Home » కొత్త టెక్నాలజీ » Recent Articles:

మీ ఫోన్ కెమెరాని మీ పిసి Webcamగా ఇలా వాడుకోవచ్చు..

వీడియో లింక్ ఇది: http://bit.ly/sricameraphone

మీ ఫ్రెండ్స్, రెలెటివ్స్‌తో వీడియో ఛాట్ చేసుకోవడానికి మీ పిసికి Webcam లేదా?

మీ దగ్గర ఎటూ కెమెరా ఫోన్ ఉంది కదా.. ఆ కెమెరాని మీ పిసి యొక్క Webcamగా వాడేసుకుంటే పోలా.. :)

వినడానికి ఇది అసాధ్యమనిపిస్తోంది కదూ.. :) అయితే ఈ వీడియో చూడండి అది ఎంత ఈజీ పనో ప్రాక్టికల్‌గా నేను చేసి చూపించడం జరిగింది.

ఈ టెక్నిక్‌తో మీ ఫోన్ కెమెరాని మీ పిసి యొక్క Webcamగా వాడేసుకుని Skype, Google+ వంటి అన్ని చోట్లా వీడియో ఛాటింగ్ చేసేసుకోవచ్చు.

గమనిక: ప్రతీ పిసి యూజర్‌కీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ షేర్ చెయ్యగలరు.

వీడియో లింక్ ఇది: http://bit.ly/sricameraphone

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

ఫోన్‌లో ఫొటోలు వైర్‌లెస్‌‌గా ప్రింట్ తీసుకోవడం ఇలా…. Must Watch & Share

వీడియో లింక్ ఇది: http://bit.ly/srimobileprint

వేలకు వేలు ఖర్చుపెట్టి ఫోన్లు కొన్నంత మాత్రాన సరిపోదు… వాటిని మాగ్జిమమ్ వాడుకునే టెక్నిక్‌లూ తెలియాలి…

మీ ఫోన్‌లో తీసిన ఫొటో గానీ, లేదా ఫోన్‌లో ఉన్న ఏదైనా డాక్యుమెంట్‌ని ప్రింట్ తీసుకోవాలంటే ఏం చేస్తారు?

ఫోన్‌ని పిసికి కనెక్ట్ చేసి.. ఆ ఫైళ్లని పిసిలోకి కాపీ చేసుకుని ప్రింట్ తీసుకుంటారు కదూ..?

అస్సలు ఇలాంటిదేమీ చెయ్యకుండానే మీ దగ్గర వైర్‌లెస్ ప్రింటర్ లేకపోయినా…. మీ ఫోన్ నుండి నేరుగా ప్రింటర్‌లో ప్రింట్‌లు పొందడం ఎలాగో ఈ వీడియోలో ప్రాక్టికల్‌గా చూపించాను…. కావాలంటే బయటకు తీసిన పేపర్‌ని కూడా మీరు ఛెక్ చేసుకోవచ్చు.

అంతే కాదు… ఈ టెక్నిక్ ద్వారా మీరు హైద్రాబాద్‌లో కూర్చుని ప్రింట్ ఇస్తే మీ ఊళ్లో ఉన్న ప్రింటర్‌లో ప్రింట్ అయ్యే విధంగానూ చేసుకోవచ్చు. ఎంత అద్భుతమైన టెక్నాలజీనో మీరే చూడండి.

గమనిక: టెక్నాలజీ ఎంత పవర్‌ఫుల్‌గా వాడుకోవచ్చో ప్రతీ ఒక్కరికీ తెలియజేసే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ షేర్ చెయ్యగలరు.

వీడియో లింక్ ఇది: http://bit.ly/srimobileprint

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

ఆటో మీటర్ దోపిడీలను ఇలా అడ్డుకోండి..

వీడియో లింక్ ఇది: http://bit.ly/sriauto

రోజూ మనలో చాలామంది ఆటోల్లోనే ప్రయాణం చేస్తుంటాం…

అలాగే రోజూ ఆటో వాళ్లతో గొడవ పడుతూనే ఉంటాం…. :(

ఒక ఆటోకి తక్కువైతే.. మరో ఆటోకి ఎక్కువవుతుంది.. అదేమని అడిగితే పెద్ద ఆర్గ్యుమెంట్…

మీటర్ టాంపరింగ్‌ల వల్ల జరుగుతున్న మోసాలివి… అలాగని ఊరికే వదిలేయలేం కదా…

ప్రతీ ఒక్కరూ ఎదుర్కొనే ఈ ప్రాక్టికల్ ప్రాబ్లెం కోసం ఈ వీడియోలో ఓ మంచి సొల్యూషన్ చూపిస్తున్నాను….

