Home » పిసి చిట్కాలు » Recent Articles:

మీ కంప్యూటర్లో విద్యుత్ ని ఎక్కువ వాడుకుంటున్న అంశాలేమిటి?

కంప్యూటర్ కావచ్చు.. లాప్ టాప్ కావచ్చు.. గంటల తరబడి వాడుతున్నప్పుడు కరెంట్ బిల్లులు తడిసి మోపెడు రావడం సహజం. అసలే వేసవి వస్తోంది. కరెంట్ ఖర్చు తగ్గించుకునే మార్గాలు చూడాలి కదా!

మీ కంప్యూటర్లో ఏయే అంశాలు ఎక్కువ విద్యుత్ ని వినియోగించుకుంటున్నాయో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటో విద్యుత్ వినియోగాన్ని తగ్గించుకోవచ్చో విండోస్ చేతే సజెషన్లు పొందాలంటే ఈ వీడియోలో చూపించిన టెక్నిక్ ని ఫాలో అయిపొండి. మీ పవర్ బిల్లులు తగ్గుతాయి.

మీ వెబ్ సైట్ లోనూ, బ్లాగ్ లోనూ మీకు ఈ వీడియో నచ్చితే రీపబ్లిష్ చేసుకోవచ్చు. మీ బ్లాగ్ లో కొత్త పోస్ట్ చేసేటప్పుడు HTML మోడ్ లో ఉండగా క్రింది లైన్ ని మీ పోస్ట్ లో add చేస్తే ఈ వీడియో వచ్చేస్తుంది.

<iframe width="560" height="315" src="http://www.youtube.com/embed/hWl4wlVezwk" frameborder="0" allowfullscreen></iframe>

 

 

 

180 రోజువారీ పనులు ఒకేచోట చేసుకోండి ఇలా.. (వీడియో డెమో)

కంప్యూటర్ ని వాడేటప్పుడు వేర్వేరు పనులు చేయడానికి వేర్వేరు చోట్లకి కష్టపడి వెళ్లనవసరం లేదు.

హ్యాంగ్ అయిన అప్లికేషన్లనీ అక్కడి నుండే క్లోజ్ చేసుకోవచ్చు.. మీ దగ్గరున్న ఫొటోల్నీ ఒక ఫార్మేట్ నుండి మరో ఫార్మేట్ కి అదేచోట మార్చుకోవచ్చు..

ఒక పదాన్ని కేవలం గూగుల్ తో సరిపెట్టుకోకుండా అనేక చోట్ల అక్కడికక్కడే వెదుక్కోవచ్చు..  ట్రాన్స్ లేషన్, కంప్యూటర్ పనితీరు వివరాలు చూడడం, మనం తరచూ వాడే వెబ్ సైట్లకి షార్ట్ కట్ లు పెట్టుకోవడం..

ఇలా 180కి పైగా రోజువారీ మనకు అవసరం అయ్యే పనుల్ని ఒకేచోటి నుండి చేసుకోవడం ఎలాగో తెలుసుకోవాలనుకుంటున్నారా?

అయితే ఇంకెందుకు ఆలస్యం.. ఈ వీడియో చూస్తే ఆ సీక్రెట్ తెలిసిపోతుంది. అందరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కీ షేర్ చెయ్యగలరు.

మీ వెబ్ సైట్ లోనూ, బ్లాగ్ లోనూ మీకు ఈ వీడియో నచ్చితే రీపబ్లిష్ చేసుకోవచ్చు. మీ బ్లాగ్ లో కొత్త పోస్ట్ చేసేటప్పుడు HTML మోడ్ లో ఉండగా క్రింది లైన్ ని మీ పోస్ట్ లో add చేస్తే ఈ వీడియో వచ్చేస్తుంది.

<iframe width="560" height="315" src="http://www.youtube.com/embed/kTYii3G53qc" frameborder="0" allowfullscreen></iframe>

 

 

 

Windows 7, Vistaలలో “C” లాంగ్వేజ్ ఇలా బ్రహ్మాంఢంగా పనిచేస్తుంది..

