Home » వీడియోలు » Recent Articles:

మీ కంప్యూటర్లో విద్యుత్ ని ఎక్కువ వాడుకుంటున్న అంశాలేమిటి?

కంప్యూటర్ కావచ్చు.. లాప్ టాప్ కావచ్చు.. గంటల తరబడి వాడుతున్నప్పుడు కరెంట్ బిల్లులు తడిసి మోపెడు రావడం సహజం. అసలే వేసవి వస్తోంది. కరెంట్ ఖర్చు తగ్గించుకునే మార్గాలు చూడాలి కదా!

మీ కంప్యూటర్లో ఏయే అంశాలు ఎక్కువ విద్యుత్ ని వినియోగించుకుంటున్నాయో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటో విద్యుత్ వినియోగాన్ని తగ్గించుకోవచ్చో విండోస్ చేతే సజెషన్లు పొందాలంటే ఈ వీడియోలో చూపించిన టెక్నిక్ ని ఫాలో అయిపొండి. మీ పవర్ బిల్లులు తగ్గుతాయి.

మీ వెబ్ సైట్ లోనూ, బ్లాగ్ లోనూ మీకు ఈ వీడియో నచ్చితే రీపబ్లిష్ చేసుకోవచ్చు. మీ బ్లాగ్ లో కొత్త పోస్ట్ చేసేటప్పుడు HTML మోడ్ లో ఉండగా క్రింది లైన్ ని మీ పోస్ట్ లో add చేస్తే ఈ వీడియో వచ్చేస్తుంది.

<iframe width="560" height="315" src="http://www.youtube.com/embed/hWl4wlVezwk" frameborder="0" allowfullscreen></iframe>

 

 

 

TV9లో నిన్న WallPostపై అభిప్రాయం ఇది

TV9లో wallpost.com సోషల్ నెట్ వర్కింగ్ సైట్ గురించి నిన్న రాత్రి (17 ఫిబ్రవరి 2012) ప్రసారమైన కధనంలో నా అభిప్రాయాన్ని ఈ వీడియోలో చూడవచ్చు.

 

ABNలో హ్యాకింగ్ పై ఈరోజు జరిగిన డిస్కషన్ ఇది

ABN ఆంధ్రజ్యోతి ఛానెల్ లో ఈరోజు (17th Feb 2012) ఉదయం 7.30 నుండి 8 వరకూ 27 ప్రభుత్వ వెబ్ సైట్లు హ్యాక్ అవడంపై  జరిగిన నా లైవ్ డిస్కషన్ ఇది.

 

ETV2 సఖిలో నిన్న (ఫిబ్రవరి 15, 2012) ప్రసారమైన నా ప్రోగ్రామ్ వీడియో ఇది

జూలై 2010 నుండి ETV2లో సఖి.కామ్ పేరుతో ప్రసారం అవుతున్న నా టెక్నాలజీ సంబంధిత ప్రోగ్రామ్ లో భాగంగా నిన్న (ఫిబ్రవరి 15, 2012)న ప్రసారమైన ప్రోగ్రామ్ ని చూడడం మిస్ అయిన వారు ఈ క్రింద చూడవచ్చు.

మీ వెబ్ సైట్ లోనూ, బ్లాగ్ లోనూ మీకు ఈ వీడియో నచ్చితే రీపబ్లిష్ చేసుకోవచ్చు. మీ బ్లాగ్ లో కొత్త పోస్ట్ చేసేటప్పుడు HTML మోడ్ లో ఉండగా క్రింది లైన్ ని మీ పోస్ట్ లో add చేస్తే ఈ వీడియో వచ్చేస్తుంది.

<iframe width="560" height="315" src="http://www.youtube.com/embed/kTYii3G53qc" frameborder="0" allowfullscreen></iframe>

 

 

 

180 రోజువారీ పనులు ఒకేచోట చేసుకోండి ఇలా.. (వీడియో డెమో)

కంప్యూటర్ ని వాడేటప్పుడు వేర్వేరు పనులు చేయడానికి వేర్వేరు చోట్లకి కష్టపడి వెళ్లనవసరం లేదు.

హ్యాంగ్ అయిన అప్లికేషన్లనీ అక్కడి నుండే క్లోజ్ చేసుకోవచ్చు.. మీ దగ్గరున్న ఫొటోల్నీ ఒక ఫార్మేట్ నుండి మరో ఫార్మేట్ కి అదేచోట మార్చుకోవచ్చు..

