పోయిన మీ ఫోన్ సరిగ్గా ఎక్కడ ఉందో లొకేషన్ ని ఇలా తెలుసుకోవచ్చు.. (వీడియో డెమో)

మోజుపడి కొన్న ఫోన్ పోతే ఆ బాధ చెప్పలేనిది. కొన్ని ఫోన్లలో SIM మార్చినా మన సెకండరీ నెంబర్ కి వివరాలు పంపించే  సదుపాయాలు ఉన్నా అవి కూడా ఈ క్షణం ఫోన్ ఎక్కడ ఉంది అన్నది స్పష్టంగా చెప్పలేవు.

ఈ వీడియోలో నేను చూపిస్తున్న టెక్నిక్ తో పోయిన ఫోన్ సరిగ్గా ఎక్కడ ఉందో తెలుసుకోవడంతో పాటు మనం ఇంట్లో కూర్చునే ఆ పోయిన ఫోన్ ద్వారా దొంగతనం చేసిన వ్యక్తికి తెలియకుండా ఫొటో తీయించి మన కంప్యూటర్ స్క్రీన్ మీద ఆ ఫొటోని చూసేయవచ్చు.

సో అలా వేర్వేరు సందర్భాల్లో మనం ఫొటోలను సేకరించడం ద్వారా ఆ దొంగ faceని గానీ, అతను తిరుగుతున్న పరిసరాలనూ తెలుసుకోవచ్చు. సరే ఇలా నేను మాటల్లో చెప్పే కన్నా స్వయంగా వీడియోలో చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. చూసేయండి మరి.

 ఈ వీడియోని మీ మిత్రులతో పంచుకోవాలంటే ఈ లింకుని వారికి పంపించండి:  http://goo.gl/FQpYq

మీ వెబ్ సైట్ లోనూ, బ్లాగ్ లోనూ మీకు ఈ వీడియో నచ్చితే రీపబ్లిష్ చేసుకోవచ్చు. మీ బ్లాగ్ లో కొత్త పోస్ట్ చేసేటప్పుడు HTML మోడ్ లో ఉండగా క్రింది లైన్ ని మీ పోస్ట్ లో add చేస్తే ఈ వీడియో వచ్చేస్తుంది.

<iframe width="560" height="315" src="http://www.youtube.com/embed/BH9z73ucaig" frameborder="0" allowfullscreen></iframe>

 

 

 

మనం వేసుకునే టాబ్లెట్ల వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్టులు వస్తాయో తెలుసుకోవాలి కదా..? (వీడియో డెమో)

టెక్నాలజీ మన జీవితాన్ని మెరుగుపరచడానికి ఉపయోగపడకపోతే వృధానే! అయితే మనకు మంచి చేసే resources ఎన్నో ఉన్నా టెక్నాలజీని చెడుకే వాడుకోవడం మన బలహీనతనుకోండి, మన ఆలోచనల్లో మార్పు రాకపోతే ఎవరూ మార్చలేరు.

ఇంతకీ విషయమేమిటంటే.. మనం ఫీవర్ అనీ, థ్రోట్ ఇన్ ఫెక్షన్ అనీ, ఇంకా అనేక కారణాలతో డాక్టర్ల ప్రిస్కిప్షన్ తోనూ, మామూలుగానే ఏవిబడితే అవి టాబ్లెట్లని మింగేస్తుంటాం. అవి లోపలకి వెళ్లి ఎంత భీభత్సం సృష్టిస్తాయో కూడా పట్టించుకోం. డాక్టర్లు కూడా వాళ్లకున్న బిజీ షెడ్యూల్స్ లో 2 నిముషాలు మాట్లాడడమే గొప్ప అన్నట్లు ఉంటుంటే మనకు మెడిసిన్స్ ఎలా వాడాలో ఏం చెబుతారు చెప్పండి?

సో మన ఆరోగ్యం గురించి మనమేగా శ్రద్ధ తీసుకోవసింది. మనం ఎప్పుడు ఏ మెడిసిన్ వాడుతున్నా అది ఏయే ట్రీట్ మెంట్లకు పనికొస్తుంది, ఎవరు వాడాలి, ఎవరు వాడకూడదు, ఎంత మోతాదులో వాడాలి, సైడ్ ఎఫెక్టులు ఎలా ఉంటాయి, తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి, ఏయే కాంబినేషన్ల డ్రగ్స్ ని కలిపి వాడకూడదు వంటి వివరాలన్నింటినీ తెలిపే ఓ సైట్ ని ఈ వీడియోలో మీకు పరిచయం చేశాను. అందులో ఉండే అన్ని ఆప్షన్లూ మీరు చూడొచ్చు.