95% మంది ఇంజనీరింగ్ స్టూడెంట్లు పాతకాలం Windows XPనే వాడుతుంటారు. అదేమంటే విండోస్ Vista, 7 ఆపరేటింగ్ సిస్టమ్ లలో C, C++ లు పనిచేయడం లేదని కంప్లయింట్లు చేస్తుంటారు.

Windows 7లో “C” పనిచేయడం లేదనేది ఓ కంప్యూటర్ ఇంజనీరింగ్ స్టూడెంట్ గా చేయాల్సిన కంప్లయింట్ కాదు. దానికి ఎన్నో సొల్యూషన్లు ఉన్నాయి. వాటన్నింటిలోకీ బెస్ట్ సొల్యూషన్ ని ఈ వీడియోలో పరిచయం చేస్తున్నాను.

మీరు ఎలాంటి సెట్టింగులూ మార్చుకోవలసిన పనిలేదు. సింపుల్ గా ఈ వీడియోలో చూపించినట్లు చేయండి చాలు.

ప్రతీ ఇంజనీరింగ్ విద్యార్థీ, బయట ఇనిస్టిట్యూట్ లలో C, C++ నేర్చుకునే ప్రతీ ఒక్కరూ ఖచ్చితంగా తెలుసుకోవలసిన టెక్నిక్ ఇది.

ఆ ఏముందిలే.. “XPనే వాడేస్తే సరిపోతుంది కదా..” అని సరిపెట్టుకున్నారంటే ఎప్పటికప్పుడు డైనమిక్ గా ఉండే కంప్యూటర్ రంగంలో రాణించడం చాలా కష్టం.

సో ఇప్పటికీ టెక్నికల్ గా వెనుకబాటుతనంలో ఉన్న ఎందరో విద్యార్థులకు ఉపయోగపడే ఈ వీడియోని వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేసి వారిని చైతన్యపరచగలరు.

http://bit.ly/sriCLang

మీ వెబ్ సైట్ లోనూ, బ్లాగ్ లోనూ మీకు ఈ వీడియో నచ్చితే రీపబ్లిష్ చేసుకోవచ్చు. మీ బ్లాగ్ లో కొత్త పోస్ట్ చేసేటప్పుడు HTML మోడ్ లో ఉండగా క్రింది లైన్ ని మీ పోస్ట్ లో add చేస్తే ఈ వీడియో వచ్చేస్తుంది.

<iframe width="560" height="315" src="http://www.youtube.com/embed/4hnnqgx_tjk" frameborder="0" allowfullscreen></iframe>

 

 

 

బ్లూ టెర్రర్ – Must Watch

ఉన్న ఫళాన బ్లూ స్క్రీన్ వచ్చి కంప్యూటర్ రీస్టార్ట్ అయిపోవడం అనుభవమే.

మనందరం దీని బాధితులమే. కానీ కారణాలూ, పరిష్కారాలూ మాత్రం తెలుసుకోం. ప్రతీ చిన్న దానికీ ఎవరి మీదనో ఆధారపడే కన్నా అస్సలు ఇలాంటి ఇబ్బందులు ఎందుకు వస్తాయో కారణాలూ, పరిష్కారాలూ తెలుసుకుంటే అంతా మన కంట్రోల్ లో ఉంటుంది కదా?

ప్రతీ కంప్యూటర్ యూజర్ తప్పనిసరిగా చూడాల్సిన వీడియో ఇది.. వీడియో చూశాక ఆ విషయం మీకు అర్థమవుతుంది.  ఈ వీడియోని మీ మిత్రులకూ షేర్ చేయడం ద్వారా వారూ నాలెడ్జ్ పొందేలా చూడగలరు.

మీ వెబ్ సైట్ లోనూ, బ్లాగ్ లోనూ మీకు ఈ వీడియో నచ్చితే రీపబ్లిష్ చేసుకోవచ్చు. మీ బ్లాగ్ లో కొత్త పోస్ట్ చేసేటప్పుడు HTML మోడ్ లో ఉండగా క్రింది లైన్ ని మీ పోస్ట్ లో add చేస్తే ఈ వీడియో వచ్చేస్తుంది.

