Home » కొత్త టెక్నాలజీ » Recent Articles:

త్వరలో రాబోయే అడోబ్ ఫొటోషాప్ CS 6 ఇలా ఉంటుంది

తాజా ఆడోబ్ ఫొటోషాప్ CS 6 వెర్షన్ జూన్ 2012 లోపు అందుబాటులోకి…

ఫొటోలను ఎడిట్ చేసేటప్పుడు కళ్లు వత్తిడికి గురికాకుండా మునుపటి వెర్షన్లకు భిన్నంగా పై చిత్రంలోని విధంగా  పూర్తి డార్క్ ఇంటర్ ఫేస్ తో, సరికొత్త సదుపాయాలతో అడోబ్  ఫొటోషాప్ CS 6 వెర్షన్ జూన్ 2012 లోపు విడుదల కానుంది.

"కంప్యూటర్ ఎరా" పాఠకులూ, మిత్రుల కోసం ఫొటోషాప్ CS 6 ఇంటర్ ఫేస్ ని ఈ చిత్రంలో చూపిస్తున్నాను. ఈ వెర్షన్ ప్రస్తుతానికి అందుబాటులో లేదు. ఓ టెక్నికల్ మేగజైన్ గా మాకు ఉన్న ప్రత్యేక సదుపాయాల మూలంగా ఈ ప్రివ్యూని చూపించగలుగుతున్నాం. అధికారికంగా CS 6 వెర్షన్ విడుదల అయ్యే వరకూ వేచి ఉండండి, ఎన్నో అద్భుతమైన సదుపాయాలు రుచి చూస్తారు.

అడోబ్ ఫొటోషాప్ CS 6 కొత్త వెర్షన్ జూన్ 2012 లోపు

 

కంప్యూటర్ ని వేగం చేసుకోవడానికి అద్భుతమైన మార్గం

ఎక్కువ ఖరీదైన కంప్యూటర్ కొంటే బాగా స్పీడ్ గా పనిచేస్తుందని అనుకుంటాం. కానీ ఏ కంప్యూటర్ అయినా ఆన్ చేసిన తర్వాత డెస్క్ టాప్ రావడానికి ఒకటిన్నర, రెండు నిమిషాలు పట్టక తప్పట్లేదు.

ఆన్ చేశాక డెస్క్ టాప్ వచ్చేవరకూ అలాగే స్క్రీన్ వైపు చూడడం ఎంత నరకమో ఆలోచించండి.

పిసిలు ఎందుకంత నత్తనడక నడుస్తున్నాయి? ఆన్ చేసిన వెంటనే ఏది లోడ్ అవడానికి ఎంత టైమ్ పడుతోందో తెలుసుకుంటే సగం ప్రాబ్లెం సాల్వ్ అవుతుంది కదా!

నా విషయానికే వస్తే ఈ వీడియోలో నేను చూపించిన టెక్నిక్ తో ఏది ఎక్కువ టైమ్ తీసుకుంటోందో తెలుసుకుని 3 నిమిషాల నుండి 1.30 నిమిషాలకు డెస్క్ టాప్ వచ్చేలా నా పిసి పనితీరుని మెరుగుపరుచుకున్నాను.

సో మీరూ ఈ వీడియో చూసి మీ కంప్యూటర్ ని మరింత వేగం చేసుకోండి.

ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ కీ share చేయడం ద్వారా వారూ మరంత నాలెడ్జ్ పొందేలా చూడండి.

మీ వెబ్ సైట్ లోనూ, బ్లాగ్ లోనూ మీకు ఈ వీడియో నచ్చితే రీపబ్లిష్ చేసుకోవచ్చు. మీ బ్లాగ్ లో కొత్త పోస్ట్ చేసేటప్పుడు HTML మోడ్ లో ఉండగా క్రింది లైన్ ని మీ పోస్ట్ లో add చేస్తే ఈ వీడియో వచ్చేస్తుంది.

<iframe width="560" height="315" src="http://www.youtube.com/embed/qbJVEcLf4mQ" frameborder="0" allowfullscreen></iframe>

 

 

 

Firefox 10 ఇక్కడ డౌన్ లోడ్ చేసుకోవచ్చు

 

ఇప్పటివరకూ మనకు అందుబాటులో ఉన్న Firefox 9.0.1 స్థానంలో Firefox 10 తాజా వెర్షన్ కొద్ది గంటల్లో మనకు అందుబాటులోకి రానుంది.

