Home » తెలుగు భాషాపరిరక్షణ » Recent Articles:

ఏపిల్ Macలో తెలుగు సమస్య ఇలా తీరుతుంది (వీడియో డెమో)

ఏపిల్ Mac ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న కంప్యూటర్లలో తెలుగు అక్షరాలు సక్రమంగా కన్పించక చాలామంది ఇబ్బంది పడుతుంటారు.

Apple Mac Book Pro వంటి లాప్ టాప్ లు వాడే వారికీ, కొత్తగా కొనాలనుకున్న వారికీ ఈ వీడియోలో తెలుగు వెబ్ సైట్లూ, మెయిల్స్, ఛాటింగ్ లో తలెత్తే సమస్యకు పరిష్కారాన్ని ప్రాక్టికల్ గా చూపించడం జరిగింది. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కీ share చెయ్యగలరు.

 

మీ వెబ్ సైట్ లోనూ, బ్లాగ్ లోనూ మీకు ఈ వీడియో నచ్చితే రీపబ్లిష్ చేసుకోవచ్చు. మీ బ్లాగ్ లో కొత్త పోస్ట్ చేసేటప్పుడు HTML మోడ్ లో ఉండగా క్రింది లైన్ ని మీ పోస్ట్ లో add చేస్తే ఈ వీడియో వచ్చేస్తుంది.

<iframe width="560" height="315" src="http://www.youtube.com/embed/6tyewtohsh8" frameborder="0" allowfullscreen></iframe>

 

 

 

అనేక తెలుగు టెక్నికల్ వీడియోల హ్యాండ్ బుక్ ఇదిగోండి.. (నవంబర్ 18 అప్ డేట్ )

ప్రతీ కంప్యూటర్ యూజర్ కీ ఖచ్చితంగా పనికొచ్చే పలు తెలుగు టెక్నికల్ వీడియోల హ్యాండ్ బుక్ ని ఈ క్రింది లింక్ నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

నా తెలుగు టెక్నికల్ వీడియోలను చూసేటప్పుడు ఈరోజు మీకు ఒక వీడియో ఇంట్రెస్టింగ్ అన్పించకపోవచ్చు.. రేపు "ఫలానా వీడియో ఎక్కడుంది.." అని అవసరం కొద్దీ వెదుక్కోవలసి రావచ్చు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఒక మామూలు కంప్యూటర్ యూజర్ దగ్గర్నుండీ ప్రొఫెషనల్స్ వరకూ ఉపయోగపడే వీడియో లింకులన్నింటినీ దఫాల వారీగా ఒకేచోట అందించే ప్రయత్నమే ఈ Handbook.

మీరు ఈ క్రింది లింక్ నుండి PDF ఫైల్ ని డౌన్ లోడ్ చేసుకుని మీ కంప్యూటర్లో జాగ్రత్తపరుచుకోవచ్చు.

PDF ఫైల్ డౌన్ లోడ్ లింకు:

http://goo.gl/TfI5d

ఆ PDF ఫైల్ లోని లింక్ ని క్లిక్ చేస్తే మీ బ్రౌజర్ లో సంబంధిత  వీడియో ఓపెన్ అవుతుంది.
అలాగే మీ సౌకర్యం కోసం కొన్ని వీడియోల లింకులను ఇక్కడా ఇదే పోస్టులో ఇస్తున్నాను.

- నల్లమోతు శ్రీధర్

కొన్ని వీడియోల లింకులు ఒకేచోట మీ సౌకర్యం కోసం:

1.      పలు సెల్ ఫోన్లని USB పోర్ట్ ద్వారా ఛార్జింగ్ చేసుకునే కేబుల్ దొరుకుతోంది తెలుసా? అదీ తక్కువ ధరకే! అదెలా ఉంటుందో ఎలా వాడాలో ఈ వీడియోలో చూడండి

http://goo.gl/Gwhzz

 

2.      పిసి యూజర్లు కంప్యూటర్ ని విప్పదీస్తే లోపల ఏమి పాడవుతాయో అని అస్సలు క్లీనింగే చేయరు. మీకు ఎలాంటి భయం లేకుండా ఈజీగా మీ పిసిని క్లీన్ చేసుకోవడం ఎలాగో ఈ వీడియోలో చూపించాము..

           http://goo.gl/ZdUpd

3.      విండోస్ మీడియా ప్లేయర్ లో పాటలు వినేటప్పుడు మీకు నచ్చిన ఫొటోని బ్యాక్ గ్రౌండ్ గా సెట్ చేసుకోవచ్చని తెలుసా? ఆ చిన్న టెక్నిక్ ని ఇక్కడ చూసేయండి మరి.

           http://goo.gl/IeAZS

4.      చాలామంది Gmail అకౌంట్లు హ్యాక్ అయి ఉంటున్నాయి.. అయినా ఆ విషయం తెలియకుండానే పనిచేసుకుపోతున్నారు. ఈ నేపధ్యంలో మీ అకౌంట్ హ్యాక్ అవకుండా ఎంత పటిష్టమైన జాగ్రత్త తీసుకోవచ్చో ఈ వీడియోలో చూడవచ్చ.

           http://goo.gl/h5WDj

5.      చీటికీ మాటికీ మీ పిసికి వైరస్ వస్తోందా? హార్డ్ వేర్ టెక్నీషియన్ కి వందలకొద్దీ వదిలిస్తున్నారా? ఈ వీడియోలో చూపించిన టెక్నిక్ ఫాలో అవండి ఇక మీ పిసికి వైరస్సే రాదు.

http://goo.gl/9pGiD

6.      ఫొటోషాప్ లో మీ ఫొటోని మంచి బ్యాక్ గ్రౌండ్ లో నిలబడ్డట్లు మిక్సింగ్ చేయాలనుకుంటున్నారా? మీ ఫొటోనే కాదు.. మీ ఫ్రెండ్స్ బర్త్ డేల సమయంలో ఈ టెక్నిక్ తో వారికి మంచి గ్రీటింగూ చేసేయొచ్చు. అదెలాగో ఇక్కడ చూడండి..

