మార్చి 2012 "కంప్యూటర్ ఎరా" తెలుగు మాసపత్రిక ఫిబ్రవరి 26, 2012 నాటికి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ లభిస్తుంది. Subscription వంటి సర్క్యులేషన్ ఆఫీస్ సంబంధిత అంశాలకు 040-27673494 అనే నెంబర్ లో సంప్రదించవచ్చు.
95% మంది ఇంజనీరింగ్ స్టూడెంట్లు పాతకాలం Windows XPనే వాడుతుంటారు. అదేమంటే విండోస్ Vista, 7 ఆపరేటింగ్ సిస్టమ్ లలో C, C++ లు పనిచేయడం లేదని కంప్లయింట్లు చేస్తుంటారు.
Windows 7లో “C” పనిచేయడం లేదనేది ఓ కంప్యూటర్ ఇంజనీరింగ్ స్టూడెంట్ గా చేయాల్సిన కంప్లయింట్ కాదు. దానికి ఎన్నో సొల్యూషన్లు ఉన్నాయి. వాటన్నింటిలోకీ బెస్ట్ సొల్యూషన్ ని ఈ వీడియోలో పరిచయం చేస్తున్నాను.
మీరు ఎలాంటి సెట్టింగులూ మార్చుకోవలసిన పనిలేదు. సింపుల్ గా ఈ వీడియోలో చూపించినట్లు చేయండి చాలు.
ప్రతీ ఇంజనీరింగ్ విద్యార్థీ, బయట ఇనిస్టిట్యూట్ లలో C, C++ నేర్చుకునే ప్రతీ ఒక్కరూ ఖచ్చితంగా తెలుసుకోవలసిన టెక్నిక్ ఇది.
ఆ ఏముందిలే.. “XPనే వాడేస్తే సరిపోతుంది కదా..” అని సరిపెట్టుకున్నారంటే ఎప్పటికప్పుడు డైనమిక్ గా ఉండే కంప్యూటర్ రంగంలో రాణించడం చాలా కష్టం.
సో ఇప్పటికీ టెక్నికల్ గా వెనుకబాటుతనంలో ఉన్న ఎందరో విద్యార్థులకు ఉపయోగపడే ఈ వీడియోని వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేసి వారిని చైతన్యపరచగలరు.
మీ వెబ్ సైట్ లోనూ, బ్లాగ్ లోనూ మీకు ఈ వీడియో నచ్చితే రీపబ్లిష్ చేసుకోవచ్చు. మీ బ్లాగ్ లో కొత్త పోస్ట్ చేసేటప్పుడు HTML మోడ్ లో ఉండగా క్రింది లైన్ ని మీ పోస్ట్ లో add చేస్తే ఈ వీడియో వచ్చేస్తుంది.
జూలై 2010 నుండి ETV 2 సఖి కార్యక్రమంలో ధారావాహికగా ప్రసారం అవుతున్న నా సఖి.కామ్ ప్రోగ్రామ్ లో భాగంగా బేసిక్ ఫొటో ఎడిటింగ్ పై నిన్న (ఫిబ్రవరి 3, 2012) ప్రసారమైన ఎపిసోడ్ ని ఈ క్రింది వీడియోలో చూడవచ్చు
1. Forward బటన్ ఇకపై hiddenగా ఉంటుంది, కేవలం మనం ప్రస్తుతం ఉన్న పేజీ నుండి ముందు పేజీకి వెళ్లినప్పుడు మాత్రమే ఈ బటన్ కన్పిస్తుంది.
2. WebGL అనే వెబ్ ఆధారిత గ్రాఫిక్స్ లైబ్రరీకి Anti-Aliasing సదుపాయం కల్పించబడింది.
3. CSS3 3D -Tramsforms ఇకపై సపోర్ట్ చేయబడతాయి.
4. మనం తరచూ వాడే Google Docs వంటి పలు వెబ్ అప్లికేషన్లు కంప్యూటర్ స్క్రీన్ మొత్తాన్నీ ఆక్రమించే విధంగా రూపొందించడం కోసం Full Screen API సపోర్ట్ కల్పించబడింది.
