ఇలాంటి కేస్‌లు అందరికీ చుట్టుకునే ప్రమాదం చాలా ఉంది.. Must Share

By | January 27, 2013

ఓ ఆర్నెల్ల క్రితం అనుకుంటాను…

ఏ ఛానెల్ వాళ్లు వచ్చారో గుర్తులేదు… IT Actలోని Section 66A క్లాజ్ గురించి బైట్ కోసం వచ్చినప్పుడు… ఆఫ్ ది రికార్డ్ కొన్ని విషయాలు చెప్పాను…

“ఇప్పుడేముంది… మున్ముందు మనం ఎన్ని కేసులూ, ఘోరాలూ చూడాల్సి వస్తుందో నా కళ్లెదుట చాలా స్పష్టంగా కన్పిస్తోంది” అని!!

16 ఏళ్ల నుండి రకరకాల platforms మీద జనాలు మాట్లాడుకుంటున్న విశృంఖలమైన మాటలు గమనిస్తూ వస్తున్నాను… పెదవి దాటిన పెడార్థాల మాటలు మెడలకు చుట్టుకునే రోజులు ఎప్పుడో ఊహించాను…

ఈరోజు మహిళల్ని కించపరుస్తూ జరిగిన వ్యాఖ్యానాలు ఆదీ కాదు, అంతమూ కాదు….

ఇప్పటికీ పార్టీలూ, రాజకీయ నాయకుల్నీ, నేరుగా తాము ద్వేషించే మనుషుల్నీ ఇష్టమొచ్చినట్లు బూతులతో.. అభ్యంతరకరమైన భాషతో సంభాషణలు సాగిస్తున్న వారెందరో ఉన్నారు.. “వారంతా ప్రస్తుతానికి సమస్య తమది కాదు” అని ధైర్యంగా ఉంటున్నారు….

ఈ క్షణం మనం ఎవర్నైయినా సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో తిడితే, అభ్యంతరకరమైన భాష వాడితే ఊచలు లెక్కపెట్టాల్సి వస్తుందన్న విషయం చాలామందికి తెలీట్లేదు… IT Actని క్షుణ్ణంగా చదివాను…. వాటిలోని క్లాజులతో సహా ఎన్నో ఉరితాళ్లు మన మెడలపై వేలాడుతున్న విషయం గ్రహించండి….

నేను చాలాసార్లు ఒకటే చెప్తూ వస్తున్నాను.. Facebookలాంటి పబ్లిక్ platformని మంచి విషయాలు చర్చించుకోవడానికి వాడుకోవడం శ్రేయస్కరం అని! ఇలా చెప్పడానికి కారణం… మనం మాట్లాడే ప్రతీ చెడూ విషయమూ మనకు ఉరితాడే అన్నది నాకు తెలుసు కాబట్టి!! కొంతమందికి పాపం ఇది అర్థం కాక ఛాదస్తంగా భావిస్తూ వచ్చారు, వస్తున్నారు.

ఈరోజు మనం దేశాన్ని తిట్టడానికి లేదు.. నాయకుల్ని తిట్టడానికి లేదు… తోటి మనిషిని తిట్టడానికి లేదు… కులాలూ, మతాలూ, ప్రాంతాల్నీ తిట్టడానికి లేదు…. ఎవరైనా ఎవరిపైనైనా కేస్ ఫైల్ చేయొచ్చు.. ఈ విషయం అర్థమైన రోజున ఎగిరెగిరిపడుతున్న నోళ్లన్నీ ఖచ్చితంగా మూతబడక తప్పదు.

ఇంటర్నెట్ అంటే అపరిమితమైన స్వేచ్ఛ అని అర్థం చేసుకుంటే ఖచ్చితంగా ఆపద పాలవుతాం… 99% మందికి తెలీని ఎన్నో చిక్కుముళ్లు IT Actలో ఉన్నాయి… అలాగే అవసరాన్ని బట్టి ఇతర చట్టాలతో కలిపి ఎవరైనా మన అభ్యంతరకరమైన చిన్న కామెంట్లకు కూడా కేస్ ఫైల్ చేసి బోన్ ఎక్కించవచ్చు.

ప్రతీ ఒక్కరూ ఇది తెలుసుకోవలసిన అవసరం ఉంది… ముఖ్యంగా ఈరోజు ఒకర్నొకరు బండ బూతులు తిట్టుకుంటున్న వ్యక్తిగత ధూషణలు కూడా శిక్షార్షాలే…. కేస్ ఫైల్ చేసే వాళ్లు ఉంటే గనుక! సో తస్మాత్ జాగ్రత్త..!!

సోషల్ నెట్ వర్కింగ్ సైట్ల యూజర్ల శ్రేయస్సు, అవగాహనని దృష్టిలో ఉంచుకుని రాయబడిన దీన్ని మీ మిత్రులతోనూ షేర్ చేసి వారినీ కాపాడగలరు.

ధన్యవాదాలు

– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com