ప్రభుత్వాన్ని తిట్టుకోవడమే కాదు… ఇలా ప్రభుత్వ విభాగాలను నిలదీయొచ్చు!! Must Watch & Share
వీడియో లింక్ ఇది: http://bit.ly/srirti
మనం ప్రభుత్వాలనూ, ప్రభుత్వ విభాగాలనూ తిట్టుకోవడంతో సరిపెట్టుకోవాల్సిన పనిలేదు…
మనకు ఏ డిపార్ట్‌మెంట్‌పై అయినా అనుమానం ఉంటే, లేదా ఏ ప్రభుత్వ పధకంపై నైనా, లేదా మీ వ్యక్తిగత అవసరాలకు చేసిన అప్లికేషన్ల తాజా స్థితిపై అయినా సమాచారం కావాలంటే.. “సమాచార హక్కు” చట్టం క్రింద (RTI Act) ఉచితంగా సమాచారం కోరొచ్చు.
దీని వల్ల మనకు ఎలాంటి నష్టమూ లేదు… ఆయా విభాగాల నుండి ఖచ్చితంగా మనకు సమాచారం అందించబడాలి…
చాలామందికి ఇది తెలీక ఇప్పటికీ ఏదైనా కోపం వస్తే తిట్టుకుంటూ కూర్చుంటున్నారు తప్ప మన తరఫున ఓ మంచి చట్టం ఉందని గుర్తించడం లేదు.
సో మీరు ఏ విషయంపై అయినా ఏ కేంద్ర, రాష్ట్ర విభాగం నుండైనా, ఎటువంటి సమాచారాన్నయినా కోరుకుంటున్నట్లయితే ఈ వీడియో తప్పకుండా ఉపయోగపడుతుంది.
ఆన్‌లైన్‌లో ఉచితంగా మీరు RTI చట్టం క్రింద సమాచారాన్ని ఎలా కోరవచ్చో చూపించడం జరిగింది.
సో టెక్నాలజీని సమాజ శ్రేయస్సు కోసం, మెరుగైన ప్రభుత్వాలూ, పాలన పొందడం కోసం వినియోగించుకుందాం…
గమనిక: ప్రతీ భారతీయ పౌరుడికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ షేర్ చెయ్యగలరు.
వీడియో లింక్ ఇది: http://bit.ly/srirti
ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com






