Home » Uncategorized » Recent Articles:

కష్టపడకుండానే తెలుగులో టైపింగ్ ఇలా

December 14, 2011 Uncategorized 1 Comment

ముందుగా ఓ విజ్ఞప్తి:
తెలుగు టైపింగ్ చాలా సులభంగా చేయొచ్చని చాలామందికి తెలియదు. అలాంటి వారందరి కోసం 5 గంటలపాటు కష్టపడి తయారు చేసిన వీడియో ఇది. ఇందులో ప్రతీ స్టెప్ చాలా వివరంగా ఎవరైనా 10 నిమిషాల్లో అర్థం చేసుకోగలిగేలా చూపించడం జరిగింది. ఈ వీడియో మీ ఒక్కరికే కాదు మీకు తెలిసిన ప్రతీ ఒక్కరికీ లింకు పంపించండి, వారూ తెలుగులో రాయడం మొదలెడతారు, తద్వారా మనం తెలుగు భాషని చాలావరకూ రక్షించవాళ్లం అవుతాం.

ఇ-మెయిల్స్ లోనూ, ఫేస్ బుక్ లోనూ, వెబ్ సైట్లలోనూ, notepad, MS Word వంటి విండోస్ అప్లికేషన్లలోనూ ఎక్కడైనా నేరుగా తెలుగు టైప్ చేసుకోవచ్చనీ.. అదీ చాలా చాలా సులభంగా టైప్ చేయవచ్చనీ కొంతమందికి తెలియదు.

మీరూ తెలుగులో టైప్ చేయాలని ఉన్నా అదేదో చాలా కష్టమని భయపడుతూ ఉంటే ఈ వీడియో తప్పకుండా చూడాల్సిందే.

ఖచ్చితంగా ఈ వీడియో చూసిన మరుక్షణం మీరు తెలుగులో టైప్ చేయడం మొదలుపెట్టేస్తారు. మరో అరగంటలో మరింత వేగంగా టైప్ చేసేస్తారు. ఒక రోజు గడిచిందంటే  ఇక తెలుగు టైపింగ్ ని మరో 10 మందికి నేర్పించడానికి రెడీ అయిపోతారు.

తెలుగు టైపింగ్ అంటే ఎక్కడో టైప్ చేసి, దాన్ని కాపీ చేసి, కావలసిన చోట పేస్ట్ చేసుకోవాలనుకునే వారికీ ఈ వీడియో వివిధ విండోస్ అప్లికేషన్లలోనూ, ఇంటర్నెట్ లోనూ నేరుగా తెలుగులో టైప్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే తెలుగు టైపింగ్ కొత్తగా చేయాలనుకునే వారికీ బాగా పనికొస్తుంది. స్పీకర్లు ఆన్ చేసుకుని వింటూ చూస్తే సులభంగా అర్థమవుతుంది.

- నల్లమోతు శ్రీధర్

ఈ వీడియోని మీ మిత్రులతో పంచుకోవాలంటే ఈ లింకుని వారికి పంపించండి:  http://www.youtube.com/watch?v=pIWFjqNTdA0

 ఈ వీడియోని 3Dలోనూ చూడవచ్చు: వీడియోని ప్లే చేసేటప్పుడు ప్లేయర్ పై ఉండే 3D అనే బటన్ ని క్లిక్ చేయడం ద్వారా ఈ వీడియోని 3Dలోనూ మీరు చూడొచ్చు. తెలుగులో మొట్టమొదటి 3D ఛానెల్ అయిన http://youtube.com/nallamothu అనే దానికి మీరు Subscribe చేయొచ్చు.

 

 

నా సైట్ పేజ్ లోడింగ్ ఇకపై మరింత వేగంగా ఉంటుంది..

November 19, 2011 Uncategorized No Comments

"నల్లమోతు శ్రీధర్ సాంకేతికాలు" సైట్ ని 2007 నుండి ఆదరిస్తున్న మిత్రులకు ధన్యవాదాలు.

వివిధ కారణాల వల్ల VPS హోస్టింగ్ లో ఉన్నా కొన్నిసార్లు ఈ వెబ్ సైట్ స్లోగా ఓపెన్ అవుతోందనీ, పేజీలు స్లోగా ఉన్నాయని కొంతమంది చెబుతూ ఉండేవారు.

సందర్శకులకు ఎదురవుతున్న ఈ ఇబ్బందిపై దృష్టి పెట్టడం జరిగింది. ఇకపై మునుపటి కన్నా 30 నుండి 50% వేగంగా ఈ సైట్ లోని పేజీలు లోడ్ అవుతాయి.

అలాగే ఇటీవల టెక్నికల్ వీడియోల పోర్టల్ ని ఈ క్రింది లింక్ లో ప్రారంభించడం జరిగింది. అది మున్ముందు మరింత విస్తరించబడుతుంది. దాన్నీ తరచూ సందర్శించగలరు.

http://computerera.co.in

ధన్యవాదాలు.

 

- నల్లమోతు శ్రీధర్

మీ పిల్లలకు గూగుల్ అశ్లీల సెర్చ్ ఫలితాలు చూపించకుండా ఇలా లాక్ చేసుకోండి.. (వీడియో డెమో)

October 25, 2011 Uncategorized No Comments

మీరు చిన్న పిల్లలకు కంప్యూటర్ నేర్పిద్దామని గూగుల్ ఓపెన్ చేశారుకుందాం.

"Google Imagesలో ఇలా ఫొటోలు వెదుక్కోవచ్చు" అంటూ ఓ పదం టైప్ చేసి వెదగ్గానే ఆ వచ్చిన ఫొటోల్లో అశ్లీలమైనవి సైతం వచ్చేస్తే ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది?

గూగుల్ కి కంప్యూటర్ ముందు కూర్చున్నది చిన్న పిల్లలో, పెద్ద వాళ్లో తెలియదు. ఎలాంటి జాగ్రత్తలూ తీసుకోపోతే అది అశ్లీల వెబ్ సైట్లూ, నగ్న/అశ్లీల ఫొటోలను సైతం చూపిస్తుంటుంది. చిన్న పిల్లలున్న కుటుంబాల్లో ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి!  సో ఇలాంటప్పుడు ఈ వీడియోలో నేను చూపించిన విధంగా ఓ చిన్న సెట్టింగ్ చేసుకోవడం ద్వారా ఇకపై గూగుల్ సెర్చ్ ఫలితాల్లో ఎలాంటి అసభ్య ఫొటోలూ, సమాచారం చోటు చేసుకోకుండా జాగ్రత్త తీసుకోవచ్చు. కంప్యూటర్లు వాడే ప్రతీ కుటుంబానికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తోనూ పంచుకుని వారినీ కాపాడండి.

ఈ వీడియోని మీ మిత్రులతో పంచుకోవాలంటే ఈ లింకుని వారికి పంపించండి:  http://www.youtube.com/watch?v=oj-pNk4SvHU

 ఈ వీడియోని 3Dలోనూ చూడవచ్చు: వీడియోని ప్లే చేసేటప్పుడు ప్లేయర్ పై ఉండే 3D అనే బటన్ ని క్లిక్ చేయడం ద్వారా ఈ వీడియోని 3Dలోనూ మీరు చూడొచ్చు. తెలుగులో మొట్టమొదటి 3D ఛానెల్ అయిన http://youtube.com/nallamothu అనే దానికి మీరు Subscribe చేయొచ్చు.