 

ఈ వెర్షన్ ని ముందే వాడాలనుకునే వారు ఈ లింక్ నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చు:

http://goo.gl/hRSkO

Firefox 10 డౌన్ లోడ్ ఇక్కడ

కొత్తగా ఈ వెర్షన్ లో చోటుచేసుకున్న మార్పులు:

1. Forward బటన్ ఇకపై hiddenగా ఉంటుంది, కేవలం మనం ప్రస్తుతం ఉన్న పేజీ నుండి ముందు పేజీకి వెళ్లినప్పుడు మాత్రమే ఈ బటన్ కన్పిస్తుంది.

2. WebGL అనే వెబ్ ఆధారిత గ్రాఫిక్స్ లైబ్రరీకి Anti-Aliasing  సదుపాయం కల్పించబడింది.

3. CSS3 3D -Tramsforms ఇకపై సపోర్ట్ చేయబడతాయి.

4. మనం తరచూ వాడే Google Docs వంటి పలు వెబ్ అప్లికేషన్లు కంప్యూటర్ స్క్రీన్ మొత్తాన్నీ ఆక్రమించే విధంగా రూపొందించడం కోసం Full Screen API సపోర్ట్ కల్పించబడింది.

5. కొత్త CSS Style Inspectorతో కంటెంట్ హైలైటింగ్ సదుపాయం కలిగిన Inspect tool వెబ్ డెవలపర్లకి బాగా ఉపయోగపడుతుంది.

ఇలా అనేక మార్పులు ఈ కొత్త వెర్షన్ లో చోటుచేసుకున్నాయి.

కొత్త వెర్షన్ Firefox బ్రౌజర్ యొక్క auto-update ద్వారా అందరికీ అందుబాటులోకి రావడానికి మరికొన్ని గంటల సమయం పడుతుంది.

TV9 ఛానెల్ లో నిన్న జరిగిన నా లైవ్ డిస్కషన్ మిస్ అయిన వారు ఇక్కడ చూడొచ్చు..

TV 9 తెలుగు ఛానెల్ లో నిన్న రాత్రి 8 గంటలకు ప్రసారమైన నా live discussionని మిత్రులు ఈ క్రింద చూడవచ్చు.

ధన్యవాదాలు.

అతి పెద్ద స్క్రీన్ కలిగిన తాజా ఫోన్ (వీడియో డెమో)

ఇప్పటివరకూ ఏ మొబైల్ ఫోనూ కలిగి ఉండనంత పెద్ద సైజ్ లో 5.3 అంగుళాల స్క్రీన్ సైజ్ కలిగిన ఈ ఫోన్ తాజా సంచలనం. కేవలం స్క్రీన్ సైజే కాదు Super AMOLED డిస్ ప్లే, పగిలిపోని చెక్కుచెదరని గొరిల్లా గ్లాస్ స్క్రీన్, S-Pen అనే సరికొత్త ఏర్పాటూ.. చెప్పుకుంటూ పోతే నేను ఈ వీడియోలో వివరంగా చూపించిన Samsung Galaxy Note అన్నీ ప్రత్యేకతలే.

దీని గొప్పదనం క్రింద మీరే స్వయంగా చూసేయండి.

మీ వెబ్ సైట్ లోనూ, బ్లాగ్ లోనూ మీకు ఈ వీడియో నచ్చితే రీపబ్లిష్ చేసుకోవచ్చు. మీ బ్లాగ్ లో కొత్త పోస్ట్ చేసేటప్పుడు HTML మోడ్ లో ఉండగా క్రింది లైన్ ని మీ పోస్ట్ లో add చేస్తే ఈ వీడియో వచ్చేస్తుంది.

<iframe width="560" height="315" src="http://www.youtube.com/embed/DE785iELg6M" frameborder="0" allowfullscreen></iframe>

 

 

 

ఏపిల్ లేటెస్ట్ మోడల్ iPhone 4S పూర్తి వీడియో రివ్యూ

దార్శనికుడు ఏపిల్ స్టీవ్ జాబ్స్ మరణించడానికి   సరిగ్గా ఒకరోజు ముందు  అక్టోబర్ 4, 2011న యావత్ ప్రపంచంతో పాటే నేనూ iPhone 5 విడుదల కోసం ప్రతీ క్షణం ఎదురుచూశాను.