ఒక పదాన్ని కేవలం గూగుల్ తో సరిపెట్టుకోకుండా అనేక చోట్ల అక్కడికక్కడే వెదుక్కోవచ్చు..  ట్రాన్స్ లేషన్, కంప్యూటర్ పనితీరు వివరాలు చూడడం, మనం తరచూ వాడే వెబ్ సైట్లకి షార్ట్ కట్ లు పెట్టుకోవడం..

ఇలా 180కి పైగా రోజువారీ మనకు అవసరం అయ్యే పనుల్ని ఒకేచోటి నుండి చేసుకోవడం ఎలాగో తెలుసుకోవాలనుకుంటున్నారా?

అయితే ఇంకెందుకు ఆలస్యం.. ఈ వీడియో చూస్తే ఆ సీక్రెట్ తెలిసిపోతుంది. అందరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కీ షేర్ చెయ్యగలరు.

మీ వెబ్ సైట్ లోనూ, బ్లాగ్ లోనూ మీకు ఈ వీడియో నచ్చితే రీపబ్లిష్ చేసుకోవచ్చు. మీ బ్లాగ్ లో కొత్త పోస్ట్ చేసేటప్పుడు HTML మోడ్ లో ఉండగా క్రింది లైన్ ని మీ పోస్ట్ లో add చేస్తే ఈ వీడియో వచ్చేస్తుంది.

<iframe width="560" height="315" src="http://www.youtube.com/embed/kTYii3G53qc" frameborder="0" allowfullscreen></iframe>

 

 

 

గూగుల్ కొత్త ప్రైవసీ పాలసీ గురించి TV9లో నిన్నటి నా అభిప్రాయం ఇది

గూగుల్ ప్రైవసీ పాలసీ గురించి TV9లో నిన్న (12 ఫిబ్రవరి ఆదివారం)  ప్రసారమైన కధనంలో నా అభిప్రాయాలు ఈ వీడియోలో చూడవచ్చు

Windows 7, Vistaలలో “C” లాంగ్వేజ్ ఇలా బ్రహ్మాంఢంగా పనిచేస్తుంది..

95% మంది ఇంజనీరింగ్ స్టూడెంట్లు పాతకాలం Windows XPనే వాడుతుంటారు. అదేమంటే విండోస్ Vista, 7 ఆపరేటింగ్ సిస్టమ్ లలో C, C++ లు పనిచేయడం లేదని కంప్లయింట్లు చేస్తుంటారు.

Windows 7లో “C” పనిచేయడం లేదనేది ఓ కంప్యూటర్ ఇంజనీరింగ్ స్టూడెంట్ గా చేయాల్సిన కంప్లయింట్ కాదు. దానికి ఎన్నో సొల్యూషన్లు ఉన్నాయి. వాటన్నింటిలోకీ బెస్ట్ సొల్యూషన్ ని ఈ వీడియోలో పరిచయం చేస్తున్నాను.

మీరు ఎలాంటి సెట్టింగులూ మార్చుకోవలసిన పనిలేదు. సింపుల్ గా ఈ వీడియోలో చూపించినట్లు చేయండి చాలు.

ప్రతీ ఇంజనీరింగ్ విద్యార్థీ, బయట ఇనిస్టిట్యూట్ లలో C, C++ నేర్చుకునే ప్రతీ ఒక్కరూ ఖచ్చితంగా తెలుసుకోవలసిన టెక్నిక్ ఇది.

ఆ ఏముందిలే.. “XPనే వాడేస్తే సరిపోతుంది కదా..” అని సరిపెట్టుకున్నారంటే ఎప్పటికప్పుడు డైనమిక్ గా ఉండే కంప్యూటర్ రంగంలో రాణించడం చాలా కష్టం.

సో ఇప్పటికీ టెక్నికల్ గా వెనుకబాటుతనంలో ఉన్న ఎందరో విద్యార్థులకు ఉపయోగపడే ఈ వీడియోని వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేసి వారిని చైతన్యపరచగలరు.

http://bit.ly/sriCLang

మీ వెబ్ సైట్ లోనూ, బ్లాగ్ లోనూ మీకు ఈ వీడియో నచ్చితే రీపబ్లిష్ చేసుకోవచ్చు. మీ బ్లాగ్ లో కొత్త పోస్ట్ చేసేటప్పుడు HTML మోడ్ లో ఉండగా క్రింది లైన్ ని మీ పోస్ట్ లో add చేస్తే ఈ వీడియో వచ్చేస్తుంది.

<iframe width="560" height="315" src="http://www.youtube.com/embed/4hnnqgx_tjk" frameborder="0" allowfullscreen></iframe>

 

 

 

బ్లూ టెర్రర్ – Must Watch

ఉన్న ఫళాన బ్లూ స్క్రీన్ వచ్చి కంప్యూటర్ రీస్టార్ట్ అయిపోవడం అనుభవమే.

