కామెంట్లలో మీ పేరు దుర్వినియోగం కాకుండా ఈ జాగ్రత్తలు తీసుకోండి.
Feb 14th, 2009 | By | Category: Uncategorized“న్యూజింగ్స్” అనే బ్లాగులో కొత్తపాళీ గారి పేరిట తప్పుడు కామెంట్ పబ్లిష్ అయిన విషయం ఆయన పోస్ట్ చదివి షాక్ అయ్యాను. “ఇలా ఎలా జరిగే అవకాశం ఉంది?” అనే విషయం ఒకరిద్దరు మిత్రులతో సంప్రదించిన తర్వాత కొంత అవగాహన కలిగింది. ఈ సమస్య ఇలా వచ్చే అవకాశముంది.
- కామెంట్ బాక్సుల్లో కన్పించే ఆప్షన్లు:
మనం ఒక బ్లాగులో కామెంట్ రాయడానికి వెళ్లినప్పుడు Post a Comment అనే బటన్ క్లిక్ చేసిన వెంటనే కన్పించే Comment Boxలో సాధారణంగా Choose an Identity అనే ప్రదేశం వద్ద ఈ క్రింది ఆప్షన్లు కన్పిస్తుంటాయి.
- Google/Blogger: ఈ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుంటే మన జీమెయిల్ యూజర్ నేమ్, పాస్ వర్డ్ తో లాగిన్ అయితేనే మనం మన Gmail ఐడిలో కన్పించే Display name పేరిట కామెంట్ రాయగలుగుతాం.
- Open ID, Live Journal, WordPress, AIM వంటి ఇతర సర్వీసుల్లో అకౌంట్ కలిగిన వారు ఆ ఐడెంటిటీ ఆధారంగా కామెంట్లు రాయవచ్చు.
- Name/URL అనే ఆప్షన్ ఉపయోగించి “ఏదైనా పేరుతో” “ఏదైనా బ్లాగు, సైట్ అడ్రస్ ని” మన ఉనికిగా చూపిస్తూ కామెంట్ రాయవచ్చు. ఈ ఆప్షన్ నే జనాలు దుర్వినియోగం చేస్తున్నారు. ఇక్కడ Name వద్ద మీ పేరుని టైప్ చేసి, URL అనే బాక్సులో మీ బ్లాగు అడ్రస్ ని టైప్ చేసి ఎవరి పోస్ట్ లో అయినా కామెంట్ రాశారంటే ఆ కామెంట్ మీరే రాసినట్లు భ్రమకలిగించేలా కామెంట్ పోస్ట్ అవుతుంది. సో ఇలాంటి కామెంట్లని అడ్డుకోవడం అన్నది ప్రతీ బ్లాగు ఓనర్ దృష్టి సారించవలసిన విషయం. ఎన్నో అపార్థాలకు తావిచ్చే ఈ ఆప్షన్ ఎలా డిసేబుల్ చెయ్యాలన్నది ఈ క్రింద వివరిస్తాను.
- “అజ్ఞాత” పేరుతోనూ కామెంట్లు రాయవచ్చు.

ఆలస్యం చెయయకుండా అందరు బ్లాగర్లు చేయాల్సిన పని/కొత్తవారికి నేర్పించాల్సిన జాగ్రత్త:
మీ Blogger అకౌంట్ లోకి లాగిన్ అయి Dashboardలోకి వెళ్లి Settings>Comments అనే విభాగంలోకి వెళ్లండి. అందులో Who Can Comment అనే విభాగంలో Anyone అని ఉంటే వెంటనే దాని బదులు Registered Users Includes Open ID అనే రెండవ ఆప్షన్ ని టిక్ చేయండి. చివరిగా పేజీని క్రిందికి scrool చేసి Save Settings అనే బటన్ ని క్లిక్ చేయండి. దయచేసి అజాగ్రత్తగా ఉండకుండా ప్రతీ బ్లాగర్ ఈ పని వెంటనే చేయండి.
