మీ Graphics Card సామర్థ్యాన్ని ఇలా తెలుసుకోండి..
Feb 21st, 2009 | By | Category: Uncategorizedమనకు కంప్యూటర్ స్క్రీన్ పై దృశ్యాలు కన్పిస్తున్నాయంటే వాటిని మోనిటర్ కి పంపించేది Graphics Cardనే. గ్రాఫిక్స్ కార్డ్ ఎంత శక్తివంతమైనది ఉంటే గ్రాఫిక్స్ నాణ్యత, గేమ్ లు, వీడియో కన్వర్షన్ వంటివి చేసేటప్పుడు స్పీడ్ అంత బాగుంటుంది. మీ కంప్యూటర్లో onboard (మదర్ బోర్డ్ పై ఓ చిన్న చిప్ రూపంలో అమర్చబడి ఉండే) గ్రాఫిక్స్ కార్డ్ ఉన్నా, లేదా మరింత శక్తివంతమైన external గ్రాఫిక్ కార్డ్ ఉన్నా దాని మెమరీ సైజ్, క్లాక్ స్పీడ్ వగైరా వివరాలు తెలుసుకోవాలంటే ఈ క్రింది మార్గాలు ఉపయోగపడతాయి.
1. GPUZ: మన కంప్యూటర్ యొక్క గ్రాఫిక్ కార్డ్ గురించి సమస్త సమాచారాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడే టూల్ ఇది. గ్రాఫిక్ కార్డ్ మోడల్, GPU, టెక్నాలజీ, రిలీజ్ డేట్, Device ID, మెమరీ టైప్, Bus Width, Bandwidth వంటి అన్ని వివరాలను ఇది చూపిస్తుంది.

దీని డౌన్ లోడ్ లింకు: ఇక్కడ క్లిక్ చేయండి.
2. DirectX Diagnostic Window: వేరే సాఫ్ట్ వేర్ ఏదీ అవసరం లేకుండా Windows ఆపరేటింగ్ సిస్టమ్ లోనే DirectX డ్రైవర్లతో పాటు ఇన్ స్టాల్ అయ్యే DirectX Diagnostic ప్రోగ్రామ్ ఆధారంగా కూడా మన గ్రాఫిక్ కార్డ్ వివరాలను తెలుసుకోవచ్చు. అదెలాగంటే..

- Start>Run కమాండ్ బాక్స్ లో dxdiag అని టైప్ చేసి Enter ప్రెస్ చేయండి.
- వెంటనే ఈ క్రింది చిత్రంలోని విధంగా డైలాగ్ బాక్స్ వస్తుంది. అందులో Display అనే టాబ్ లోకి వెళితే మీ గ్రాఫిక్ కార్డ్ వివరాలు కన్పిస్తాయి.


