విండోస్ 8 కన్జ్యూమర్ ప్రివ్యూ ఇన్ స్టలేషన్ ఇలా (First in Telugu)

విండోస్ 8 కన్జ్యూమర్ ప్రివ్యూ ఇన్ స్టలేషన్ ఇలా

US టైమ్ జోన్ ప్రకారం గంట క్రితం ఈరోజు (29 ఫిబ్రవరి 2012)  విడుదలైన Windows 8 కన్జ్యూమర్ ప్రివ్యూ ఇన్ స్టలేషన్ పై అవగాహన కలగడం కోసం నేను ఇన్ స్టాల్ చేస్తుండగా తీసిన స్క్రీన్ షాట్స్ ఇవి.

విండోస్ 8 రిటైల్ Final వెర్షన్ ఈ ఏడాది అక్టోబర్ లోపు విడుదలవుతుందని ఓ అంచనా.

ఈ క్రింది లింక్ లో 36 ఫొటోల నా స్వంత ఇన్ స్టలేషన్ ఆల్బమ్ చూడవచ్చు..

 

http://tinypic.com/a/2pa1v/2

మీ ఫైళ్లని 40+ ఏంటీవైరస్ లతో స్కాన్ చేయండిలా (వీడియో డెమో)

http://bit.ly/srivirusclean1

మీ పిసిలో ఉన్న ఒకానొక్క ఏంటీవైరస్ సాఫ్ట్ వేర్ వైరస్ లను గుర్తించడం లేదని బాధపడుతున్నారా?

మీ దగ్గర ఉన్న ఫైల్ లో వైరస్ ఉందని మీకు చూఛాయగా తెలిసినా.. ఆ వైరస్ పేరేమిటో గుర్తించలేకపోతుంటే.. మన ఫైళ్లని Norton, McAfee, Kaspersky, ESET, NOD వంటి 40కి పైగా ఏంటీవైరస్ సాఫ్ట్ వేర్లతో స్కాన్ చేసి సరైన ఫలితాలు చూపించే మార్గాన్ని ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఫాలో అవండి.

మీ వెబ్ సైట్ లోనూ, బ్లాగ్ లోనూ మీకు ఈ వీడియో నచ్చితే రీపబ్లిష్ చేసుకోవచ్చు. మీ బ్లాగ్ లో కొత్త పోస్ట్ చేసేటప్పుడు HTML మోడ్ లో ఉండగా క్రింది లైన్ ని మీ పోస్ట్ లో add చేస్తే ఈ వీడియో వచ్చేస్తుంది.

<iframe width="560" height="315" src="http://www.youtube.com/embed/rSxanibtdII" frameborder="0" allowfullscreen></iframe>

 

 

ఈ వేసవిలో మీ కంప్యూటర్ ప్రాసెసర్ కాలిపోవచ్చు ఇలా చేయకపోతే..

http://bit.ly/sricpu

మండు వేసవి ముంచుకొస్తోంది. 99% మంది కంప్యూటర్ల బాగోగులు అస్సలు పట్టించుకోరు.

వేసవిలో ఎందరో కంప్యూటర్ల CPUల్లోని ట్రాన్సిస్టర్లు కాలిపోతుంటాయి.

అంత ప్రమాదం మీకూ రాకముందే ఈ వీడియోలో ప్రాక్టికల్ గా చూపించిన పద్ధతి ప్రకారం CPUని క్లీన్ చేసుకుని అవసరం అయితే థర్మల్ పేస్ట్ ని అప్లై చేయండి. వీడియో చూస్తే మొత్తం ప్రొసీజర్ మీకు కళ్లకు కట్టినట్లు అర్థమవుతుంది.
 

http://bit.ly/sricpu

 

మీ వెబ్ సైట్ లోనూ, బ్లాగ్ లోనూ మీకు ఈ వీడియో నచ్చితే రీపబ్లిష్ చేసుకోవచ్చు. మీ బ్లాగ్ లో కొత్త పోస్ట్ చేసేటప్పుడు HTML మోడ్ లో ఉండగా క్రింది లైన్ ని మీ పోస్ట్ లో add చేస్తే ఈ వీడియో వచ్చేస్తుంది.