 ఈ వీడియోని మీ మిత్రులతో పంచుకోవాలంటే ఈ లింకుని వారికి పంపించండి:  http://goo.gl/m3xhW

మీ వెబ్ సైట్ లోనూ, బ్లాగ్ లోనూ మీకు ఈ వీడియో నచ్చితే రీపబ్లిష్ చేసుకోవచ్చు. మీ బ్లాగ్ లో కొత్త పోస్ట్ చేసేటప్పుడు HTML మోడ్ లో ఉండగా క్రింది లైన్ ని మీ పోస్ట్ లో add చేస్తే ఈ వీడియో వచ్చేస్తుంది.

<iframe width="560" height="315" src="http://www.youtube.com/embed/Xea8-Kd_mW4" frameborder="0" allowfullscreen></iframe>

 

 

 

ఒకే ఇంటర్నెట్ కనెక్షన్ పిసికీ, లాప్ టాప్ కీ, మొబైల్ కీ Share చేసుకోవడం (వీడియో డెమో)

మన ఇంటర్నెట్ కనెక్షన్ ని కేవలం కంప్యూటర్ ఒక్కదానికే వాడటం కాకుండా మన దగ్గర ఉన్న సెల్ ఫోన్ లోనూ, లాప్ టాప్ లోనూ, నెట్ బుక్ లోనూ.. ఎన్ని డివైజ్ లు ఉంటే అన్నింటికీ షేర్ చేసుకోవడం ఎలాగో ఈ వీడియోలో చూపించాను.

ఎక్కువ పిసి వద్ద గడిపే వారు మళ్లీ మొబైల్ కోసం GPRS, EDGE, 3G వంటి వాటికి డబ్బులు వృధాగా ఖర్చుపెట్టాల్సిన పనిలేకుండా మీ పిసికి వాడుకునే నెట్ కనెక్షన్ నే మీ ఫోన్ లో వాడుకోవచ్చు. మరిన్ని ప్రయోజనాలూ ఈ వీడియో చూస్తే అర్థమవుతాయి.

 ఈ వీడియోని మీ మిత్రులతో పంచుకోవాలంటే ఈ లింకుని వారికి పంపించండి:  http://goo.gl/JX07i

మీ వెబ్ సైట్ లోనూ, బ్లాగ్ లోనూ మీకు ఈ వీడియో నచ్చితే రీపబ్లిష్ చేసుకోవచ్చు. మీ బ్లాగ్ లో కొత్త పోస్ట్ చేసేటప్పుడు HTML మోడ్ లో ఉండగా క్రింది లైన్ ని మీ పోస్ట్ లో add చేస్తే ఈ వీడియో వచ్చేస్తుంది.

<iframe width="560" height="315" src="http://www.youtube.com/embed/WUXyqh2mZMI" frameborder="0" allowfullscreen></iframe>

 

 

 

మీ కంప్యూటర్ Fastగా పనిచేసేందుకు కొన్ని చిట్కాలు (వీడియో డెమో)

చాలా చిన్న చిన్న సెట్టింగులు చేసుకుంటే మన కంప్యూటర్ performanceని మెరుగుపరుచుకోవచ్చు.  పనితీరు పెరగడం వల్ల పిసి మరింత వేగంగా ఉంటే ఎంత ఈజీగా పనిచేసుకుంటూ పోవచ్చో ఆలోచించండి?

ఈ వీడియోలో ఎలాంటి కంప్యూటర్ నాలెడ్జ్ లేని వారైనా ఫాలో అవగలిగే కొన్ని చిన్న టెక్నిక్స్ ని వివరిస్తున్నాను. చూసేయండి మరి.

 ఈ వీడియోని మీ మిత్రులతో పంచుకోవాలంటే ఈ లింకుని వారికి పంపించండి:  http://goo.gl/KGUhF

మీ వెబ్ సైట్ లోనూ, బ్లాగ్ లోనూ మీకు ఈ వీడియో నచ్చితే రీపబ్లిష్ చేసుకోవచ్చు. మీ బ్లాగ్ లో కొత్త పోస్ట్ చేసేటప్పుడు HTML మోడ్ లో ఉండగా క్రింది లైన్ ని మీ పోస్ట్ లో add చేస్తే ఈ వీడియో వచ్చేస్తుంది.