<iframe width="560" height="315" src="http://www.youtube.com/embed/M9tA-RD0bGU" frameborder="0" allowfullscreen></iframe>

 

 

 

ఇక అన్ని అప్ డేట్లూ ముందే ఇలా షెడ్యూల్ చేసుకోండి (వీడియో డెమో)

మీకు కంప్యూటర్, ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోయినా ఫర్వాలేదు.

మీరు కోరుకున్న ఫేస్ బుక్, ట్విట్టర్ అప్ డేట్లు మాత్రం ఠంచనుగా పోస్ట్ అయిపోతాయి. అవి text కావచ్చు, మీరు ఎంచుకున్న ఫొటోలు కావచ్చు, లింకులు కావచ్చు.

అదెలా సాధ్యం అనుకుంటున్నారా? పండగలప్పుడూ, పబ్లిక్ హాలిడేస్ సమయంలోనూ అందర్నీ విష్ చేస్తూ ముందే మీరు షెడ్యూల్డ్ మెసేజ్ లు పెట్టుకునే టెక్నిక్ ని ఈ వీడియోలో చూపించాను.

దీని సాయంతో మీరు ఎప్పుడైనా ఆటోమేటిక్ గా మీ ఫొటోల్నీ, మెసేజ్ ల్నీ మీ Facebook, Twitter, Linkedin అకౌంట్లలో పోస్ట్ చేయొచ్చు.

ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ మిత్రులకూ షేర్ చేయడం ద్వారా వారూ ఈ సదుపాయాన్ని వాడుకునేలా చూడగలరు.

http://bit.ly/sriFBupdates

మీ వెబ్ సైట్ లోనూ, బ్లాగ్ లోనూ మీకు ఈ వీడియో నచ్చితే రీపబ్లిష్ చేసుకోవచ్చు. మీ బ్లాగ్ లో కొత్త పోస్ట్ చేసేటప్పుడు HTML మోడ్ లో ఉండగా క్రింది లైన్ ని మీ పోస్ట్ లో add చేస్తే ఈ వీడియో వచ్చేస్తుంది.

<iframe width="560" height="315" src="http://www.youtube.com/embed/POO1_sbFtnE" frameborder="0" allowfullscreen></iframe>

 

 

 

అమ్మో.. డేటా డిలీట్ చేస్తారేమో..! (వీడియో డెమో)

చిన్న పిల్లలకో, అపరిచితులకో కంప్యూటర్ వదిలి వెళ్లాలంటే ఎవరైనా భయపడతారు కదా?

కంప్యూటర్లో ఉన్న అతి ముఖ్యమైన ఫైళ్లని, ఫోల్డర్లని వారెక్కడ పొరబాటునో/కావాలనో డిలీట్ చేస్తారేమోనన్నదే ఈ భయానికి కారణం.

ఒక్కోసారి మనమూ ఏదో ఆలోచిస్తూ ముఖ్యమైన ఫోల్డర్లని ఉన్న ఫళాన డిలీట్ చేసి పారేస్తుంటాం కూడా!

మన డేటా అంత ముఖ్యమైనదని భావించేటప్పుడు.. ఎవరూ ఆ డేటాని డిలీట్ చేయడానికి లేకుండా కాపాడుకుంటే గొడవ వదిలిపోతుంది కదా? ఎంచక్కా ఎవరికైనా పిసిని అలా వదిలేసి వెళ్లిపోవచ్చు.

మన కంప్యూటర్లోని ముఖ్యమైన ఫైళ్లని, ఫోల్డర్లని పొరబాటున కూడా ఎవరూ డిలీట్ చేయకుండా రక్షించుకోవడం ఎలాగో ఈ వీడియోలో చూపించాను.

ప్రతీ ఒక్కరికీ ఎంతో ఉపయోగపడే ఈ టెక్నిక్ ని మీ ఫ్రెండ్స్ కీ షేర్ చేయడం ద్వారా వారూ ఈ నాలెడ్జ్ పొందేలా చూడగలరు.

