Home » ట్రబుల్ షూటింగ్ » Recent Articles:

మీ కంప్యూటర్లో విద్యుత్ ని ఎక్కువ వాడుకుంటున్న అంశాలేమిటి?

కంప్యూటర్ కావచ్చు.. లాప్ టాప్ కావచ్చు.. గంటల తరబడి వాడుతున్నప్పుడు కరెంట్ బిల్లులు తడిసి మోపెడు రావడం సహజం. అసలే వేసవి వస్తోంది. కరెంట్ ఖర్చు తగ్గించుకునే మార్గాలు చూడాలి కదా!

మీ కంప్యూటర్లో ఏయే అంశాలు ఎక్కువ విద్యుత్ ని వినియోగించుకుంటున్నాయో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటో విద్యుత్ వినియోగాన్ని తగ్గించుకోవచ్చో విండోస్ చేతే సజెషన్లు పొందాలంటే ఈ వీడియోలో చూపించిన టెక్నిక్ ని ఫాలో అయిపొండి. మీ పవర్ బిల్లులు తగ్గుతాయి.

మీ వెబ్ సైట్ లోనూ, బ్లాగ్ లోనూ మీకు ఈ వీడియో నచ్చితే రీపబ్లిష్ చేసుకోవచ్చు. మీ బ్లాగ్ లో కొత్త పోస్ట్ చేసేటప్పుడు HTML మోడ్ లో ఉండగా క్రింది లైన్ ని మీ పోస్ట్ లో add చేస్తే ఈ వీడియో వచ్చేస్తుంది.

<iframe width="560" height="315" src="http://www.youtube.com/embed/hWl4wlVezwk" frameborder="0" allowfullscreen></iframe>

 

 

 

Windows 7, Vistaలలో “C” లాంగ్వేజ్ ఇలా బ్రహ్మాంఢంగా పనిచేస్తుంది..

95% మంది ఇంజనీరింగ్ స్టూడెంట్లు పాతకాలం Windows XPనే వాడుతుంటారు. అదేమంటే విండోస్ Vista, 7 ఆపరేటింగ్ సిస్టమ్ లలో C, C++ లు పనిచేయడం లేదని కంప్లయింట్లు చేస్తుంటారు.

Windows 7లో “C” పనిచేయడం లేదనేది ఓ కంప్యూటర్ ఇంజనీరింగ్ స్టూడెంట్ గా చేయాల్సిన కంప్లయింట్ కాదు. దానికి ఎన్నో సొల్యూషన్లు ఉన్నాయి. వాటన్నింటిలోకీ బెస్ట్ సొల్యూషన్ ని ఈ వీడియోలో పరిచయం చేస్తున్నాను.

మీరు ఎలాంటి సెట్టింగులూ మార్చుకోవలసిన పనిలేదు. సింపుల్ గా ఈ వీడియోలో చూపించినట్లు చేయండి చాలు.

ప్రతీ ఇంజనీరింగ్ విద్యార్థీ, బయట ఇనిస్టిట్యూట్ లలో C, C++ నేర్చుకునే ప్రతీ ఒక్కరూ ఖచ్చితంగా తెలుసుకోవలసిన టెక్నిక్ ఇది.

ఆ ఏముందిలే.. “XPనే వాడేస్తే సరిపోతుంది కదా..” అని సరిపెట్టుకున్నారంటే ఎప్పటికప్పుడు డైనమిక్ గా ఉండే కంప్యూటర్ రంగంలో రాణించడం చాలా కష్టం.

సో ఇప్పటికీ టెక్నికల్ గా వెనుకబాటుతనంలో ఉన్న ఎందరో విద్యార్థులకు ఉపయోగపడే ఈ వీడియోని వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేసి వారిని చైతన్యపరచగలరు.

http://bit.ly/sriCLang

మీ వెబ్ సైట్ లోనూ, బ్లాగ్ లోనూ మీకు ఈ వీడియో నచ్చితే రీపబ్లిష్ చేసుకోవచ్చు. మీ బ్లాగ్ లో కొత్త పోస్ట్ చేసేటప్పుడు HTML మోడ్ లో ఉండగా క్రింది లైన్ ని మీ పోస్ట్ లో add చేస్తే ఈ వీడియో వచ్చేస్తుంది.

<iframe width="560" height="315" src="http://www.youtube.com/embed/4hnnqgx_tjk" frameborder="0" allowfullscreen></iframe>

 

 

 

బ్లూ టెర్రర్ – Must Watch

ఉన్న ఫళాన బ్లూ స్క్రీన్ వచ్చి కంప్యూటర్ రీస్టార్ట్ అయిపోవడం అనుభవమే.