<iframe width="560" height="315" src="http://www.youtube.com/embed/b0-Nt7bk9hY" frameborder="0" allowfullscreen></iframe>

 

 

 

వేలాది రూపాయలు పెట్టి డిజిటల్ కెమెరా కొనే ముందు ఈ వీడియో ఓసారి చూడండి

కంపెనీ పేరునో, ఎక్కువ Mega Pixelనో చూసి డిజిటల్ కెమెరాలను కొనాలనుకునే వారు వాటికన్నా ఎక్కువ ఆలోచించవలసిన విషయాల గురించి ఈ వీడియోలో వివరించాను. Image Sensor, Lens, optial zoom వంటి ముఖ్యమైన factors గురించి ఏమాత్రం ఫొటోగ్రఫీపై అవగాహన లేని వారికి సైతం అర్థమయ్యే సులభమైన భాషలో డిస్కస్ చేశాను ఈ వీడియోలో!

వెనుకాముందూ ఆలోచించకుండా వేలాది రూపాయలు వృధా చేయకుండా ఓ 5 నిమిషాలు ఓపికగా ఈ వీడియో చూసి ఆ తర్వాత ఎలాంటిది కొనాలో నిర్ణయించుకోండి.

- నల్లమోతు శ్రీధర్

 ఈ వీడియోని మీ మిత్రులతో పంచుకోవాలంటే ఈ లింకుని వారికి పంపించండి:  http://goo.gl/hQUtB

మీ వెబ్ సైట్ లోనూ, బ్లాగ్ లోనూ మీకు ఈ వీడియో నచ్చితే రీపబ్లిష్ చేసుకోవచ్చు. మీ బ్లాగ్ లో కొత్త పోస్ట్ చేసేటప్పుడు HTML మోడ్ లో ఉండగా క్రింది లైన్ ని మీ పోస్ట్ లో add చేస్తే ఈ వీడియో వచ్చేస్తుంది.

<iframe width="560" height="315" src="http://www.youtube.com/embed/FnpLMMXVvhw" frameborder="0" allowfullscreen></iframe>

 

 

 

మీరు స్వంతంగా వెబ్ సైట్ / ఆన్ లైన్ పత్రిక పెట్టాలనుకుంటున్నారా? ఎంత ఈజీనో చూడండి

సెలబ్రిటీల దగ్గర్నుండీ, మామూలు వ్యక్తుల వరకూ స్వంత వెబ్ సైట్లు కలిగి ఉంటున్నారు. మీరు రచయితలైనా, సాహిత్యం, వంటల వంటి పలు అభిరుచుల పట్లా ఆసక్తి ఉంటే మీరు మీ స్వంత వెబ్ సైట్ మొదలుపెట్టవచ్చు.  చాలామంది అనుకుంటున్నట్లు వెబ్ సైట్లు మొదలుపెట్టడం ఖరీదైన వ్యవహారమేమీ కాదు.

అలాగే అందరూ భయపడేటట్లు వెబ్ సైట్ల నిర్వహణా, డిజైనింగ్ వంటివీ మనం ప్రత్యేకంగా నేర్చుకోవలసిన పనిలేదు. ఈ వీడియో చూస్తే స్వంతంగా వెబ్ సైట్ ని కలిగి ఉండాలన్న మీ కల ఖచ్చితంగా ఆచరణకు నోచుకుంటుంది. మీకు వెబ్ సైట్ల పరంగా ఉన్న అనేక అపోహలు తొలగిపోతాయి.

- నల్లమోతు శ్రీధర్

 ఈ వీడియోని మీ మిత్రులతో పంచుకోవాలంటే ఈ లింకుని వారికి పంపించండి:  http://goo.gl/CsiU0

మీ వెబ్ సైట్ లోనూ, బ్లాగ్ లోనూ మీకు ఈ వీడియో నచ్చితే రీపబ్లిష్ చేసుకోవచ్చు. మీ బ్లాగ్ లో కొత్త పోస్ట్ చేసేటప్పుడు HTML మోడ్ లో ఉండగా క్రింది లైన్ ని మీ పోస్ట్ లో add చేస్తే ఈ వీడియో వచ్చేస్తుంది.

