ఆకాష్ టాబ్లెట్ కొంటారా? ఇలాంటివి కొంటారా?
ఆకాష్ టాబ్లెట్ అతి చవకగా లభిస్తోందని ప్రభుత్వం ఊదరగొడుతోంది, ప్రజలూ దాన్ని దక్కించుకోవడానికి వేచి చూస్తున్నారు. ఆకాష్ టాబ్లెట్ ని నేను స్వయంగా వాడి చూశాను. చాలా తక్కువ responsiveగానూ, Android Market నుండి ఏ అప్లికేషనూ ఇన్ స్టాల్ అవడం లేదు. దాన్ని ఎందుకు అంతగా ప్రమోట్ చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు.
సరే సరిగ్గా 5000లకు HP TouchPad అనే అద్భుతమైన Touchpad లభిస్తోంది. ఒక్కసారి దీన్ని చూడండి, ఆకాష్ ని పక్కన పెట్టి చూడండి. 5000ల ఆఫర్ ఇప్పుడు లేకపోయినా చవకగా ఆకాష్ కంటే అద్భుతమైన Tabletలు కొద్దిరోజుల్లో లభిస్తాయన్నది ఎవరూ కాదనలేని వాస్తవం.
ఒకసారి క్రింది వీడియోని చూడడం ద్వారా ఈ వీడియోని చూసి ఆకాష్ ని కొనాలనుకుంటారో, ఇలాంటివి కొనాలనుకుంటారో మీరే నిర్ణయించుకోండి. మరోసారి ప్రభుత్వపు హడావుడికీ, మంత్రుల అవగాహనాలేమిని సొమ్ము చేసుకోవాలనుకునే వారికీ సాల్యూట్ కొడుతూ
మీ వెబ్ సైట్ లోనూ, బ్లాగ్ లోనూ మీకు ఈ వీడియో నచ్చితే రీపబ్లిష్ చేసుకోవచ్చు. మీ బ్లాగ్ లో కొత్త పోస్ట్ చేసేటప్పుడు HTML మోడ్ లో ఉండగా క్రింది లైన్ ని మీ పోస్ట్ లో add చేస్తే ఈ వీడియో వచ్చేస్తుంది.
<iframe width="560" height="315" src="http://www.youtube.com/embed/NsNnzylHDGI" frameborder="0" allowfullscreen></iframe>

















