95% కంప్యూటర్ యూజర్లకి తెలీని టెక్నిక్ – BIOS అప్‌డేట్ చేసుకుని మీ పిసి పెర్‌ఫార్మెన్స్ పెంచుకోండి ఇలా…
వీడియో లింక్ ఇది: http://bit.ly/sribiosupdate
వేలాది రూపాయలు పెట్టి కంప్యూటరో, లాప్‌టాపో కొంటాం.
అనుకున్నంత స్పీడ్‌గా లేదని కంప్లయింట్లు చేస్తుంటాం. కంప్యూటర్ స్పీడ్‌గా ఉండాలంటే ప్రాసెసర్, RAM ఎక్కువ ఉన్నంత మాత్రాన సరిపోదు.. Windows 8 లాంటి లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్నంత మాత్రాన కూడా సరిపోదు.
మనం వాడే ఆపరేటింగ్ సిస్టమ్ కంప్యూటర్లోని వివిధ హార్డ్‌వేర్ పరికరాలతో కలిసి పనిచేయడానికి BIOS అనేది అతి ముఖ్యమైన భాగం. కంప్యూటర్ కొన్న తర్వాత ఒక్కసారి కూడా దాన్ని update చేసుకోపోతే మీ సిస్టమ్ నుండి అందాల్సిన మరింత పెర్‌ఫార్మెన్స్‌ని చేజేతులా వదులుకున్నట్లే.
చాలామందికి BIOS అప్‌డేట్ చేసుకోవచ్చని తెలీదు.. మరికొంత మంది అలా update చేయడం చాలా ప్రమాదం, ఎందుకొచ్చిన గొడవ అని భయపడిపోతారు. ఈ వీడియో చూస్తే అలాంటి భయాలన్నీ పోతాయి. మీరూ 5 నిముషాల్లోపు మీ BIOSని అప్‌డేట్ చేసుకోగలుగుతారు.
మరింత సిస్టమ్ పెర్‌ఫార్మెన్స్‌ని పొందగలుగుతారు.
గమనిక: అందరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ షేర్ చేయగలరు.
వీడియో లింక్ ఇది: http://bit.ly/sribiosupdate
ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com







sir na peru imran, nenu me blog, videos,magazines ani follow avuthanu sir chala baga manchi techinques istharu , lagea unwanted number nundi call ravadam,alagea visiginchadam aneadi e rojulo chala common aiepoiendhi sir elanti wrong numbers ni ela arikatali , alagea, emina salaha ivandi sir thankyou sir subhadhinam