 

http://goo.gl/mOzOi

 

7.      BIOSలో మనం కంప్యూటర్ కి పాస్ వర్డ్ పెట్టుకోవచ్చు, USB పోర్టులను పనిచేయకుండా చేయొచ్చు… వందలాది సెట్టింగులు అందులో లభిస్తుంటాయి. మరి వాటిని ఈజీగా వాడడం ఎలాగో ఇక్కడ తెలుసుకోండి.

http://goo.gl/YUXxu

 

8.      మీ కంప్యూటర్ ని మీ పెన్ డ్రైవ్ సాయంతో వేగంగా పనిచేసేలా చేసుకోవచ్చని తెలుసా? పెన్ డ్రైవ్ ని వృధాగా పక్కన పెట్టడం మానేసి ఈ టెక్నిక్ తెలుసుకుని ఆచరించండి మరి.. పిసి అన్నా స్పీడ్ అవుతుంది..

          http://goo.gl/5SgZH

9.      కొన్ని వైరస్ లు విండోస్ లో ఎంత ట్రై చేసినా దాక్కునే ఉంటాయి. అలాంటప్పుడు విండోస్ బూట్ అవకముందు వాటిని స్కాన్ చేసుకోవడం బెటర్. అదెలాగో ఈ వీడియో చూస్తే మీకు తెలుస్తుంది.

http://goo.gl/0usHF

10.   మెయిల్స్ లోనూ, ఛాటింగ్ లోనూ, Word, Notepad వంటి అనేక విండోస్ ప్రోగ్రాముల్లోనూ చక్కగా తెలుగులో టైప్ చేయాలని ఉంటే.. అది ఎంత చిన్న విషయమో ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది.

         http://goo.gl/JpEIE

11.   మీ ఫోన్ కోసం కొన్న బ్లూటూత్ హెడ్ సెట్ కేవలం ఫోన్ కాల్స్ నే విన్పిస్తోందా? పాటలూ, సినిమాల్లోని ఆడియోనీ బ్లూటూత్ హెడ్ సెట్ లో పొందడం ఎలాగో ఈ క్రింది లింకులో చూడండి

http://goo.gl/EUmyZ

 

12.   కొత్తగా ఫొటోషాప్ నేర్చుకుంటున్నారా? లేదా ఇప్పటికే కొంత వచ్చా? ఈ వీడియోలో చూపిస్తున్న రెండు మంచి టెక్నిక్ లు ఇకపై మీకు మరింత యూజ్ ఫుల్ గా ఉంటాయి మీరే చూడండి

 

http://goo.gl/Uhxm6

13.   కొన్ని ఫైల్ పేర్లు బ్లూ కలర్ లో కన్పిస్తుంటాయి. ఇలా కన్పిస్తోందంటే వైరస్సా? ఏమైనా సిస్టమ్ లో ప్రాబ్లెం ఉందా? అస్సలు ఎందుకు ఇలా కన్పిస్తాయో ఇక్కడ తెలుసుకోండి

     http://goo.gl/x4cav

14.   మీ ఇంట్లో పిల్లలు గంటల తరబడి ఛాటింగ్, మెయిల్స్, ఫేస్ బుక్ వంటి వాటికి అతుక్కుపోతున్నారా? లేదా మీరు ఏవైనా ఇతర వెబ్ సైట్లని బ్లాక్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే చాలా చిన్న టెక్నిక్ తో అవసరం లేని సైట్లని బ్లాక్ చేసుకోవడం ఇక్కడ చూడండి

http://goo.gl/rfkuw

 

15.   సెల్ ఫోన్ లోనూ తెలుగు చూడొచ్చు, తెలుగులో టైప్ చేసుకోవచ్చని తెలుసా? ఆశ్చర్యపోకండి.. స్వయంగా మీరే ఈ వీడియోలో చూడండి.. మీరూ మరో 10 మందికి చెప్తారు..

http://goo.gl/al1MK

 

16.   మీ టివికి ఉన్న డివిడి ప్లేయర్ లో అన్ని వీడియోలూ ప్లే అవడం లేదా? మీ పిసిలో ప్లే అయ్యే అన్ని వీడియోలూ టివిలోనూ ప్లే అయ్యే విధంగా మార్చుకోవడం ఎలాగో ఇక్కడ చూసేయండి, ఇక మీ ప్రాబ్లెం సాల్వ్ అవుతుంది.

        http://goo.gl/LUAjD

17.   సెల్ ఫోన్ రీఛార్జ్ చేయించుకోవడానికి కష్టపడి షాపుల చుట్టూ తిరగడం ఎందుకు? ఇక్కడ అద్భుతమైన పద్ధతిని చూపించాం.. ఇకపై దీన్ని ఫాలో అయిపొండి.. రీఛార్జ్ ఎప్పుడైనా మీరే చేసుకోవచ్చు..

http://goo.gl/WafcM

 

 

కంప్యూటర్ మీద అక్షరాలను తెలుగులో చదివి విన్పించే స్పీచ్ ఇంజిన్ ఇదిగోండి..

మన కంప్యూటర్ స్ర్కీన్ మీద ఉన్న అక్షరాలను తెలుగులో చదివి విన్పించడానికి Indian Language TTSలో భాగంగా ఓ స్పీచ్ ఇంజిన్ ని iit వారు అభివృద్ధిపరిచారు. దాన్ని మీరూ డౌన్ లోడ్ చేసుకుని వాడవచ్చు. అదెలాగో ఈ వీడియోలో చూపించాను.

ఆ TTS ఇంజిన్ డివిడిలు ఈరోజే నాకు iit నుండి చేరాయి. వాస్తవానికి వారం రోజుల క్రితమే ఇంటర్నెట్ లో ఇది అందుబాటులోకి వచ్చినా పనుల వత్తిడి వల్ల ఇంత అద్భుతమైన సదుపాయాన్ని మీకు పరిచయం చేయలేకపోయాను. నేరుగా డివిడిలు iit వారి నుండి వచ్చిన తర్వాతా దీన్ని మీకు పరిచయం చేయకపోవడం భావ్యం కాదనిపించింది. అందుకే ఇప్పటికీ మేగజైన్ ప్రిపరేషన్ లో తలమునకలై ఉన్నా ఈ వీడియోని తయారు చేశాను.

టెక్నాలజీ సామాన్య ప్రజలకు ఉపయోగపడేలా కృషిచేస్తున్న iitలకూ, ప్రభుత్వ విభాగాలకూ, సంస్థలకూ కృతజ్ఞతలు తెలుపుతున్నాను.

- నల్లమోతు శ్రీధర్

ఈ వీడియోలో తెలుగు సమాచారాన్ని ఎలా చదివి విన్పిస్తోందో మీరే చూడొచ్చు.


Telugu Text to Speech Engine by nallamothu

 

మొదట ఇక్కడ నుండి NVDA  ఫైల్ ని డౌన్ లోడ్ చేసుకుని ఇన్ స్టాల్ చేసుకోండి: http://sourceforge.net/projects/nvda/files/releases/2010.1/

రెండవ స్టెప్ గా ఇక్కడ నుండి మీకు కావలసిన వెర్షన్ ని డౌన్ లోడ్ చేసుకోండి: http://sourceforge.net/projects/tts-indianlang/files/

ఆ తర్వాత నేను వీడియోలో చూపించిన విధంగా సెట్టింగులు చేయండి. అంతే మీ కంప్యూటర్లోనూ తెలుగు చదివి విన్పించబడుతుంది.

ఇక సెల్ ఫోన్ లోనూ తెలుగులో టైప్ చేసుకోవచ్చు.. నేను చేస్తున్నా చూడండి.. మీరూ ఫాలో అవొచ్చు

నమ్మలేకపోతున్నారా? పూర్తిగా కంప్యూటర్లోనే తెలుగు రాయలేకపోతున్నాం.. సెల్ ఫోన్ లో తెలుగులో టైప్ చేయడం ఎలా సాధ్యమని ఆశ్చర్యపోతున్నారా? ఈ వీడియోలో మీ ఆశ్చర్యాన్ని పోగొట్టడం కోసం నేను గూగుల్ లో తెలుగులో టైప్ చేసి చూపిస్తున్నాను. కేవలం గూగుల్ లోనే కాదు..

