ఈ బ్లాగు గురించి మీ మిత్రులకు తెలియజేయండి.

ఏ అప్లికేషన్ లో నుండైనా PDF క్రియేట్ చేసుకోవడం ఎంత సులభమో

Jul 14th, 2009 | By admin | Category: పిసి చిట్కాలు

8-10 ఏళ్ల క్రితం సంగతి.. అప్పట్లో PDF ఫైళ్లని క్రియేట్ చేసుకోవాలంటే Adobe Acrobat సాఫ్ట్ వేర్ తప్పనిసరిగా ఉండవలసి వచ్చేది. ఆ తర్వాతి కాలంలో అనేక థర్డ్ పార్టీ అప్లికేషన్లూ PDF ఫైళ్లని తయారు చేసి పెట్టడానికి అందుబాటులోకి వచ్చాయి. అయితే కొన్ని PDF తయారీ సాఫ్ట్ వేర్లు యూనీకోడ్ (ఇప్పుడు మనం ఇంటర్నెట్ లో ఎక్కువగా చూస్తున్న తెలుగు, ఇతర భాషల) ఫాంట్లని సరిగా హ్యాండిల్ చెయ్యకపోవడం వల్ల ???? గుర్తులు వస్తుంటాయి. ఇలాంటి సమస్యలు ఏమీ లేకుండా పూర్తి ఉచితంగా చాలా సులభంగా PDF ఫైళ్లని క్రియేట్ చేసుకోవడం ఎలాగో ఇప్పుడు చూద్దాం.

కావలసిన సాఫ్ట్ వేర్: doPDF. (ఇది పూర్తిగా ఉచితం)

స్టెప్ 1: http://www.dopdf.com/ అనే సైట్ ని ఓపెన్ చేసి సైట్ ఓపెన్ అయ్యాక క్రింది చిత్రంలో విధంగా Get It! అనే బటన్ ని క్లిక్ చెయ్యండి. కొద్ది క్షణాలకు 1.64MB సైజ్ కలిగిన చిన్న సాఫ్ట్ వేర్ డౌన్ లోడ్ అవడం మొదలవుతుంది.

స్టెప్ 2: డౌన్ లోడ్ అయ్యాక ఆ dopdf.exe అనే ఫైల్ ని డబుల్ క్లిక్ చేసి సెటప్ రన్ అయ్యాక క్రింది చిత్రంలో విధంగా ఎక్కడ ఇన్ స్టాల్ చెయ్యబడాలో ఎంచుకుని ఆ ప్రోగ్రామ్ ఇన్ స్టలేషన్ ని ముగించండి. ఇప్పుడు ప్రతీ అప్లికేషన్ లోనూ Print డైలాగ్ బాక్స్ లో doPDF పేరిట ఓ అదనపు ప్రింటర్ డ్రైవర్ జతచేర్చబడుతుంది.

స్టెప్ 3: ఇప్పుడు మీరు MS Word, Internet Explorer, Firefox, Photoshop, Pagemaker, వంటి అన్ని రకాల విండోస్ అప్లికేషన్ల నుండి మీ డాక్యుమెంట్లని PDF ఫైళ్లుగా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఉదా.కు.. క్రింది చిత్రంలో Firefoxలో ఒక వెబ్ పేజీని PDFగా మారుస్తున్నాను. మీరు ఏ అప్లికేషన్ లో ఉన్నా File మెనూలో Print అనే కమాండ్ ని క్రింది చిత్రంలో విధంగా ఎంపిక చేసుకోండి.

స్టెప్ 4: వెంటనే వచ్చే Print డైలాగ్ బాక్స్ లో Printer అనే లిస్ట్ లో క్రింది చిత్రంలోని విధంగా doPDF v6 అనే ప్రింటర్ మోడల్ ని ఎంపిక చేసుకోండి.

స్టెప్ 5: ఆ తర్వాత ఆ డైలాగ్ బాక్స్ చివర ఉండే OK కొట్టినట్లయితే క్రింది చిత్రంలోని విధంగా PDF ఫైల్ పేరునీ, అది ఎక్కడ సేవ్ చెయ్యాలో ఎంచుకోమని వస్తుంది. డీఫాల్ట్ గా Desktopపై సేవ్ అయ్యేలా సెట్ చెయ్యబడి ఉంటుంది. Browse బటన్ క్లిక్ చెయ్యడం ద్వారా మీకు కావలసిన ఫోల్డర్ లో, మీకు కావలసిన పేరుతో సేవ్ అయ్యేలా సెట్ చేసుకుని, ఆ క్రిందనే Embed fonts అనే బటన్ ని టిక్ చేయండి. చివరిగా OK బటన్ ని ప్రెస్ చెయ్యండి.

అంతే క్షణాల్లో మీరు ఎంచుకున్న డాక్యుమెంట్ PDF ఫార్మేట్ లోకి కన్వర్ట్ చేయబడుతుంది. కమర్షియల్ సాఫ్ట్ వేర్ల ట్రయల్ వెర్షన్లలో మాదిరిగా ఎలాంటి వాటర్ మార్క్ లూ ఉండవు, పైరేటెడ్ సాఫ్ట్ వేర్లు డౌన్ లోడ్ చేసుకుని పిసిలోకి వైరస్ లు తెచ్చుకోవలసిన పనీ లేదు. పూర్తి ఉచితంగా చాలా సింపుల్ గా PDFలు తయారు చేసుకోవచ్చు కదా! :)

గమనిక: 15,700లకు పైగా ఉన్న ఇలాంటి చక్కని టెక్నికల్ చిట్కాలను ఒకే చోట చదవదలుచుకున్నారా.. ఇంకెందుకాలశ్యం వెంటనే.. http://computerera.co.in/forum/register.php అనే లింకు ద్వారా “కంప్యూటర్ ఎరా సాంకేతిక సహాయం ఫోరమ్”లో రిజిస్టర్ చేసుకుని వేలాది పోస్టులు ఆస్వాదించండి. :)

Liked this article? Read another similar article.
Stumble! for WP

Leave Comment