కానీ అందర్నీ నిరుత్సాహపరుస్తూ ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్న Apple iPhone 4S విడుదలైంది. iPhone 5 అనే device naming సిరీస్  కోసం తాపత్రయపడడం కన్నా మెరుగైన డివైజ్ కోసం తాపత్రయపడడం మంచిది అన్న విషయం iPhone 4Sని వాడాక అర్థమైంది. ఖచ్చితంగా ఇది ఏపిల్ సంస్థ ప్రతిష్టని నిలబెట్టే ఓ మంచి smartphoneగా నేను భావిస్తాను. మరింత లోతైన విశ్లేషణా, వివరాలూ ఈ వీడియోలో మీరు చూడవచ్చు.

 

మీ వెబ్ సైట్ లోనూ, బ్లాగ్ లోనూ మీకు ఈ వీడియో నచ్చితే రీపబ్లిష్ చేసుకోవచ్చు. మీ బ్లాగ్ లో కొత్త పోస్ట్ చేసేటప్పుడు HTML మోడ్ లో ఉండగా క్రింది లైన్ ని మీ పోస్ట్ లో add చేస్తే ఈ వీడియో వచ్చేస్తుంది.

<iframe width="560" height="315" src="http://www.youtube.com/embed/kfkRSd3ZDOY" frameborder="0" allowfullscreen></iframe>

 

 

 

ఆకాష్ టాబ్లెట్ కొంటారా? ఇలాంటివి కొంటారా?

ఆకాష్ టాబ్లెట్ అతి చవకగా లభిస్తోందని ప్రభుత్వం ఊదరగొడుతోంది, ప్రజలూ దాన్ని దక్కించుకోవడానికి వేచి చూస్తున్నారు. ఆకాష్ టాబ్లెట్ ని నేను స్వయంగా వాడి చూశాను. చాలా తక్కువ responsiveగానూ, Android Market నుండి ఏ అప్లికేషనూ ఇన్ స్టాల్ అవడం లేదు. దాన్ని ఎందుకు అంతగా ప్రమోట్ చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు.

సరే సరిగ్గా 5000లకు HP TouchPad అనే అద్భుతమైన Touchpad లభిస్తోంది. ఒక్కసారి దీన్ని చూడండి, ఆకాష్ ని పక్కన పెట్టి చూడండి. 5000ల ఆఫర్ ఇప్పుడు లేకపోయినా చవకగా ఆకాష్ కంటే అద్భుతమైన Tabletలు కొద్దిరోజుల్లో లభిస్తాయన్నది ఎవరూ కాదనలేని వాస్తవం.

ఒకసారి క్రింది వీడియోని చూడడం ద్వారా ఈ వీడియోని చూసి ఆకాష్ ని కొనాలనుకుంటారో, ఇలాంటివి కొనాలనుకుంటారో మీరే నిర్ణయించుకోండి. మరోసారి ప్రభుత్వపు హడావుడికీ, మంత్రుల అవగాహనాలేమిని సొమ్ము చేసుకోవాలనుకునే వారికీ సాల్యూట్ కొడుతూ :)

మీ వెబ్ సైట్ లోనూ, బ్లాగ్ లోనూ మీకు ఈ వీడియో నచ్చితే రీపబ్లిష్ చేసుకోవచ్చు. మీ బ్లాగ్ లో కొత్త పోస్ట్ చేసేటప్పుడు HTML మోడ్ లో ఉండగా క్రింది లైన్ ని మీ పోస్ట్ లో add చేస్తే ఈ వీడియో వచ్చేస్తుంది.

<iframe width="560" height="315" src="http://www.youtube.com/embed/NsNnzylHDGI" frameborder="0" allowfullscreen></iframe>

 

 

 

మీ సెల్ ఫోన్ మీపైనే నిఘా పెట్టిందా? మీరు చేసేవన్నీ ఇతరులకు చేరవేస్తోందా?

ఇటీవల వార్తాపత్రికల్లోనూ, ప్రసార మాధ్యమాల్లోనూ అవగాహనారాహిత్యంతో ప్రజల్లో భయాలను కలిగిస్తూ వస్తున్న కధనాలను దృష్టిలో ఉంచుకుని అందరికీ దీనిపై అవగాహన కలగడం కోసం అందిస్తున్న వివరణ ఇది. దీన్ని అందరికీ చేరవేసి ప్రతీ ఒక్కరూ భయాల్ని పోగొట్టుకునేలా సహకరించగలరు.