<iframe width="560" height="315" src="http://www.youtube.com/embed/s-ZALwYso44" frameborder="0" allowfullscreen></iframe>

 

 

 

మీకు తెలియకుండానే మీ పిసిలో అత్యంత ప్రమాదకరమైన రూట్ కిట్ లు ఉండొచ్చు (వీడియో డెమో)

ఒక సగటు కంప్యూటర్ యూజర్ భద్రత మీద చాలా తక్కువ దృష్టి పెడుతూ ఉంటారు. కంప్యూటర్లో మనకు తెలియకుండానే ఎన్ని ప్రమాదాలు జరిగిపోతున్నా గమనించకపోవడం అన్నది ఎంత దారుణమైన పరిస్థితో ఆలోచించండి.

అందరూ వైరస్ అనే పదాన్ని వింటూనే ఉంటారు కానీ అంతకన్నా rootkitలు మరింత ప్రమాదకరమైనవి, అస్సలు అవి కొన్ని ఉన్నాయని తెలుసుకోరు. అలాగే కీజెన్ లు, ప్యాచ్ లూ, లోడర్ల ద్వారా పైరేటెడ్ సాఫ్ట్ వేర్ వాడుతూ కూడా.. తమ ఏంటీవైరస్ సాఫ్ట్ వేర్ వాటిలో వైరస్ చూపించడం లేదు కాబట్టి అవన్నీ క్లీన్ గా ఉంటాయని నమ్ముతూ ఉంటారు. ఈ నేపధ్యంలో కీజెన్ ల వంటి వాటని క్రిప్ట్ చేసి మన పిసిలో ఎలా ప్రవేశపెడతారు వంటి విషయాల్నీ ఈ వీడియోలో ప్రస్తావించాను. స్పీకర్లు ఆన్ చేసుకుని వింటూ చూడండి.

- నల్లమోతు శ్రీధర్

 ఈ వీడియోని మీ మిత్రులతో పంచుకోవాలంటే ఈ లింకుని వారికి పంపించండి:  http://goo.gl/IL1IZ

మీ వెబ్ సైట్ లోనూ, బ్లాగ్ లోనూ మీకు ఈ వీడియో నచ్చితే రీపబ్లిష్ చేసుకోవచ్చు. మీ బ్లాగ్ లో కొత్త పోస్ట్ చేసేటప్పుడు HTML మోడ్ లో ఉండగా క్రింది లైన్ ని మీ పోస్ట్ లో add చేస్తే ఈ వీడియో వచ్చేస్తుంది.

<iframe width="560" height="315" src="http://www.youtube.com/embed/AWCq-psD8N4" frameborder="0" allowfullscreen></iframe>

 

 

 

వెబ్ సైట్లు / బ్లాగులూ / ఫేస్ బుక్ లలో మీరు కష్టపడి టైప్ చేసిన మేటర్ పొరబాటున పోతే ఇలా తిరిగి తెచ్చుకోవచ్చు

క్రింది వాటిలో మీరు ఏ సమస్యనైనా ఎదుర్కోవచ్చు:

  • చాలా కష్టపడి మీరు ఓ పెద్ద మెయిల్ మెసేజ్ కంపోజ్ చేశారనుకుందాం. పొరబాటున Select All చేసి మీకు మీరే దాన్ని డిలీట్ చేశారనుకుందాం.
  • Facebookలోనో, Google+లోనో, ఆర్కుట్ లోనో, ఒక బ్లాగ్ లోనో, వెబ్ సైట్ లోనో సీరియస్ డిస్కషన్ చేస్తూ మీ అభిప్రాయాన్ని ఓ పెద్ద పేరా టైప్ చేసినప్పుడు ఒక్కోసారి పొరబాటున మొత్తం కష్టపడి మన ఆలోచనలకు పదును పెట్టి రాసిన మేటర్ మొత్తం పోగొట్టుకుంటూ ఉంటాం. మళ్లీ అంత వివరంగా రాయాలంటే ఓపిక లేక నిరుత్సాహంతో వదిలేస్తుంటాం.

ఇలాంటి అన్ని సమస్యలకు పరిష్కారమే నేను ఈ వీడియోలో చూపిస్తున్న టెక్నిక్. ఇంటర్నెట్ లో మీరు ఏ సైట్ లో ఏం టైప్ చేస్తూ పొరబాటున పోగొట్టుకున్నా దాన్ని ఎంత ఈజీగా తిరిగి తెచ్చుకోవచ్చో, టైమ్ నీ, ఓపికనీ కాపాడుకోవచ్చో ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది.