 

వీడియోని చూసేటప్పుడు మీ నెట్ కనెక్షన్ స్పీడ్ గా ఉన్నదైతే.. 720p, 1080p అనే హై డెఫినిషన్ (HD) రిజల్యూషన్లని Youtube Playerలో ఎంచుకుని మరింత హై క్వాలిటీతో వీడియోని చూడొచ్చు.
 

 వివిధ టెలివిజన్ ఛానెళ్లలో నేను చేసిన ప్రోగ్రాములు, ఇతర టెక్నికల్ వీడియోల కోసం http://youtube.com/nallamothu అనే ఛానెల్ కి సబ్ స్కైబ్ చేయొచ్చు.

Subscribe to me on YouTube

computerera telugu magazine

 

కొందరు బ్లాగర్లూ మీ ద్వేషాలు నాపై పనిచేయవు.. ఎందుకు టైమ్ వృధా చేసుకుంటారు?

October 9, 2011 Uncategorized No Comments

కొందరు బ్లాగర్లు పాపం తమ ఆలోచనలన్నింటినీ నాపై కేంద్రీకరిస్తున్నట్లు ఉన్నారు.. అందుకే అవసరానికి మించి నన్ను గమనిస్తున్నారు, "నల్లమోతు శ్రీధర్ సాంకేతికాలు" బ్లాగులో 2007 నుండీ చేస్తున్న పోస్టులు వారి దృష్టికి ఎందుకు చెదుర్చుతున్నాయో అర్థం కావట్లేదు.. రకరకాల మార్గాల్లో నా స్ఫూర్తిని దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నారు. మిత్రులారా.. అందరికీ చెప్పేదొక్కటే.. నేను చాలా సున్నిత మనస్కుడిని.. అంతే తోలు మందం కలిగిన వాడిని. నేను నిర్దేశించుకున్న లక్ష్యానికి కట్టుబడి ఒక సైనికునిలా 15 ఏళ్లుగా పనిచేసుకుంటూ పోతున్నాను. ఇది మీలో 95% మందికి అర్థం కాదు. ఏదో నా గురించి గొప్ప చెప్పుకోవడానికి "లక్ష్యం గిక్ష్యం" అంటున్నాననుకుంటారు. నా స్వభావాన్ని దగ్గరగా చూడకుండా, తెలుగు వారందరికీ సాంకేతిక పరిజ్ఞానం అందించాలని ప్రతీ క్షణం నేను పడే తపననీ ఓ రెండు రోజులైనా నా పక్కన కూర్చుని గమనించకుండా.. తమ సంకుచిత మనస్థత్వాలతో నా ఉత్సాహాన్ని నీరుగార్చాలని చూస్తే.. వ్యర్థప్రయాసే అవుతుంది.

"శ్రీధర్ చందుపట్ల" అనే వ్యక్తి చారిత్రక నేపధ్యం ఉన్న వ్యాసాలు బాగా రాస్తారని మిత్రులు ఎవరో ఫోన్ సంభాషణల్లో చెబితే ఓ సంవత్సరం క్రితం గూగుల్ లో ఆ పేరుని టైప్ చేసి వెళ్లి వెదికాను (నా సమయాన్ని కాపాడుకోవడానికి నేను కూడలి, జల్లెడ వంటి వాటిని రెండేళ్ల నుండి ఓపెన్ చేయడం లేదు. ఓపెన్ చేస్తే ఓ బ్లాగ్ నుండి మరో బ్లాగుకీ, ఆయా బ్లాగుల్లో ఉండే కామెంట్లకీ దృష్టిని వృధా చేయలేక).

ఆయన బ్లాగుని చూసి చాలా బాగా రాస్తున్నారనిపించింది. అదే  మొదటా, ఆఖరూ ఆయన గురించి నేను తెలుసుకోవడం. బ్లాగు చదవగానే మంచి బ్లాగు అని ముద్ర ఎలా పడుతుందో.. దాంతోపాటే మంచి మనిషి అనే ముద్ర దానంతట అదే నిర్మితమవుతుంది.. మనం ఆశావాదులం కదా! :)

ఆ మనిషి ఉన్నట్లుంది ఈరోజు ఉదయం నాకు ఫేస్ బుక్ లో Message ఆప్షన్ ద్వారా ఓ మెసేజ్ పెట్టారు. ఆయన నా ఫ్రెండ్ లిస్ట్ లో లేరు.  ఫ్రెండ్ లిస్ట్ లో లేకపోయినా మనం ఇతరులకు పర్సనల్ మెసేజ్ లు పంపించే సదుపాయం ఫేస్ బుక్ లో ఉంది.  దాన్ని ఆయన వాడుకుంటూ ఈ క్రింది మెసేజ్ పెట్టారు, దానికి నేను ఇచ్చిన రిప్లైలూ మీరు చూడవచ్చు.

nallamothusridhar facebook screenshot

"నల్లమోతు సాంకేతికాలు" బ్లాగులో నేను చేసే ప్రతీ పోస్ట్ కీ క్రింద "కంప్యూటర్ ఎరా" మేగజైన్ చందా వివరాలు ఉంటాయి. పాపం అది ఆయనకు అభ్యంతరకరంగా ఉందట. నేను సేవ చేయడం మానేసి కమర్షియల్ అయిపోయానట. ఆయన నా బ్లాగుకి వస్తుంది పోస్టుల కోసమా.. వాటి క్రింద ఉండే ఏడ్ ల కోసమా? ఇలా నన్ను ప్రశ్నించిన ఆయనే google.com సైట్ లో ఏమైనా వెదికినప్పుడు పక్కనే చాలా ads వస్తుంటాయి కదా.. గూగుల్ వాళ్లకూ "మీరు పిసి యూజర్లకి సేవ చేయట్లేదు, నేను మీ సైట్ చూడను" మాదిరి అమాయకత్వపు మెసేజ్ లు పంపగలరా? కంప్యూటర్ ఎరా మేగజైన్ లో ఓ ఉద్యోగిగా మాత్రమే పనిచేసే నేను ఆ మేగజైన్ గురించి నా బ్లాగులో ఏడ్ పెడితే నాకేమైనా జీతం పెరుగుతుందా? ప్రతీ నెలా మేగజైన్ ని ఎంతో కష్టపడి అద్భుతంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తున్నాను. సో ఇలా బ్లాగు పోస్టుల క్రింద మేగజైన్ వివరాలు పెడితే మరో ఒకరిద్దరైనా ఆ నాలెడ్జ్ ని పొందుతారు అన్న తపనతో మేగజైన్ వివరాలు పెడుతున్నాను. సరే మాటవరసకే అనుకుందాం.. "నేను కమర్షియల్ అయిపోయానండీ, ఏమిటి మీకు నష్టం?"  సేవ, కమర్షియల్ అని రెండు పదాలు తెలిసిన ప్రతీ వాడూ ప్రతీ దాని పట్లా తన జడ్జ్ మెంట్లను తాను ఇచ్చేయడమే!