5. కొత్త CSS Style Inspectorతో కంటెంట్ హైలైటింగ్ సదుపాయం కలిగిన Inspect tool వెబ్ డెవలపర్లకి బాగా ఉపయోగపడుతుంది.
ఇలా అనేక మార్పులు ఈ కొత్త వెర్షన్ లో చోటుచేసుకున్నాయి.
కొత్త వెర్షన్ Firefox బ్రౌజర్ యొక్క auto-update ద్వారా అందరికీ అందుబాటులోకి రావడానికి మరికొన్ని గంటల సమయం పడుతుంది.
ఫిబ్రవరి 2012 "కంప్యూటర్ ఎరా" తెలుగు మాసపత్రిక కవర్ పేజీ ఇది. పత్రిక కవర్ కోసం ఫొటో షూట్ లో పాల్గొన్న సినిమా నటి, యాంకర్ హాసిని గారికి ధన్యవాదాలు. ఎన్నో ఉపయోగపడే అంశాలతో రాష్ట్రవ్యాప్తంగా పుస్తకాల షాపుల్లో లభిస్తోందీ తాజా సంచిక. 040-27673494 అనే సర్క్యులేషన్ ఆఫీస్ నెంబర్ కి కాల్ చేసి రూ. 240 సంవత్సర చందా చెల్లించడం ద్వారా దేశంలో ఎక్కడికైనా పత్రికను నేరుగా మీ ఇంటికే తెప్పించుకోవచ్చు.
కొన్ని రోజుల క్రితం "Akash, Ubislate 7 వంటి నాసిరకం ఉత్పత్తులపై విపరీతమైన మోజు పెంచుకోవద్దు" అని చెబుతూ, కొన్ని నెలలు వేచి చూస్తే మంచి కంపెనీల, నాణ్యత, మంచి పనితీరు కలిగిన టాబ్లెట్లు చవక ధరలకే అందుబాటులోకి వస్తాయన్న దానికి ఉదాహరణగా HP Touch Pad 32 GB టాబ్లెట్ ని http://www.youtube.com/watch?v=NsNnzylHDGI అనే వీడియోలో చూపించాను.
ఈ టాబ్లెట్ ఆఫర్ లో 99 డాలర్లకు (అంటే 4 నెలల క్రితం అప్పటి ధర ప్రకారం రూ. 5,000 లోపు) లభించింది.
ఈ వీడియో పోస్ట్ చేసిన తర్వాత చాలామంది "అందులో Web OS మాత్రమే ఉంటుంది కదా, ఆండ్రాయిడ్ లేనప్పుడు వృధా కదా" అంటూ పెదవి విరిచారు.
ఒక మామూలు కంప్యూటర్ నే తీసుకుంటే దానిలో విండోస్, Linux ఇలా ఏ OS నైనా వేసుకోవచ్చు. అలాగే టాబ్లెట్లలోనూ మనకు నచ్చిన OSని వేసుకోవడానికి పద్ధతులు ఉంటాయి.
దీన్ని నిరూపించడానికే నేను పై వీడియోలో చూపించిన టాబ్లెట్ లో Android ఆపరేటింగ్ సిస్టమ్ ని వేసి, దాని ఫొటోలు ఇక్కడ అందిస్తున్నాను.
ఇకపోతే "HP కంపెనీ ఆ ప్రోడక్ట్ ని నిలిపివేసిందట", "ఇండియాలో దొరకట్లేదు" అంటూ సందేహాలు వ్యక్తం చేసిన వారికి నేను చెప్పదలుచుకున్నది ఒక్కటే.. నేను ఈ టాబ్లెట్ ని రివ్యూ చేసింది కేవలం "ఆకాష్, Ubislate 7లకు దేశీయ బ్రాండింగ్ పులిమి, సామర్థ్యానికి మించి నెత్తికి ఎక్కించుకుంటున్న ప్రభుత్వ ధోరణినీ, ప్రజల అవగాహనా లేమినీ" కొద్దిగా విజ్ఞులైన వారి దృష్టికి తెస్తూ.. కొన్నాళ్లు వేచి చూస్తే నేను వీడియోలో చూపించినటువంటి నాణ్యమైన టాబ్లెట్లు అతి చవక ధరలకే రావడం ఖాయం అన్నది తెలియజెప్పడానికి మాత్రమే.
