ఈ బ్లాగు గురించి మీ మిత్రులకు తెలియజేయండి.

ఏ రైలు ఎక్కడ ఉంది? ఎంత ఛార్జ్ అవుతుంది వంటి వివరాలకు

Jul 13th, 2009 | By admin | Category: ఇంట్రెస్టింగ్ వెబ్ సైట్లు

పండగలొస్తే రైలు ప్రయాణాలతో సందడే సందడి కదా! అస్సలు ఏయే ఊళ్లకు ఏయే రైళ్లు వెళతాయో, స్లీపర్, 3A, 2A, AC ఛెయిర్ కార్ వంటి వివిధ క్లాసులకు మీరు వెళ్లబోయే ఊరుకి ఎంత టికెట్ ఛార్జ్ అవుతుందో, ఏ స్టేషన్ ఏ ఊళ్లో ఎంత సేపు ఆగుతుందో, ఎన్ని గంటలకు చేరుతుందో వంటి రైల్వేలకు సంబంధించిన సమస్త సమాచారం లభించే సైట్ ఒకటుంది.. IRCTC గురించి చెప్పబోతున్నాననుకుంటున్నారు కదూ! :) లేదు.  ఆన్ లైన్ లో రైల్వే టిక్కెట్లని బుక్ చేసుకోవడానికి IRCTC బాగా హెల్ప్ చేసేదైతే IRCTCలో కూడా లభించనంత విస్తృత సమాచారం లభించే సైటే.. http://indiarailinfo.com/ ఈ సైట్ లో అనేక సదుపాయాలు ఉన్నాయి.

టెక్నాలజీని ఎంత బాగా సద్వినియోగం చేసుకోవచ్చు అన్న దానికి ఈ సైట్ చక్కని ఉదాహరణ. ఎలాగంటే వివిధ ట్రెయిన్ల షెడ్యూల్ ఆధారంగా ఏ ట్రెయిన్ ఇప్పుడు ఏ ఊళ్లో ఉందో ఏకంగా google maps ద్వారా కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది ఈ సైట్. అదెలాగో చూద్దామా..

స్టెప్ 1: http://indiarailinfo.com/ సైట్  ఓపెన్ చెయ్యండి. క్రింది చిత్రంలో విధంగా అందులో Train Name/Number అనే బాక్స్ లో మీరు ఏ ట్రెయిన్ గురించి వివరాలు చూడాలనుకుంటున్నారో ఆ ట్రెయిన్ పేరు గానీ, నెంబర్ గానీ టైప్ చేసి Get Train అనే బటన్ ని క్లిక్ చెయ్యండి.

స్టెప్ 2: వెంటనే క్రింది చిత్రంలోని విధంగా ఆ రైలు ప్రయాణించే వివిధ స్టేషన్ల పేర్లు, వాటి కోడ్ పేర్లు, ఆయా స్టేషన్లకు ఎన్ని గంటలకు వెళ్తుంది, ఎన్ని గంటలకు ఆ స్టేషన్ల నుండి departure అవుతుందీ, ఒక్కో స్టేషన్ లో ఎంత సేపు ఆగుతుంది, ఆ రైలు ప్రయాణం మొదలెట్టిన రోజు నుండి ఎన్ని రోజులకు ఏ స్టేషన్ కి చేరుకుంటుంది (రాత్రి 12 గంటలు దాటితే రెండవ రోజు క్రింద లెక్కేస్తుంది), మొట్టమొదటి స్టేషన్ నుండి వివిధ స్టేషన్లు ఎంతెంత దూరం ఉంటాయి, వివిధ స్టేషన్ల వద్ద రైలు స్పీడ్ ఎంత ఉంటుంది వంటి సమస్త సమాచారం చూపించబడుతుంది.

స్టెప్ 3: ఏదైనా ట్రెయిన్ ని అందుకోవాలంటే ప్రస్తుతం అది ఏ స్టేషన్ లో ఉందో, మనం ఉంటున్న స్టేషన్ కి ఎంత లేట్ గా వస్తుందో తెలియక చీటికీ మాటికీ రైల్వే నెంబర్ కి కాల్ చేయవలసి వస్తుంటుంది. ఒక రఫ్ ఐడియా కోసం సగటున ఆ ట్రెయిన్ ఎంత లేట్ అవుతూ ఉంటుందో, ఈరోజు ఎంత లేట్ గా ప్రయాణం చేస్తోందో, అలాగే ఇప్పుడు ఆ ట్రెయిన్ ఏ ప్రాంతంలో ఉందో Google Maps ద్వారా Mapని చూడాలంటే క్రింది చిత్రంలో విధంగా Route Mape/Live Status అనే బటన్ ని క్లిక్ చెయ్యండి.

స్టెప్ 4: అంతే వెంటనే క్రింది చిత్రాల్లో మాదిరిగా ఆ ట్రెయిన్ సగటున ఎంత లేట్ గా నడుస్తుంది, ప్రస్తుత స్థితి వంటి వివరాలు, అలాగే రూట్ మాప్ ద్వారా ప్రస్తుతం ఆ రైలు ఎక్కడ ఉన్నదీ కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. ఇదంతా టెక్నాలజీ ఆధారంగా యాంత్రికంగా జరిగే తతంగం కాబట్టి అన్ని సందర్భాల్లో ఈ వివరాలను కరెక్ట్ అని నమ్మడానికి లేదు. కానీ రైలు ప్రస్తుత స్థితిపై కొంతవరకూ సమాచారం తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది.

గమనిక: 15,700లకు పైగా ఉన్న ఇలాంటి చక్కని టెక్నికల్ చిట్కాలను ఒకే చోట చదవదలుచుకున్నారా.. ఇంకెందుకాలశ్యం వెంటనే.. http://computerera.co.in/forum/register.php అనే లింకు ద్వారా “కంప్యూటర్ ఎరా సాంకేతిక సహాయం ఫోరమ్”లో రిజిస్టర్ చేసుకుని వేలాది పోస్టులు ఆస్వాదించండి. :)

Liked this article? Read another similar article.
Stumble! for WP

One comment
Leave a comment »

  1. good job.. keep it

Leave Comment