ఒక మనిషికి సాటి మనిషిపై ద్వేషం ఎందుకు పెరుగుతుందో అర్థం కాదు. ద్వేషం పెరిగితే మనకు మెచ్యూరిటీ ఉంటే తప్పు మన ఆలోచనా ధోరణిదా, అవతలి వాళ్లదా అన్నది విశ్లేషించుకుని మన ద్వేషాన్ని మనం చల్లార్చుకోవాలి. అంతేగానీ ఏదోలా బురదజల్లేద్దామని, ఒక మాట అంటే బాధపడుతూ కూర్చుంటారు కదా.. అని సంకుచితత్వాన్ని ప్రదర్శిస్తే ఎవరికి నష్టం?

"ఈ విషయంపై ఇంత దృష్టి పెట్టి నలుగురితో పంచుకోవడం అవసరమా" అని చాలా ఆలోచించాను.  గతంలో కూడా ఒకటికి రెండు సార్లు తెలుగు బ్లాగర్ల నుండి ఇలాంటి అకారణమైన అక్కసు నాకు ఎదురైంది. పాపం ప్రతీ ఒక్కరూ నాలో 1% పార్శ్యాన్ని కూడా తడిమి చూడకుండానే  నా గురించి మిడిమిడి అభిప్రాయాలు వెళ్లగక్కేసి నన్ను నిరుత్సాహపరచాలని అనుకుంటున్నారు. అందుకే ఇంకెవరైనా ఇలాంటి అక్కసులూ, అసూయలూ, ద్వేషాలూ ఉన్న వారు ఉండి ఉంటారు కదా.. వారికి ఒక విజ్ఞప్తి చేద్దామనుకుంటున్నాను.

"బాబులూ, అమ్మలూ.. నేను సమాజంలోని కుళ్లునంతా ఎంతవరకూ చూడాలో అంతవరకూ చూసేశాను. ఉచిత సలహాల పేరిటా, మరో నెపంతో నన్ను కుంగదీయాలని ప్రయత్నిస్తే మీ సమయం వృధా అవుతుంది తప్ప నా స్ఫూర్తిని ఎవరూ చెదరగొట్టలేరు. నేను ఏ పని చేసినా అందులో స్వచ్ఛత, నిజాయితీ, పట్టుదల నా మనఃసాక్షితో స్కాన్ చేసుకుని నాకు సమ్మతమైతేనే  చేస్తాను తప్ప మీలాంటి గొప్ప విమర్శకుల సాయం నాకెప్పుడూ అవసరం లేదు. నా జోలికి రాకండి, పచ్చిగా చెప్పాలంటే నేను తోలు మందం గాడిని.. మీ అక్కసుని వ్యక్తపరిస్తే అది నన్నేదో చేసేస్తుందని భ్రమపడిపోకండి. నా దారికి మీరు ఏమాత్రం అడ్డురాలేరు. టెక్నాలజీని ప్రతీ ఒక్కరికీ పంచిపెట్టాలన్న నా తపన ముందు మీరెవ్వరూ సరితూగరు.

ఇలాంటి అడ్డూ అదుపూ లేకుండా అక్కసు వెళ్లగక్కే మిత్రులకు నేను ఇచ్చే చివరి హెచ్చరిక ఇది. కాదూ.. టైమ్ వేస్ట్ చేసుకుంటూ నేను మెయిల్ లో ఎక్కడ దొరుకుతానా, ఫేస్ బుక్ లో ఎక్కడ దొరుకుతానా.. అని వెదుక్కుంటూ వచ్చి బురద జల్లేద్దామని ప్రయత్నిస్తే.. కానీయండి పాపం టైమ్ వేస్ట్ చేసుకుంటామంటే ఎవరు కాదంటారు?

Note: ఇంత వివరంగా రాయడం వాస్తవానికి నాకు చాలా సమయం వృధా. కానీ ఇప్పటికి పలు మందికి పైగా అజ్ఞాతల గానూ, నేరుగా పేర్లతోనూ వ్యక్తిగత దాడి చేయప్రయత్నించారు. పాపం నా గురించి తెలియని అమాయకులు ఇంకెంతో మంది ఉండి ఉండొచ్చు.. మున్ముందైనా నా గురించి సరిగ్గా తెలుసుకోకుండా మిడిమిడిగా అవాకులూ, చెవాకులూ పేలడం వృధా ప్రయాసే అని బహిరంగంగా స్టేట్ మెంట్ ఇవ్వడం సబబని ఈ పోస్ట్ రాస్తున్నాను.

ధన్యవాదాలు

నల్లమోతు శ్రీధర్
 

computerera telugu magazine

Windows 8 డెవలపర్ ప్రివ్యూ నేను వాడుతుండగా..

September 14, 2011 Uncategorized No Comments

"కంప్యూటర్ ఎరా" లాంటి పత్రికను ఆరంభించినప్పటి నుండి (10 సంవత్సరాలు) ఎడిటర్ గా ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని పాఠకులకు అందిస్తూ వస్తున్న నేను ఆ క్రమంలో తాజాగా విండోస్ 8 డెవలపర్ ప్రివ్యూని వాడడం మొదలెట్టాను. అందులో చోటుచేసుకున్న మార్పులను ఈ క్రింద ఫొటోల రూపంలో అందిస్తున్నాను.

 

- నల్లమోతు శ్రీధర్

విండోస్ 8లో చోటుచేసుకున్న Metro UI (యూజర్ ఇంటర్ ఫేస్)

 Metro UI nallamothusridhar

విండోస్ 8లో "నల్లమోతు శ్రీధర్ సాంకేతికాలు"బ్రౌజ్ చేస్తుండగా..

విండోస్ 8 nallamothusridhar

ఆఫీస్ 2007, 2010లో మాదిరిగా రిబ్బన్ యూజర్ ఇంటర్ ఫేస్ ని కలిగిన Windows Explorer, అందులో నేను క్రియేట్ చేసిన ఫోల్డర్

ribbion ui nallamothusridhar windows 8

నేను 4GB RAMతో 64-bit విండోస్ 8 వాడుతున్నాను..

4gb ram windows 8 nallamothu sridhar

ఫైళ్లు, ప్రోగ్రాములూ, సెట్టింగులను ఇలా సులభంగా వెదుక్కోవచ్చు.. సరికొత్త యూజర్ స్వరూపం ఇక్కడ కూడా..

విండోస్ 8 search interface

Control Panelలో యూజర్ అకౌంట్లు ఇలా కన్పిస్తుంటాయి:

Windows 8 User Interface Control Panel nallamothu sridhar

 

సైబర్ నేరాలపై అవగాహన – మహిళ పేరుతో నకిలీ మెయిల్ ఐడి కేసు (వీడియో వివరణ)

 సైబర్ నేరాలకు పాల్పడితే ఎవరూ ఏమీ చేయలేరనే ధీమా చాలామందిలో ఉంటోంది. అలాగే బాధితులు కూడా సరైన help దొరకదేమోనని కామ్ గా ఉండిపోతున్నారు. ఈ నేపధ్యంలో టెక్నాలజీ రంగంలో 15 ఏళ్లుగా ఉండడం వల్ల నాకు తెలిసిన కొన్ని కేసులు, అవి పరిష్కారమైన తీరూ మిత్రులతో పంచుకుంటాను వీలువెంబడి! ఆ క్రమంలో ఇప్పుడో కేసు వివరాలు చెబుతాను.