గతంలో ఈ HP Touchpad 32 GB టాబ్లెట్ గురించి నేను చేసిన వీడియో రివ్యూని చూడలేకపోయిన వారు ఈ క్రింద దాన్ని చూడవచ్చు:
ధన్యవాదాలు.
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
1996వ సంవత్సరంలో తెలుగులో మొట్టమొదట కంప్యూటర్ సాహిత్యాన్ని ప్రారంభించే అవకాశం నాకు కలిగింది. అదే సమయంలో చెన్నైలో సూపర్ హిట్ తెలుగు ఫిల్మ్ మేగజైన్ కి సబ్ ఎడిటర్ గా కూడా ఏకకాలంలో పనిచేస్తూ 1998 వరకూ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, మనీషా కొయిరాలా, శంకర్, రజనీకాంత్, కమల్ హాసన్ వంటి ప్రముఖులెందరినో ఇంటర్వ్యూలు చేయడం మర్చిపోలేని అనుభవం. అయితే సినిమా రంగంలో ఉన్న అనారోగ్యకరమైన వాతావరణం వల్ల నాకంటూ ఓ ప్రత్యేకమైన ఉనికిని సృష్టించుకోవడం కోసం సినిమా రంగం నుండి బయటకు వచ్చి పూర్తిగా టెక్నాలజీ రంగంలో స్థిరపడడం జరిగింది. 96 నుండి 2001 వరకూ పలు కంప్యూటర్ పత్రికలకు ఎడిటర్ గా పనిచేసి.. 2001 నుండి "కంప్యూటర్ ఎరా" తెలుగు మంత్లీ మేగజైన్ ఎడిటర్ గా పత్రిక మొత్తాన్నీ రూపొందిస్తూ ఉన్నాను. అలాగే తెలుగు టెలివిజన్ ఛానెళ్లలో మొట్టమొదటి టెక్నికల్ phone-in ప్రోగ్రామ్ కి గెస్ట్ గా అటెండ్ అయ్యే అవకాశమూ 2010 జనవరి 20న కలిగింది. అప్పటి నుండి ఇప్పటివరకూ TV 9, ABN, I News, ETV2, NTV, Zee 24 గంటలు, Studio N, సాక్షి టివి, మహా టివి, జాగృతి న్యూస్ వంటి ఛానెళ్లలో 100కి పైగా లైవ్, రికార్డెడ్ ప్రోగ్రాముల్ని చేయడం జరిగింది. 2007లో అత్యుత్తమైన నాణ్యతతో కూడిన పోస్టులతో, వీడియోలతో తెలుగులో మొదటి ప్రొఫెషనల్ టెక్నికల్ బ్లాగ్ గానూ, మొదటి వీడియో బ్లాగ్ గానూ ఇప్పుడు మీరు చూస్తున్న బ్లాగ్ ప్రత్యేకతను సంతరించుకుంది. అలాగే 2007 జనవరి 1న ప్రారంభించిన తెలుగులోనే మొట్టమొదటి టెక్నికల్ ఫోరమ్ అయిన "కంప్యూటర్ ఎరా సాంకేతిక ఫోరమ్" 14 వేల మంది సభ్యులతో 10 వేలకు పైగా పోస్టులతో 2009 జూలై వరకూ నిర్వహించబడింది. దాంతోపాటే మొట్టమొదటి తెలుగు టెక్నికల్ ఛాట్ రూమ్ అయిన "కంప్యూటర్ ఎరా సాంకేతిక సహాయం" అనే ఛాట్ రూమ్ రెండేళ్లలో వేలాది మందికి తెలుగు టైప్ చేయడం మొదలుకుని అనేక కంప్యూటర్ సంబంధిత సాంకేతిక సమస్యలకు తక్షణ సహాయం అందించింది. ఇకపోతే http://youtube.com/nallamothu అనే ఛానెల్ లో 361కి పైగా ప్రొఫెషనల్ క్వాలిటీ తెలుగు టెక్నికల్ వీడియోలు అందించాను. ఈ ఛానెల్ కి 1704 మంది సబ్ స్కైబర్లు ఉన్నారు. అందుబాటులో ఉన్న వివిధ మార్గాల ద్వారా తెలుగు వారందరకీ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించే పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాను.
