మీ ఫేస్‌బుక్ ఫ్రెండ్స్‌ని మీరు avoid చేస్తున్నారన్న అపార్థాలు దీంతో మాయం… Must Watch & Share

By | December 7, 2012

వీడియో లింక్ ఇది:  http://bit.ly/srifbchat

ఫేస్‌బుక్ ఎంత చిరాకు తెప్పిస్తుందంటే…

మీరు ఏదో పనిలో చాలా బిజీగా ఉన్నారనుకుందాం…

మీ ఫ్రెండ్ ఎవరో ఓ పర్సనల్ మెసేజ్ పంపారనుకుందాం… “అదేమిటా” అనే క్యూరియాసిటీ కొద్దీ మీరు దాన్ని చూడకుండా ఉండలేరు… అలాగని అప్పటికప్పుుడు వారికి రిప్లై ఇవ్వడానికీ మీ బిజీ పనులు పర్మిట్ చేయకపోవచ్చు.

ఫేస్‌బుక్ మాత్రం మీరు అవతలి వారి మెసేజ్‌ని ఫలానా టైమ్‌లో చూసేసినట్లు వారికి చెప్పేస్తుంది… వాళ్లేమో చూసీ మీరు రిప్లై కూడా ఇవ్వలేదని మీరు avoid చేస్తున్నారని మీపై కోపం పెంచుకుంటూ ఉంటారు.

సో ఈ ఇబ్బందికరమైన ఆప్షన్ ద్వారా మీ రిలేషన్లు దెబ్బతింటున్నాయా? అయితే ఈ వీడియోలో నేను చూపించిన టెక్నిక్ ఫాలో అవండి…

ఇకపై మీరు అవతలి వారి మెసేజ్ చదివినా.. మీరు చదివిన విషయం వారికి చెప్పబడదు… మీకు టైమ్ ఉన్నప్పుడు తీరిగ్గా రిప్లై ఇస్తే సరిపోతుంది.

అసలే ఫేస్‌బుక్ పరిచయాలు తుమ్మితే ఊడితే ముక్కు లాంటివి…. ఇలాంటి “Seen” వంటి టైమ్‌తో సహా చెప్పే ఇబ్బందుల వల్ల మీ రిలేషన్స్ నష్టపోకుండా కాపాడుకోండి.

గమనిక: ప్రతీ ఫేస్‌బుక్ యూజర్‌కీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ షేర్ చేయగలరు.

వీడియో లింక్ ఇది:  http://bit.ly/srifbchat

ధన్యవాదాలు

– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com