మీరు ఎంత దూరం ప్రయాణం చేశారో, మినిమమ్ ఫేర్ ఎంతో… చివరకు destination చేరుకున్న తర్వాత ఎంత చెల్లించాలో ఆణా పైసలతో సహా కరెక్ట్‌గా తెలుసుకునే టెక్నిక్ ఇది…

టెక్నాలజీని మంచిగా వాడుకుంటే ఎన్ని ప్రయోజనాలున్నాయో దీన్ని చూస్తే మీకే అర్థమవుతుంది..

గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ షేర్ చెయ్యగలరు.

వీడియో లింక్ ఇది: http://bit.ly/sriauto

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

ట్రాఫిక్ జామ్ ఎక్కడయిందో ముందే తెలుసుకోండి ఇలా….

వీడియో లింక్ ఇది: http://bit.ly/sritraffic

ఏ రోడ్‌లో ఎంత ట్రాఫిక్ జామ్ ఉంటుందో…  ఆఫీసులకూ, స్కూళ్లకూ, కాలేజీలకు ఎంత లేట్‌గా వెళ్లాల్సి వస్తుందో మనకు తెలిసిందే…

మనం ఇంటి నుండి బయర్దేరాక ఏ రూట్‌లో ఎంత ట్రాఫిక్ ఉందో ఎప్పటికప్పుడు ముందే తెలిసే అవకాశముంటే.. పెద్దగా ట్రాఫిక్ లేని వేరే రూట్‌లోనో, షార్ట్‌కట్‌లోనో వెళ్లిపోవచ్చు కదా…

ఎప్పటికప్పుడు తాజాగా అలా వివిధ రూట్లలోని ట్రాఫిక్ ఎలా ఉందో లైవ్‌గా తెలుసుకోవడం ఎలాగో ఈ వీడియోలో చూపించాను…

సో ఇలాంటివి ఫాలో అయితే కొంతవరకూ ట్రాఫిక్ బాధలు తప్పుతాయి….

గమనిక: అందరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ షేర్ చెయ్యగలరు.

ధన్యవాదాలు

వీడియో లింక్ ఇది: http://bit.ly/sritraffic

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

మీ రాబోయే కరెంట్ బిల్ ఎంత షాకిస్తుందో ముందే తెలుసుకోండి ఇలా…

వీడియో లింక్ ఇది: http://bit.ly/sripowerbill

మనకు కరెంట్ బిల్లు ఎంతొస్తుందో తెలీదు… బిల్ చూసి కాసేపు షాక్ అయ్యి… కరెంటోళ్లని ఓ ఐదు నిముషాలు తిట్టుకుని… పే చెయ్యడానికే అలవాటు పడిపోయాం…

వివిధ స్లాబ్ సిస్టమ్‌ల కొద్దీ మనకు వస్తున్న బిల్లులు కరెక్టేనా…. అసలు ఎన్ని యూనిట్లు వాడుకుంటే మనకు ఎంత బిల్ వచ్చే అవకాశముంది, Fixed Charges ఎంత వంటి వివరాలు నేరుగా మీ మొబైల్‌లోనే కాలిక్యులేట్ చేసుకోగలిగితే బాగుంటుంది కదా?

ఈ వీడియోలో నేను చూపిస్తున్న టెక్నిక్‌తో మీరు ప్రస్తుతం బాకీ ఉన్న కరెంట్ బిల్లు ఎంతో తెలుసుకోవచ్చు… వివిధ స్లాబుల లెక్కన ఎన్ని యూనిట్లకు ఎంత ఖర్చవుతుందో చిటికెలో తెలుసుకోవచ్చు.

గమనిక: కరెంట్ ఉన్న ప్రతీ ఇంట్లోనూ ఇలాంటి అవసరం ఖచ్చితంగా ఉంటుంది… అలాగే ఈ మధ్య అందరి దగ్గరా ఆండ్రాయిడ్ ఫోన్లు మాత్రం ఖచ్చితంగా ఉంటున్నాయి… సో అందరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ షేర్ చెయ్యడానికి వెనుకాడకండి.