My Contact Number: 9000239948
Mail ID: sridharcera@gmail.com
మార్చి 2012 "కంప్యూటర్ ఎరా" తెలుగు మాసపత్రిక ఫిబ్రవరి 26, 2012 నాటికి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ లభిస్తుంది. Subscription వంటి సర్క్యులేషన్ ఆఫీస్ సంబంధిత అంశాలకు 040-27673494 అనే నెంబర్ లో సంప్రదించవచ్చు.
కంప్యూటర్ కావచ్చు.. లాప్ టాప్ కావచ్చు.. గంటల తరబడి వాడుతున్నప్పుడు కరెంట్ బిల్లులు తడిసి మోపెడు రావడం సహజం. అసలే వేసవి వస్తోంది. కరెంట్ ఖర్చు తగ్గించుకునే మార్గాలు చూడాలి కదా! మీ కంప్యూటర్లో ఏయే అంశాలు ఎక్కువ విద్యుత్ ని వినియోగించుకుంటున్నాయో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటో విద్యుత్ వినియోగాన్ని తగ్గించుకోవచ్చో విండోస్ చేతే సజెషన్లు పొందాలంటే ఈ వీడియోలో చూపించిన టెక్నిక్ ని ఫాలో అయిపొండి. మీ పవర్ బిల్లులు తగ్గుతాయి. మీ వెబ్ సైట్ [...]
జూలై 2010 నుండి ETV2లో సఖి.కామ్ పేరుతో ప్రసారం అవుతున్న నా టెక్నాలజీ సంబంధిత ప్రోగ్రామ్ లో భాగంగా నిన్న (ఫిబ్రవరి 15, 2012)న ప్రసారమైన ప్రోగ్రామ్ ని చూడడం మిస్ అయిన వారు ఈ క్రింద చూడవచ్చు. మీ వెబ్ సైట్ లోనూ, బ్లాగ్ లోనూ మీకు ఈ వీడియో నచ్చితే రీపబ్లిష్ చేసుకోవచ్చు. మీ బ్లాగ్ లో కొత్త పోస్ట్ చేసేటప్పుడు HTML మోడ్ లో ఉండగా క్రింది లైన్ ని మీ పోస్ట్ [...]
కంప్యూటర్ ని వాడేటప్పుడు వేర్వేరు పనులు చేయడానికి వేర్వేరు చోట్లకి కష్టపడి వెళ్లనవసరం లేదు. హ్యాంగ్ అయిన అప్లికేషన్లనీ అక్కడి నుండే క్లోజ్ చేసుకోవచ్చు.. మీ దగ్గరున్న ఫొటోల్నీ ఒక ఫార్మేట్ నుండి మరో ఫార్మేట్ కి అదేచోట మార్చుకోవచ్చు.. ఒక పదాన్ని కేవలం గూగుల్ తో సరిపెట్టుకోకుండా అనేక చోట్ల అక్కడికక్కడే వెదుక్కోవచ్చు.. ట్రాన్స్ లేషన్, కంప్యూటర్ పనితీరు వివరాలు చూడడం, మనం తరచూ వాడే వెబ్ సైట్లకి షార్ట్ కట్ లు పెట్టుకోవడం.. ఇలా [...]