- నల్లమోతు శ్రీధర్

 ఈ వీడియోని మీ మిత్రులతో పంచుకోవాలంటే ఈ లింకుని వారికి పంపించండి:  http://goo.gl/rXByQ

మీ వెబ్ సైట్ లోనూ, బ్లాగ్ లోనూ మీకు ఈ వీడియో నచ్చితే రీపబ్లిష్ చేసుకోవచ్చు. మీ బ్లాగ్ లో కొత్త పోస్ట్ చేసేటప్పుడు HTML మోడ్ లో ఉండగా క్రింది లైన్ ని మీ పోస్ట్ లో add చేస్తే ఈ వీడియో వచ్చేస్తుంది.

<iframe width="560" height="315" src="http://www.youtube.com/embed/fCqhI8OM6IM" frameborder="0" allowfullscreen></iframe>

 

 

 

అనేక తెలుగు టెక్నికల్ వీడియోల హ్యాండ్ బుక్ ఇదిగోండి.. (నవంబర్ 18 అప్ డేట్ )

ప్రతీ కంప్యూటర్ యూజర్ కీ ఖచ్చితంగా పనికొచ్చే పలు తెలుగు టెక్నికల్ వీడియోల హ్యాండ్ బుక్ ని ఈ క్రింది లింక్ నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

నా తెలుగు టెక్నికల్ వీడియోలను చూసేటప్పుడు ఈరోజు మీకు ఒక వీడియో ఇంట్రెస్టింగ్ అన్పించకపోవచ్చు.. రేపు "ఫలానా వీడియో ఎక్కడుంది.." అని అవసరం కొద్దీ వెదుక్కోవలసి రావచ్చు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఒక మామూలు కంప్యూటర్ యూజర్ దగ్గర్నుండీ ప్రొఫెషనల్స్ వరకూ ఉపయోగపడే వీడియో లింకులన్నింటినీ దఫాల వారీగా ఒకేచోట అందించే ప్రయత్నమే ఈ Handbook.

మీరు ఈ క్రింది లింక్ నుండి PDF ఫైల్ ని డౌన్ లోడ్ చేసుకుని మీ కంప్యూటర్లో జాగ్రత్తపరుచుకోవచ్చు.

PDF ఫైల్ డౌన్ లోడ్ లింకు:

http://goo.gl/TfI5d

ఆ PDF ఫైల్ లోని లింక్ ని క్లిక్ చేస్తే మీ బ్రౌజర్ లో సంబంధిత  వీడియో ఓపెన్ అవుతుంది.
అలాగే మీ సౌకర్యం కోసం కొన్ని వీడియోల లింకులను ఇక్కడా ఇదే పోస్టులో ఇస్తున్నాను.

- నల్లమోతు శ్రీధర్

కొన్ని వీడియోల లింకులు ఒకేచోట మీ సౌకర్యం కోసం:

1.      పలు సెల్ ఫోన్లని USB పోర్ట్ ద్వారా ఛార్జింగ్ చేసుకునే కేబుల్ దొరుకుతోంది తెలుసా? అదీ తక్కువ ధరకే! అదెలా ఉంటుందో ఎలా వాడాలో ఈ వీడియోలో చూడండి

http://goo.gl/Gwhzz

 

2.      పిసి యూజర్లు కంప్యూటర్ ని విప్పదీస్తే లోపల ఏమి పాడవుతాయో అని అస్సలు క్లీనింగే చేయరు. మీకు ఎలాంటి భయం లేకుండా ఈజీగా మీ పిసిని క్లీన్ చేసుకోవడం ఎలాగో ఈ వీడియోలో చూపించాము..

           http://goo.gl/ZdUpd

3.      విండోస్ మీడియా ప్లేయర్ లో పాటలు వినేటప్పుడు మీకు నచ్చిన ఫొటోని బ్యాక్ గ్రౌండ్ గా సెట్ చేసుకోవచ్చని తెలుసా? ఆ చిన్న టెక్నిక్ ని ఇక్కడ చూసేయండి మరి.

           http://goo.gl/IeAZS

4.      చాలామంది Gmail అకౌంట్లు హ్యాక్ అయి ఉంటున్నాయి.. అయినా ఆ విషయం తెలియకుండానే పనిచేసుకుపోతున్నారు. ఈ నేపధ్యంలో మీ అకౌంట్ హ్యాక్ అవకుండా ఎంత పటిష్టమైన జాగ్రత్త తీసుకోవచ్చో ఈ వీడియోలో చూడవచ్చ.