 
ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తో పంచుకోవాలంటే ఈ లింక్ ని వారికి పంపించండిhttp://www.youtube.com/watch?v=G1g8zsF0XNA
 

కేస్ ఇది:

ఒకతను ఓ మహిళ పేరుతో ఇ-మెయిల్ ఐడి సృష్టించుకుని, ఆ మెయిల్ ఐడితో 5 వెబ్ సైట్లలో "తాను ఓ కాల్ గర్ల్" ననీ, ఆ అమ్మాయి ఫోన్ నెంబర్ సైతం పేర్కొన్నాడు. 
 

ఇన్వెస్టిగేషన్ ఇలా జరిగింది: 

 
అతను ఏయే IPల నుండి మెసేజ్ లు పోస్ట్ చేశాడన్నది ISPల సహకారంతో, ఆయా వెబ్ సైట్ల వెబ్ మాస్టర్ logsలో ఆ వ్యక్తిచే పోస్ట్ చేయబడిన మెసేజ్ ల timestamp, ip అడ్రస్ లు, మెయిల్ సర్వర్లలోని ఆ అకౌంట్ యొక్క ఏక్టివిటీ రికార్డులు పోలీసులు తెలుసుకుని అతని అడ్రస్ పట్టుకుని అరెస్ట్ చేశారు. కాలేజీలో ఆ అమ్మాయి తన క్లాస్ మేట్ అనీ, పెళ్లి చేసుకోమని అడిగితే ఒప్పుకోలేదని ఇలా చేశాననీ పోలీసులతో చెప్పాడు.
 

పడిన శిక్ష: 

 
IT Act 2000లోని U/S 67 సెక్షన్ ప్రకారం మరియు IPC 469, 509 ప్రకారం 2 సంవత్సరాల జైలు శిక్ష అమలుపరచబడింది.
 

వీడియోని చూసేటప్పుడు మీ నెట్ కనెక్షన్ స్పీడ్ గా ఉన్నదైతే.. 720p, 1080p అనే హై డెఫినిషన్ (HD) రిజల్యూషన్లని Youtube Playerలో ఎంచుకుని మరింత హై క్వాలిటీతో వీడియోని చూడొచ్చు.

 వివిధ టెలివిజన్ ఛానెళ్లలో నేను చేసిన ప్రోగ్రాములు, ఇతర టెక్నికల్ వీడియోల కోసం http://youtube.com/nallamothu అనే ఛానెల్ కి సబ్ స్కైబ్ చేయొచ్చు.

computerera telugu magazine

 
 

 

రూ. 10,000 విలువైన Kinige.com అనే తెలుగు, ఇంగ్లీషు పుస్తకాల సైట్ గిఫ్ట్ కూపన్లు 100 మందికి ఉచితం (5 రోజుల ఆఫర్)

గత ఆఫర్లలో లైసెన్స్ లు గెలుచుకున్న వారూ కొత్త ఆఫర్లకు అర్హులే.

 

ఈ ఆఫర్ మీకు లభించే సమయం: 29 జూలై 2011 ఉదయం 10 గంటల నుండి 3 ఆగస్ట్ 2011 ఉదయం10 గంటల వరకూ (మొత్తం 5 రోజుల పాటు) 

 మీరు గిఫ్ట్ కూపన్ ఎలా పొందాలో వివరాలు అడుగున ఉన్నాయి చూడండి.

పుస్తకాలన్నా, చక్కని సాహిత్యమన్నా ఆసక్తి లేని వారు ఉండరు. అయితే వృత్తి ఉద్యోగాల్లో, పనుల వత్తిడుల్లో పుస్తకాలను వెంట తీసుకువెళ్లి తీరుబడిగా చదువుకునే  వెసులుబాటు ఎవరికీ దొరకట్లేదు. మన ఆనందాలైనా, అభిరుచులైనా, స్నేహితులైనా, చదువైనా, రాతలైనా సకలం కంప్యూటర్లూ, మొబైళ్లతోనే  ముడిపడిపోయినప్పుడు కంప్యూటర్లోనే అద్భుతమైన రచనలను చదువుకునే అవకాశం దొరికితే బాగుంటుంది కదా! ఆ అవసరాన్ని తీర్చేదే "Kinige.com (కినిగె.కామ్)" అనే సైటు!
 

ఈ  వెబ్ సైట్ లింకు ఇది: 

ఇ-బుక్స్ దొరికే సైట్లు చాలానే ఉన్నాయి కదా.. ఇదే ఎందుకు?

 
మనం సాహిత్యాన్ని అభిమానిస్తాం. రచయితల్ని ఆరాధిస్తాం. కానీ ఆ రచయితలు మరో నాలుగు రచనలు చేయాలన్నా మనం పుస్తకాలను కొంటేనే కదా వారు పొట్టపోసుకుని అద్భుతమైన సాహిత్యాన్ని మనకు అందించగలిగేది! మరి చాలా సైట్లలో దొంగతనంగా పుస్తకాలను స్కాన్ చేసి  పెట్టే ఇ-పుస్తకాలను డౌన్ లోడ్ చేసుకోవడం ద్వారా సాహిత్యాభిమానులుగా సాహిత్యాన్ని మనం బ్రతికిస్తున్నామా? చంపేస్తున్నామా?
 
సరిగ్గా ఇక్కడే ఈ "కినిగె" సైట్ తన ప్రత్యేకతను చాటుకుంటుంది. నేరుగా రచయితల అనుమతితో పుస్తకాలను చవక ధరలకు ఆన్ లైన్ లో విక్రయిస్తూ, అద్దెకు ఇస్తూ అటు రచయితలకు ఆదాయంతో పాటు ఇటు పుస్తక ప్రియులకు ఒరిజినల్ సాహిత్యాన్ని దర్జాగా చదువుతున్నామన్న అనుభూతినీ మిగుల్చుతుంది. ఈ  క్రింది వీడియోలో kinige.com సైట్ లో రిజిస్టర్ చేసుకోవడం మొదలుకుని, పుస్తకాలు కొనడం, అద్దెకు తీసుకోవడం, స్నేహితులకు గిఫ్ట్ లు పంపడం వంటి పలు విషయాలను పూసగుచ్చినట్లు చూపించడం జరిగింది. స్పీకర్లు ఆన్ చేసుకుని వింటూ చూస్తే ఈజీగా అర్థమవుతుంది.
 
ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తో పంచుకోవాలంటే ఈ లింక్ ని వారికి పంపించండిhttp://www.youtube.com/watch?v=3GjU8H63o4g 
 

 

ఏమిటి Kinige.com (కినిగె.కామ్) ప్రత్యేకతలు?

 kinige nallamothusridhar 1
  • తెలుగు, ఇంగ్లీషు సాహిత్యానికి సంబంధించి విస్తృత శ్రేణిలో పుస్తకాలు kinige.com సైట్ లో లభిస్తున్నాయి. కధలు, కవితలు, ఫిక్షన్, నాన్-ఫిక్షన్, ఆధ్యాత్మికం, సినిమా, రాజకీయాలూ, పిల్లల పుస్తకాలూ వంటి వివిధ విభాగాల క్రింద ఇవి అందుబాటులో ఉన్నాయి.
  •  
  • ఒక పుస్తకాన్ని పుస్తకం అసలు ధరతో సంబంధం లేకుండా రూ. 30 నామమాత్రపు అద్దెతో  నెలరోజుల పాటు చదువుకునే అవకాశం ఈ సైట్ కల్పిస్తోంది.
  •  
  • పుస్తకాలను మనకు మనం అద్దెకు తీసుకోవడం, కొనడమే కాకుండా మన ఆత్మీయులకు వారి పుట్టినరోజులు, ఇతర ప్రత్యేకరోజుల్లో గిఫ్ట్ గా పంపించవచ్చు. మనం గిఫ్ట్ గా పంపే పుస్తకాలు వారికి నచ్చుతాయో లేదోనని సందేహంగా ఉంటే మన అకౌంట్ లోని కొంత బ్యాలెన్స్ ని వారికి గిఫ్ట్ గా పంపించుకోనూ వచ్చు. ఆ అమౌంట్ తో వారు వారికి నచ్చిన పుస్తకాలను kinige.com సైట్ నుండి కొనుక్కోగలుగతారు లేదా అద్దెకు తీసుకుంటారు.
  •  
  • మన అకౌంట్ లోకి విదేశాల్లో నివశిస్తున్న వారు Paypal ద్వారానూ (పేపాల్ తో $10 రీఛార్జ్ చేసుకుంటే రూ. 400 బ్యాలెన్స్ లభిస్తుంది), ఇండియాలో నివశిస్తున్నవారు వివిధ బ్యాంకుల క్రెడిట్, డెబిట్ (ATM) కార్డులు, క్యాష్ కార్డులూ, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సదుపాయాల ద్వారానూ అమౌంట్ ని రీఛార్జ్ చేసుకుని వాడుకోవచ్చు.
  •  
  • అటు ఆఫీసులోనూ, ఇటు ఇంట్లోనూ వేర్వేరు కంప్యూటర్లలో, iPhone, iPad వంటి పలు రకాల మొబైల్ డివైజ్ లలోనూ, అలాగే Windows, Mac, Linux వంటి అన్ని ఆపరేటింగ్ సిస్టమ్ లలోనూ మనం కొన్న/అద్దెకు తీసుకున్న పుస్తకాలను చదువుకోవచ్చు..
 
ఇలా ఎన్నో ప్రత్యేకతల సమాహారం kinige.com సైట్.
 
kinige nallamothusridhar 2
 
kinige nallamothusridhar 3
 
kinige nallamothusridhar 4

ఉచితంగా ఎన్నిగిఫ్ట్ కూపన్లు అందిస్తున్నామంటే:

మొత్తం 100 మందికి ఒక్కొక్కటి రూ. 100 విలువ గల మొత్తం రూ. 10,000 విలువైన 100 గిఫ్ట్ కూపన్లు.

ఒక్కొకటి ధర ఎంత?

విడిగా కొనాలంటే రూ. 100. మీకు పూర్తి ఉచితం.

పుస్తకాలంటున్నారు, చాలా సైట్లలో కన్పించే మాదిరి పైరేటెడ్ వా?

అస్సలు కానేకాదు. 100% ఇవి రచయితల అనుమతితో అందించబడుతున్న అసలు పుస్తకాలు. దర్జాగా మీరు వీటిని ఆస్వాదించవచ్చు.

గిఫ్ట్ కూపన్ గెలుపొందాలంటే రూల్స్ ఎలా ఉంటాయి?

అస్సలు రూల్స్  ఏమీ ఉండవు. ఈ రోజు (29 జూలై 2011 ఉదయం 10 గంటల నుండి 3 ఆగస్ట్ 2011 ఉదయం10 గంటల వరకూ (మొత్తం 5 రోజుల పాటు) sridharcera@gmail.com అనే నా మెయిల్ ఐడికి ఈ క్రింది వివరాలతో పాటు రాసి పంపండి. గతంలో ముగిసిన ఆఫర్లకి రిక్వెస్ట్ పంపితే పరిగణించబడవు. ఇప్పుడు నడుస్తున్న ఆఫర్ కే మీరు రిక్వెస్ట్ పంపాలి.

1. మీ పూర్తి పేరు

2. మీ అసలైన (నకిలీవీ, వాడనివీ పనికిరావు) మెయిల్ ఐడి

3. మీ ఫోన్ నెంబర్

4. ఊరి పేరు.

5. మీరు కోరుతున్న గిఫ్ట్ కూపన్ పేరుగా "Kinige" అనే పేరునీ కూడా మీరు పంపే మెయిల్ లో పేర్కొనాలి.

పై వివరాలతో రిక్వెస్ట్ పంపిన వారి నుండి వారి అవసరాన్ని గుర్తించి randomగా 100 గిఫ్ట్ కూపన్లు కేటాయిస్తాం. ఇంకేమీ రూల్స్ లేవు. ఆగస్ట్ 5 ఉదయం 10 గంటల నుండి 12 గంటల లోపు మీ గిఫ్ట్ కూపన్లు  మీకు మెయిల్ ద్వారా పంపుతాను.

 

Backup4all మొత్తం 88 వేల రూపాయల విలువైన 40 లైసెన్స్ లు గెలుచుకున్న వారి వివరాలు

కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ అందిస్తున్న ఆఫర్లలో తాజాగా Backup4all అనే రూ. 2,200 విలువైన సాఫ్ట్ వేర్ ఒరిజినల్ లైసెన్స్ గెలుసుచుకున్న 40 మంది వివరాలు ఈ క్రింద చూడవచ్చు. విజేతలకు శుభాకాంక్షలు.

 

backup4all winners

అంతర్జాలం వంటి అర్థం కాని పదాలతో టెక్నాలజీ సామాన్యులకు దూరం

June 12, 2011 Uncategorized 24 Comments

అందరికీ అలవాటైన సాంకేతిక పదాలను కూడా తెలుగులో ఇంటర్నెట్ ని "అంతర్జాలం" అనీ, ఆండ్రాయిడ్ టాబ్లెట్ వంటి వాటిని "పలక"లనీ కొత్త పదాలనూ ఆవిష్కరించేసి… అసలే అంత ఈజీగా వంటబట్టని టెక్నాలజీని మరింత క్లిష్టం చేయడం హాస్యాస్పదం. అంతర్జాలం అన్న పదాన్ని చూసినప్పుడల్లా "మార్జాలం (పిల్లి)", పలక అనగానే బడి పలక గుర్తొస్తాయి. కొత్త తెలుగు సాంకేతిక పదాల అన్వేషణ కన్నా ఇప్పటికే వాడుకలో ఉన్న అనేక సాధారణ తెలుగు పదాలు మరుగునపడిపోతున్నాయి. వాటిపై దృష్టి పెట్టడం చాలా అవసరం.