మనందరం దీని బాధితులమే. కానీ కారణాలూ, పరిష్కారాలూ మాత్రం తెలుసుకోం. ప్రతీ చిన్న దానికీ ఎవరి మీదనో ఆధారపడే కన్నా అస్సలు ఇలాంటి ఇబ్బందులు ఎందుకు వస్తాయో కారణాలూ, పరిష్కారాలూ తెలుసుకుంటే అంతా మన కంట్రోల్ లో ఉంటుంది కదా?

ప్రతీ కంప్యూటర్ యూజర్ తప్పనిసరిగా చూడాల్సిన వీడియో ఇది.. వీడియో చూశాక ఆ విషయం మీకు అర్థమవుతుంది.  ఈ వీడియోని మీ మిత్రులకూ షేర్ చేయడం ద్వారా వారూ నాలెడ్జ్ పొందేలా చూడగలరు.

మీ వెబ్ సైట్ లోనూ, బ్లాగ్ లోనూ మీకు ఈ వీడియో నచ్చితే రీపబ్లిష్ చేసుకోవచ్చు. మీ బ్లాగ్ లో కొత్త పోస్ట్ చేసేటప్పుడు HTML మోడ్ లో ఉండగా క్రింది లైన్ ని మీ పోస్ట్ లో add చేస్తే ఈ వీడియో వచ్చేస్తుంది.

<iframe width="560" height="315" src="http://www.youtube.com/embed/M9tA-RD0bGU" frameborder="0" allowfullscreen></iframe>

 

 

 

అమ్మో.. డేటా డిలీట్ చేస్తారేమో..! (వీడియో డెమో)

చిన్న పిల్లలకో, అపరిచితులకో కంప్యూటర్ వదిలి వెళ్లాలంటే ఎవరైనా భయపడతారు కదా?

కంప్యూటర్లో ఉన్న అతి ముఖ్యమైన ఫైళ్లని, ఫోల్డర్లని వారెక్కడ పొరబాటునో/కావాలనో డిలీట్ చేస్తారేమోనన్నదే ఈ భయానికి కారణం.

ఒక్కోసారి మనమూ ఏదో ఆలోచిస్తూ ముఖ్యమైన ఫోల్డర్లని ఉన్న ఫళాన డిలీట్ చేసి పారేస్తుంటాం కూడా!

మన డేటా అంత ముఖ్యమైనదని భావించేటప్పుడు.. ఎవరూ ఆ డేటాని డిలీట్ చేయడానికి లేకుండా కాపాడుకుంటే గొడవ వదిలిపోతుంది కదా? ఎంచక్కా ఎవరికైనా పిసిని అలా వదిలేసి వెళ్లిపోవచ్చు.

మన కంప్యూటర్లోని ముఖ్యమైన ఫైళ్లని, ఫోల్డర్లని పొరబాటున కూడా ఎవరూ డిలీట్ చేయకుండా రక్షించుకోవడం ఎలాగో ఈ వీడియోలో చూపించాను.

ప్రతీ ఒక్కరికీ ఎంతో ఉపయోగపడే ఈ టెక్నిక్ ని మీ ఫ్రెండ్స్ కీ షేర్ చేయడం ద్వారా వారూ ఈ నాలెడ్జ్ పొందేలా చూడగలరు.

మీ వెబ్ సైట్ లోనూ, బ్లాగ్ లోనూ మీకు ఈ వీడియో నచ్చితే రీపబ్లిష్ చేసుకోవచ్చు. మీ బ్లాగ్ లో కొత్త పోస్ట్ చేసేటప్పుడు HTML మోడ్ లో ఉండగా క్రింది లైన్ ని మీ పోస్ట్ లో add చేస్తే ఈ వీడియో వచ్చేస్తుంది.

<iframe width="560" height="315" src="http://www.youtube.com/embed/jyk9KsG7ZT0" frameborder="0" allowfullscreen></iframe>

 

 

 

కంప్యూటర్ ని వేగం చేసుకోవడానికి అద్భుతమైన మార్గం

ఎక్కువ ఖరీదైన కంప్యూటర్ కొంటే బాగా స్పీడ్ గా పనిచేస్తుందని అనుకుంటాం. కానీ ఏ కంప్యూటర్ అయినా ఆన్ చేసిన తర్వాత డెస్క్ టాప్ రావడానికి ఒకటిన్నర, రెండు నిమిషాలు పట్టక తప్పట్లేదు.

