Gmailని మీ స్వంత రంగులతో నింపుకోవడం ఇలా..
Feb 22nd, 2009 | By | Category: Uncategorized
కొన్నేళ్లపాటు ఒకే మాదిరి రంగులను చూస్తూ వచ్చిన Gmail యూజర్లకు కొన్ని నెలల క్రితం Google సంస్థ Gmail Themesతో తాయిలం అందించింది. ఇటీవలి కాలంలో గమనిస్తూ పోతే ఒకటి రెండు రోజులకో మార్పు, కొత్త జోడింపు చొప్పున Gmailలోనూ, ఇతర Google సర్వీసులలోనూ చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే Gmail Themesలో ఏదో ఒక themeని ఉపయోగిస్తున్న వారు ఆ రెడీమేడ్ కలర్ స్కీమ్ లు నచ్చకపోతే స్వంతంగా మీకు నచ్చిన రంగులతోనూ Gmail స్వరూపాన్ని మార్చుకోవచ్చు. అదెలాగంటే..
ఇలా చేయండి..
- మీ Gmailలోకి లాగిన్ అవండి.
- Settings విభాగంలోకి వెళ్లండి.
- Themes అనే టాబ్ లోకి వెళ్లండి. ఇందులో అన్నింటికన్నా చివర్న Choose your own colors అనే ఆప్షన్ కన్పిస్తుంది. దాన్ని క్లిక్ చేయండి.
- దీంతో వెంటనే ఒక పాపప్ విండో స్ర్కీన్ పై ప్రత్యక్షమవుతుంది. ఇందులో Gmail స్వరూపంలోని వివిధ భాగాలను మనకు నచ్చిన రంగులతో నింపుకునేలా వివిధ భాగాలపై క్లిక్ చేస్తూ తద్వారా వచ్చే Color paletteల నుండి నచ్చిన రంగులను ఎంచుకుంటూ మొత్తం పూర్తయ్యాక Save బటన్ కొడితే సరిపోతుంది.
అంతే ఇప్పుడు మీరు ఎంచుకున్న కొత్త వర్ణాలతో Gmail కన్పించనారంభిస్తుంది. ఓసారి ప్రయత్నించి చూడండి.