ఇ-మెయిల్స్, ఫేస్ బుక్, యాహూ మెసెంజర్, GTalk వంటి ఛాటింగ్ ప్రోగ్రాములూ, అన్ని రకాల వెబ్ సైట్లలోనూ ఎంచక్కా ఈజీగా ఫోన్ నుండే తెలుగులో టైప్ చేసుకోవచ్చు. అంటే తెలుగు వినియోగం విషయంలో మీకు ఎలాంటి పరిమితులూ లేవన్నమాట.

ఆలస్యమెందుకు సెల్ ఫోన్ లో తెలుగు టైప్ చేయడమెలాగో చూసేయండి మరి!
ఇకపోతే కంప్యూటర్లో తెలుగు టైపింగ్ ఇప్పటికీ రాని వారు గతంలోనే ఈ క్రింది లింకులో నేను తయారు చేసిన వీడియోని చూసి 10 నిముషాల్లో ఏ వెబ్ సైట్ లో అయినా నేరుగా తెలుగులో టైప్ చేయొచ్చు.
http://www.youtube.com/watch?v=pIWFjqNTdA0

అలాగే మీ సెల్ ఫోన్ లో తెలుగు అక్షరాలు సరిగ్గా కన్పించడం లేదని భావిస్తున్న వారు ఎంత చవక ఫోన్ లో అయినా తెలుగుని భేషుగ్గా చూడడం ఎలాగో ఇప్పటికే నేను చేసిన ఈ క్రింది వీడియోలో చూడవచ్చు.

http://www.youtube.com/watch?v=tJdFVOZnqFQ

 ఈ వీడియోని మీ మిత్రులతో పంచుకోవాలంటే ఈ లింకుని వారికి పంపించండి:  http://goo.gl/EQRoH

 మీ వెబ్ సైట్ లోనూ, బ్లాగ్ లోనూ మీకు ఈ వీడియో నచ్చితే రీపబ్లిష్ చేసుకోవచ్చు. మీ బ్లాగ్ లో కొత్త పోస్ట్ చేసేటప్పుడు HTML మోడ్ లో ఉండగా క్రింది లైన్ ని మీ పోస్ట్ లో add చేస్తే ఈ వీడియో వచ్చేస్తుంది.

<iframe width="560" height="315" src="http://www.youtube.com/embed/5jNWMFodA2c" frameborder="0" allowfullscreen></iframe>

 

కష్టపడకుండానే తెలుగులో నేరుగా టైప్ చేయాలనుకుంటున్నారా? ఈ వీడియో చూడండి.. మరుక్షణం టైప్ చేయడం మొదలుపెట్టేస్తారు (వీడియో డెమో)

ముందుగా ఓ విజ్ఞప్తి:
తెలుగు టైపింగ్ చాలా సులభంగా చేయొచ్చని చాలామందికి తెలియదు. అలాంటి వారందరి కోసం 5 గంటలపాటు కష్టపడి తయారు చేసిన వీడియో ఇది. ఇందులో ప్రతీ స్టెప్ చాలా వివరంగా ఎవరైనా 10 నిముషాల్లో అర్థం చేసుకోగలిగేలా చూపించడం జరిగింది. ఈ వీడియో మీ ఒక్కరికే కాదు మీకు తెలిసిన ప్రతీ ఒక్కరికీ లింకు పంపించండి, వారూ తెలుగులో రాయడం మొదలెడతారు, తద్వారా మనం తెలుగు భాషని చాలావరకూ రక్షించవాళ్లం అవుతాం.

ఇ-మెయిల్స్ లోనూ, ఫేస్ బుక్ లోనూ, వెబ్ సైట్లలోనూ, notepad, MS Word వంటి విండోస్ అప్లికేషన్లలోనూ ఎక్కడైనా నేరుగా తెలుగు టైప్ చేసుకోవచ్చనీ.. అదీ చాలా చాలా సులభంగా టైప్ చేయవచ్చనీ కొంతమందికి తెలియదు.

మీరూ తెలుగులో టైప్ చేయాలని ఉన్నా అదేదో చాలా కష్టమని భయపడుతూ ఉంటే ఈ వీడియో తప్పకుండా చూడాల్సిందే.

ఖచ్చితంగా ఈ వీడియో చూసిన మరుక్షణం మీరు తెలుగులో టైప్ చేయడం మొదలుపెట్టేస్తారు. మరో అరగంటలో మరింత వేగంగా టైప్ చేసేస్తారు. ఒక రోజు గడిచిందంటే  ఇక తెలుగు టైపింగ్ ని మరో 10 మందికి నేర్పించడానికి రెడీ అయిపోతారు.

తెలుగు టైపింగ్ అంటే ఎక్కడో టైప్ చేసి, దాన్ని కాపీ చేసి, కావలసిన చోట పేస్ట్ చేసుకోవాలనుకునే వారికీ ఈ వీడియో వివిధ విండోస్ అప్లికేషన్లలోనూ, ఇంటర్నెట్ లోనూ నేరుగా తెలుగులో టైప్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే తెలుగు టైపింగ్ కొత్తగా చేయాలనుకునే వారికీ బాగా పనికొస్తుంది. స్పీకర్లు ఆన్ చేసుకుని వింటూ చూస్తే సులభంగా అర్థమవుతుంది.

- నల్లమోతు శ్రీధర్

ఈ వీడియోని మీ మిత్రులతో పంచుకోవాలంటే ఈ లింకుని వారికి పంపించండి:  http://www.youtube.com/watch?v=pIWFjqNTdA0

 ఈ వీడియోని 3Dలోనూ చూడవచ్చు: వీడియోని ప్లే చేసేటప్పుడు ప్లేయర్ పై ఉండే 3D అనే బటన్ ని క్లిక్ చేయడం ద్వారా ఈ వీడియోని 3Dలోనూ మీరు చూడొచ్చు. తెలుగులో మొట్టమొదటి 3D ఛానెల్ అయిన http://youtube.com/nallamothu అనే దానికి మీరు Subscribe చేయొచ్చు.

 
వీడియోని చూసేటప్పుడు మీ నెట్ కనెక్షన్ స్పీడ్ గా ఉన్నదైతే.. 720p, 1080p అనే హై డెఫినిషన్ (HD) రిజల్యూషన్లని Youtube Playerలో ఎంచుకుని మరింత హై క్వాలిటీతో వీడియోని చూడొచ్చు.
 

 వివిధ టెలివిజన్ ఛానెళ్లలో నేను చేసిన ప్రోగ్రాములు, ఇతర టెక్నికల్ వీడియోల కోసం http://youtube.com/nallamothu అనే ఛానెల్ కి సబ్ స్కైబ్ చేయొచ్చు.