1996లో మొదటిసారి తెలుగులో కంప్యూటర్ సాహిత్యాన్ని ప్రారంభించినప్పటి నుండి ఇలా తోచిన పేర్లని ప్రయోగించదలిచినట్టయితే ఇప్పటికి గందరగోళం సృష్టించి ఉండగలిగే వాడిని. అప్పట్లో నా లక్ష్యం పదాలు ఏవైనా ఈజీగా అర్థమవడం. దురదృష్డవశాత్తు ఈ మధ్య ఇలాంటివి అధికమయ్యాయి. మరో విషయం గత 15 సంవత్సరాలుగా ప్రచురణారంగంలో సంపాదకునిగా ఉంటూ వేలాది మంది పాఠకుల నాడిని గమనిస్తూ అర్ణం చేసుకున్నది.. అధికశాతం యువతరానికి తెలుగు చదవడం రాదు. ఇంగ్లీషులో పత్రిక తీసుకురమ్మని అడిగేవారు ఎంతమందో! ఈ నేపధ్యంలో కొత్త పదాలతో కాస్తో కూస్తో పఠనాసక్తి కలిగిన వారినీ బేజారెక్కించడం ఎంతవరకూ సబబు?

వాదోపవాదాలు నాకు వ్యక్తిగతంగా నచ్చకపోవడం వల్ల నా ఈ అభిప్రాయాన్ని ఇన్నాళ్లూ అణిచివేసుకున్నాను. నా అభిప్రాయంలో పస ఉందనిపించినా విబేధించినా ఒక సంపాదకునిగా 15 ఏళ్ల నా అనుభవంతో గ్రహించిన వాస్తవాలు తప్పు మాత్రం కావు. అర్థం పర్థం లేని పదాలతో టెక్నాలజీ చేదుగానే తోస్తుంది.. సామాన్యులకు!

ఇక్కడ నాకు తెలుగు భాషపై అపారమైన గౌరవం ఉంది. కానీ భాషారక్షణ పేరుతో ఇప్పటికే పండితపామరులకు ఆంగ్లంలో ఉన్నా చాలా సులభంగా అర్థమవుతూ ఉన్న ఇంటర్నెట్, స్క్ర్రీన్, విండో, లాప్ టాప్, మై డాక్యుమెంట్స్ వంటి పదాలను "నా దస్త్రాలు, తెర, అంతర్జాలం" అని గ్రాంధికత మేళవించి మార్చి పారేస్తే తెలుగులో కంప్యూటింగ్ విస్తరించడం మాట దేముడెరుగు.. ఈ పదాలు చూసి తెలుగంటేనే భయపడిపోతారు. ఒక్క విషయం గమనిస్తే "అంతర్జాలం" వంటి కొన్ని పదాలను ప్రసారమాధ్యమాలూ అనుసరిస్తున్నా ఇలాంటి పదాలను సమర్థించేవారూ, అదే పనిగా తోచిన పదాలను ఓ పరిమిత సముదాయంలో చర్చలు జరిపి ఇష్టానుసారం వాడుకలోకి తీసుకురావడానికి ప్రయత్నించేవారూ.. తమ మిత్రులతో గానీ, ఆత్మీయులతో గానీ ముచ్చటించేటప్పుడు.. "నా దస్త్రాలు, తెర, అంతర్జాలం" అనే పదాలను ఉచ్ఛరిస్తున్నారా? నేను ప్రశ్నించేది ఈ పదాలు తెలిసి అర్ణమయ్యే కొద్దిమంది మిత్రులతో సంభాషణల్లో కాదు.. తాము ఎక్కడ తిరిగినా, కొత్త వారు ఎవరు కలిసినా ఈ క్లిష్టమైన పదాలు నిర్మొహమాటంగా వాడగలుగుతున్నారా? కొండొకచో వాడితే ఈ వింత పదాలు విని అవతలి వారి హావభావాలు సవ్యంగా ఉంటున్నాయా? వినే వారికే రుచించనప్పుడు అర్థం కాని పదాలతో టెక్నాలజీని సామాన్యులకు దూరం చేయడం సరైనదేనా?

నా మనోగతాన్ని ఎవరినో విమర్శించడానికి ఉద్దేశించబడినదిగా సంకుచితంగా స్వీకరిస్తే నవ్వి నిమ్మకుండడం తప్ప నేనేం చేయలేను. కానీ గత 15 సంవత్సరాలుగా అందరిలా వేలకు వేలు జీతాలు వచ్చే ఉద్యోగాలకు నన్ను నేను అర్పించుకోకుండా  తెలుగు వారికి వీలైన అన్ని మార్గాల్లో టెక్నాలజీని సరళంగా అందించండం కోసం చిత్తశుద్థిగా అతితక్కువ జీతాలు వచ్చే రంగమైనా పత్రికారంగంలోనే కొనసాగుతూ తెలుగు సాంకేతిక రంగానికి అంకితమైపోయిన వ్యక్తిగా ఇలాంటి పోకడలపై నా గళం ఇప్పటికైనా విప్పడం అవసరమనిపించి ఇది రాశాను.

మణికట్టు ఆపరేషన్ వల్ల ఇది టైప్ చేయడానికే గంట వరకూ పట్టింది. కాబట్టి మీకెవరికైనా భిన్నాభిప్రాయాలు ఉన్నా వివరంగా చర్చించలేను. అంతగా దీనిపై మాట్లాడదలిస్తే మీ మెయిల్ ఐడి ఇస్తే నా మొబైల్ నెంబర్ పంపుతాను. ఫోన్ లో మాట్లాడవచ్చు.

 

ఈ పదాలు ఎంత విచిత్రంగా ఉన్నాయో చూడండి.. గట్టిపళ్ళెం(HDD), జాలగూడు, విహారిణి, నియంత్రణా వ్యవస్థ (O.S),క్రమకర్తలు(Programmers),ఖతి (Font),సంగణకం(Computer), విశ్వవ్యాప్త వలయం(World Wide Web), మృదులాంతకం (Software), ఇంకోటి నాకు విచిత్రంగా అనిపించిన పదం "పంపక సులభ కవిలె (PDF)" అలాగే సంప్రకారం (Format)

 

పోర్టబుల్ హార్డ్ డిస్క్ ని తీసుకురమ్మని చెప్పాలంటే "పంపక సులభ గట్టిపళ్లెం" అని కష్టపడాలన్నమాట!!