<iframe width="560" height="315" src="http://www.youtube.com/embed/FFsj1iB8qD0" frameborder="0" allowfullscreen></iframe>

 

మీరు కొన్న వస్తువు Manual మిస్ అయిందా? (వీడియో డెమో)

http://bit.ly/sriguide

సెల్ ఫోన్ కావచ్చు, టివి కావచ్చు, కంప్యూటర్ కావచ్చు.. ఏ వస్తువైనా కొన్న ఆనందంలో చాలామంది దాని Manualని చూడనే చూడరు. కొన్నాళ్లకి అది ఎక్కడో పోగొట్టుకుంటారు.

Manual చూడకపోతే ఏం పోయిందిలే.. అని అనుకోవచ్చు చాలామంది! Manuals చదవకపోవడం వల్ల ప్రతీ వస్తువులో లభించే సదుపాయాల్లో కేవలం 65% సదుపాయాల్నే మనం వాడుకుంటున్నట్లు ఓ సర్వేలో తేలింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మేన్యువల్స్ చదవకపోవడం వల్ల మనం ఎంత నష్టపోతున్నామో!

మీ ఇంట్లో ఉన్న రకరకాల వస్తువుల Manuals మీ దగ్గర మిస్ అయితే వర్రీ అవ్వాల్సిన పనిలేదు.

ఈ క్రింది వీడియోలో నేను చూపించిన టెక్నిక్ ద్వారా అలా మీరు పోగొట్టుకున్న manuals వెంటనే పొందొచ్చు.

ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కీ షేర్ చెయ్యగలరు. వారికీ ఉపయోగపడుతుంది.

http://bit.ly/sriguide

మీ వెబ్ సైట్ లోనూ, బ్లాగ్ లోనూ మీకు ఈ వీడియో నచ్చితే రీపబ్లిష్ చేసుకోవచ్చు. మీ బ్లాగ్ లో కొత్త పోస్ట్ చేసేటప్పుడు HTML మోడ్ లో ఉండగా క్రింది లైన్ ని మీ పోస్ట్ లో add చేస్తే ఈ వీడియో వచ్చేస్తుంది.

<iframe width="560" height="315" src="http://www.youtube.com/embed/9hnwb0ejr6s" frameborder="0" allowfullscreen></iframe>

 

 

 

ఏపిల్ కంప్యూటర్ల లోపలి భాగం ఇక్కడ చూడండి (వీడియో డెమో)

http://bit.ly/sridharapple

చాలామంది అస్సలు ఏపిల్ కంప్యూటర్లే చూసి ఉండరు. ఒకవేళ చూసి ఉన్నా లోపల భాగాలు ఎలా ఉంటాయో తెలిసి ఉండదు.

మనం రోజువారీ వాడే అసెంబుల్డ్ పిసిలకు భిన్నంగా ఏపిల్ సంస్థ నుండి నాణ్యమైన మెటీరియల్ తో చాలా solidగా రూపొందించబడి ఉండే రెండు Apple కంప్యూటర్లను, అంతర్గత భాగాలనూ ఈ వీడియోలో

మిత్రుల కోసం ప్రాక్టికల్ గా చూపిస్తున్నాను.

http://bit.ly/sridharapple

మీ వెబ్ సైట్ లోనూ, బ్లాగ్ లోనూ మీకు ఈ వీడియో నచ్చితే రీపబ్లిష్ చేసుకోవచ్చు. మీ బ్లాగ్ లో కొత్త పోస్ట్ చేసేటప్పుడు HTML మోడ్ లో ఉండగా క్రింది లైన్ ని మీ పోస్ట్ లో add చేస్తే ఈ వీడియో వచ్చేస్తుంది.

<iframe width="560" height="315" src="http://www.youtube.com/embed/8U14B3EaV3I" frameborder="0" allowfullscreen></iframe>

 

 

 

కంప్యూటర్ ఎరా మార్చి 2012 విడుదల తేదీ వివరాలు

మార్చి 2012  "కంప్యూటర్ ఎరా" తెలుగు మాసపత్రిక ఫిబ్రవరి 26, 2012 నాటికి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ లభిస్తుంది.  Subscription వంటి సర్క్యులేషన్ ఆఫీస్ సంబంధిత అంశాలకు 040-27673494 అనే నెంబర్ లో సంప్రదించవచ్చు.

 

మీ కంప్యూటర్లో విద్యుత్ ని ఎక్కువ వాడుకుంటున్న అంశాలేమిటి?