మీ వెబ్ సైట్ లోనూ, బ్లాగ్ లోనూ మీకు ఈ వీడియో నచ్చితే రీపబ్లిష్ చేసుకోవచ్చు. మీ బ్లాగ్ లో కొత్త పోస్ట్ చేసేటప్పుడు HTML మోడ్ లో ఉండగా క్రింది లైన్ ని మీ పోస్ట్ లో add చేస్తే ఈ వీడియో వచ్చేస్తుంది.

<iframe width="560" height="315" src="http://www.youtube.com/embed/jyk9KsG7ZT0" frameborder="0" allowfullscreen></iframe>

 

 

 

డివిడి తయారీ కంపెనీలు మనల్ని మోసం చేస్తున్నాయా?

ఈ ప్రశ్న చాలామంది నాకు వేశారు.. అందుకే ఈ వీడియో చేయాల్సి వచ్చింది.

ఇంతకీ ఎందుకు అందరూ అలా ప్రశ్నిస్తున్నారంటే “మామూలు డివిడిలో 4.7 GB డేటా పట్టినప్పుడు Double Layer డివిడిలో దానికి రెట్టింపు డేటా అంటే 9.4 GB పట్టాలి కదా! మరి విచిత్రంగా కేవలం 8.5 GB డేటానే ఎందుకు పడుతోంది” అన్నది అందరి సందేహం. ఇది చదివాక మీకూ ఇదే డౌట్ వచ్చి ఉంటుంది. ఈ వీడియో చూస్తే మీ సందేహం ఇట్టే తీరిపోతుంది.

మీ వెబ్ సైట్ లోనూ, బ్లాగ్ లోనూ మీకు ఈ వీడియో నచ్చితే రీపబ్లిష్ చేసుకోవచ్చు. మీ బ్లాగ్ లో కొత్త పోస్ట్ చేసేటప్పుడు HTML మోడ్ లో ఉండగా క్రింది లైన్ ని మీ పోస్ట్ లో add చేస్తే ఈ వీడియో వచ్చేస్తుంది.

<iframe width="560" height="315" src="http://www.youtube.com/embed/d4EQzEMoDCU" frameborder="0" allowfullscreen></iframe>

 

 

 

ఆంధ్రప్రభ డైలీ పేపర్ లోని నిన్నటి నా టెక్నాలజీ కాలమ్ ఇది

ఆంధ్రప్రభ డైలీ పేపర్ లో ప్రతీ సోమవారం ప్రచురించబడుతున్న నా "సైన్స్ అండ్ టెక్నాలజీ" కాలమ్ లో నిన్నటి (30th Jan 2012) సంచిక ఇది.

ఆంధ్రప్రభలో నల్లమోతు శ్రీధర్ టెక్నాలజీ కాలమ్
Full Page at a glance

Andhra Prabha ఆంధ్రప్రభ లో నల్లమోతు శ్రీధర్ టెక్నాలజీ కాలమ్ మొదటి భాగం

Page Top Side

ఆంధ్రప్రభ డైలీ పేపర్ లో టెక్నాలజీ కాలమ్ నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

Bottom Side

 

 

 

ముఖ్యమైన ఫైల్ కరప్ట్ అయిందా? కారణాలు ఇవి.. Must Watch

ఆ ఒక్క ఫైల్ లో మీ జీవితం ముడిపడి ఉందనుకుందాం.. లేదా ఎన్నో గంటలు కష్టపడి ఆ ఫైల్ ని తయారు చేసుకున్నారనుకుందాం.

ఓ ఫైన్ మార్నింగ్ అవసరం పడి ఆ ఫైల్ ని ఓపెన్ చేయబోతే File Corrupted.. మాదిరి మెసేజ్ వస్తే ఎంత బాధగా ఉంటుంది? ఇప్పటివరకూ మీకు ఇలాంటి సమస్యలేమీ రాకపోయినా మున్ముందు ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోపోతే ఫైళ్లు కరప్ట్ అవడం చాలా మామూలు విషయం.

