వెబ్ సైట్ల క్రియేషన్ ఎలా? I News Live ఇంటర్వ్యూ

వెబ్ సైట్ క్రియేషన్ రిక్వైర్ మెంట్స్ గురించి I News తెలుగు ఛానెల్ జరిపిన 30 నిముషాల లైవ్ ప్రోగ్రామ్ ని ఈ క్రింద మూడు పార్ట్ లుగా చూడవచ్చు.

CD/ DVD ఇన్ సైడ్ స్టోరీ - I News Live ఇంటర్వ్యూ

CD, DVDల గురించి ఇంట్రెస్టింగ్ విషయాలతో I News తెలుగు ఛానెల్ లో నేను చేసిన ఓ అరగంట ఫోన్-ఇన్ లైవ్ ప్రోగ్రామ్ ని ఇక్కడ చూడవచ్చు

Softwaresపై I News Live ఇంటర్వ్యూ

కంప్యూటర్ సాఫ్ట్ వేర్ల ఇన్ స్టలేషన్, OS సెక్యూరిటీ జాగ్రత్తలు, ఇతర ముఖ్య అంశాలపై I News తెలుగు ఛానెల్ లో నేను చేసిన అరగంట phone-in లైవ్ షో ని ఇక్కడ చూడవచ్చు.

Recent Articles:

ఆంధ్రప్రభ డైలీ పేపర్ లోని నా I.T కాలమ్ ఇది

జనవరి నుండి ప్రతీ సోమవారం ఆంధ్రప్రభ డైలీ పేపర్ కి ఇతర ట్రాన్స్ లేషన్ స్థాయి కధనాలు అందించే పత్రికలకు భిన్నంగా నాదైన ప్రాక్టికల్ ముద్రతో టెక్నాలజీ కాలమ్ అందిస్తూ వచ్చాను. అయితే పనుల వత్తిడిలో ఉంటూ ఉండడం వల్ల ఆ కాలమ్ ని మిత్రులతో పంచుకోలేకపోయాను.

మొన్నటి సోమవారం ప్రచురితమైన కాలమ్ ఇది.

ఆంధ్రప్రభ డైలీ పేపర్ లో నా టెక్నాలజీ కాలమ్

మైక్రోసాఫ్ట్ Skydrive 25 GB ఉచిత స్టోరేజ్ మిస్ అవకండి

మైక్రోసాఫ్ట్ SkyDrive 25GBకి అప్ గ్రేడ్ అవండి

మైక్రోసాఫ్ట్ సంస్థ అందిస్తున్న Skydrive ఉచిత స్టోరేజ్ ప్రస్తుతం ఉన్న 7GB నుండి 25GBకి అప్ గ్రేడ్ అయ్యే అవకాశం మిస్ అవకండి. మైక్రోసాఫ్ట్ సంస్థ పరిమిత సమయానికి మాత్రమే ఈ సదుపాయాన్ని అందిస్తోంది. సో వెంటనే Windows Live ఐడి ఉన్న వారు https://skydrive.live.com/ ద్వారా 25GBకి అప్ గ్రేడ్ అవండి.

అలాగే రేపు Google Drive అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశముంది https://drive.google.com/start

skydrive nallmothusridhar

ఈరోజు ETV2 Sakhiలో తాజా ప్రోగ్రామ్

ETV2 సఖిలో నాలుగు రోజుల క్రితం ప్రసారమైన నా  "సఖి.కామ్" ప్రోగ్రామ్ మిస్ అయిన వారు ఈ వీడియోలో చూడవచ్చు.

ETV2 సఖిలో వీడియో కన్వర్షన్ పై ఇటీవలి ఎపిసోడ్ ఇది

ETV2 సఖిలో దాదాపు గత రెండు సంవత్సరాలుగా ప్రసారమవుతున్న నా ధారావాహిక సఖి.కామ్ లో ఇటీవల ప్రసారం అయిన ఎపిసోడ్ ఇది:

ఇకపోతే సమయాభావం వల్ల నేను బ్లాగ్ పై ఎక్కువ సమయం గడపలేకపోతున్నాను. అలాగని రోజుకి ఒకటి రెండు టెక్నికల్ అప్ డేట్లు చేస్తూనే ఉన్నాను. నన్నూ, నా అప్ డేట్లనీ ఇలా బ్లాగ్ ద్వారా కన్నా, నిరంతరం నేరుగా ఫాలో అవాలనుకునే వారు https://www.facebook.com/nallamothusridhar అనే నా ఫేస్ బుక్ ఐడి ద్వారా ఫాలో కావొచ్చు. అక్కడ ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపండి. ఇప్పటికే అటు కంప్యూటర్ ఎరా పాఠకులు కావచ్చు, ఇతర మిత్రులు కావచ్చు 2900 మంది వరకూ ఫేస్ బుక్ ద్వారా ఫాలో అవుతున్నారు. చాలా updates బ్లాగ్ లో బదులు Facebookలోనే చేస్తున్నాను.