వీడియో లింక్ ఇది: http://bit.ly/sripowerbill

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

Google Play స్టోర్‌లో “Telugu Computer Tutorials” ఫ్రీ అప్లికేషన్ మీ కోసం..

nallamothuappthumb1

హై డెఫినిషన్‌లో మొట్టమొదటిసారిగా తెలుగులో అందించబడుతున్న “Telugu Computer Tutorials” అప్లికేషన్‌ ఇప్పుడు మీకు Google Play Storeలో లభిస్తోంది.

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో, టాబ్లెట్‌లో Google Playలో Nallamothu అని గానీ, “Telugu Computer Tutorials” అని గానీ వెదికి ఈ అప్లికేషన్‌ని పూర్తి ఉచితంగా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు.

ఇకపై  తాజా వీడియోలన్నీ ఈ అప్లికేషన్ ద్వారా మీకు లభ్యమవుతుంటాయి….

ప్రతీ ఆండ్రాయిడ్‌ యూజర్‌కీ పనికొచ్చే ఈ అప్లికేషన్ గురించి ఈ updateని షేర్ చెయ్యడం ద్వారా మీ ఫ్రెండ్స్‌కీ తెలియజేయగలరు.

- నల్లమోతు శ్రీధర్

ఎడిటర్

కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

మీ ఫోన్ దొంగిలించినందుకు దొంగే బాధపడిపోతాడు…. నమ్మబుద్ధి కావట్లేదా…?

వీడియో లింక్ ఇది: http://bit.ly/srisafemobile

మీ ఫోన్‌ని కాపాడుకోవడానికి మీరు జీవితంలో రకరకాల సాఫ్ట్‌వేర్లు వాడి చూసుంటారు…..

ఖచ్చితంగా ఈ వీడియోలో నేను చూపించినంత టెక్నిక్‌ని మించినది మాత్రం ఏం ఉండదు….

ఈ వీడియో చూసి నేను చెప్పినట్లు చేస్తే మీ ఫోన్ దొంగిలించినందుకు దొంగే బాధపడాలి :P

ఫోన్ పోయినప్పటి నుండి ఆ ఫోన్ సరిగ్గా ఎక్కడుందో, దొంగ ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో కనిపెట్టేయొచ్చు…

అతను ఏ నెంబర్లకి ఫోన్లు చేస్తున్నాడో, SMSలు చేస్తున్నాడో ఆ మెసేజ్‌ల వివరాలతో సహా మీ కంప్యూటర్ స్క్రీన్ మీదే చూసేయొచ్చు.

దొంగ తన ఫ్రెండ్స్‌తో కూర్చుని ఖుషీ చేసుకుంటుంటే… అతనికి తెలీకుండా వారందరి ఫొటోలూ తీయొచ్చు…. వీడియో తీయొచ్చు…. వాళ్లేం మాట్లాడుకుంటున్నదీ ఆడియో రికార్డ్ చేసి వెంటనే మన మెయిల్‌కి పొందొచ్చు….

వాళ్ల ఫ్రెండ్స నెంబర్లు మనకు తెలుస్తుంటే… అతనెక్కడ తిరుగుతున్నాడో క్షణం క్షణం మనకు తెలుస్తుంటే… సిమ్‌ మార్చేసినా ఉపయోగం లేకపోతే… చివరకు దొంగ ఫొటో, వీడియో, మాటలూ, SMS మెసేజ్‌లూ కూడా మనకు వచ్చేస్తుంటే….. ఇంకా పోలీస్ కంప్లయింట్లెందుకు…? నేరుగా మనమే ఓ అరగంటలో పట్టుకోలేమా….?

నేనైతే గత ఏడాదిన్నరగా ఈ టెక్నిక్ ఫాలో అవుతున్నాను… ఎక్కడైనా ఫోన్ మర్చిపోయి వచ్చినా అస్సలు భయం లేదు…. నాకెందుకు భయం…. దొంగ భయపడాలి గానీ :P

ఖరీదైనవీ, మామూలువీ రకరకాల ఫోన్లు వాడే ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని “ఖచ్చితంగా” మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చేసి వారి ఫోన్లనీ కాపాడండి…

షేర్ చేస్తే పోయేదేముంది dude.. షేర్ చెయ్యకపోతే “ఫోన్లు పోతాయి గానీ!” :P

వీడియో లింక్ ఇది: http://bit.ly/srisafemobile

- నల్లమోతు శ్రీధర్

ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

ఫేస్‌బుక్‌లో ఇక దేన్నయినా వెదికేయొచ్చు.. ఈ Graph Searchతో..