అది మీ రెజ్యూమ్ కావచ్చు, ఫొటో కావచ్చు, నెట్ నుండి డౌన్ లోడ్ చేసుకున్న ఫైల్ కావచ్చు.. ఎందుకు కరప్ట్ అవుతుంది అన్నది చాలా వివరంగా ఈ వీడియోలో చెప్పడం జరిగింది. ఈ వీడియో చూస్తే File corruptionపై మీకు పూర్తి అవగాహన ఏర్పడుతుంది. ఇకపై జాగ్రత్తగా ఉండొచ్చు.

మీ వెబ్ సైట్ లోనూ, బ్లాగ్ లోనూ మీకు ఈ వీడియో నచ్చితే రీపబ్లిష్ చేసుకోవచ్చు. మీ బ్లాగ్ లో కొత్త పోస్ట్ చేసేటప్పుడు HTML మోడ్ లో ఉండగా క్రింది లైన్ ని మీ పోస్ట్ లో add చేస్తే ఈ వీడియో వచ్చేస్తుంది.

<iframe width="560" height="315" frameborder="0" allowfullscreen="" src="http://www.youtube.com/embed/ip6bOy0xKjQ"></iframe></p>

 

 

మీ హార్డ్ డిస్క్ ఎప్పుడైనా ఫెయిలైపోవచ్చు.. నమ్మలేకపోతున్నారా? ఇది చూడండి

ఉన్న ఫళాన హార్డ్ డిస్క్ dead అయిపోతే అందులో మీరు ఎంతో కష్టపడి సేవ్ చేసుకున్న ఫైళ్లూ, డేటా అంతా ఏమైపోవాలి? ఆలోచించండి. “హార్డ్ డిస్క్ ఎందుకు ఫెయిలవుతుందిలే” అని ధీమాగా ఉండకండి.

ఇక్కడ నా 3 హార్డ్ డిస్కులలో ఒకటి ఫెయిల్ అవడానికి ఎంత దగ్గరగా ఉందో ఈ వీడియోలో చూస్తే మీరు ఇంకే మాత్రం ఆలస్యం చెయ్యరు.

C, D, E, F వంటి అన్ని డ్రైవ్ లూ ఉండే మీ హార్డ్ డిస్క్ పూర్తిగా పనిచేయకుండా ఆగిపోకముందే ఈ వీడియోలో నేను చూపించిన పద్ధతిలో వాటి హెల్త్ కండిషన్ తెలుసుకుని డేటా బ్యాకప్ తీసుకోండి.

మీ వెబ్ సైట్ లోనూ, బ్లాగ్ లోనూ మీకు ఈ వీడియో నచ్చితే రీపబ్లిష్ చేసుకోవచ్చు. మీ బ్లాగ్ లో కొత్త పోస్ట్ చేసేటప్పుడు HTML మోడ్ లో ఉండగా క్రింది లైన్ ని మీ పోస్ట్ లో add చేస్తే ఈ వీడియో వచ్చేస్తుంది.

<iframe width="560" height="315" src="http://www.youtube.com/embed/_E0yjj0Ys74" frameborder="0" allowfullscreen></iframe>

 

 

 

Search This Site:

About Me

1996వ సంవత్సరంలో తెలుగులో మొట్టమొదట కంప్యూటర్ సాహిత్యాన్ని ప్రారంభించే అవకాశం నాకు కలిగింది. అదే సమయంలో చెన్నైలో సూపర్ హిట్ తెలుగు ఫిల్మ్ మేగజైన్ కి సబ్ ఎడిటర్ గా కూడా ఏకకాలంలో పనిచేస్తూ 1998 వరకూ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, మనీషా కొయిరాలా, శంకర్, రజనీకాంత్, కమల్ హాసన్ వంటి ప్రముఖులెందరినో ఇంటర్వ్యూలు చేయడం మర్చిపోలేని అనుభవం. అయితే సినిమా రంగంలో ఉన్న అనారోగ్యకరమైన వాతావరణం వల్ల నాకంటూ ఓ ప్రత్యేకమైన ఉనికిని సృష్టించుకోవడం కోసం సినిమా రంగం నుండి బయటకు వచ్చి పూర్తిగా టెక్నాలజీ రంగంలో స్థిరపడడం జరిగింది. 96 నుండి 2001 వరకూ పలు కంప్యూటర్ పత్రికలకు ఎడిటర్ గా పనిచేసి.. 2001 నుండి "కంప్యూటర్ ఎరా" తెలుగు మంత్లీ మేగజైన్ ఎడిటర్ గా పత్రిక మొత్తాన్నీ రూపొందిస్తూ ఉన్నాను. అలాగే తెలుగు టెలివిజన్ ఛానెళ్లలో మొట్టమొదటి టెక్నికల్ phone-in ప్రోగ్రామ్ కి గెస్ట్ గా అటెండ్ అయ్యే అవకాశమూ 2010 జనవరి 20న కలిగింది. అప్పటి నుండి ఇప్పటివరకూ TV 9, ABN, I News, ETV2, NTV, Zee 24 గంటలు, Studio N, సాక్షి టివి, మహా టివి, జాగృతి న్యూస్ వంటి ఛానెళ్లలో 100కి పైగా లైవ్, రికార్డెడ్ ప్రోగ్రాముల్ని చేయడం జరిగింది. 2007లో అత్యుత్తమైన నాణ్యతతో కూడిన పోస్టులతో, వీడియోలతో తెలుగులో మొదటి ప్రొఫెషనల్ టెక్నికల్ బ్లాగ్ గానూ, మొదటి వీడియో బ్లాగ్ గానూ ఇప్పుడు మీరు చూస్తున్న బ్లాగ్ ప్రత్యేకతను సంతరించుకుంది. అలాగే 2007 జనవరి 1న ప్రారంభించిన తెలుగులోనే మొట్టమొదటి టెక్నికల్ ఫోరమ్ అయిన "కంప్యూటర్ ఎరా సాంకేతిక ఫోరమ్" 14 వేల మంది సభ్యులతో 10 వేలకు పైగా పోస్టులతో 2009 జూలై వరకూ నిర్వహించబడింది. దాంతోపాటే మొట్టమొదటి తెలుగు టెక్నికల్ ఛాట్ రూమ్ అయిన "కంప్యూటర్ ఎరా సాంకేతిక సహాయం" అనే ఛాట్ రూమ్ రెండేళ్లలో వేలాది మందికి తెలుగు టైప్ చేయడం మొదలుకుని అనేక కంప్యూటర్ సంబంధిత సాంకేతిక సమస్యలకు తక్షణ సహాయం అందించింది. ఇకపోతే http://youtube.com/nallamothu అనే ఛానెల్ లో 361కి పైగా ప్రొఫెషనల్ క్వాలిటీ తెలుగు టెక్నికల్ వీడియోలు అందించాను. ఈ ఛానెల్ కి 1704 మంది సబ్ స్కైబర్లు ఉన్నారు. అందుబాటులో ఉన్న వివిధ మార్గాల ద్వారా తెలుగు వారందరకీ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించే పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాను. My Contact Number: 9000239948 Mail ID: sridharcera@gmail.com

ఇక్కడ RSS Feedకి Subscribe చేసి నేరుగా పోస్ట్ లు పొందండి

ఆండ్రాయిడ్ లో పొందండి!

నా వీడియోలను మీ దగ్గర ఉన్న Android ఫోన్ లో పొందాలంటే ఈ క్రింది లింక్ ని మీ ఫోన్ బ్రౌజర్ లో ఓపెన్ చేసి వెంటనే వచ్చే అప్లికేషన్ ని ఇన్ స్టాల్ చేసుకోండి. అన్ని వీడియోలూ ఎంజాయ్ చేయండి. http://goo.gl/DqsA4

లేదా ఈ క్రింది QR Codeని మీ Android ఫోన్ లోని Barcode Scannerతో స్కాన్ చేస్తే నేరుగా అప్లికేషన్ డౌన్ లోడ్ పేజీకి వెళ్లవచ్చు. Image and video hosting by TinyPic