11 Years Telugu Boy Created Asp.Net based Website
5వ తరగతి చదువుతున్న 11 ఏళ్ల పిల్లవాడు ASP.Netతో స్వంతంగా వెబ్‌సైట్ క్రియేట్ చేస్తే అద్భుతమే కదా?
పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడికి చెందిన “అభి” www.ABHISclassroom.com పేరిట స్కూల్ టైమ్ టేబుళ్లు, స్కూల్ ప్రిన్సిపాల్, మేనేజ్‌మెంట్, టీచర్ల గురించి సమాచారంతోనూ, ఎగ్జామ్స్ గురించి సమాచారంతోనూ ఓ సైట్ క్రియేట్ చేశాడు..
దానిని launch చెయ్యడానికి ప్రత్యక్షంగా నేను వెళ్లాల్సి ఉన్నా అనివార్య కారణాల వల్ల వెళ్లలేకపోతున్నాను. ఈ నేపధ్యంలో మీ మెసేజ్ రికార్డ్ చేసి పంపితే సంతోషిస్తామనీ, దాన్ని రేపు సైట్ లాంఛింగ్ సమయంలో స్కూల్ యాజమాన్యమూ, మీడియా ప్రతినిధుల సమక్షంలో ప్లే చేస్తామని వారి పేరెంట్స్ కోరడంతో దీన్ని రికార్డ్ చేయడం జరిగింది.
ఆ సైట్‌ని హైద్రాబాద్ నుండి రిమోట్‌గా లాంఛ్ చేయడమూ జరుగుతోంది.
పిల్లల్లో ఉన్న అద్భుతమైన టాలెంట్‌ని ప్రతీ పేరెంట్ ప్రోత్సహిస్తే ఇలాంటి అద్భుతమైన kids భవిష్యత్ తరాలకు మార్గనిర్దేశకులు అవుతారు.
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్