మీ భయాలు తొలగించుకోండి ఇలా..

http://bit.ly/onlinepayments

ఆన్ లైన్ లో అన్నీ కొనుక్కోవచ్చని తెలిసీ.. బిల్లులు సైతం pay చేసుకోవచ్చని తెలిసీ కూడా చాలామంది వెనుకాడుతూ ఉంటారు.

ఒకటే భయం.. ఇంటర్నెట్ బ్యాంకింగ్ కావచ్చు, ATM (డెబిట్) కార్డ్, క్రెడిట్ కార్డుల ద్వారా పే చేసినప్పుడు అమౌంట్ కట్ అయీ transaction ఫెయిల్ అవుతుందేమోననే సందేహం.

ఎందుకొచ్చిన గోల, కొద్దిగా కష్టమైనా క్యూలో నిలబడి కడితే నిశ్చింతంగా ఉండొచ్చు కదా అన్న కామన్ మెన్ సైకాలజీ.

ఆన్ లైన్ చెల్లింపుల విషయాల్లో మీకు ఉన్న భయాలన్నీ ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా తొలగిపోతాయి.

పేమెంట్ గేట్ వేల గురించి, అమౌంట్ కట్ అయీ ఫలితం లేకపోతే ఎంత ఈజీగా మన డబ్బు వెనక్కి తెచ్చుకోవచ్చన్నదీ.. మొదలైన విషయాలు దీనిలో చెప్పడం జరిగింది.

అందరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తోనూ షేర్ చేసుకోగలరు.

http://bit.ly/onlinepayments

 

మీ వెబ్ సైట్ లోనూ, బ్లాగ్ లోనూ మీకు ఈ వీడియో నచ్చితే రీపబ్లిష్ చేసుకోవచ్చు. మీ బ్లాగ్ లో కొత్త పోస్ట్ చేసేటప్పుడు HTML మోడ్ లో ఉండగా క్రింది లైన్ ని మీ పోస్ట్ లో add చేస్తే ఈ వీడియో వచ్చేస్తుంది.

<iframe width="560" height="315" src="http://www.youtube.com/embed/wVwZsCIY4Qc" frameborder="0" allowfullscreen></iframe>

 

 

 

ఏప్రిల్ 2012 కంప్యూటర్ ఎరా కవర్ పేజ్ ఇది

ఏప్రిల్ 2012 "కంప్యూటర్ ఎరా" తెలుగు మేగజైన్ ఏప్రిల్ 2-5 తేదీ మధ్య రాష్ట్రవ్యాప్తంగా పుస్తకాల షాపుల్లో అందుబాటులోకి వస్తుంది. బుక్ షాపుల్లో మేగజైన్ ని సులభంగా గుర్తించడం కోసం ఈ తాజా సంచిక కవర్ పేజీ ఇక్కడ అందిస్తున్నాం.

కంప్యూటర్ ఎరా ఏప్రిల్ 2012 తెలుగు మేగజైన్ కవర్ పేజీ

Flash Player 11.2 విడుదలైంది.. వెంటనే ఇన్ స్టాల్ చేసుకోండి!

flash player 11.2

ఇంటర్నెట్ లో ఏదైనా Flash ఆన్ లైన్ గేమ్ ని ఆడేటప్పుడు మౌస్ తో రైట్ క్లిక్ చేయలేం కదా, అలాగే మిడిల్ క్లిక్ కూడా చెయ్యలేం.

కొద్ది గంటల క్రితం Adobe సంస్థ Flash Player 11.2 తాజా వెర్షన్ ని విడుదల చేసింది. 