           http://goo.gl/h5WDj

5.      చీటికీ మాటికీ మీ పిసికి వైరస్ వస్తోందా? హార్డ్ వేర్ టెక్నీషియన్ కి వందలకొద్దీ వదిలిస్తున్నారా? ఈ వీడియోలో చూపించిన టెక్నిక్ ఫాలో అవండి ఇక మీ పిసికి వైరస్సే రాదు.

http://goo.gl/9pGiD

6.      ఫొటోషాప్ లో మీ ఫొటోని మంచి బ్యాక్ గ్రౌండ్ లో నిలబడ్డట్లు మిక్సింగ్ చేయాలనుకుంటున్నారా? మీ ఫొటోనే కాదు.. మీ ఫ్రెండ్స్ బర్త్ డేల సమయంలో ఈ టెక్నిక్ తో వారికి మంచి గ్రీటింగూ చేసేయొచ్చు. అదెలాగో ఇక్కడ చూడండి..

 

http://goo.gl/mOzOi

 

7.      BIOSలో మనం కంప్యూటర్ కి పాస్ వర్డ్ పెట్టుకోవచ్చు, USB పోర్టులను పనిచేయకుండా చేయొచ్చు… వందలాది సెట్టింగులు అందులో లభిస్తుంటాయి. మరి వాటిని ఈజీగా వాడడం ఎలాగో ఇక్కడ తెలుసుకోండి.

http://goo.gl/YUXxu

 

8.      మీ కంప్యూటర్ ని మీ పెన్ డ్రైవ్ సాయంతో వేగంగా పనిచేసేలా చేసుకోవచ్చని తెలుసా? పెన్ డ్రైవ్ ని వృధాగా పక్కన పెట్టడం మానేసి ఈ టెక్నిక్ తెలుసుకుని ఆచరించండి మరి.. పిసి అన్నా స్పీడ్ అవుతుంది..

          http://goo.gl/5SgZH

9.      కొన్ని వైరస్ లు విండోస్ లో ఎంత ట్రై చేసినా దాక్కునే ఉంటాయి. అలాంటప్పుడు విండోస్ బూట్ అవకముందు వాటిని స్కాన్ చేసుకోవడం బెటర్. అదెలాగో ఈ వీడియో చూస్తే మీకు తెలుస్తుంది.

http://goo.gl/0usHF

10.   మెయిల్స్ లోనూ, ఛాటింగ్ లోనూ, Word, Notepad వంటి అనేక విండోస్ ప్రోగ్రాముల్లోనూ చక్కగా తెలుగులో టైప్ చేయాలని ఉంటే.. అది ఎంత చిన్న విషయమో ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది.

         http://goo.gl/JpEIE

11.   మీ ఫోన్ కోసం కొన్న బ్లూటూత్ హెడ్ సెట్ కేవలం ఫోన్ కాల్స్ నే విన్పిస్తోందా? పాటలూ, సినిమాల్లోని ఆడియోనీ బ్లూటూత్ హెడ్ సెట్ లో పొందడం ఎలాగో ఈ క్రింది లింకులో చూడండి

http://goo.gl/EUmyZ

 

12.   కొత్తగా ఫొటోషాప్ నేర్చుకుంటున్నారా? లేదా ఇప్పటికే కొంత వచ్చా? ఈ వీడియోలో చూపిస్తున్న రెండు మంచి టెక్నిక్ లు ఇకపై మీకు మరింత యూజ్ ఫుల్ గా ఉంటాయి మీరే చూడండి

 

http://goo.gl/Uhxm6

13.   కొన్ని ఫైల్ పేర్లు బ్లూ కలర్ లో కన్పిస్తుంటాయి. ఇలా కన్పిస్తోందంటే వైరస్సా? ఏమైనా సిస్టమ్ లో ప్రాబ్లెం ఉందా? అస్సలు ఎందుకు ఇలా కన్పిస్తాయో ఇక్కడ తెలుసుకోండి

     http://goo.gl/x4cav

14.   మీ ఇంట్లో పిల్లలు గంటల తరబడి ఛాటింగ్, మెయిల్స్, ఫేస్ బుక్ వంటి వాటికి అతుక్కుపోతున్నారా? లేదా మీరు ఏవైనా ఇతర వెబ్ సైట్లని బ్లాక్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే చాలా చిన్న టెక్నిక్ తో అవసరం లేని సైట్లని బ్లాక్ చేసుకోవడం ఇక్కడ చూడండి

http://goo.gl/rfkuw

 