ఆన్ చేశాక డెస్క్ టాప్ వచ్చేవరకూ అలాగే స్క్రీన్ వైపు చూడడం ఎంత నరకమో ఆలోచించండి.

పిసిలు ఎందుకంత నత్తనడక నడుస్తున్నాయి? ఆన్ చేసిన వెంటనే ఏది లోడ్ అవడానికి ఎంత టైమ్ పడుతోందో తెలుసుకుంటే సగం ప్రాబ్లెం సాల్వ్ అవుతుంది కదా!

నా విషయానికే వస్తే ఈ వీడియోలో నేను చూపించిన టెక్నిక్ తో ఏది ఎక్కువ టైమ్ తీసుకుంటోందో తెలుసుకుని 3 నిమిషాల నుండి 1.30 నిమిషాలకు డెస్క్ టాప్ వచ్చేలా నా పిసి పనితీరుని మెరుగుపరుచుకున్నాను.

సో మీరూ ఈ వీడియో చూసి మీ కంప్యూటర్ ని మరింత వేగం చేసుకోండి.

ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ కీ share చేయడం ద్వారా వారూ మరంత నాలెడ్జ్ పొందేలా చూడండి.

మీ వెబ్ సైట్ లోనూ, బ్లాగ్ లోనూ మీకు ఈ వీడియో నచ్చితే రీపబ్లిష్ చేసుకోవచ్చు. మీ బ్లాగ్ లో కొత్త పోస్ట్ చేసేటప్పుడు HTML మోడ్ లో ఉండగా క్రింది లైన్ ని మీ పోస్ట్ లో add చేస్తే ఈ వీడియో వచ్చేస్తుంది.

<iframe width="560" height="315" src="http://www.youtube.com/embed/qbJVEcLf4mQ" frameborder="0" allowfullscreen></iframe>

 

 

 

ముఖ్యమైన ఫైల్ కరప్ట్ అయిందా? కారణాలు ఇవి.. Must Watch

ఆ ఒక్క ఫైల్ లో మీ జీవితం ముడిపడి ఉందనుకుందాం.. లేదా ఎన్నో గంటలు కష్టపడి ఆ ఫైల్ ని తయారు చేసుకున్నారనుకుందాం.

ఓ ఫైన్ మార్నింగ్ అవసరం పడి ఆ ఫైల్ ని ఓపెన్ చేయబోతే File Corrupted.. మాదిరి మెసేజ్ వస్తే ఎంత బాధగా ఉంటుంది? ఇప్పటివరకూ మీకు ఇలాంటి సమస్యలేమీ రాకపోయినా మున్ముందు ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోపోతే ఫైళ్లు కరప్ట్ అవడం చాలా మామూలు విషయం.

అది మీ రెజ్యూమ్ కావచ్చు, ఫొటో కావచ్చు, నెట్ నుండి డౌన్ లోడ్ చేసుకున్న ఫైల్ కావచ్చు.. ఎందుకు కరప్ట్ అవుతుంది అన్నది చాలా వివరంగా ఈ వీడియోలో చెప్పడం జరిగింది. ఈ వీడియో చూస్తే File corruptionపై మీకు పూర్తి అవగాహన ఏర్పడుతుంది. ఇకపై జాగ్రత్తగా ఉండొచ్చు.

మీ వెబ్ సైట్ లోనూ, బ్లాగ్ లోనూ మీకు ఈ వీడియో నచ్చితే రీపబ్లిష్ చేసుకోవచ్చు. మీ బ్లాగ్ లో కొత్త పోస్ట్ చేసేటప్పుడు HTML మోడ్ లో ఉండగా క్రింది లైన్ ని మీ పోస్ట్ లో add చేస్తే ఈ వీడియో వచ్చేస్తుంది.

<iframe width="560" height="315" frameborder="0" allowfullscreen="" src="http://www.youtube.com/embed/ip6bOy0xKjQ"></iframe></p>

 

 

మీ హార్డ్ డిస్క్ ఎప్పుడైనా ఫెయిలైపోవచ్చు.. నమ్మలేకపోతున్నారా? ఇది చూడండి

ఉన్న ఫళాన హార్డ్ డిస్క్ dead అయిపోతే అందులో మీరు ఎంతో కష్టపడి సేవ్ చేసుకున్న ఫైళ్లూ, డేటా అంతా ఏమైపోవాలి? ఆలోచించండి. “హార్డ్ డిస్క్ ఎందుకు ఫెయిలవుతుందిలే” అని ధీమాగా ఉండకండి.

