మీకన్నీ తెలిసి ఉండొచ్చు…. చాలామందికి చాలా తెలియాల్సి ఉంది….
జనరల్ టెక్నికల్ టాపిక్స్ మీదే ఎందుకు వీడియోలు చేస్తుంటారు… మేగజైన్‌లోనూ జనరల్ టాపిక్సే రాస్తుంటారు… అని చాలామంది అడుగుతూ ఉంటారు….
వాస్తవానికి నాకు C, C++లు వచ్చు, జావా వచ్చు… ఫ్లాష్ స్క్కిప్టింగ్, html, phpల్లో ప్రవేశం, హార్డ్‌వేర్, పిసి అసెంబ్లింగ్, నెట్‌వర్కింగ్, లైనక్స్, Mac, SEO, సోషల్ మార్కెటింగ్ం పేజ్‌మేకర్, ఫొటోషాప్, కోరల్ డ్రా, ప్రీమియర్, ఇల్లస్ట్రేటర్, ఆఫీస్ వంటి వాటి మొదలుకుని Tally, Focus వంటి ఆఫ్‌బీట్ టాపిక్స్ వరకూ నాలెడ్జ్ ఉంది….
బట్ నా లక్ష్యం ఏదో ఒక టాపిక్ మాత్రమే ఇష్టపడే ఏ కొద్దిమందికో నా విలువైన సమయం కేటాయించడం కాదు….
మీరు గమనించండి… నేను చేసే వీడియోలు కావచ్చు… మేగజైన్‌లో రాసే ఆర్టికల్స్ కావచ్చు…. ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడేలా ఉంటాయి తప్ప…. ఏ కొద్దిమందికో ఉపయోగపడేలా ఉండవు…
ఉదా.కు.. రైల్వే రిజర్వేషన్ల గురించి నిన్న, మొన్న చేసిన ఓ వీడియోనే తీసుకుంటే…..
- మీరు ఓ ప్రోగ్రామర్ అయినా ఆ వీడియో మీకు పనికొస్తుంది…. ఖచ్చితంగా మీకు గొప్ప టెక్నికల్ నాలెడ్జ్ ఉన్నా ఈ విషయం మీకు తెలిసి ఉండదు….
- ఒక వెబ్ డిజైనర్ అయినా మీకు పనికొస్తుంది…
- ఒక డిటిపి ఆపరేటర్ అయినా పనికొస్తుంది
- VFx గ్రాఫిక్స్ డిజైనర్ అయినా మీకు ఆ వీడియో పనికొస్తుంది
- ఓ రిటైర్డ్ ఎంప్లాయీ అయినా పనికొస్తుంది
- ఓ హౌస్ వైఫ్ అయినా పనికొస్తుంది….
- ఓ స్కూల్ కిడ్ కైనా పనికొస్తుంది…..
అలాగే ఈరోజు చేసిన సినిమా టిక్కెట్లు ఆన్‌లైన్‌లో చేసుకోవడం అనే వీడియోనే తీసుకుంటే…. పిల్లాపాపలతో థియేటర్లకు వెళ్లి బ్లాక్‌లో వందలు పెట్టి టిక్కెట్లు కొంటున్న వారెందరో నాకు థియేటర్ల వద్ద కన్పిస్తుంటారు…. అలాంటి ఎంతోమందికి ఈ వీడియో పనికొస్తుంది కదా…..
ఇలా అందరికీ పనికొచ్చే విషయాలు నేను ఆలోచిస్తాను తప్ప….. “అందులో నాకు నాలెడ్జ్ ఉంది…. ఇందులో నాకు నాలెడ్జ్ ఉంది” అని మేధస్సుని ప్రదర్శించుకునే పిచ్చి ప్రయత్నాలు కావి నావి….. ఒక్కసారి నా Profileలో నా లక్ష్యాన్ని మరోసారి చదవండి….
టెక్నాలజీని సామాన్య ప్రజలకు ఉపయోగపడేలా చేయడం నా లక్ష్యం తప్ప టెక్నాలజీని అంతో ఇంతో తెలిసిన టెకీస్ కోసం స్పెండ్ చేయడం కాదు నా లక్ష్యం…
అందుకే నేను చేసే వీడియోలూ, మేగజైన్‌లో రాసే విషయాలూ 10% మంది గొప్ప గొప్ప వాళ్లకు ఆల్రెడీ తెలిసి ఉండొచ్చు…. కానీ 90% మంది అతి సామాన్యులు వాటి ద్వారా ఎంత ప్రయోజనం పొందుతున్నారో నేను అందుకునే ఫోన్ల ద్వారా, మెయిల్స్ ద్వారా, ఇతర రెస్పాన్సుల ద్వారా నాకు మాత్రమే తెలుసు….
సో ఈ మధ్య కొంతమంది నా ముందు బలప్రదర్శన చేస్తున్నట్లు…. మీకెంతో తెలుసనీ, ఇవన్నీ ఇప్పటికే తెలుసనీ… ఇలా దయచేసి ప్రదర్శనలు చేయకండి…. సైలెంట్‌గా నా టార్గెటెడ్ పీపుల్‌ని నా నాలెడ్జ్ నేను ఇచ్చుకుంటూ పోతున్నాను…. మీకు ఆల్రెడీ తెలిసినవి అయితే సంతోషం… వదిలేయండి…. తెలియనివైతే మనస్ఫూర్తిగా తెలుసుకోండి….. మనస్సుకి తాళాలు వేసుకోకుండా!!
టెక్నాలజీ అందరికీ చేరాలి… అన్నీ తెలిసిన కొద్దిమందికి చేరితే ఏం లాభం?
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com







శ్రీధర్ గారికి నమస్కారం , మీ తదుపరి పత్రికలో ఇన్వెర్తెర్స్ మరియు సొలర్ ఇన్వెర్తెర్స్ గురించి ఒక అర్తికల్ రాయండి ప్రస్తుత కరెంట్ కోతల సమయంలో అందరికీ పనికివస్తుంది..
//మీకన్నీ తెలిసి ఉండొచ్చు…. చాలామందికి చాలా తెలియాల్సి ఉంది….//
శ్రీధర్ గారు మీరు చెప్పింది నిజం.అడ్వాన్స్‌గా ఉండే కొందరికి మీరిచ్చే టిప్స్ సిల్లిగా అనిపించవచ్చు కాని బేసిక్ నాలెడ్జ్ లేని వారి గురించి వారు ఆలోచించరు అంతేకాకుండ తమకు తెలిసిన దాన్ని ఇతరులకు పంచరు, పంచే వారిని చూస్తే సహించరు ఇది లోక నీతి ఏం చేస్తాం ఖర్మ.
చాలా మంది సాఫ్ట్వేర్ వాళ్ళకు కూడా హార్డ్‌వేర్, పిసి అసెంబ్లింగ్, నెట్‌వర్కింగ్, లైనక్స్,సోషల్ మార్కెటింగ్ం పేజ్‌మేకర్, ఫొటోషాప్, కోరల్ డ్రా, ప్రీమియర్, ఇల్లస్ట్రేటర్, ఆఫీస్ వంటి వాటిలో కనీస పరిజ్ఞానం లేకపోవడం తప్పనిసరిగా ఒప్పుకోవలసిన విషయమే.
“మీకన్నీ తెలిసి ఉండొచ్చు…. చాలామందికి చాలా తెలియాల్సి ఉంది….” అన్నదానికి అందరు ఏఖీభవించాల్సిందే.ఎందుకంటే అది నిజం కాబట్టి.