అసలు ఫ్లాష్ ప్లేయర్ అంటే ఏమిటో తెలియని వారి కోసం చిన్న వివరణ ఏంటంటే.. మనం Youtube, MetaCafe వంటి వెబ్ సైట్లలో వీడియోలు చూడగలుగుతున్నా, ఆన్ లైన్ గేమ్ లు ఆడగలుగుతున్నా, వివిధ వెబ్ సైట్లలో ఏనిమేటెడ్ అడ్వర్ టైజ్ మెంట్లు చూడగలుగుతున్నా అవన్నీ మన కంప్యూటర్లో Flash Player అనే సాఫ్ట్ వేర్ ఉంటేనే సక్రమంగా ఓపెన్ అవుతాయి. అది లేకుంటే Missing Plugin అంటూ మెసేజ్ చూపించడం మీ దృష్టికి వచ్చే ఉంటుంది.

Flash Player 11.2లో కొత్తదనం ఏముంది?

Flash ఆధారంగా చేసుకుని ఆన్ లైన్ గేమ్ లను తయారు చేసే కంపెనీలు ఇకపై మరింత శక్తివంతమైన గేమ్ లను అందించవచ్చు. వాటిని Flash Player 11.2 సమర్థవంతంగా పిసి యూజర్ల కంప్యూటర్ స్క్రీన్లపై చూపిస్తుంది. అలాగే మౌస్ రైట్, మిడిల్ క్లిక్ ల ద్వారా మరిన్ని ఆప్షన్లని తమ గేమ్ లలో పొందుపరచవచ్చు. హార్డ్ వేర్ accelerationని పూర్తిగా సపోర్ట్ చేయడం వల్ల మెరుగైన గేమింగ్ అనుభూతి కలుగుతుంది.

అలాగే Youtube వంటి సైట్లలో వీడియోల్ని మనం చూసేటప్పుడు  పలు థ్రెడ్ లతో వీడియో డీకోడ్ చేయబడడం వల్ల 1080p Full HD వీడియోల్ని మరింత స్మూత్ గా మనం చూడగలుగుతుతాం.

మీరు Flash Player 11.2ని వెంటనే ఇన్ స్టాల్ చేసుకోవచ్చు. https://www.adobe.com/products/flashplayer/distribution3.html అనే లింక్ లో దీని డౌన్ లోడ్ లింకులు లభిస్తాయి.

ఇక్కడ మనుషుల్ని ద్వేషించవచ్చు..

enemygraph telugu

ఒకే రకమైన interestలు ఉన్న వారిని కనెక్ట్ చెయ్యడానికి  Facebook ఎంతగా ఉపయోగపడుతోందో గమనిస్తూనే ఉన్నాం.

సినిమాలపై ఆసక్తి ఉన్న వాళ్లంతా ఒకచోట చేరతారు.. ఒకరితో ఒకరు ఇంటరాక్ట్ అవుతారు.. హ్యూమన్ రిలేషన్స్, టెక్నాలజీ.. పార్టీలూ, తెలంగాణా, సీమాంధ్ర, క్రికెట్ ఇలా ఎవరు దేనిపట్ల ఎక్కువ ప్రభావితులై ఉంటే వారు అలాంటి సమాచారానికి, అలాంటి సమాచారం పోస్ట్ చేసే వ్యక్తులకు ఆకర్షితులు అవుతారు. ఇలాగే కొత్త పరిచయాలు పుడుతున్నాయి, కొన్ని పరిచయాలు తెగిపోతూ ఉంటాయి కూడా!

విచక్షణ లేని టెక్నాలజీని మనిషి కూడా విచక్షణ కోల్పోతే ఎంత దారుణంగా వాడుకోవచ్చో ఇప్పుడు EnemyGraph అనే ఫేస్ బుక్ అప్లికేషన్ ని చూస్తే అర్థమవుతుంది. మీకు ఎవరైనా వ్యక్తులు కావచ్చు, కంపెనీలు కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు.. శత్రువులు ఉంటే వారిని శత్రువులుగా వ్యక్తపరచవచ్చు.

సింపుల్ గా చెప్పాలంటే మనకు నచ్చిన వారిని ఫేస్ బుక్ లో Friendsగా ఎలా జాయిన్ చేసుకుంటామో అదే మాదిరిగా మనం ద్వేషించే వారిని ఈ అప్లికేషన్ ద్వారా శత్రువులుగా పేర్కొనవచ్చు.

మనకు నచ్చని విషయాన్ని కానీ, మన శత్రువుని గానీ ద్వేషించే వారు మనకు పరోక్షంగా మిత్రులైపోతారు అనే కాన్సెప్ట్ ని ఆధారంగా చేసుకుని సరికొత్త  గ్రూప్ లు సృష్టించుకోవడానికీ ఈ అప్లికేషన్ తెర తీస్తోంది.