మనందరం దీని బాధితులమే. కానీ కారణాలూ, పరిష్కారాలూ మాత్రం తెలుసుకోం. ప్రతీ చిన్న దానికీ ఎవరి మీదనో ఆధారపడే కన్నా అస్సలు ఇలాంటి ఇబ్బందులు ఎందుకు వస్తాయో కారణాలూ, పరిష్కారాలూ తెలుసుకుంటే అంతా మన కంట్రోల్ లో ఉంటుంది కదా?

ప్రతీ కంప్యూటర్ యూజర్ తప్పనిసరిగా చూడాల్సిన వీడియో ఇది.. వీడియో చూశాక ఆ విషయం మీకు అర్థమవుతుంది.  ఈ వీడియోని మీ మిత్రులకూ షేర్ చేయడం ద్వారా వారూ నాలెడ్జ్ పొందేలా చూడగలరు.

మీ వెబ్ సైట్ లోనూ, బ్లాగ్ లోనూ మీకు ఈ వీడియో నచ్చితే రీపబ్లిష్ చేసుకోవచ్చు. మీ బ్లాగ్ లో కొత్త పోస్ట్ చేసేటప్పుడు HTML మోడ్ లో ఉండగా క్రింది లైన్ ని మీ పోస్ట్ లో add చేస్తే ఈ వీడియో వచ్చేస్తుంది.

<iframe width="560" height="315" src="http://www.youtube.com/embed/M9tA-RD0bGU" frameborder="0" allowfullscreen></iframe>

 

 

 

ఇక అన్ని అప్ డేట్లూ ముందే ఇలా షెడ్యూల్ చేసుకోండి (వీడియో డెమో)

మీకు కంప్యూటర్, ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోయినా ఫర్వాలేదు.

మీరు కోరుకున్న ఫేస్ బుక్, ట్విట్టర్ అప్ డేట్లు మాత్రం ఠంచనుగా పోస్ట్ అయిపోతాయి. అవి text కావచ్చు, మీరు ఎంచుకున్న ఫొటోలు కావచ్చు, లింకులు కావచ్చు.

అదెలా సాధ్యం అనుకుంటున్నారా? పండగలప్పుడూ, పబ్లిక్ హాలిడేస్ సమయంలోనూ అందర్నీ విష్ చేస్తూ ముందే మీరు షెడ్యూల్డ్ మెసేజ్ లు పెట్టుకునే టెక్నిక్ ని ఈ వీడియోలో చూపించాను.

దీని సాయంతో మీరు ఎప్పుడైనా ఆటోమేటిక్ గా మీ ఫొటోల్నీ, మెసేజ్ ల్నీ మీ Facebook, Twitter, Linkedin అకౌంట్లలో పోస్ట్ చేయొచ్చు.

ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ మిత్రులకూ షేర్ చేయడం ద్వారా వారూ ఈ సదుపాయాన్ని వాడుకునేలా చూడగలరు.

http://bit.ly/sriFBupdates

మీ వెబ్ సైట్ లోనూ, బ్లాగ్ లోనూ మీకు ఈ వీడియో నచ్చితే రీపబ్లిష్ చేసుకోవచ్చు. మీ బ్లాగ్ లో కొత్త పోస్ట్ చేసేటప్పుడు HTML మోడ్ లో ఉండగా క్రింది లైన్ ని మీ పోస్ట్ లో add చేస్తే ఈ వీడియో వచ్చేస్తుంది.

<iframe width="560" height="315" src="http://www.youtube.com/embed/POO1_sbFtnE" frameborder="0" allowfullscreen></iframe>

 

 

 

ETV 2 సఖిలో నిన్న(3 ఫిబ్రవరి 2012) ప్రసారమైన నా సఖి.కామ్ ప్రోగ్రామ్ ఇది

జూలై 2010 నుండి ETV 2 సఖి కార్యక్రమంలో ధారావాహికగా ప్రసారం అవుతున్న నా సఖి.కామ్ ప్రోగ్రామ్ లో భాగంగా బేసిక్ ఫొటో ఎడిటింగ్ పై నిన్న (ఫిబ్రవరి 3, 2012) ప్రసారమైన ఎపిసోడ్ ని ఈ క్రింది వీడియోలో చూడవచ్చు

 

Search This Site:

About Me

1996వ సంవత్సరంలో తెలుగులో మొట్టమొదట కంప్యూటర్ సాహిత్యాన్ని ప్రారంభించే అవకాశం నాకు కలిగింది. అదే సమయంలో చెన్నైలో సూపర్ హిట్ తెలుగు ఫిల్మ్ మేగజైన్ కి సబ్ ఎడిటర్ గా కూడా ఏకకాలంలో పనిచేస్తూ 1998 వరకూ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, మనీషా కొయిరాలా, శంకర్, రజనీకాంత్, కమల్ హాసన్ వంటి ప్రముఖులెందరినో ఇంటర్వ్యూలు చేయడం మర్చిపోలేని అనుభవం. అయితే సినిమా రంగంలో ఉన్న అనారోగ్యకరమైన వాతావరణం వల్ల నాకంటూ ఓ ప్రత్యేకమైన ఉనికిని సృష్టించుకోవడం కోసం సినిమా రంగం నుండి బయటకు వచ్చి పూర్తిగా టెక్నాలజీ రంగంలో స్థిరపడడం జరిగింది. 96 నుండి 2001 వరకూ పలు కంప్యూటర్ పత్రికలకు ఎడిటర్ గా పనిచేసి.. 2001 నుండి "కంప్యూటర్ ఎరా" తెలుగు మంత్లీ మేగజైన్ ఎడిటర్ గా పత్రిక మొత్తాన్నీ రూపొందిస్తూ ఉన్నాను. అలాగే తెలుగు టెలివిజన్ ఛానెళ్లలో మొట్టమొదటి టెక్నికల్ phone-in ప్రోగ్రామ్ కి గెస్ట్ గా అటెండ్ అయ్యే అవకాశమూ 2010 జనవరి 20న కలిగింది. అప్పటి నుండి ఇప్పటివరకూ TV 9, ABN, I News, ETV2, NTV, Zee 24 గంటలు, Studio N, సాక్షి టివి, మహా టివి, జాగృతి న్యూస్ వంటి ఛానెళ్లలో 100కి పైగా లైవ్, రికార్డెడ్ ప్రోగ్రాముల్ని చేయడం జరిగింది. 2007లో అత్యుత్తమైన నాణ్యతతో కూడిన పోస్టులతో, వీడియోలతో తెలుగులో మొదటి ప్రొఫెషనల్ టెక్నికల్ బ్లాగ్ గానూ, మొదటి వీడియో బ్లాగ్ గానూ ఇప్పుడు మీరు చూస్తున్న బ్లాగ్ ప్రత్యేకతను సంతరించుకుంది. అలాగే 2007 జనవరి 1న ప్రారంభించిన తెలుగులోనే మొట్టమొదటి టెక్నికల్ ఫోరమ్ అయిన "కంప్యూటర్ ఎరా సాంకేతిక ఫోరమ్" 14 వేల మంది సభ్యులతో 10 వేలకు పైగా పోస్టులతో 2009 జూలై వరకూ నిర్వహించబడింది. దాంతోపాటే మొట్టమొదటి తెలుగు టెక్నికల్ ఛాట్ రూమ్ అయిన "కంప్యూటర్ ఎరా సాంకేతిక సహాయం" అనే ఛాట్ రూమ్ రెండేళ్లలో వేలాది మందికి తెలుగు టైప్ చేయడం మొదలుకుని అనేక కంప్యూటర్ సంబంధిత సాంకేతిక సమస్యలకు తక్షణ సహాయం అందించింది. ఇకపోతే http://youtube.com/nallamothu అనే ఛానెల్ లో 361కి పైగా ప్రొఫెషనల్ క్వాలిటీ తెలుగు టెక్నికల్ వీడియోలు అందించాను. ఈ ఛానెల్ కి 1704 మంది సబ్ స్కైబర్లు ఉన్నారు. అందుబాటులో ఉన్న వివిధ మార్గాల ద్వారా తెలుగు వారందరకీ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించే పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాను. My Contact Number: 9000239948 Mail ID: sridharcera@gmail.com

ఇక్కడ RSS Feedకి Subscribe చేసి నేరుగా పోస్ట్ లు పొందండి

ఆండ్రాయిడ్ లో పొందండి!

నా వీడియోలను మీ దగ్గర ఉన్న Android ఫోన్ లో పొందాలంటే ఈ క్రింది లింక్ ని మీ ఫోన్ బ్రౌజర్ లో ఓపెన్ చేసి వెంటనే వచ్చే అప్లికేషన్ ని ఇన్ స్టాల్ చేసుకోండి. అన్ని వీడియోలూ ఎంజాయ్ చేయండి. http://goo.gl/DqsA4

లేదా ఈ క్రింది QR Codeని మీ Android ఫోన్ లోని Barcode Scannerతో స్కాన్ చేస్తే నేరుగా అప్లికేషన్ డౌన్ లోడ్ పేజీకి వెళ్లవచ్చు. Image and video hosting by TinyPic