Subscribe to me on YouTube

computerera telugu magazine

యూనీకోడ్ పై అవగాహన కూడా లేని ఐటీ శాఖామాత్యులు

 

యూనీకోడ్ కన్సార్టియమ్ లో 7 లక్షలు వెచ్చించి తెలుగు భాషకు శాశ్వత సభ్యత్వం తీసుకున్నామని ఐ.టి. శాఖామాత్యలు పొన్నాల లక్ష్మయ్య కన్పించిన ప్రతీ వేదికపై సగర్వంగా చెప్పేస్తున్నారు. ఇకపై ప్రభుత్వ ఉత్వర్తులు, ఉత్తరప్రత్యుత్తరాలూ, టెండర్లా, ప్రభుత్వ వెబ్ సైట్లూ తెలుగులోనే నిర్వహించబడడానికి ఈ సభ్యత్వం సహాయం చేస్తుందనీ, తెలుగు కొత్త యూనీకోడ్ ఫాంట్లు కూడా ఈ సభ్యత్వం ద్వారానో సృష్టించుకోవచ్చనీ, తెలుగులో పూర్తి స్థాయి వెబ్ బ్రౌజర్ అందుబాటులోకి తీసుకు వస్తామనీ ఓ 4-5 పాయింట్లు మళ్లీ మళ్లీ చెప్పేస్తున్నారు. వార్తాపత్రికలూ, న్యూస్ ఛానెళ్లు కూడా ఇదోదో ఘనకార్యమనుకుని కధనాలు ప్రచురిస్తున్నాయి.

ఇక్కడ ప్రతీ ఒక్కరూ తెలుసుకోవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి.

1. యూనీకోడ్ లో తెలుగు భాష 2005 నాటి నుండే విరివిగా వాడబడుతోంది. ఇంటర్నెట్ లో అనేక వెబ్ సైట్లూ, బ్లాగులూ యూనీకోడ్ ద్వారానే అప్పటి నుండి ప్రచురించబడుతూ ఉన్నాయి. ఎటొచ్చీ ప్రభుత్వానికి గానీ, ప్రభుత్వ యంత్రాంగానికి గానీ దీనిపై అవగాహన లేకపోవడం వల్ల ఇలా యూనీకోడ్ కన్సార్టియమ్ లో సభ్యత్వం తీసుకోవడం ద్వారానే మనం తెలుగు ఇంటర్నెట్ లో వాడగలుగుతున్నామన్న భ్రమని కలిగి ఉన్నారు, ప్రజలకు కలిగిస్తున్నారు. 2008 డిసెంబర్ లో అప్పటి అధికార భాషా సంఘం అధ్యక్షులు ఎ.బి.కె. ప్రసాద్ గారిని ప్రభుత్వ లావాదేవీల్లో యూనీకోడ్ వాడకాన్ని మొదలుపెట్టే చర్యలకు శ్రీకారం చుట్టమని సచివాలయంలో మరో మిత్రునితో సహా ఆయన్ని స్వయంగా కలిసి విన్నవించాను. దానిపై ఆయన సానుకూలత ప్రకటించారు కూడా, కానీ ఎందుకో ఆచరణకు నోచుకోలేదు. ఇప్పుడు తాజాగా మంత్రివర్యులు ఇదేదో తాము యూనీకోడ్  కన్సార్టియమ్ లో సభ్యత్వం తీసుకోవడం వల్ల సాధ్యపడుతున్న పనిగా అభివర్ణిస్తున్నారు. యూనీకోడ్  వాడకానికి కన్సార్టియమ్ లో సభ్యత్వం అవసరం లేదు, చిత్తశుద్ధిగా యూనీకోడ్ ని వాడుకుంటూ పోతే సరిపోతుంది.

2. ప్రత్యేకంగా తెలుగులో వెబ్ బ్రౌజర్ తయారు చేసి అందుబాటులోకి తీసుకురాబోతున్నామని చెబుతున్నారు. తెలుగులో వెబ్ బ్రౌజర్ అంటే అర్థం?  మాట వరుసకి..  ఫైర్ ఫాక్స్ వంటి బ్రౌజర్ ని తీసుకుని File, Edit వంటి మెనూల పేర్లని తెలుగీకరించి విడుదల చేయబోతున్నారా? ఇది ప్రత్యేకమైన తెలుగు బ్రౌజర్ అవుతుందా? లేక బ్రౌజర్ లో తెలుగు వనరులు లభించే ప్రతీ లింకునూ మెనూల్లో గానీ, సైడ్ బార్ లో గానీ, టూల్ బార్ గా గానీ అమర్చి "ఇది మన తెలుగు బ్రౌజర్" అని ప్రచారం చేయబోతున్నారా? వేచి చూడాలి ప్రభుత్వపు అజ్ఞానపు ఛేష్టలు ఎలా ఉండబోతున్నాయో!

3. తెలుగులో యూనీకోడ్ ఫాంట్ల రూపకల్పన చేస్తున్నాం అన్నారు. ప్రస్తుతానికి గౌతమి, వేమన, పోతన, ఆకృతి, ఆకృతి బోల్డ్ వంటి పలు యూనీకోడ్ ఫాంట్లు అందుబాటులో ఉన్నాయి. అవి సాధారణ సమాచారాన్ని (running textని) టైప్ చేయడానికి ఉపయోగపడతాయి తప్ప శీర్షికలూ (titles) వంటి వాటికి ఉపయోగపడవు. అందుకే అదనంగా మరికొన్ని యూనీకోడ్ ఫాంట్ల రూపకల్పన జరగవలసిందే. అయితే అదనంగా యూనీకోడ్ ఫాంట్ల రూపకల్పనకు కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నట్లు సదరు మంత్రివర్యులు సెలవిస్తున్నారు. ప్రైవేట్ సంస్థలైన అనూ, శ్రీలిపి వంటివి లెటరింగ్ ఆర్టిస్టులూ, సాంకేతిక నిపుణుల సహాయంతో లక్షల ఖర్చులోనే 30, 40 తెలుగు ఫాంట్లు తమ కోసం తయారు చేయించుకోగా లేనిది 4, 5 యూనీకోడ్ ఫాంట్ల తయారీకి కోట్లు ఎలా ఖర్చవుతుందో ఆ మంత్రివర్యులకూ, వారి తెలుగు భాషా రక్షణ బృందానికే తెలియాలి.

చివరిగా తెలుగు భాషని రక్షించడానికి ఆర్భాటపు ప్రకటనలు అవసరం లేదు, ముఖ్యంగా తెలుగు భాషా ఉద్ధరణ అనేది  తమ ప్రచారాస్త్రం కన్నా ఆచరణలో చిత్తశుద్ధితో చూపించవలసిన క్రియాశీలక చర్య.