ఇక్కడ నా 3 హార్డ్ డిస్కులలో ఒకటి ఫెయిల్ అవడానికి ఎంత దగ్గరగా ఉందో ఈ వీడియోలో చూస్తే మీరు ఇంకే మాత్రం ఆలస్యం చెయ్యరు.

C, D, E, F వంటి అన్ని డ్రైవ్ లూ ఉండే మీ హార్డ్ డిస్క్ పూర్తిగా పనిచేయకుండా ఆగిపోకముందే ఈ వీడియోలో నేను చూపించిన పద్ధతిలో వాటి హెల్త్ కండిషన్ తెలుసుకుని డేటా బ్యాకప్ తీసుకోండి.

మీ వెబ్ సైట్ లోనూ, బ్లాగ్ లోనూ మీకు ఈ వీడియో నచ్చితే రీపబ్లిష్ చేసుకోవచ్చు. మీ బ్లాగ్ లో కొత్త పోస్ట్ చేసేటప్పుడు HTML మోడ్ లో ఉండగా క్రింది లైన్ ని మీ పోస్ట్ లో add చేస్తే ఈ వీడియో వచ్చేస్తుంది.

<iframe width="560" height="315" src="http://www.youtube.com/embed/_E0yjj0Ys74" frameborder="0" allowfullscreen></iframe>

 

 

 

ఇప్పటికీ విండోస్ ఇన్ స్టాల్ చేయడం మీకు రాదా? ఇతరులపై ఆధారపడుతున్నారా? ఇక్కడ నేర్చుకోండి

కంప్యూటర్ స్లో అవడం వల్లనో, వైరస్ వల్లనో చీటికీ మాటికీ విండోస్ ని ఫ్రెష్ గా ఇన్ స్టాల్ చేయవలసి వస్తే.. దాని కోసం ప్రతీసారీ ఇంట్లో ఉన్న చదువుకున్న పిల్లల మీదనో, ఆ చదువుకున్న పిల్లలకు తెలియకపోతే హార్డ్ వేర్ టెక్నీషియన్ ని వెదికి 200, 300 సమర్పించుకుని ఇన్ స్టాల్ చేయించుకోవడం ఎంత ఇబ్బందో ఆలోచించండి.

విండోస్ ని ఇన్ స్టాల్ చేయడం అన్నది చాలా చాలా చిన్న విషయం.

ఎంత చిన్న విషయమో ఈ వీడియోలో నేను ప్రాక్టికల్ గా ప్రతీ స్టెప్ నీ చూపిస్తున్నాను, ఈ వీడియో చూశారంటే ఇక ఎవరి సహాయం మీరు తీసుకోరు, మీకు మీరే విండోస్ ని install చేసుకోగలుగుతారు.

 

మీ వెబ్ సైట్ లోనూ, బ్లాగ్ లోనూ మీకు ఈ వీడియో నచ్చితే రీపబ్లిష్ చేసుకోవచ్చు. మీ బ్లాగ్ లో కొత్త పోస్ట్ చేసేటప్పుడు HTML మోడ్ లో ఉండగా క్రింది లైన్ ని మీ పోస్ట్ లో add చేస్తే ఈ వీడియో వచ్చేస్తుంది.

<iframe width="560" height="315" src="http://www.youtube.com/embed/3sxSHC_Rd_A" frameborder="0" allowfullscreen></iframe>

 

 

 

కొన్ని వెబ్ సైట్లు మీ కంప్యూటర్లో ఓపెన్ అవకుండా బ్లాక్ చేసుకోవాలనుకుంటున్నారా? ఇలా చేయండి..

కొన్ని కారణాల వల్ల మనం కొన్ని వెబ్ సైట్లు మన కంప్యూటర్లో ఓపెన్ అవకుండా నిలిపివేయాలనుకోవచ్చు. అయితే ఇలా బ్లాక్ చేయడం ఎలాగో తెలియక చాలామంది హోమ్ పిసి యూజర్లు తంటాలు పడుతుంటారు. ఇదంత కష్టమైన విషయమేమీ కాదు. ఈ వీడియో చూశారంటే 5 నిముషాల్లో మీరు మీ కంప్యూటర్లోనూ అవసరం లేని వెబ్ సైట్లు ఇకపై లోడ్ అవకుండా బ్లాక్ చేయగలుగుతారు.