ఓ విచక్షణ కలిగిన మనిషిగా మనం ఆలోచిస్తే..  ఇప్పటికే మనం రాజకీయాల్నీ, సినిమా తారల్నీ, క్రికెటర్లనూ, దేశాన్నీ, వ్యవస్థనీ, అధికారుల్నీ.. పక్క వ్యక్తినీ ఇలా ప్రతీ ఒక్కరితో విబేధిస్తూ మానసికంగా ఒంటరి అవుతూ ఉన్నాం. ఇక మన ద్వేషాన్ని నేరుగా వ్యక్తపరచడానికి ఇలాంటి అప్లికేషన్లు తోడైతే మనలో మంచి ఆలోచనలు, ఫ్రెండ్లీ నేచర్ మాయమై అందరినీ తిట్టుకుంటూనే గడిపేస్తామేమో!

ఇది ఫేస్ బుక్ యూజర్ల అవగాహన, స్వీయ విశ్లేషణ కోసం రాయబడింది.

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

ఆండ్రాయిడ్ లేటెస్ట్ OS ఐస్ క్రీమ్ శాండ్ విచ్ నా Galaxy Noteలో (ఫొటోలు)

ఆండ్రాయిడ్ తాజా ఆపరేటింగ్ సిస్టమ్ అయిన ఐస్ క్రీమ్ శాండ్ విచ్ (ICS) 4.0.3 వెర్షన్ అన్ని రకాల ఆండ్రాయిడ్ డివైజ్ లకూ అందుబాటులో లేదు. శక్తివంతమైన ప్రాసెసర్, మెమరీ ఉన్న కొన్ని డివైజ్ లకు మాత్రమే, కొందరు ఫోన్ తయారీదారులు మాత్రమే వారి పరిమితులను బట్టి అప్ డేట్ అందిస్తున్నారు.

ఓ రకంగా చెప్పాలంటే ఇప్పటివరకూ ఆండ్రాయిడ్ ఫోన్లుగా చలామణి అవుతున్న 95% ఫోన్లలో ఆండ్రాయిడ్ 2.1, 2.2, 2.3.6 వంటి వెర్షన్లే ఇన్ స్టాల్ చేయబడి లభిస్తున్నాయి.

అలాగే టాబ్లెట్ల విషయానికి వస్తే ఖరీదైన తాజా కొన్ని టాబ్లెట్లలో మాత్రమే ICS ఇన్ స్టాల్ చేయబడి లభిస్తోంది.

ఒక్కసారి ICS ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న డివైజ్ ని వాడామంటే ఇక వేరే ఏ డివైజ్ నీ వాడలేము. అంత ఆకర్షణీయంగానూ, వేగంగానూ ఉంటుంది.

నా Samsung Galaxy Noteకి జూన్, 2012 నాటికి శాంసంగ్ సంస్థ నుండి ICS అప్ డేట్ వస్తుంది. అయితే నా ప్రయోగాల్లో భాగంగా ICSని custom ROMని ఫోన్ ని రూట్ చేసి ఇన్ స్టాల్ చేసిన తర్వాత తీసిన ఫొటోలు ఇవి.

ICS ఎలా ఉందో శాంపిల్ గా మీరే స్వయంగా చూడండి.

ఐస్ క్రీమ్ శాండ్ విచ్ 1

ఆండ్రాయిడ్ ఐస్ క్రీమ్ శాండ్ విచ్ తెలుగు 2

తెలుగు ఐస్ క్రీమ్ శాండ్ విచ్

ఆండ్రాయిడ్ ఐస్ క్రీమ్ శాండ్ విచ్ నల్లమోతు శ్రీధర్

నల్లమోతు ఛానెల్ ఆండ్రాయిడ్ లో

కెర్నల్ వెర్షన్ ICS

 

Search This Site:

About Me

1996వ సంవత్సరంలో తెలుగులో మొట్టమొదట కంప్యూటర్ సాహిత్యాన్ని ప్రారంభించే అవకాశం నాకు కలిగింది. అదే సమయంలో చెన్నైలో సూపర్ హిట్ తెలుగు ఫిల్మ్ మేగజైన్ కి సబ్ ఎడిటర్ గా కూడా ఏకకాలంలో పనిచేస్తూ 1998 వరకూ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, మనీషా కొయిరాలా, శంకర్, రజనీకాంత్, కమల్ హాసన్ వంటి ప్రముఖులెందరినో ఇంటర్వ్యూలు చేయడం మర్చిపోలేని అనుభవం. అయితే సినిమా రంగంలో ఉన్న అనారోగ్యకరమైన వాతావరణం వల్ల నాకంటూ ఓ ప్రత్యేకమైన ఉనికిని సృష్టించుకోవడం కోసం సినిమా రంగం నుండి బయటకు వచ్చి పూర్తిగా టెక్నాలజీ రంగంలో స్థిరపడడం జరిగింది. 96 నుండి 2001 వరకూ పలు కంప్యూటర్ పత్రికలకు ఎడిటర్ గా పనిచేసి.. 2001 నుండి "కంప్యూటర్ ఎరా" తెలుగు మంత్లీ మేగజైన్ ఎడిటర్ గా పత్రిక మొత్తాన్నీ రూపొందిస్తూ ఉన్నాను. అలాగే తెలుగు టెలివిజన్ ఛానెళ్లలో మొట్టమొదటి టెక్నికల్ phone-in ప్రోగ్రామ్ కి గెస్ట్ గా అటెండ్ అయ్యే అవకాశమూ 2010 జనవరి 20న కలిగింది. అప్పటి నుండి ఇప్పటివరకూ TV 9, ABN, I News, ETV2, NTV, Zee 24 గంటలు, Studio N, సాక్షి టివి, మహా టివి, జాగృతి న్యూస్ వంటి ఛానెళ్లలో 100కి పైగా లైవ్, రికార్డెడ్ ప్రోగ్రాముల్ని చేయడం జరిగింది. 2007లో అత్యుత్తమైన నాణ్యతతో కూడిన పోస్టులతో, వీడియోలతో తెలుగులో మొదటి ప్రొఫెషనల్ టెక్నికల్ బ్లాగ్ గానూ, మొదటి వీడియో బ్లాగ్ గానూ ఇప్పుడు మీరు చూస్తున్న బ్లాగ్ ప్రత్యేకతను సంతరించుకుంది. అలాగే 2007 జనవరి 1న ప్రారంభించిన తెలుగులోనే మొట్టమొదటి టెక్నికల్ ఫోరమ్ అయిన "కంప్యూటర్ ఎరా సాంకేతిక ఫోరమ్" 14 వేల మంది సభ్యులతో 10 వేలకు పైగా పోస్టులతో 2009 జూలై వరకూ నిర్వహించబడింది. దాంతోపాటే మొట్టమొదటి తెలుగు టెక్నికల్ ఛాట్ రూమ్ అయిన "కంప్యూటర్ ఎరా సాంకేతిక సహాయం" అనే ఛాట్ రూమ్ రెండేళ్లలో వేలాది మందికి తెలుగు టైప్ చేయడం మొదలుకుని అనేక కంప్యూటర్ సంబంధిత సాంకేతిక సమస్యలకు తక్షణ సహాయం అందించింది. ఇకపోతే http://youtube.com/nallamothu అనే ఛానెల్ లో 361కి పైగా ప్రొఫెషనల్ క్వాలిటీ తెలుగు టెక్నికల్ వీడియోలు అందించాను. ఈ ఛానెల్ కి 1704 మంది సబ్ స్కైబర్లు ఉన్నారు. అందుబాటులో ఉన్న వివిధ మార్గాల ద్వారా తెలుగు వారందరకీ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించే పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాను. My Contact Number: 9000239948 Mail ID: sridharcera@gmail.com

ఇక్కడ RSS Feedకి Subscribe చేసి నేరుగా పోస్ట్ లు పొందండి

ఆండ్రాయిడ్ లో పొందండి!

నా వీడియోలను మీ దగ్గర ఉన్న Android ఫోన్ లో పొందాలంటే ఈ క్రింది లింక్ ని మీ ఫోన్ బ్రౌజర్ లో ఓపెన్ చేసి వెంటనే వచ్చే అప్లికేషన్ ని ఇన్ స్టాల్ చేసుకోండి. అన్ని వీడియోలూ ఎంజాయ్ చేయండి. http://goo.gl/DqsA4

లేదా ఈ క్రింది QR Codeని మీ Android ఫోన్ లోని Barcode Scannerతో స్కాన్ చేస్తే నేరుగా అప్లికేషన్ డౌన్ లోడ్ పేజీకి వెళ్లవచ్చు. Image and video hosting by TinyPic