కొత్త బ్లాగర్లకు సూచనలు:
ఏ పేరుతో అయినా, ఏ బ్లాగు లింకుని ఫాలో చేస్తూ అయినా మీ బ్లాగులో ధూషణలు, ధ్వేషపూరిత, కించపరిచేలా కామెంట్లు వచ్చినట్లయితే.. అది నిజంగా ఆ వ్యక్తి రాశారేమోనని వారిపై ధ్వేషం పెంచుకోకండి. మీరు వెంటనే పైన చెప్పిన సెట్టింగు చేసుకోండి. వ్యక్తుల మధ్య చిచ్చు రగిలించడానికి కొందరు ఇలాంటి చర్యలకూ పాల్పడుతున్నారు.



An alternative is to have a unique photograph in your profile. The people using URL will not able to use the photograph while commenting
శ్రీధర్ గారు,
నాకర్థం కాలేదు. మీరు చెప్పిన ఆప్షన్ ఇప్పుడు నేను కామెంట్ పెడుతున్న ఈ ఆప్షన్ లో లేదుగా. name అన్న చోట ఒక బ్లాగర్ పేరు, mail అన్న చోట ఆ బ్లాగరు ఈ మెయిల్(తెలిసే అవకాశం ఉంటుంది కదా) వారి ఈ మెయిల్, URE అన్న చోట వారి బ్లాగ్ తాలూకూ URL ఇచ్చి కామెంట్ పెడితే వారి పేరుతోనే కదా కామెంట్ పబ్లిష్ అవుతుంది? దీన్నెలా అడ్డుకోవాలి?
ఈ కామెంట్ తర్వాత దీనికి వ్యతిరేకమైన కామెంట్ నా పేరుతో వస్తే అది నాది కాదని గమనిక!
@సుజాత
శ్రీధర్ బ్లాగు వర్డుప్రెస్సులో ఉంది కదా. ఇది కాస్త వేరు. వర్డుప్రెస్ బ్లాగుల్లో ‘సైటులో నమోదైతే తప్ప వ్యాఖ్యలు అనుమతింవద్దు’ అని అమర్చుకోవచ్చు లేదా ప్రతీ వ్యాఖ్యనీ మోడరేషనుకి వచ్చేలా పెట్టుకోవచ్చు.
థాంక్స్ శ్రీధర్ గారూ
అబ్రకదబ్ర గారు, బ్లాగర్ సెట్టింగులపై రాత్రి 1 గంట సమయంలో ఈ పోస్ట్ రాస్తూ నా వర్డ్ ప్రెస్ కామెంట్ సెట్టింగులపై దృష్టి నిలిపే సమయం లేకుండిపోయింది. నా సెట్టింగులను కూడా సరిచేసుకున్నాను.
సుజాత గారు ఇప్పుడు పూర్తి మోడరేషన్ పెట్టాను.ఇప్పటికీ వర్డ్ ప్రెస్ లో పేరు, మెయిల్ ఐడి, వెబ్ అడ్రస్ తో కామెంట్ పబ్లిష్ అయినా కామెంట్ సారాంశాన్ని బట్టి ఏది జెన్యూన్ కామెంటో, ఏది నకిలీదో తెలుసుకుని పబ్లిష్ చేయగలను.
శ్రీధర్ గారూ, చాలా కృతక్షతలు.
శ్రీధర్ గారూ, చాలా కృతక్షతలు.
శ్రీధర్ గారూ, నేను కొన్ని బ్లాగ్ ల నుండి కొంత సమాచారం తీసుకోవడం జరిగింది వాళ్ల బ్లాగు లో నేను మనవి చేసి మరీ సుమా
మీ యెక్క అభిప్రాయం కై వేచి చూస్తూ మీ అభిమాని
లోపింటి శ్రీ
శ్రీనివాసరావు గారు, ఇతర బ్లాగుల్లో సమాచారం తీసుకోవడం అన్న విషయంలో పర్పస్ ఏమిటి, దానికి అవతలి వారు సమ్మతం తెలియజేస్తున్నారా లేదా వంటి అనేక అంశాలు పరిగణనలోకి తీసుకోవాలి. ఆయా బ్లాగు నిర్వాహకులు ఒప్పుకుంటే సరి.