నా యాక్సిడెంట్ వార్త తెలిసి మీరు అందించిన ఆశీస్సులకు ధన్యవాదాలు

June 9, 2011 Uncategorized 2 Comments

యాక్సిడెంట్ అయ్యి మణికట్టుకి అపరేషన్ అయ్యి నెలరోజులు పూర్తయింది. ఇంకో ఒకటి నుండి ఒకటిన్నర నెలలు ఓపిక పట్టాలి. అంతవరకూ ఒంటి చేత్తో టైపింగ్ చేయక తప్పదు. ఒంటి చేత్తో తెలుగు  టైపింగ్.. అదీ ఫొనెటిక్ కాకుండా అనూ మాడ్యులర్ చాలా కష్టంగా ఉంది.. అయినా అసాధ్యం కాదని మాత్రం అర్ధమైంది. అందుకే నాకేదో ఐపోయిందన్న శూన్యత ఆవరించకుండా గత 15 ఏళ్ళుగా చేస్తున్న నా టెక్నికల్ అవేర్ నెస్ ఏక్టివిటీస్ ఇలా కూడా కొనసాగిస్తూనే ఉన్నాను. జీవితంలో ఇదో కొత్త అనుభవం. సాంకేతిక రంగానికి సేవ చేసే భాగ్యాన్నే కాదు.. జీవితాన్ని, పరిస్ధితులను ఎదుర్కొనే మానసిక స్థైర్యాన్ని ఇచ్చిన భగవంతునికీ, మోరల్ సపోర్ట్ ఇస్తున్న మిత్రులందరికీ ధన్యవాదాలు.

 

ఆత్మీయులు అందించిన కొన్ని ఆశీర్వచనాలు:

—————————————————————————————–

వందే  మాతరం

 

నల్లమోతు శ్రీధర్ గారికి    77 సం వృద్ధుడి  ఆశీర్వచనములు.

మీకు  జరిగిన ప్రమాదానికి  చింతిస్తున్నాను.  మీరు త్వరగా కోలుకొంతారని ఆశిస్తున్నాను.

మామిడెన్న  వెంకట  రంగశాయి  (విశాకపట్నం)

———————————–

 

Dear Sridhar garu

I am sorry to learn that you have sustained bone injury which has resulted gap between us.

We pray the Almighty to bestow you with courage, vigour and vitality by strengthening your hands
and be nearer to the readers with heart and soul.

We are enriching with your tutorials and per force we are constrained for the unforeseen gap.  With
hope we will wait for this bubble.

Speedy convalescence

Yours truly

Sambasiva Prasad.

——————-

Dear Sir Namaskaram,
Meku accident jarigindani telisi chala badapaddanu,
Gata 10 years nunchi me patrika kramam tappakunda chaduvutunnanu
patrika late aina parva ledu me arogyam jagrata
Meru twaraga kolukowalai "Allah" nu Pradistunnanu.

Me abhimani
Mohd. Ghouse
Ibrahimpatnam, Ranga Reddy Dist.,

I am very sad to knew this bad news

I pray the God for quick recovery for our valuable person Nallamothu Sridhar Garu.

surya smart

 

I PRAY GOD FOR GOOD HEALTH OF SRIDHAR GARU AND FOR HIS EARLY RECOVERY.

PLEASE CONVEY MY FEELINGS.

A RAVINDAR RAO

FOREST OFFICER

 

I am feeling very sorry for the accident and hope Sridhar garu will recover soon and attend to routine work  as many a reader of Computer Era will be awaiting his good health and service.

Ramamohana Rao Chirravuri Vuyyuru

మా అభిమాన కంప్యూటర్ రచయిత నల్లమోతుగారు త్వరగా కోలుకోవాలని దేవున్ని
ప్రార్థిస్తున్నాను.

J Chandra sekhar
kadapa

Dear Sri Sridhar,

 

I am really sorry to learn about the unfortunate incident. My god send wishes to you for your speedy recovery. We can wait for the magazine and I am sure the wait will worth the delay. God bless you.

 

Your unknown follower
Madhu, Vizag.

 

Hi Sridhar,

 

get well soon, Your contribution towards the magazine is excellent,

 

Regards,

NGSankar

Oracle WebCenter & UCM Consultant

L & T Infotech

hope our beloved sir recover fast.

ravigopal gumma

I am very sorry to here such news. Any way I would like to wish you an early recovery.

Thanking you.

G. Ashok

 

dear sridhar garu,

          felt very sad to hear about your accident.don’t worry about the magazine,preority should be given to health.stopping the may cause financial loss,but I wish when sridhar attend the office every thing will be quite okey. Hope you will recover soon !

           with so much love and effection to you….yours….BLNRao,vizianagaram


Dear Sir,

We pray the god to give early recovery at the best possible.

sr ceevee

 

maa priyathama annaiah ku twaragaa heal avvalani manahspurthigaa korukuntunaanu. 

with love

-shivaram

(shambala innovations – Pyramid Valley, Bangalore)

 

Sir, We are very much worried about ur health; We are with you all the
time; don’t worry about the magazine; We are number one in Telugu;
Take rest; Wishing a speedy recovery
-Regards
-srinivas

we are very sorry to hear this, sir u r services are very important to us plz get well soon….

 


sudhaakarun

we all pray for your health
get well soon
god bless you

rajarentapalli kumar

God! I will pray he will early recover

csn012@

 

We wish him get well soon. Our sincere prayers for his quick healing.

jagan mohan

Ayyyo Sridhar garu…..meku ala jaragaram nijam ga chala badaga vundi.meru tvaraga kolukovali ani manaspurthiga korukuntunnanu…Take rest Sir….bye….
bye…. take care.

Seshagiri Rao Sonthi

 

sir i wish you a speedy recovery, whether i dont know am i eligible r not to wish like this, may god bless you and wish you a speedy recovery

pavan guggilam

Oh sir…. really i feel lot….. take care sir….. and take good treatment…..

venki meda

So sad sir.. Sorry.. I an wait..

sekhar naidu 

mithrama,

ela unnaru…mee health ela undhi. fracture set ayyindha…..enni rojulaki vipputhamu kattu ani chepparu

sri sri sri sri

Ooh!! what a sad news!!
I hope will be alright soon.

leela kiran

i am feeling very bad.i want his recovery very urgent.i love his books.i hope god always with him.

king tirupathi

————————————

Sir, It is too sad to hear this. But I wish you a speedy recovery. Take care of yourself.

 

Thank you

Vishnu Vardhan.

—————————————————-

Wish u to get well soon sir.

yama venkatasubbareddy

————————————————

I prayer to god for you, to get well soon !!

-      Shreedhar geNius

I pray with God as early as possible Sridhar Sir  should be recover and healthy.

from:

B.Guru

 

wishing him a speedy recovery.awaiting for good news.

suresh M

 

sridar garu thwaraga recover avalani korukuntunam….

Raju R

Sridhar garu thyoraga kolukovaalani God ni Pray chestunnamu.

prasad c

I am sorry sridhar I felt very sad about the news takecare
of your health.
yours

G. kasi viswanath Rao,
Dharmavaram.

Dear Mr. Sridhar garu,

Yes. Take care of your health first and take complete rest. Think of preparing Magazine only when 

when you feel fit to do the job. 

With my wishes for your speedy recovery,

nkrao

Bhubaneswar

Sir,

 

I pray to GOD.  You will get well soon….

 

vinjamuri sitaram

oooh i m sorry  sir….
meeru twaraga kolukovalani aa bhagavantunni manaspurthiga korukuntu…….
mee patakudu….
kiran-anantapur

kiranindian indian

We pray the God for his speed recovery and he will be alright, don’t worry.

chalam clpa

i am very sory about this matter…..
i whish to happty speed recovery….

ramu nakerikanti

I wish Sri Sridhar garu , a very speedy recovery and get back to his profession very soon.