వీడియో లింక్ ఇది: http://bit.ly/srigraph

మీ ఇంటి దగ్గరలో ఉంటున్న ఫ్రెండ్స్ వివరాలు కావాలా…. లేదా మీకు దగ్గరలోని రెస్టారెంట్ల వివరాలు కావాలా…. లేక మీ ఫ్రెండ్స్ అప్‌లోడ్ చేసిన ఫొటోలన్నీ ఒకేచోట చూడాలా….

లేదా మీ కాలేజీలో చదువుకున్న అమ్మాయిలో/అబ్బాయిలో వివరాలు మాత్రమే కావాలా……

మీరు ఏదైనా కోరుకోండి…. క్షణాల్లో మీ ముందు ప్రత్యక్షమవుతాయి నేను ఈ వీడియోలో చూపించిన కొత్త ఫేస్‌బుక్ ఆప్షన్ ద్వారా!

ప్రతీ ఫేస్‌బుక్ యూజర్ తప్పనిసరిగా చూడాల్సిన వీడియో ఇది. మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.

వీడియో లింక్ ఇది: http://bit.ly/srigraph

ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

మీ పర్మిషన్ లేకుండా మౌస్ కదిలిస్తే మెయిల్ అలర్ట్ రావాలా?

వీడియో లింక్ ఇది: http://bit.ly/srimousealert

మీ అనుమతి లేకుండా ఎవరైనా మౌస్ కదిలిస్తే ఆ విషయం మీకు మెయిల్ అలర్ట్ ద్వారా రావడమే కాకుండా మీ దగ్గర Webcam ఉంటే మీ కంప్యూటర్ ముందు కూర్చున్న వారి ఫొటో కూడా తీసి ఏకంగా మీకు మెయిల్ చేసే ఏర్పాటు ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారా?

అయితే ఈ వీడియోలో నేను చూపించిన పద్ధతిని ఫాలో అవ్వొచ్చు..

గమనిక: ప్రతీ పిసి యూజర్‌కీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ షేర్ చేయగలరు.

వీడియో లింక్ ఇది: http://bit.ly/srimousealert

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/

హలో డాక్టర్….

వీడియో లింక్ ఇది: http://bit.ly/sridoct

డాక్టర్ల దగ్గర వెయిట్ చేయడం అంత మెంటల్ టార్చర్ ఏదీ ఉండదేమో… :) అలాగని ఎలాంటి ప్లానింగూ లేకుండా నేరుగా వెళితే చాలాసేపు వెయిట్ చేయకా తప్పదు…

చాలా హాస్పిటల్స్, డాక్టర్లు ఫోన్ ద్వారా అపాయింట్‌మెంట్లు ఇచ్చినా అవసరానికి ఈ విషయం మనకు గుర్తుండదు.

అలాగే కొన్నిసార్లు మనం ప్రస్తుతం ఉన్న లొకేషన్‌కి దగ్గరలో ఆర్టోపెడిక్ డాక్టరో, డెంటిస్టో, ENT స్పెషలిస్టో అవసరం ఉండీ… వారి వివరాలు తెలీక ఎక్కడెక్కడో వెదికేస్తూ ఉంటాం.

ఇలాంటి అన్ని ఇబ్బందులకూ “ది బెస్ట్” సొల్యూషన్ నేను ఈ వీడియోలో చూపించాను.

నేరుగా మొబైల్‌లోనే కావలసిన తేదీ, సమయానికి కావలసిన డాక్టర్ వద్ద అపాయింట్‌మెంట్ తీసుకోవచ్చు, సరిగ్గా మనం ఉన్న లొకేషన్ నుండి దగ్గరలో ఉన్న పలువురు డాక్టర్లూ, వారి హిస్టరీతో సహా తెలుసుకోవచ్చు…. అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవచ్చు.

ప్రతీ ఒక్కరికీ అనేక అత్యవసర సందర్భాల్లో పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ షేర్ చేయగలరు.

