్లలో 90కి పైగా లైవ్, రికార్డెడ్ ప్రోగ్రాముల్ని చేయడం జరిగింది. 2007లో అత్యుత్తమైన నాణ్యతతో కూడిన పోస్టులతో, వీడియోలతో తెలుగులో మొదటి ప్రొఫెషనల్ టెక్నికల్ బ్లాగ్ గానూ, మొదటి వీడియో బ్లాగ్ గానూ ఇప్పుడు మీరు చూస్తున్న బ్లాగ్ ప్రత్యేకతను సంతరించుకుంది. అలాగే 2007 జనవరి 1న ప్రారంభించిన తెలుగులోనే మొట్టమొదటి టెక్నికల్ ఫోరమ్ అయిన "కంప్యూటర్ ఎరా సాంకేతిక ఫోరమ్" 14 వేల మంది సభ్యులతో 10 వేలకు పైగా పోస్టులతో 2009 జూలై వరకూ నిర్వహించబడింది. దాంతోపాటే మొట్టమొదటి తెలుగు టెక్నికల్ ఛాట్ రూమ్ అయిన "కంప్యూటర్ ఎరా సాంకేతిక సహాయం" అనే ఛాట్ రూమ్ రెండేళ్లలో వేలాది మందికి తెలుగు టైప్ చేయడం మొదలుకుని అనేక కంప్యూటర్ సంబంధిత సాంకేతిక సమస్యలకు తక్షణ సహాయం అందించింది. ఇకపోతే http://youtube.com/nallamothu అనే ఛానెల్ లో 361కి పైగా ప్రొఫెషనల్ క్వాలిటీ తెలుగు టెక్నికల్ వీడియోలు అందించాను. ఈ ఛానెల్ కి 1192 మంది సబ్ స్కైబర్లు ఉన్నారు. అందుబాటులో ఉన్న వివిధ మార్గాల ద్వారా తెలుగు వారందరకీ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించే పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాను.

Google Playలో పొందండి

ఇక్కడ RSS Feedకి Subscribe చేసి నేరుగా పోస్ట్ లు పొందండి