 

Gurubabu

Recover well and as soon as possible sir.

KONATHALA CHINNI KISHORE

Sir u not dissapointed u pray the god. Iam already praying

danayya———-
Sent via Nokia Email

WE WISH HIM SPEEDY RECOVERY

JOHN HYDE KANUMURI

Get well soon sir…!

Bobby N.Royal

Hai sirdhar garu,

Wish u a very speedy recovery.. Take care of ur hand

Regards,

Karthik Pavan.G

Dear Sir

I pray the supreme god for speed recover

regards
sridhararao

  get well soon   i am very sorry to hear that

   ——–ravindra  one of your fans

శ్రీధర్ గారు మీకు ఏక్సిడెంట్ జరిగిందని తెలిసి చాలా బాదపడ్డాం. మీరు త్వరగా కోలుకోవాలని మనస్పూర్తిగ ఆ భగవంతున్ని కోరుకుంటున్నాను.

మీ అభిమాని
శ్రీనివాస్

GET WELL SOON

GOD BLESS YOU

mohammad ahamadullah

Dear Sir,

I am very sorry to hear a bad news from you. So i would wish to recovery very soon.

johnson g

Dear sridharji

Bad luck – we miss your editorials, – get will soon – May 

God bless you

 

PRASAD

 

I am praying to God GET WELL SOON ….

salumiah syed

we wish

get well soon 

 to     sridhar garu

subramanya prasad

Dear Sridhar Garu,

 

We will pray to God, soon recovery for you health.

 

BEST OF LUCK TO YOU SIR

 

with regards

 

– 
SRINIVASA RAO (VASU)

MIS Dept.

we wish you Mr.Sridhar  speedy recovery.

shivaganesh nagaraju

so sad for this oh god please take care his

hema vardan 

hello sridhar ,
very sorry to this news . I hope that you will set shortly .

regards
krishnaprasad

he will get well soon

surya vamsi

Oh…….. sad.

 

Please make him take complete rest until he will cure.

 

Regards

 

Gangadhar

get will soon mr.

Nallamothu Sridhar garu

kaparapu raj kumar john

Search This Site:

About Me

1996వ సంవత్సరంలో తెలుగులో మొట్టమొదట కంప్యూటర్ సాహిత్యాన్ని ప్రారంభించే అవకాశం నాకు కలిగింది. అదే సమయంలో చెన్నైలో సూపర్ హిట్ తెలుగు ఫిల్మ్ మేగజైన్ కి సబ్ ఎడిటర్ గా కూడా ఏకకాలంలో పనిచేస్తూ 1998 వరకూ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, మనీషా కొయిరాలా, శంకర్, రజనీకాంత్, కమల్ హాసన్ వంటి ప్రముఖులెందరినో ఇంటర్వ్యూలు చేయడం మర్చిపోలేని అనుభవం. అయితే సినిమా రంగంలో ఉన్న అనారోగ్యకరమైన వాతావరణం వల్ల నాకంటూ ఓ ప్రత్యేకమైన ఉనికిని సృష్టించుకోవడం కోసం సినిమా రంగం నుండి బయటకు వచ్చి పూర్తిగా టెక్నాలజీ రంగంలో స్థిరపడడం జరిగింది. 96 నుండి 2001 వరకూ పలు కంప్యూటర్ పత్రికలకు ఎడిటర్ గా పనిచేసి.. 2001 నుండి "కంప్యూటర్ ఎరా" తెలుగు మంత్లీ మేగజైన్ ఎడిటర్ గా పత్రిక మొత్తాన్నీ రూపొందిస్తూ ఉన్నాను. అలాగే తెలుగు టెలివిజన్ ఛానెళ్లలో మొట్టమొదటి టెక్నికల్ phone-in ప్రోగ్రామ్ కి గెస్ట్ గా అటెండ్ అయ్యే అవకాశమూ 2010 జనవరి 20న కలిగింది. అప్పటి నుండి ఇప్పటివరకూ TV 9, ABN, I News, ETV2, NTV, Zee 24 గంటలు, Studio N, సాక్షి టివి, మహా టివి, జాగృతి న్యూస్ వంటి ఛానెళ్లలో 100కి పైగా లైవ్, రికార్డెడ్ ప్రోగ్రాముల్ని చేయడం జరిగింది. 2007లో అత్యుత్తమైన నాణ్యతతో కూడిన పోస్టులతో, వీడియోలతో తెలుగులో మొదటి ప్రొఫెషనల్ టెక్నికల్ బ్లాగ్ గానూ, మొదటి వీడియో బ్లాగ్ గానూ ఇప్పుడు మీరు చూస్తున్న బ్లాగ్ ప్రత్యేకతను సంతరించుకుంది. అలాగే 2007 జనవరి 1న ప్రారంభించిన తెలుగులోనే మొట్టమొదటి టెక్నికల్ ఫోరమ్ అయిన "కంప్యూటర్ ఎరా సాంకేతిక ఫోరమ్" 14 వేల మంది సభ్యులతో 10 వేలకు పైగా పోస్టులతో 2009 జూలై వరకూ నిర్వహించబడింది. దాంతోపాటే మొట్టమొదటి తెలుగు టెక్నికల్ ఛాట్ రూమ్ అయిన "కంప్యూటర్ ఎరా సాంకేతిక సహాయం" అనే ఛాట్ రూమ్ రెండేళ్లలో వేలాది మందికి తెలుగు టైప్ చేయడం మొదలుకుని అనేక కంప్యూటర్ సంబంధిత సాంకేతిక సమస్యలకు తక్షణ సహాయం అందించింది. ఇకపోతే http://youtube.com/nallamothu అనే ఛానెల్ లో 361కి పైగా ప్రొఫెషనల్ క్వాలిటీ తెలుగు టెక్నికల్ వీడియోలు అందించాను. ఈ ఛానెల్ కి 1704 మంది సబ్ స్కైబర్లు ఉన్నారు. అందుబాటులో ఉన్న వివిధ మార్గాల ద్వారా తెలుగు వారందరకీ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించే పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాను. My Contact Number: 9000239948 Mail ID: sridharcera@gmail.com

ఇక్కడ RSS Feedకి Subscribe చేసి నేరుగా పోస్ట్ లు పొందండి

ఆండ్రాయిడ్ లో పొందండి!

నా వీడియోలను మీ దగ్గర ఉన్న Android ఫోన్ లో పొందాలంటే ఈ క్రింది లింక్ ని మీ ఫోన్ బ్రౌజర్ లో ఓపెన్ చేసి వెంటనే వచ్చే అప్లికేషన్ ని ఇన్ స్టాల్ చేసుకోండి. అన్ని వీడియోలూ ఎంజాయ్ చేయండి. http://goo.gl/DqsA4

లేదా ఈ క్రింది QR Codeని మీ Android ఫోన్ లోని Barcode Scannerతో స్కాన్ చేస్తే నేరుగా అప్లికేషన్ డౌన్ లోడ్ పేజీకి వెళ్లవచ్చు. Image and video hosting by TinyPic