వీడియో లింక్ ఇది: http://bit.ly/sridoct

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

Search This Site:

Press75.com Press75.com Press75.com Press75.com

About Me

1996వ సంవత్సరంలో తెలుగులో మొట్టమొదట కంప్యూటర్ సాహిత్యాన్ని ప్రారంభించే అవకాశం నాకు కలిగింది. అదే సమయంలో చెన్నైలో సూపర్ హిట్ తెలుగు ఫిల్మ్ మేగజైన్ కి సబ్ ఎడిటర్ గా కూడా ఏకకాలంలో పనిచేస్తూ 1998 వరకూ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, మనీషా కొయిరాలా, శంకర్, రజనీకాంత్, కమల్ హాసన్ వంటి ప్రముఖులెందరినో ఇంటర్వ్యూలు చేయడం మర్చిపోలేని అనుభవం. అయితే సినిమా రంగంలో ఉన్న అనారోగ్యకరమైన వాతావరణం వల్ల నాకంటూ ఓ ప్రత్యేకమైన ఉనికిని సృష్టించుకోవడం కోసం సినిమా రంగం నుండి బయటకు వచ్చి పూర్తిగా టెక్నాలజీ రంగంలో స్థిరపడడం జరిగింది. 96 నుండి 2001 వరకూ పలు కంప్యూటర్ పత్రికలకు ఎడిటర్ గా పనిచేసి.. 2001 నుండి "కంప్యూటర్ ఎరా" తెలుగు మంత్లీ మేగజైన్ ఎడిటర్ గా పత్రిక మొత్తాన్నీ రూపొందిస్తూ ఉన్నాను. అలాగే తెలుగు టెలివిజన్ ఛానెళ్లలో మొట్టమొదటి టెక్నికల్ phone-in ప్రోగ్రామ్ కి గెస్ట్ గా అటెండ్ అయ్యే అవకాశమూ 2010 జనవరి 20న కలిగింది. అప్పటి నుండి ఇప్పటివరకూ I News, ETV2, ABN ఆంధ్రజ్యోతి, NTV, Zee 24 గంటలు, సాక్షి టివి, మహా టివి, జాగృతి న్యూస్ వంటి ఛానెళ్లలో 90కి పైగా లైవ్, రికార్డెడ్ ప్రోగ్రాముల్ని చేయడం జరిగింది. 2007లో అత్యుత్తమైన నాణ్యతతో కూడిన పోస్టులతో, వీడియోలతో తెలుగులో మొదటి ప్రొఫెషనల్ టెక్నికల్ బ్లాగ్ గానూ, మొదటి వీడియో బ్లాగ్ గానూ ఇప్పుడు మీరు చూస్తున్న బ్లాగ్ ప్రత్యేకతను సంతరించుకుంది. అలాగే 2007 జనవరి 1న ప్రారంభించిన తెలుగులోనే మొట్టమొదటి టెక్నికల్ ఫోరమ్ అయిన "కంప్యూటర్ ఎరా సాంకేతిక ఫోరమ్" 14 వేల మంది సభ్యులతో 10 వేలకు పైగా పోస్టులతో 2009 జూలై వరకూ నిర్వహించబడింది. దాంతోపాటే మొట్టమొదటి తెలుగు టెక్నికల్ ఛాట్ రూమ్ అయిన "కంప్యూటర్ ఎరా సాంకేతిక సహాయం" అనే ఛాట్ రూమ్ రెండేళ్లలో వేలాది మందికి తెలుగు టైప్ చేయడం మొదలుకుని అనేక కంప్యూటర్ సంబంధిత సాంకేతిక సమస్యలకు తక్షణ సహాయం అందించింది. ఇకపోతే http://youtube.com/nallamothu అనే ఛానెల్ లో 361కి పైగా ప్రొఫెషనల్ క్వాలిటీ తెలుగు టెక్నికల్ వీడియోలు అందించాను. ఈ ఛానెల్ కి 1192 మంది సబ్ స్కైబర్లు ఉన్నారు. అందుబాటులో ఉన్న వివిధ మార్గాల ద్వారా తెలుగు వారందరకీ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించే పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాను.

Google Playలో పొందండి

ఇక్కడ RSS Feedకి Subscribe చేసి నేరుగా పోస్ట్ లు పొందండి