మీకేం అర్హత ఉందని మీరు తెలుగుపై మాట్లాడుతున్నారని కొందరు నాపై విరుచుకుపడడానికి ఈ పాటికే సిద్ధపడిపోయి ఉంటారు. . 2008 జనవరి నుండి "కంప్యూటర్ ఎరా సాంకేతిక సహాయం" పేరిట 14,000 మంది సభ్యులతో ఓ ఛాట్ రూమ్ ని నిర్వహిస్తూ ఉండేవాడిని. అందులో ఇతర సాంకేతికపరమైన అంశాలతో పాటు తెలుగులో టైప్ చేయడం కూడా ప్రతీ సభ్యునికీ TeamViewer ప్రోగ్రామ్ ద్వారా నేర్పిస్తూ ఉండేవాళ్లం, నేనూ మరికొందరు మిత్రులూ!  "తెలుగు వెలుగులు" పేరిట 2008లో ఈనాడు ఆదివారం అనుబంధంలో వ్యాసం ప్రచురించబడినప్పుడు ఆ ఛాట్ రూమ్ లింకుని కూడా ఆ వ్యాసంలో ప్రచురించారు. దాంతో ఒక్కరోజులోనే 800 మందికి షిఫ్ట్ లు వేసుకుని మరీ నేనూ, జ్యోతి గారూ, ప్రసాద్ గారు, శ్రీనివాస్ కర గారూ.. ఇలా పలువురు మిత్రులము తెలుగు టైపింగ్ నేర్పించాము.

అలాగే హైద్రాబాద్ బుక్ ఎగ్జిబిషన్ లో తెలుగు వాడకం గురించి వీడియో ప్రజంటేషన్ తయారు చేయడం దగ్గర్నుండీ.. ప్రతీరోజూ మధ్యాహ్నం నుండి రాత్రి వరకూ బుక్ ఎగ్జిబిషన్ జరిగినన్నాళ్లూ అక్కడి స్టాల్ లో గడిపి ఎంతోమందికి ఇంటర్నెట్ లో తెలుగు వాడకంపై అవగాహన కల్పించిన సంగతి దగ్గరగా చూసిన మిత్రులకు గుర్తే ఉండి ఉంటుంది.  అలాగే తెలుగు భాషా వాడకం గురించి అవగాహన పెంచడానికి వివిధ NGO సంస్థలకు తిరగడం, స్వయంగా నాకు తెలిసిన పలు కాలేజీల్లో demonstrations ఇవ్వడం జరిగింది. అధికార భాషా సంఘం అధ్యక్షుల వారిని కలిసినా, చుక్కారామయ్య, బివి పట్టాభిరాం, కళా వెంకట్రావు, పురంధరేశ్వరి, టివి 9 రవిప్రకాష్, రెయిన్ బో FM తెలుగు రేడియో వంటి వారిని కలిసి తెలుగు వాడకంపై చర్చించినా తెలుగుని కాపాడాలన్న తపనే తప్ప దూరంగా నిలుచుని రాళ్లేద్దామన్న ఉద్దేశ్యమేమాత్రపూ లేదు. చాలామంది నాలాంటి వారు చేసే విమర్శని వక్రీకరించి.. తెలుగు భాషాద్రోహులుగా చిత్రీకరించే ప్రయత్నం చేయొచ్చు. అలాంటి వారికి ప్రత్యేకంగా చెబుతున్నాను.. ఒక వ్యక్తిగా నాకు వీలైనన్ని అన్ని మార్గాల్లోనూ ఇంటర్నెట్ లో తెలుగు వాడకంపై కృషి చేస్తూనే ఉన్నాను, కొన్ని మీ గమనింపుకి రావచ్చు, కొన్ని మీరు గమనించకుండా ఉండొచ్చు.  ఇలా కృషి చేస్తున్నాను కాబట్టే ఈరోజు ఐ.టి. శాఖామాత్యులు, మరికొందరు ఆ బృందపు సభ్యులు ప్రచార మాధ్యమాల ద్వారా మామూలు మనిషికి అర్థం కాని సాంకేతిక పరిజ్ఞానాన్ని తమదైన  వక్రభాష్యంతో ప్రాచుర్యం చేస్తుంటే చూడలేక వాస్తవాస్తవాలు కొద్దిమందికైనా తెలుస్తాయని యూనీకోడ్ వాడకం గురించి ఇది రాశాను.

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
కంప్యూటర్ ఎరా తెలుగు మాసపత్రిక

ఆన్ లైన్ వీడియోలు డౌన్ లోడ్ చేసిపెట్టే రూ. 1,760 టూల్ ఒరిజినల్ లైసెన్స్ ఇదిగోండి (మొదటి ఒక్కరికే)

Youtube, Metacafe, Daily Motion వంటి వీడియో షేరింగ్ సైట్లలో ఉండే వీడియోలను డౌన్ లోడ్ చేసుకోవడానికి పలువురు పలు పద్ధతులను వాడుతుంటారు. అయిత1 ఈ క్రింది వీడియోలో కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ ఎడిటర్ నల్లమోతు శ్రీధర్ చూపిస్తున్న Video Download Studio అనే సాఫ్ట్ వేర్ కేవలం సింగిల్ లింకులను డౌన్ లోడ్ చేయడంతోనే సరిపెట్టుకోకుండా కీవర్డ్ ఆధారంగా నచ్చిన వీడియోలను వెదికి వరుసగా బల్క్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు, వివిధ ఫార్మేట్లలోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. స్పీకర్లు ఆన్ చేసుకుని ఈ వీడియో చూడండి, దీని పవర్ మీకే అర్థమవుతుంది.

రూ. 1760 టూల్ పూర్తి ఉచితంగా..

రూ. 1,760 విలువైన ఈ సాఫ్ట్ వేర్ ఒరిజినల్ లైసెన్స్ ని నల్లమోతు శ్రీధర్ సాంకేతికాలు పాఠకులు ఒకరు పూర్తి ఉచితంగా స్వంతం చేసుకోవచ్చు. నూటికి నూరుశాతం ఇది జెన్యూన్ లైసెన్స్.

అదెలాగంటారా?

మీరు చేయవలసిందల్లా సింపుల్..

1. 305కి పైగా  తెలుగు టెక్నికల్ వీడియోలు ఉన్న http://youtube.com/nallamothu అనే ఛానెల్ కి ఉచితంగా మీరూ మరియు మీ ఫ్రెండ్ ఇంకొకరిని Subscribe చేయించి, 

2. ఈ క్రింది వీడియోని ప్లే చేసి.. అందులో ఒకచోట Software Code అని కన్పించే కోడ్ ని రాసుకుని

3. ఆ కోడ్ నీ,  మీ ఇద్దరి youtube IDలూ, పేరు, ఫోన్ నెంబర్ sridharcera@gmail.comకి మెయిల్ చేయండి.

మీ నెంబర్ కి కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకుని ఏ వ్యక్తి మొదట మెయిల్ చేస్తే ఆ ఒక్కరికి రూ. 1,760 విలువైన లైసెన్స్ అందించబడుతుంది. లైసెన్స్ ఒక్కరే వాడాలి. మీరు ఇతరులకు షేర్ చేస్తే మీకూ పనికిరాకుండా పోతుంది.

 

ఒకసారి లైసెన్స్ పొందిన వారు 2 నెలల వరకూ వేరే టూల్స్ లైసెన్స్ పొందడానికి అర్హులు కారు. అందరికీ అవకాశం ఇవ్వడానికే ఈ నియమం.