కంప్యూటర్ కావచ్చు.. లాప్ టాప్ కావచ్చు.. గంటల తరబడి వాడుతున్నప్పుడు కరెంట్ బిల్లులు తడిసి మోపెడు రావడం సహజం. అసలే వేసవి వస్తోంది. కరెంట్ ఖర్చు తగ్గించుకునే మార్గాలు చూడాలి కదా!

మీ కంప్యూటర్లో ఏయే అంశాలు ఎక్కువ విద్యుత్ ని వినియోగించుకుంటున్నాయో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటో విద్యుత్ వినియోగాన్ని తగ్గించుకోవచ్చో విండోస్ చేతే సజెషన్లు పొందాలంటే ఈ వీడియోలో చూపించిన టెక్నిక్ ని ఫాలో అయిపొండి. మీ పవర్ బిల్లులు తగ్గుతాయి.

మీ వెబ్ సైట్ లోనూ, బ్లాగ్ లోనూ మీకు ఈ వీడియో నచ్చితే రీపబ్లిష్ చేసుకోవచ్చు. మీ బ్లాగ్ లో కొత్త పోస్ట్ చేసేటప్పుడు HTML మోడ్ లో ఉండగా క్రింది లైన్ ని మీ పోస్ట్ లో add చేస్తే ఈ వీడియో వచ్చేస్తుంది.

<iframe width="560" height="315" src="http://www.youtube.com/embed/hWl4wlVezwk" frameborder="0" allowfullscreen></iframe>

 

 

 

TV9లో నిన్న WallPostపై అభిప్రాయం ఇది

TV9లో wallpost.com సోషల్ నెట్ వర్కింగ్ సైట్ గురించి నిన్న రాత్రి (17 ఫిబ్రవరి 2012) ప్రసారమైన కధనంలో నా అభిప్రాయాన్ని ఈ వీడియోలో చూడవచ్చు.

 

ABNలో హ్యాకింగ్ పై ఈరోజు జరిగిన డిస్కషన్ ఇది

ABN ఆంధ్రజ్యోతి ఛానెల్ లో ఈరోజు (17th Feb 2012) ఉదయం 7.30 నుండి 8 వరకూ 27 ప్రభుత్వ వెబ్ సైట్లు హ్యాక్ అవడంపై  జరిగిన నా లైవ్ డిస్కషన్ ఇది.

 

ETV2 సఖిలో నిన్న (ఫిబ్రవరి 15, 2012) ప్రసారమైన నా ప్రోగ్రామ్ వీడియో ఇది

జూలై 2010 నుండి ETV2లో సఖి.కామ్ పేరుతో ప్రసారం అవుతున్న నా టెక్నాలజీ సంబంధిత ప్రోగ్రామ్ లో భాగంగా నిన్న (ఫిబ్రవరి 15, 2012)న ప్రసారమైన ప్రోగ్రామ్ ని చూడడం మిస్ అయిన వారు ఈ క్రింద చూడవచ్చు.

మీ వెబ్ సైట్ లోనూ, బ్లాగ్ లోనూ మీకు ఈ వీడియో నచ్చితే రీపబ్లిష్ చేసుకోవచ్చు. మీ బ్లాగ్ లో కొత్త పోస్ట్ చేసేటప్పుడు HTML మోడ్ లో ఉండగా క్రింది లైన్ ని మీ పోస్ట్ లో add చేస్తే ఈ వీడియో వచ్చేస్తుంది.

<iframe width="560" height="315" src="http://www.youtube.com/embed/kTYii3G53qc" frameborder="0" allowfullscreen></iframe>

 

 

 

Search This Site:

About Me

1996వ సంవత్సరంలో తెలుగులో మొట్టమొదట కంప్యూటర్ సాహిత్యాన్ని ప్రారంభించే అవకాశం నాకు కలిగింది. అదే సమయంలో చెన్నైలో సూపర్ హిట్ తెలుగు ఫిల్మ్ మేగజైన్ కి సబ్ ఎడిటర్ గా కూడా ఏకకాలంలో పనిచేస్తూ 1998 వరకూ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, మనీషా కొయిరాలా, శంకర్, రజనీకాంత్, కమల్ హాసన్ వంటి ప్రముఖులెందరినో ఇంటర్వ్యూలు చేయడం మర్చిపోలేని అనుభవం. అయితే సినిమా రంగంలో ఉన్న అనారోగ్యకరమైన వాతావరణం వల్ల నాకంటూ ఓ ప్రత్యేకమైన ఉనికిని సృష్టించుకోవడం కోసం సినిమా రంగం నుండి బయటకు వచ్చి పూర్తిగా టెక్నాలజీ రంగంలో స్థిరపడడం జరిగింది. 96 నుండి 2001 వరకూ పలు కంప్యూటర్ పత్రికలకు ఎడిటర్ గా పనిచేసి.. 2001 నుండి "కంప్యూటర్ ఎరా" తెలుగు మంత్లీ మేగజైన్ ఎడిటర్ గా పత్రిక మొత్తాన్నీ రూపొందిస్తూ ఉన్నాను. అలాగే తెలుగు టెలివిజన్ ఛానెళ్లలో మొట్టమొదటి టెక్నికల్ phone-in ప్రోగ్రామ్ కి గెస్ట్ గా అటెండ్ అయ్యే అవకాశమూ 2010 జనవరి 20న కలిగింది. అప్పటి నుండి ఇప్పటివరకూ TV 9, ABN, I News, ETV2, NTV, Zee 24 గంటలు, Studio N, సాక్షి టివి, మహా టివి, జాగృతి న్యూస్ వంటి ఛానెళ్లలో 100కి పైగా లైవ్, రికార్డెడ్ ప్రోగ్రాముల్ని చేయడం జరిగింది. 2007లో అత్యుత్తమైన నాణ్యతతో కూడిన పోస్టులతో, వీడియోలతో తెలుగులో మొదటి ప్రొఫెషనల్ టెక్నికల్ బ్లాగ్ గానూ, మొదటి వీడియో బ్లాగ్ గానూ ఇప్పుడు మీరు చూస్తున్న బ్లాగ్ ప్రత్యేకతను సంతరించుకుంది. అలాగే 2007 జనవరి 1న ప్రారంభించిన తెలుగులోనే మొట్టమొదటి టెక్నికల్ ఫోరమ్ అయిన "కంప్యూటర్ ఎరా సాంకేతిక ఫోరమ్" 14 వేల మంది సభ్యులతో 10 వేలకు పైగా పోస్టులతో 2009 జూలై వరకూ నిర్వహించబడింది. దాంతోపాటే మొట్టమొదటి తెలుగు టెక్నికల్ ఛాట్ రూమ్ అయిన "కంప్యూటర్ ఎరా సాంకేతిక సహాయం" అనే ఛాట్ రూమ్ రెండేళ్లలో వేలాది మందికి తెలుగు టైప్ చేయడం మొదలుకుని అనేక కంప్యూటర్ సంబంధిత సాంకేతిక సమస్యలకు తక్షణ సహాయం అందించింది. ఇకపోతే http://youtube.com/nallamothu అనే ఛానెల్ లో 361కి పైగా ప్రొఫెషనల్ క్వాలిటీ తెలుగు టెక్నికల్ వీడియోలు అందించాను. ఈ ఛానెల్ కి 1704 మంది సబ్ స్కైబర్లు ఉన్నారు. అందుబాటులో ఉన్న వివిధ మార్గాల ద్వారా తెలుగు వారందరకీ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించే పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాను. My Contact Number: 9000239948 Mail ID: sridharcera@gmail.com

ఇక్కడ RSS Feedకి Subscribe చేసి నేరుగా పోస్ట్ లు పొందండి

ఆండ్రాయిడ్ లో పొందండి!

నా వీడియోలను మీ దగ్గర ఉన్న Android ఫోన్ లో పొందాలంటే ఈ క్రింది లింక్ ని మీ ఫోన్ బ్రౌజర్ లో ఓపెన్ చేసి వెంటనే వచ్చే అప్లికేషన్ ని ఇన్ స్టాల్ చేసుకోండి. అన్ని వీడియోలూ ఎంజాయ్ చేయండి. http://goo.gl/DqsA4

లేదా ఈ క్రింది QR Codeని మీ Android ఫోన్ లోని Barcode Scannerతో స్కాన్ చేస్తే నేరుగా అప్లికేషన్ డౌన్ లోడ్ పేజీకి వెళ్లవచ్చు. Image and video hosting by TinyPic