95% మంది ఇంజనీరింగ్ స్టూడెంట్లు పాతకాలం Windows XPనే వాడుతుంటారు. అదేమంటే విండోస్ Vista, 7 ఆపరేటింగ్ సిస్టమ్ లలో C, C++ లు పనిచేయడం లేదని కంప్లయింట్లు చేస్తుంటారు. Windows 7లో “C” పనిచేయడం లేదనేది ఓ కంప్యూటర్ ఇంజనీరింగ్ స్టూడెంట్ గా చేయాల్సిన కంప్లయింట్ కాదు. దానికి ఎన్నో సొల్యూషన్లు ఉన్నాయి. వాటన్నింటిలోకీ బెస్ట్ సొల్యూషన్ ని ఈ వీడియోలో పరిచయం చేస్తున్నాను. మీరు ఎలాంటి సెట్టింగులూ మార్చుకోవలసిన పనిలేదు. సింపుల్ గా ఈ [...]
ఉన్న ఫళాన బ్లూ స్క్రీన్ వచ్చి కంప్యూటర్ రీస్టార్ట్ అయిపోవడం అనుభవమే. మనందరం దీని బాధితులమే. కానీ కారణాలూ, పరిష్కారాలూ మాత్రం తెలుసుకోం. ప్రతీ చిన్న దానికీ ఎవరి మీదనో ఆధారపడే కన్నా అస్సలు ఇలాంటి ఇబ్బందులు ఎందుకు వస్తాయో కారణాలూ, పరిష్కారాలూ తెలుసుకుంటే అంతా మన కంట్రోల్ లో ఉంటుంది కదా? ప్రతీ కంప్యూటర్ యూజర్ తప్పనిసరిగా చూడాల్సిన వీడియో ఇది.. వీడియో చూశాక ఆ విషయం మీకు అర్థమవుతుంది. ఈ వీడియోని మీ మిత్రులకూ [...]
తాజా ఆడోబ్ ఫొటోషాప్ CS 6 వెర్షన్ జూన్ 2012 లోపు అందుబాటులోకి… ఫొటోలను ఎడిట్ చేసేటప్పుడు కళ్లు వత్తిడికి గురికాకుండా మునుపటి వెర్షన్లకు భిన్నంగా పై చిత్రంలోని విధంగా పూర్తి డార్క్ ఇంటర్ ఫేస్ తో, సరికొత్త సదుపాయాలతో అడోబ్ ఫొటోషాప్ CS 6 వెర్షన్ జూన్ 2012 లోపు విడుదల కానుంది. "కంప్యూటర్ ఎరా" పాఠకులూ, మిత్రుల కోసం ఫొటోషాప్ CS 6 ఇంటర్ ఫేస్ ని ఈ చిత్రంలో చూపిస్తున్నాను. ఈ వెర్షన్ [...]
ఇక్కడ RSS Feedకి Subscribe చేసి నేరుగా పోస్ట్ లు పొందండి
నా వీడియోలను మీ దగ్గర ఉన్న Android ఫోన్ లో పొందాలంటే ఈ క్రింది లింక్ ని మీ ఫోన్ బ్రౌజర్ లో ఓపెన్ చేసి వెంటనే వచ్చే అప్లికేషన్ ని ఇన్ స్టాల్ చేసుకోండి. అన్ని వీడియోలూ ఎంజాయ్ చేయండి.
http://goo.gl/DqsA4
లేదా ఈ క్రింది QR Codeని మీ Android ఫోన్ లోని Barcode Scannerతో స్కాన్ చేస్తే నేరుగా అప్లికేషన్ డౌన్ లోడ్ పేజీకి వెళ్లవచ్చు.
Recent Comments:
Beri.Viswanath: Good evening sir! munduga meeku chala krutagnatalu, chala manchi manchi vishayalu teliyajestunnaru, many many thanks, aite telugu lo type gurchi meeru...
muralidhar: sorry. i got it. it was my browser problem.
thanks anyway....
muralidhar: sridhar garu, video link ledu. okasaari check cheyyagalaru. thanks
murali...
sivakrishna: mee last video chusina, bagundi, kani ee techniuque evarikina munde telisivunte ,permession changechese files ni delete cheyyochu kada(this ismy ooubt...
వేణు: శ్రీధర్ గారూ, ఉపయోగపడే సమాచారం సరళంగా అర్థమయ్యేలా అందించారు. థాంక్యూ....