గత 10 సంవత్సరాలుగా తెలుగు పాఠకులకు అద్భుతమైన సాంకేతిక సమాచారాన్ని పంచుతూ ఎందరో జీవితంలో స్థిరపడడానికి ఉపయోగపడిన "కంప్యూటర్ ఎరా" తెలుగు మాసపత్రిక నవంబర్ 2011 సంచిక విడుదలైంది. హైద్రాబాద్ లోని అన్ని బుక్ షాపుల్లో ప్రస్తుతం లభిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా నవంబర్ 2-3 తేదీల్లోపల అందుబాటులోకి వస్తుంది. అసలు "కంప్యూటర్ ఎరా"లో ఏముంటుంది.. అని భృకుటి ముడివేసే వారి కోసం.. మేగజైన్ పై ఓ అవగాహన కలగడం కోసం నవంబర్ 2011 సంచికలో ప్రచురించిన వందల కొద్దీ అంశాల్లో కొన్ని ముఖ్యాంశాలను ఈ క్రింద తెలియజేస్తున్నాం.


నవంబర్ 2011 "కంప్యూటర్ ఎరా" సంచికలోని కొన్ని ముఖ్యాంశాలు:
1. ఒక కంప్యూటర్లో ఇన్ స్టాల్ అయిన అప్లికేషన్లని వేరే పిసికి మళ్లీ ఇన్ స్టలేషన్ అవసరం లేకుండా కాపీ చేసుకోవడం ఎలా?
2. CPU వనరులను ఆదా చేసుకోవడానికి బ్యాక్ గ్రౌండ్ లో అవసరం లేకపోయినా నడుస్తున్న వనరులను suspend చేసుకోవడం
3. వైర్ లెస్ డేటా కార్డులను కొనబోయే ముందు తీసుకోవలసిన జాగ్రత్తలు
4. మీ పిల్లల ఆన్ లైన్ అలవాట్లని కనిపెట్టడమెలా?
5. పెన్ డ్రైవ్ ని Eject చేశాక మళ్లీ వాడాలంటే ఎందుకు గుచ్చాలి?
6. లాప్ టాప్ లు ఎంత టెంపరేచర్ లో పనిచేయొచ్చు?
7. ఆకర్షణీయమైన పోస్టర్లు తయారు చేసుకోవాలనుకుంటున్నారా? ఈజీ పద్ధతి.
8. విండోస్ 8 తక్కువ మెమరీతో ఎలా పనిచేయలుగుతుంది?
9. Outlookలో మెయిల్ అటాచ్ మెంట్ల సైజ్ ని పెంచడం ఎలా?
10. DVI, HDMI పోర్టుల్లో లేని ప్రత్యేకతలు Display Portలో ఏమి ఉన్నాయి?
11. Excelలో ఖాళీ Cellsని తొలగించుకోవడం ఎలా?
12. ఫాంట్లని సిస్టమ్ లో ఇన్ స్టాల్ చేయకుండానే అప్పటికప్పుడు వాడుకోవచ్చు తెలుసా?
13. నెట్ బుక్ లో సిడి/డివిడి డ్రైవ్ ఉండదు కదా.. అయినా వేరే సిస్టమ్ యొక్క డ్రైవ్ ని అవసరానికి వాడుకునే టెక్నిక్
14. మనం ప్రయాణించబోతున్న రైలు ఎక్కడ వరకూ వచ్చింది అన్న వివరాలు ఖచ్చితంగా తెలుసుకోవడం ఎలా?
15. రొటీన్ రెజ్యూమ్ లను చూసీ చూసీ విసుగొస్తోందా? మీ రెజ్యూమ్ ని కలర్ ఫుల్ గా తయారు చేసుకోవడం ఇలా..
16. కంప్యూటర్లోని ముఖ్యమైన డేటాని నిరంతరం బ్యాకప్ తీస్తూ ఉండాలా?
17. ఫొటోషాప్ లో Mask ఛానెళ్లని సృష్టించడం ఎంత సులభమో!
18. మీ ఫోన్ ని వైర్ లెస్ రూటర్ గా మార్చుకోవడం ఇలా..
19. పవర్ పాయింట్ లో టైటిల్ స్లైడ్లని వేగంగా తయారు చేసుకునే పద్ధతి
20. లాప్ టాప్ కి వచ్చే కొన్ని సాధారణ సమస్యలు ఇవి..
21. ఉబుంటులో Firewall ఎందుకు డిసేబుల్ చేయబడి ఉంటుంది?
22. పెన్ డ్రైవ్ తో పిసిని లాక్ చేయొచ్చని తెలుసా?
23. డేటాని పలు డివిడిల్లోకి spanning చేసుకోవడం ఎలా?
24. మొక్కలు పెంచడం మీకు ఇష్టమా? మీ మొక్కల నిర్వహణకు టెక్నాలజీని ఇలా వాడుకోవచ్చు
25. System Restoreలో మీకు కావలసిన ఫైల్ ఉంటే దాన్ని ఒక్కదాన్నే వెలికి తీయడం ఎలా?
ఇలా వందల కొద్దీ అంశాలు నవంబర్ 2011 "కంప్యూటర్ ఎరా" తెలుగు మేగజైన్ లో ప్రచురించబడ్డాయి.
విడి ప్రతి రూ. 20. సంవత్సర చందా రూ. 240 మాత్రమే. చందా వివరాలకు: 9963293399
విడిగా రాష్ర్టవ్యాప్తంగా ప్రముఖ పుస్తకాల షాపులన్నింటిలోనూ నవంబర్ 2-3 వ తేదీల్లోపల మేగజైన్ లభిస్తుంది.