 

మీ వెబ్ సైట్ లోనూ, బ్లాగ్ లోనూ మీకు ఈ వీడియో నచ్చితే రీపబ్లిష్ చేసుకోవచ్చు. మీ బ్లాగ్ లో కొత్త పోస్ట్ చేసేటప్పుడు HTML మోడ్ లో ఉండగా క్రింది లైన్ ని మీ పోస్ట్ లో add చేస్తే ఈ వీడియో వచ్చేస్తుంది.

<iframe width="560" height="315" src="http://www.youtube.com/embed/AdNfxDRlTBE" frameborder="0" allowfullscreen></iframe>

 

 

 

మీ ఫ్రెండ్స్ Birthdayల గురించి SMS రిమైండర్లు పంపబడాలా? (వీడియో డెమో)

మీ Birthday రోజు ఎవరైనా విష్ చేస్తే ఎంత సంతోషంగా అన్పిస్తుంది? అలాంటిది మన ఫ్రెండ్స్, రెలెటివ్స్ ని మర్చిపోకుండా మనం విష్ చేస్తే వాళ్లు మనల్ని జీవితాంతం మర్చిపోలేరు కదా. 

అయితే అందరం బిజీనే. ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా, రెలెటివ్ దైనా బర్త్ డే గుర్తుపెట్టుకోవడం కష్టమవుతోంది. మీకు Facebookలో ఉన్న ముఖ్యమైన ఫ్రెండ్స్ యొక్క బర్త్ డేల గురించి మీ ఫోన్ కి SMS ద్వారా రిమైండర్ పంపించబడితే ఎంత బాగుంటుందో కదా!
నేను ఈ వీడియోలో చూపిస్తున్న టెక్నిక్ ని ఫాలో అయితే ఇక ఖచ్చితంగా ఏ ముఖ్యమైన ఫ్రెండ్ బర్త్ డేనీ మర్చిపోలేరు.

 

మీ వెబ్ సైట్ లోనూ, బ్లాగ్ లోనూ మీకు ఈ వీడియో నచ్చితే రీపబ్లిష్ చేసుకోవచ్చు. మీ బ్లాగ్ లో కొత్త పోస్ట్ చేసేటప్పుడు HTML మోడ్ లో ఉండగా క్రింది లైన్ ని మీ పోస్ట్ లో add చేస్తే ఈ వీడియో వచ్చేస్తుంది.

<iframe width="560" height="315" src="http://www.youtube.com/embed/fHpJL4Rc7GM" frameborder="0" allowfullscreen></iframe>

 

 

 

ఈ వీడియోలు మీరు మిస్ అయి ఉండొచ్చు..

పోగొట్టుకున్న ఫోన్ సరిగ్గా ఎక్కడ ఉందో తెలుసుకోవడం ఇలా..

మీ ఫోన్ పోతే మామూలు anti-theft సాఫ్ట్ వేర్లు అయితే SIM కార్డ్ మారిస్తే దాని వివరాలు పంపిస్తాయి తప్ప దొంగ ఎక్కడ ఉన్నాడన్న విషయం చెప్పలేవు. అదే మేము ఈ వీడియోలో చూపిస్తున్న పద్ధతిలో ప్రపంచంలో ఏ మూలన ఉన్నా సరిగ్గా అతను ఉన్న లొకేషన్ ని చూడొచ్చు. దొంగకి తెలియకుండా మన ఫోన్ కెమెరా ఫొటోలు తీసి మనకు పంపించేలా చేయొచ్చు. ఇంత అద్భుతమైన టెక్నిక్ ని వెంటనే చూసేయండి ఈ క్రింది లింకులో..

http://goo.gl/7cHps

కొత్త డిజిటల్ కెమెరా కొనబోతున్నారా? ఖచ్చితంగా ఈ వీడియో చూడాల్సిందే!

ఎక్కువ మెగాపిక్సెల్స్ (MP) ఉంటే అది మంచి కెమెరా అని చాలామంది తప్పుడు అభిప్రాయం కలిగి ఉంటారు. డిజిటల్ కెమెరాలో మనం దృష్టి పెట్టవలసిన ముఖ్యమైన విషయాలు వేరే చాలా ఉన్నాయి. వాటి గురించి స్టడీ చేయకుండా వేలాది రూపాయలు పెట్టి కెమెరా కొంటే బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. ఆ ముఖ్యమైన అంశాలేమిటో ఈ వీడియోలో వివరిస్తున్నాం, చూడండి.

http://goo.gl/OpO5b

 

మీ నెట్ కనెక్షన్ ని పిసి, లాప్ టాప్, మొబైల్స్ కీ వైర్ లెస్ గా ఇలా షేర్ చేసుకోవచ్చు