మరిన్ని ఆఫర్లకు ఈ http://computerera.co.in/blog అనే ఈ నల్లమోతు శ్రీధర్ సాంకేతికాలు బ్లాగుని సందర్శిస్తుండండి.

 

ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తో పంచుకోవాలంటే ఈ లింక్ ని వారికి పంపించండి. http://www.youtube.com/watch?v=7iHGS8ANnYI

వీడియోని చూసేటప్పుడు మీ నెట్ కనెక్షన్ స్పీడ్ గా ఉన్నదైతే.. 720p, 1080p అనే హై డెఫినిషన్ (HD) రిజల్యూషన్లని Youtube Playerలో ఎంచుకుని మరింత హై క్వాలిటీతో వీడియోని చూడొచ్చు.

 వివిధ టెలివిజన్ ఛానెళ్లలో నేను చేసిన ప్రోగ్రాములు, ఇతర టెక్నికల్ వీడియోల కోసం http://youtube.com/nallamothu అనే ఛానెల్ కి సబ్ స్కైబ్ చేయొచ్చు.


 

11.05 AM అప్ డేట్: ఆఫర్ క్లోజైంది. 10.47 నిముషాలకు నవీన్ కుమార్ అనే వ్యక్తి మెయిల్ పంపి, ఫోన్ లో మాట్లాడి ఒరిజినల్ లైసెన్స్ గెలుసుకున్నారు. ఆ వివరాలు క్రింద చూడొచ్చు. మరో ఆఫర్ కి రూల్స్ మరో విధంగా ఉంటాయి.

computerera registration

 

computerera telugu magazine

తెలుగు భాషాపరిరక్షణోద్యమ నేపధ్యం ఇదీ..

వాస్తవానికి సాంకేతిక పదాలు అనువదించబడుతున్న తీరుపై నా అభిప్రాయం మేధావులూ, భాషాసేవకులకు విన్నవిద్దామని గత పోస్టు రాశాను. అదే పోస్టుని తెలుగుపదంగూగుల్ గుంపులో ప్రచురిస్తే అక్కడ ఒకరిద్దరు భాషాభిమానులు తెలుగు పద సృష్టినే ప్రశ్నించే వారికి ఈ గుంపులో ప్రవేశం లేదుఅనే తరహాలో అన్యాపదేశంగా తిరస్కార ధోరణి కనబరచడం.. మరోవైపు తెలుగుపదంగుంపు తెరిచిన పుస్తకం లాంటిదనీ, ఎవరైనా చర్చల్లో పాల్గొనవచ్చని పారదర్శకత వ్యక్తపరిచే ఆ నిర్వాహక బృందం అక్కడి తోటి సభ్యుల నుండి వచ్చిన తిరస్కారపూరిత స్పందనలను ఖండించకపోవడం.. ఈ రెండు నాలుకల ధోరణిని గమనించిన తర్వాతా..

అలాగే నేను సాంకేతిక పదసృష్టి గురించి ఓ వాదనను విన్పిస్తే దానికి ప్రాధాన్యతను తగ్గించి.. ఏకంగా తెలుగు భాషావ్యాప్తినే నేను అడ్డుకుంటున్నట్లు అటు తర్కంతోనూ, ఇటు ఎన్నో ఏళ్లుగా తెలుగు భాషాభిమానులు ఆవేదనతో సంసిద్ధంగా ఉంచుకున్న పడికట్టు వాక్యాలతోనూ నన్ను పరోక్షంగా భాషాద్రోహిగా ముద్రించాలన్న ప్రయత్నాన్నీ గమనించిన తర్వాతా..

కేవలం అభిప్రాయం వెలిబుచ్చి వదిలేస్తే స్వీకరించే సహృదయులు ఆ పదసృష్టి ప్రక్రియలో లేరని అర్థమైంది. అందరి మెదళ్లూ కొత్త ఆలోచలను తావులేకుండా పిడివాదాన్ని సంతరించుకుని తాళం వేయబడి ఉంటే మనకెందుకులే అని వదిలేస్తే ఆ ఇరుకైన భావజాలాన్ని మనమూ ఒప్పుకున్నట్లు అవుతుందని ఉన్న ఫళంగా ఈ "సరికొత్త తెలుగు భాషాపరిక్షణోద్యమాన్ని ప్రకటించడం జరిగింది. ఇది రాత్రికి రాత్రి ఊపందుకునేది కాదని తెలుసు.. ఇప్పటికి సంకుచితంగా ఉన్న తెలుగు భాషోద్ధరణకార్యక్రమాల చిత్తశుద్ధి ఏపాటిదో గ్రహించి వాటి మాయ నుండి ఎంతమంది ఈ మన కోణంలోనైనా పయనించడం మొదలుపెడతారో తెలియదు.. అయినా నేను ఆశావాదిని.. మెల్లగానైనా నాకూ, కలిసి వస్తే మీకూ, మనందరకూ చేతనైనంత తెలుగు భాష భ్రష్టుపట్టకుండా చేయగలం అన్న నమ్మకం కుదిరాకే దీనికి ఉపక్రమించాను. తెలుగు భాష పట్ల నా ఆవేదన అర్థమైనవారు కలిసి వస్తారని ఆశ, కలిసిరాకపోయినా నా ప్రయత్నలోపం ఉండదు.

ధన్యవాదాలు.

 

చివరిగా ఇక్కడ నేను వ్యక్తిగతంగా ఎవరికీ వ్యతిరేకిని కాదని, తెలుగు భాషకు కూడా వ్యతిరేకిని కాదని మరోమారు చాలా స్పష్టంగా విన్నవించుకుంటున్నాను. ఎవరైనా ఈ విషయంపై మాట్లాడేటప్పుడు నా స్థాయిని చులకనగా నిలుపుకుని ఏ వేదికపై మాట్లాడినా అది వారి చిన్నతనమే అవుతుందని గ్రహించండి. పెద్దలైనా, చిన్నలైనా బుద్ధులు చిన్నగా ఉంటే వాటిని నేను మనసుకి తీసుకోను.

telugu

తెలుగు భాష ఉనికీ, స్థితి, గతీ, మేధావుల భాషాపాండిత్యంతో గందరగోళపు పదాలతో సామాన్యులకు దూరం అవుతున్న తీరుపై మీరూ ఆందోళన చెందుతుంటే మీ సైట్లలో, బ్లాగుల్లో, మీ ప్రతీ పోస్టుల్లో ఈ క్రింది ఎంబెడ్ కోడ్ ని  పొందుపరిచి భాషపై మీకున్న అభిమానాన్ని ప్రదర్శించవచ్చు. కనీసం దీని ద్వారానైనా సదరు మేధావులు  డ్రాయింగ్ రూముల్లో కూర్చుని ఏకపక్షంగా విచిత్ర పదాలను తామర తంపరగా సృష్టించి చలామణి చేయప్రయత్నించడం ఎంత తప్పిదమో గ్రహిస్తారని ఆశిద్దాం.