15.   సెల్ ఫోన్ లోనూ తెలుగు చూడొచ్చు, తెలుగులో టైప్ చేసుకోవచ్చని తెలుసా? ఆశ్చర్యపోకండి.. స్వయంగా మీరే ఈ వీడియోలో చూడండి.. మీరూ మరో 10 మందికి చెప్తారు..

http://goo.gl/al1MK

 

16.   మీ టివికి ఉన్న డివిడి ప్లేయర్ లో అన్ని వీడియోలూ ప్లే అవడం లేదా? మీ పిసిలో ప్లే అయ్యే అన్ని వీడియోలూ టివిలోనూ ప్లే అయ్యే విధంగా మార్చుకోవడం ఎలాగో ఇక్కడ చూసేయండి, ఇక మీ ప్రాబ్లెం సాల్వ్ అవుతుంది.

        http://goo.gl/LUAjD

17.   సెల్ ఫోన్ రీఛార్జ్ చేయించుకోవడానికి కష్టపడి షాపుల చుట్టూ తిరగడం ఎందుకు? ఇక్కడ అద్భుతమైన పద్ధతిని చూపించాం.. ఇకపై దీన్ని ఫాలో అయిపొండి.. రీఛార్జ్ ఎప్పుడైనా మీరే చేసుకోవచ్చు..

http://goo.gl/WafcM

 

 

“C” లాంగ్వేజ్ అస్సలు ఎందుకు పనికొస్తుంది? కంప్యూటర్ బేసిక్స్ కూడా తెలియని వారికి అర్థమవడం కోసం వివరణ ఇదిగోండి

మీరు ఖచ్చితంగా C లాంగ్వేజ్ అనే పేరు వినే ఉంటారు. కానీ అది చాలా కష్టమని మీరు భావిస్తూ ఉండొచ్చు.  ఇంజనీరింగ్ చదివే స్టూడెంట్ల దగ్గర్నుండీ సాఫ్ట్ వేర్ జాబ్ లు చేసే వాళ్ల వరకూ C లాంగ్వేజ్ ని ఎందుకు అంతగా వాడతారో అర్థం అయి ఉండదు. అస్సలు మీరు కనీసం తెలుసుకోవాలని కూడా ప్రయత్నించి ఉండి ఉండకపోవచ్చు.

కనీసం ఇప్పటికైనా C లాంగ్వేజ్ ఎందుకు పనికొస్తుందో తెలుసుకోవాలన్న మినిమమ్ క్యూరియాసిటీ మీకు కలిగి ఉంటే ఈ వీడియో మీ కోసమే తయారు చేశాను.

దీనిలో కావాలని పెద్ద పెద్ద ఉదాహరణలు చెప్పలేదు. వీలైనంత వరకూ అర్థం కాని పదాలను వాడకుండా ఉండడానికి ప్రయత్నించాను. అస్సలు C లాంగ్వేజ్ అనేది ఎందుకు వాడతారో మామూలు కంప్యూటర్ యూజర్ కి తెలియడమే ఈ వీడియో లక్ష్యం. అలాగే C లాంగ్వేజ్ అంటే ఏదో గొప్ప కాదనీ, చిన్న చిన్న లైన్లతో కావలసిన ఫలితాలు ఎలా వస్తాయో ఎవరికైనా అర్థం కావడం కోసం ఇందులో ఓ చిన్న ప్రోగ్రామ్ నీ చూపించాను.

చదువుకునే పిల్లలే కాదు.. వారిని చదివించే తల్లిదండ్రులకు కూడా ఈ వీడియో చూస్తే C లాంగ్వేజ్ మీద కొద్దిపాటి అవగాహన కలుగుతుంది. మీవాడు ఏం నేర్చుకుంటున్నాడంటే.. "C" అని ధీమాగా చెప్పేయగలరు. :)  

జస్ట్ సరదాకే అంటున్నాననుకోండి. కానీ ఇది నిజం! మీరే చూడండి.

  ఈ వీడియోని మీ మిత్రులతో పంచుకోవాలంటే ఈ లింకుని వారికి పంపించండి:  http://goo.gl/9V44J

మీ వెబ్ సైట్ లోనూ, బ్లాగ్ లోనూ మీకు ఈ వీడియో నచ్చితే రీపబ్లిష్ చేసుకోవచ్చు. మీ బ్లాగ్ లో కొత్త పోస్ట్ చేసేటప్పుడు HTML మోడ్ లో ఉండగా క్రింది లైన్ ని మీ పోస్ట్ లో add చేస్తే ఈ వీడియో వచ్చేస్తుంది.