మీరు BSNL, Airtel, Reliance, Beam Cable వంటి ఎలాంటి నెట్ కనెక్షన్ వాడుతున్నా ఆ నెట్ కనెక్షన్ ని ఎంత ఈజీగా వైర్ లెస్ రూటర్ ద్వారా మీ ఇంట్లో ఉన్న ఇతర కంప్యూటర్లకూ, లాప్ టాప్ కీ, మీ సెల్ ఫోన్ కీ షేర్ చేసుకోవచ్చో తెలుసా? చాలామందికి రూటర్ ని ఎలా వాడాలో తెలియదు, కొందరు రూటర్ గురించే విని ఉండరు. రూటర్ పై ఏమాత్రం నాలెడ్జ్ లేని వారికైనా మీ నెట్ కనెక్షన్ ని సులభంగా షేర్ చేయడం ఎలాగన్నది ఈ వీడియోలో చూపించాం.

http://goo.gl/azzkw

 

మందుల్ని ఎలాబడితే అలా మింగేయకండి.. మనం వాడే మెడిసిన్స్ వివరాలు ఇక్కడ..

గొంతునొప్పి వస్తే ఎరిథ్రోమైసిస్ అనీ, జ్వరం వస్తే పారాసిటమాల్ అనీ ఇష్టమొచ్చినట్లు వేసుకుంటూ ఉంటాం కదా! ప్రతీ టాబ్లెట్ కీ చాలా సైడ్ ఎఫెక్టులు ఉంటాయి,  కొన్ని మెడిసిన్స్ ని కొందరు వాడకూడదు, అలాగే ప్రతీ మెడిసిన్ కీ ఓ మోతాదు ఉంటుంది. ఈ వివరాలన్నీ డాక్టర్లు వాళ్ల బిజీ పనుల్లో మనకు చెప్పరు. అలాగని గుడ్డిగా ఇష్టమొచ్చినట్లు వేసుకుని ఇబ్బందులు పడడం సరైనది కాదు కదా! అందుకే ఈ వీడియోలో ప్రతీ టాబ్లెట్ / క్యాప్సూల్ ని ఎలా వాడాలో, సైడ్ ఎఫెక్టులు ఏమిటో వివరించే ఓ అద్భుతమైన వెబ్ సైట్ ని పరిచయం చేయడం జరిగింది, చూసేయండి మరి!

http://goo.gl/Hp6Cg

మీ కంప్యూటర్ ని స్పీడ్ గా మార్చుకునే కొన్ని మంచి టెక్నిక్స్..

నూటికి 95% మంది తమ పిసి స్లోగా పనిచేస్తోందనే కంప్లయింట్ చేస్తుంటారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని కంప్యూటర్ వేగంగా పనిచేసేలా ఎలాంటి మార్పులు చేసుకోవాలో ఈ వీడియోలో వివరంగా చూపించడం జరిగింది. ఇందులో చూపించిన కొన్ని టెక్నిక్స్ మీరూ ఫాలో అయితే మీ పిసి పనితీరులో వేగం ఖచ్చితంగా మీరే గమనిస్తారు.. క్రింది లింకులో చూడండి.

 

http://goo.gl/HCRN9

 

ఇలాంటి మరిన్ని వీడియోలను చూడడానికి ఈ క్రింది "కంప్యూటర్ ఎరా" అధికారిక వీడియో పోర్టల్ ని తరచూ విజిట్ చేస్తుండండి.

http://computerera.co.in

 

మేము కొత్త వీడియోని అప్ లోడ్ చేసిన వెంటనే మీకు Mail ద్వారా ఆ వివరాలు పంపబడాలంటే ఈ క్రింది లింక్ లో ఉచితంగా Subscribe చేసుకోండి. ఇప్పటికే 1423 మంది ఇలా Subscribe చేసుకున్నారు.

http://youtube.com/nallamothu

Search This Site:

About Me

1996వ సంవత్సరంలో తెలుగులో మొట్టమొదట కంప్యూటర్ సాహిత్యాన్ని ప్రారంభించే అవకాశం నాకు కలిగింది. అదే సమయంలో చెన్నైలో సూపర్ హిట్ తెలుగు ఫిల్మ్ మేగజైన్ కి సబ్ ఎడిటర్ గా కూడా ఏకకాలంలో పనిచేస్తూ 1998 వరకూ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, మనీషా కొయిరాలా, శంకర్, రజనీకాంత్, కమల్ హాసన్ వంటి ప్రముఖులెందరినో ఇంటర్వ్యూలు చేయడం మర్చిపోలేని అనుభవం. అయితే సినిమా రంగంలో ఉన్న అనారోగ్యకరమైన వాతావరణం వల్ల నాకంటూ ఓ ప్రత్యేకమైన ఉనికిని సృష్టించుకోవడం కోసం సినిమా రంగం నుండి బయటకు వచ్చి పూర్తిగా టెక్నాలజీ రంగంలో స్థిరపడడం జరిగింది. 96 నుండి 2001 వరకూ పలు కంప్యూటర్ పత్రికలకు ఎడిటర్ గా పనిచేసి.. 2001 నుండి "కంప్యూటర్ ఎరా" తెలుగు మంత్లీ మేగజైన్ ఎడిటర్ గా పత్రిక మొత్తాన్నీ రూపొందిస్తూ ఉన్నాను. అలాగే తెలుగు టెలివిజన్ ఛానెళ్లలో మొట్టమొదటి టెక్నికల్ phone-in ప్రోగ్రామ్ కి గెస్ట్ గా అటెండ్ అయ్యే అవకాశమూ 2010 జనవరి 20న కలిగింది. అప్పటి నుండి ఇప్పటివరకూ TV 9, ABN, I News, ETV2, NTV, Zee 24 గంటలు, Studio N, సాక్షి టివి, మహా టివి, జాగృతి న్యూస్ వంటి ఛానెళ్లలో 100కి పైగా లైవ్, రికార్డెడ్ ప్రోగ్రాముల్ని చేయడం జరిగింది. 2007లో అత్యుత్తమైన నాణ్యతతో కూడిన పోస్టులతో, వీడియోలతో తెలుగులో మొదటి ప్రొఫెషనల్ టెక్నికల్ బ్లాగ్ గానూ, మొదటి వీడియో బ్లాగ్ గానూ ఇప్పుడు మీరు చూస్తున్న బ్లాగ్ ప్రత్యేకతను సంతరించుకుంది. అలాగే 2007 జనవరి 1న ప్రారంభించిన తెలుగులోనే మొట్టమొదటి టెక్నికల్ ఫోరమ్ అయిన "కంప్యూటర్ ఎరా సాంకేతిక ఫోరమ్" 14 వేల మంది సభ్యులతో 10 వేలకు పైగా పోస్టులతో 2009 జూలై వరకూ నిర్వహించబడింది. దాంతోపాటే మొట్టమొదటి తెలుగు టెక్నికల్ ఛాట్ రూమ్ అయిన "కంప్యూటర్ ఎరా సాంకేతిక సహాయం" అనే ఛాట్ రూమ్ రెండేళ్లలో వేలాది మందికి తెలుగు టైప్ చేయడం మొదలుకుని అనేక కంప్యూటర్ సంబంధిత సాంకేతిక సమస్యలకు తక్షణ సహాయం అందించింది. ఇకపోతే http://youtube.com/nallamothu అనే ఛానెల్ లో 361కి పైగా ప్రొఫెషనల్ క్వాలిటీ తెలుగు టెక్నికల్ వీడియోలు అందించాను. ఈ ఛానెల్ కి 1704 మంది సబ్ స్కైబర్లు ఉన్నారు. అందుబాటులో ఉన్న వివిధ మార్గాల ద్వారా తెలుగు వారందరకీ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించే పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాను. My Contact Number: 9000239948 Mail ID: sridharcera@gmail.com

ఇక్కడ RSS Feedకి Subscribe చేసి నేరుగా పోస్ట్ లు పొందండి

ఆండ్రాయిడ్ లో పొందండి!

నా వీడియోలను మీ దగ్గర ఉన్న Android ఫోన్ లో పొందాలంటే ఈ క్రింది లింక్ ని మీ ఫోన్ బ్రౌజర్ లో ఓపెన్ చేసి వెంటనే వచ్చే అప్లికేషన్ ని ఇన్ స్టాల్ చేసుకోండి. అన్ని వీడియోలూ ఎంజాయ్ చేయండి. http://goo.gl/DqsA4

లేదా ఈ క్రింది QR Codeని మీ Android ఫోన్ లోని Barcode Scannerతో స్కాన్ చేస్తే నేరుగా అప్లికేషన్ డౌన్ లోడ్ పేజీకి వెళ్లవచ్చు. Image and video hosting by TinyPic