తెలుగు భాషాపరిరక్షణకి సరికొత్త ఉద్యమం – మీరూ భాగస్వాములవుతారా?

ఇటీవల చాప క్రింద నీరులా తెలుగు భాషని తమ మేధావితనం నుండి ఊడిపడుతున్న పదాలతో గందరగోళపరిచే ప్రయత్నాలు ఊపందుకున్నాయి. ఉదా.కు.. గట్టిపళ్ళెం(HDD), జాలగూడు, విహారిణి, నియంత్రణా వ్యవస్థ (O.S),క్రమకర్తలు(Programmers),ఖతి (Font),సంగణకం(Computer), విశ్వవ్యాప్త వలయం(World Wide Web), మృదులాంతకం (Software),"పంపక సులభ కవిలె (PDF)"అలాగే సంప్రకారం (Format) వంటివి. వీటికి మొదటి వేదిక బ్లాగులు. ఇలాంటి విచిత్ర పద ప్రయోగాలను అంగీకరిస్తే మనకు తెలుగు భాషపై మమకారం ఉన్నట్లు, వీటినీ, వీటి పుట్టుక యొక్క ప్రామాణీకతని ప్రశ్నిస్తే భాషాద్రోహులుగా ముద్రించ ప్రయత్నిస్తారు. భాష కొందరి సొత్తా? పాండిత్య ప్రదర్శనతో హాస్యాస్ఫూరకంగా ఉండే పదాలను సృష్టించేసి.. "ఇదే సరైన భాష, ఒప్పుకో.. లేదా భాషా ద్రోహిగా మిగిలిపోతావు" అంటే ఏమిటర్థం? ఇప్పటికే చక్కని ప్రమాణాలతో ఉన్న తెలుగు భాషని తూలనాడితే ద్రోహం కానీ ఈ పైత్యపు పదాలను ఒప్పుకోపోవడం భాషపై గౌరవం లేనట్లు ఎలా అవుతుందో సదరు మేధావులకే తెలియాలి.

 

కొత్తపదాలు పుట్డాలి నిజమే.. కానీ అవి ఉచ్ఛరించడానికి అనువుగా పుట్టించడంలో మేధావులు ఎందుకు శ్రద్థ తీసుకోరు? నోరు తిరగక అందరూ వదిలేసే విధంగా ఉండే పదాల్ని జనసామాన్యంలో ఎన్నాళ్లని బ్రతికించగలరు? ఆంగ్ల పదాలను మక్కీకి మక్కి తర్జుమా చేసే ప్రయత్నంలో "సరళత"ని గాలికొదిలేస్తే ఆ పదాలకు మనుగడ ఎంత?

 

ఇన్నాళ్లూ నేను తటస్థుడిని, ఇకముందు కూడా అంతే. తెలుగు బ్లాగుల్లో 2007 నుండి నా నడవడికను చూసిన ఎవరికైనా ఇది అర్థమయ్యే ఉంటుంది. భాషని కలుషితం చేస్తున్న తీరుని సహించలేక ఇప్పుడు నేను గళమెత్తడాన్ని నేపధ్యంగా తీసుకుని నాకు రంగూ, రుచీ, వాసనల్ని ఆపాదించి ఏదో గాటన కట్టేద్దామని ఎవరైనా అనుకుంటే అది వారి చిన్నతనమే అవుతుంది. భాషపై ఎవరికి ఎంత బాధ్యత ఉందో అది అర్థం పర్థం లేని పదాలతో కలుషితం కాకుండా రక్షించుకోవలసిన బాధ్యత నాకూ అంతే ఉంది. పడికట్టు వాదనలతో భాష ఔన్నత్యాన్ని, తెలుగు వారిగా మన తెలుగుని రక్షించుకోవలసిన కర్తవ్యాన్నీ సుదీర్ఘ విశ్లేషణలతో ఏకరువు పెడుతూ లోపాయికారీగా తాము తామర తంపరగా సృష్టించే విచిత్ర పదాలకు ఒప్పుకోలుని చదువరుల నుండి పొందగోరే ప్రయత్నాలు అందరికీ అర్థమవుతాయి. భాష మేధావుల మెదళ్లల్లోంచి మాత్రమే కాదు జనించవలసింది.. సామాన్యుల అభిప్రాయాలకూ భాషానిర్మాణంలో స్థానం ఉండాలి. అప్పుడే ఆ భాష అర్థవంతంగా ఉంటుంది. లేదంటే “PDFని పంపక సులభ కవిలెఅని నిర్థారించేశాం పో.. ఇక వాడుకోండి అని చేతులు దులుపుకుంటే ఎవరు ఎందుకు వాడాలి? అది సరళమైన పదమా? గుర్తుంచుకుని వాడడానికి?

 

ఇలాంటి ప్రయత్నాలతో భాషని కలుషితం చేస్తున్న మేధావుల నుండి నా తెలుగు భాష చులకన అవకుండా ఉండేలా ఒక బాధ్యత గల వ్యక్తిగా నేనూ తెలుగు భాషా పరిరక్షణఉద్యమాన్ని ప్రారంభిస్తున్నాను. ఇందులో ఎవరైనా భాగస్వాములు కావచ్చు. పూర్తి కార్యాచరణ అందరం కలిసి నిర్మించుకుందాం.దf

తెలుగు భాష ఉనికీ, స్థితి, గతీ, మేధావుల భాషాపాండిత్యంతో గందరగోళపు పదాలతో సామాన్యులకు దూరం అవుతున్న తీరుపై మీరూ ఆందోళన చెందుతుంటే మీ సైట్లలో, బ్లాగుల్లో, మీ ప్రతీ పోస్టుల్లో ఈ క్రింది ఎంబెడ్ కోడ్ ని  పొందుపరిచి భాషపై మీకున్న అభిమానాన్ని ప్రదర్శించవచ్చు. కనీసం దీని ద్వారానైనా సదరు మేధావులు  డ్రాయింగ్ రూముల్లో కూర్చుని ఏకపక్షంగా విచిత్ర పదాలను తామర తంపరగా సృష్టించి చలామణి చేయప్రయత్నించడం ఎంత తప్పిదమో గ్రహిస్తారని ఆశిద్దాం.

 

 

telugu

 

ఫేస్ బుక్ నుండి ఈ అంశం గురించి వచ్చిన కొన్ని స్పందనలు:

  • Tri H Sree తప్పకుండా మీతో కలిసి మనం అందరం మన తల్లి ని కాపాడుకుందాము

    17 minutes ago ·

  • Krishna Krp

    Khachitam ga sridhar garu, miru cheppindi nutiki nuru pallu yadardham. Bhasha lo saralatal lopiste adi prajalaku cheruva kaledu. adi andariku amodayogyam kadu. samklistamina bhasha vyavaharam ati koddimandi bhasha nipunulaki,panditulaki matrame artham autundi. manam edina vishayanni janam andarito panchukovalante manam vyaktikarinche bhavam chala saralam ga unde andariki artham ayyela undali. miru chese ee prayatnaniku nenu cheygaligindi edina unte tappakunda chestanu sridhar garu.