ముఖ్యంగా చిన్న పిల్లలు గంటల తరబడి ఆన్ లైన్ గేమ్ లకు అతుక్కుపోతుంటే, లేదా సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలోనూ, ఛాటింగ్ లోనూ కాలం గడుపుతుంటే ఈ వీడియోలో నేను చూపించిన టెక్నిక్ బాగా ఉపయోగపడుతుంది. స్పీకర్లు ఆన్ చేసుకుని వింటూ చూసేయండి మరి.

నల్లమోతు శ్రీధర్

 ఈ వీడియోని మీ మిత్రులతో పంచుకోవాలంటే ఈ లింకుని వారికి పంపించండి:  http://goo.gl/ey7O7

మీ వెబ్ సైట్ లోనూ, బ్లాగ్ లోనూ మీకు ఈ వీడియో నచ్చితే రీపబ్లిష్ చేసుకోవచ్చు. మీ బ్లాగ్ లో కొత్త పోస్ట్ చేసేటప్పుడు HTML మోడ్ లో ఉండగా క్రింది లైన్ ని మీ పోస్ట్ లో add చేస్తే ఈ వీడియో వచ్చేస్తుంది.

<iframe width="560" height="315" src="http://www.youtube.com/embed/bMfgV3hLbJg" frameborder="0" allowfullscreen></iframe>

 

 

 

మీకు తెలియకుండానే మీ పిసిలో అత్యంత ప్రమాదకరమైన రూట్ కిట్ లు ఉండొచ్చు (వీడియో డెమో)

ఒక సగటు కంప్యూటర్ యూజర్ భద్రత మీద చాలా తక్కువ దృష్టి పెడుతూ ఉంటారు. కంప్యూటర్లో మనకు తెలియకుండానే ఎన్ని ప్రమాదాలు జరిగిపోతున్నా గమనించకపోవడం అన్నది ఎంత దారుణమైన పరిస్థితో ఆలోచించండి.

అందరూ వైరస్ అనే పదాన్ని వింటూనే ఉంటారు కానీ అంతకన్నా rootkitలు మరింత ప్రమాదకరమైనవి, అస్సలు అవి కొన్ని ఉన్నాయని తెలుసుకోరు. అలాగే కీజెన్ లు, ప్యాచ్ లూ, లోడర్ల ద్వారా పైరేటెడ్ సాఫ్ట్ వేర్ వాడుతూ కూడా.. తమ ఏంటీవైరస్ సాఫ్ట్ వేర్ వాటిలో వైరస్ చూపించడం లేదు కాబట్టి అవన్నీ క్లీన్ గా ఉంటాయని నమ్ముతూ ఉంటారు. ఈ నేపధ్యంలో కీజెన్ ల వంటి వాటని క్రిప్ట్ చేసి మన పిసిలో ఎలా ప్రవేశపెడతారు వంటి విషయాల్నీ ఈ వీడియోలో ప్రస్తావించాను. స్పీకర్లు ఆన్ చేసుకుని వింటూ చూడండి.

- నల్లమోతు శ్రీధర్

 ఈ వీడియోని మీ మిత్రులతో పంచుకోవాలంటే ఈ లింకుని వారికి పంపించండి:  http://goo.gl/IL1IZ

మీ వెబ్ సైట్ లోనూ, బ్లాగ్ లోనూ మీకు ఈ వీడియో నచ్చితే రీపబ్లిష్ చేసుకోవచ్చు. మీ బ్లాగ్ లో కొత్త పోస్ట్ చేసేటప్పుడు HTML మోడ్ లో ఉండగా క్రింది లైన్ ని మీ పోస్ట్ లో add చేస్తే ఈ వీడియో వచ్చేస్తుంది.

<iframe width="560" height="315" src="http://www.youtube.com/embed/AWCq-psD8N4" frameborder="0" allowfullscreen></iframe>

 

 

 

Search This Site:

About Me

1996వ సంవత్సరంలో తెలుగులో మొట్టమొదట కంప్యూటర్ సాహిత్యాన్ని ప్రారంభించే అవకాశం నాకు కలిగింది. అదే సమయంలో చెన్నైలో సూపర్ హిట్ తెలుగు ఫిల్మ్ మేగజైన్ కి సబ్ ఎడిటర్ గా కూడా ఏకకాలంలో పనిచేస్తూ 1998 వరకూ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, మనీషా కొయిరాలా, శంకర్, రజనీకాంత్, కమల్ హాసన్ వంటి ప్రముఖులెందరినో ఇంటర్వ్యూలు చేయడం మర్చిపోలేని అనుభవం. అయితే సినిమా రంగంలో ఉన్న అనారోగ్యకరమైన వాతావరణం వల్ల నాకంటూ ఓ ప్రత్యేకమైన ఉనికిని సృష్టించుకోవడం కోసం సినిమా రంగం నుండి బయటకు వచ్చి పూర్తిగా టెక్నాలజీ రంగంలో స్థిరపడడం జరిగింది. 96 నుండి 2001 వరకూ పలు కంప్యూటర్ పత్రికలకు ఎడిటర్ గా పనిచేసి.. 2001 నుండి "కంప్యూటర్ ఎరా" తెలుగు మంత్లీ మేగజైన్ ఎడిటర్ గా పత్రిక మొత్తాన్నీ రూపొందిస్తూ ఉన్నాను. అలాగే తెలుగు టెలివిజన్ ఛానెళ్లలో మొట్టమొదటి టెక్నికల్ phone-in ప్రోగ్రామ్ కి గెస్ట్ గా అటెండ్ అయ్యే అవకాశమూ 2010 జనవరి 20న కలిగింది. అప్పటి నుండి ఇప్పటివరకూ TV 9, ABN, I News, ETV2, NTV, Zee 24 గంటలు, Studio N, సాక్షి టివి, మహా టివి, జాగృతి న్యూస్ వంటి ఛానెళ్లలో 100కి పైగా లైవ్, రికార్డెడ్ ప్రోగ్రాముల్ని చేయడం జరిగింది. 2007లో అత్యుత్తమైన నాణ్యతతో కూడిన పోస్టులతో, వీడియోలతో తెలుగులో మొదటి ప్రొఫెషనల్ టెక్నికల్ బ్లాగ్ గానూ, మొదటి వీడియో బ్లాగ్ గానూ ఇప్పుడు మీరు చూస్తున్న బ్లాగ్ ప్రత్యేకతను సంతరించుకుంది. అలాగే 2007 జనవరి 1న ప్రారంభించిన తెలుగులోనే మొట్టమొదటి టెక్నికల్ ఫోరమ్ అయిన "కంప్యూటర్ ఎరా సాంకేతిక ఫోరమ్" 14 వేల మంది సభ్యులతో 10 వేలకు పైగా పోస్టులతో 2009 జూలై వరకూ నిర్వహించబడింది. దాంతోపాటే మొట్టమొదటి తెలుగు టెక్నికల్ ఛాట్ రూమ్ అయిన "కంప్యూటర్ ఎరా సాంకేతిక సహాయం" అనే ఛాట్ రూమ్ రెండేళ్లలో వేలాది మందికి తెలుగు టైప్ చేయడం మొదలుకుని అనేక కంప్యూటర్ సంబంధిత సాంకేతిక సమస్యలకు తక్షణ సహాయం అందించింది. ఇకపోతే http://youtube.com/nallamothu అనే ఛానెల్ లో 361కి పైగా ప్రొఫెషనల్ క్వాలిటీ తెలుగు టెక్నికల్ వీడియోలు అందించాను. ఈ ఛానెల్ కి 1704 మంది సబ్ స్కైబర్లు ఉన్నారు. అందుబాటులో ఉన్న వివిధ మార్గాల ద్వారా తెలుగు వారందరకీ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించే పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాను. My Contact Number: 9000239948 Mail ID: sridharcera@gmail.com

ఇక్కడ RSS Feedకి Subscribe చేసి నేరుగా పోస్ట్ లు పొందండి

ఆండ్రాయిడ్ లో పొందండి!

నా వీడియోలను మీ దగ్గర ఉన్న Android ఫోన్ లో పొందాలంటే ఈ క్రింది లింక్ ని మీ ఫోన్ బ్రౌజర్ లో ఓపెన్ చేసి వెంటనే వచ్చే అప్లికేషన్ ని ఇన్ స్టాల్ చేసుకోండి. అన్ని వీడియోలూ ఎంజాయ్ చేయండి. http://goo.gl/DqsA4

లేదా ఈ క్రింది QR Codeని మీ Android ఫోన్ లోని Barcode Scannerతో స్కాన్ చేస్తే నేరుగా అప్లికేషన్ డౌన్ లోడ్ పేజీకి వెళ్లవచ్చు. Image and video hosting by TinyPic