<iframe width="560" height="315" src="http://www.youtube.com/embed/z-0kwG2lbA0" frameborder="0" allowfullscreen></iframe>

 

 

 

Search This Site:

Press75.com Press75.com Press75.com Press75.com

About Me

1996వ సంవత్సరంలో తెలుగులో మొట్టమొదట కంప్యూటర్ సాహిత్యాన్ని ప్రారంభించే అవకాశం నాకు కలిగింది. అదే సమయంలో చెన్నైలో సూపర్ హిట్ తెలుగు ఫిల్మ్ మేగజైన్ కి సబ్ ఎడిటర్ గా కూడా ఏకకాలంలో పనిచేస్తూ 1998 వరకూ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, మనీషా కొయిరాలా, శంకర్, రజనీకాంత్, కమల్ హాసన్ వంటి ప్రముఖులెందరినో ఇంటర్వ్యూలు చేయడం మర్చిపోలేని అనుభవం. అయితే సినిమా రంగంలో ఉన్న అనారోగ్యకరమైన వాతావరణం వల్ల నాకంటూ ఓ ప్రత్యేకమైన ఉనికిని సృష్టించుకోవడం కోసం సినిమా రంగం నుండి బయటకు వచ్చి పూర్తిగా టెక్నాలజీ రంగంలో స్థిరపడడం జరిగింది. 96 నుండి 2001 వరకూ పలు కంప్యూటర్ పత్రికలకు ఎడిటర్ గా పనిచేసి.. 2001 నుండి "కంప్యూటర్ ఎరా" తెలుగు మంత్లీ మేగజైన్ ఎడిటర్ గా పత్రిక మొత్తాన్నీ రూపొందిస్తూ ఉన్నాను. అలాగే తెలుగు టెలివిజన్ ఛానెళ్లలో మొట్టమొదటి టెక్నికల్ phone-in ప్రోగ్రామ్ కి గెస్ట్ గా అటెండ్ అయ్యే అవకాశమూ 2010 జనవరి 20న కలిగింది. అప్పటి నుండి ఇప్పటివరకూ I News, ETV2, ABN ఆంధ్రజ్యోతి, NTV, Zee 24 గంటలు, సాక్షి టివి, మహా టివి, జాగృతి న్యూస్ వంటి ఛానెళ్లలో 90కి పైగా లైవ్, రికార్డెడ్ ప్రోగ్రాముల్ని చేయడం జరిగింది. 2007లో అత్యుత్తమైన నాణ్యతతో కూడిన పోస్టులతో, వీడియోలతో తెలుగులో మొదటి ప్రొఫెషనల్ టెక్నికల్ బ్లాగ్ గానూ, మొదటి వీడియో బ్లాగ్ గానూ ఇప్పుడు మీరు చూస్తున్న బ్లాగ్ ప్రత్యేకతను సంతరించుకుంది. అలాగే 2007 జనవరి 1న ప్రారంభించిన తెలుగులోనే మొట్టమొదటి టెక్నికల్ ఫోరమ్ అయిన "కంప్యూటర్ ఎరా సాంకేతిక ఫోరమ్" 14 వేల మంది సభ్యులతో 10 వేలకు పైగా పోస్టులతో 2009 జూలై వరకూ నిర్వహించబడింది. దాంతోపాటే మొట్టమొదటి తెలుగు టెక్నికల్ ఛాట్ రూమ్ అయిన "కంప్యూటర్ ఎరా సాంకేతిక సహాయం" అనే ఛాట్ రూమ్ రెండేళ్లలో వేలాది మందికి తెలుగు టైప్ చేయడం మొదలుకుని అనేక కంప్యూటర్ సంబంధిత సాంకేతిక సమస్యలకు తక్షణ సహాయం అందించింది. ఇకపోతే http://youtube.com/nallamothu అనే ఛానెల్ లో 361కి పైగా ప్రొఫెషనల్ క్వాలిటీ తెలుగు టెక్నికల్ వీడియోలు అందించాను. ఈ ఛానెల్ కి 1192 మంది సబ్ స్కైబర్లు ఉన్నారు. అందుబాటులో ఉన్న వివిధ మార్గాల ద్వారా తెలుగు వారందరకీ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించే పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాను.

Google Playలో పొందండి

ఇక్కడ RSS Feedకి Subscribe చేసి నేరుగా పోస్ట్ లు పొందండి