    16 minutes ago ·

  • Srinivasa Babu Todeti తప్పకుండా

    10 minutes ago ·

  • K Krishna Chaitanya desha basha landu telugu lessa ani nammuthunnam kabatti thappakunda sir………………. Than Q for giving this……… :D
     
    •  

      Narsing Basuthkar ఈ విషయం పైనే అంధ్ర జ్యొతి ఆదివారం పుస్తకం లో తేది 12-06-11 నాడు పాపినేని శివశంకర్ గారి "అనగా నేమి?" అన్న కథ వచ్చింది….చాలా బాగా రాసారు…చదువగలరు…

      7 hours ago ·

    • Siva Vemuri SURE..

      7 hours ago ·

    • Srinivas Gupta సరే మరి ,నేను మీతో పాటు వస్తున్నా.పదండి.

      ·

    • Bhaskar Venkat nenu kuda meethone

      3 hours ago ·

Santhosh Kumar Sharma Gollapelli ya, even facebook telugu version or windows telugu version asalu use cheyalem

 

  • Narsing Basuthkar మీరు చెప్పింది అక్షరాల సత్యం.చిన్నప్పటి నుంచి పాఠ్య పుస్తకాల లో ఉండే తెలుగు చూసి ఇది తెలుగు భాషేనా అని సందేహం కలుగుతుండేది..తరువాత కాని తెలిసి రాలేదు.. కాదని…వేలల్లో జీతాలు తీసుకుంటూ తెలుగు భాష ను సాంకేతిక భాషగా అభివృద్ధి చెయ్యలేని మన తెలుగు "పీఠాధిపతులు" ఇందుకు సిగ్గుపడాలి…


  • Kiran Kumar Boddeda Sridhar Nallamothu sir nyc post….amazing


  • Hari Krishna padalu chala vichitranga unnai sir….ila computer gurinchi telugu lo matladatam chala kastam…okka padanike pavu ganta pattela undi….


  • Kamalakar Reddy well said and well done. Manam teluguloki saankethika padaalanu alaage grahinchadam manchidi, andaraku arthamavuthundi.

Search This Site:

About Me

1996వ సంవత్సరంలో తెలుగులో మొట్టమొదట కంప్యూటర్ సాహిత్యాన్ని ప్రారంభించే అవకాశం నాకు కలిగింది. అదే సమయంలో చెన్నైలో సూపర్ హిట్ తెలుగు ఫిల్మ్ మేగజైన్ కి సబ్ ఎడిటర్ గా కూడా ఏకకాలంలో పనిచేస్తూ 1998 వరకూ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, మనీషా కొయిరాలా, శంకర్, రజనీకాంత్, కమల్ హాసన్ వంటి ప్రముఖులెందరినో ఇంటర్వ్యూలు చేయడం మర్చిపోలేని అనుభవం. అయితే సినిమా రంగంలో ఉన్న అనారోగ్యకరమైన వాతావరణం వల్ల నాకంటూ ఓ ప్రత్యేకమైన ఉనికిని సృష్టించుకోవడం కోసం సినిమా రంగం నుండి బయటకు వచ్చి పూర్తిగా టెక్నాలజీ రంగంలో స్థిరపడడం జరిగింది. 96 నుండి 2001 వరకూ పలు కంప్యూటర్ పత్రికలకు ఎడిటర్ గా పనిచేసి.. 2001 నుండి "కంప్యూటర్ ఎరా" తెలుగు మంత్లీ మేగజైన్ ఎడిటర్ గా పత్రిక మొత్తాన్నీ రూపొందిస్తూ ఉన్నాను. అలాగే తెలుగు టెలివిజన్ ఛానెళ్లలో మొట్టమొదటి టెక్నికల్ phone-in ప్రోగ్రామ్ కి గెస్ట్ గా అటెండ్ అయ్యే అవకాశమూ 2010 జనవరి 20న కలిగింది. అప్పటి నుండి ఇప్పటివరకూ TV 9, ABN, I News, ETV2, NTV, Zee 24 గంటలు, Studio N, సాక్షి టివి, మహా టివి, జాగృతి న్యూస్ వంటి ఛానెళ్లలో 100కి పైగా లైవ్, రికార్డెడ్ ప్రోగ్రాముల్ని చేయడం జరిగింది. 2007లో అత్యుత్తమైన నాణ్యతతో కూడిన పోస్టులతో, వీడియోలతో తెలుగులో మొదటి ప్రొఫెషనల్ టెక్నికల్ బ్లాగ్ గానూ, మొదటి వీడియో బ్లాగ్ గానూ ఇప్పుడు మీరు చూస్తున్న బ్లాగ్ ప్రత్యేకతను సంతరించుకుంది. అలాగే 2007 జనవరి 1న ప్రారంభించిన తెలుగులోనే మొట్టమొదటి టెక్నికల్ ఫోరమ్ అయిన "కంప్యూటర్ ఎరా సాంకేతిక ఫోరమ్" 14 వేల మంది సభ్యులతో 10 వేలకు పైగా పోస్టులతో 2009 జూలై వరకూ నిర్వహించబడింది. దాంతోపాటే మొట్టమొదటి తెలుగు టెక్నికల్ ఛాట్ రూమ్ అయిన "కంప్యూటర్ ఎరా సాంకేతిక సహాయం" అనే ఛాట్ రూమ్ రెండేళ్లలో వేలాది మందికి తెలుగు టైప్ చేయడం మొదలుకుని అనేక కంప్యూటర్ సంబంధిత సాంకేతిక సమస్యలకు తక్షణ సహాయం అందించింది. ఇకపోతే http://youtube.com/nallamothu అనే ఛానెల్ లో 361కి పైగా ప్రొఫెషనల్ క్వాలిటీ తెలుగు టెక్నికల్ వీడియోలు అందించాను. ఈ ఛానెల్ కి 1704 మంది సబ్ స్కైబర్లు ఉన్నారు. అందుబాటులో ఉన్న వివిధ మార్గాల ద్వారా తెలుగు వారందరకీ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించే పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాను. My Contact Number: 9000239948 Mail ID: sridharcera@gmail.com

ఇక్కడ RSS Feedకి Subscribe చేసి నేరుగా పోస్ట్ లు పొందండి

ఆండ్రాయిడ్ లో పొందండి!

నా వీడియోలను మీ దగ్గర ఉన్న Android ఫోన్ లో పొందాలంటే ఈ క్రింది లింక్ ని మీ ఫోన్ బ్రౌజర్ లో ఓపెన్ చేసి వెంటనే వచ్చే అప్లికేషన్ ని ఇన్ స్టాల్ చేసుకోండి. అన్ని వీడియోలూ ఎంజాయ్ చేయండి. http://goo.gl/DqsA4

లేదా ఈ క్రింది QR Codeని మీ Android ఫోన్ లోని Barcode Scannerతో స్కాన్ చేస్తే నేరుగా అప్లికేషన్ డౌన్ లోడ్ పేజీకి వెళ్లవచ్చు. Image and video hosting by TinyPic